జయహో శాసనసభ

image

శాసనసభ బడ్జెటు సమావేశాలు ఇన్ని రోజులపాటు జరగడం, ఇన్ని గంటలపాటు చర్చ చేయడం, ఇంత సావధానంగా అన్ని పక్షాలూ చర్చలో పాల్గొనడం బహుశా ఇటీవలి చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు. కొత్త రాష్ట్రమయినా మన అసెంబ్లీ చాలా పరిణతిని ప్రదర్శించింది. తెలుగుదేశం ప్రతినిధులు ఒకరిద్దరి పిడకల వేట కార్యక్రమాన్ని మినహాయిస్తే అర్థవంతమైన చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చాలా గంభీరంగా, సంయమనంతో వ్యవహరించారు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి సంబంధించి తాను అనుకుంటున్నదేమిటో, చేస్తున్నదేమిటో, చేయదల్చుకున్నదేమిటో సభలో అందరిముందు అరమరికలు లేకుండా ఆవిష్కరించారు. ఇటీవలికాలంలో ఏ ముఖ్యమంత్రీ వెచ్చించనంత సమయం ఆయన అసెంబ్లీకి వెచ్చించారు. ఉద్యమకాలంలో దూకుడుగా శరపరంపరగా ప్రత్యర్థులపై స్పందించిన కేసీఆర్, ఇప్పుడు అసెంబ్లీలో అందరి విమర్శలు, సమస్యలు విని సావధానంగా స్పందించడం కొత్తపరిణామం. ఏదో తోచింది మాట్లాడడం కాకుండా అన్ని అంశాలపై సాకల్యంగా సన్నద్ధమై, ఒక స్పష్టమైన, లోతైన అవగాహనతో ఆయన సభను మెప్పించే ప్రయత్నం చేశారు. మాటకు మాటలు అస్సలు లేవని కాదు. కొంతమంది మంత్రులు సమావేశాల తొలిరోజుల్లో ఉద్యమకాలంలో మాదిరిగానే ఒంటికాలిపై లేచి ప్రతిపక్షాల దాడులను తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత్తర్వాత అందరూ చాలా ఓపికతో చర్చల్లో పాల్గొనడం, సమాధానాలు చెప్పడం కనిపించింది. మంత్రులు చాలా మంది కొత్తవాళ్లయినా తమ తమ శాఖలపై పూర్తి అవగాహనతో, అంతే గంభీరంగా సభలో మాట్లాడారు. ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాజయ్య వంటివారు చాలా అనుభవజ్ఞుల్లాగా సభను అలరించారు. తడబడిన సందర్భాలు లేవు. ఇది కొత్త అసెంబ్లీ అనిపించలేదు. చాలా అనుభవజ్ఞులతో కూడిన సభగా రాణించింది. సభలో సగానికిపైగా తొలిసారి అసెంబ్లీకి వచ్చిన సభ్యులు ఉన్నప్పటికీ అత్యధిక మంది ఏదో ఒక అంశంపై చర్చలో పాల్గొనడం ఈ సమావేశాల ప్రత్యేకత. మునుపెన్నడూ సభలో మాట్లాడే అవకాశాలు రాని నియోజకవర్గాల ప్రతినిధులు సైతం ఈసారి తమతమ ప్రాంతాల సమస్యలను ప్రస్తావించగలిగారు.

తెలుగుదేశంలో కొందరు సభ్యులు తప్ప ప్రతిపక్షాలు కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాయి. కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకుడు కె.జానారెడ్డి నిర్మాణాత్మకంగా వ్యవహరించారు. వివిధ సందర్భాల్లో పెద్దరికం చూపించారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా విమర్శించాల్సిన చోట విమర్శించారు. సమర్థించాల్సిన చోట సమర్థించారు. జీవన్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వంటివారు కూడా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అదే సమయంలో సంయమనమూ పాటించారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలోనే నగుబాటు కాకూడదన్న స్పృహ చాలా మంది నాయకుల్లో కనిపించింది. రాజకీయాలు తేల్చుకునేందుకు ఇది సమయం కాదన్న జాగ్రత్త ప్రతిపక్ష సభ్యుల్లో వ్యక్తమయింది. పిడుగుకు బియ్యానికి ఒకే మంత్రం జపించే కొంతమంది అల్పజీవులు సభా కార్యక్రమాలకు అవరోధాలు కల్పించాలని చూసినా సభలోని మరే పక్షమూ వారి వెంట వెళ్లలేదు. బయటివారు ఎవరో ఆడిస్తే ఆడేవారు, ‘రెచ్చిపోండి’ అని ఎవరో ఎగదోస్తే ఎగిరెగిరి విమర్శలు గుప్పించేవారు తెలంగాణ సమాజంలో రాణించలేరని ఈ సమావేశాలు రుజువు చేశాయి. టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు అసభ్యతకు, సభ్యతకు మధ్య సంధిచేయలేక సతమతమయ్యారు. ప్రభుత్వంపై, అధికారపక్షంపై ఉన్నవీ లేనివీ ప్రభుత్వంపై గుప్పించి అమాతంగా పెద్ద నాయకులైపోదామని భ్రమించేవారికి అసెంబ్లీ సమావేశాలు తగిన స్థానం చూపించాయి. ప్రజలు శాసనసభ్యులను, శాసనసభ్యులు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, ఇది ప్రజాస్వామిక ప్రభుత్వమనీ గుర్తించకుండా, తెలంగాణ నాయకత్వానికి, ప్రభుత్వానికి దొరతనం, నియంతృత్వం అంటగట్టాలని చూసే అరాచకులకు ఈ సమావేశాలు గట్టిగానే బుద్ధిచెప్పాయి. ఇదంతా చంద్రబాబు ఎజెండాను మోస్తున్నవారి పన్నాగం. చంద్రబాబుకు భజన చేస్తున్న ఒక పత్రికాధినేత ఎన్నికల ఫలితాలు వచ్చిన మూన్నాళ్లకే కేసీఆర్‌కు నియంత అని, అరాచకవాది అని సర్టిఫికెట్టు ఇచ్చాడు. ప్రజలెన్నుకున్న నాయకుడికి ఏమాత్రం ప్రజామోదం లేని మనిషి ఈ పేరు పెడతాడు. అదే మంత్రాన్ని టీడీపీ నాయకులు పట్టుకుంటారు. అహంకారాన్ని, నియంతృత్వాన్ని తమ తమ బుర్రలనిండా నింపుకున్నవారు, ఏ వ్యవస్థలనూ గౌరవించనివారు ఎదుటివారికి పేర్లు పెడుతున్నారు. విచిత్రంగా ఇప్పుడు పీపుల్స్‌వార్ కూడా అలాగే అంటున్నట్టు ఒక పత్రికా ప్రకటన ఇటీవల బయటికి వచ్చింది. తీరాచూస్తే అది డూప్ల్లికేట్ అని, మావోయిస్టులకు ఆ ప్రకటనకు సంబంధంలేదని తెలిసింది. అంటే ఈ ప్రచారం వెనుక ఎవరున్నారో, ఎందుకు ఇది చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సీమాంధ్ర నాయకత్వం తెలంగాణ నాయకత్వానికి వ్యతిరేకంపై ఇంతకాలం వేస్తూ వచ్చిన ముద్రలు, నిందలనే ఇప్పుడు ఇక్కడ వారి వారసులు కొందరు ప్రయోగిస్తున్నారు. ఆంధ్ర నాయకత్వానికి ఆరవ వేలుగా వ్యవహరించేవారిని తెలంగాణ సమాజం ఇప్పుడే కాదు ఎప్పటికీ హర్షించదు.

బీజేపీ నాయకత్వం ఈ అంశాన్ని తొందరగానే గుర్తించినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ తర్వాత అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఆ పార్టీయే. తెలుగుదేశంకు తోకగా కాక, సొంత ఎజెండాతో వ్యవహరించేందుకు ఆ పార్టీ వ్యవహరించింది. ఆ పార్టీ నుంచి లక్ష్మణ్ చాలా పరిణతితో సభా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎంఐఎం సభ్యులు ఎప్పటిలాగే చాల చురుకుగా చర్చల్లో పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎంలకు ఒకే సభ్యుడు ఉన్నప్పటికీ వారు తమ నిర్మాణాత్మక పాత్రను కాపాడుకునే ప్రయత్నం చేశారు. శాసన మండలిలో కూడా ఈ సారి మునుపటికంటే విస్తృతంగా చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి, మంత్రులు గతంలో మండలిని ఎక్కువగా లెక్కపెట్టేవారు కాదు. కానీ ఈ సారి వారు విధిగా మండలి సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొన్నారు. సమాధానాలిచ్చారు. స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్, మండలి చైర్మన్ స్వామి గౌడ్…ముగ్గురూ ఆ పదవులకు కొత్తవారే. కానీ సభా నిర్వహణలో వారు చాలా అనుభవజ్ఞుల్లా వ్యవహరించారు. అందరి మనుషుల్లాగానే వ్యవహరించారు. వివాదాలకు కేంద్ర బిందువు కాలేదు. వీలైనంత ఎక్కువమందిని సభా కార్యకలాపాల్లో భాగస్వాములను చేశారు. స్పీకర్‌పై అవిశ్వాసం పెడతామని బొబ్బలు పెట్టిన టీడీపీ సైతం చివరికి ఎవరి మద్దతూ లేక వెల్లకిలా పడవలసి వచ్చింది.

కేసీఆర్‌కు ఏదో ఒక సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇంకా చాలా టైముంది. మన రాష్ట్రంలో ఇదితొలి ప్రభుత్వం. తొలి ముఖ్యమంత్రి ఆయన. పదమూడేళ్లు పోరాడి ఈ రాష్ట్రం సాధించిన ఘనత ఆయనకుంది. అనేక ఎత్తుపల్లాలను, అనేక కష్టనష్టాలను దాటుకుని అసాధ్యం అనుకున్నదానిని సుసాధ్యం చేశారు. అందుకే తెలంగాణ ప్రజలు ఆయనపై విశ్వాసం ఉంచి రాష్ట్రం అప్పగించారు. దీనిని ఎవరు జీర్ణించుకోలేకపోతే వాళ్లే సతమతమవుతారు. ఇప్పుడు ఎజెండాలో ఉన్న సమస్యలేవీ తెలంగాణ ప్రభుత్వంతో వచ్చినవి కాదు. చాలా సమస్యలు దీర్ఘకాలికంగా సంక్రమించినవి. ఆ సమస్యల నుంచి బయటపడడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రణాళికతో, కార్యాచరణతో పని మొదలు పెట్టింది. పారిశ్రామికాభివృద్ధి, సాగునీరు, తాగునీరు, విద్యుత్తు రంగాలను ప్రాధాన్య రంగాలుగా ఎంచుకుని పనులు ప్రారంభించింది. వాటి సాధ్యాసాధ్యాలు, జయాపజయాలు తేలడానికి సమయం ఇవ్వాలి. అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్న పూర్తి ఆత్మవిశ్వాసం ఆయన ప్రసంగాల్లో వ్యక్తమయింది. ప్రతిగడపకూ మంచి నీరు ఇవ్వకపోతే ఓటు అడగను అని చెప్పగలిగిన ధైర్యం ఏ నాయకుడికి ఉంటుంది? కానీ కేసీఆర్ తొణకకుండా బెణకకుండా ఈ లక్ష్యాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాతగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ నవతెలంగాణ నిర్మాతగా విజయం సాధిస్తారా లేదా అన్నది ఆయన పెట్టుకున్న లక్ష్యాల సాధనపై ఆధారపడి ఉంటుంది.

రైతులను ఆదుకోండి….ఆత్మహత్యలను ఆపండి

assembly-t_1402230513

తెలంగాణాలో రైతుల ఆత్మహత్యల నివారణకు తక్షణం పూనుకోవాలి… ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి. ఇంకా ఆలస్యం చేయడం మరింత సంక్షోభానికి దారి తీస్తుంది. ఈ సమస్య ఇప్పుడే వచ్చినది కాకపోవచ్చు. కానీ తెలంగాణా రాకతోనే కరువు మీదపడి వచ్చింది. రైతులు మనకాళ్ళ ముందే రాలి పోతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై మాట్లాడనంతకాలం ప్రతిపక్షాలు, ఆంధ్ర మీడియా నానా అల్లరి చేసి రైతుల్లో మరింత మానసిక కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తాయి. తెలంగాణా రాష్ట్రాన్ని విఫలం చేయాలన్న మారీచుల ప్రయత్నాలకు మనం ఆయుధాలివ్వొద్దు. ప్రభుత్వం బోల్డుగా ఈ సమస్యను ఎదుర్కోవాలి. ప్రభుత్వం మాట్లాడడం మొదలుపెడితే ప్రతిపక్షాలు, పత్రికల నోళ్ళు మూతపడతాయి.

1. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలి. ప్రైవేటు అప్పులపై మారటోరియం ప్రకటించాలి.. వ్యవసాయ సంక్షోభ సహాయ నిధిని ఏర్పాటు చేసి ఆపత్కాలంలో రైతులను ఆదుకునేందుకు ఉపయోగించాలి. ఇందుకు పౌర సమాజం నుంచి, కార్పొరేట్ సమాజం నుంచి కూడా నిధులు సమీకరించాలి.

2. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలి.

3. మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణం గ్రామాలను సందర్శించి రైతులకు భరోసా ఇవ్వాలి. పత్రికలూ, ప్రతిపక్షాలు పల్లెల్లో ప్రేరేపిస్తున్న మానసిక కల్లోలాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణా ప్రభుత్వం పూనుకోవాలి.

4. వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటపడేయడానికి తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న దీర్ఘకాలిక చర్యలగురించి ప్రజలకు వివరించాలి.

Hate to be hated

image

Hate is too great a burden to bear. It injures the hater more than it injures the hated.

-Coretta Scott King

I hate to have hatred towards people and region, but I wont hasitate to say a spade a spade.

I feel people cannot be blamed for what their leaders do, either in Telangana or in Andhra. Establishment is different from people.

Whatever I comment on Chandrababu or Jaganmohan Reddy, it cannot be applied to people they represent.

I have great respect towards Andhra and Rayalaseema brothern, for their hardwork, dynamism and hospitality. I was cared by one and all when I was studying at S V University.

Commentary is not like sitting on the wall and commenting on the whole world, but defending an indefensible, pleading on behalf of a deprived society.

These days some people with dupe mails sending me hate mails. I think their love towards Chandrababu or Jagan may provoking them to do so, rather than their love towards their people. Only I can smile at them.

ఏకే-47 చిక్కుముడి వీడిందా? మరింత చిక్కుపడిందా?

AK_47_Banjara_hills_Hyderabad_shooting_650_clean

ఏకే-47 మాయమైన కేసులో చిక్కుముడి వీడినట్టు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. పార్కు వద్ద ఘటనకు సంబంధించి చిక్కుముడి వీడి ఉండవచ్చు. కానీ ఏకే-47 మాయం కావడానికి సంబంధించి మరిన్ని చిక్కుముడులు బయటికి వస్తున్నాయి. పోలీసు బాసుల వ్యవహారంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

1. ఏకే-47 ఎప్పుడో మాయమైతే ఇప్పటిదాకా దర్యాప్తు కానీ, విచారణ కానీ, నివేదిక కానీ లేకపోవడం ఏమిటి? గ్రే హౌండ్సు అధికారులు చడీచప్పుడు లేకుండా ఎందుకున్నారు?

2. పార్కు వద్ద ఘటన జరిగిన రోజు డీజీపీ అనురాగ్్ శర్మ ఏకే-47 మాయమైన ఘటనకు సంబంధించి ఆరుగురిని సస్పెండు చేసినట్టు ప్రకటించారు. తీరా దొంగ దొరికాక ఆయన డ్యూటీలోనే ఉన్నాడని, సెలవుపెట్టి నేరానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. మరి డీజీపీ సస్పెండు చేసింది ఎవరిని? లేదంటే అబద్ధం చెప్పారా? అబద్ధం చెబితే ఎందుకు చెప్పారు? ఎవరిని కాపాడడానికి చెప్పారు?

3. ఏకే-47 పోయిన విషయం ఎవరెవరికి తెలుసు? అప్పుడు గ్రే హౌండ్సు బాసులెవరు? ఈ చోరీపై వారేమి చేశారు?

4. ఈ నిర్లక్ష్యానికి కారణమైన పోలీసులపై ప్రభుత్వం ఇప్పుడేమి చర్యలు తీసుకుంటుందన్నది అసలు ప్రశ్న.

మా పీవీ పేరు మీరు పెట్టుకుంటారా?

assembly-t_1402230513

ఎన్టీఆర్ అందరి మనిషి, ఆయన పేరు పెడితే కాదంటారా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. అందరి మనిషిపై ఆంధ్రజ్యోతి, ఈనాడుల్లో అన్నన్ని అభాండాలు ఎందుకు రాయించావు? అందరి మనిషికి వ్యతిరేకంగా కుట్రచేసి ఎమ్మెల్యేలను, ఎన్టీఆర్ కుటుంబాన్ని నీకు అనుకూలంగా ఎలా పోగేశావు? అందరి మనిషిని అధికారం నుంచి ఎందుకు కూలదోశావు? అందరి మనిషిని గుండెపగిలి చనిపోయేట్టు ఎందుకు వేధించావు? అందరి మనిషిపై వైస్రాయ్ హోటల్ ముందు ఎందుకు చెప్పులు వేయించావు? చావగొట్టి సంతాప సభలు పెట్టడం, చెప్పులు వేసిన చేతులతోనే పాలాభిషేకం చేయించడం, పనికిరాడని చెప్పిన నోటితోనే మా దేవుడు అని చెప్పించడం, వెన్నుపోటును ప్రజాస్వామ్య రక్షణగా చెప్పుకోవడం….ఇవన్నీ చంద్రబాబు బాలశిక్షలోని పాఠాలు. అధికారం కోసం దేశభక్తి నుంచి దేశద్రోహం దాకా ఏదైనా బోధించగల నైపుణ్యం చంద్రబాబుది. అందుకే చంద్రబాబు ఎన్టీఆర్‌కు సర్టిఫికెట్లు ఇస్తే జనం నవ్విపోతారు. ఎన్‌టిఆర్‌ను నాశనం చేసినవాడు, అధికారంలోకి రాగానే ఎన్‌టిఆర్ బొమ్మలన్నీ పీకేయించివాడు ఇవ్వాళ ఆయనపై తనకేదో భక్తి ఉన్నట్టు ప్రకటించుకోవడం కేవలం ఆయన అవసరం కోసమే. ఎన్‌టిఆర్ పేరు చెబితేనే ఇప్పటికీ చంద్రబాబుకు నాలుగు నూకలు దక్కుతున్నాయి. ఆ నూకలు కాపాడుకోవడంకోసమే ఎన్‌టిఆర్‌ను సజీవంగా ఉంచాలని ఆయన ఆశిస్తూ ఉంటారు. ఆయనకు ఎన్‌టిఆర్‌పై మహాగౌరవం ఏదో ఉన్నట్టు ఎవరూ భ్రమపడరాదు. ఆ మాటకొస్తే చంద్రబాబుకు ఎవరిపైనా గౌరవం ఉండదు. తనకు అవసరం ఉన్నంతమేరకే ఎవరితోనయినా సంబంధాలు. తనకు ఉపయోగిపడితేనే ఎవరినయినా చేరదీస్తారు. అవసరం తీరిన తర్వాత ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. మొదట ఎన్‌టిఆర్‌ను, ఆతర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావును, అటుపిమ్మట హరికృష్ణను, ఇప్పుడు చిన్న ఎన్‌టిఆర్‌ను…. ఎవరెవరిని ఎలా మోసం చేస్తూ వచ్చారో అందరికీ తెలుసు. అందువల్ల ఎన్‌టిఆర్‌పై చంద్రబాబు ప్రకటించే గౌరవమర్యాదలను అస్సలు పట్టించుకోనవసరం లేదు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని స్వదేశీ టర్మినలుకు ఎన్‌టిఆర్ పేరును పెట్టించుకోవడం తెలంగాణతో గిల్లికజ్జాలు పెట్టుకునే కుతంత్రలో భాగం. తెలంగాణపై తన ఆధిపత్యాన్ని ప్రకటించుకునే దురహంకారానికి కొనసాగింపు.

ఎన్‌టిఆర్ తెలంగాణకు అవసరమా లేదా అన్నది నిర్ణయించుకోవలసింది తెలంగాణ ప్రజలు. ఎన్‌టిఆర్ తెలంగాణకు ఏం చేశారన్నది తూకం వేసుకోవలసింది తెలంగాణ రాజకీయ వ్యవస్థ. ఎన్‌టిఆర్ తెలంగాణ నాయకులకంటే గొప్పవారేమీ కాదు. విశాలాంధ్రకోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు, భూసంస్కరణలు తెచ్చి ఇక్కట్ల పాలైన పీవీ నరసింహారావు, తెలంగాణ ఉద్యమాన్ని త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ ఉన్నతికోసం పాటుపడిన మర్రి చెన్నారెడ్డిల కంటే ఎన్‌టిఆర్ ఎందులో గొప్ప? అత్యధిక సంఖ్యలో బీసీలకు టిక్కెట్లు ఇచ్చిన పీవీ నరసింహారావు తెలంగాణ రాజకీయాల్లోకి కొత్త నీరును తీసుకువచ్చిన తొలి నాయకుల్లో ఒకరు. ఎన్‌టిఆర్ తెలంగాణకు ఎంత మేలు చేశారో అంత కీడు కూడా చేశారు. తెలంగాణలో అట్టడుగువర్గాలను రాజకీయాలకు చేరువ చేసిన ఎన్‌టిఆర్, ఈ ప్రాంతంలో పరాయీకరణను వేగవంతం చేసినవారిలో కూడా ప్రథముడు. హైదరాబాద్ ఆంధ్ర వలస నగరంగా వేగం పుంజుకున్నది ఎన్‌టిఆర్ హయాంలోనే. తెలంగాణ ఉద్యోగాలు పెద్ద ఎత్తున కొల్లగొట్టబడింది కూడా ఆయన కాలంలోనే. వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలుగు యూనివర్శిటీ, ఓపెన్ యూనివర్శిటీ, జేఎన్‌టీయూతో పాటు అనేక విద్యాసంస్థల్లోకి సీమాంధ్ర నుంచి అనేకమంది ప్రవాహంలా వచ్చి చేరింది కూడా ఎన్‌టిఆర్ ప్రభుత్వంలోనే. ఆ విద్యాసంస్థల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కకపోవడం ఇప్పుడు లెక్కలు తీసినా తెలిసిపోతుంది. ఇంతెందుకు రంగారెడ్డి జిల్లాలో స్థానికేతరులు యాభైశాతం దాటింది కూడా ఎన్‌టిఆర్ పాలనలోనే. ఎన్‌టిఆర్ విడుదల చేశారని చెబుతున్న 610 జీవో కంటి తుడుపు మాత్రమే. ఈ జీవో జారీ చేసిన తర్వాత ఎన్‌టిఆర్ ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. కానీ ఒక్కరిని కూడా తెలంగాణ నుంచి బయటికి పంపలేదు. అసలు ఆ జీవో విషయాన్నే ఆయన మరచిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డిలు తెలంగాణను తమ కాలనీగా మార్చుకున్నారు. హైదరాబాద్‌ను దాదాపు కబ్జా పెట్టారు. వారి ఆధిపత్య పాలనకు వ్యతిరేకంగానే తెలంగాణ సమాజం పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. ఇప్పుడు కూడా వారి ముద్రలు, వారి నీడలు తెలంగాణపై రుద్దడానికి ప్రయత్నించడం విస్మయకరం.

అందరి మనుషుల సిద్ధాంతం కొందరికే ఎందుకు వర్తిస్తుంది? భూసంస్కరణలు ప్రవేశ పెట్టిన తొలి ముఖ్యమంత్రి, దేశాన్ని ఏలిన ఏకైక తెలుగు ప్రముఖుడు పీవీ నరసింహారావు అందరి మనిషి కాలేదెందుకు? విశాలాంధ్రకోసం ముఖ్యమంత్రి పదవిని పరిత్యజించిన బూర్గుల రామకృష్ణారావు అందరి మనిషి కాలేదెందుకు? ప్రత్యేక తెలంగాణకోసం పోరాడిన చరిత్ర ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గోదావరి-కృష్ణా డెల్టా ఆధునీకరణకోసం పాటుపడిన మర్రి చెన్నారెడ్డి అందరి మనిషి కాలేదెందుకు? తెలంగాణ ప్రజలు హైదరాబాద్ రాష్ట్రం విడిగా ఉండాలని కోరుతూ ఉంటే తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలని విశాలాంధ్ర వాదాన్ని భుజాన వేసుకున్న సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, స్వామి రామానందతీర్థ, రావి నారాయణ రెడ్డి వంటి ఎందరో మహామహులు అందరి మనుషులు కాదెట్లా? ఇన్ని చెబుతున్నారే… మా నేతలది ఒక్క విగ్రహమైనా మీ గడ్డపై ప్రతిష్టించారా? మా నాయకుల పేర్లు ఒక్కటైనా మీ సంస్థలకు పెట్టారా? మా యోధుల పేర్లు ఒక్కటయినా మీ వీధులకు పెట్టారా? ఇంతెందుకు మా పీవీ నరసింహారావు పేరు మీ బెజవాడ విమానాశ్రయానికి పెడతారా? మీ పులిచింతల ప్రాజెక్టుకు మా మర్రి చెన్నారెడ్డి పేరు పెడతారా? మీ రాజధానికి కాకతీయ నగరమని పెట్టుకుంటారా? మీరు ఇవేవీ చేయరు. చేయలేరు. ఎందుకంటే ఆక్రమించుకోవడమే కానీ, కలుపుకోవడం మీ స్వభావంలో లేదు. మీకు లేని విశాల హృదయం తెలంగాణ ప్రజలకే ఉండాలని కోరుకోవడం దురాశకాదా? విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం, పేర్లు పెట్టుకోవడం స్వీయ అస్తిత్వ ప్రకటన రూపాలు. తెలంగాణపై మీ ఆధిపత్య ప్రకటనకు ప్రతిరూపంగా మా గడ్డపై మీ నేతల విగ్రహాలు, మా సంస్థలకు మీ నేతల పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు అధికారం మా చేతికి వచ్చిన తర్వాత కూడా మీ ఆధిపత్యమే కొనసాగిస్తారా? ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేయడం కాదా?

సీమాంధ్ర ఆధిపత్య శక్తులు ఒక పథకం ప్రకారం తెలంగాణ చరిత్రను విస్మరణకు గురిచేశాయి. తెలంగాణ నేతల ప్రతిష్ఠను దెబ్బతీస్తూ వచ్చాయి. తెలంగాణ నేతలను ఎప్పటికప్పుడు విలన్లుగా నిలబెట్టే ప్రయత్నం చేశాయి. ముల్కీ నిబంధనలు సమర్థించడం, భూ సంస్కరణలు తేవడం, బీసీలను ఎక్కువ మందిని ప్రోత్సహించడం వంటి ప్రగతిశీల విధానాలు అనుసరించినందుకు పీవీ నరసింహారావుకు వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమం తీసుకువచ్చిన ఘనత ఆంధ్ర నాయకత్వానిది. దేశ ప్రధానిగా పనిచేసినా, ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని కాపాడినా ఆంధ్ర నాయకత్వం పీవీ నరసింహారావును ఏరోజూ గౌరవించింది లేదు. పీవీ అంత్యక్రియల సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సాధన అంతిమ ఘడియల్లో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర నాయకత్వం వ్యవహరించిన తీరు చూసిన తర్వాత మర్రి చెన్నారెడ్డి ఎంత గొప్పవారో అర్థమయింది. చెన్నారెడ్డి తెలంగాణకోసం పోరాడి, ఇందిరాగాంధీని ఎదిరించి 11 స్థానాల్లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులను గెలిపించి, తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షకు తిరుగులేని భూమికను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర అన్నట్టుగా దేశ రాజకీయాలు నడుస్తుండేవి. ఆమెకు ఎదురు చెప్పేవారు లేరు, కేంద్రంలో ఏకధ్రువ ప్రభుత్వం. ఆంధ్ర నాయకులు అప్పుడు కూడా బలిష్టులు. వారందరినీ ఎదుర్కొని నిలబడడమే చెన్నారెడ్డి సాధించిన విజయం. మరి ఇప్పుడు- కేంద్రంలో ప్రభుత్వం మిశ్రమ ప్రభుత్వం, అత్యంత బలహీనమైన కేంద్రం అయి ఉండి నాలుగేళ్లపాటు తెలంగాణపై అడుగుముందుకు వేయకుండా నిలువరించగలిగారు సీమాంధ్ర నాయకులు. ఇప్పుడే ఇంతగా ప్రతిఘటించారంటే 1970లలో ఎలా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ సమాజం అంతా చెన్నారెడ్డిని ద్రోహి అనుకునేలా చరిత్ర రచన జరిగింది. మన నాయకులను చిన్నవాళ్లుగా చూపించి, తమ నాయకులను పెద్దవాళ్లుగా చూపించే కుట్ర అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. చంద్రబాబును గొప్పగా చూపించడం, కేసీఆర్‌పై విష ప్రచారాలు చేయించడం ఇందులో భాగమే. ఆంధ్ర పార్టీల ఏజెంట్లు, ఆంధ్ర మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఈ దృష్టితోనే చూడాలి. ఆంధ్ర ముద్రలను మనపై రుద్దే ఇటువంటి శక్తులను ఏదోరకంగా వదిలించుకోవడం తప్ప మనకు మరో గత్యంతరం లేదు.

Kaleshwaram: A spiritual and mythological place to visit

One of the Thrilinga’s

Its an abode of Kaleshwara Mukteeshwara Swamy, one among Thrilinga’s, which is original source for Tilinga and Telangana… It is the site of a temple of the Hindu god Lord Shiva. The temple is significant because of the two Shiva Lingas that are found on a single pedestal. These Linga are named Lord Shiva and Lord Yama. Collectively, they known as Kaleshwara Mukteswara Swamy. Kaleshwaram is one of three Shiva temples mentioned in Trilinga Desham “Land of Three Lingas.”

FullSizeRender_1

Thriveni Sangamam

Kaleshwaram is located exactly at the merging point of the Godavari River and its tributary, the River Pranahita. People believe that there is another river named saraswathi flowing under godavari and pranahita,therefore calling the meeting point as Triveni(three) Sangamam (Confluence). Kaleshwaram is center for pushkaras which are organised once for every 12 years. Saraswathi pushkaras took place in 2013 summer and godavari pushkaras are about to take place in 2015. All the 365 days fresh waters from Pranahitha flows here.

One can visit Kaleshwaram via Warangal, Parkal, Bhupalapalli, Mahadevpur or Via Karimnagar, Peddapalli, Manthanai, Mahadvepur.