ఆంధ్ర జ్యోతి వంకర రాతలు

image

పొద్దున్నే ఒక విద్యుత్ జేఏసీ లీడర్ ఫోను చేసాడు.

‘ఆంధ్ర జ్యోతి చూశారా. సురేష్ చందాకు ఏదో అన్యాయమై పోయినట్టు. చత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు, లైన్లు వేయడంలో ఏదో మతలబు ఉన్నట్టు రాశారు. అస్సలు ఆయనను అక్కడనుంచి తప్పించాలని మేమంతా కోరాము. ఆయన తెలంగాణకు పనికిరాడు. చత్తీస్ గడ్ నుంచి విద్యుత్ తీసుకురావడానికి ఆయన ఏమాత్రం ఆసక్తి చూపలేదు. అది ఇప్పుడు అయ్యే పని కాదు. అయినా నాకెందుకు తలనొప్పి. రేపు ఐఏఎస్ ల విభజనలో నేను ఏ రాష్ట్రానికి పోతానో తెలియదు…. ఇలా రకరకాలుగా మాట్లాడాడు. అటువంటి అధికారిని ఎ ప్రభుత్వమైనా ఏమి చేస్తుంది? మీరు నమస్తేలో కౌంటర్ రాయండి సర్’

తెలంగాణకు అర్జన్టుగా విద్యుత్ కావాలి. డైనమిక్ గా చొరవ తీసుకునే అధికారి కావాలి. అందుకే ఆయనను మార్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. కానీ వార్తలను ఎలా వక్రీకరించవచ్చునో ఆంధ్ర జ్యోతిని చూస్తే అర్థమవుతుంది.

Eenadu hides the Thief

Its organised looty
By the police, of the police, for the police

image

See how eenadu tried to hide the thieives and also made attempt to say that there was a robbery very near to Chief Ministers House. SIB office was earlier allocated to Andhra Grey Hounds, bon the request of Telangana Chief Minister it was re allocated to Telangana Government. Telangana Government wants to use this building to hear the grievences of public, who came to see the Chief Minister.

image

But keeping in mind Andhra Officers orchestrated a virtual looty. Orderd by a IG, who was earlier worked as a city police commissioner, organised by an SP level officer and operated by many DSPs, CIs and SIs. But Eenadu tried to hide the entire story. Just reported that as if tgere was a’choree’. Theft may cost few lakhs of rupees, but it shows the Andhra Police establishment pigmy mentality.

These people needs Rajaji like retort. Why dont Telangana government ask them to get last from Hyderabad? Telangana Government must institute an enquire and book the theives to the bars.

స్థానికత-హక్కు, అవసరం

BY పి. సుభాష్ సి రెడ్డి

Telangana-seemandhra-map-e1395162279484

ఇవ్వాళ.. కేసీఆర్ అంటున్నది కొత్తదేమీ కాదు. రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు న్యాయసూత్రాలku అనుగుణంగా తెలంగాణలో ముల్కీ రూల్స్‌ను అమలు చేయాలంటున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న హక్కు, ధర్మం కూడా. కేసీఆర్ ఒకవేళ అలా చేయక పోతే.. తెలంగాణ ప్రజలను మోసం చేసినవారవుతారు. ఈ సందర్భంలోనే చెప్పుకోవాలంటే.. తెలంగాణ ప్రజలు గత 60 ఏళ్లుగా ఈ ముల్కీ రూల్స్ అమలు కోసం, పెద్దమనుషుల ఒప్పందం అమలుకోసం పోరాడుతున్నారు. ఇప్పుడు ఈ ముల్కీ రూల్స్‌ను మరిచిపోవడమంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో అర్థం లేదు. మన రాష్ట్రంలో మన పాలనలో ముల్కీ రూల్స్‌ను పాటించడంలోనే మన విముక్తి ఉన్నది.

నాకు పీఎన్‌వీ నాయర్ అంటే అమిత గౌరవం. ‘హాన్స్ ఇండియా’ పత్రిక ఎడిటర్‌గా ఆయన వృత్తి నిబద్ధతగల జర్నలిస్టుగా, సుదీర్ఘ జీవితానుభవం ఉన్న జ్ఞానిగా విశిష్ట గౌరవ మర్యాదలున్నవారు. అయితే.. నేను ఈ వ్యాసంతో ఆయనకున్న జ్ఞానాన్నీ, వృత్తినిబద్ధతను సవాలు చేయడం లేదు. కానీ రెండు ఇరుగు పొరుగు రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాలు, వాటి సంబంధాల విషయంలో తలెత్తుతున్న సమస్యలు, కొన్ని విషయాలను ఆయన దృష్టికి తేదల్చుకున్నాను. అయితే ఇక్కడే మరో విషయం కూడా స్పష్టం చేయాలి. నేను కేసీఆర్‌నో, తెలంగాణనో వెనకేసుకొస్తున్నాననుకోవద్దు. సహజ న్యాయసూత్రాల ఆధారంగా తెలంగాణ ప్రజలు, వారి తరఫున కేసీఆర్ కోరుతున్న లేదా అంటున్న విషయాలను విపులీకరించదల్చుకున్నాను.

ఇక్కడే మరో విషయం కూడా స్పష్టం చేయాలి. సహజంగానే తరతరాల చరిత్రను పరిశీలించినా.. తెలంగాణ ప్రజలు ప్రేమగల వారు. ద్వేషమన్నదే ఎరుగని వారు. అలాగే కేసీఆర్ కూడా ద్వేషంతో ఏనాడూ ఏమీ చేయలేదు. ఏ మాటా మాట్లాడలేదు. ఆయన అన్నదల్లా సహజ న్యాయసూత్రాల ఆధారంగా తెలగాణ ప్రజలకు న్యాయం దక్కాలె. వివక్ష, అణచివేతలు అంతంకావాలె. వలసపీడనల పీడ విరగడ కావాలె.

తెలంగాణ ప్రజలే కాదు, కేసీఆర్ కూడా పరద్వేషం ఎరుగని వారు. తెలియని వారు. అంతే కాదు, పరద్వేషం వినాశకారి అని నమ్మే వాళ్లం. అయినా.. సీమాంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని, దోపిడీ పీడనలను వ్యతిరేకిస్తూ తెలంగాణ జాతి విముక్తి కావాలని కోరుకుంటున్నాం. సీమాంధ్ర నేతలు ఈ విషయాలను చూడనిరికరిస్తూ మాట్లాడటం వారికే చెల్లింది. లేదా వారి సహజ దోపిడీ ఆధిపత్య స్వభావాన్ని చెప్పకనే చెబుతున్నది. అలాగే ‘స్థానికత’ (లోకల్), ఎవరు స్థానికులు అన్న విషయాన్ని సీమాంధ్ర నేతలు చేస్తున్న వాదనలు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉన్నది.
స్థానికత ఆధారంగానే విద్యా, ఉద్యోగాల్లో ప్రవేశం ఉండటమే కాదు, విద్యార్థులకు అందించే ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్‌లు) ఇవ్వడం సహజం. దీనికోసం ప్రతి రాష్ట్రం తనదైన విధి విధానాలను రూపొందించుకుంటుంది. ఇది దేశంలోని అన్నిరాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానమే. తెలంగాణ కూడా ఈ విధానాన్నే అనుసరిస్తుంది. తెలంగాణకు కూడా స్థానికత గురించి విధానాలు రూపొందించుకునే హక్కు ఉన్నది.

అయితే అన్ని రాష్ట్రాల్లో స్థానికతను నిర్ధారించే విషయంలో ఒకే విధమైన విధివిధానాలు లేవు. స్థానిక ధృవీకరణ పత్రాన్ని పొందడానికి కావలసిన అవసరమైన రుజువులు, పత్రాలు ఒకే విధంగా లేవు. ఉదాహరణకు.. హిమాచల్ ప్రదేశ్‌లో స్థానికుడు అవ్వాలంటే.. అతనికి ఆ రాష్ట్రంలో శాశ్వతమైన(పర్మనెంట్) ఇల్లు ఉండాలి. అలాగే కనీసం 15 ఏళ్లకు తగ్గకుండా ఆ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి.అలా ఉన్నప్పుడే ఎవరికైనా, ఏ ఉద్యోగికైనా స్థానికత సర్టిఫికేట్ ఇస్తారు. దీనికి సంబంధించి అవసరమైన రుజుసూత్రాలను పొందుపరిచినప్పుడే లోకల్ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే రాజస్థాన్‌లో.. కనీసం పది ఏళ్లు రాజస్థాన్‌లో నివసిస్తున్నట్లయితేనే లోకల్ సర్టిఫికేట్ ఇస్తారు. త్రిపురలో కూడా స్థానిక సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆ రాష్ట్రంలో స్థిరమైన ఇల్లు ఉండాలి. కనీసం పదేళ్లకు తగ్గకుండా త్రిపురలోనే నివసిస్తూ ఉండాలి. ఉత్తరాఖండ్‌లో కూడా స్థానికుడు అవ్వాలంటే.. 15 ఏళ్లుగా అక్కడ నివాసం ఉండాలి. లేదా పర్మినెంట్ స్థిరనివాస గృహం కలిగి ఉండాలి. పర్మనెంట్ అంటే తరతరాలుగా వారసత్వంగా వచ్చిన ఇల్లు అని అర్థం. దీన్ని బట్టి .. వివిధ రాష్ట్రాల్లో స్థానికతకు సంబంధించి వివిధ విధివిధానాలను రూపొందించుకున్నట్లు అర్థమవుతున్నది. ఈ స్థానికత ఆధారంగానే స్థానికులకు ఆయా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలకు అర్హులుగా ప్రకటిస్తారు. అందజేస్తారు. సరిగ్గా ఇలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా స్థానికతను నిర్ధారించేందుకు తనవైన విధివిధానాలను (ముల్కీ రూల్స్) రూపొందించుకునే హక్కు ఉన్నది.
ఇక్కడే ‘ముల్కీ రూల్’ గురించి మనం ఎలా నిర్వచించుకున్నామో తెలుసుకోవాల్సి ఉన్నది. ‘ముల్కీ అంటే ఎవరైతే హైదరాబాద్ స్టేట్‌లో పుట్టారో వారంతా ముల్కీ(స్థానికు)లే. అలాగే హైదరాబాద్ స్టేట్‌లో అవిచ్ఛిన్నంగా పదిహేనేళ్లు నివాసముండాలె.అలాగే తాను స్థానికుడే అనేందుకు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలె. ఇక్కడ గమనించాల్సిందేమంటే.. పదిహేనేళ్లు అవిచ్ఛిన్నంగా నివాసముండాలి. తాను పుట్టిన స్థానాన్ని త్యాగం చేస్తానని అఫిడవిట్ సమర్పించాలి. సుప్రీంకోర్టు తప్ప మరేదీ ఈ ముల్కీ రూల్‌ను ప్రశ్నించడానికి వీలులేదు. ఆంధ్రాలో హైదరాబాద్ రాష్ట్రం 1956లో విలీనం అయిన తర్వాత కూడా ఈ ముల్కీ రూల్స్ అమలులో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో చూస్తే.. ఇవ్వాళ.. కేసీఆర్ అంటున్నది కొత్తదేమీ కాదు. రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు న్యాయసూత్రాలku అనుగుణంగా తెలంగాణలో ముల్కీ రూల్స్‌ను అమలు చేయాలంటున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న హక్కు, ధర్మం కూడా. కేసీఆర్ ఒకవేళ అలా చేయక పోతే.. తెలంగాణ ప్రజలను మోసం చేసినవారవుతారు. ఈ సందర్భంలోనే చెప్పుకోవాలంటే.. తెలంగాణ ప్రజలు గత 60 ఏళ్లుగా ఈ ముల్కీ రూల్స్ అమలు కోసం, పెద్దమనుషుల ఒప్పందం అమలుకోసం పోరాడుతున్నారు. ఇప్పుడు ఈ ముల్కీ రూల్స్‌ను మరిచిపోవడమంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో అర్థం లేదు. మన రాష్ట్రంలో మన పాలనలో ముల్కీ రూల్స్‌ను పాటించడంలోనే మన విముక్తి ఉన్నది.

ఇక్కడే ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకం గురించి కూడా చెప్పుకోవాలి. ఇది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న సాయం. ఆర్థికంగా వెనకబడి ఉన్న వారికీ,వర్గాలకూ ఫీజు రీయింబర్స్ మెంటు పథకం వర్తింపచేస్తున్నారు. దాదాపు 6 లక్షల మంది వృత్తివిద్యాకోర్సులు చదువుతున్న వారికి ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. ఇందులో లక్షా 50 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులుంటారు. 2013-14 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్ మెంటుకు ఆధార్ కార్డ్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. వైఎస్ రాజశేఖర్‌డ్డి ప్రభుత్వ హయాంలో 2005లో ఈ ఫీజు రీయింబర్స్ మెంటు పథకాన్ని ప్రవేశపెట్టి రెండువేల కోట్ల రూపాయలను విడుదల చేశారు. అది 2012-13నాటికి అయిదు వేల కోట్లకు చేరింది. ఈ పథకం కింద వృత్తి విద్యా కోర్స్‌లైన ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ తదితర కోర్సులకు ఏడాదికి 52వేల రూపాయలు అందిస్తారు. అయితే.. ఈ పథకం ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 39 వేల మంది ఆంధ్రా విద్యార్థులకు కూడా సాయం అందించాల్సి వస్తున్నది.

నిజానికి ఈ ఆంధ్రా విద్యార్థులకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారి తల్లిదంవూడులు వారి ఫీజులను చెల్లించాలి. లేదా వారినుంచి పన్నులు వసూలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాలి. ఈ సహజ న్యాయ సూత్రాన్ని మరిచి చంద్రబాబునాయుడు ఫీజు రీయింబర్స్ గురించి అరిచి అల్లరి చేయడం దేనికోసం? వీరికోసం ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఏకోశానా లేదు. తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ పథకం కింద సాయపడటం తెలంగాణ ప్రభుత్వ నైతిక బాధ్యత. సీమాంధ్ర నేతలు అదే పనిగా తెలంగాణ ప్రభుత్వంపై ఏడ్చితే ఉపయోగం లేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను తిట్టడం, ఆడిపోసుకోవడంతో ఉపయోగం లేదు. వారు ఆంధ్రా ప్రభుత్వ పాలకుడు చంద్రబాబుపై వత్తిడి తెచ్చి వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని వత్తిడి చేయాలి. ఏ ప్రాంత, ఏ దేశ ప్రజల హక్కులు అయినా వారి దేశంలోనే ఉంటాయి. పరాయి ప్రాంతంలో ఆ హక్కులు వర్తించవు. అమెరికాపౌరుల హక్కులు వారి దేశంలోనే ఉంటాయి. పరాయి దేశంలో కాదు.

కాంట్రక్టు క్రమబద్దీకరణకు ప్రజల ఓటు

logo
కాంట్రక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తం అని టీఅరెస్ ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ప్రజలు ఆ మానిఫెస్టోను నమ్మే ఓట్లు వేసి అధికారం అప్పగించారు. కాంగ్రెస్, భాజపా, తెదేపా అనుకూల విద్యార్థి సంఘాలు కావాలనే ఇప్పుడు అల్లరి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. టీఅరెస్ కొత్తగా ఈ నిర్ణయం చేయలేదు. కాంట్రక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ పూర్తిగా సమంజసం.

పరిశోధన చేసి, వయస్సు మీదపడి, పెళ్ళిళ్ళు చేసుకుని, పది, పదిహేనేళ్ళుగా తక్కువ జీతాలతో పాఠాలు చెబుతున్నవారిపై ఇప్పుడు దాడి జరుగుతున్నతీరు ఎంత మాత్రం మానవీయం కాదు. ఇది కొందరు పేచీ కోరు మనస్తత్వంతో రేపుతున్న సమస్య. మాకు ఉద్యోగాలు కావాలని అడగడం న్యాయం. వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వొద్దుఅని డిమాండు చేయడం కుల్లుమోతు తనం.

ప్రభుత్వం వచ్చి రెండు మాసాలు కాలేదు… ఉద్యోగుల కేటాయింపుజరగలేదు. ఐఎఎస్ ల కేటాయింపు జరగలేదు. టీపీఎస్సీ ఏర్పడలేదు. ఆఫీసులు ఇంకా కుదురుకోలేదు. వేలాది ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. నిజమైన నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగుల వలలో చిక్కుకుని రాష్ట్రంలో వాతావరణాన్ని పాడు చేయవద్దు.

No pepper to spray away Lanco’s R36,558 crore debt burden

RBI_900449f

ENS Economic Bureau | New Delhi | February 15, 2014 2:03 am

Lanco Group sacks 4,000 employees due to slowdow

The total debt sitting on the books of the company is Rs 36,558 crore and there is little chance of it melting soon as its revenue has dipped to Rs 458.54 crore at the end of December 2013 just 50 per cent of the figure for last year, at the same time.

Shares of Lagadapati Rajagopal’s Lanco Infratech, the holding company of the group, are now trading at 35 per cent discount to the book value at the BSE on Friday.

The market cap of the firm is down to Rs 1,565 crore as the company, which originated in Andhra Pradesh, has almost eaten through its net worth. The total debt sitting on the books of the company is Rs 36,558 crore and there is little chance of it melting soon as its revenue has dipped to Rs 458.54 crore at the end of December 2013 just 50 per cent of the figure for last year, at the same time.

Yet the company has asked the 27-member consortium of banks for a fresh loan of Rs 3,300 crore as part of its corporate debt restructuring for Rs 7,700 crore, one of the largest such packages for corporate India.

As part of the deal the company has won a two-year interest holiday. Bank guarantees and letters of credit worth Rs 3,300 crore will be rescinded as a result of which, the company will get additional funds of Rs 2,500 crore from the bankers.

Also, as part of the agreement, the banks will reduce interest rates by 2.5 per cent for the first three years after the grace period of two years.

Interestingly, the current chairman of the company L Madhusudan Rao, younger brother of Rajagopal, will have to put in only Rs 153 crore as additional equity to add to the lean Rs 239.24 crore share capital of the company.

The 27-bank consortium, led by IDBI bank, has, however, asked Lanco to pare its assets. It has been advised to sell its three power projects. The combined valuation for Kondapalli project (1,500 MW), partial sale of Amarkantak power project and Vidarbha project (1,300 MW), which according to estimates is expected to fetch Rs 6,000 crore.

Lanco Infra EPC deputy managing director SC Manocha told The Indian Express the company expects to get the fresh funding flowing in soon.

The Lanco story started coming unstuck from 2011, the same year it made its most ambitious investment. It bought Griffin coal blocks in Australia at the height of the commodity cycle, for A$750 million (Rs 4,100 crore). It was meant to fuel its three power plants as the company with an installed capacity of 3,287 MW had become the largest private power utility that year in the country.

But the share prices began to slide immediately thereafter as the level of debt spooked the investors. The company was hit with a lawsuit filed by an Australia-based company Perdaman Chemicals and Fertilizers for Rs 16,733 crore that was almost three times the then market cap of Lanco. But despite these, the company which Rajagopal left twelve years ago is still identified with him.

Rajagopal, better known since Thursday as ‘the pepper-spray MP’, has ceased to be the chairman of the company with its headquarters at Gurgaon, but the L in Lanco is still known as Lagadapati. Officially Lanco is an acronym for Lagadapati Amarappa Naidu, who
continued…

410 defaulters vs 39 lakh farmers

RBI_900449f

RBI is creating lot of noise against farm loans waiver, where as it is keeping a blind eye to the reality of corporate companies are playing havoc with public finances. Crop loan waiver is meant to help more than 39 lakh farmers, who are struggling to survive, where as corporate loan waiver or one time settlement or rescheduling is a big fraud on the Public Sector Banks.

D130196224

D130208784

D130199104

చందమామను చూడమంటే….

images

న్యూస్ రూములను ఇంత కుంచిత, రోగగ్రస్థ, అథమ స్వభావం ఉన్న మనుషులు ఆక్రమించేశారా అనిపించింది. కనీస అవగాహన, పరిమితులు, విలువలు తెలియని మనుషులు ఎడిటర్లయ్యారా అనిపిస్తుంది.

మూడు రోజుల క్రితం ఒక అధికారి కలిసి చానెళ్ల పంచాయతీని పరిష్కరిస్తే మంచిదేమో అన్నారు. నిజమే…ఇంకా సాగదీయడం అనవసరం అనిపించింది. ప్రభుత్వానికి సంబంధం ఉన్నా లేకపోయినా అపవాదు వచ్చేది ప్రభుత్వానికే. ప్రభుత్వమే చొరవతీసుకుని ఒకసారి ఆపరేటర్లను పిలిచి చెబితే పరిష్కారమవుతుందనిపించింది. వాస్తవానికి ఆ చానెళ్ల ప్రసారాలు తిరిగి ప్రారంభించాలని తెలంగాణ సమాజం నుంచి డిమాండేమీ లేదు. పైగా పీడాపోయిందని సంతోషించే వాళ్లే ఎక్కువగా తారసపడుతున్నారు. ఎంఎస్‌ఓల ఆగ్రహం సమంజసమేనని వాదిస్తున్నవాళ్లు కూడా ఎక్కువే. కానీ ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, సమాచార స్వేచ్ఛ, ప్రసార స్వేచ్ఛను ఎంతయినా అంగీకరించి తీరాలి. ఆ చానెళ్లు ప్రదర్శించే వంకరబుద్ధులను ప్రజలు సహించడం లేదు. తెలంగాణ సమాజానికి ఆ చైతన్యం వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకోసం మద్దతుగా ఆ చానెళ్లు వేసిన వెర్రి మొర్రి వేషాలన్నీ ప్రజలకు తెలుసు. అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేకపోయాయి. కేసీఆర్ జైత్రయాత్రను నిలువరించలేకపోయాయి. రేపయినా అదే జరుగుతుంది. శుక్రవారం నాడు సత్తుపల్లి నుంచి ఒక తెలంగాణవాది ఫోను చేశారు. ‘‘సార్. అక్కడ నిలిచిపోయిన చానెల్ ఒకటి ఇక్కడ వస్తున్నది. ‘కేసీఆర్‌ను తుగ్లక్ అని చంద్రబాబు విమర్శించడాన్ని మీరు సమర్థిస్తున్నారా?’ అని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు సమాధానంగా 54 శాతం మంది సబబే అని సమాధానం ఇచ్చారట. 44 శాతం మంది కాదు అని సమాధానం ఇచ్చారట. అలాగని ఆ టీవీలో వస్తోంది. టీవీ పగలగొట్టబుద్ధవుతోంది’’ అని ఆవేశంగా చెప్పారు. ఆ చానెల్ చూడడం ఎందుకు? ఆరోగ్యం పాడుచేసుకోవడం ఎందుకు? వేరే చానెల్ పెట్టుకోండి అని సమాధానపర్చాల్సి వచ్చింది. సాయంత్రం మరో మిత్రుడు బుల్లెట్ న్యూస్‌కు సంబంధించిన మరో విడియో క్లిప్ పట్టుకొచ్చాడు. అది జూన్ ఆరున ప్రసారం అయిందట. అప్పటికి ప్రభుత్వం ఏర్పడి నాలుగవ రోజు. వివాదం చెలరేగింది జూన్ 10న ప్రసారం అయిన బుల్లెట్ న్యూస్‌పైన. ఎందుకోగానీ జూన్ ఆరు క్లిప్ ఎవరూ పెద్దగా గమనించినట్టు లేరు. అది చూస్తే రక్తం సలసల కాగిపోయింది. న్యూస్ రూములను ఇంత కుంచిత, రోగగ్రస్థ, అథమ స్వభావం ఉన్న మనుషులు ఆక్రమించేశారా అనిపించింది. కనీస అవగాహన, పరిమితులు, విలువలు తెలియని మనుషులు ఎడిటర్లయ్యారా అనిపిస్తుంది. నిజానికి యజమానిగా ఉన్నవాళ్లను ఈ తప్పులన్నింటికీ బాధ్యులుగా భావిస్తుంటారు. కానీ వారు ఇవన్నీ చూసే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇవన్నీ రవిప్రకాశ్‌కు తెలిసి జరిగే అవకాశం లేదు. కానీ బాధ్యత ఆయనపైనే పడుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వాస్తవికతను జీర్ణించుకోలేని అహంకారపూరిత సంకుచిత మానవులు ఇంకా పాత బుద్ధులనే ప్రదర్శిస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలు. ప్రజాస్వామిక వాదనకు అవకాశం లేకుండా చేస్తున్నారు. పత్రికాస్వేచ్ఛకోసం మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు. నిన్నగాక మొన్న తెలంగాణ ప్రజలు తిరస్కరించి, బహిష్కరించి, చీత్కరించిన శక్తుల పక్షాన నిలబడి వారు వికృత వ్యాఖ్యావిన్యాసాలు చేస్తున్నారు.

తెలంగాణ సమాజంలో వెల్లువెత్తిన ఆనందాన్ని పంచుకోవడానికి బదులు తాము ఇక్కడ ఇంకా విషపు విత్తనాలను నాటడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశం జరిగిన రోజు తెలంగాణ సమాజం అంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. ఐదున్నరగంటలపాటు ఓపికగా చర్చించి, అంతే ఓపికగా 69 నిమిషాలపాటు పాత్రికేయులకు వివరించారు. మంత్రివర్గంలో కూడా ప్రతి అంశంపై అందరి అభిప్రాయాలు తీసుకున్నారని సమాచారం. అధికారుల అభిప్రాయాలు కూడా విన్నారట. అందుకే సమావేశం అన్ని గంటలపాటు జరిగింది. అంత ఆలస్యమయినా రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఏక బిగిన 43 అంశాలపై నిర్ణయాలు ప్రకటించారు. ఆయన బలహీనుడని, పరిపాలించలేడని ఊదరగొట్టిన సీమాంధ్ర మీడియా, ఆధిపత్య శక్తులు చేసిన ప్రచారంలో కొట్టుకుపోయిన వారికి ఆయన ఎనర్జీ ఆశ్చర్యపరిచింది. ఏమాత్ర తొట్రుపడకుండా, తడుముకోకుండా, సాధికారికంగా ఆయన మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం పండుగ చేసుకుంది. కనీసం ఇంటికొక్కరికి మేలు జరిగే నిర్ణయాలు ఉన్నాయి. ప్రత్యర్థులతో సైతం ఔరా అనిపించే విధంగా ఆయన సంచలనాత్మకంగా నిర్ణయాలు ప్రకటించారు. బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్టు, అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునే కార్యాచరణను ప్రకటించారు. ఉద్యమకారులపై కేసులన్నీ ఎత్తివేసేందుకు నిర్ణయించారు. ఉద్యోగులకు ఇస్తానన్న ఇంక్రిమెంటు ప్రకటించారు. తండాలను పంచాయతీలుగా మార్చారు… ఎన్నికల ప్రణాళికను కేబినెట్ ఎజెండాగా పెట్టి, పరిష్కరించిన తొలి ప్రభుత్వం ఇదే కావచ్చు. తెలంగాణ ముద్రకోసం, తెలంగాణ ఆత్మను ప్రతిష్టించడంకోసం ఆయన ప్రయత్నించారు. పాత చిహ్నాల స్థానంలో కొత్త చిహ్నాలను ఆవిష్కరించే నిర్ణయాలు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంగా, పశువైద్య విశ్వవిద్యాలయం పీవీ నరసింహారావు విశ్వవిద్యాలయంగా మారనుండడం తెలంగాణలో సీమాంధ్ర ప్రతీకలను తొలగించే దిశగా పడిన తొలి అడుగులు. తెలంగాణ చరిత్ర, సంస్కృ తి, సాహితీ వైభవాలను గుర్తుకుతెచ్చే తెలంగాణ వైతాళికుల పేర్లు, విగ్రహాలు తెలంగాణ అంతటా కనిపించాలి. కేసీఆర్ నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమయింది. తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలూ బాహాటంగానే కేబినెట్ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశాయి.

హైదరాబాద్‌లో భూఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు పితామహుడు చంద్రబాబే. రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి దానిని పతాకస్థాయికి తీసుకెళ్లారు. భూములు ఆక్రమించడం, వాటిని క్రమబద్ధీకరించడం, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం వాటిని క్రమబద్దీకరించడం గత రెండు దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తూ వచ్చారు. గృహనిర్మాణ క్రమశిక్షణను నాశనం చేసిన మహానుభావులు వీళ్లు.

ఒక్క చంద్రబాబుకు, ఆయన తాబేదార్లకు మాత్రం ఎప్పటిలాగే కేసీఆర్ తుగ్లక్‌లాగా కనిపించాడు. ఎందుకు కనిపిస్తున్నాడంటే రెండు అంశాలు ఆయనకు కంటగింపుగా ఉన్నాయి. మొదటిది ఫీజు రీయింబర్సు మెంటు. రెండవది హైదరాబాద్‌లో భూ ఆక్రమణలపై, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం. ఈ విషయంలో బీజేపీ నాయకత్వం కూడా చంద్రబాబుతోపాటే రాగాలు తీస్తున్నది. ఎందుకంటే హైదరాబాద్‌లో భూఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు పితామహుడు చంద్రబాబే. రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి దానిని పతాకస్థాయికి తీసుకెళ్లారు. భూములు ఆక్రమించడం, వాటిని క్రమబద్ధీకరించడం, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం వాటిని క్రమబద్దీకరించడం గత రెండు దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తూ వచ్చారు. గృహనిర్మాణ క్రమశిక్షణను నాశనం చేసిన మహానుభావులు వీళ్లు. ఇష్టం వచ్చినట్టు కట్టుకుని తర్వాత రెగ్యులరైజ్ చేయించుకోవచ్చుననే మనస్తత్వాన్ని పెంచి పోషించింది వీళ్లే. ఈ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల పర్యవసానమే ఇవ్వాళ హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారడానికి, చినుకుపడితే స్తంభించిపోవడానికి కారణం. భూమి రికార్డులు మాయమవుతాయి. కొత్త రికార్డులు పుట్టుకొస్తాయి. అసలు మండల రెవెన్యూ కార్యాలయాలు అదేపనిగా తగులపడడం, ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోకపోవడంలోని మతలబు ఏమిటి? ముఖ్యంగా షేక్‌పేట, బాలానగర్ మండల కార్యాలయాలు ఎన్నిసార్లు తగులబడ్డాయి? ఎందుకు తగులబడ్డాయి? ఎప్పుడయినా శోధించారా? సీమాంధ్ర నాయకత్వం హైదరాబాద్‌ను కొల్లగొట్టే విషయంలో ఔరంగజేబుల్లా వ్యవహరించారు. ఇప్పుడు కేసీఆర్ వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. నగరపాలనలో ఒక క్రమశిక్షణను పాదుకొల్పేందుకు కృషిచేస్తున్నారు.

ఇక ఫీజు రీయింబర్సుమెంటు విషయం. మొన్నీ మధ్య ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న ఓ ప్రముఖ వైద్యుడు కలిశారు. ఆయన చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం వేసింది. ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన తర్వాత ఏ ఏ ప్రైవేటు ఆస్పత్రికి ప్రభుత్వం ఎన్ని వందల కోట్లు ఇచ్చిందో ఆయన వివరించారు. అందులో పదిశాతం డబ్బులిస్తే మేము అంతకంటే గొప్ప సేవలు అందించేవాళ్లం అన్నారు. మేము ఒక ఎక్స్‌రే మెషిన్ కొనాలంటే కూడా అదేదో కార్పొరేషన్ అనుమతినివ్వాలి. వారికి లంచాలివ్వాలి. కార్పొరేట్ ఆస్పత్రులు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన సొమ్ముతోనే తలా ఒక వైద్య కళాశాలను ప్రారంభించాయని కూడా ఆయన చెప్పారు. ఆరోగ్యశ్రీని తెచ్చి ప్రభుత్వాసుపత్రులను నిర్లక్ష్యం చేశారు. అక్కడ ఫినాయిల్ కొనాలంటే కూడా లక్ష రూల్స్. ఫీజు రీయింబర్సుమెంటుకు దీనికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? ఫీజు రీయింబర్సుమెంటు నిధులతోనే ఇవ్వాళ ఒక్క ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల పది ఇంజనీరింగ్ కళాశాలలయ్యాయి. మనం విద్యార్థులకు ఇస్తున్నాం అనుకుంటున్నాం. కానీ చేరుతున్నది ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల బొక్కసాల్లోకి. ఒక లెక్కా పత్రం లేదు. ఎవరు అర్హులో ఎవరు అనర్హులో లేదు. గుండుగుత్తగా సంవత్సరానికి ఇంతమందికి ఇన్ని వేల కోట్లు? విచ్చలవిడిగా ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటే ఒక కుంభకోణం. ఫీజు రీయింబర్సుమెంటు మరో కుంభకోణం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని సమీక్షించి ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం(ఫాస్ట్)’ పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. కానీ సీమాంధ్ర నాయకత్వానికి ఏజెంటుగిరీ చేస్తున్న నాయకులు ఇందులో రంధ్రాన్వేణ చేస్తున్నారు. బీసీలకేదో అన్యాయం జరిగిపోతుందని ఒక నాయకుడు వాపోయారు. తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలవల్ల అత్యధికంగా ప్రయోజనాలు పొందేది బీసీ సామాజిక వర్గమే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక బీసీ ఆర్థిక మంత్రి అయ్యారు. ఒక బీసీ స్పీకర్ అయ్యారు. మరో బీసీ మండలి చైర్మన్ అయ్యారు. మరో ఇద్దరు బీసీలు కీలక మంత్రి పదవుల్లో ఉన్నారు. మచ్చలను మాత్రమే చూడదల్చుకున్నవారికి చందమామ అందం కనిపించదు. అటువంటి వారు తెలంగాణకు భారం.