Velugu Song


victory

velugupata_Page_Final

జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం
స్వర్గమనేదే ఉంటే నేలపైకి దించుదాం :జీవి:

గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా
గంగ పొంగి పొరలినా నేల భీతి చెందునా
ఆత్మబలం కూడగట్టి ఆకసాన్ని వంచుదాం
స్వర్గమనేదే ఉంటే నేలపైకి దించుదాం :జీవి:

ఆకులన్ని రాలినా వేసవి వెంటాడినా
చినుకు రాలకుండునా చిగురువేయకుండునా
ఆశయాలు నీరుపోసి ఆశలన్ని పెంచుదాం
స్వర్గమనేదేవుంటే నేలపైకి దించుదాం :జీవి:

పేదరికం కసిరినా పెనుచీకటి ముసిరినా
వేలజనం మేలుకుంటె వేకువ రాకుండునా
అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం
స్వర్గమనేదేవుంటె నేలపైకి దించుదాం :జీవి:
-Vijaya Bharathi, Velugu

నాకు బాగా నచ్చిన పాటల్లో ఒకటి.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily

3 thoughts on “Velugu Song”

  1. Sir this song written by vijayabharathi she leves at karnul . She was group leder and world bank counsaltent for poverty eradication programme. She is done wonders in karnul rural villages

Leave a comment