మాట తప్పుట, మడమ తిప్పుట


మాట తప్పను. మడమ తిప్పను…. ఈ మాటలు 2009 ఎన్నికలకు ముందు కూడా అన్నట్టు గుర్తు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం జరగ్గానే మాట మార్చడం, పార్టీ మార్చడం, మడమ తిప్పడం, 2014 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పడిపడి ఏడ్వడం….. ఇంకా అందరికీ గుర్తే. ఎవరైనా ఎలా మర్చిపోగలరు?

ఇప్పుడు మరో ప్రతిజ్ఞ. మరో పార్టీ. మరో మడమ. బకరాలు ఎవరు? బలయ్యేది ఎవరు?

భూములేలినా బుద్ధి మారదా!

తెలంగాణ ప్రజలకు చంద్రబాబు హయాంలో జరిగిన మంచేకాదు చెడుగురించి కూడా బోలెడు అవగాహన ఉంది.హైదరాబాద్‌ను ఆంధ్రా కాలనీగా వ్యవస్థితం చేసింది కూడా చంద్రబాబే. ఆ కాలంలోనే హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హుడా) నిధులను విజయవాడ-గుంటూరు-తెనాలి అభివృద్ధి సంస్థకు మళ్లించింది కూడా ఆయన కాలంలోనే. ఆయన ఇతర రంగాలను సర్వనాశనం చేసిందీ నిజం. పల్లెలను, వ్యవసాయాన్ని, నీటిపారుదల ప్రాజెక్టులను వదిలేసి ప్రపంచ బ్యాంకు ఎజెండాను మోసింది నిజం. తెలంగాణను రైతు ఆత్మహత్యల తో వల్లకాడుగా మార్చింది కూడా ఆ పదేళ్లలోనే.

ఎలుకతోలు తెచ్చి ఎన్నేళ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అని వేమన చెప్పింది ఎంత సత్య మో ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు, ఆయన ప్రభుత్వం తెలంగాణ గురించి చేస్తు న్న సూత్రీకరణలు చూస్తే తెలుస్తుంది. ఒక్క చం ద్రబాబు నాయుడే కాదు నీతి ఆయోగ్ వైస్ చైర్మ న్ రాజీవ్‌కుమార్ కూడా అమరావతిలో జరిగిన ఒక సమావేశంలో చాలా తెలివితక్కువ వాదన చేశారు. తెలంగాణకు వచ్చే పన్నుల ఆదాయంలో హైదరాబాద్‌లోని ఆంధ్రావారు చెల్లిస్తున్నదే 50 శాతం ఉంటుందని, వారంతా అమరావతికి వస్తే ఆంధ్రప్రదేశ్ గొప్పగా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబునాయుడు చాలా అనుభవం కలిగిన నాయకునిగా చెప్పుకుంటారు. రాజీవ్‌కుమార్‌కు కూడా గొప్ప ఆర్థిక నిపుణునిగా పేరుంది. తెలంగాణవాళ్లకు వ్యవసాయం చేయడం రాదని కృష్ణా ట్రిబ్యునల్‌కు లేఖలు రాసిన ఇంజినీర్లు కూడా నిన్నమొన్నటిదాకా హైదరాబాద్ నీళ్లూ, కూడూ అనుభవించినవాళ్లే. ఇటువంటి మనుషులు ఇంత విచక్షణారహితంగా ఎలా మాట్లాడగలుగుతున్నారన్నదే ప్రశ్న. హైదరాబాద్ రాజధాని కాబట్టి, బతుకుదెరువు బాగుంటుంది కాబట్టి, ఎదుగడానికి అవకాశాలు ఎక్కువగా ఉం టాయి కాబట్టి, రెండు రాష్ర్టాలతోపాటు దేశంలోని అన్నిరాష్ర్టాల ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఉద్యోగాలు చేశారు, వ్యాపారాలు చేశారు, పరిశ్రమలు ప్రారంభించారు, స్థలం కొనుక్కున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, రోడ్లు వేయించుకున్నారు, సుఖవంతమైన జీవితం చూసుకున్నారు. ఇందులో ఏదీ లోకోద్ధరణ కోసం జరుగలేదు. ఎవరి సంగతో ఎందుకు? నేను మా ఊరి నుంచి హైదరాబాద్ నగరానికి హైదరాబాద్‌లో ఉన్నవారిని, హైదరాబాద్ రాజధానిగా కలిగిన తెలంగాణవారిని ఉద్ధరించడంకోసం రాలేదు. బతుకడం కోసం వచ్చా ను. ఇక్కడ స్థిరపడ్డాను. బతుకుదెరువులో భాగంగా నా ప్రవృత్తికి తగిన ఒక వృత్తిని ఎంచుకున్నాను. అందులో పనిచేస్తున్నాను. కాలక్రమంలో ఎదిగాను. ఇవ్వాళ నేను కూడా పన్ను కడుతున్నాను. అదంతా ఒక బాధ్యత కలిగిన పౌరునిగా తప్ప, ఉద్ధరణ కాదు.

భారతీయులు అదృష్టవంతులు. వారికి బ్రిటిష్ పాలకు లు, అందునా శ్వేతజాతీయుల పాలన లభించింది. లేకపోతే వారు ఎప్పటికీ బాగుపడేవారు కాదు అని వెనుకటికి ఓ శ్వేత జాతి దురహంకార మేధావి చేసిన వ్యాఖ్యకు ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తేడా ఏమీ లేదు. ఇద్దరిదీ దురహంకారమే. అభివృద్ధి అన్నది ఒక నిరంతర ప్రక్రియ. ఒకరు ఆలోచిస్తారు. ఒకరు విధాన కల్పన చేస్తారు. మరొకరు ఆచరణ మొదలుపెడుతారు. ఇంకొకరు పూర్తి చేస్తారు. మళ్లీ మరో ఆలోచన మొదలవుతుంది. ఇందులో ఎవరి పాత్ర వారిది.

హైదరాబాద్‌లో నివసిస్తున్న ఏ ప్రాంతం వారికైనా ఇదే లాజిక్ వర్తిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి హైదరాబాద్‌లో ఉండే ఆంధ్రవారంతా అమరావతికి వస్తే బాగుంటుందని చంద్రబాబునాయుడుకు ఉండవచ్చు. అది అర్థం చేసుకోవచ్చు. కానీ రాజీ వ్‌కుమార్‌కు ఎందుకుండాలి? ఎందుకంటే ఆంధ్రకు ప్రత్యేక హోదా ఎగ్గొట్టడం కోసం ఏదో ఒక ఉపశమనం చేకూర్చే మాటలు చెప్పాలి. అందుకు ఇటువంటి తలతిక్కవాదన చేసి ఉం టాడు. రాష్ర్టాలు విడిపోయినప్పుడు ఏ రాజధాని అయినా బోసిపోదు. ఎడారి కాదు. మద్రాసు నుంచి కర్నూలుకు, కర్నూలు నుంచి హైదరాబాద్‌కు రాజధాని మారిన తర్వాత సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు ఎందుకు రాలేదు? మా వాళ్లతోపాటే మేము ఎందుకు అనుకోలేదు? అది ఆచరణ సాధ్యం కాదు కాబట్టి. మద్రాసులో, కోయంబత్తూరులో పరిశ్రమలు పెట్టిన ఆంధ్రా పారిశ్రామికవేత్తలు అన్నీ మూసేసుకుని ఆంధ్రకో హైదరాబాద్‌కో వచ్చారా? హైదరాబాద్‌లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగినవారంతా ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారాలు, పరిశ్రమలు ప్రారంభించి ఎదిగినవారే. మద్రాసు నుంచి వ్యాపారా లు మోసుకొచ్చినవారు అతి తక్కువ. ఇటువంటి అర్థరహితమైన వాదనలు గతంలోనూ జరిగాయి. మహారాష్ట్ర నుంచి గుజరాత్‌ను విడదీసేప్పుడు బొంబాయిపై ఇదేవిధంగా రచ్చ చేశారు. బొంబాయిలో వ్యాపారాలన్నీ గుజరాతీలవేనని, అందువల్ల బొంబాయిని గుజరాత్‌కు రాజధానిగా కొనసాగించాలని వాదించారు. బొంబాయిని గుజరాత్ నుంచి విడదీస్తే బొంబాయి బోసిపోతుందని బెదిరించారు. కానీ వాస్తవంగా ఏం జరిగింది? అక్కడ వ్యాపారాలు మూతపడలేదు. బొంబాయి దేశ ఆర్థిక రాజధాని అయింది. గుజరాతీ లు గుజరాత్‌లో కొత్తగా వ్యాపారాలు పెట్టుకున్నారు. రెండు రాష్ర్టాలు ఎదిగాయి. ఇప్పుడూ తెలంగాణ, ఆం ధ్రలో అదే జరిగితే సంతోషం. అంతే కానీ రెండు రాష్ర్టాలకు పోటీపెట్టి మాట్లాడటం, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రకు అన్యాయం జరిగిపోయిందంటూ చీటికీ మాటికీ వాపోవడం రాజనీతిజ్ఞత కాదు, రాజకీయ దివాళాకోరుతనం. ప్రజలను భావోద్వేగాలపరంగా రెచ్చగొట్టడం వారికి మంచిది కాదు.

1995కు ముందు హైదరాబాద్‌లో ఏముంది? ఇప్పుడేముంది? అని చంద్రబాబునాయుడు మాట్లాడారు. ఇంత రాజకీయ అనుభవం ఏమైందో అర్థం కాదు. హైదరాబాద్ చంద్రబాబు పుట్టకముందు, ఎన్‌టీఆర్ రాక ముందు కూడా వైభవంగానే ఉంది. భారతీయులు అదృష్టవంతులు. వారికి బ్రిటిష్ పాలకు లు, అందునా శ్వేతజాతీయుల పాలన లభించింది. లేకపోతే వారు ఎప్పటికీ బాగుపడేవారు కాదు అని వెనుకటికి ఓ శ్వేత జాతి దురహంకార మేధావి చేసిన వ్యాఖ్యకు ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తేడా ఏమీ లేదు. ఇద్దరిదీ దురహంకారమే. అభివృద్ధి అన్నది ఒక నిరంతర ప్రక్రియ. ఒకరు ఆలోచిస్తారు. ఒకరు విధాన కల్పన చేస్తారు. మరొకరు ఆచరణ మొదలుపెడుతారు. ఇంకొకరు పూర్తి చేస్తారు. మళ్లీ మరో ఆలోచన మొదలవుతుంది. ఇందులో ఎవరి పాత్ర వారిది. దేశంలోకి కంప్యూటర్లు తేవాలని రాజీవ్‌గాంధీ ఆలోచించారు. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుల ను ప్రారంభించాలన్న ఆలోచన అప్పటిదే. 1993లో నే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మాదాపూర్ రాజీవ్‌గాంధీ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేశా రు. ఎన్‌టీఆర్ కు చేసిన ద్రోహం తాలూకు పాపాలను కడిగేసుకోవ డం కోసం బాబు అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాలపై దృష్టిని కేంద్రీకరించిన మాటవాస్తవం. ఐటీ రంగం అభివృద్ధి వేగిరపరచింది నిజం. ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డి ఏమీ ఆపలేదు. అడ్డుకోలేదు. ఇప్పుడు స్వరాష్ట్రంలో ఇంకా స్వేచ్ఛగా అభివృద్ధి పథం సాగుతున్నది. మునుపెన్నడూ లేనంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్‌ను మరిం త మహోజ్వల నగరంగా తీర్చిదిద్దడానికి బాటలు వేస్తున్నారు. మొత్తంగా ఈ అభివృద్ధి ప్రస్థానంలో నేనుగానీ లేకపోతే… అనే సంభాషణే అవసరం లేని ది. ఎవరి పాత్ర వారికి ఉంటుంది. కేటీఆర్ నిజాయితీగా చంద్రబాబు చేసిన కృషిని ఒక వేదికపై చెప్పారు. ఆ గౌరవాన్ని చంద్రబాబు కాపాడుకుంటే మంచిది. అది కాకుండా హైదరాబాద్‌ను, తెలంగాణను కించపరిచే భాషను గానీ, వాదనను గానీ తెలంగాణ ప్రజ లు అంగీకరించరు.

ప్రకాశం బరాజు రాకముందు కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఏమి పంటలు వేసేవారో, ఎంత పంట పండించేవారో ఒక్కసారి చరిత్ర పుటల్లోకి, కనీ సం మద్రాసు ప్రెసిడెన్సీ గెజిట్‌లలోకి వెళ్లి చదువుకుంటే తెలుస్తుంది. ప్రకాశం బరాజు, దానిపైన నాగార్జున సాగరం వచ్చిన తర్వాత కృష్ణా, గుంటూరు వారు వరిపంటలో ఆరితేరి ఉండవచ్చు. సాగునీటికి పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేసుకోవడం తెలంగాణ రైతులకు సాధ్యమైతే బంగారం పండిస్తారు. అద్భుతాలు సృష్టిస్తారు. ఎప్పటిదాకో ఎందుకు తెలంగాణ ప్రభు త్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం రికార్డు స్థాయి లో వరిపంట దిగుబడి వచ్చింది. తెలంగాణ రైతు కరెంటుకోసం, పెట్టుబడి కోసం, ఎరువులకోసం ఎదురుచూడటంలోనే తన శక్తినంతా ధారపోస్తూ వచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం ఆ కష్టాలనుంచి విముక్తి చేసింది కాబట్టి అంత పంట దిగుబడి వచ్చింది.

ఎందుకంటే తెలంగాణ ప్రజలకు చంద్రబాబు హయాంలో జరిగిన మంచేకాదు చెడుగురించి కూడా బోలెడు అవగాహన ఉంది. హైదరాబాద్‌ను ఆంధ్రా కాలనీగా వ్యవస్థితం చేసింది కూడా చంద్రబాబే. ఆ కాలంలోనే హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా) నిధులను విజయవాడ-గుంటూరు-తెనా లి అభివృద్ధి సంస్థకు మళ్లించింది కూడా ఆయన కాలంలోనే. ఆయన ఇతర రంగాలను సర్వనాశనం చేసిందీ నిజం. పల్లెలను, వ్యవసాయాన్ని, నీటిపారుదల ప్రాజెక్టులను వదిలేసి ప్రపంచబ్యాంకు ఎజెండా ను మోసింది నిజం. తెలంగాణను రైతు ఆత్మహత్యల తో వల్లకాడుగా మార్చింది కూడా ఆ పదేళ్లలోనే. ఆయన తన ఘన కార్యాలను గురించి చెప్పుకున్నప్పు డు, తెలంగాణకు జరిగిన నష్టాలను కూడా చెప్పాల్సి ఉంటుంది. అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా- అప్ప ట్లో తెలంగాణ ఆదాయాన్ని ఇతర ప్రాంతాలకు మళ్లిం చి, ఇక్కడి ప్రజలకు చిప్ప చూపించేవారు. ఇప్పుడు తెలంగాణ ఆదాయం తెలంగాణలోనే ఖర్చు పెట్టుకునే అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడుకు ఇప్పు డు అలా ఖర్చు పెట్టుకునే ఛాన్సు పోయింది. అందుకే ప్రతిసందర్భంలో కంటికి కడివెడుగా ఏడుస్తున్నాడు. అంత బాధగా ఉంటే రాజీవ్‌కుమార్ చెప్పినట్టు చంద్రబాబు తెలంగాణలో వ్యాపారాలు మూసివేసి, అమరావతికి తరలించుకోవచ్చుగా. హెరిటేజ్ పన్ను ఆదా యం అంతా ఆంధ్రాకే దక్కేట్టు చూడవచ్చుగా. అది మాత్రం కుదరదు.

ఇక వ్యవసాయం గురించి, కృష్ణాజలాల పంపిణీ గురించి ఆంధ్రా ప్రభుత్వం రాసిన లేఖ ఆధిపత్య దురహంకారానికి పరాకాష్ట. పొరుగురాష్ట్రం, ఎగువరాష్ట్రం అయిన తెలంగాణతో ఎలా వ్యవహరించాలో ఆంధ్ర నాయకత్వానికి ఇప్పటికీ సోయి రాలేదని చెప్పడానికి ఉదాహరణ. ఇప్పటికీ తామేదో పెద్దన్నలమైన ట్టు, తెలివిమంతులైనట్టు, నేర్పడానికే పుట్టినట్టు వ్యవహరించడం వారి తెంపరితనాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాదనలే ఇప్పటికీ చేస్తున్నారు. తెలంగాణ వారికి వ్యవసాయం రాదు, మేము నేర్పించాము అన్నాడో దురహంకారి. తెలంగాణలో కొన్ని శతాబ్దాలుగా వ్యవసాయం ఉంది. కాకతీయులు నిర్మించిన తటాకాల నాటి నుంచి వ్యవసాయం కొనసాగుతున్నది. హైదరాబాద్ రాష్ట్రంలో 1901లోనే 8.69 లక్షల ఎకరాలు వరిపంట సాగయింది. ప్రకాశం బరాజు రాకముందు కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఏమి పంటలు వేసేవారో, ఎంత పంట పండించేవారో ఒక్కసారి చరిత్ర పుటల్లోకి, కనీ సం మద్రాసు ప్రెసిడెన్సీ గెజిట్‌లలోకి వెళ్లి చదువుకుంటే తెలుస్తుంది. ప్రకాశం బరాజు, దానిపైన నాగార్జున సాగరం వచ్చిన తర్వాత కృష్ణా, గుంటూరు వారు వరిపంటలో ఆరితేరి ఉండవచ్చు. సాగునీటికి పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేసుకోవడం తెలంగాణ రైతులకు సాధ్యమైతే బంగారం పండిస్తారు. అద్భుతాలు సృష్టిస్తారు. ఎప్పటిదాకో ఎందుకు తెలంగాణ ప్రభు త్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం రికార్డు స్థాయి లో వరిపంట దిగుబడి వచ్చింది. తెలంగాణ రైతు కరెంటు కోసం, పెట్టుబడి కోసం, ఎరువుల కోసం ఎదురుచూడటంలోనే తన శక్తినంతా ధారపోస్తూ వచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం ఆ కష్టాలనుంచి విముక్తి చేసింది కాబట్టి అంత పంట దిగుబడి వచ్చిం ది. తెలంగాణ రైతులకు వ్యతిరేకంగా ఇలా వాదిస్తున్నారు సరే, మరి రాయలసీమ సంగతేమిటి? వాళ్ల కూ వ్యవసాయం చేయరాదని, దిగుబడి తీయలేరని ఎగతాళి చేస్తారా? నీళ్లివ్వడానికి నిరాకరిస్తారా? తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వాదననే రాయలసీమకు వ్యతిరేకంగా చేయగలరా? ఇంత మూర్ఖపు అధికారు లు, ఇంత పైత్యపు నాయకత్వం ఉండటం ఆంధ్రా ప్రజల విషాదం.
kattashekar@gmail.com

అదే భావజాలం, అవే తిట్లు

తెలంగాణ రాష్ట్రం కొత్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కొత్త. ఏదో చేయాలన్న ఆరాటం. రుజువు చేసుకోవాలన్న తపన. ముందున్న నాయకత్వానికంటే భిన్నంగా ఉండాలన్న తాపత్రయం.. ఇవన్నీతెలంగాణ నాయకత్వాన్ని ప్రజలకు సన్నిహితులనుచేశాయి. ప్రభుత్వంలోని నాయకత్వం ఇంతగా ప్రజలతో కలసి మమేకం కావడం కూడా ఇదే ప్రథమం. వీరిలో అత్యధికులు ఉద్యమకాలంలో కూడా జనంతో ఉన్నారు. ప్రతి ఉద్యమంలో ముందుండి పోరాడారు. అదే ఒరవడి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నది. మరి ప్రతిపక్ష నాయకులో. అప్పుడు కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నారు. తెలంగాణ సమాజం ఎంత క్షోభపడుతున్నా ఉలుకూ పలుకూ లేకుండా ఆంధ్రా నాయకత్వం మాటున పడి ఉన్నారు.

కండ్లముందు కనిపించే వాస్తవా న్ని చూడటానికి నిరాకరించేవారికి ఏమి చెప్పినా ఏమి ప్రయోజనం? చెవిటివారి ముందు శంఖమూదడం కంఠశోష. కరెంటు సమస్యను తెలంగాణ ప్రభు త్వం ఎలా పరిష్కరించిందో ప్రజలందరికీ అనుభవంలో ఉన్నది. కరెంటు బాధల నుంచి విము క్తి వల్ల కలిగిన ప్రయోజనాలేమిటో ఇవ్వాళ తెలంగాణ ప్రజలకు ఎవరో చెప్పనవసరంలేదు. కరెంటు కోతలు లేవు. మోటార్లు కాలిపోవడం లేదు. లో ఓల్టేజీ సమస్య లేదు. ఇప్పుడు కరెంటుకోసం ఎదురుచూసుడు లేదు. ఫ్యాక్టరీలు, ఆఫీసులు, పెద్దపెద్ద దుకాణాలు, చిన్నచిన్న కిరా ణా కొట్లు, ఇళ్లల్లో అయితే జనరేటర్లు, ఇన్వర్టర్లు అన్నీ బందయిపోయాయి. ఎక్కడయినా ఉన్నా ఏదయినా ఆపత్కాల అవసరాల కోసమే వాడుకుంటున్నారు. జనరేటర్లు, ఇన్వర్టర్లు అమ్మే వ్యాపారులు వేరే వ్యాపారాలకు మళ్లవలసిన పరిస్థితి వచ్చింది. కరెంటుకోసం రాస్తారోకోలు, సబ్‌స్టేషన్లపై దాడులు, విద్యుత్ అధికారుల నిర్బంధాలు ఈ మూడున్నరేండ్లలో ఏనాడైనా చూశామా? ఇన్నీ తెలిసి కాంగ్రెస్ నాయకులు సవాళ్లు విసురుతున్నారు. కరెంటు విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాన్ని కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ ఊహించి ఉండరు. ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ నాయకుల మాటల్లో ఎన్ని వైరుధ్యాలంటే అన్నీ మేమే చేశాం, అంతా మా ఘనకార్యమే అని ఒకసారి అంటారు. అడ్డగోలు ధరపెట్టి కొనుగోలు చేశారని, అవినీతి జరిగిందని మరోసారి అంటారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క యూనిట్ విద్యు త్తు ఉత్పత్తి చేయలేదని చెబుతారు. ఏమీ చేయకుండానే ఈ మూడేండ్లలో సౌరవిద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ ఎలా ఎదిగింది? 2500 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యానికి ఎలా చేరుకుంది? థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు పరుగులు పెట్టిందెప్పుడు? భూపాలపల్లి, జైపూరు, కొత్తగూడెంలో కొత్త యూనిట్లు అందుబాటులోకి వచ్చిందెప్పుడు? కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా ప్రాజెక్టుల వెంట వెళితేగదా తెలిసేది. బజార్లో కాళ్లు బార్లా చాపుకొని సవాళ్లు విసురుతున్నవాళ్లు ముందు రాష్ట్రంలో అవసరమైన విద్యుత్తు ఎంత? ఉత్పత్తి అవుతున్నదెంత? ఎక్కడెక్కడ ఏయే ప్రాజెక్టులు ఉన్నా యో తెలుసుకొని మాట్లాడితే జనం సంతోషిస్తారు. మాట్లాడటానికి నోరూ, మైకూ ఉంటే చాలదు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ వనరుల నుంచి విద్యుత్ ఉత్పాదన పెరుగుతున్నది. మన దేశంలోనూ వివిధ రాష్ర్టాల్లో విద్యుదుత్పాదన బాగా పెరిగింది. తత్ఫలితంగా కొనుగోలు చార్జీలు తగ్గుతున్నాయి. మన ఎత్తిపోతల పథకాలన్నీ అందుబాటులోకి వచ్చేనాటికి విద్యుత్ బల్క్ కొనుగోలు చార్జీలు బాగా తగ్గుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చాలాకాలంగా చెబుతున్నారు. ఆ దృక్పథంతోనే పెద్ద ఎత్తున గోదావరిపై నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టులు చేపట్టారు. అత్యంత వేగంగా ఆ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి సమస్త యం త్రాంగం కృషి చేస్తున్నది. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావుతోపాటు ఏ జిల్లా మంత్రి ఆ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల వెంటపడుతున్నారు. కరెంటు తర్వాత నీరే అత్యంత కీల కం. కరెంటు కంటే నీరు ఖరీదైనది. అందుకే నీటికోసం ఎంతయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తున్నది. కాంగ్రెస్ నాయకత్వం ఇవేవీ చూడదల్చుకోలేదు. బట్టకాల్చి మీదవేసి ఏదో పబ్బం గడుపుకోవాలన్న ఆరాటం తప్ప నిర్మాణాత్మక పాత్ర పోషించే దార్శనికతే వారిలో కనిపించడం లేదు. సుదీర్ఘకాలంపాటు ఒక ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన కారణంగా టీఆర్‌ఎస్ నాయకత్వానికి ప్రజాపక్షపాతంతో పనిచేసే దార్శనికత అబ్బింది. కాంగ్రెస్ నాయకత్వానికి ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ప్రజాకేంద్రక ఆలోచనా ధోరణి అలవడలేదు. పొలాలకు నీళ్లిస్తే రైతులు, కూలీలు మన మాట వినరు, రోడ్డేస్తే జనం మనకు అందుబాటులో ఉండరు అన్న భూస్వామ్య దృక్ప థం నుంచి చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ బయటపడలేదు. ఆధునిక దృక్పథం కానీ, క్రియాశీల ఆలోచనలు కానీ వారికి రావడం లేదు. ఎంతసేపు తిట్లపురాణాలు తప్ప, ప్రత్యామ్నాయ ఆలోచనాధారను వారు అలవర్చుకోవడంలేదు. ఒక కాంగ్రెస్ మిత్రుడన్నట్టు ఆ పార్టీలో నాయకులకు మేధావులంటే చిన్నచూపు. బాగా మాట్లాడేవారిని, మంచి వక్తలను చూస్తే అక్కడ అగ్రకులాల నుంచి వచ్చి పెద్దనాయకులుగా చలామణి అవుతున్నవారు కళ్లలో నిప్పులు పోసుకుంటారని ఆ మిత్రుడు బాధపడ్డారు. అందుకే ఆ పార్టీలో భావజాలపరంగా ఒక దివాళా పరిస్థితి తలెత్తింది.

తెలంగాణ సాధించడంలో ప్రధాన చోదకశక్తిగా పనిచేసిన కేసీఆర్‌కు వచ్చినంత గొప్పపేరు మరెవరికీ రాలేదు. రాదు. ఆయన అందరిలో ఒకడు కాదు, అరుదైన నాయకుడు. ఆయన నాయకత్వంలో లోపాలు ఉండవచ్చు. మహాత్ములయిన నాయకుల్లో కూడా చరిత్ర కొన్ని లోపాలను లెక్కపెట్టింది. ఇదీ అంతే. ఒక గొప్ప నాయకుడు వస్తే తప్ప ఆయనను ఎదిరించడం సాధ్యం కాదు. నాయకుడు రాత్రికిరాత్రి నోరేసుకుని బయలుదేరితే తయారుకాడు. దానికి సాధన కావాలి. ఓపిక కావా లి. సందర్భం కావాలి. లేదంటే సందర్భం సృష్టించుకోవాలి. కొత్త రాజకీయ నమూనాలను తయారు చేసుకోవాలి. అందుకోసం అనేకమంది మేధావులు, నాయకుల అనుభవాలను చదువాలి. తిట్టి, కొట్టి, పెట్టి నాయకులయ్యేవారి వల్ల సమాజానికి ఏమీ లాభం ఉండదు. వారు అనేకమందిలో ఒకరు. వారు రాజకీయాలను కలుషితం చేయగలరు, తప్ప ఉన్నతీకరించలేరు. కల్లుకొట్టు ముందు నిలబడి మైకంలో మతితప్పి అమ్మనాబూతులు తిట్టేవాడికి పది మైకుల ముందు నిలబడి మాంచి ఖద్దరు బట్టలు తొడిగి పట్టుకండువా మీదేసుకుని మాట్లాడేవారికి తేడా లేకపోతే ఇక జనానికి ఏమి చెబుతారు? జనానికి ఎలా నాయకత్వం వహిస్తారు?

కరెంటు, తాగునీరు-సాగునీరు, రైతుకు ఎకరాకు నాలుగువేల పెట్టుబడి, భూ రికార్డుల ప్రక్షాళన, పిం ఛన్లు, కళ్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు, సంక్షే మ గురుకులాలు.. ఇవి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని చరిత్రలో నిలిచిపోయేట్టు చేస్తాయి. ఇంతకంటే ఉన్నతంగా, ఇంతకంటే భిన్నంగా, ఇంతకంటే ప్రయోజనకరంగా ప్రతిపక్షాలు ఏదైనా ఎజెండాతో వస్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. అధికారం పోయిందన్న అక్కసు, ద్వేషాలతో, తాము ఇంతకాలం అనుభవించిన పదవులు ఎవరో అనుభవిస్తున్నారన్న దుగ్ధతో, ప్రాజెక్టులు-కాంట్రాక్టులు అంటే కమీషన్లు అని మాత్రమే అర్థం చేసుకుని అవి తమకు దక్కకుండా పోయాయన్న ఉక్రోషంతో బుసలు ముసలు కొడితే అధికారం రాదు. తెలంగాణ సాధించడంలో ప్రధాన చోదకశక్తిగా పనిచేసిన కేసీఆర్‌కు వచ్చినంత గొప్పపేరు మరెవరికీ రాలేదు. రాదు. ఆయన అందరిలో ఒకడు కాదు, అరుదైన నాయకుడు. ఆయన నాయకత్వంలో లోపాలు ఉండవచ్చు. మహాత్ములయిన నాయకుల్లో కూడా చరిత్ర కొన్ని లోపాలను లెక్కపెట్టింది. ఇదీ అంతే. ఒక గొప్ప నాయకుడు వస్తే తప్ప ఆయనను ఎదిరించడం సాధ్యం కాదు. నాయకుడు రాత్రికిరాత్రి నోరేసుకుని బయలుదేరితే తయారుకాడు. దానికి సాధన కావాలి. ఓపిక కావా లి. సందర్భం కావాలి. లేదంటే సందర్భం సృష్టించుకోవాలి. కొత్త రాజకీయ నమూనాలను తయారు చేసుకోవాలి. అందుకోసం అనేకమంది మేధావులు, నాయకుల అనుభవాలను చదువాలి. తిట్టి, కొట్టి, పెట్టి నాయకులయ్యేవారి వల్ల సమాజానికి ఏమీ లాభం ఉండదు. వారు అనేకమందిలో ఒకరు. వారు రాజకీయాలను కలుషితం చేయగలరు, తప్ప ఉన్నతీకరించలేరు. కల్లుకొట్టు ముందు నిలబడి మైకంలో మతితప్పి అమ్మనాబూతులు తిట్టేవాడికి పది మైకుల ముందు నిలబడి మాంచి ఖద్దరు బట్టలు తొడిగి పట్టుకండువా మీదేసుకుని మాట్లాడేవారికి తేడా లేకపోతే ఇక జనానికి ఏమి చెబుతారు? జనానికి ఎలా నాయకత్వం వహిస్తారు?

తెలంగాణ ఉద్యమం నాయకత్వ సంస్కృతిలో కూడ ఒక గొప్ప మార్పు తెచ్చింది. గత మూడున్నరేండ్లలో మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పల్లెలు, పట్టణాలు, ప్రాజెక్టులు పట్టుకుని తిరిగినట్టుగా చరిత్రలో ఏనాడైనా ఏ నాయకుడైనా తిరిగినాడా? ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పట్నంలో ఉన్నది తక్కువ. హుజూరాబాద్, కరీంనగర్‌తోపాటు ఇతర జిల్లాల్లో ఉన్నది ఎక్కువ. ఆయనకు ఎప్పుడు ఏరోజు ఫోన్ చేసినా హైదరాబాద్ నుంచి ఊరికెళుతూనో, ఊరి నుంచి హైదరాబాద్‌కు వస్తూనో మాట్లాడుతారు. తన్నీరు హరీశ్‌రావు అయితే కాలికి బలపం కట్టుకున్నారు. కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి… దాదాపు మంత్రులంతా నిమ్మళంగా నాలుగు రోజులు పట్నంల గడిపింది లేదు. తెలంగాణ రాష్ట్రం కొత్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కొత్త. ఏదో చేయాలన్న ఆరాటం. రుజు వు చేసుకోవాలన్న తపన. ముందున్న నాయకత్వానికంటే భిన్నంగా ఉండాలన్న తాపత్రయం.. ఇవన్నీ తెలంగాణ నాయకత్వాన్ని ప్రజలకు సన్నిహితులనుచేశాయి. ప్రభుత్వంలోని నాయకత్వం ఇంతగా ప్రజలతో కలసి మమేకం కావడం కూడా ఇదే ప్రథమం. వీరిలో అత్యధికులు ఉద్యమకాలంలో కూడా జనం తో ఉన్నారు. ప్రతి ఉద్యమంలో ముందుండి పోరాడారు. అదే ఒరవడి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నది. మరి ప్రతిపక్ష నాయకులో. అప్పుడు కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నారు. తెలంగాణ సమాజం ఎంత క్షోభపడుతున్నా ఉలుకూ పలుకూ లేకుండా ఆంధ్రా నాయకత్వం మాటున పడి ఉన్నా రు. ఇంకొందరేమో తెలుగుదేశం, సీపీఎం పార్టీలలో తెలంగాణకు ద్రోహం చేసిన ఆంధ్ర నాయకత్వాలతో అంటకాగుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆంధ్ర నాయకత్వం వదిలివెళ్లిన భావజాలంతోనే తెలంగా ణ నాయకత్వంపై దాడి చేస్తున్నారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేయడం, ఉద్యోగ నోటిఫికేషన్లపై వివాదాలు రేపడం, ప్రతిపనికీ అవరోధాలు కల్పించడం ఇవన్నీ వారి వారసత్వ లక్షణాలే. అప్పటికీ ఇప్పటికీ వీరికి ఒరిజినాలిటీ ఏదీ లేదు. అన్నీ తెచ్చిపెట్టుకున్న వాదాలు, వాదనలు. బీజేపీ కేం ద్రంలో అధికారంలో ఉండి ప్రజలకు ఈ మూడున్నరేండ్లలో ఎన్ని కష్టాలను పరిచయం చేసిందో అం దరికీ అనుభవంలోకి వచ్చింది. తెలంగాణకు అనుకూలంగా ఒక్క మంచిపనీ చేయలేదు. విభజన చట్టంలోని హామీలన్నీ పెండింగులోనే ఉన్నాయి. తెలంగాణకు మద్దతు ఇచ్చిన మంచిని కూడా ఆ పార్టీ కాపాడుకోలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత ఏదైనా దక్కుతుందంటే అది టీఆర్‌ఎస్ నాయకత్వానికి, అనివార్యతకు తలొగ్గి, ప్రజావాంఛను గౌరవించి, పార్లమెంటుతో ఒప్పించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా అప్పుడూ ప్రేక్షకులే.

Judicial Monarchy Questionable

మేడి పండు చూడ మేలిమైయుండును పొట్టవిప్పి చూడ పురుగులుండు.

********

దేవతా వస్త్రాలు తీసేసారు. వస్త్రాలు తీసినవారిపై భక్తజనాల వాంతులు చేసుకోవడం మొదలయింది.

********

Democratization of judicial process much needed value today. It seems hierarchical monarchy is ruling the process. Its right to raise a point now. Judiciary cannot hide behind the courteous screens.

గొంతులు కాదు, బుద్ధి పెరుగాలె

ఇసుక క్వారీల గురించి కాంగ్రెస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తెలంగాణ ప్రభుత్వం ఇసుక క్వారీలను క్రమబద్ధీకరించి ఏటా 300 నుంచి 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించింది. కాంగ్రెస్ ఇసుక వ్యాపారం నుంచి ప్రభుత్వానికి ఎంత సంపాదించిందో, నాయకుల సొంతానికి ఎంత సంపాదించిందో 2004-2014 సంవత్సరాల లెక్కలు మాట్లాడుతాయి. ఉన్నదీ లేనిదీ కలిపి మాట్లాడితే గవర్నర్ కోపం చేయకేం చేస్తారు? కేసీఆర్‌ను ఢీకొనాలంటే పదిహేడేండ్లపాటు ఆయన పడిన పాట్లు, ఆయన చేసిన సాధన కాంగ్రెస్ నాయకత్వం చేయాలి. ఆ దిశగా ఇసుమంతైనా అడుగులు పడిన జాడలు కనిపించవు. ఈ మూడున్నరేండ్లలో వారి అవగాహనస్థాయిలో ఏ మాత్రం మార్పు వచ్చిన సూచన కనిపించదు. మనం బాగుపడకపోతే అవతలివాడి పేరును చెడగొట్టాలన్నది చాలాపాతకాలపు రాజకీయ సిద్ధాంతం.

ప్రజల విశ్వాసాన్ని పొందడం ఒక్క రోజుతో జరిగే పనికాదు. కష్టాల్లో నష్టాల్లో సంక్షోభాల్లో తమతో ఎవరున్నారన్నదే జనం చూస్తారు. అధికారంలో ఉన్నా తమ బాగోగులను ఎవరు చూస్తున్నారన్నదే ముఖ్యం. జనపక్షపాతం ఎవరి విధానా ల్ల్లో, చేతల్లో కనిపిస్తుందన్నదే ప్రధానం. తెలంగాణ ప్రజలు రెండు దశలూ చూశారు. రాష్ట్ర సాధనోద్యమ దశలో అన్ని సందర్భాల్లో నిలబ డి కొట్లాడింది టీఆర్‌ఎస్సేనని ఇవ్వాళ రాష్ట్రంలో ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఉద్యమం విద్రోహాలను, సంక్షోభాలను, ఎత్తుపల్లాలను ఎదుర్కొంటున్నప్పుడు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఏం చేస్తూ ఉన్నాయో కూడా జనం మరిచిపోలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్నదేమిటో, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నదేమిటో జనం గమనిస్తున్నారు. కేసీఆర్ కాకుండా మరొకరు ముఖ్యమంత్రి అయి ఉంటే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండేదన్న ఆందోళన వ్యక్తంచేసిన తెలంగాణవాదులూ ఉన్నారు. తెలంగా ణ బాధలు తెలిసినవారు, తెలంగాణ కోసం త్యాగాలు చేసినవారు, తెలంగాణకు వీలైనంత మంచి చేయాలని తపించినవారు నాయకుడిగా లేకపోతే తెలంగాణ ఇవ్వాళ ఉన్న పరిస్థితిలో ఉండేది కాదు. విభజన సమయంలో జిద్దుగా నిలబడి మన హక్కులను, మన నీటి, నిధుల వాటాలను సాధించుకోవడం ఒక ఎత్తయితే రాష్ట్ర ప్రగతికి దీర్ఘకాలపు బాటలు వేసి ఒక గుణాత్మకమైన మార్పునకు పునాదులు వేయడం మరో ఎత్తు. తెలంగాణ గురించి ఒక సమగ్ర దృక్పథం ఉన్న కేసీఆర్ వల్ల ఇది సాధ్యమైంది. తెలంగాణ ఇవ్వాళ వివిధ రంగాల్లో రికార్డుల పరంపర సాధిస్తున్నదంటే అందుకు తెలంగాణ నాయకత్వ అంకితభావమే కారణం. కేసీఆర్‌ను సవాలు చేయాలంటే మరో కేసీఆరే రావాలి. అంత జ్ఞానం, అంత పంతం, అంత ప్రజాపక్షపాతం, సమస్యల మూలాల్లోకి వెళ్లి చూసే సునిశిత దృష్టి కలిగిన మరో నాయకుడిని ప్రతిపక్షం చూపించగలదా? ఇప్పటికీ వారికి సమస్యలను గుర్తించడం, వాటిని ఒక పద్ధతి ప్రకారం ప్రజెంట్ చేయడమే రాలేదు. వారు ఉద్యమకాలంలో కానీ, ఈ మూడున్నరేండ్ల స్వరాష్ట్ర పాలనలో కానీ కొత్తగా పాఠాలేవీ నేర్చుకోలేదు. ఇప్పటికీ తెలంగాణకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న దానికంటే ఒక ఉన్నతమైన మార్గమేదో తమ వద్ద ఉన్నదని చెప్పే దమ్ము ఒక్క నాయకుడికీ లేకపోయింది. ప్రతిపక్షం ఎంతసేపూ తిట్లూ, ఆరోపణలు, పాతచింతకాయ పచ్చడిలాంటి విమర్శలు తప్ప ఒక రాజకీయ దార్శనిక దృష్టిని ప్రజలకు పరిచయం చేయలేకపోయింది.

ఇరువైనాలుగు గంటల కరెంటు తమ గొప్పే అని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చెబితే ప్రజలు నవ్విపోరా? కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోగానే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో వారానికో పాత్రికేయుల సమావేశం పెట్టి అవాకులు చవాకులు పేలుతుంటే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఏం చేస్తూ ఉన్నా రు? రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారబంధురం అవుతుందని నాటి ముఖ్యమంత్రి తన అజ్ఞానాన్నంతా ప్రదర్శిస్తుంటే ఇప్పుడిచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఏదో అప్పుడే షబ్బీర్ అలీ ఎందుకివ్వలేదు? ఒక్కపైసా ఇవ్వనుపొమ్మని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వాగితే ఒక్క తెలంగాణ మంత్రి అయినా ఇదేమిటని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ప్రశ్నించలేదంటే వీరెవరికీ తెలంగాణ సోయిగానీ, తెలంగాణ ఆత్మగౌర వస్ఫూర్తిగానీ లేదు. తెలంగాణ వస్తే వస్తుంది, మనం మాత్రం పదవులు వదలొద్దు, ప్రయోజనాలు మరువొద్దు అనుకుని ఇండ్లకు ఫైళ్లు తెప్పించుకొని సంతకాలు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర ఆంధ్ర నాయకులు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసినప్పుడల్లా పిల్లలు పిట్టల్లా రాలిపోతూ ఉంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా రాజీనామా వారి ముఖాన పడేసి, తెగించి పోరాడలేదు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఆత్మకు దగ్గర కావడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అసలు తెలంగాణ సమస్యే వారి కి అర్థంకాలేదు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా తెలంగాణ సమస్య వారికి అర్థం కాలేదు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేయడం, ఉద్యోగాల క్రమబద్ధీకరణపై అడ్డంకులు కల్పించడం, రాజకీయ వాయివరుసలు మరిచి పరమ నీచమైన స్థాయికి దిగి విమర్శలు కురిపించడం కాంగ్రెస్ నాయకుల దివాలాకోరుతనాన్ని మరింత బట్టబయలు చేస్తున్న దే తప్ప వారిపై ప్రజల విశ్వాసాన్ని పెంచదు. తెలంగాణ సమస్య నీళ్లు, ఉద్యోగాలు, నిధులే. తెలంగాణ బీళ్లన్నీ నీళ్లతో తడువాలంటే ప్రాజెక్టులను పరుగులు పెట్టించాలి. గరిష్ఠంగా నదీజలాలను తెలంగాణ భూములకు మళ్లించాలి. తెలంగాణ ఉద్యమంలో జనం బాధలగాథల నుంచి నేర్చుకున్న పాఠం ప్రథ మ ప్రాధాన్యంగా తాగు, సాగు నీరందించడం. అం దుకే కేసీఆర్ నీటిపారుదల ప్రాజెక్టులను ఒక యజ్ఞం లా ముందుకు నడిపిస్తున్నారు. తెలంగాణ ప్రజలు నీటికోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. కాం గ్రెస్, ఇతర ప్రతిపక్షాల నాయకులు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. త్వరగా ప్రాజెక్టు లు పూర్తిచేసి, నీళ్లివ్వాలని డిమాండు చేయాల్సిందిపోయి, వందలాది కేసులు ముందేసుకుని అదేదో పెద్ద ఉద్ధరణ కార్యక్రమంగా వీధుల్లోకి వస్తున్నారు.

తాగు, సాగు నీరు కోసం ఎదురుచూసే కోట్లాదిమం ది కాంగ్రెస్ నాయకులను చూసి ఏమనుకోవాలి? అలాగే కరెంటు సమస్యపై కాంగ్రెస్‌ది ఎదురీతే. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కరెంటు ఉత్పత్తి చేయనిమాట నిజమే కావచ్చు. కానీ అధికారంలోకి వచ్చి న ఆరు మాసాల్లోనే కరెంటు కోతల నుంచి తెలంగా ణ రైతాంగాన్ని, పరిశ్రమలను విముక్తి చేసింది. అదే పట్టుదలతో అనేక విద్యుత్ ప్రాజెక్టులను ముందుకు నడిపించి, విద్యుదుత్పాదనను పెంచి ఇవ్వాళ 24 గంటల విద్యుత్ ఇస్తున్నది. ఈ విద్యుత్ అంతా తమ ఘనకార్యమేనని కాంగ్రెస్ నాయకులు చెప్ప డం హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్‌కు అంత తెలివే వుంటే తెలంగాణ రాకముందే కరెంటు కోతల నుం చి విముక్తి ఇచ్చి ఉండవచ్చు కదా. కొత్త ఉత్పత్తి చేయకుండా కేసీఆర్ ఇవ్వగలిగినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? తెలంగా ణ కాంగ్రెస్ నాయకత్వం అప్పుడు ఎవరి సేవలో తరిస్తూ కూర్చున్నది? కాంగ్రెస్ నాయకత్వానికి, కేసీఆర్‌కు ఉన్న తేడా అదే. కేసీఆర్‌కు సంకల్పం ఉంది. తెలంగాణ రైతు ఆత్మ ఉంది. అందుకే కరెంటు కోత లు లేకుండా చూడటం అత్యంత ప్రాధాన్యమైన అం శంగా భావించి, అదనపు భారం భరించడానికి సిద్ధపడి, విద్యుత్ కొనుగోలుచేసి రైతులను, పరిశ్రమల ను కష్టాల నుంచి గట్టెక్కించారు. ఆ అంశంపైనా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కాలంచెల్లిన వాదన లు, డేటాలు ప్రదర్శనకు పెట్టడం అర్థ రహితం. ఇసుక క్వారీల గురించి కాంగ్రెస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తెలంగాణ ప్రభుత్వం ఇసుక క్వారీలను క్రమబద్ధీకరించి ఏటా 300 నుం చి 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించిం ది. కాంగ్రెస్ ఇసుక వ్యాపారం నుంచి ప్రభుత్వానికి ఎంత సంపాదించిందో, నాయకుల సొంతానికి ఎంత సంపాదించిందో 2004-2014 సంవత్సరా ల లెక్కలు మాట్లాడుతాయి. ఉన్నదీ లేనిదీ కలిపి మాట్లాడితే గవర్నర్ కోపం చేయకేం చేస్తారు? కేసీఆర్‌ను ఢీకొనాలంటే పదిహేడేండ్లపాటు ఆయన పడి న పాట్లు, ఆయన చేసిన సాధన కాంగ్రెస్ నాయకత్వం చేయాలి. ఆ దిశగా ఇసుమంతైనా అడుగులు పడిన జాడలు కనిపించవు. ఈ మూడున్నరేండ్లలో వారి అవగాహనస్థాయిలో ఏ మాత్రం మార్పు వచ్చిన సూచన కనిపించదు. మనం బాగుపడకపోతే అవతలివాడి పేరును చెడగొట్టాలన్నది చాలాపాతకాలపు రాజకీయ సిద్ధాంతం. ఉన్నవీ లేనివీ కల్పిం చి, బురద కుమ్మరించి, బద్నాం చేసి, జనంలో పలుచన చేసి.. అంటే ఎంత అధమస్థాయి రాజకీయమై నా చేసి పైకి రావాలనుకోవడం ఈ కాలానికి సరిపడదు. ప్రజలకు ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. గొంతులు పెద్దవి చేసి, మైకులు పెద్దవి పెట్టుకున్నంతమాత్రాన మంచి చెడు కాబోదు, చెడు మంచి కాబోదు.

ఇటీవల ఒక సీనియర్ టీడీపీ నాయకుడు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తమతో పొత్తు పెట్టుకుంటేనే మళ్లీ గెలుస్తారని వాదించారు. కేసీఆర్‌కు మీ అవసరం ఏముంది? నాడే ఒంటరిగా గెలిచారు. ఇప్పుడు మీ పార్టీయే అంతిమయాత్రలో ఉంది. ఇక మీతో పొత్తు సంగతి ఎక్కడిది? అని పక్కనే ఉన్న మిత్రు డు ప్రశ్నించాడు. మాకు 5 నుంచి పది శాతం ఓట్లున్నా యి. మాతో కలవకుంటే అవన్నీ కాంగ్రెస్‌కు పడతా యి అన్నారాయన. మీరు ఇంకా భ్రమల్లో ఉన్నారు. కేసీఆర్‌కు ఇప్పుడు ఎవరి అవసరమూ లేదు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటేయడానికి ఒక్క కారణం చెప్పం డి? అని నిలదీశాడు మిత్రుడు. ఏమి చేయలేదని ప్రజలు కేసీఆర్‌ను వదులుకుంటారు? అని మళ్లీ మిత్రుడు రెట్టించాడు. ఆ నాయకుడు నీళ్లు నమిలాడు. కాసేపటికి తేరుకుని ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిగత విమర్శలు ప్రస్తావించారు. కరెంటు వచ్చిందా లేదా, రుణమాఫీ అయిందా లేదా, వ్యవసాయానికి విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుతున్నాయా లేదా? ప్రాజెక్టుల నుంచి గరిష్ఠంగా నీటిని వాడుకుంటున్నా మా లేదా? సంక్షేమ పింఛన్లు అందుతున్నాయా లేదా? డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం జరుగుతున్నదా లేదా? ఉద్యోగులు అడిగిన డిమాండ్లు నెరవేర్చారా లేదా? అంగన్‌వాడీ కార్యకర్తలు, మున్సిపాలిటీ స్వచ్ఛ కార్మికులు, హోంగార్డులు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు.. ఇలా అట్టడుగున పనిచేస్తున్న సిబ్బంది జీతాలు గణనీయంగా పెరిగాయా లేదా? ఉద్యోగాల భర్తీ వేగంగా జరుగుతున్నది.. ఇలా ఎన్నయినా చెబు తా? మీరు ఒక్క కారణం చెప్పండి వ్యతిరేకంగా ఓటేయడానికి? అని ఆ మిత్రుడు ప్రశ్నించాడు. ఇక ఇది తేలేది కాదని ఆ నాయకుడు నిష్క్రమించారు. ఎన్నిక లు ఇంకా ఏడాది దూరంలో ఉన్నాయి. ప్రజల్లో వ్యతిరేకతను సృష్టించి గెలువాలన్న తాపత్రయాన్ని ఆ నాయకుడి మనఃస్థితి తెలుపుతుంది. చాలామంది ప్రతిపక్ష నాయకుల పరిస్థితి ఇలాగే ఉంది. విశాల జన బాహుళ్యం మాత్రం స్వరాష్ట్రంలో ప్రారంభమైన పురోగామియాత్ర ఆగిపోగూడదని, కేసీఆర్ నాయకత్వం నిరాటంకంగా కొనసాగాలని కోరుకుంటున్నది. ఇది ఎవరి ఇష్టాయిష్టాయిలతో నిమిత్తం లేని వాస్తవస్థితి.
kattashekar@gmail.com

The Socialist “Threat” Which Forced the West to Set Up Welfare States- By Subin Dennis

The establishment of welfare states by capitalist countries in the West is one of the enduring legacies of the challenge posed by the socialist block led by the Soviet Union.
Subin Dennis

While the October Revolution and the subsequent building of socialism brought down inequalities in Russiasharply, the expansion of the socialist block following World War II and the threat that socialism might spread to the capitalist core forced the Western capitalist countries to bring about far-reaching changes in their home ground. These changes – involving, among others, the setting up of welfare states and higher taxes on the rich – considerably reduced inequalities in those countries, until the massive reversal that occurred with the advent of neoliberalism.
A look at the changes in the income-share of the richest sections of the population in the United Kingdom and France, for instance, is instructive.

The period from the end of World War I to the end of World War II saw a decline in the income-share of the top 1%. According to Thomas Piketty, whose work on inequality has led to more and renewed discussions on the issue in the recent years, this was a period when capitalism was exposed to a series of shocks. The Western capitalist countries – especially those of Western Europe – saw the destruction of wealth in physical terms as a result of the wars. They also suffered losses of assets through expropriation following the Bolshevik Revolution in Russia. The modern progressive income tax was born during the period immediately following World War I, as post-war reconstruction required new sources of revenue. There were several waves of working class strikes in France in May and June 1919, less than two years after the Bolshevik Revolution. It was in such circumstances that the ruling classes decided that those with the highest incomes had to be taxed more to ensure social stability. The introduction of the progressive income tax was accompanied by the introduction of higher inheritance tax rates in a number of countries such as the United States, Britain, Germany and France.

But an even sharper decline in inequality was to occur following the Second World War. The leading role played by the Soviet Union in the victory against the fascist powers in World War II led to an enormous increase in its prestige. 27 million Soviet citizens lost their lives during the World War II – the highest casualty figures for any country during the war – and the Nazis suffered three-quarters of their war-time losses fighting the Red Army. The socialist block expanded on an impressive scale following the successful conclusion of the anti-fascist war, with a number of countries in Eastern Europe adopting socialism. Decolonisation which led to the loss of foreign assets contributed to the decrease in economic inequalities in a number of Western capitalist countries which were hitherto colonial powers. In several Western European countries which did not become socialist, the power and prestige of the Left – including both the communist and the non-communist (the social democratic) Left – increased immensely. The stellar role played by the communists of France, Italy and several other countries in the Resistance against the fascist forces had contributed to the tremendous increase in their influence and popularity.

The French Communist Party (PCF) even emerged as the single largest party in the elections held to the interim Constituent National assembly in 1945, with 26.2% of the vote. In the November 1946 elections which elected the first legislature of the new French Fourth Republic, the PCF again became the single largest party, with 28.3% of the votes and 182 out of 627 seats. The PCF participated in governing coalitions until 1947, when, with the beginning of the Cold War, the PCF ministers were expelled from the government.
The Italian Communist Party also became a powerful force after World War II. The communists were part of the government in Italy from June 1944 until May 1947, when they were expelled just as in the case of France. In the general elections held in 1948, the Popular Democratic Front led by the PCI came second with 30.98% of votes. In fact, the American magazine Time had claimed that a victory for the Left would take the country to the brink of catastrophe. According to renowned British historian Eric Hobsbawm, the United States had even planned a military intervention if the communists won the elections.

It was in this context that the Western capitalist countries framed their economic policies. So while the Soviet Union had set up the most gigantic welfare system that history had seen, the ruling elite in many of the Western European countries realised that the threat of socialist revolutions in their own countries could be fended off only by allowing significant concessions in favour of the workers.

Thus these countries set up public sector enterprises, nationalised strategic industries and sectors, increased workers’ wages and established social security systems, while public education, public health and public housing were expanded massively. Keynesian demand management policies led to near full employment being achieved – the average unemployment rate in western Europe during the 1960s was 1.5 per cent (today the unemployment rate in the European Union stands at 8.6%).

In Britain the Labour Party recognised the dangers of economic power being concentrated in the hands of a few. Their manifesto for the general elections in 1945 said:
“Hard-faced men and their political friends kept control of the government. They controlled the banks, the mines, the big industries, largely the press and the cinema… They controlled the means by which people got their living. They controlled the ways by which people learned about the world outside… The great inter-war slumps were not acts of God or of blind forces. They were the sure and certain result of the concentration of too much economic power in the hands of too few men… The price of so-called “economic freedom” for the few is too high if it is bought at the cost of idleness and misery for millions. There are basic industries ripe and over-ripe for public ownership and management in the direct service of the nation.” “Security from war, food, houses, clothing, employment, leisure and social security for all must come before the claims of the few for more rent, interest and profit,” said the Labour Party leader Clement Attlee.

The Labour Party won the 1945 elections, nationalised key sectors such as electricity, gas and railways, and laid the foundations for what was to become the extensive social security system in Britain, including the National Health Service. And of course, the most famed social security systems were set up in the Scandinavian countries with their significantly smaller populations.
The emergence of the welfare state in the countries of Western Europe was financed by increased taxes on the rich. France and Germany had top marginal tax rates of income tax (applying to the highest incomes) between 50 and 70 per cent from the late 1940s until the 1980s. In Britain, the rates applicable to the highest incomes and estates was 98 percent in the 1940s, with the top rates touching that peak again in the 1970s. The United States also had very high tax rates (the top rate was around 90 percent until the mid-1960s) until the early 1980s, with an attendant decrease in inequalities, although its social security systems never became as robust as Western Europe’s. Inequalities in the US skyrocketed in the decades since the 1980s.
Things changed drastically from the 1970s and 1980s onwards, with tax cuts for the rich, privatisation of the public sector, whittling down of welfare systems, smashing of trade unions and stagnating or declining real wages. The result, as expected, was a steep increase in economic inequalities, as can be seen in the charts below.

The richest 10% in Britain had 38.37% of the total national income in 1937, which came down to 32% in 1949, and further to less than 28% by the end of the 1970s. With the rightward shift of economic policies led by Margaret Thatcher in the 1980s, the share of the top 10% rose sharply, reaching 43% in 2007. There has been a slight decline in the years following the economic crisis which began in 2008, but at 40%, it is still higher than the pre-World War II levels. The richest 10% in France accounted for 43% of total national income in 1938, the year before World War II began. With war-time destruction of wealth and the post-war turn of economic policies, it declined to less than 30% by the early 1980s. Since the attack on the working class in France has been less vicious and the mollycoddling of the rich less stark compared to Britain, the income-share of the top 10% in France has registered only a marginal increase in the recent years.

ఊసరవెళ్లి చంద్రబాబు

ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తే ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుందేమో! రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున చంద్రబాబునాయుడు చేసిన ప్రసంగం ఆయన అజీర్తిని, అక్కసును, ఉక్రోశాన్ని మరోసారి బయటపెట్టింది. ఈ ఆరు దశాబ్దాల్లో ఆంధ్ర ఆధిపత్య శక్తుల తెలంగాణ ఎంతగా నష్టపోయిందో, తెలంగాణను కొల్లగొట్టే అవకాశం చేజారిపోయినందుకు ఇప్పుడు ఎంతగా ఆక్రోశిస్తున్నాయో చంద్రబాబు మాటలు వింటే అర్థం అవుతుంది. చంద్రబాబు మారడు. చంద్రబాబు మారినట్టు నటిస్తుంటాడు. బుద్ధి మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. చంద్రబాబునాయుడు 2009 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌తో పొత్తుకోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేస్తాం అని తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా ఆయనను ఎవరూ నమ్మలేదు. చంద్రబాబు మోసగాడు అని తెలుసు. ఆయన మోసం 2009 సాధారణ ఎన్నికల్లోనే బట్టబయలైంది. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్టే పెట్టుకుని, 30 నియోజకవర్గాల్లో తన పార్టీ అభ్యర్థులను పోటీ అభ్యర్థులుగా దింపాడు. ఆ దెబ్బతో తెలంగాణ వాదాన్ని, టీఆర్‌ఎస్‌ను నాశనం చేయవచ్చని కుట్ర పన్నాడు. అయితే ఒక్క మేలు జరిగింది. ఒక ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ అధికారికంగా తీర్మానం చేయడం ఆరోజుకు ఒక ఘనవిజయం. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వై ఎస్ రాజశేర్‌రెడ్డి ఒక్కడే తెలంగాణకు అడ్డమూ నిలువూ అయి కూర్చున్నాడు. నిజానికి 2006లోనే తెలంగాణ ఏర్పడి ఉండాలి. అప్పుడు కూడా రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసి రాష్ట్ర ఏర్పాటు ప్రయత్నాలను అడ్డుకున్నాడు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఎన్నికుట్రలు చేయాలో అన్ని కుట్రలు రాజశేఖర్‌రెడ్డి చేశాడు. 2009 ఎన్నికలలో కూడా మొదటి దశ ఎన్నికలు అయిపోగానే హైదరాబాద్ వెళ్లాలంటే వీసా తీసుకోవాలా అని ఆంధ్రా ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకుని రెండో సారి గెలిచారు. ఎటొచ్చీ చివరిదాకా తెలంగాణకు అడ్డంగా నిలబడింది రాజశేఖర్‌రెడ్డి.

చంద్రబాబునాయుడిది ఎప్పుడూ అవకాశవాద వైఖరే. ఒకప్పుడు తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి వీలు లేదని చెప్పిన పెద్దమనిషి, 2009 ఎన్నికలు వచ్చేసరికి ఓట్లకోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ నిర్ణయం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లా ఆ ఊసు లేదు. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఇప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాణాలకు తెగించి దీక్ష పూనారు. రాష్ట్రమంతా ఉద్యమం తీవ్రతరమైంది. అసెంబ్లీలో తీర్మానం పెట్టండి సమర్థిస్తాం అని చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలో ప్రధాన పార్టీలన్నీ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తమ అభిప్రాయాలు చెప్పాయి. ముఖ్యమంత్రి రోశయ్య అదే నివేదిక కేంద్రానికి పంపారు. కేంద్రంలో బీజేపీ కూడా తెలంగాణకు అనుకూలంగానే ఉంది. అప్పటికి కేసీఆర్ దీక్ష 11వ రోజుకు చేరింది. పార్లమెంటులో కూడా అన్ని పక్షాలు కేసీఆర్ ఆరోగ్యంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 2009 డిసెంబరు 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్త్నున్నట్టు అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు పేద్ద పిల్లిమొగ్గ వేశారు. ఆంధ్ర ఆధిపత్య శక్తులను రెచ్చగొట్టి ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి ఉత్తుత్త నమూనా రాజీనామా పత్రాలు ఆంధ్రా ఎమ్మెల్యేలందరికీ పంపించి సంతకాలు చేయించి, రాజీనామాల నాటకం ఆడించాడు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఠా కుట్రల కారణంగా తెలంగాణ మూడేండ్లు వెనుకకుపోయింది. తెలంగాణ బిడ్డలు స్వరాష్ట్రం ఇక రాదేమోనన్న నిరాశానిస్పృహల్లో వందలాది మంది యువకులు ఆత్మారణ చేసుకోవలసి వచ్చింది. సమ్మెలు, బంద్‌లు, ర్యాలీలు, పోలీసుల నిర్బంధాలు…తెలంగాణ అనుభవించిన క్షోభ అంతా ఇంతా కాదు. అయినా తెలంగాణ పట్టినపట్టు పట్టువిడువకుండా నిలిచి గెలిచింది. మూడేండ్లు గడిచాయి. చంద్రబాబు అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పాట పాడుతున్నడు.

విస్మయం కలిగించే అంశం ఏమంటే ఇంకా టీడీపీ దిమ్మలు, జెండాలు, ఏజెంట్లు ఈ రాష్ట్రంలో మిగిలి ఉండడం. చంద్రబాబు ఎజెండాను మోస్తూ తెలంగాణవాదులపై, తెలంగాణ ప్రభుత్వంపై దాడులు చేయడం. వీళ్లకు ఆత్మభిమానం, చీమూ నెత్తురూ ఉన్నాయా? ఇంకా ఆ ఆంధ్ర పార్టీలో ఎలా ఉంటున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఆంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడే పార్టీ ఏదన్నా ఉంటే ఆంధ్రాలో బతకనిస్తారా? తెలంగాణ సహనం ఎంత గొప్పది అని పదవీ విరమణ చేసిన ఓ చరిత్ర అధ్యాపకుడు ఆవేశంగా అన్నారు. ఒక కఠినవాస్తవం ఏమంటే తెలంగాణపై చంద్రబాబుకు ఇంకేమాత్రం ఆశలు లేవు. తెలంగాణలో ఆశలు పెట్టుకున్నవారెవరూ రాష్ట్ర విభజనపై ఇంత దుర్మార్గంగా మాట్లాడరు. వచ్చే ఎన్నికల్లో మొన్న వచ్చిన సీట్లు, ఓట్లు కూడా రావని ఆయనకు బాగా తెలుసు. అయినా తెలంగాణవాళ్లు తెలివితక్కువ వాళ్లని ఆయన నమ్మకం. మరికొంతకాలం భ్రమలు సాగు చేయవచ్చునని ఆయన భావిస్తున్నారు. అసలు విషయం మాత్రం ఓటుకు నోటు కేసుకోసం మాత్రమే తెలంగాణ టీడీపీ శాఖను మోస్తున్నారు. కేవలం ఒక ప్రత్యేక అవసరంకోసం మాత్రమే ఇంకా ఇక్కడ జెండా పీకేయకుండా కొనసాగిస్తున్నారు. తెలంగాణలో ఇంకా డబ్బుఖర్చు పెట్టడం అవసరమా అని చంద్రబాబు సన్నిహితులు వరంగల్ ఎన్నికల సమయంలోనే ప్రశ్నించారట. ఇక్కడి నాయకులేమో ఇంకా చంద్రబాబు వలలకు చిక్కుతూనే ఉన్నారు. తెలంగాణ విముక్తి పొందినా వారు మాత్రం ఇంకా ఆయన సేవలో తరిస్తూనే ఉన్నారు. చంద్రబాబుది ఒక్క తెలంగాణ విషయంలోనే కాదు ప్రత్యేక హోదా విషయంలోనూ అవకాశవాదమే. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని వాదించింది అప్పటి ప్రతిపక్షనాయకుడు వెంకయ్యనాయుడు. ఐదేండ్లు కాదు పదేండ్లు కావాలని వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు అందరూ ఒక్కటే పాట పాడారు. ఆంధ్రకు అన్యాయం జరిగిందనే పేరుతో పోలవరం ప్రాజెక్టుకోసమని తెలంగాణ నుంచి ఏడు మండలాలను లాగేసుకోవడంలో కూడా వీరిద్దరిదే ప్రధాన పాత్ర. ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదా లేదు పొమ్మంటే, అంతకంటే ఎక్కువే ఇస్తున్నాం, ప్రత్యేక హోదా ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని మాటలు మార్చిన ఈ పెద్ద మనుషులు ఇప్పుడు ఆంధ్ర ప్రజల సంరక్షకులుగా పోజులు పెడితే జనం నమ్మాలి. చంద్రబాబునాయుడు ఆంధ్ర ప్రయోజనాల రక్షకునిగా పాత ఏడుపే ఏడిస్తే జనం కరిగిపోవాలి? జనం ఒక్కసారి మోసపోతారు. పదేపదే మోసం చేయడం సాధ్యం కాదు. ఏమాత్రం నిజాయితీ లేని నాయకులు వీళ్లు.

చంద్రబాబునాయుడుకు నిజాయితీ ఉంటే ఈపాటికి రాజధాని నిర్మాణం పూర్తయ్యేది. ఎన్ని అంతస్తుల భవనమైనా మూడేండ్లకు మించి పట్టదు. ఆయన చేసిన వృధా ఖర్చులతోనే అసెంబ్లీకి, సచివాలయానికి సరిపోను నిర్మాణాలు పూర్తి చేసి ఉండవచ్చు. కానీ చంద్రబాబు లక్ష్యం అదికాదు. రాజధానిని తన సొంత ఎస్టేట్‌గా మార్చుకునే ప్రయత్నంలో ఇంతవరకు అసలు నిర్మాణాలు చేపట్టలేదు. ఇవ్వాళ భవంతులు కట్టడానికి సింగపూరు, హాంకాంగ్, టోక్యో నిపుణులు అవసరం లేదు. నిర్మాణ రంగంలో భారత దేశాన్ని మించిన దేశం ఏమీ లేదు. దుబాయ్‌లోని బుర్జు ఖళీఫా నిర్మాణంలో కూడా మన ఇంజనీర్లదే ప్రధాన పాత్ర. పెద్ద పెద్ద విమానాశ్రయాలన్నీ మనవాళ్లు నిర్మించినవే. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లతోపాటు పలు అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణంలో మనవాళ్లదే ప్రధాన పాత్ర. జీఎంఆర్, జీవీకేలు ఎంత ఖ్యాతి గడించాయో తెలుసు. చత్తీస్‌ఘడ్ రాజధాని నిర్మాణ కాంట్రాక్టర్లలో ఎక్కువమంది మనవాళ్లే. కానీ చంద్రబాబునాయుడు సామాన్యమైన నాయకుడు కాదు కదా. తెరవెనుక, తెరముందు ఎన్నో ఉంటాయి. అన్నీ సెటిల్ అయిన తర్వాతగానీ ఆయన ఏదీ చేపట్టరు. రాజధానిలో మరొక పక్షానికి చోటు లేకుండా చేయడం, తన వాళ్లు మాత్రమే చుట్టూ ఉండేట్టు చూసుకోవడం, ఇంకా ఎన్నో పనులు చేయాలి. అందుకే అసలు నిర్మాణాలు పక్కనపెట్టి కొసరు నిర్మాణాలు చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చేసినట్టు చెబుతున్నారు. హైదరాబాద్‌నుంచి ఆగమేఘాలపై ఎందుకు పోవలసి వచ్చిందో ఓటుకు నోటు కేసులో ఉపయోగించిన ఫోను సంభాషణలు చెబుతాయి. ఆయన నోరు తెరిస్తే నాది తెరిచిన పుస్తకం అని చెబుతారు. నిజమే ఆయనది తెరిచిన పుస్తకమే. పేజీల నిండా రక్తపు మరకలు, నల్ల మరకలే.

Changing colors of Chandrababu

Andhra CM Chandra Babu may be thinking that speaking against State division will be benefiting to him again. But it won’t. His party made resolutions AND SUPPORTED TELANGANA FORMATION IN THE BEGINNING AND BACKTRACKED ON ITS STAND AND TRIED TO CHEAT BOTH TELANGANA AND ANDHRA PEOPLE. When YSR opposing Telangana State formation during 2004-09, Chandrababu taken a stand and supported division. And When Centre started division process he twisted his tongue again. Now After three years of division too his indigestion not gone. Chandrababu He is the most dishonest politician on the earth. See what he is saying now:
http://www.eenadu.net/homeinner.aspx…

ఏమిటి బీజేపీ గొప్ప

ఏమిటి బీజేపీ గొప్ప

ప్రధాని నరేంద్రమోడీ మూడేళ్ల పాలన సమీపించిన దశలో ఆయన నమ్మిన బంటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా దక్షిణాదియాత్ర మొదలు పెట్టాడు. ఇది దండయాత్రలాగా సాగింది. దక్షిణాదికి తెలంగాణ గేట్‌వే అని ఆయనే చెప్పారు. పూర్వం దక్షిణాదిపై దండయాత్రకు వచ్చినవారంతా దక్కను ద్వారానే ప్రవేశించారు. అప్పుడు కూడా ముందుగా దేవగిరి(మహారాష్ట్ర)ని నాశనం చేసి, ఆ తర్వాత తెలంగాణలో ప్రవేశించారు. మహారాష్ట్రలో బీజేపీ శివసేనతో కలిసి అధికారంలో ఉంది. ఇక మిగిలింది తెలంగాణే అని వారు భావిస్తున్నట్టున్నారు. మోడీ తదుపరి లక్ష్యం దక్షిణాది రాష్ర్టాలే అని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్నది. మైత్రి ద్వారా కాకుండా ఘర్షణ ద్వారా మాత్రమే బీజేపీని విస్తరించగలమని మోడీ, అమిత్‌షాల ప్రగాఢ నమ్మకం. పొత్తులు, మిత్రత్వాలు తాత్కాలికం, ఒంటరిగా ఎదగడమే దీర్ఘకాలికం అని ప్రగాఢంగా నమ్మిన నాయకులు వారు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిచోటా ఘర్షణకే దిగుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర, జార్ఖండ్, కేరళ, తమిళనాడు, ఇప్పుడు తెలంగాణ అన్ని చోట్లా ఒంటరిగానే ఎదగడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇందుకు మినహాయింపు కాదు. అక్కడ కూడా ఇది సంధికాలమే. విడిపోయిన దేశాలతో అఖండ భారతం సాధించడం సాధ్యం కాకపోవచ్చు కానీ, ఇప్పుడు ఉన్న దేశాన్ని ఏకఛత్రంకిందికి తీసుకురావడం సాధ్యమే అని వారు నమ్ముతున్నారు. అది సాధించగలిగితే అఖండభారతం సాధించినట్టే అని భావిస్తున్నారు. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మౌలిక నినాదం. భారత ఏకాత్మతావాదం పేరుతో బీజేపీ అగ్రనేతలు దేశమంతా యాత్రలు చేసిన విషయం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు రాజకీయ ఏకాత్మతావాద యాత్ర జరుగుతున్నది. ఈ యాత్ర నిరాటంకంగా ముందుకు సాగడానికి అవసరమైన అన్ని ఎత్తుగడలూ నరేంద్ర మోడీ ప్రయోగిస్తున్నారు. నోట్ల రద్దు నుంచి మొదలు పెడితే ప్రత్యర్థులపై కేసులు, దాడులు, దర్యాప్తులు అన్నీ అందులో భాగమే. సరెండర్ ఆర్ ఫినిష్ అన్నది అప్రకటిత నినాదం.

నోట్ల రద్దు దేశంలోని ప్రత్యర్థి రాజకీయ పక్షాలను ఆర్థికంగా నిరాయుధులను చేసే ఒక పెద్ద మంత్రం. అందుకే ఒక మేధావి దీనిని రాజకీయ కుట్ర అని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు ద్వారా ఏమేమి జరుగుతాయని చెప్పారో అవేవీ జరుగలేదు. కాశ్మీరులో శ్రీనగర్‌లో ఇప్పుడు సైన్యం కూడా అడుగుపెట్టలేని పరిస్థితి ఉత్పన్నమైంది. జీపులకు మనుషులను కట్టి ముందుకు అడుగులువేయవలసిన అమానుష దుస్థితి ఇవ్వాళ సైన్యానిది. ఉగ్రవాదుల రాక ఆగలేదు. సరిహద్దులో కాల్పులు ఆగలేదు. జనం చావులూ ఆగలేదు. ఏదో ఒక రోజు యుద్ధం కూడా వస్తుందేమోనన్న ఆందోళన ఇవ్వాళ దేశంలోని మార్కెట్లను పట్టిపీడిస్తున్నది. ఎన్నికలకు ముందు ఒక యుద్ధం వచ్చినా రావచ్చు. దండకారణ్యంలో మరణఘోష ఆగలేదు. ఇటు పోలీసులు, అటు నక్సలైట్లు, మధ్యలో మామూలు మనుషులు సమిథలు అవుతూనే ఉన్నారు. ఆర్థిక క్రమశిక్షణ వచ్చి సచ్చిందీ లేదు. బ్యాంకుల ఎన్‌పీఏలు ఏయేటికాయేడు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. బ్యాంకుల సేవలు మెరుగు పడింది లేదు. యాభైశాతానికి పైగా ఏటీఎంలు మూతపడే ఉన్నాయి. బ్యాంకుల్లో అకౌంటు ఉంటే డబ్బుండాలి. లేకుంటే వడ్డీలాగా పెనాల్టీలు పడతాయి. డబ్బులేకపోతే అక్కౌంటు మూసేసుకోవాలి. నోట్ల రద్దుకు ముందు కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్లు ఎన్ని చెలామణిలో ఉన్నాయని చెప్పిందో అన్ని నోట్లు బ్యాంకులకు వచ్చినట్టు లెక్కలు చెప్పింది. మరి నల్లడబ్బు ఏమైంది? నోట్ల రద్దు కారణంగా అదనంగా సంపాదించిన ఆదాయపు పన్ను అయినా గణనీయంగా ఉందా అంటే అదీ లేదు. నోట్ల రద్దు సందర్భంగా దొరికిన దొంగనోట్ల శాతం అసలు లెక్కలోకి తీసుకోదగింది కాదని ఆర్బీఐ లెక్కలు చెబుతున్నాయి. ఇవన్నీ కాగాపోగా నోట్ల రద్దు తర్వాతనే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ధారాళంగా డబ్బు ఖరు చేశాయి. బీజేపీ అందరికంటే ఎక్కువగా ఖర్చు చేసిందని అక్కడ ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన వారు చెబుతున్నారు. పోనీ రాజకీయ, అధికార యంత్రాంగాల్లో అవినీతి తగ్గిందా? మళ్లీ రేపు నల్లడబ్బు పోగుపడదని గ్యారంటీ ఉందా? ఇవేవీ జరుగలేదు. జరుగవు. అయినా ఎందుకు చేశారూ అంటే తమ పార్టీ, తానూ, తనను ఆర్థికంగా బలపరుస్తున్నవారూ బలపడడానికి ఈ ఐదేళ్ల అధికారాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోదల్చుకున్నారు. ఆ ప్రయత్నంలో ఇప్పటివరకు ఆయనకు ఎదురుదెబ్బలు తగల్లేదు. దేశానికి మంచి జరిగినా జరుగకపోయినా ఆయన మాత్రం బలపడుతూనే ఉన్నారు.

ఎకానమీలో రెండు విడ్డూరాలు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఒకవైపు షేర్ మార్కెట్ కొత్తపుంతలు తొక్కుతున్నది. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. మరోవైపు వేలాది మంది ఐటీ, ఆటోమొబైల్ ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ జీవితం గడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో లే ఆఫ్‌లు, రిట్రెంచ్‌మెంట్‌లు జరుగుతున్నాయి. కొత్తగా ట్రేడ్ యూనియన్‌లు పెట్టుకోవాలన్న ఆలోచన ఐటీ ఉద్యోగులకు కూడా వచ్చింది. టాటా మోటార్స్, షెవర్లే కంపెనీలు వందలాది మందిని రిట్రెంచ్ చేస్తున్నాయి. ఉద్యోగాల కల్పన దారుణంగా దెబ్బతింటున్నది. అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి. రియల్ ఎస్టేట్ ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఒకనాటి బలుపూఊపూవాపూ అన్నీ తగ్గిపోయాయి. నోట్ల రద్దుకు ముందు ఉన్న వెసులుబాటు ఇప్పుడు ఏ రంగంలోనూ లేదు. పది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నా నలుగురితో సరిపెట్టుకోవలసిన పరిస్థితి. ఎగుమతులు తగ్గిపోయాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినా మేకపోతు గాంభీర్యం దేశాన్ని నడిపిస్తున్నది. మాటలు, నినాదాలు అమ్మి అంతా సవ్యంగా ఉందని నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్న తెలంగాణకు వచ్చి అమిత్‌షా చేసిందీ ఆ ప్రయత్నమే. ఆయన తెలంగాణకు తమ సొమ్మేదో దోచుకొచ్చి పెట్టినట్టు మాట్లాడారు. లక్ష కోట్లు ఆయన జేబులోంచి ఇచ్చినట్టు చెప్పుకున్నారు. భారత దేశం రాష్ట్రల సమాఖ్య. కేంద్రం ఒక మిథ్య. రాష్ట్రల నుంచి వచ్చే ఆదాయమే కేంద్రం ఆదాయం. కేంద్రం గాలిలోంచి పుట్టించేది, సరిహద్దుల్లో, విదేశాల్లో సంపాదించేది ఏమీ ఉండదు. రాష్ట్రల్లో జరిగే ఉత్పత్తులు, అందించే సేవలు, జరిగే అమ్మకాలు, చేసే ఎగుమతులు వాటిపై వచ్చే పన్నులు ఆదాయమే కేంద్రం ఆదాయం. అంటే పునాది రాష్ట్రలే. కేంద్రం నుంచి నికరంగా ప్రజలకు అందేది ఏమీ ఉండదు. కేంద్రం వద్ద ఎంత సొమ్ము ఉన్నా అందులో ప్రజలకు అందేది పదీ పరకా మాత్రమే. రాష్ట్రల నిధులే ప్రజలకు పెన్నిధి. రాష్ట్రలు ప్రజలకు దగ్గరగా ఉంటాయి. ప్రజల అవసరాలను గుర్తించి పనిచేస్తాయి. ప్రజలకు సంపదను పంపిణీ చేస్తాయి. కేంద్రం నిధులు అధిక మొత్తాల్లో పెద్దలకు గద్దలకు మాత్రమే దక్కుతాయి అని ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్య ముమ్మాటికీ వాస్తవం.

బీజేపీ తెలంగాణకు ఏనాడూ చుట్టం కాదు. తెలంగాణ విముక్తి పోరాటంలో ఆ పార్టీ పునాది వర్గాలు చేసింది ఇసుమంతైనా లేదు. 1969 ఉద్యమంలో కూడా వారు గొప్ప పాత్ర ఏమీ నిర్వర్తించలేదు. గత రెండు దశాబ్దాల్లో బీజేపీ నిర్వర్తించిన పాత్ర కూడా అవమానకరమైనది, దాగుడుమూతలతో కూడుకున్నది. 1998 ఎన్నికల్లో ఒక ఓటు రెండు రాష్ర్టాలు నినాదంతో గణనీయంగా ఓట్లు సాధించిన పార్టీ ఆ తర్వాత ప్లేటు పిరాయించి తెలుగుదేశంతో ఊరేగింది. తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉండిపోయింది. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సొంతబలాన్నే నమ్ముకున్నారు. టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల సొంత బలమై కొట్లాడి, అనేక ఎత్తుపల్లాలు దాటుకుని తెలంగాణ సాధించింది. తెలంగాణ పేరు చెప్పక పోతే ఎవరికీ మెతుకు పుట్టని పరిస్థితిని ఆనాడు ఉద్యమ యోధుడు కె.చంద్రశేఖర్‌రావు సృష్టించారు. అందుకే కాంగ్రెస్ ఇవ్వక తప్పని పరిస్థితికి వచ్చింది. బీజేపీ మద్దతు ఇవ్వక తప్పని స్థితికి చేరింది. అయినా తెలంగాణ ఇచ్చే క్రమంలో ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడిన నాటకాలన్నీ గుర్తుపెట్టుకుని ఎన్నికల్లో ఆ పార్టీలకు ఎలా గుణపాఠం చెప్పాలో అలా గుణపాఠం చెప్పారు. బీజేపీ తన ఆంధ్ర పక్షపాతాన్ని ఏనాడూ దాచుకోలేదు. బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు పునర్విభజన చట్టానికి మద్ధతు ఇస్తూనే ఆంధ్రకు చేయవలసినదంతా చేశారు. పదేండ్ల ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు, అర్ధంతరంగా ఆరు మండలాలను, సీలేరు విద్యుత్తును, శబరి నదిని ఆంధ్రలో కలిపేయడం, ఉమ్మడి సంస్థలను మూడేండ్లయినా విభజించకపోవడం, ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి చేయకపోవడం, ఆంధ్రకు ప్రకటించిన సగం ప్రాజెక్టులు కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం, తెలంగాణలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకూ జాతీయ హోదా ప్రకటించకపోవడం…బీజేపీ చేసిన అన్యాయాల జాబితా చాలా తయారు చేయవచ్చు. బీజేపీ దళిత పక్షపాతం ఒక నటన. దళితులపట్ల ఆ పార్టీ ఆధిపత్య వర్గాలు ఎలా వ్యవహరిస్తున్నాయో గుజరాత్, జార్కండ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో గోరక్షణ పేరిట జరుగుతున్న ఘాతుకాలు ఏమిటో అందరికీ తెలుసు. అందువల్ల బీజేపీ తెలంగాణ ప్రజలను మాయ చేయలేదు. మోడీ, అమిత్ షా ఘర్షణ రాజకీయాలు ఎక్కడయినా పనిచేయవచ్చు, ఇక్కడ కష్టం.