నిశ్శబ్దవిప్లవం కాదు, శబ్దవిప్లవమే

కాంగ్రెస్ నాయకులు నిశ్శబ్ద విప్లవం గురించి మాట్లాడుతుంటే వీళ్లు ప్రజలకు ఎంత దూరంగా ఉండి మాట్లాడుతున్నారో అర్థమవుతున్నది. కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని వాళ్లకు నిశ్శబ్ద విప్లవాలే కనిపిస్తాయి. తమ రాజకీయ జీవితంలో ఏనాడూ ఒక నిర్మాణాత్మక విధానాన్ని అమలు చేయని పార్టీ కాంగ్రెస్. ఏనాడూ ప్రజలకు చేరువగా వచ్చి నిలబడని పార్టీ కాంగ్రెస్. ఏనాడూ స్వతంత్రించి తమ ప్రజలకు ఏమి కావాలో అది చేసే సాహసం చేయని ఉపగ్రహ నాయకులు కాంగ్రెస్ నాయకులు. నీతులన్నీ వదలి, తప్పులన్నీ చేసి, ఆరు దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి సేవ చేస్తూ ఇప్పుడు నీతుల గురించి, కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ నాయకుల భావ దారిద్య్రం అర్థం చేసుకోవచ్చు. ఏ విలువల పట్లనైనా వీరికి నిబద్ధత ఉన్నదీ లేనిది వీరి రాజకీయ జీవితాల్లోకి తొంగిచూస్తే చాలు చాలా సులువుగా అర్థమవుతుంది. కేసీఆర్ కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని పదేపదే మాట్లాడుతున్న ఉత్తమ్ కుమారునికి, కోమటిరెడ్డి సోదరులకు, జానారెడ్డి…ఇంకా చాలా మంది కాంగ్రెస్ నాయకులకు ఒకటే ప్రశ్న. ఉత్తమ్‌కుమారుని ఇంట్లో ఇద్దరికి, కోమటిరెడ్డి ఇంట్లో ఇద్దరికి, రేపు జానారెడ్డి ఇంట్లో ఇద్దరికి…రాజకీయ వారసత్వాలు ఇస్తే తప్పులేదు, కానీ ఒక సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ముందుండి కొట్లాడి, నలిగి నలిగి ఎదిగి వచ్చిన నాయకులు ఒకే కుటుంబం నుంచి వచ్చిన వారయితే తప్పేమిటి? ఉత్తమ్ కుమార్‌రెడ్డికి, జానారెడ్డికి, కోమటిరెడ్డికి, దామోదర్‌రెడ్డికి ప్రజలంటే ఒక ఓటు వేసే యంత్రాలు. ఎన్నికలప్పుడు మాత్రమే పనికివచ్చే ఈవీఎంలు. వారిపట్ల ఎటువంటి సేవాదృక్పథం, సహృదయం, సహానుభూతి లేని నాయకులు వీరు. ప్రజలకు మేలు చేసి, పనులు చేసి, అభివృద్ధి చూపించి వారిని గెలుచుకోవడం, వారి హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం కాకుండా, ప్రజలను ఎన్నిక ఎన్నికకూ ఎలా బురిడీ కొట్టించాలో మాత్రమే తెలిసిన రాజకీయ విద్యాపారంగతులు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ పాత ఒరవడిని రద్దు చేసింది. జనం మధ్య జనం కోసం పనిచేయడం అన్నది ఎలా ఉంటుందో గత నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రుజువు చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు జనంలో ఒకరుగా ఉన్నారు. పిలిస్తే పలికేట్టుగా పల్లెలు పట్టుకుని తిరిగారు. పోటీపడి అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వానికి టీఆర్‌ఎస్ నాయకత్వానికి అసలు పోలికే లేదు. టీఆర్‌ఎస్ నాయకులు ఉద్యమంలో రాటుదేలి, ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకుని, పోరాడి రాజకీయాల్లో ఎదిగి వచ్చినవారు. కాంగ్రెస్ నాయకులు పైరవీలు చేసి పైకి వచ్చినవారు. ధన రాజకీయాలతో ఎదిగి వచ్చినవారు. రెండు పార్టీల మధ్య ఇంత స్పష్టమైన అంతరం ఉన్నది. ఇక నిశ్శబ్ద విప్లవం అవసరం ఉంటే గింటే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఉండాలి. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా జనం గొంతెత్తి మాట్లాడుతున్నారు. వారు తమ ఇష్టాయిష్టాలను దాచుకోవడం లేదు. బాహాటంగానే టీఆర్‌ఎస్‌ను ఎందుకు సమర్థిస్తున్నారో చెబుతున్నారు. అక్కడో ఇక్కడో కొద్ది మంది నాయకులపై అసంతృప్తి ఉంటే ఉండవచ్చు. కానీ ప్రభుత్వం, మెజారిటీ టీఆర్‌ఎస్ నాయకత్వం కష్టపడుతున్న తీరును అందరూ గమనిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం ఎందుకు? ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చినందుకా? విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేసినందుకా? చెరువులు బాగుచేయించినందుకా? ఎప్పుడూ లేనంతగా కాలువలలో నీరు పారించినందుకా? ఊరూరా రోడ్లు, భవనాలు నిర్మించినందుకా? పంటపెట్టుబడికింద ఎనిమిది వేల రూపాయల సాయం అందిస్తున్నందుకా? పైసా ఖర్చు లేకుండా రెవెన్యూ రికార్డులను సరిచేసి, పట్టా పుస్తకాలు ఇస్తున్నందుకా? నలభై లక్షల మందికి పించన్లు అందిస్తున్నందుకా? మున్సిపాలటీల స్వీపర్లు మొదలుకుని వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు, హోంగార్డులు, అంగన్‌వాడీ కార్యకర్తలు…ఇలా అతితక్కువ భత్యాలతో పనిచేస్తున్న వర్గాలకు పెద్ద మనసుతో భత్యాలను పెంచినందుకా? ఉద్యోగులకు అడిగిందే తడవుగా డిమాండ్లను నెరవేర్చుతున్నందుకా? ఏ కారణం చేత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవం వస్తుంది? అని మొన్న పాస్ పుస్తకాలు తీసుకోవడానికి వెళ్లిన సందర్భంగా ఇష్టాగోష్టి సమావేశంలో ఒక రైతు నాయకుడు ప్రశ్నించాడు. కాంగ్రెస్ నాయకులకు ఒక ప్రాజెక్టు అంటే నాలుగైదు పంచవర్ష ప్రణాళికలపాటు పండుగ. ప్రాజెక్టు మొదలు పెట్టి, అందులో నీళ్లు వచ్చే నాటికి ఒక తరం గతించి పోయే పరిస్థితి. నిధులివ్వరు. భూసేకరణ చేయరు. జనం నీళ్లు వస్తాయని కొండకు ఎదురు చూసి నట్టు ఎదురు చూడడం, తరాలు మారిపోవడం….అదొక అంతులేని వ్యధ. మాధవరెడ్డి ప్రాజెక్టు కింద ఉదయ సముద్రం పూర్తి చేసి దశాబ్దం గడచిపోయింది. ఈరోజుకూ ఉదయ సముద్రం రిజర్వాయరును పూర్తిస్థాయిలో నింపని పరిస్థితి. సగం డిస్ట్రిబ్యూటర్లకు నీరివ్వని పరిస్థితి. ఎందుకంటే ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం ఇవ్వరు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పనులు కదలడం మొదలయింది. నష్టపరిహారం ఖరారయింది. ఒక్క మాధవరెడ్డి ప్రాజెక్టే కాదు, కాళేశ్వరం నుంచి పాలమూరు రంగారెడ్డి వరకు డెడ్‌లైన్‌లు పెట్టుకుని, రాత్రి జాగారాలు చేసి, ఒకటికి పదిసార్లు ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల వెంటపడి పనులు వేగంగా పూర్తి చేయించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మించడం అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పొలాలకు నీళ్లివ్వడం. మొబిలైజేషన్ అడ్వాన్సులు, బ్రోకర్లు, కమీషన్లు, ఎస్కలేషన్లు, ఏళ్ల తరబడి సాగదీసుడు, ధనయజ్ఞాలు…ఇది కాంగ్రెస్ సృష్టించిన ఇరిగేషను ప్రాజెక్టుల

పదజాలం. తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల విజ్ఞాన సర్వస్వాన్ని పునర్లిఖించింది. నీళ్లివ్వడం ఒక్కటే లక్ష్యంగా ప్రాజెక్టుల పనులను నడిపిస్తున్నది. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పనివిధానానికి, తెలంగాణ ప్రభుత్వ పనివిధానానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని పదవీ విరమణ చేసిన నీటిపారుదల ఇంజనీరు వివరించారు. కొన్ని ప్రాజెక్టుల కింద ఫలితాలు కనిపిస్తున్నాయి. జనం ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులే అక్కసుతో రగిలిపోతున్నారు అని ఆయన అన్నారు.

ఇప్పటిదాకా మమ్మల్ని పట్టించుకున్న నాయకుడు కేసీఆర్ ఒక్కరే. రైతు బిడ్డ. రైతు కష్టం తెలిసినోడు. అందుకే ఆయన ఇంతపెద్ద పని ముందేసుకుని చేయిస్తుండు. నాకు పెట్టుబడి వచ్చినా రాకున్నా పర్వాలేదు. కానీ మూడెకరాలోళ్లు, నాలుగెకరాలోళ్లు, పేద రైతులు పండుగ చేసుకుంటుండ్రురా. ఇసోంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెప్పుకుంటుండ్రురా అని లింగయ్య తాత చెప్పాడు. ఆయన పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి కాంగ్రెస్ వాది. నాయనా నా చెక్కు రాలేదురా. ఇస్తరా ఇవ్వరా. ఒక్కసారి కనుక్కుని చెప్పు అని ఒక పెద్దావిడ ప్రశ్నించింది. రికార్డుల్లో కొన్ని తప్పులు దొర్లాయి సరిచేసి త్వరలోనే ఇచ్చేస్తామని ఎమ్మార్వో చెప్పారు. డబ్బులు ఎంత ఇస్తున్నామని కాదు, రైతులోకంలో అది సృష్టించిన ఆత్మవిశ్వాసం, ప్రజల్లో వెల్లువెత్తిన హర్షాతిరేకాలు ప్రభుత్వ విధానం సాధించిన విజయానికి సూచికలు. ఇవ్వాళ పల్లెలు కళకళలాడుతున్నాయి. పించను డబ్బులతో, పంటపెట్టుబడి డబ్బులతో ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలను చేరుకునే ప్రయత్నం, ఆదుకునే ప్రయత్నం చేసింది. నెలనెలా వచ్చే పించను డబ్బులు కాకుండా సుమారు ఆరువేల కోట్ల రూపాయలు పంట పెట్టుబడి రూపంలో పల్లెలకు ఇన్‌ఫ్యూజ్ అయిందంటే దాని ప్రభావం ఎంతగా ఉంటుందో ఊహించండి. ఇంతగా నిధులు ప్రజలకు అందజేసిన చరిత్ర దేశంలో ఏపార్టీకయినా, ఏ రాష్ర్టానికయినా ఉందా? కంపెనీలు 30 వేల కోట్లు, 40 వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగవేస్తున్న కాలంలో, దివాలా ప్రకటిస్తున్న కాలంలో, విదేశాలకు పారిపోతున్న కాలంలో కేవలం ఆరు వేల కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం పల్లెల్లో ఒక గుణాత్మక మార్పునకు పునాదులు వేసింది. ఈ పెట్టుబడిదేముంది, గిట్టుబాటు ధర ఇవ్వాళని, అలా రైతుకు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని  కొందరు మాట్లాడుతున్నారు. అసలు మార్కెట్లను గతంలో ఏ ప్రభుత్వం అన్నా పట్టించుకుందా? జోక్యం చేసుకుని రైతు పంటలను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుందా? తెలంగాణ ప్రభుత్వమే ఆ విషయంలో అందరికంటే ముందుగా స్పందిస్తున్నది. ఈ సారి అసాధారణ రీతిలో వరిపంట పండించారు. మొన్న సంగారెడ్డి నుంచి సింగూరు వెళుతుంటే దాదాపు పది కిలోమీటర్ల పొడవున రైతులు ధాన్యం రాశులు రోడ్డుపై ఆరబెట్టుకుంటున్నారు. అంతధాన్యం నేనెప్పుడూ చూడలేదు. ఎక్కడ చూసినా వందలు వేల బస్తాలు నింపి నెట్టుకట్టి పెట్టారు. అక్కడ ఒక రైతును అడిగాను…ఎన్నేళ్లుగా ఇలా పండిస్తున్నారు? అని. అయ్యో ఎన్నో ఏళ్లు ఎక్కడ. ఇంతకుముందు మాకు నీళ్లు ఎక్కడివి? తెలంగాణ వచ్చినంక ఈ రెండు మూడేళ్ల నుంచే ఈ పంట. సింగూరు నుంచి మాకు నీళ్లిస్తున్నరు. అందుకే ఇంత పంట దిగుబడి వచ్చింది అని ఆ రైతు చెప్పారు. అందరూ వరే పండిస్తే ఎలా? పంటలు మార్చవచ్చు కదా? అని అంటే ఇగ చెయ్యాలె. మేమూ అదే అనుకుంటున్నం అని ఆ రైతు సమాధానం చెప్పాడు. పంట పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి రావడం వల్ల కొనుగోళ్ల సమస్య ఏర్పడ్డ మాట వాస్తవమే. అయినా ప్రభుత్వమే మిల్లర్లతో, మార్కెట్ వర్గాలతో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు మార్గం సుగమం చేస్తున్నది. కాంగ్రెస్ హయాంలో రైతులది అరణ్య రోదన. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ స్పందించి దిద్దుబాటు చర్యలు, సహాయక చర్యలు చేపడుతున్నది.

అందుకే కాంగ్రెస్ నాయకత్వం ఎంత గింజుకున్నా ప్రజల్లో స్పందన రావడం లేదు. ఇంతకాలం ఎటువంటి బాధ్యత లేకుండా అనుభవించిన అధికారం చేజారిపోయిందన్న అక్కసు, ద్వేషం, ఆక్రోషం కాంగ్రెస్ నాయకులను వివశులను చేస్తున్నది. మంచిని మంచి చెడును చెడు అనాలనే కనీస నిజాయితీ కూడా వారిలో లోపించింది. అడ్డగోలు మాటలు, ఆరోపణలు ఆ వివశత్వం నుంచి వస్తున్నవే. వాస్తవాలు తెలుసుకునే పరిస్థితిలో కానీ ప్రజాస్పందనను గుర్తించే పరిస్థితుల్లోగానీ వారు లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ నాయకత్వానికి కాలం చెల్లిపోయింది. ఈ కాలానికి పనికివచ్చే  ఆలోచనలు కానీ, ఆహార్యం కానీ, వర్తన కానీ, ఆధునికత కానీ వారికి లేవు, ఇక రావు. సమీప భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ను మరిపించే మంత్ర దండమేదీ వారివద్ద లేదు. రాదు. ఆ పార్టీ నాయకత్వం ఉత్త భ్రమల దుర్గాలు నిర్మించుకుని విహరించవలసిందే.

Advertisements

నరేంద్ర మోడీ అజీర్తి

విభజన చట్టం అష్టవంకరలతో రూపొందించారని చెప్పిన మోడీ ఈ నాలుగేళ్లలో వాటిని సరిదిద్దడానికి ఎందుకు ప్రయత్నించలేదో చెబితే బాగుండేది. నిజానికి నరేంద్ర మోడీ విభజన చట్టంలోని లోపాలను సరిచేయలేక కాదు. ఇష్టం లేకనే ఇన్ని వేషాలు వేశారని ఇప్పుడు అర్థం అవుతున్నది.

 

Telangana-seemandhra-map-e1395162279484

మనసులో గూడుకట్టుకున్న భావాలు ఏదో ఒక బలహీనక్షణంలో బయటపడతాయి. నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రం విషయంలో తను అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. తను ఎవరి పక్షమో, అప్పుడు తను ప్రధానిగా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కూడా మోడీ చెప్పకనే చెప్పారు. పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్ర విభజన చేశారు అన్నాడే కానీ, ఒక ప్రజాస్వామ్య ప్రక్రియను ముందుకు సాగకుండా ఆంధ్ర నాయకత్వం చేసిన వికృత చేష్టలను వేటినీ మోడీ గుర్తు పెట్టుకోలేదు. అన్ని రాజకీయ పక్షాలు తెలంగాణ రాష్ట్ర విభజనకు అంగీకరించి చివరి నిమిషంలో మాటమార్చడం గురించి కానీ, దొంగ రాజీనామా బెదిరింపులు కానీ, పార్లమెంటులో విభజన బిల్లుకు అడుగడుగునా అడ్డుపడడం, సభాధ్యక్షులను అవమానించడం, పెప్పర్ స్ప్రేకు దిగడం…ఇవేవీ నరేంద్రమోడీ ప్రస్తావించలేదు. రాష్ట్ర విభజన జరుగుతున్న కాలంలో విభజనను వ్యతిరేకించే ఏకైక నినాదం తప్ప, తమ రాష్ర్టానికి కావలసిందేమిటో అడగని ఆంధ్ర నాయకత్వం గురించి కూడా ఆయన మాట్లాడలేదు. అశాస్త్రీయ విభజన అంటూ మాటిమాటికీ వాపోతున్న మోడీ, బాబు, వారి ఇతర వందిమాగధులకు గర్తుకురాని విషయమేమంటే, కాంగ్రెస్ విభజన చట్టం రూపొందిస్తున్నప్పుడు, ఇరు ప్రాంతాల-ఇతర పార్టీల నాయకులను క్రమంతప్పకుండా సంప్రదించి, వారి సూచనలను, సలహాలను పరిగణిస్తూనే తయారు చేశారు. ఈ సంప్రదింపుల్లో బీజేపీని కూడా భాగం చేశారు. సహకరించనిది, సమస్యలు సృష్టించింది ఆంధ్రా నాయకత్వమే. 2014 ఎన్నికల ప్రచారంలో కూడా నరేంద్ర మోడీ దాదాపు ఇలాగే మాట్లాడారు. అప్పటికీ ఇప్పటికీ ఆయన మనసులో ఉన్నది అదే. తన నాలుగేళ్ల అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి ప్రతిపక్షాన్ని ఆడిపోసుకునే ఏకైక విన్యాసానికి మోడీ దిగారు. ఆ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణను దారుణంగా అవమానించారు. నరేంద్రమోడీ ఆంధ్రకే కాదు, తెలంగాణకూ అన్యాయం చేశారు. విభజన చట్టంలో కాంగ్రెస్ చేసిన తప్పులను వల్లెవేసిన నరేంద్రమోడీ ఈ నాలుగేళ్లలో తాను చేసింది ఏమిటో కూడా చెప్పి ఉంటే బాగుండేది. విభజన చట్టం అష్టవంకరలతో రూపొందించారని చెప్పిన మోడీ ఈ నాలుగేళ్లలో వాటిని సరిదిద్దడానికి ఎందుకు ప్రయత్నించలేదో చెబితే బాగుండేది. నిజానికి నరేంద్ర మోడీ విభజన చట్టంలోని లోపాలను సరిచేయలేక కాదు. ఇష్టం లేకనే ఇన్ని వేషాలు వేశారని ఇప్పుడు అర్థం అవుతున్నది.

భద్రాచలం నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నారు. వారి ఎమ్మెల్యే ఖమ్మంలో ఉన్నారు. విభజన కారణంగా అక్కడ ఒక రాజ్యాంగ సమస్య ఉత్పన్నమైంది. 2019 ఎన్నికల్లో భద్రాచలంలో ఓటర్ల సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కలిసిన ఏడు మండలాల ప్రజలు తమ ఓటు హక్కును ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలియదు. పెద్దపెద్ద సమస్యలు పరిష్కరించినట్టు చెప్పుకునే ఈ అభినవ సర్దారు పటేలుకు ఇంత చిన్న సమస్యను పరిష్కరించడానికి ఎందుకు వీలు పడలేదో బీజేపీ నేతలు చెప్పాలె.

నరేంద్రమోడీ రాజ్యాంగ సవరణలు అవసరమైన విధాన నిర్ణయాలను కూడా అనేకం ఈ నాలుగేళ్లలో తీసుకున్నారు. జనజీవితాలను విపరీతంగా ప్రభావితం చేసిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటివి పార్లమెంటు ఆమోదం పొందాయి. నాలుగు బడ్జెట్‌లు ఆమోదం పొందాయి. పార్లమెంటులో మెజారిటీ లేకపోతే ఇవేవీ ముందుకు సాగేవి కాదు. అంతెందుకు ఎన్‌డీఏ రాగానే గోదావరికి ఆ ఒడ్డు ఈ ఒడ్డున ఏడు మండలాలను తెలంగాణ నుంచి లాగేసి, ఆంధ్రలో విలీనం చేస్తూ చట్టాన్ని తెచ్చింది. మరి అదే మోడీ విభజనను పూర్తి చేయడానికి ఎందుకు పూనుకోలేదు. వాజపేయి మూడు రాష్ర్టాలను ఎటువంటి పేచీలేకుండా గొప్పగా విభజించారని మోడీ చెప్పారు. ఇప్పుడు అదే గొప్పతనాన్ని చాటుకుని మోడీ విభజన చట్టంలోని తప్పిదాలను ఎందు సరిచేయలేదు? రెండు ప్రాంతాల ప్రజలకు ఎందుకు మేలు చేయలేదు? తెలంగాణను పూర్తిగా ఎందుకు విస్మరించారు. చట్టంలో ఇచ్చిన ఓ మోస్తరు హామీలను కూడా ఎందుకు అమలు చేయలేదు? విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ఎందుకు నాన్చుతున్నారు. హైకోర్టు విభజన ఎందుకు చేయలేదు? న్యాయాధికారుల విభజన ఎందుకు పూర్తి చేయలేదు? ప్రభుత్వ సిబ్బంది, ప్రభుత్వ కార్పొరేషన్ల సిబ్బంది, రాష్ట్ర యూనివర్సిటీల విభజన ఇంకా రావణకాష్టంలా ఎందుకు కాలుతూనే ఉంది? వాజపేయి మూడు రాష్ర్టాల విభజన చేసినప్పుడు కోర్టుల విభజన ఇలాగే జరిగిందా? విభజన చట్టంలోని లోపాలను సరిచేయడానికి ఈ నాలుగేళ్లు చాలలేదా?

రాజకీయ సుస్థిరతకోసం అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని సూచిస్తే ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాజ్యాంగ సవరణ చేయకుండానే చట్టంలో సవరణ చేసి అమలు చేసే వీలు ఉంది. రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా పార్లమెంటులో అవసరమైన రాజకీయ ఏకాభిప్రాయం కూడా ఉంది. ఎన్‌డీఏతోపాటు ప్రతిపక్షాలు కూడా రెండు రాష్ర్టాలలో అసెంబ్లీ సీట్లు పెంచడాన్ని సమర్థించేవే. అయినా ఎందుకు చొరవ తీసుకోలేదు. అసెంబ్లీ సీట్లను పెంచే విషయంలోనే ఇన్ని డ్రామాలు ఆడిన బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయమే చేయాల్సి వస్తే ఎంత దుర్మార్గంగా వ్యవహరించేవారో, ఎవరి మాటలు వినేవారో చెప్పనవసరం లేదు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఇక్కడి నుంచి తొలగించి ఆంధ్రలో కలిపారు. భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. భద్రాచలం నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నారు. వారి ఎమ్మెల్యే ఖమ్మంలో ఉన్నారు. విభజన కారణంగా అక్కడ ఒక రాజ్యాంగ సమస్య ఉత్పన్నమైంది. 2019 ఎన్నికల్లో భద్రాచలంలో ఓటర్ల సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కలిసిన ఏడు మండలాల ప్రజలు తమ ఓటు హక్కును ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలియదు. పెద్దపెద్ద సమస్యలు పరిష్కరించినట్టు చెప్పుకునే ఈ అభినవ సర్దారు పటేలుకు ఇంత చిన్న సమస్యను పరిష్కరించడానికి ఎందుకు వీలు పడలేదో బీజేపీ నేతలు చెప్పాలె.

తెలుగు నేలపై ఒక సంక్షుభిత వాతావరణం ఏర్పడిన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ దానిని తొలగించడానికి ఎంత చొరవ తీసుకోవాల్సి ఉండింది? కానీ మోడీకి అటువంటి స్పందనలేమీ ఉండవని, ఆయన ఫక్తు రాజకీయ నాయకుడని, అమరావతికి మట్టి తెచ్చి ఇచ్చిన నాడే అర్థం చేసుకుని ఉండాలి. ఆయన ఈ నాలుగేళ్లూ అదే వైఖరిని ప్రదర్శించారు. పెద్ద పెద్ద మాటలు, చాలా చిన్న చేతులు, చేతలు.

సమైక్య రాష్ట్రంలో సాగునీరు విషయంలో ఎక్కువగా నష్టపోయింది తెలంగాణ. ఆగమేఘాలపై ప్రాజెక్టులు నిర్మించుకోవలసిన అవసరం ఉన్నది తెలంగాణకే. అందుకే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేయింబవళ్లు వెంటపడి ప్రాజెక్టుల నిర్మాణం చేయిస్తున్నారు. తెలంగాణలో అరవైశాతం భూభాగానికి ఉపయోగపడే కాళేశ్వరం ప్రాజెక్టును గరిష్టంగా నీరు ఉపయోగించుకునే విధంగా డిజైను చేసి పనులు జరిపిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ చాలాకాలంగా కోరుతున్నది. కేంద్రం నుంచి ఒక్క సానుకూల మాట ఇప్పటివరకు రాలేదు. పైగా తెలంగాణ ప్రజల గుండెల్లో పొడిచే మాటలు మాట్లాడుతున్నారు. తెలుగు నేలపై ఒక సంక్షుభిత వాతావరణం ఏర్పడిన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ దానిని తొలగించడానికి ఎంత చొరవ తీసుకోవాల్సి ఉండింది? కానీ మోడీకి అటువంటి స్పందనలేమీ ఉండవని, ఆయన ఫక్తు రాజకీయ నాయకుడని, అమరావతికి మట్టి తెచ్చి ఇచ్చిన నాడే అర్థం చేసుకుని ఉండాలి. ఆయన ఈ నాలుగేళ్లూ అదే వైఖరిని ప్రదర్శించారు. పెద్ద పెద్ద మాటలు, చాలా చిన్న చేతులు, చేతలు.

నరేంద్ర మోడీ ఈ నాలుగేళ్లలో జనానికి చేసిన మేలు కంటే నష్టమే ఎక్కువని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఎన్నికల్లో వరుసగా ప్రజలు తేల్చి చెబుతూ వచ్చారు. ఆయన ఓటు బలం తగ్గిపోతూ వచ్చింది. దేశాన్ని ఒక స్వేచ్ఛా ప్రజాస్వామిక భావాలతో వర్ధిల్లే సమాజంగా కాకుండా, ప్రభుత్వానికి ఆదాయాన్ని, లాభాలను సమకూర్చే ఒక కంపెనీ స్థాయికి మార్చిన ఘనత మోడీకి దక్కుతుంది. ప్రజల ఆర్థిక స్వేచ్ఛపై దాడి జరిగింది. ప్రజలు స్వేచ్ఛగా కనీసం లక్ష రూపాయలు దాచుకోలేని ఒక దుస్థితి వచ్చింది. ఒక అతీతభయాన్ని ప్రజలపై రుద్దారు. మరోవైపు కంపెనీలు, సంపన్న వర్గాలు యధేచ్ఛగా నల్లధనాన్ని, తెల్ల ధనాన్ని పోగేయగలుగుతున్నాయి. నరేంద్ర మోడీ తలపెట్టిన స్వచ్ఛ ఆర్థిక వ్యవస్థ పేదవాళ్లకే గానీ పెద్దవాళ్లకు కాదన్న భావన జనాలలో వచ్చింది. ఈ వ్యతిరేకతను దారి మళ్లించడానికే అసందర్భ ఆవేశాలు, అనవసర విషయాలపై మోడీ నోరు పారేసుకున్నారు. కానీ జనం దృష్టిమళ్లించడం ప్రతిసారీ సాధ్యమయ్యే పనికాదు.

ఎవరికివారే మహానటులు

ప్రధాని నరేంద్ర మోడి, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహుచక్కగా, కడు రమ్యముగా నటిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఎంపీలతో ఆందోళన చేయిస్తున్నారు. నరేంద్రమోడీ కాంగ్రెస్‌ను తిట్టిపోసి టీడీపీని రంజింపజేశారు, శాంతింపజేశారు.

ప్రధాని నోట నేడు లోక్‌సభలో జాలువారిన ఆణిముత్యాలు-పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారట. మూడు రాష్ర్టాలు ఇచ్చినప్పుడు చిన్న పంచాయతీ జరుగలేదట. మరి మోడీ చేసిందేమిటో. ఈ నాలుగేళ్లలో ఏమి ఉద్ధరించారో. తెలంగాణ మెడలు వంచి ఏడు మండలాలను కాజేస్తూ చట్టం చేసిన విషయం నరేంద్ర మోడీ ఎంత ఈజీగా మరిచిపోయారో.

విభజన మంటను ఈ నాలుగేళ్లుగా ఆజ్యం పోస్తూ రాజేస్తున్నది ఎవరో. రెండు రాష్ర్టాలతో నాటకాలు ఆడుతున్నదెవరో. విభజన చట్టంలో వేసిన చిక్కుముడులను విప్పడానికి మోడీ ఎందుకు ప్రయత్నించలేదో.

సమాజంపై ఎంతో తీవ్రమైన ప్రభావం కలిగించే డీమానిటైజేషన్, జీఎస్టీ వంటి నిర్ణయాలు చేయగలిగిన ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టాన్ని ఎందుకు సవరించలేకపోయిందో బీజేపీ నాయకులు చెప్పాలి. విభజన చట్టంలోని చిక్కుముడులు విప్పడానికి కాంగ్రెస్ అడ్డుపడిందా, ఇతర ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయా?

ఒకటి మాత్రం అనిపిస్తున్నది. నాడు కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం చేయకపోయి ఉంటే నేడు మోడీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది కాదని మాత్రం అర్థం అవుతోంది.

This is real face of Modi

“ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ తీరు వల్లే రాష్ట్రానికి ఇప్పుడు సమస్యలు వచ్చాయని, రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కూడా కాంగ్రెస్ మోసం చేసిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎన్డీయే ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని, అప్పుడు ఏ రాష్ట్రానికీ ఇలాంటి అన్యాయం జరగలేదని, ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇవ్వడం వల్ల అప్పట్లో సమస్య రాలేదని, అలాంటి మహోన్నత చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందని మోదీ గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాలు కాకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్‌ తలుపులు మూసి హడావుడిగా ఏపీని విభజించిందని ప్రధాని మోదీ ఆరోపించారు.

What is that Modi Government done all these four years to rectify the mistakes done by Congress Government while bifurcating State. Shall we assume that Telangana State might have not formed at all in the realm of NDA, if it was not done then.

సైంధవుల సయ్యాట

img_4813

మహాభారతం ఒక గొప్ప రాజకీ య కావ్యం. అందులో కనిపించని రాజకీయపాత్రలు లేవు. కౌరవ పాండవుల పెనుగులాట లాగా ఇప్పుడూ ఎప్పుడూ అధికారం కోసం పెనుగులాట సహ జం. ఎవరు కౌరవులు, ఎవరు పాండవులన్నది ఇప్పుడేమో ప్రజలు నిర్ణయిస్తున్నారు. ప్రధాన పాత్రలు కాకుండా భారతంలో సైంధవుడు, శల్యుడు, శిఖండి, కర్ణుడు, అశ్వత్థామ.. వంటి చాలా పాత్రలున్నాయి. ఒకటి మంచికి, మరొకటి చెడుకు, ఇంకొకటి త్యాగానికి, స్నేహానికి, మరొకటి ద్రోహానికి ప్రతీకలు. ప్రధాన పాత్రలు కాకుండా చాలా తరచుగా ఇటువంటి పాత్రల గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు సైంధవుడు. సింధు రాజు. ఆయన అసలుపేరు జయద్రథుడు. కౌరవుల ఏకైక సోదరి దుస్సల భర్త. అంటే పాండవులకు కూడా బావ వరుస. అటువంటి వాడు ఒకసారి అరణ్యవాసంలో ఉండగా జయద్రథుడు వరుసకు సోదరి అయిన ద్రౌపదిని చూసి మోహించి, రథంపై లాక్కెళుతుంటాడు. ఈ విషయం తెలిసిన పాండవులు ఆయనను వెంబడించి, బంధించి, జుట్టు కొరిగించి, అవమానించి పంపుతారు. ఆ అవమానంతో తపస్సు చేస్తాడు. పాండవులపై ప్రతీకారం తీర్చుకునే శక్తిని ఇవ్వమని శివుడిని అడుగుతాడు. అంతశక్తిని ఇవ్వలేను కానీ, ఒకరో జంతా పాండవ యోధులను నిలువరించే శక్తిని ఇస్తున్నాను. ఒక్క అర్జునుడిని మాత్రం ఎవరూ నిరోధించలేరు అని శివుడు చెబుతాడు. కురుక్షేత్రంలో పద్మవ్యూహం పన్నిన రోజున అర్జునుడిని ఉద్దేశపూర్వకంగా మరోవైపు మళ్లించి, పద్మవ్యూహంతో పాండవ సేనను ఛిన్నాభిన్నం చేస్తుంటారు ద్రోణాది కౌరవసేన. ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు ఒక్కరు కూడా అడుగు ముందుకువేయలేకపోతారు. అభిమన్యుడు ఒక్కడే పద్మవ్యూహంలోకి వెళ్లగలుగుతాడు. కానీ బయటికి రాలేడు. కౌరవయోధులంతా కలిసి అభిమన్యుడిని చంపుతారు. దానికి ప్రతీకారంగా అర్జునుడు మరుసటిరోజు సైంధవుడిని చంపుతాడు. ఒక్కరోజు పాండవ యోధులను నిలువరించగలుగడం, పాక్షిక నష్టం కలిగించగలుగడం సైంధవుడి పాత్ర. సైంధువుడు దుష్కర్ముడు. దుష్టపాత్ర. అభిమన్యుడి హత్యకు కారకుడు. ఆధునిక రాజకీయాల్లో ఎవరినైనా తిట్టాల్సి వస్తే ఈ పేరుతో తిట్టడం అందుకే. వీరు యుద్ధాన్ని గెలువలేరు. ఏదో తెలియని బాధ, దుగ్ధ ఉంటాయి. ఎవరినో గెలిపించడానికి, మరెవరినో ఓడించడానికి పనికివస్తారు.

“వాడు రోడ్డేస్తే నాకు చెడ్డ పేరొస్తుంది. వాడు కాలువ తీస్తే వాడికి పేరొస్తుంది. పొలాలకు నీళ్లొస్తే జనం మన మాట వినరు. ఊళ్లోకి బడి వస్తే పిల్లలు పనికిరారు. అందరికీ భూమి ఉంటే మన పొలాల్లో ఎవరు పనిచేస్తారు? ఇది తరతరాలుగా సాగుతున్న ఆలోచనాధార. చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ ఆలోచనాధార నుంచి బయటపడటం లేదు. రైతులకు పరిహారం ఇవ్వాలనడం, పునరావాసం కల్పించాలనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయంలేదు. ప్రభుత్వం చట్టం ద్వారానే ఆ పనులన్నీ చేస్తున్నది. ఇంకా నష్టపోతున్నామని ఎక్కడైనా రైతులు వాదిస్తే అదనపు సాయం కూడా అందిస్తున్నది.” 

 
పవన్‌కల్యాణ్ గురించి ఒక మిత్రుడు ఇదేమాట అన్నాడు. అందుకే పైకథ అంతా చెప్పాల్సి వచ్చింది. పవన్‌కల్యాణ్ అమాయకుడు, భోళా అని మరో మిత్రుడు అన్నాడు. సైంధవుడా, అమాయకుడా అన్న ప్రశ్న ఆయన మాటలు, ప్రవర్తనను చూసి అర్థం చేసుకోవాలి. ఆయన గెలువాలనుకొని, మార్పు తేవాలనుకొని రాజకీయాలు చేస్తున్నట్టుగా అనిపించదు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్మార్ట్ సీఎం అంటారు. ఆయన పాలన బాగుందంటారు. మళ్లీ తెలంగాణలో అన్ని స్థానాలకు పోటీ చేస్తానంటాడు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడుతూ చాలా మిస్టీరియస్ పాత్ర పోషిస్తున్నాడనిపిస్తుంది. వసంత కోకిలలాగా ఎన్నికల రుతువులో పాటపాడే సినీ నాయకుడు కనిపిస్తారాయనలో. 2009 ఎన్నికలకు ముందు నుంచి నిన్న మొన్నటిదాకా ఆయన మాటల్లో వచ్చిన మార్పులన్నీ గుదిగుచ్చి ఎవరో మిత్రుడు ఒక వీడి యో పంపారు. ఆయనలో ఎన్ని వైరుధ్యాలో. ఎంత నిలకడలేని తనమో. ఎంత చపలచిత్తమో. ఎంత అవకాశవాదమో. ఆయన చేగో బొమ్మ పెట్టుకుంటే ఒకప్పుడు మురిసిపోయాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తే కనిపించేదంతా వాస్తవం కాదని, లోపలి మనుషులు వేరే ఉంటారని అర్థం అవుతుంది. పవ న్‌కల్యాణ్ తన అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పు డు తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా తీర్మానం చేశారు. పవన్‌కల్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తూ ఆవేశంతో ఊగిపోతూ నేను మీకు అండగా ఉంటా అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తాను సైతం అంకితమవుతానని చెప్పారు. 2009 డిసెంబరులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం రాగానే అడ్డం తిరిగారు. గడ్డం గీసుకున్నంత తేలికగా రాష్ట్రాన్ని విడదీస్తారా అని ప్రశ్నించారు. విభజన జరిగినప్పుడు నాకు ఏడుపొచ్చింది. ఒక్కరోజు కాదు రెండు రోజు లు కాదు 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పా డు. కేసీఆర్ తాటా తీస్తా అని బీరాలు పలికాడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ ఇంకా చాలాచాలా మాట్లాడాడు. అటువంటి మనిషి ఇప్పు డేం మాట్లాడుతున్నాడు? జై తెలంగాణ, వందేమాతరం వంటి ఒక మహావాక్యమట. కేసీఆర్ అంటే తనకు చాలా ఇష్టమట. ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతాయేమో. తెలంగాణకు నిజంగా కేసీఆర్ చాలు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ వంటి టుమ్రీ రాజకీయవాదులు అవసరంలేదు. పిచ్చికూతలతో, పిచ్చి ఆవేశాలతో ఇక్కడ వాతావరణం చెడగొట్టకుంటే చాలు. చిరంజీవిలో ఉన్నపాటి స్థిరత్వం, గాంభీర్యం కూడా ఈ మనిషిలో లేదు.

“రాజకీయాల్లో స్థిరత్వం ఉండాలి. మాట్లాడే ప్రతిమాటకు పొంతన ఉండాలి. సంబద్ధత ఉండాలి. కొనసాగింపు ఉండాలి. దీర్ఘకాలిక దృక్పథం ఉండా లి. ఇవి లేని విన్యాసాలన్నీ దూదిపింజల్లా గాలికి కొట్టుకుపోతాయి. పవన్‌కల్యాణ్ అయినా, తెలంగాణలో ప్రతిపక్ష నాయకులకైనా అదే వర్తిస్తుంది.”

రాజకీయాల్లో స్థిరత్వం ఉండాలి. మాట్లాడే ప్రతిమాటకు పొంతన ఉండాలి. సంబద్ధత ఉండాలి. కొనసాగింపు ఉండాలి. దీర్ఘకాలిక దృక్పథం ఉండా లి. ఇవి లేని విన్యాసాలన్నీ దూదిపింజల్లా గాలికి కొట్టుకుపోతాయి. పవన్‌కల్యాణ్ అయినా, తెలంగాణలో ప్రతిపక్ష నాయకులకైనా అదే వర్తిస్తుంది. ప్రతిపక్షాలది మరీ విచిత్ర వైఖరి. విశాల జనబాహుళ్య ప్రయోజనాలు చూడాలా లేక కొద్దిమంది కక్షిదారు ల ప్రయోజనాలు చూస్తారా? కాంగ్రెస్, బీజేపీలు ప్రజాపక్షపాతం కలిగిన రాజకీయపక్షాలుగా కాకుం డా కోర్టు కక్షిదారులుగా మారిపోయాయి. కరువు సీమకు ఎన్నో ఏండ్లు ప్రాతినిధ్యం వహించిన నాగం జనార్దన్‌రెడ్డి కేసుల ఉద్యమం నడిపిస్తున్నారు. జేఏసీ నాయకులు సైతం కేసుల వెంటే పరుగెడుతున్నారు. కాంగ్రెస్ సంగతి ఇంకా చెప్పనవసరం లేదు. ఈ కక్షిదారుల మనస్తత్వం భూస్వామ్య సంస్కృతి నుం చి పుట్టుకొచ్చింది. వాడు రోడ్డేస్తే నాకు చెడ్డ పేరొస్తుం ది. వాడు కాలువ తీస్తే వాడికి పేరొస్తుంది. పొలాలకు నీళ్లొస్తే జనం మన మాట వినరు. ఊళ్లోకి బడి వస్తే పిల్లలు పనికిరారు. అందరికీ భూమి ఉంటే మన పొలాల్లో ఎవరు పనిచేస్తారు? ఇది తరతరాలుగా సాగుతున్న ఆలోచనాధార. చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ ఆలోచనాధార నుంచి బయటపడటం లేదు. రైతులకు పరిహారం ఇవ్వాలనడం, పునరావాసం కల్పించాలనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయంలేదు. ప్రభుత్వం చట్టం ద్వారానే ఆ పనులన్నీ చేస్తున్నది. ఇంకా నష్టపోతున్నామని ఎక్కడైనా రైతులు వాదిస్తే అదనపు సాయం కూడా అందిస్తున్నది. అన్నిరకాలుగా నిర్వాసితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అదీ నచ్చకపోతే కోర్టులో అదనపు పరిహారం కోసం కొట్లాడే అవకాశమూ ఉంది. రాజకీయ లక్ష్యాలు, వాంఛలు, అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులకు అవరోధాలుగా మార డం రాష్ర్టానికి మంచిది కాదు.

నిజానికి ఈ పరిహారాల గురించి ఆలోచించకుండానే చాలా ప్రాజెక్టుల కింద రైతులు తమ భూము ల్లో కాలువలు తవ్వనిచ్చారు. నల్లగొండ జిల్లాలో వరదకాలువ కింద చాలామంది రైతులు భూములు ఎప్పుడో ఇచ్చేశారు. కనీసం భూ సేకరణ నోటిఫికేషన్ కూడా రాకుండానే భూములు ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల కింద కొన్ని గ్రామా ల రైతులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి భూములు ఇచ్చారు. వాళ్లు దేవుళ్లు. ఎందుకంటే నీరు బంగారమని, జీవనాధారమని, నీటి కంటే ఏదీ విలువైనది కాదని అర్థం చేసుకున్నవాళ్లు, నమ్మినవాళ్లు కాబట్టి వారు అలా చేశారు. రాజకీయ నాయకత్వం అటువం టి వారికి అండగా నిలబడి సత్వర న్యాయం జరిగేట్టు చూడాలి. నీళ్లు లేకపోతే ఎన్ని ఎకరాల భూమి ఉంటే ఏమిటి ప్రయోజనం? రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ తాగు, సాగునీటి కోసం తన్లాడింది. నీరు లేక తెలంగాణ ఎలా వెనుకబడిపోయిందో అందరికీ అనుభవంలో ఉన్నదే. స్వరాష్ట్ర ఉద్యమం కారణంగానే ఆంధ్ర నాయకత్వం తెలంగాణలో ఆదరాబాద రా అడ్డగోలు ప్రాజెక్టులు మొదలుపెట్టింది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన శక్తులు ఇప్పుడు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఫ్రంటు గట్టడం అంటే అం తకంటే విడ్డూరం ఏముంటుంది? నిన్నటి మన ఎజెం డా ఇవ్వాళ ఎందుకు ఎజెండా కాకుండాపోయింది? అభివృద్ధి పథంలో సైంధవులు కాకూడదని అందరూ అర్థం చేసుకుంటే తెలంగాణకు మేలు జరుగుతుంది.