బాబుకు 40 సీట్లు దాటవట

మహానటుడు ఎన్ఠీఆర్ కాదు, చంద్రబాబే. ఎంత బాగా నటిస్తున్నాడో. తెలంగాణ బూచిని చూపి ఆంధ్రాలో సెంటిమెంటు పండించాలని తెగ ప్రయత్నిస్తున్నాడు.

కానీ బాబుకు విశ్వసనీయత లేదు. పెద్ద మాయగాడని జనానికి అర్థమయింది. టీడీపీ శ్రేణులకూ అర్థమయింది. అందుకే వైసి పీలోకి స్వచ్చందంగా దూకుళ్లు మొదలయినాయి. బాబు బంగారం పెడతామన్నా లీడర్లు ఆగుతలేరు.

బాబుకు 40 సీట్లు దాటవని ఇటీవల ఒక స్థానిక సర్వే తేల్చేసింది. అంతకుముందే రెండు జాతీయస్థాయి సర్వేల్లో వైసీపీ ఘానా విజయం సాధించబోతున్నదని వెల్లడయింది. అందుకే బాబు frustrate అయితున్నాడు. అడ్డగోలుగా అబద్దాలు చెబుతున్నడు.

చంద్రబాబుకు సరైనోడు కేసీఆరే

వైస్రాయ్ సిద్ధాంత కర్త కేసీఆరేనని 2001లో చెప్పి ఉంటే బాగుండేది. అప్పుడేమో నేనే మొనగాడినని చెప్పుకున్నవు. కేసీఆర్ పక్కనబెట్టి అవమానించినవు. ఇప్పుడేమో కేసీఆర్ అంటున్నవు. నిజంగానే అది నాలుకా తాటిమట్టా? కులగజ్జిని మహావృక్షంలా పెంచిన చంద్రబాబు, ఆయన బాకా మీడియా కేసీఆర్ కులాన్ని అంటగట్టాలని చూశాయి. చంద్రబాబు దేశమంతా తిరిగి ఏ చక్కానయినా కలవవచ్చు, అది తప్పు కాదట, కేసీఆర్ తిరిగి రాష్ర్టాల ముఖ్యమంత్రులను కలవడం, ఆ తర్వాత నరేంద్ర మోడీని కలవడం తప్పట. బ్రీఫింగ్ చేయడానికి కలిశావా అని నువ్వు ప్రశ్నిస్తే జనం నవ్విపోరా చంద్రబాబూ. బ్రీఫింగ్ గురించి ‘బ్రీఫ్డు మీ’ సాక్షిగా నీకు ఎంత అనుభవం ఉందో ఎవరికి తెలియదు చంద్రబాబూ. ఇంతకాలం మీరంతా కట్టగట్టుకుని ఏది చేస్తే అది రాజకీయం. మీరు చెప్పేది వేదం. మీరు ఆడింది ఆట. పాడింది పాట. ఇక నడవదు బాబూ. మీరు తప్పు చేసినా రైటే. దొంగతనం చేసినా రైటే. కేసులు కొట్టేయించుకున్నా రైటే. మీకు అలా సాగింది. ఇంక కష్టం బాబూ.

ఇంతకాలానికి మీకు సరైనోడు దొరికాడు. నీగురించి కేసీఆర్ అన్నవన్నీ అక్షర సత్యాలు. వెన్నుపోటు పొడవలేదా? మాటలు మార్చలేదా? పార్టీలు మార్చలేదా? పిల్లిమొగ్గలెయ్యలేదా? ఆంధ్రప్రజల మనోభావాలతో ఇష్టమొచ్చినట్టు ఆడుకోలేదా? మోడీతో నాలుగేళ్లు అంటకాగి ఇప్పుడు అడ్డం తిరిగావు. కాంగ్రెస్ సర్వనాశనం కావాలని శాపనార్థాలు పెట్టినోడివి ఆ పార్టీ కొంగుపట్టుకున్నావు. నీకు విలువలు లేవన్నది అందుకే. పచ్చి మోసగాడివి అన్నదీ అందుకే. హైటెక్ సిటీ నేనే కట్టాను అన్నావు. అంతమొనగాడివైతే సొంత రాజధాని నాలుగేళ్లలో ఎందుకు కట్టలేదు. ఇప్పుడు బున్యాదులు తీసి, ఇంత సిమెంటు కాంక్రీటు బోసి అదేదో ఘనకార్యం చేసినట్టు బిల్డప్ ఇచ్చుడు ఏంది? నీ డబ్బాలు, బాకాలు దానికి అంతగా జోకుడేంది?

చంద్రబాబూ నీకు మర్యాద కావాలా? పార్టీ పెట్టి, ప్రజలను గెలిచి, ప్రభుత్వాన్ని సాధించి, మీ అందరికీ పదవులు ఇచ్చి, అధికారంలో కూర్చో బెడితే ఆయనకు వెన్నుపోటు పొడిచి, ఆయనపై చెప్పులు వేయించి, ఆయనను దారుణంగా అవమానించి, గుండె పగిలి చనిపోయేలా చేసిన ఘాతక చరిత్ర నీది. చంద్రబాబు ఇప్పుడు కూడా తాను బాధితుడి ఫోజు పెట్టి మరోసారి జనాన్ని మోసం చేయాలని చూస్తున్నడు. నరేంద్రమోడీ, జగన్, పవన్, కేసీఆర్ అందరూ ఒక్కటయ్యారని అబద్ధపు ప్రచారం చేసి, తానొక్కడినే కొట్లాడుతున్నానని జనాన్ని నమ్మించాలని చూస్తున్నడు. పవన్ కల్యాణ్ కొంపలు కూల్చడానికి ఇప్పటికే కొందరు కోవర్టులను ఆయన పార్టీలో చేర్పించాడు. ఎన్నికల వేళ వాళ్లు తమ నిజస్వరూపం ప్రదర్శిస్తారు. కుళ్లు, కుతంత్రాలు, కుట్రలు అబ్బో చంద్రబాబు రాజకీయ డిక్షనరీలో వాడని పదం లేదు.

చంద్రబాబుకు ఆంధ్రను బాగుచేసే ఉద్దేశం ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలవడం ఒక్కటే ఆయన ఎజెండా. అందుకోసం ఎంతకయినా తెగించడమే ఆయన నైజం. మళ్లీ ఆంధ్ర ప్రజలను పిచ్చోళ్లను చేసి ఆడించాలని చూస్తున్నడు. ఆయన పాతకాలను సమర్థించేందుకు బాకాలు, డబ్బాలు మళ్లీ మోపయినయి.

బీసీ రిజర్వేషన్లపై ఏది నిజం?

head-in-sand

బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయస్థానాల తీర్పులను మరుగున పరిచి తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం నడుస్తున్నది. ఏ రిజర్వేషన్లయినా 50 శాతానికి మించకుండా చూడండి అని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. కొందరు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళితేనే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. మరోవైపు నెలరోజుల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి తీరాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదీ కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ వచ్చిన తీర్పే. ఈ రెండు తీర్పులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లను 23.81 శాతానికి తగ్గిస్తూ అత్యవసర ఆదేశాలు జారీ చేసి ఎన్నికల నిర్వహణకు సిద్ధమయింది.

ఈ వాస్తవాలను మరుగున పరిచి కొందరు మాజీ న్యాయమూర్తులతో సహా ప్రతిపక్ష నాయకులు బీసీ రిజర్వేషన్లను ఎలా తగ్గిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి దురుద్దేశాన్ని ఆపాదించాలని కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. రిజర్వేషన్ల మొత్తంపై కేంద్రం పెత్తనం కాకుండా రాష్ర్టాలకే నిర్ణయాధికారం ఉండాలని కోరుతున్నారు. ఆ విషయాలను మరుగునపర్చి మాజీ న్యాయమూర్తులు కొందరు రాజకీయ చిడతలు పట్టుకుని తిరుగుతున్నారు.

శకునాల బల్లి చంద్రబాబు

img_4885-3

తెలుగుదేశం చంద్రబాబునాయుడు అంతటి రాజకీయ అవకాశవాది, మాటలు మార్చే వాడు దేశంలో మరొకరు ఉండరు. ఏమాత్రం వెన్నెముక లేని రాజకీయ జీవి. నాలుగేళ్లపాటు ప్రధాని నరేంద్రమోడీతో అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు వీరావేశాలు ప్రదర్శిస్తున్నారు. మూడో ఫ్రంటుకు అవకాశమే లేదని, నరేంద్రమోడీకి మేలు చేయడంకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలలో ఏదో పార్టీకి దూరంగా ఫ్రంటులు మనుగడ సాగించలేవని చెబుతున్నారు. మరి 1989లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు, ఆ తర్వాత 1996లో ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ ఎలా వచ్చాయి? ఎలా ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి?

చంద్రబాబునాయుడు దివాళాకోరు కాబట్టి అవేవీ గుర్తు లేవు. కాంగ్రెస్, బీజేపీలు ఒంటరిగా లేక కూటములుగా ఈసారి 150 నుంచి 200 స్థానాలలోపే గెల్చుకుంటాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 225 లోక్ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ర్టాలలోని ప్రాంతీయ పార్టీలన్నీ జట్టు కడితే కాంగ్రెస్, బీజేపీ కూటమిలకంటే ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంది. ఈ స్థానాల బలంతో కేంద్రంలో నిర్ణాయక పాత్ర పోషించవచ్చు. కాంగ్రెస్, బీజేపీలను ఫెడరల్ ఫ్రంటుకే మద్దతు ప్రకటించాలని కోరే అవకాశం ఉంది. అది వదిలేసి నోటికి వచ్చినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు. తనకు అనువైతే ఒకరకంగా కాకపోతే మరో రకంగా నాలుక మడతేయడం చంద్రబాబుకు అలవాటే.

ఫెడరల్ మార్గం మేలు

poll

 

మోదీ ఇకముందు కూడా ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. మళ్లీ అధికారంలోకి వచ్చినా ఆయన ధోరణి మారకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా ఇదే పరిస్థితి. ఆ రెండు పార్టీలదీ ఉత్తరాది మనస్తత్వం. ఢిల్లీ కేంద్రక ఆలోచన. దక్షిణాది అంటే ఒక చిన్నచూపు. అందుకే అన్ని ప్రాంతాలు తమ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటుకునే ఒక ఫెడరల్ నమూనా దేశ రాజకీయాలకు అవసరం. ఆ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ఆలోచన ఉత్తమమైనది. చంద్రబాబువి ఆసరా రాజకీయాలు. ఆయన ఎవరో ఒకరిపై ఆధారపడితే తప్ప రాష్ట్రంలో,రాజకీయాల్లో బతుకలేరు.

జాతీయపార్టీల కేంద్రీకృత అధికారం దేశానికి చేటు. గతంలో ఇందిరాగాంధీ, తాజాగా ప్రధాని నరేం ద్ర మోదీ నాయకత్వం ఆ విషయం బాగా రుజు వు చేసింది. ఆయన నిర్ణయాలు చేస్తున్న తీరు, వాటి తప్పొప్పులను సమీక్షించడానికి నిరాకరించే మొండితనం దేశానికి చాలా నష్టం చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ, పెట్రో ధరలకు స్వేచ్ఛ, నల్లధనం విషయంలో చేతులెత్తేయ డం, బ్యాంకు డిఫాల్టర్లను కట్టడి చేయకపోవడం, రాష్ర్టాల హక్కులను గౌరవించకపోవడం ఆయన లెక్కచేయనితనానికి తార్కాణా లు. ఇవన్నీ పదుగురితో చర్చించి తీసుకున్న నిర్ణయాలు కాదు. ఆయన, మరికొద్ది మంది దేశంపై రుద్దిన నిర్ణయాలు. బ్యాంకులు, కోర్టు లు, ఉన్నత విద్యావ్యవస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘాసంస్థలు.. అన్నీ అనర్హులతో నిండిపోతున్నాయి. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండాలే తప్ప బలాదూర్‌గా వ్యవహరించే ప్రభుత్వం కాదు. ఒక్క బీజేపీ సమస్య కాదు, జాతీ యపార్టీల అన్నింటి సమస్య. వారి ఆలోచనలన్నీ ఢిల్లీ కేం ద్రంగా, ఉత్తరాది కేంద్రం గా ఉంటాయి. వారు ఏ నిర్ణ యం చేయాలన్నా, ఏ విధా నం రూపొందించాల న్నా ఒక రాష్ర్టానికి మరో రాష్ర్టానికి పోటీపెట్టి ఆలోచిస్తారు. చివరికి ఏ నిర్ణయ మూ చేయని దుస్థితిలో ఉండిపోతారు.

ఏకపక్ష అధికారం ఉన్నప్పుడల్లా ఢిల్లీలో జరిగింది ఇదే. ఇందిరాగాంధీ ఏకపక్షంగా అధికారం చెలాయించింది కాబట్టే 1969లో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయగలిగింది. 10 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినా తెలంగాణ వాదాన్ని గౌరవించలేదు. ప్రశ్నించలేని అధికారం చెలాయించింది కాబట్టే ఎదురుదెబ్బలు తగిలేసరికి 1975లో ఎమర్జెన్సీ విధించింది. 1977లో జనతా ప్రభుత్వం, 1989 తర్వాత ఫ్రంట్ రాజకీయాలు మొదలైన తర్వాతనే కేంద్రం లో ఏ పార్టీ ఉన్నా ఒళ్లు దగ్గర పెట్టుకోవడం కొంత అలవాటైంది. విశ్వనాథ ప్రతాప్‌సింగ్ ప్రభుత్వం, అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వాలు ఫ్రంట్ రాజకీయాలపై ఆధారపడినా శక్తివంతమైన పాలన ను అందించాయి. దేశంలో మొదటిసారి రైతు రుణ మాఫీ చేసింది 1989లో జాతీయ ఫ్రంట్ ప్రభుత్వం హయాంలోనే. వెనుకబడిన తరగతులకు మండల్ రిజర్వేషన్లు అమలు చేసిందీ వీపీ సింగ్ ప్రభుత్వమే. ప్రపంచానికి మరోసారి మన అణు పాటవాన్ని చాటిం ది వాజపేయి పాలనలోనే. కార్గిల్ యుద్ధం గెలిచిందీ ఆయన పాలనలోనే. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులు, రోడ్డు ప్రాజెక్టులు మొదలైందీ వాజపేయి పాలనలోనే. వీపీసింగ్, వాజపే యి దేశమంతటా ఏదో ఒక రూపంలో కనిపించారు. పల్లెలకు రోడ్లన్నీ వాజపేయి పేరుతోనే వచ్చాయి. వెనుకబడిన తరగతులకు విద్య ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు వీపీ సింగ్ కారణంగానే వచ్చాయి.

మోదీ కూడా ప్రజలకు చాలా రూపాల్లో కనిపించారు. ఆయన కనిపించిన సందర్భాలన్నీ ప్రజలకు ప్రతికూలమైనవే. నోట్ల రద్దు పేదల ఆర్థికస్వేచ్ఛను దెబ్బతీసింది. పెద్దల ఆర్థికస్వేచ్ఛను మాత్రం ఇసుమంత కూడా తాకలేదు. బ్యాంకులకు రుణాల ఎగవేత ఆగలే దు. నల్లధనం చెలామణి ఆగలేదు. అవినీతి ఆగలేదు. ఎన్నికల ఖర్చు తగ్గలేదు. ధరల పెరుగుదల ఆగలేదు. పెద్ద వాళ్ల నోట్ల చెలామణి ఎప్పటిలాగే ఉంది. చిన్నవాళ్ల వద్ద నోట్లు మిగులలేదు. అందుకే కేంద్రం లో జాతీయ పార్టీలకు తిరుగులేని అధికారం దేశానికి ఎప్పుడూ మంచిది కాదు. సమాఖ్య రాజకీయాలే దేశానికి అవసరం. సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించే నాయకత్వమే దేశానికి కావాలి. ఇందుకు సమాఖ్య రాజకీయ నమూనానే కావాలి. మళ్లీ జాతీయ ఫ్రంట్ తర హా ఫెడరల్ ఫ్రంట్ రావాలి. జాతీయపార్టీలకు ఫ్రంట్‌లు అండగా ఉండటం కాదు. ఫ్రంట్‌కే జాతీయ పార్టీలు మద్దతుగా వచ్చే పరిస్థితి రావాలి. వీపీ సింగ్, ఎన్టీఆర్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది. కాంగ్రెస్ అవినీతిపైన, బీజేపీ మతోన్మాదంపైన నేషనల్ ఫ్రంట్ పోరాడింది. ఈ నేపథ్యంలో జరిగిన 1989 ఎన్నికల్లో జనతాదళ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ 146 స్థానాలు గెలువగా కాంగ్రెస్ 197 స్థానాలను గెలిచింది. బీజేపీ 86 స్థానాలు, వామపక్షాలు 52 స్థానాలు గెలిచాయి.

రాజీవ్‌గాంధీ తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని ప్రకటించారు. ఆ వెంటనే వామపక్షాలు, బీజేపీ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించాయి. అలా మరోసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ర్టాల ఆకాంక్షలు నెరవేర్చుకునే అవకాశం అప్పుడు మొదలైంది. జాతీయ రహదారులు, కొత్త రైల్వే మార్గాలు, జాతీయ విద్యాసంస్థలు అనేక ప్రాజెక్టులు ఆయా ప్రాంతీ య పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వంలో ఉండి తమ రాష్ర్టాలకు తీసుకొచ్చారు. నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నది కొద్దికాలమే అయినా మంచి ఫలితాలనే అందించింది. దీర్ఘకాలిక దృష్టిలేని స్వార్థ రాజకీయశక్తుల కారణంగా నేషనల్ ఫ్రంట్ ఎక్కువ కాలం మనలేకపోయింది. మరోసారి 199 6 ఎన్నికల్లో ప్రాంతీయపార్టీలన్నీ యునైటె డ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, బీజేపీలు కలిసి 300 స్థానాలు గెలిస్తే, ప్రాంతీయ పార్టీలు 243 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్ బయ టి మద్దతుతో దేవెగౌడ, ఇంద్రకుమార్ గుజ్రాల్ వంటి వారు దేశాని కి ప్రధానులు అయ్యే అవకాశం వచ్చింది. దక్షిణాది నుంచి రెండో ప్రధాని దేవెగౌడ. అయితే ప్రయోజన వైరుధ్యాల వల్ల యునైటెడ్ ఫ్రంట్ కూడా ఎక్కువ కాలం నిలువలేదు. 1998, 99లలో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రాంతీయపార్టీలు గెలుచుకున్న స్థానాల సంఖ్య తగ్గినా ఢిల్లీ లో రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకపాత్ర పోషించాయి. వాజపేయి వంటి నాయకుడు ప్రధాని కావడానికి ప్రాంతీయ పార్టీలే మద్దతు తెలిపాయి. ఆ తర్వాత మన్మోహన్‌సింగ్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలకు కూడా ప్రాంతీయపార్టీలే ప్రాణవాయువు.

ఇందిరాగాంధీ తర్వాత తిరిగి ఏకచ్ఛత్రాధిపత్యం వచ్చింది నరేం ద్ర మోదీకే. అందుకే ఆయన ఎవరి మాటా వినని సీతయ్యలాగా నిర్ణయాలు చేస్తూ పోయారు. నోట్ల రద్దు విషయం కనీసం మంత్రివర్గానికి తెలియదు. ఆర్థికమంత్రికి కూడా తెలియదని అప్పట్లో వార్తలు వచ్చాయి. మోదీ రాష్ర్టాలకు న్యాయంగా ఇవ్వాల్సిన ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. మంచిగా ఉంటే ఒకరకంగా ప్రత్యర్థిగా ఉంటే మరోరకంగా తటస్థంగా ఉంటే ఇంకోరకంగా కేంద్రం సాయాన్ని రాజకీయ జూదం స్థాయికి మార్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లోపభూయిష్టమని అదనీ ఇదనీ తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ ప్రభుత్వం వాటిని సరిచేసేందుకు ఎంతమాత్రం ప్రయత్నించలేదు. హైకోర్టు విభజనను కోర్టు వ్యాజ్యాలకు వదిలేసింది. కేంద్ర సంస్థల మంజూరీని ఇంకా సాగదీస్తూనే ఉన్నది. రాష్ర్టాల ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో నూ దాటవేత వైఖరినే ప్రదర్శిస్తున్నది. రాజకీయ సుస్థిరతను కోరి శాసనసభ నియోజకవర్గాల సంఖ్య ను పెంచాలని పునర్విభజన చట్టంలో ప్రతిపాదిస్తే దానిపై లేనిపోని పేచీలు లేవదీసి ఇప్పుడు చేయలేమని వాదిస్తున్నది. పార్లమెంట్ ఆమోదించిన చట్టంలోని ప్రతిపాదనకే ఇటువంటి పరిస్థితి ఉంటే కేంద్రం ఇంక దేనిని గౌరవిస్తుంది? ఒకవేళ రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తే కూడా పార్లమెంట్‌లో అంతటి మెజార్టీ బీజేపీకి ఉన్న ది. జీఎస్టీ వంటి సంక్లిష్టమైన బిల్లును ఆమోదింపజేసుకున్నది. అన్ని పార్టీలు ఒప్పుకున్న పునర్విభజన ప్రతిపాదనలపై నిర్ణయం చేయడానికి ఎందుకు తాత్సారం? అన్నింటినీ సొంత రాజకీయ ప్రయోజన దృష్టితో చూసే మోదీ సంకుచిత దృక్పథమే ఈ జాప్యానికి కారణం. కేంద్రం తలుచుకుంటే రాష్ర్టాలకు సంబంధించిన సమస్యలన్నీ ఒక్కరోజులో పరిష్కారమవుతాయి. మోదీ అలా ఆలోచించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఉపయోగపడతారు ఎవరు ఉపయోగపడరు అన్న లెక్కలు వేసుకుని మరీ సహకరించడమో, సతాయించడమో చేస్తున్నారు.

మోదీ ఇకముందు కూడా ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. మళ్లీ అధికారంలోకి వచ్చినా ఆయన ధోరణి మారకపోవ చ్చు. ఒకవేళ కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా ఇదే పరిస్థితి. ఆ రెండు పార్టీలదీ ఉత్తరాది మనస్తత్వం. ఢిల్లీ కేంద్రక ఆలోచన. దక్షిణాది అంటే ఒక చిన్నచూపు. అందుకే అన్ని ప్రాంతాలు తమ అస్తిత్వా న్ని, ఆత్మగౌరవాన్ని చాటుకునే ఒక ఫెడరల్ నమూనా దేశ రాజకీయాలకు అవసరం. ఆ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ఆలోచన ఉత్తమమైనది. చంద్రబాబువి ఆసరా రాజకీయాలు. ఆయన ఎవరో ఒకరిపై ఆధారపడితే తప్ప రాష్ట్రం లో, రాజకీయాల్లో బతుకలేరు. అందుకే ఆయన ముందే తన రాజకీయావసరాలను కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారు. కేసీఆర్ బీజేపీ, కాం గ్రెస్‌లకు దూరంగా ఒక ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రధాని, ఉప ప్రధాని, మంత్రివర్గాన్ని నిర్ణయించడంలో రాష్ర్టాలకు ప్రమేయం ఉండాలని భావిస్తున్నారు. ప్రధాని ఉత్తరాది నుంచి ఉంటే దక్షిణాది నుంచి ఉప ప్రధాని ఎందుకు ఉం డకూడదు? కీలకమైన శాఖలు దక్షిణాది రాష్ర్టాలకు ఎందుకు దక్కకూడదు? తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడి షా వంటి రాష్ర్టాలు తమ రాష్ర్టాల ప్రగతికి సాధించుకున్న ప్రాజెక్టు లు తెలంగాణకు కూడా ఒక నమూనా కావాలి.

తమిళనాడులో ఉన్నన్ని జాతీయ రహదారులు, రైలుమార్గాలు దేశంలో ఎక్కడా లేవు. బీహార్‌లో రైలు మార్గాలు అసాధారణ రీతిలో విస్తరించాయి. ఆ రాష్ర్టాల నాయకత్వం స్వతంత్రంగా ఉండి కొట్లాడి రైల్వేలు, ఉపరితల రవాణా వంటి శాఖలు తీసుకొని తమ రాష్ర్టాలకు మేలు చేయగలిగారు. తెలంగాణకు చేయాల్సింది చాలా ఉన్నది. రైల్వేలు, జాతీయ రహదారుల విషయంలో మనం ఇప్పటికీ వెనుకబడి ఉన్నాం. తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి నమూనా దేశానికి కూడా అవసరం. గత ఎన్నికల్లో కేసీఆర్ ధైర్యం చేసి అమలుచేసిన రుణమాఫీ దేశమంతటా ఒక నినాదమై కూర్చుంది. ఏనాడూ రైతుల గోడు పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు దేశమంతటా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నది. కేసీఆర్ కేవలం రుణమాఫీ మాత్ర మే కాదు, దేశమంతటా రైతుబంధు అమలుచేయాలని పిలుపునిస్తున్నారు. భారీ ఎత్తున దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని సూచిస్తున్నారు. దేశంలో 65 శాతం ప్రజానీకం ఆధారపడిన వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ ఎజెండా అంతా అమలు కావాలంటే ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భవించాలి. కాంగ్రెస్, బీజేపీ ఛత్రాలకింద తలదాచుకోవడం మాని ప్రాంతీయ ఆకాంక్షల కేంద్రబిందువుగా ఒక బలమైన ఫ్రంట్ రూపొందాలి. ఆ దిశగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు విజయవం తం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈవీఎంలపై భావదారిద్య్రం

evm

 

ఈవీఎంలను మానిప్యులేట్ చేయవచ్చునని, అవి తీసేసి మళ్లీ మాన్యువల్ బ్యాలెట్ ఎన్నికలు జరిపించాలని కొంత మంది రాజకీయ నాయకులు, మేధావులు డిమాండు చేస్తున్నారు. పార్టీలన్నీ తీర్మాణం చేసి అటువంటి నిర్ణయం తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ తాము గెలిచినచోట ఒక విధంగా ఓడిన చోట మరో విధంగా ఈవీఎంల వినియోగంపై చర్చ చేయడమే విడ్డూరమవుతుంది. నాకు గుర్తున్న మేరకు 2004 నుంచి పూర్తిస్థాయిలో ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఈవీఎంలను మానిప్యులేట్ చేయవచ్చునని మొదటి నుంచీ విమర్శలు ఉన్న మాట వాస్తవమే. అవి అనుమానపూరిత విమర్శలు తప్ప, రుజువైన దాఖలాలు లేవు.

2004లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఇటువంటి అనుమానాలు అనేక మంది సీనియర్ జర్నలిస్టులు, మేధావులు సైతం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఓడిపోవాలని బలంగా కోరుకుంటున్నవారొకవైపు, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాలు రావాలని కోరుకుంటున్నవారు మరోవైపు. చంద్రబాబు ఇంద్రుడు చంద్రుడు ఆయన ఏదో ఒకటి చేసి మళ్లీ గెలుస్తాడు అన్న భావనను చంద్రబాబునాయుడు, ఆయన అనుకూల మీడియా ప్రజలపై బలంగా రుద్దింది. అప్పుడు కూడా వంటకం చేసిన సర్వేలు జనంపై రుద్దారు. ఒక సీనియర్ జర్నలిస్టు జూబిలీహిల్స్ పోలింగ్ బూత్ వెళ్లి ఓటేసి వచ్చాడు. ఎటు ఓటు వేసినా సైకిల్ పడుతుందని నా అనుమానం అన్నాడు.

కానీ ఎన్నికల తర్వాత ప్రజాతీర్పు స్పష్టమైంది. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాలు గెలిచాయి. ఇలా అనేక రాష్ర్టాల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి. పాలించే పార్టీలు మారుతూనే ఉన్నాయి. 2014లో కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ఓడిపోయి ఎన్ గెలిచింది. ఈవీఎంలను మానిప్యులేట్ చేసే పనయితే రాహుల్ ఎప్పుడో ప్రధాని కావలసింది. అంతదూరం ఎందుకు? నరేంద్రమోడీ సర్వశక్తిమంతుడని పేరు కదా! మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఓడిపోతే దేశవ్యాప్తంగా తన పాలనకు ముప్పు వస్తుందనీ తెలుసు. అయినా అక్కడ ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించారు. బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ మాత్రం ఈవీఎంలు సక్రమంగా పనిచేసి, తెలంగాణలో మాత్రమే తేడా చేశాయా?

ఇవన్నీ ప్రజల తీర్పును జీర్ణించుకోలేని ఒక భావదారిద్య్రం నుంచి వచ్చే ఆలోచనలు. తెలంగాణలో ప్రజలు కూడా సాధారణ తీర్పు ఇవ్వలేదు. దాదాపు 30 లక్షల ఓట్ల ఆధిక్యతను ఇచ్చారు. టీఆర్ 88 స్థానాల్లో విజయం సాధించింది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా కాంగ్రెస్ ఇంకా అదే సమస్యను పట్టుకుని వేలాడడం ఆశ్చర్యం వేస్తున్నది. కాంగ్రెస్ నాయకులు ఈ పితూరీలు, ఫిర్యాదులు, కేసుల చుట్టూ కాకుండా జనం చుట్టూ తిరిగితే నాలుగు ఓట్లు వస్తాయి. ఎప్పటిలాగే ఓటర్ల జాబితాలు, సమస్యలంటూ కోర్టుల చుట్టూ తిరిగితే ప్రజలు హర్షించరు. దానికంటే ఓటర్ల జాబితాలో నమోదుకాని వారిని చేర్పిస్తే ఒకింత మేలు జరుగుతుంది.