జరిగింది చాలు, జరగాల్సింది చూద్దాం

ఎనభై నాలుగేళ్ల పెద్దాయన ఒకరు సోమవారం అకస్మాత్తుగా ఆఫీసుకు వచ్చారు. చరిత్ర అధ్యాపకునిగా ఉద్యోగ విరమణ చేశారు. చరిత్రపై అనేక పుస్తకాలు రాశారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన కాళ్లూ చేతులూ వణుకుతున్నాయి. వణుకుతున్న చేతులతోనే ఒక వ్యాసం రాసుకువచ్చారు. ఎక్కడో ఎల్‌బి నగర్ కామినేని ఆస్పత్రి దగ్గరి నుంచి 250 రూపాయలు ఆటో చార్జీ పెట్టుకుని బంజారాహిల్స్‌లోని నమస్తే తెలంగాణ ఆఫీసుకు వచ్చారు. ఆయన గళంమాత్రం వచ్చినప్పటి నుంచి ఆవేశంతో, బాధతో అనర్గళంగా మోగుతూనే ఉన్నది. ‘బాబూ నాకు చాలా ఆందోళనగా ఉంది. ఢిల్లీ ముందు కేసీఆర్ ఓడిపోతారేమోనని భయమేస్తున్నది. కోదండరామ్, కేసీఆర్ రచ్చకెక్కుతారేమోనని దిగులు కలుగుతున్నది. ఎవరిపద్దతిలో వారు ఇద్దరూ తెలంగాణకోసమే కొట్లాడుతున్నారు.ఎందుకిలా తగవులాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. పెద్దవాళ్లెవరూ ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ల మధ్య ఎవరూ ఎందుకు సంధి కుదర్చడం లేదు?…’ ఆయన ఆవేదనకు అంతు లేదు. తనకు షుగర్ ఉంది. అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయినా ఏదో చేయాలన్న ఆరాటం. ఏదో చెప్పాలన్న తాపత్రయం. గజిబిజిగా రాసుకువచ్చిన వ్యాసాన్ని ఆసాంతం డిక్టేట్ చేశారు. ఇక ఆకలేస్తున్నది, వెళ్లి పోతానన్నారు. భోజనం తెప్పిస్తానంటే వద్దన్నారు. కారులో దింపే ఏర్పాటు చేస్తానంటే ఒప్పుకోలేదు. మళ్లీ 250 రూపాయలకు ఆటో మాట్లాడుకుని వెళ్లిపోయారు. నాకైతే మనసు వికలమైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఆ ఫలాలు అనుభవించే వయసు కాదు. ఏ పార్టీలూ, పదవులతో సంబంధం లేదు. తెలంగాణ రావాలన్న ప్రగాఢవాంఛ తప్ప మరో ధ్యాస ఏదీ లేదు. ఇది ఆయన ఒక్కడి బాధ కాదు. లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారుల్లో మసలుతున్న బాధ. తేదీలు మారిపోతున్నాయి. నెలలు గడచిపోతున్నాయి.  పరిస్థితులు చేజారి పోతున్నాయి. యూపీఏ ప్రభుత్వం నవంబరు చివర్లో ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనో లేక ఫిబ్రవరిలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లోనో అవిశ్వాస గండం తప్పించుకుంటుందో లేదో తెలియదు. మధ్యంతర ఎన్నికల గాలులు ముమ్మరంగా వీస్తున్నాయి. మమత, మాయావతి,  ములాయం…ఎవరి కారణాలవల్ల వారు ఎన్నికల అదనుకోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఎన్నికల జ్వరం మొదలయితే ఇక తెలంగాణ సమస్య మరికొంతకాలం అటకెక్కినట్టే.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పదేపదే అదేపనిగా చెబుతూ వచ్చిన ‘త్వరలో తెలంగాణ’ అన్నది గోడమీది రాతగా మిగిలిపోయింది. కేసీఆర్ ఎంత గట్టిగా చెప్పినా ఇప్పుడు ఎవరూ నమ్మని పరిస్థితి. ఇప్పటికి ఎన్ని వాయిదాలు చూశామో లెక్కే లేదు. ఎప్పటికప్పుడు ఆశోపహతులు కావడం తెలంగాణ ప్రజల వంతు అయింది. కాంగ్రెస్ కేసీఆర్‌తో ఏం మాట్లాడుతున్నదో ఎవరికీ తెలియదు. కానీ ఆయన చెబుతూవచ్చిన ‘అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ’ అన్న మాటలను మాత్రం తెలంగాణ ప్రజలు చాలా సార్లు సీరియస్‌గానే తీసుకున్నారు. కాంగ్రెస్ చర్చలంటూ జరిపితే ఆయనతోనే జరుపుతుందని, ఉద్యమ పార్టీ నేతగా ఆయన నిజమే మాట్లాడుతూ ఉండవచ్చని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఇది నాన్నా పులి కథలాగా తయారైంది. ఇప్పుడు తెలంగాణ వస్తున్నదంటే కిందికి మీదికి చూసే పరిస్థితి దాపురించింది. ఆయన మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోని దుస్థితి ఎదురయింది. తెలంగాణ ఇవ్వనందుకు కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. అనవసరమైన ఆశలు కల్పించినందుకు కేసీఆర్‌పై అసంతృప్తి ప్రబలుతున్నది. కేసీఆర్ పాపులారిటీ గ్రాఫ్ గత మూడు మాసాల వ్యవధిలో 60 శాతం నుంచి 40 శాతానికి పడిపోయిందని నిత్యం సర్వేల్లో నిమగ్నమయ్యే ఒక విశ్లేషకుడు చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాలకు మించి రావని, ఆరేడు లోక్‌సభ స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఆరు మాసాల క్రితం ఇవే సర్వేలు టీఆరెస్‌కు 75 నుంచి 90 దాకా స్థానాలు రావచ్చని తెలిపాయి. పాపులారిటీ గ్రాఫ్ ఎప్పటికప్పుడు మారే మాట వాస్తవం. ఇవ్వాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చునన్నది నిజమే. కేసీఆర్ మళ్లీ జనంలోకి వచ్చి గళం విప్పితే పరిస్థితులు మారవచ్చు కూడా. కానీ ఇప్పటి పరిస్థితి మాత్రం ఇది. ఆయన ఇప్పుడయినా కాంగ్రెస్‌తో తాడో పేడో తేల్చుకోవాలన్నది తెలంగాణవాదుల ఆకాంక్ష. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదలిస్తే అక్టోబరు 31లోపు కేబినెట్‌లో నిర్ణయం చేయాలి. మధ్యంతర ఎన్నికలు వచ్చినా రాకపోయినా బడ్జెట్ సమావేశాల తర్వాత-అంటే మే 2013 తర్వాత, యూపీఏ తెలంగాణపై నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే 2014 ఎన్నికలకు అప్పటికి సరిగ్గా ఏడాది మాత్రమే మిగిలి ఉంటుంది. ఏడాది కాలంలో రాష్ట్రం ఏర్పాటు చేయడం వంటి కీలకమైన నిర్ణయం తీసుకుని, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయడానికి, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆ కొద్ది సమయం చాలదు.

ఏం జరిగినా ఈ ఆరు మాసాల వ్యవధిలోనే జరగాలి. రాష్ట్ర విభజన ఆషామాషీ కాదు. కేబినెట్ తీర్మానం చేయాలి. రాష్ట్రపతికి నివేదించాలి. రాష్ట్రపతి ఆ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభకు(ఫర్ చేయాలి) అభిప్రాయం కోసం పంపి, దాన్ని తిప్పి పంపడానికి నిర్దిష్ట సమయం ఇవ్వాలి. ఆ తీర్మానం వెనుకకు వచ్చిన తర్వాత శాసనసభ అభిప్రాయంతో తిరిగి కేబినెట్‌కు పంపాలి. కేబినెట్ దానిని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపాదించాలి. సాధారణ మెజారిటీతో ఆ తీర్మాణం ఆమోదం పొందాలి. ఇవన్నీ జరగడానికి ముందు కేంద్రం సీమాంధ్ర నాయకులతో చర్చలు జరపాలి. సీమాంధ్ర రాజధాని ప్రదేశం గుర్తించడం, నిర్మాణాలు, ప్యాకేజీలు, ఒప్పందాల గురించి వారిని ఒప్పించాలి. ఇవేవీ జరుగకుండా కేంద్ర కేబినెట్ నేరుగా తీర్మానం చేయడం సాధ్యమేనా? ఇప్పటికయితే ఈ సూచనలేవీ లేవు. సీమాంధ్ర నాయకులతో చర్చలు జరుపుతున్న జాడలేవీ కనిపించడం లేదు. పైగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిలు పూటకో మాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మోసపూరితమైన ఎత్తుగడలతో, ఉత్తుత్తి చర్చలతో కేసీఆర్ విలువైన సమయాన్ని కాజేస్తున్నదేమోనన్న ఆందోళన తెలంగాణవాదులను పట్టిపీడిస్తున్నది. కేసీఆర్ చర్చలపై నమ్మకం పెట్టుకుని ఉద్యమానికి దూరంగా ఉండడం వల్ల తెలంగాణ సమాజంలో ఒక సందిగ్ధ వాతావరణం ఏర్పడింది. రాజకీయ శక్తుల పునరేకీకరణ ఆగిపోయింది. అక్కడక్కడా అరకొర ఉద్యమాలు తప్ప తెలంగాణ వ్యాప్తంగా శ్రేణులను కదిలించే కార్యాచరణ ఏదీ లేకుండా పోయింది.  ఉద్యమ నిర్మాణం నిలిచిపోయింది. విలీనం మాట ముందుకు వచ్చింది మొదలు శ్రేణులు జావగారిపోయాయి. పొరపాటున మధ్యంతర ఎన్నికలు వస్తే ఎదుర్కొనే ఎన్నికల సన్నద్ధత ఆ పార్టీలో కొరవడింది. ఇంతకాలంగా టీఆరెస్‌లో చేరదామని ఉవ్విళ్లూరిన కాంగ్రెస్, టీడీపీ తమ్ముళ్లు కొందరు ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఎక్కడ రాజకీయ శూన్యత ఉంటే అక్కడికి వెళ్లిపోతున్నారు. 2010లో 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల సమయంలో ఉన్న ఊపు ఇప్పుడు తరిగిపోయింది. ఆరోజు ఒకేమాట ఒకే బాటగా టీఆరెస్ వెంట నడిచిన జేయేసీలు ఇప్పుడు నూటొక్క రాగాలు వినిపిస్తున్నాయి. మేధావులు, విద్యావంతులు, అధ్యాపకులు, ఉద్యోగుల్లో ఒక వర్గం ఉద్యమ స్రవంతి నుంచి దూరంగా జరిగిపోతున్నది. బహుశా కాంగ్రెస్ కోరుకుంటున్నది కూడా ఇదే కావచ్చు. కేసీఆర్‌ను బ లహీనపరిచే దూరదృష్టితోనే చర్చల నాటకం నడిపిస్తున్నదన్న అనుమానమూ కొందరిలో లేకపోలేదు. ఉద్యమం ఇలాగే కునారిల్లి, 200లో 17 నియోజకవర్గాల ఉప ఎన్నికల నాటి ‘తటస్థ వాతావరణమే’ ఇప్పుడు కూడా పునరావృతమయితే ఇక తెలంగాణను ఎవరూ కాపాడలేరు. ఆ ఎన్నికల్లో 17 స్థానాలను టీఆరెస్, కాంగ్రెస్, టీడీపీలు పంచుకున్నట్టే వచ్చే ఎన్నికల్లో 119 స్థానాలు పంపకానికెళ్తె తెలంగాణవాదం తెల్లారిపోయినట్టే.

ఇంకోవైపు తెలంగాణవాదం నుంచి దృష్టి మళ్లించేందుకు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, అధికార కాంగ్రెస్‌లు చేయని యాత్రలు లేవు, వేయని పాత్రలు లేవు, విసరని వలలు లేవు, ఇవ్వని హామీలు లేవు. టీఆరెస్, తెలంగాణ ఉద్యమం ఇంకా దూకుడుగా ఉండవలసిన అవసరం మునుపటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది. కానీ మబ్బుల్లో నీటిని చూసి కుండలో నీళ్లు ఒలకబోసుకున్నట్టు టీఆరెస్ కాంగ్రెస్ మాయలో పడి తెలంగాణ శక్తులను ఏకం చేసే చొరవను వదిలేసుకుంటున్నది. తెలంగాణ వేదికలకు దూరమవుతున్నది. తెలంగాణ శక్తులకు కేంద్రబిందువుగా వ్యవహరించవలసిన పార్టీ ఎవరో పిలిచినట్టు పక్కకు జరిగిపోతున్నది. ఇది తెలంగాణకు నష్టదాయకం. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, నేతలు టీటీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వీళ్లెవరూ తెలంగాణకోసం చొరవ తీసుకునే అవకాశం లేదు. వాళ్లు కిరణ్‌కుమార్‌రెడ్డి చేతిలోనో, చంద్రబాబు చేతిలోనో లేక జగన్ మోహన్‌రెడ్డి చేతిలోనో కీలుబొమ్మలు.  వాళ్లు మౌలికంగా సీమాంధ్ర నేతల వద్ద రాజకీయ బానిసత్వానికి అలవాటు పడినవాళ్లు. వాళ్లిచ్చే టిక్కెట్లు, వాళ్లు విదిల్చే ఎన్నికల నిధులపై ఆధారపడేవాళ్లు. వాళ్లు స్వతంత్రించి తెలంగాణకోసం చావోరేవో తేల్చుకుందామని సాహసించే అవకాశం లేదు. వాళ్ల ద్వారా తెలంగాణ వచ్చినా తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. ఎటొచ్చీ టీఆరెస్ ఒక్కటే నిలబడాలి. కొట్లాడాలి. అది వదిలేస్తే తెలంగాణకు తీరని నష్టం. తెలంగాణ నేలకున్న పాపమో శాపమో తెలియదు. ఇక్కడ ఇగోల సంఘర్షణ ఎక్కువ. చీలికలు పేలికలు కాకుండా ఏ ఉద్యమమూ కొనసాగ లేదు. తొలుత కమ్యూనిస్టు ఉద్యమం చీలి చీలి, కూలిపోయింది. సిద్ధాంతాల కంటే నాయకుల అహంభావాలే కమ్యూనిస్టులను ఛిన్నాభిన్నం చేశాయి. ఎన్ని పార్టీలు అవతరించాయో చెప్పలేం. తర్వాత 1969 నాటి తెలంగాణ ఉద్యమమూ అలాగే చీలి కూలి రాలిపోయింది. ఇప్పుడు పదేళ్లుగా జరుగుతున్న ఉద్యమంలోనూ తెలంగాణ నేతలు ఒక్కటయిన సందర్భాలు అరుదు. ఎవరికి వారే యమునా తీరే. ఎవరూ ఎవరినీ నమ్మరు. తెలంగాణకు ఇప్పుడు వందలు, వేలాది మంది నాయకులు. కానీ కలసి కొట్లాడరు. లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలకంటే ఆధిపత్యాన్ని చాటుకోవాలన్న తాపత్రయమే ఎక్కువ. రాబోయే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రులమవుదామని కాంగ్రెస్ నాయకులు కాచుక్కూచుంటే, చంద్రబాబు, షర్మిల యాత్రల ద్వారా మోక్షం పొందాలని టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణకోసం ఏదైనా చేద్దామన్న తెగింపు వీళ్లెవరికీ లేదు. కేసీఆరే మళ్లీ అన్ని శక్తులను ఏకం చేసే పెద్దన్న పాత్ర పోషించాలి. తెలంగాణ ఇస్తారో చస్తారో తేల్చుకొమ్మని ఢిల్లీకి ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వాలి. తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చేదాకా అక్టోబరు 31 తర్వాత తిరిగి ఢిల్లీ గడప తొక్కబోమని స్పష్టం చేయాలి. కార్యక్షేత్రంలో దూకి తెలంగాణ శ్రేణులను కదిలించాలి. తెలంగాణ శక్తులను ఒకే తాటిపైకి తీసుకురావాలి. తెలంగాణ ఇవ్వడం ఇవ్వకపోవడం కాంగ్రెస్ సమస్య. కొట్లాడడం మన ధర్మం. విలీనం ఇక అప్రస్తుతం, అసంగతం. మొన్న 1 మంది ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీని నడవనివ్వలేదు. రేపు 70 మందో 0 మందో ఎమ్మెల్యేలు, 15 మంది ఎంపీలు తెలంగాణవాదులు గెలిస్తే హైదరాబాద్‌లో సీమాంధ్ర సర్కారు ఎలా నడుస్తుంది? తెలంగాణను అప్పుడెవరు ఆపగలరు? ఇక నుంచి ప్రతి అడుగూ ఆ దిశగా పడాలి.

Blame Game on barring T Media: Who is responsible? Center or COP organizers?

Here is a reply from COP authorities, throwing blame on Central Government. But how can they allow it?

—– Original Message —–

From: david ainsworth [mailto:david.ainsworth@cbd.int]
To: ceo@ntemail.in
Cc: anastasia.beliaeva@cbd.int
Sent: Thu, 18 Oct 2012 04:30:26 +0000
Subject: Reply to your communication of 17 October

Thank you for your letter.

It is important to note, that although the High Level Segment takes place concurrently with COP 11 and is held in the same venue as the COP, it is an event organised and governed by the government of India. Provisions for participation and access to this, including the opening plenary, are at the discretion of the government of India. The CBD Secretariat does facilitate the participation of a variety of actors and persons, but it does so under the guidance of the government of India.

Ultimately, you will need to direct your queries regarding access to the High Level Segment to the government of India.

With regard to access for COP 11, as you are no doubt aware, priority passes were issued to a limited number of journalists, including at least one, and at time two journalists, from each media organization. These were issued in two batches for COP 11. One was issued for access from the beginning of COP 11 until the 14th. The second batch was issued for access to COP 11 events and activities from October 15 to the 19th. These passes provided access to the HICC facilities.

These passes remain valid for access to the vast majority of COP 11 discussions, except for the contact groups and bilaterals, and regional meetings, as per our media access policy.

We are available to sort out any challenges with regard to COP 11 access, but for matters relating to the High Level Segment, you will need to discuss with the government of India.

Best Regards,

David Ainsworth

2011-2020 United Nations Decade on Biodiversity ­­

Tyranny of Seemandhra Establishment -Telangana Media Barred from PM’s Program

Peaks of AP Police arrogance

Its shame on Democracy. Its shame on freedom of press. Journalists who are representing Telangana Media were selectively and pointedly barred from attending PM’s program in COP. Namasthe Telangana Daily, TNews, V6, HMTV reporters were necked out from PM’s program, in the name of avoiding Telangana voice. It’s insulting the media. It’s undermining all sorts of ethics. It’s arrogance of power and establishment. Everybody must condemn this act of Policracy.

Hindu and some English Journos Spewing venom on T Movement

Today I read Hindu Newspaper and some news online by English Journalists.  They didn’t recognize the strength of Sunday’s March.  But they tried to find the holes in the movement. There are two news items in Hindu. One is telling that TRS is losing the ground and TJAC scored over it. Another is on regarding Maoists presence in the March. These two items are targeted and motivated. They want to bury the name and fame the March got under these mud carpets.   Without TRS, BJP, CPI and TNGO’s massive participation, March might not have succeeded in this way. It is a combined effort. You can understand well, what happened, when all political parties including TRS and TNGO’s went out with their masses.  But anti-Telangana mind set don’t want to see the fact.  These people are always be searching for blacker side of happenings. This type of thinking is nothing but a form of confirmation of bias, wishful writings.  One cannot divide Telangana movement at this stage. Telangana March proved that if situation demands, all forces will come to one platform. Some sections of OUJAC opposed the March and then joined it with their mighty. Gaddar once heckled the March, but later he participated in it. In the beginning TRS not party to March call, but finally they sprung in to the March. March became big success nevertheless of repression and blockades. But Hindu editors proved that journalistic principle of proximity is perfectly working with them. I am sorry to say this. But, proved fact many a times. Then regarding Maoists presence! State and Central Governments pronounced many times that, they successfully eradicated Maoism from AP and also asked all other states take AP as a model.  But these biased minds don’t want to acknowledge that and always be trying to paint Telnagana as Maoist base. They forgot that Maoism saw its peaks in United Andhra, when Andhra establishment is at the helm of affairs.  Hindu doing this way is not the first time. Another Journo with First Post tried to belittle the Movement and to prove that there is no Telangana sentiment in Hyderabad, showing response to Bandh as an example.  Conveniently he closed his eyes to the fact that no political party, which are votaries of Telangana supported for Bandh.  And also, the man earlier, who worked with NDTV forgot that Hyderabad earlier seen many Bandhs for Telangana.  In December 2009 Hyderabad observed complete shutdown for two days. Is it problem of short memory or convenient ignorance? These people make big judgments and general statements basing on bits and pieces and also the same people depend on bits and pieces to reject general strength of a movement or sentiment.  These types of writings should be exposed and condemned.