ఏది నైతికబలం? ఏది మందబలం?

తెలంగాణ గెలిచింది. గెలుస్తుంది. కుట్రలు, కుతంత్రాలు, మెజారిటీ అప్రజాస్వామిక దాష్టీకాలను జయించి రాష్ట్ర విభజన బిల్లు ఢిల్లీకి వెళ్లింది. మందబలం ముందు నైతిక బలం విజయం సాధించింది. అడ్డదారిలో దొడ్డిదారిలో ఒక నోటీసుపై సభలో ఓటింగు పెట్టి, అది గెలిపించుకున్నామనిపించుకుని, తెలంగాణ ఏర్పాటుకు నైతికత లేదని చెప్పేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, ఆయన వందిమాగధ మీడియా మూకలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ బిల్లు పార్లమెంటులో నిలువదని నిపుణుల అభిప్రాయాల పేరుతో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు ఈ క్షణంలో కూడా ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, స్పీకర్ మనోహర్‌కు తెలంగాణ ప్రజలు ధన్యవాదాలు చెప్పుకోవాలి. వారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ బిల్లు విజయవంతంగా ఢిల్లీ వెళ్లడానికి సహకరించారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఉండవచ్చు. అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసి ఉండవచ్చు….రాష్ట్రపతిపాలన విధించేదాకా పరిస్థితి తీసుకెళ్లి, బిల్లును ముందుకు నడువకుండా చేసి ఉండవచ్చు…..ఇంకా అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నా వాటి జోలికి వెళ్లకుండా ముఖ్యమంత్రి పదవిని అంటిపెట్టుకుని బిల్లుపై చర్చ పూర్తి చేయడానికి సహకరించి, చివరికి ఒక తీర్మానం చేయించి ఢిల్లీకి పంపేందుకు సహకరించారు ఆయన. స్పీకర్ కూడా కట్టె విరగకుండా పాము చావకుండా తెలంగాణకోసం చర్చ జరిగింది, ఆంధ్రకోసం తీర్మానం జరిగింది అని అనిపించి కథ ముగించారు. ఈ తీర్మానంతో బ్రహ్మాండం బద్దలయిపోతుందని సీమాంధ్ర మీడియా ‘తిరస్కారం’ అన్న దాన్నే ఎక్కువ చేసి చూపించి, బిల్లుకు నైతికత లేదని, ఉండదని, కోర్టుల్లో నిలవదని అనిపించేందుకు ప్రయత్నిస్తున్నది. వాస్తవం ఏమిటి? నైతికబలం ఎటువైపు ఉంది?
image

మొదటిది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో 50 రోజులపాటు చర్చ జరిగింది. 87 మంది సభ్యులు 50 గంటలపాటు బిల్లుపై చర్చించారు. దాదాపు అందరు సభ్యులూ లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇవన్నీ సభ రికార్డుల్లో ఉన్నాయి. సభలో చర్చను ముగించి ఈ మొత్తం సమచారాన్ని కేంద్రానికి పంపుతున్నట్టు స్పీకర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది బిల్లుకు లభించిన అంతిమ నైతిక విజయం.

రెండవది, శాసనసభ ఆమోదించినట్టుగా చెబుతున్న నోటీసు ప్రభుత్వం ఇచ్చింది కాదు. అది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యక్తిగతంగా ప్రతిపాదించింది. ప్రభుత్వం నోటీసు ఇవ్వాలంటే అది కేబినెట్‌లో చర్చించి తీర్మానించి ఉండాలి. ఈ నోటీసుకు కేబినెట్ తీర్మానం లేదు. కేబినెట్ తీర్మానం లేని నోటీసు లీగల్‌గా చెల్లదు. ముఖ్యమంత్రి ఒక ప్రాంతీయ నాయకుడిగా ప్రతిపాదించిన నోటీసు అది. సభా సంప్రదాయాల ప్రకారం స్పీకర్ వాస్తవానికి ఇటువంటి నోటీసును అనుమతించకూడదు. రాష్ట్రపతి నివేదించిన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు మధ్యలో ఇటువంటి తీర్మానాలు వస్తే తిరస్కరించాలి. మౌఖికంగాను, లిఖితపూర్వకంగానూ సభలో సభ్యులంతా తమ అభిప్రాయాలను చెప్పడానికి అవకాశం ఉన్నప్పుడు మళ్లీ ఇటువంటి తీర్మానం అనుమతించి ఉండకూడదు. కానీ స్పీకర్ కూడా ప్రాంతీయ ఒత్తిళ్లకు తలొగ్గి సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారు. అందువల్ల ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసుకు గానీ, సభలో చేసిన తీర్మానానికిగానీ ఎటువంటి నైతికత లేదు. మెజారిటీ ఆధిపత్యం ఉన్న సభలో తీర్మానం నెగ్గకుండా ఎలా ఉంటుంది? ఆ విషయం కేంద్రానికి, రాజ్యాంగ నిపుణులకు తెలియదా?

మూడవది, తెలంగాణ ఏర్పాటుకు కాన్సెన్సస్ లేదని ముఖ్యమంత్రి నోటీసులో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లభించినంత రాజకీయ కాన్సెన్సస్ ఏ రాష్ట్ర విభజనకు లభించలేదు. కాన్సెన్సస్ అంటే ‘విస్తృతాంగీకారం లేదా మెజారిటీ అంగీకారం’. ఏకగ్రీవ అంగీకారం కాదు. ఒక్క సిపిఎం తప్ప రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక సందర్భంలో తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించాయి. అభ్యంతరం లేదని చెప్పాయి. కాంగ్రెస్, బిజెపి, టీడీపీ, పీఆర్‌పీ, సిపిఐ మేనిఫెస్టోల్లో రాసుకున్నాయి. వైసీపీ తీర్మానం చేసింది. లోక్‌సత్తా తమకు కూడా అభ్యంతరం లేదని చెప్పింది. 2009 డిసెంబరులో అన్ని పార్టీల శాసనసభా పక్షాల నాయకుల సమావేశం తెలంగాణ ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ తీర్మానం చేసింది. కాంగ్రెస్ శాసనసభా పక్షం తెలంగాణపై అంతిమ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం చేసింది. తెలంగాణపై కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి స్వయంగా అనేకసార్లు ప్రకటించారు. ఇక జాతీయ స్థాయిలో పార్లమెంటులో దాదాపు 400 మంది సభ్యుల బలం ఉన్న 3 రాజకీయ పక్షాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా లేఖలు ఇచ్చాయి. తెలంగాణకు ఇంతకంటే నైతిక బలం ఏం కావాలి? కోర్టులో న్యాయం కోసం కొట్లాడడానికి ఇవన్నీ చాలవా?

నాలుగవది, మెజారిటీ ప్రాంతాల దాష్టీకానికి మైనారిటీ ప్రాంతాలు బలికాకూడదన్న ఉద్దేశంతోనే రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల ఏర్పాటు అధికారాన్ని కేంద్రానికి అప్పగించారు. మెజారిటీ ప్రాంతాలు తాము అనుభవిస్తున్న వసతులు, వనరులు, ప్రయోజనాలను వదులుకోవడానికి సిద్ధపడవని, విభజన సమస్యను రాష్ట్రాలకు వదిలేస్తే మైనారిటీ ప్రాంతాలు ఎప్పటికీ స్వేచ్ఛను అనుభవించలేవని రాజ్యాంగ రచయితలు అప్పుడే భావించారు. ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష, దానికి మద్దతుగా ప్రారంభమైన పార్లమెంటరీ ప్రక్రియ మందబలం ముందు ఓడిపోతే ప్రజాస్వామ్యానికి అవి అంతిమ ఘడియలు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. బలవంతంగా కలిపి ఉంచడం కాదు, స్వచ్ఛందంగా కలిసి జీవించడం సమాఖ్య స్ఫూర్తి.

ఐదవది, అసెంబ్లీ తీర్మానాలతో నిమిత్తం లేకుండా కేంద్రం నిర్ణయాలు చేయడం ఇదే మొదలు కాదు. ఇప్పటివరకు 1 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రతి సందర్భంలో ఏదో ఒక వివాదం రావడం, కోర్టులు తీర్పులు ఇవ్వడం జరుగుతూనే ఉంది. మహరాష్ట్ర, గుజరాత్ విభజన సందర్భంగా మూడు రాష్ట్రాల(బొంబాయి, మహారాష్ట్ర, గుజరాత్) ఏర్పాటు బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ చర్చించి పార్లమెంటుకు పంపింది. కేంద్రం ఆ బిల్లును పక్కనబెట్టి అంతిమంగా రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తూ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించి ఆమోదింపజేసింది. పంజాబ్ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కంటే ఓవరాక్షన్ చేశారు. ఇందిరాగాంధీ అక్కడి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి, రాష్ట్రపతి పాలన విధించి రెండు మాసాల్లో రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేసింది. రాష్ట్ర విభజన విషయంలో అంతిమ నిర్ణయం కేంద్రానిదేనని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి తీర్మానానికి ఎటువంటి విలువాలేదు, సీమాంధ్రలో పాలాభిషేకాలు జరుగడం తప్ప.

ఆరు, ముఖ్యమంత్రి ఏ నైతిక విలువలు లేని వైరుధ్యాల పుట్ట. రాష్ట్రపతి ఆరువారాల సమయం ఇచ్చారు. దానిని వృధా చేయడమే కాకుండా మళ్లీ సమయం పొడిగింపు కోరారు. రాష్ట్రపతి మరో వారం గడువు ఇచ్చారు. మొత్తం ఈ యాభై రోజుల్లో కనీసం నాలుగైదుసార్లు గంటలు గంటలు మాట్లాడారు. ఒకవైపు చర్చ జరుగుతుండగానే మళ్లీ సమయం పొడిగించాలని కోరారు. ఆ లేఖ ఢిల్లీ చేరకముందే బిల్లును తిరస్కరించాలని నోటీసు ఇచ్చారు. ఇదంతా ఒక ప్రభుత్వానికి నాయకునిగా కాదు, కేవలం ఒక వ్యక్తిగా. చివరకు నోటీసుపై తూతూ మంత్రంగా తీర్మానం చేయించారు. ఇదంతా అసెంబ్లీ రికార్డుల్లో భద్రంగా ఉంది. ఇది నీతి అంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు.

సీమాంధ్ర నాయకత్వం చేస్తున్నవాదనలేవీ న్యాయ పరీక్షకుగానీ, ప్రజాస్వామ్య పరీక్షకు గానీ నిలబడలేవు. వారు చెబుతున్నదాంట్లో నీతిలేదు, నిజం లేదు. తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే సమయం ఆసన్నమైంది. సీమాంధ్ర రాజకీయ ఆర్థిక ఆధిపత్యం నుంచి విముక్తిపొందే తరుణం సమీపిస్తున్నది. ఇంతదూరం వచ్చిన తర్వాత ఇక ఎవరూ తెలంగాణను ఆపలేరు. ఆపే ప్రయత్నం చేసినవారెవరూ తెలంగాణలో రాజకీయంగా బతికిబట్టకట్టలేరు. న్యాయం, ధర్మం మన పక్షాన ఉన్నాయి. విజయం కనుచూపు మేరలో ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు.

సీమాంధ్ర మీడియా గంగవెర్రులు

తెలంగాణపై
నిర్ణయమే రాదన్నారు. నిర్ణయం వచ్చింది.

కేబినెట్‌నోట్ ఉండదన్నారు. నోట్ వచ్చింది.

బిల్లు రూపొందదన్నారు. బిల్లు రూపొందింది.

బిల్లు అసెంబ్లీకి రాదన్నారు. అసెంబ్లీకి వచ్చింది.
Head-in-Sand

బిల్లు తిరిగి వెళ్లదన్నారు. తిరిగి వెళ్లింది.

బిల్లును తిరస్కరించారని చెబుతున్నారు. చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించారు.

పార్లమెంటుకు వెళ్లదంటున్నారు. పార్లమెంటుకు వెళుతుందని జీవోఎం సభ్యుడు వీరప్ప మొయిలీ ప్రకటించారు.

కిందపడ్డా పైచేయి మాదేనని చెప్పడానికి సీమాంధ్ర మీడియా కుప్పిగంతులు వేస్తూనే ఉంది.

అక్కసు, ఆక్రోషం తలకెక్కిన సీమాంధ్ర మీడియా రేపేమి చేస్తుందో, ఏమి చెబుతుందో చూద్దాం!

తిరస్కార తీర్మానం అడ్డంకి కాదు: మొయిలీ

Sakshi | Updated: January 30, 2014 16:19 (IST)
తిరస్కార తీర్మానం అడ్డంకి కాదు: మొయిలీ

2nd lead moily
న్యూఢిల్లీ: విభజన బిల్లు తిరస్కార తీర్మానంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు వీరప్ప మెయిలీ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తిరస్కార తీర్మానం తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకి కాబోదని మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్నారు.

తెలంగాణ ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే కోరామని తెలిపారు. ఓటింగ్ గాని, తీర్మానం గాని కోరలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు సవరణలు చేసి పార్లమెంట్‌లో పెడతామని వీరప్ప మెయిలీ తెలిపారు. అసెంబ్లీ తెలంగాణ బిల్లు ఓడిపోలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.

Ethical Telangana, Unethical Assembly

Rejection won’t matter
Unethical and arrogant mind of a Chief Minister

1. The resolution, proposed by Chief Minister Kirankumar Reddy, did not get Cabinet approval. Chief Minister as an individual moved the resolution, which did not legal sanctity. He did not followed proper procedure to bring a resolution, but Speaker under pressure, put it to vote.
image
2. Assembly resolution won’t make any difference. President, only seek assembly opinion. According to Article 3 of Constitution of India final authority on the division of state is rest with Parliament. On this issue earlier judgments are in place. Central Government kept aside the Bill considered by Maharashtra assembly and introduced a fresh Bill in Parliament and got approval.

3. Government of India and all political parties at Centre know that Telangana issue got political consensus and passed through all the due legal processes. Only political bankruptcy of Andhra leaders and their parties, made situation complicated.

4. So far 18 states were formed. Same process was followed by the Centre in regard of Andhra Pradesh division. The question is not the procedural failure of the Centre, its nascent and ugly face of Seemandhra hegemony creating problems.

5. Election manifestos of all parties(Congress, TDP, PRP, YCP, CPI, BJP), all party legislature party leaders unanimous resolution, more than 35 political parties letters in support of Telangana formation, APCC resolution handing over the decision on Telangana to High Command….these are the evidences for political consensus.

6. Ethical questions must be asked about the behavior of hegemony, not about assembly resolution. If a brutal majority in the Assembly can stall the democratic process began by federal Government? Is our federal system is going to allow a minority region to suffer at the hands of majority rule?

7. Ethical questions must be asked on the contradictions of Kirankumar Reddy and his establishment. President gave four weeks time. He wasted it and asked for further extension. He did not know then that Bill is not eligible for consideration. He spoke all the non sense (burning more than three hours) about the Bill during those 40 days and then asked further time. President gave further week days. He spoke again and again. Few days ago he wrote another letter seeking further extension. Finally this notice and resolution. Now, one can understand the state of mind of a Chief Minister and his ethical status.

తెలంగాణదే అంతిమ విజయం

ఆంధ్రప్రదేశ్‌కు అంతిమ సంస్కారం
మెజారిటీ దాష్టీకానికి చరమగీతం
అసెంబ్లీ తీర్మానంతో ఒరిగేదేమీ లేదు

అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు మద్దతు లేదని కేంద్రానికి ముందే తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు, జయప్రకాశ్‌నారాయణ్, స్పీకర్ మనోహర్ ఇత్యాది ఆధిపత్యవాదులంతా కుమ్మక్కయి తీర్మానం చేసినట్టు ప్రకటించుకున్నారు. దీనికి పెద్దగా విలువలేదు. స్పీకర్ ఓటింగ్ విషయంలో సీమాంధ్ర నాయకత్వానికి సహకరించినా బిల్లుపై చర్చ ముగిసిందని ప్రకటించారు. తెలంగాణకు సీమాంధ్ర నాయకులు పీడ విరగడయింది.

End of the Majority tyranny

The establishment which created problems to the formation of Telangana state since last ten years, now accusing Centre of hurriedly bringing the bill. If Seemandhra leaders are ready to dialogue, why not they used 50 days time? Dialogue cannot work with obstructionists.

When Chief Minister and Opposition leaders came obstructionists, How can you find fault with Ministers rushing in to the Assembly well? Devils preaching sermons?

Dhed dhamak, half bill

Reactions and responses

‘Now everyone in Telangana and Delhi understood that how Seemandhra leaders habituated and looted Telangana. Their harakiri and their undemocratic behaviour proved that how Telangana is suffering at their hands.’

‘Dhed dhamak waalonko full bill Kaisa diktha? Kabhee half bill bolthe, kabhee duplicate bill bolthe aur kabhee draft bill bolthe…ye pagal hai kyah? abtak attarah states banaa hua… A nayaa hai kyah? Ye jane Delhiwaalonse jaadaa smajtha kyah?’
images
‘Intha thondi manushulanu, intha neethileni manushulanaa Manam inthakalam mana nayakulugaa moshaamu? Veella peeda viragadayyedaakaa Telanganaku musthi ledu’

‘We are in the last leg of United Andhra Pradesh. Everything is moving in right direction.now nobody can stop Telangana. They are trying to provoke and create law and order problem. Restraint is the need of the hour. Be united and shunt out the Seemandhra leadership’.

‘Political freedom from Seemandhra leadership is real freedom for Telangana. If somebody depends on B forms and election funding from Seemandhra leadership, it means they are surrendering their freedom to the other region’.

GoM on Telangana to meet next week

image

PTI
In this file photo, Union Home Minister Sushilkumar Shinde chairs a meeting of Group of Ministers on Telangana in New Delhi. The group will meet in the first week of
Centre will decide on A.P. Chief Minister N. Kiran Kumar Reddy’s demand for an extension of deadline for returning the Andhra Pradesh Reorganisation Bill.

The Group of Ministers on Telangana will meet in the first week of February to decide on Centre’s next course of action after Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy sought extension of the deadline for discussing and returning the Andhra Pradesh Reorganisation Bill.

The GoM, set up to look into the bifurcation of Andhra Pradesh, is likely to meet on February 4 to articulate the government’s view for recommending to President Pranab Mukherjee the next course of action, official sources said.

The GoM is headed by Home Minister Sushilkumar Shinde.

The move comes after the Chief Minister on Tuesday wrote to the President seeking extension of the January 30 deadline during which the Andhra Pradesh Assembly will have to discuss and return the Andhra Pradesh Reorganisation Bill to the Central government with or without its view.

However, experts are of the opinion that whatever the Assembly does, Parliament can go ahead with its legislative process for creation of the new state.

The President initially gave time till January 23 to the state Legislature to discuss the Bill and return it but subsequently extended the deadline till January 30 after the Andhra Pradesh government sought four weeks extension.

On Tuesday, Mr. Reddy has said he has written the letter to the President but did not specify how much time was sought.

But, sources close to him said an additional three weeks were sought by the state government.

Mr. Reddy’s move came after the Seemandhra ministers and MLAs at a meeting with him decided to seek additional time citing frequent disruptions in the Assembly.

So far only about 90 MLAs, including the Chief Minister, have spoken on the Bill and expressed their views while some others gave their opinion in writing.

But most of the Assembly time was lost in disruptions by either the Seemandhra or the Telangana legislators on one demand or the other.

There is no immediate indication what would be the GoM’s next course of action as the government has already declared its intention to table the Telangana bill in the coming session of Parliament beginning February 5.

“We are clear in our mind that the Telangana bill will be brought in this session of Parliament. It is a commitment we have made,” Mr. Shinde had said.

Parliament session commences on February five and is scheduled to end on February 21. This will be the last session of Parliament before the tenure of the UPA-II comes to an end.

The Union Cabinet had on December 5 given the go-ahead for the creation of a 10-district Telangana and outlined the blueprint for carving out the country’s 29th state.

Telangana will comprise 10 districts and the rest of Andhra Pradesh will consist of 13 districts. Hyderabad will remain the common capital for both the states for a period not exceeding 10 years.

The Andhra Pradesh Chief Minister has stoutly opposed the proposed bifurcation of the state and said it would be detrimental to all regions.

Mr. Reddy, who had openly opposed the Congress Working Committee’s July 30 resolution to split Andhra Pradesh and create Telangana, spoke on the floor of the House what he had been saying in public in the last seven months.

“Our CWC has taken a decision, but I am totally opposing it. It’s not in the interest of anyone,” he said.