కాంగ్రెస్‌కు ఇదే చివరి అవకాశం

28 June 2014, 07.00pm
కేంద్రంలో కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై ఏదో ఒకటి తేల్చేస్తామంటున్నది. రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జిగా నియమితులైన దిగ్విజయ్‌సింగ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనారాయణలతో సమావేశమై చర్చలు జరిపారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, పల్లంరాజులు కూడా దిగ్విజయ్‌తో మంతనాలు జరిపారు. ఈ మంతనాలన్నీ తెలంగాణ చుట్టే జరిగాయని అన్ని పత్రికలు రాశాయి. ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో కూడాఒకింత అసాధారణమైన కదలికే వచ్చింది. పంచాయతీరాజ్ మంత్రి కుందూరు జానారెడ్డి తెలంగాణ కోసం వీరోచిత పోరాటాలు చేయకున్నా, కాంగ్రెస్‌లో ఈ అంశాన్ని నిత్యం ఎజెండాలో ఉంచుతున్నది ఆయనే. నలుగురిని పోగేస్తున్నది, ఢిల్లీకి వెళ్లి మహజర్లు సమర్పిస్తున్నదీ ఆయనే. ఇప్పుడాయన నిజాంకళాశాల మైదానంలో ఒక పెద్ద సభ పెట్టి కాంగ్రెస్‌కు సంకేతాలు పంపదల్చుకున్నారు. తెలంగాణ ఇవ్వడం ద్వారానే కాంగ్రెస్ భవిష్యత్తుకు సోపానం వేయాలని ఈ సభ నుంచి ఆయన పిలుపునివ్వాలనుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన అంశం ఏమంటే ఈసారి జానారెడ్డి ప్రయత్నాలకు ముందెన్నడూ తెలంగాణ ఊసెత్తనివారు సైతం ఇప్పుడు మద్దతునిస్తున్నారు. చాలా హడావిడి చేస్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ వంటివారు ఏర్పాట్ల పరిశీలనకు వచ్చి, టీవీలలో కనిపించినప్పుడు చాలా మంది ‘ఔరా! అని ముక్కున వేలేసుకున్నారు’. అంజన్ ఇన్నేళ్లలో ఏరోజూ తెలంగాణ కోసం గళం విప్పిన పాపాన పోలేదు. ఇటువంటి వాళ్లు తెలంగాణలో ఇప్పుడు చాలామందే తయారవుతున్నారు. మంచిదే. ఇప్పటికయినా తెలంగాణ డిమాండుతో చేతులు కలిపినందుకు వీళ్లందరినీ అభినందించాల్సిందే. వీరంతా నిజాం కళాశాల సభను బ్రహ్మాండంగా నిర్వహించాలని కార్యకర్తలకు ఆదేశాలిస్తున్నారు. అయితే సభ ఎంత బాగా జరిపామన్నది ముఖ్యం కాదు. సభ నుంచి ఎటువంటి సందేశం ఇస్తామన్నది ముఖ్యం. తెలంగాణ సాధనకు ఎటువంటి కార్యాచరణ ఇస్తామన్నది ముఖ్యం. తెలంగాణ సాధన కోసం జరిగే కృషిలో ఎంతమంది నిలబడతారన్నది ముఖ్యం.

కాంగ్రెస్ నాయకత్వం అంతా గుర్తు పెట్టుకోవలసిన అంశం ఒక్కటుంది – తెలంగాణ ఇవ్వడమూ, రావడమూ తథ్యం. ఇప్పుడా ఇంకొన్నాళ్లకా అన్నదే సమస్య. ఇప్పుడు ఇచ్చినవాళ్లు, తెచ్చినవాళ్లు మొనగాళ్లవుతారు. ఇప్పుడు తెచ్చినవాళ్లే తెలంగాణ ప్రజలకు ఆప్తులు అవుతారు. ఇప్పుడు తెలంగాణ వస్తేనే ఈ ప్రతిష్టంభనకు, ఈ సంక్షోభానికి, ఈ ఆత్మహత్యలకు ముగింపు వస్తుంది. ఇప్పుడు రాకపోతే తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెసే అవుతుంది. ఇప్పుడు తప్పించుకోవడానికి, వాయిదాలు వేయడానికి కాంగ్రెస్‌కు ఇంకే కారణాలూ మిగల్లేదు. ఏకాభిప్రాయం లేదన్నది అబద్ధం. రాజకీయ ఏకాభిప్రాయం ఎప్పుడో వచ్చేసింది. కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంటులో చేసిన ప్రసంగం ఒక్కసారి చూడండి. ‘రాజకీయ ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే 2009 డిసెంబరు 9న ప్రకటన చేశాన’ని ఆయన పార్లమెంటులో చెప్పారు. పార్టీలలో విభజన అన్నది ఆ పార్టీల సమస్య. తెలంగాణ సమస్య కాదు. ఏ అంశంపైన అయినా ఏకాభిప్రాయం పదేపదే అడగరు. ఎస్సార్సీకి కాలం చెల్లిపోయింది. కాంగ్రెస్ ఆ పని చేయదల్చుకుంటే 2004 ఎన్నికల్లో గెల్చిన వెంటనే చేసి ఉండాలి. 2009లో కూడా శ్రీకృష్ణ కమిటీ బదులు ఎస్సార్సీనే వేసి ఉండవచ్చు. ప్యాకేజీలు చాలా పాతచింతకాయ పచ్చడి. దానిని ఎవరూ కోరడం లేదు. అది ఎందుకూ పనికి రాదు. పదేళ్ల ఉద్యమం తర్వాత, ఇన్ని హామీల తర్వాత, ఇంత మంది బలిదానాల తర్వాత ఇప్పుడు ప్యాకేజీ అంటే తెలంగాణ ప్రజలు ఛీకొడతారు. రాయల తెలంగాణ కూడా పేచీకోరు ప్రతిపాదనే. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ముందుపడకుండా చేసే కుహకమే. తెలంగాణ ఇవ్వడానికి నిరాకరించే ఎత్తుగడలో భాగమే.

కాంగ్రెస్ అధిష్ఠానం, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం గుర్తించాల్సింది ఏమంటే ఇక ఇప్పుడు అటువంటి పప్పులేమీ ఉడకవు. కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరేదీ తెలంగాణ ప్రజలను శాంతింప జేయలేదు. కాంగ్రెస్‌కు ఒకటి, రెండు, మూడు అంటూ ప్రత్యామ్నాయాలు లేవు. తెలంగాణ ఏర్పాటుకు అసలు ప్రత్యామ్నాయమే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇవ్వకపోతే రేపు ఎన్నికల తర్వాత ఎవరో ఒకరు ఇస్తారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణతో ఉంటారా, కాంగ్రెస్ అధిష్ఠానంతో ఉంటారో తేల్చుకోవాలి. నిజాం కళాశాల సభ అటువంటి సంకేతాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపాలి. సంకేతాలు అంటే సభలు, ఉపన్యాసాలు కాదు. ఒక అల్టిమేటమ్ ఇవ్వగలగాలి. తెలంగాణ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చెప్పగలగాలి. ఒత్తిడి లేకుండా నిర్ణయాలు జరగవు. ఉత్తమాటలతో పనులు జరిగే కాలం కాదిది. ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి మిగిలిన ఆఖరి అవకాశం ఇది. ఇప్పుడు తెలంగాణ ఇచ్చి, ఆ క్రెడిట్ ఎవరు కొట్టేసినా అభ్యంతరం లేదు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రావడం ముఖ్యం. ఎవరు కొట్లాడారు? ఎవరు సాధించారు? ఎవరిని నెత్తికెత్తుకోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. వారివారి జాతకాల ప్రకారం ప్రజలు వారివారి ఆదాయ వ్యయ ఫలాలు వారికి ఇస్తారు.

నిజానికి కాంగ్రెస్ నిర్వహిస్తున్న నిజాం కళాశాల సభను తెలంగాణ సాధనకోసం నిజాయితీతో చేస్తున్న ప్రయత్నంగా తెలంగాణవాదులు పరిగణించడం లేదు. ఇదేదో మరోసారి మాయ చేసే ప్రయత్నమనీ, సాక్షాత్తూ కాంగ్రెస్ హైకమాండే ఈ నాటకాన్ని నడిపిస్తున్నదనీ వాదించేవారే ఎక్కువమంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏదో మైలేజీ కొట్టేయడం కోసమే కాంగ్రెస్ ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నదన్న విమర్శలూ ఉన్నాయి. ఎన్నికల దాకా ఇలాగే కాలయాపన చేసి, మళ్లీ తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేసి, తెలంగాణ రాజకీయశక్తుల పునరేకీకరణను అడ్డుకునేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. తెలంగాణవాదులు ఇలా విమర్శించడంలో న్యాయం ఉంది. కాంగ్రెస్ ఇలా అనేకసార్లు చేసింది. ఎంపీల రాజీనామాల విషయంలోనూ, ఎంపీలను చీల్చడంలోనూ, తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలను ఒక్కతాటి మీదకు రాకుండా చేయడంలోనూ కాంగ్రెస్ ఇటువంటి విభజించి పాలించే ఎత్తుగడలను అమలు చేసింది. ఇప్పుడు ఈ సభల వెనుక కూడా అటువంటి ఎత్తుగడ ఏదో ఉండి ఉంటుందని తెలంగాణవాదులు భావించడంలో తప్పులేదు. తెలంగాణవాదుల అనుమానాలను, భయాలను వమ్ము చేయాలంటే సభ జరిపి, ఉపన్యాసాలిచ్చి, దుమ్ముదులుపుకుని పోవడం కాదు-తెలంగాణ సాధన దిశగా ఒక మైలురాయి కాదగిన నిర్ణయాలు నిజాం కళాశాల సభ చేయగలగాలి.

ఆంధ్రప్రదేశ్‌లో కనీసం సగం సీట్లు గెలవకుండా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం కల్ల. తెలంగాణ సమస్యను పరిష్కరిస్తే తప్ప సగం సీట్లకు గ్యారెంటీ లేదు. తెలంగాణ సమస్యను పరిష్కరించినా, పరిష్కరించకపోయినా ఆంధ్రలో కాంగ్రెస్‌కు వచ్చే సీట్లు బహు తక్కువ. ఎక్కువ మైలేజీ పొందడానికి అవకాశం ఉన్నది తెలంగాణలోనే. ఆ మైలేజీని సంపాదించే యత్నాల్లో భాగంగానే కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి గులామ్ నబీ ఆజాద్‌ను తప్పించి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాహుల్‌గాంధీకి పొలిటికల్ టీచర్ అయిన దిగ్విజయ్ సింగ్‌ను నియమించింది. సోనియా, రాహుల్‌గాంధీలకు దిగ్విజయ్‌పై నమ్మకం ఎక్కువ. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది దిగ్విజయ్‌సింగే. ఆయనకు విభజన వల్ల తలెత్తే సమస్యలు బాగా తెలుసు. రాష్ట్ర కాంగ్రెస్‌లోని అన్ని ప్రాంతాల నాయకులు కూడా దిగ్విజయ్ మాటకు ఎక్కువ విలువనిస్తారు. ఆయన అందరినీ కట్టడి చేయగలరని అధిష్ఠానం నమ్ముతోంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నిజాం కళాశాల సభ విజయవంతం కావచ్చు. దానితో పార్టీపై కొంత ఒత్తిడి పెరగవచ్చు. కానీ దానికంటే దిగ్విజయ్ సింగ్‌ను మెప్పించడం ముఖ్యం. ఆయనకు ఈ సమస్యకు సంబంధించి ఒక స్పష్టత ఇవ్వడం, ఒక నిర్ణయం తీసుకునే దిశగా ఆయనను ప్రభావితం చేయడం ముఖ్యం. మెప్పించడం, ప్రభావితం చేయడం అంటే సహేతుకమైన వాదనలు వినిపించడం, సమంజసమైన కారణాలు చూపించడం. తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితులు ఏమిటో వివరించడం. జూలై 27 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలలోపు తెలంగాణపై ఒక స్పష్టత తీసుకురావాలి.

ఇప్పుడు బస్సు మిస్సయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇంకెప్పుడూ దానిని అందుకోలేరు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇందుకు భారీ మూల్యాలు చెల్లించుకోవలసి వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రథమ ముద్దాయిగా నిలబడాల్సి వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్‌ను తిరిగి బతికించడం అసాధ్యమవుతుంది. నేతలంతా తమ రాజకీయ భవిష్యత్తును శాశ్వతంగా పణంగా పెట్టవలసి వస్తుంది. అవమానాలు, అనుమానాల మధ్య ప్రజల ముందుకు వెళ్లవలసిన దీనస్థితి దాపురిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కేంద్రంగా రాజకీయ శక్తుల ఏకీకరణ జరుగుతుంది. కొత్త రాజకీయశక్తులు బలపడతాయి. సరికొత్త రాజకీయ సమీకరణలు ముందుకు వస్తాయి. తెలంగాణలో, రాజధానిలో సందిగ్ధ రాజకీయ పరిస్థితులు మరికొంతకాలం కొనసాగుతాయి. ఆర్థిక, పారిశ్రామిక రంగంలో నెలకొన్న స్తబ్దత కొనసాగుతుంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మేలుకోవాలి. తమ అస్తిత్వం కోసమైనా ఒకతాటిపై నిలబడి కొట్లాడాలి. అందరూ నిలబడి కొట్లాడితే 2014 ఎన్నికలతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇప్పుడే సిద్ధిస్తుంది. కొట్లాడితే విజయం మీదే, ఫలితమూ మీదే. కాంగ్రెస్‌కు ఇది ఆఖరు అవకాశం. కాపాడుకున్నా, చేజార్చుకున్నా వారి చేతుల్లోనే ఉన్నది.
-kattashekar@gmail.com

Telangana parties to sweep in elections: CM’s secret survey

– June 27, 2013

A highly confidential survey commissioned by state Chief minister N Kiran Kumar Reddy has proved what many people in the state have been thinking for long. Pro-Telangana parties are going to decimate Congress and TDP in Telangana region.

http://www.thestatesman.net/index.php?option=com_content&view=article&id=462794&catid=35

http://missiontelangana.com/telangana-parties-to-sweep-in-elections-cms-secret-survey/

The TRS, BJP combine is projected to bag a whopping 75 seats in Telangana region if elections were to be held now. Congress, TDP and YSRCP, which have deceived the Telangana people, are going to be taught a fitting lesson in upcoming elections.

telangana-survey-cm2
The TRS party, which is spearheading the Telangana statehood movement, would be getting 60 seats. The BJP might also get benefited due to its pro-Telangana stance. It is projected to increase its tally to 15 seats.

While the ruling Congress might be restricted to just 12 seats, TDP would almost be washed out of the region with just 7 seats. YSRCP is projected to get about 14 seats.

The survey is definitely going to cause tremors in Telugu Desam Party, as it is relegated to the last position among all contesting parties in Telangana region. Many TDP leaders are already preparing to come out of the party and such survey reports might hasten the exodus.

The survey results show that there is a clear possibility of a hung Assembly for the first time in AP history.

విశాఖలో ముగిసిన నమస్తే ఆత్మీయ యాత్ర

27 జూన్ 2013

నమస్తే తెలంగాణ ఆత్మీయ యాత్ర గురువారం విశాఖపట్నంలో ప్రశాంతంగా ముగిసింది. జగదాంబ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, కంచర్ల పాలెం, ఎన్‌ఇడి జంక్షన్, గాజువాక, పరవాడ, దువ్వాడ ప్రాంతాలలో సుమారు పదివేల పత్రికలు పంచారు. ఎక్కడా ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు.

‘విభజన వికాసానికే, విడిపోయి కలిసి ఉందాం’ పేరుతో ప్రచురించిన సంచికను పాఠకులు ఆసక్తిగా చదివారు. పోలీసులు దారిపొడవునా బందోబస్తు కల్పించారు. ఆత్మీయ యాత్రను యూనివర్సిటీ వైపు, బీచ్ రోడ్డువైపు వెళ్లడానికి పోలీసులు అనుమతించలేదు.

It’s Racist Times! Whose Hyderabad is this?

Are Hyderabadis Subjected to be Civilized Now?
Telangana People Have no Civilization to Rule?

June 27th June 2013, 01.30pm

Times of India, Campaign on Hyderabad is hurting. It’s humiliating. It is belittling the Hyderabadis capacities to rule. It is not a dialogue, but racist provocation. It’s reminding the colonial logic used by Britishers to rule India then. They propagated same arguments then.

‘Indians have no civilization. They need to be ruled by us. They have to learn culture and rules of civilization. Hence they have to be subjects for us. We bring fruits of progress and modernity to the subject people” …this is the logic they applied in India for years.

They felt that Indians are inferior, not equals. They barred Indians from clubs and their specified cultural centers. In the 1930s some European Clubs in India had a sign board that read “Dogs and Indians are not allowed”.

Now that The Times of India has taken up the same logic. They want to keep away Telanganites from Hyderabad Administration. They want to separate Hyderabad from Telangana. If the Hyderabad is bad today, it’s not because of Telangana Movement, but bad establishment, which is prevailing on the city for decades.

The so called civilians, who are advocating separate administrative mechanism for Hyderabad, are not Hyderabadis. These upper strata prophecies are meant to demeaning the sons of soil. They are not representing real Hyderabad.

It is surprising that once failed, rejected and ridiculed arguments are put forward by these ‘well wishers’ of Hyderabad. We had so much of discussion during Madras – Andhra division and Gujarat – Maharashtra division. Then Madras and Bombay become the focal points. But after enough of thought, Madras became part of Tamilnadu and Bombay become capital of Maharashtra.

One can understand the dialogue on betterment of Hyderabadis life. But how can it be linked with a regional demand and develop a bogey on it? Certainly it is a cranky idea, which Times cannot do. People of Hyderabad will reject it.

పసుపు పచ్చ ప్రెస్ అంటే ఇదేనేమో….

http://apmediakaburlu.blogspot.in/2013/06/blog-post_26.html
Wednesday, June 26, 2013

తెలుగు ప్రెస్ లో ఏ పత్రిక ఎజెండా దానికుంది. సరే… ‘సాక్షి’ పేపర్, ఛానెల్ పుట్టుకొచ్చిందే పచ్చ మీడియా విష ప్రచారాన్ని అడ్డుకోవడానికని ఆ సంస్థ సగర్వంగా ప్రకటించింది. పనిలో పనిగా జగన్ కుటుంబ అజెండా మోయడానికి ఆ పత్రిక, ఛానెల్ నిరంతరం కృషి చేస్తున్నాయి. ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలు, వారి తాలూకు ఛానెల్స్ కూడా నిరంతరం తెలుగు దేశం కోసం, చంద్రబాబు కోసం పాటుపడతాయన్న విమర్శ ఉంది. అది అబద్ధం కాదు సుమా…అనడానికి ఉదాహరణలు అనేకం. లేటెస్ట్ ఉదాహరణ చూద్దాం.

ఈ మధ్యన ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి. వేల మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో… తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ చిక్కుకున్న తెలుగు వారి కోసం నడుం బిగించారు. మొన్న, అంటే సోమవారం నాడు, ఆయన డెహ్రాడూన్ వెళ్లి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి బహుగుణను కలిసి… తెలుగు వారి పట్ల వివక్ష వద్దు… అని చెప్పారు. ఈ మీటింగ్ కు సంబంధించి మంగళవారం మొదటి పేజీ పై భాగం లో ఈనాడు ఒక ఫోటో వేసింది. చంద్రబాబు… ఆ ముఖ్య మంత్రిని చూపుడు వేలు పైకెత్తి నిలదీస్తున్నట్లు ఉన్నదది. ఆ ఫోటో చూసిన తెలుగోళ్ళు… మన బాబు గారు… ఆ సీ ఎం ను ఎకేస్తున్నరహ… అని చంకలు గుద్దుకోవాలన్నది ఆ పత్రిక తాపత్రయం అని కూడా అనుకోలేము. “తె దే పా ఆధ్వర్యంలో ప్రత్యేక విమానం”… ‘ఇంటికి చేరే దాకా పార్టీ దే బాధ్యత…” అన్న శీర్షికలూ మొదటి పేజీలో వచ్చాయి. ఇక 15 వ పేజీ మొత్తం తెలుగు దేశం యాక్టివిటీ కి కేటాయించారు. అందులో… బాబు గారివి రెండు ఫోటోలు వేసారు. దేశ రాజధానిలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఒకాయన బిజీ గా ఫోన్ లో మాట్లాడుతున్న ఫోటో, పలు స్టోరీలు ప్రచురించారు……

Aathmeeya Yatra Passed Through Rajamundry Peacefully

26th June 2013

Namasthe Telangana Daily Aathmeeya Yatra completed its journey through Rajamundry Today. Namasthe Staff distributed 5000 copies of supplement newspaper among the local citizens. Police provided security to prevent any untoward incidents. General public showed interest to receive the Newspaper. Some of them appreciated Namasthe’s effort.

After completing the Yatra in Rajamundry, moved to Jaggampet, where the reception is good enough. The Yatra will reach Vizag by tomorrow. Very few disgruntled people created problem in Amalapuram, hence, the people as whole cannot be blamed for what happened there. Every one must show restraint in blaming or branding a region with intemperate language.

Rayala Telangana-A Misconceived Idea

26th June 2013, 01.30pm

The idea of Rayala Telangana is a misconceived, destructive political proposal. Congress and its social base caste are main culprits in this gamble. It is a proposal to demolish one identity and also neither recognizes Telangana identity. With this idea in mind, Congress wants to solve the Telangana problem with least resistance. Two states will have 147 each assembly and 21 each Lokhsabha seats.

The big plan behind this proposal is to finish Rayalaseema clout once for all, but preserving Reddy domination in new state. They want to weaken Chandra Babu Naidu of TDP and YS Jagan Mohan Reddy of YSRCP. But politics never happens as defined or as desired by the people who scripted it.

May be some leaders from Rayalaseema may compromise on this proposal, but people may not willing to lose their identity. There will be heavy backlash on those who support it. Another worry, which may scuttle the proposal, is sharing of Krishna waters.

If Rayala Telangana formed, Pothireddypadu regulator, come under this new establishment. If that happens, control over Srisailam reservoir and regulator will be under new political establishment, which will create problems for Nellore, Kadapa and Krishna basin.

Hence, neither Andhra nor Rayalaseema will accept for this vertical division of state. It’s creating a new problem rather  than solving one.

Aathmeeya Yatra Attacked in Amalapuram, E.G.Dist

DSC_0196DSC_0208

Namasthe Telangana ‘Aathmeeya Yatra’ was attacked by some miscreants in Amalapuram on Tuesday afternoon. Miscreants thrashed Namathe Telangana staff, when they are distributing Newspaper supplement and injured the vehicle driver Srinivas.

They dragged 7000 copies of News Paper from the vehicle and burnt down. They damaged the vehicle rear mirrors and asked the staff to get away from the city. The details of the miscreants are still not known. But they can be identified with their photos in action. Namasthe staff lodged a complaint in local police station.

It’s completely unwarranted. Athmeeya Yatra wishes to promote cordial atmosphere between two the regions on separation issue. There is no single word or news item in the Paper, with bad temperament and animosity.

So far Yatra is progressing peacefully all through the Jaggaiahpet to Vijayawada to Amalapuram. Barring, some noises by few people here and there, common public receiving the Newspaper with cordial invitation. Namsthe took this initiative to open a dialogue in the society to decide the fate of State.

DSC_0214

A Decision on Telangana, Still Hanging! So far no Package or no Telangana!

25th June 2013, 7.00a AM

Congress High command so far did not take a final view on Telangana, according to highly placed sources in Delhi. They are still considering various options to come to a conclusion. The news regarding package or outright announcement of formation of Telangana are just kite flyings of some interested sections of media.

Newly appointed in charge of AP Congress Affairs Digvijay Singh, has to take charge of state affairs. Without he getting into the matter fully, a decision cannot come out. He may conduct series of consultations with state party leaders.

Chief Minister may visit Delhi in a day or two and may have talks with High Command. And also Mr. Digvijay Singh expected to visit Hyderabad and may gauge the mood in the state. Then after only a final decision will emerge.

Congress is analysing-assessing the advantage it is going to get from the division or keeping united state. Digvijay Singh as a political Guru of Rahul Gandhi has to ensure maximum seats from Andhra Pradesh, if UPA-3 has to become reality.

Some media houses from AP are intentionally campaigning about a T decision to alert united Andhra forces on the occasion of Digvijay’s visit. Same media houses propagated about a package few days ago.

This is the time to Telangana political forces unite and build the pressure on Centre to achieve separate state. If it is possible to achieve Telangana now, political parties must keep aside their interests and become part of the solution.