శ్రీశైలం ఆక్రమణ కథ

కట్టా మీఠా

45767212

ఆక్రమణలను క్రమబద్దీకరించుకోవడంలో సీమాంధ్ర నాయకత్వానికి ఉన్న తెలివితేటలు అన్నీ ఇన్నీ కాదు. శ్రీశైలం రిజర్వాయర్‌ది ఒక ఆక్రమణ కథ. శ్రీశైలం రిజర్వాయరును విద్యుదుత్పత్తికోసం నిర్మించారని అందరికీ తెలుసు. కానీ దానిని క్రమంగా సాగునీటి ప్రాజెక్టుకిందకు మార్చిన విధానం, ఇప్పుడు మాట్లాతున్న తీరు చూస్తే విస్మయం కలుగుతుంది. శ్రీశైలం రిజర్వాయరు నుంచి రాయలసీమకు తాగునీరు, సాగునీరు ఇచ్చే అంశం ఏనాడూ ఎజెండాలో లేదు. అయితే అది పూర్తయ్యే నాటికి అంత పెద్ద రిజర్వాయరు నుంచి ఎంతో కొంత ఉపయోగించుకోకపోతే ఎలా అన్న వాదన వచ్చింది. కరువుతో అలమటిస్తున్న రాయలసీమ ప్రాంతానికి 19 టీఎంసీలు, నల్లగొండ జిల్లాకు 30 టీఎంసీలు ఇవ్వాలని 1980లలో ఆలోచన చేశారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టులపై తీర్మానం చేశారు. ఇందుకోసం 11000 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడిగట్టు కాలువ(పోతిరెడ్డిపాడు), ఎడమగట్టు కాలువలు నిర్మించాలని తలపెట్టారు. దీనితోపాటు తమిళనాడుకు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు 29 టీఎంసీల తాగు నీరివ్వడంకోసం తెలుగుగంగ కాలువను తవ్వాలని ఆ తర్వాత మరో తీర్మానం చేశారు. తెలుగు గంగ కాలువ ద్వారా తమిళనాడుకు 15 టీఎంసీల నీరు ఇవ్వాలని అందులో 5 టీఎంసీలు ఆంధ్ర నుంచి మరో ఐదేసి టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్ర వాటాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. కుడిగట్టు కాలువ, తెలుగుగంగ కాలువ అప్పుడే మొదలుపెట్టి 1995 నాటికే పూర్తి చేశారు. ఎడమగట్టు కాలువ అప్పటికీ ఇప్పటికీ పూర్తి కాలేదు…

View original post 625 more words

శ్రీశైలం రిజర్వాయరు కబ్జా

కట్టా మీఠా

pottiredupadu

ఎన్ని ప్రాజెక్టులు? ఎన్ని నీళ్లు? ఎంత దోపిడీ?
తెలంగాణ ప్రాజెక్టులపైనే ఎందుకీ ఏడుపు?

ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రలో ఏవైనా ప్రాజెక్టులు ప్రతిపాదించినపుడు మీడియాకు వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలుకాకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు కనిపించేవి. తెలంగాణ ప్రాజెక్టుల ప్రస్తావన వస్తే మాత్రం కృష్ణా, గోదావరి నదులు ఎండిపోయి నీళ్లు లేక దీనంగా కనిపించేవి. అడవులు అడ్డుపడేవి. కొండలు ఆపేసేవి. మాది ఎడారి ప్రాంతం అని దబాయించే రాయలసీమకు ఉమ్మడి రాష్ట్రంలో వారికి హక్కు ఉన్న తుంగభద్ర, కేసీ కెనాల్ కాకుండా హక్కులు లేని శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగా అనేక ప్రాజెక్టులు నిర్మించారు. సీమ మొత్తం ఎక్కడపడితే అక్కడ డజన్ల కొద్దీ రిజర్వాయర్లు కట్టుకున్నారు. పోతిరెడ్డిపాడునుంచి 450 టీఎంసీల నీటిని తరలించేలా సామర్థ్యం పెంచుకున్నారు. ఇవాళ కృష్ణ నీరు పోతిరెడ్డిపాడు నుంచి తెలుగుగంగ కాలువ పేర తమిళనాడు పూండి దాకా అడవులు, నదులు, కొండలు, గుట్టలన్నీ ఛేదించి బిరాబిరా వెళ్లిపోతున్నది. హంద్రీనీవా ఆరు వందలకు పైగా కిలోమీటర్ల దూరం నదులను దాటేసి అనంతపురం జిల్లాదాక అలవోకగా వెళుతున్నది.

తెలంగాణలో ఏదైనా ప్రాజెక్టు చేపడుతున్నామనగానే సీమాంధ్ర నాయకత్వం, మీడియా వందరకాల ప్రశ్నలు లేవనెత్తుతారు. సాధ్యాసాధ్యాలపై చర్చ చేస్తారు. నీటి హక్కుల గురించి మాట్లాడతారు. పరివాహక హక్కులను గుర్తు చేస్తారు. అనుమతులున్నాయా అని ఆరాలు తీసారు. కృష్ణానది నీటి వినియోగం విషయంలో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు జరిగిన అన్యాయం గురించి అర్థం చేసుకోవాలంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి…

View original post 815 more words

వాన కష్టం, వాన ఇష్టం

హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల ముంపు బాధలు, అక్కడక్కడా పంట నష్టాలు తప్ప ఈ వర్షాలు ఎక్కువమందికి హర్షాన్నే మిగిల్చాయి. కాలం దాటిపోయింది. ఈసారి ఇక నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ నిండవేమో అని దిగులుగా ఉండె. మరోసారి కరువు దాడి చేస్తుందేమోనన్న భయం ఉండె. ఈ వానలు ఆ భయాలన్నింటినీ దూరం చేశాయి. శ్రీరాంసాగర్ నిండడమే కాదు, మొత్తం గేట్లు ఎత్తి కిందికి వదలాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీశైలంకు భారీగా వరద వస్తున్నందన అది కూడా నిండటం తథ్యం. ఇంకా సీజను ఉంది కాబట్టి నాగార్జున సాగర్‌కు కూడా నీరు వచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయి. సింగూరు, మంజీర నిండటం, అలుగులు పోయడం ఒక కొత్త చరిత్ర. నిజాంసాగర్‌కు వరద పోటెత్తడం మరో చరిత్ర. మిషన్ కాకతీయలో పూడికలు తీసి, కట్టలు పోసుకున్న వేలాది చెరువులు నిండాయి. వరుసగా పదేళ్లు కరువు మండలాలుగా ఉన్న చోట్ల కూడా ఈసారి అన్ని చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. 

చెరువులను మనం కబ్జా చేస్తే చెరువులు మనలను కబ్జా చేయవా? అని గత రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో కొందరు లోచనాపరులు ప్రశ్నిస్తున్నారు. పౌరులు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రశ్న వేస్తే కష్టం వేసే మాట నిజం. కానీ కష్టానికి కారణాలను తెలుసుకోవడం, వాటిని పరిహరించడానికి మార్గాలను అన్వేషించడం ఇప్పుడే చేయాలి. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దానిని వంగదీయాలి. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడే దానికి పరిష్కారాలు మొదలుపెట్టాలి. కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిన్న నిజాంపేట ప్రాంతంలో పర్యటించి అక్కడి జనంతో మాట్లాడుతుంటే చాలా కృతకంగా, నాటకీయంగా కనిపించింది. పాపాలభైరవులు పరామర్శలకు వచ్చినట్టుగా అనిపించింది. తెలుగుదేశం నాయకుడు రేవంత్‌రెడ్డి ఒక్కరోజు వచ్చి రోడ్డుపై ధర్నా చేసి పత్రికలకు వార్తలిచ్చి తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఒక్కరే హేతుబద్ధంగా, పెద్దమనిషిగా మాట్లాడారు. హైదరాబాద్‌లో ఇటువంటి పరిస్థితి రావడం ఇదే మొదలు కాదు. టీడీపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇటువంటి సమస్యలనే ఎదుర్కొన్నారు. 1999లో, 2009లో, ఇంకా వేర్వేరు సందర్భాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం చూస్తూనే ఉన్నాం. అయినా నగరాన్ని బాగు చేయడానికి, చెరువులు, నాలాలు కాపాడటానికి, వరద సాఫీగా వెళ్లడానికి, డ్రైన్లు, నాణ్యమైన రీతిలో రహదారుల నిర్మాణానికి ఏ ప్రభుత్వమూ ప్రయత్నించలేదు. చెరువుల కబ్జాలు, నాలాల కబ్జాలు యథేచ్ఛగా కొనసాగాయి. ఈ లేఅవుట్లు ఎవరు వేశారో, అందులో బహుళ అంతస్థుల భవనాలు ఎవరు నిర్మించారో, లక్షలాది మంది మధ్య తరగతిని ఆ కూపంలో ఎవరు ఇరికించారో అందరికీ తెలుసు. వందలాది చెరువులు, కుంటలు మాయమ్యాయి. భూ రికార్డులు నాశనం చేశారు. రెవెన్యూ కార్యాలయాలు తగులబెట్టారు. నాలాలపై నిరాటంకంగా భవంతులు వెలిశాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హైదరాబాద్‌లో ఈ భూదందాలకు అడ్డుకట్ట మొదలయింది. కబ్జాల బాగోతాలు మందగించాయి. ముఖ్యమంత్రి స్వయంగా హైదరాబాద్‌లోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఖాళీ భూముల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. చెరువుల మరమ్మతులు కూడా చేశారు. రోడ్లకు శాశ్వత ప్రాతిపదికన చికిత్స చేయడానికి ప్రయోగాత్మకంగా వైట్ టాప్ రోడ్లను పరీక్షించి చూసిన ప్రభుత్వం ఇదే. కనీసం ఇరవై ఏళ్లపాటు మన్నిక ఉండే రోడ్లను నిర్మించడానికి జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందించడం కూడా ఇదే ప్రథమం. హైదరాబాద్‌ను దీర్ఘకాలిక దృష్టితో బాగుచేయాలని నాయకత్వం మనసుపెట్టి ఆలోచించింది కూడా ఈ రెండేళ్లలోనే. తారు రోడ్లు, తాలు రోడ్లు వేసి ఎప్పటికప్పుడు కాంట్రాక్టులు, ఆదాయాలకు అలవాటు పడిన వ్యవస్థను రూపుమాపాలని పురపాలక మంత్రి కేటీఆర్ చెప్పినప్పుడు కొందరు కాంట్రాక్టర్లు బయట వాపోయారు. తారు రోడ్లు వేయడం కోసం మేము చాలా చాలా యంత్రాలు కొన్నాం. చాలా వ్యవస్థ ఏర్పాటు చేసుకు న్నాం. ఇప్పుడు వద్దంటే ఎలా అని కాంట్రాక్టర్లు అధికారుల వద్ద గొడవకు దిగిన విషయాలూ తెలుసు. ఇదంతా జరుగుతుండగానే ఈసారి వరుణుడు తెలంగాణను కరుణించాడు. నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు కురవడం, అదీ ఎక్కువ వర్షపాతాలు నమోదు కావడం ఇటీవలి చరిత్రలో ఇదే ప్రథమం. ప్రాజెక్టులపై నిర్మించిన భారీ రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండి తెలంగాణ అంతటా హర్షామోదాలు వ్యక్తం అవుతుంటే, నగరంలో మాత్రం వరద ముంపు తీవ్రత అనుకోకుండా ఒక్కసారిగా మీదపడింది. దీంతో మునుపటికంటే సమస్య తీవ్రంగా బయటపడింది. తెలంగాణ ప్రభుత్వం తన అభివృద్ధి ప్రణాళికలకు తుది రూపు ఇచ్చే దశలో ఈ సమస్య తీవ్రంగా ముందుకు రావడం- కష్టం, నష్టం, బాధలు మిగిల్చినా- ఒక విధంగా మేలు చేసింది. ఈ నగరానికి ఎటువంటి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలో మరింత లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం కలిగింది. ప్రణాళికలు అమలయ్యేదాకా ప్రజల కష్టాలు ఆగవు కదా. అందుకే తక్షణ సాయం అందించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, మొత్తం అధికార యంత్రాంగం మునుపెన్నడూ లేని విధంగా నగరంలో తిరుగుతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అనక కష్టపడుతున్నారు. జనానికి భరోసా ఇస్తున్నారు. ఎక్కడికక్కడ వీలైన మేరకు సహాయం అందిస్తున్నారు. కొన్నిచోట్ల యుద్ధ ప్రాతిపదికన నాలాలు వెడల్పు చేసి నీటిని కిందికి పంపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆహారం, పాలు, ఇతర నిత్యావసర సరుకులు కూడా అందజేస్తున్నారు. ఇంత సంక్షోభంలోనూ విద్యుత్ కోతలు లేకుండా చూస్తున్నారు. పనిచేసే ప్రభుత్వం, స్పందించే ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదు. ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు ప్రభుత్వం రెండురోజుల పాటు సెలవులు ప్రకటించడం వల్ల నగరంలో ప్రాణనష్టం ఎక్కువ గా జరుగకుండా నివారించగలిగింది. మునుపెప్పుడయినా పురకపాలక మంత్రు లు ఇంతగా నగరంలో పర్యటించిన చరిత్ర ఉందా? పురపాలకశాఖ మంత్రి ఎవరో తెలియకుండానే కాలం గడిచిపోయిన సందర్భాలు ఎక్కువ. కేటీఆర్ ఆ చరిత్రను తిరగరాస్తున్నారు. దీనికంతటికీ మన రాష్ట్రం, మన నగరం, మన ప్రజలు అన్న భావనే ప్రేరణ. ఆత్మతో పనిచేసే తత్వమే నాంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి కొంతసమయం పట్టవచ్చు. ఈ నగరానికి మరోసారి ఈ తిప్పలు రానివ్వబోమని, ఒక్క ఏడాది కాలంలో చాలా మార్పులు చూస్తారని కేటీఆర్ ఇచ్చిన భరోసా చాలా మందికి నచ్చింది. ఈ ఆపదను ఒక సవాలుగా, ఒక పరీక్షగా పరిగణించి ఎదుర్కొంటామని ఆయన చెప్పిన మాటలు చాలా మందికి నమ్మకాన్ని కలిగించాయి. ఈ నగరం తప్పక కోలుకుంటుంది. ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఆలోచిస్తున్నదో, ఇకపై పౌరులు కూడా అంతే బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పద్ధతీ పాడు లేకుండా, అనుమతులు లేకుండా, ఎక్కడపడితే అక్కడ ప్లాట్లు, ఫ్లాట్లు కొంటే భవిష్యత్తులో ఇటువంటి పాట్లు వస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇకపై కొనుగోళ్లు చేయాలి. చెరువులోనో, చెరువుకిందో, నాలాల వెంటో ఇండ్ల నిర్మాణాలు మానెయ్యాలి. అవి ఎప్పటికయినా ముప్పేనని గుర్తించాలి. నిజాంపేటలో ఒక పౌరుడు మాట్లాడుతూ అటెటో వెళ్లే నీటిని తమ కాలనీ మీదకు వదిలారని అదేదో చెత్త టీవీలో అదేపనిగా చెప్పించారు. నీటి ప్రవాహాన్ని ఎటుపడితే అటుమళ్లించడం కుదరదని, వాలు ఎటువుంటే అటు పరుగెడతాయని విపరీతంగా వర్షాలు వరదలు వచ్చినప్పుడే తెలిసేది. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల ముంపు బాధలు, అక్కడక్కడా పంట నష్టాలు తప్ప ఈ వర్షాలు ఎక్కువమందికి హర్షాన్నే మిగిల్చాయి. కాలం దాటిపోయింది. ఈ సారి ఇక నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ నిండవేమో అని దిగులుగా ఉండె. మరోసారి కరువు దాడి చేస్తుందేమోనన్న భయం ఉండె. ఈ వానలు ఆ భయాలన్నింటినీ దూరం చేశాయి. శ్రీరాంసాగర్ నిండడమే కాదు, మొత్తం గేట్లు ఎత్తి కిందికి వదలాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీశైలంకు భారీగా వరద వస్తున్నందన అది కూడా నిండటం తథ్యం. ఇంకా సీజను ఉంది కాబట్టి నాగార్జున సాగర్‌కు కూడా నీరు వచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయి. సింగూరు, మంజీర నిండటం, అలుగులు పోయడం ఒక కొత్త చరిత్ర. నిజాంసాగర్‌కు వరద పోటెత్తడం మరో చరిత్ర. మిషన్ కాకతీయలో పూడికలు తీసి, కట్టలు పోసుకున్న వేలాది చెరువులు నిండాయి. వరుసగా పదేళ్లు కరువు మండలాలుగా ఉన్న చోట్ల కూడా ఈసారి అన్ని చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లోని నదులు, ఉపనదులు, వాగులు వంకలు అన్నీ పొంగిపొర్లాయి. మధ్య తరహా ప్రాజెక్టులన్నీ నిండుగా జలాలతో కళకళలాడుతున్నాయి. మూసీ రిజర్వాయరు గేట్లు ఇన్ని రోజులు తెరిచి ఉంచడం ఇటీవల మరో రికార్డు. పులిచింతల రిజర్వాయర్ నుంచి కూడా కిందికి నీళ్ళు వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్లకు ఏళ్లు కొండకు ఎదురు చూసినట్టు, వానకు ఎదురుచూసిన గ్రామాల్లో ఈసారి వీధులన్నీ జాలువారుతున్నాయి. తెలంగాణ ఎప్పు డో మరచిపోయిన జ్ఞాపకాలను మళ్లీ నెమరు వేసుకునే అవకాశాన్ని ఈసారి వరుణుడు మళ్లీ కల్పించాడు. మా ఊరిలో ఎప్పుడు ఎక్కడ మాయమయ్యాడో తెలియని జాలరి మళ్లీ వలలతో ప్రత్యక్షమయ్యాడు. అలుగుకు చేపలు ఎదురెక్కడం ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ చూశాం అని గ్రామస్థులు చెబుతున్నారు. ఇది వేలాది గ్రామాల అనుభవం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలను మరింత వేగంగా ముందుకు నడిపించడానికి, నీటిపారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి ఈ వానలు, వరదలు మనకు స్ఫూర్తినిస్తాయి.

Threat of War


The terror attack on URI army base camp is highly atrocious. Its nothing but declaring war on India. Its also great failure on our part to prevent such heinous attack. Kargil like negligence at border posts are going on as usual. 

When an heated exchanges of diplomatic challenges are became the order of the day, when PMs of both countries are directly encouraging internal strife vice versa, why army intelligence failed to gauge the border situation? 

Are we moving towards another war? Is the threat of war is hanging on both nations? Reactions to the terror attack is unusual this time. Different cross sections of society calling for a severe action on Pakistan. It seems BJP wishing the same.

Tragedy is that real issues behind the story will be buried, when emotions overtake the scene. Its true that Pakistan is devilish. But War is destructive and to be avoided at any cost. Pak is a devil country.

మూసీ విషాదం

 మూసీకి కుడి, ఎడమ కాలువలున్నాయి. ఈ సారి తొందరగా నీళ్లు వదిలారు. ఈ పాటికి చెరువులన్నీ నిండాల్సింది. కొందరు రైతులు స్వార్ధం, తెలివితక్కువతనంతో కుడికాలువకు తుంగతుర్తి గ్రామం వద్దే గండి పెట్టారు. కింది చెరువులకు నీరు వెళ్లడం లేదు. ఎడమకాలువ వరద తాకిడికి తెగిపోయింది. నాలుగు రోజులకింద కాలువలకు నీరు ఆపేశారు. ఇవ్వాళా మూసీ గేట్లు యెత్తి నీరు కిందికి వదలాల్సి వచ్చింది. నీటి కాలువల నిర్వహణ, ప్రాధాన్యతలపై ఒక విధానం రూపొందించకపోతే నీరు ఇలా వృధాగా సముద్రం పాలవుతూనే ఉంటుంది.

అడుగడుగునా జల దృశ్యాలు 

మూసి రిజర్వాయర్, నల్గొండ జిల్లా.

సిద్ధిపేట సమీప చెక్ డ్యామ్లు అలుగుపోస్తున్న సంబరం

మెదక్ జిల్లా ఘనపురం ప్రాజెక్టు కత్వ దూకుతున్న దృశ్యం

**********ఇవి నమస్తే తెలంగాణ విలేఖరులు పంపిన ఫొటోలు*********

సెప్టెంబరు 17 తెలంగాణ స్వేచ్ఛాదినం

కట్టా మీఠా

సెప్టెంబరు 17 తెలంగాణ స్వేచ్ఛాదినం

nalgonda-district-map

సీమాంధ్ర ఆధిపత్య శక్తులను ఖండించే క్రమంలో చాలా మంది నిజాం ప్రభువును ఊరేగించేదాకా వెళ్లారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల కంటే నిజామే గొప్పవారని చెప్పేదాకా వెళ్లారు. భూస్వామ్య ప్రభువులెప్పుడూ ఆధునిక పెట్టుబడి దారుల కంటే ఉత్తముడూ ఉన్నతమైనవాడూ కాలేడు…మార్క్సిస్టు గతి తర్కం ప్రకారం. ఒకరిని ఖండించడంకోసం మరొకరిని ఎత్తుకోవడం మంచిది కాదు.

అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలకు సెప్టెంబరు 17 ఒక ప్రత్యేకమైన రోజు. తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఆ రోజును విద్రోహ దినమని కొందరు, విలీనదినమని మరికొందరు, స్వాతంత్య్రదినమని ఇంకొందరు వాదిస్తున్నారు. కానీ అందరూ ఒక మౌలిక అంశాన్ని విస్మరిస్తున్నారు. పార్టీలు, వారి రాజకీయ సిద్ధాంతాలు, వాదోపవాదాలతో నిమిత్తం లేకుండా ఆరోజు తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. నిజాం ప్రభువుకు మనం ఎంత గొప్ప భుజకీర్తులు పెట్టాలని ప్రయత్నించినా భూస్వామ్య, రాజరిక ప్రభువు ప్రజాస్వామిక ప్రభువు కాలేడు. సమాజం అభ్యున్నతికి అత్యవసరమైన రెండు అంశాల విషయంలో నిజాం ప్రభువువల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. మొదటి అంశం: 1948కి ముందు తెలంగాణ ప్రజలకు మాతృభాషలో చదువుకునే అదృష్టం కలుగలేదు. జిల్లాకు రెండు మూడు మల్టీపర్పస్ హైస్కూళ్లు ఉన్నా మెజారిటీ జన బాహుళ్యానికి చదువు అందుబాటులోకి రాలేదు. అప్పటి బోధనా భాష ఉర్దూ. ఇందుకు భిన్నంగా సీమాంధ్రలో ఆంగ్లేయుల పాలన కారణంగా మనకంటే వందేళ్ల ముందునుంచే చదువుకునే అవకాశాలు మెండుగా లభించాయి. తెలంగాణ, సీమాంధ్రల మధ్య ఈ…

View original post 698 more words