నీటి సోయిలేకనే ఎండిపోయాం

80 Water Bodies

‘నీటి సోయి ఉంటే మన ఊళ్లు ఇట్టా ఉండేయి కాదు. నాకర్థం అయితలేదు. కోట్లు కుమ్మరించి మా భూములు తీసుకుండ్రు. కాలువలు తవ్విండ్రు. పదేండ్లాయె. చిన్న చిన్న పనులకోసం పను-లాపిండ్రు. నీటి చుక్కరాకపోయె. ఎవడు లాభపడ్డట్టురా’ అని వ్యవసాయం చేసుకుంటున్న మాజీ అధ్యాపకుడు వేసిన ప్రశ్న ఇది. ‘చెరువుల పునరుద్ధరణ చేస్తామని ముఖ్యమంత్రి చెబు-తుంటే చాలా సంబరమవుతున్నది. చెరువును పునరుద్ధరించడం అంటే బావులనూ పునరుద్ధ-రించడమే. చెరువులు నిండితే మా ఊరు బావులన్నీ అలుగులు పోస్తయి. చెరువులు పునరుద్ధ-రించడం అంటే వ్యవసాయాన్ని పునరుద్ధరించడం. మసకబారుతున్న పల్లె జీవితాన్ని పునరుద్ధ-రించడం. పశువులు, పక్షులు, చేపలు…సకల జీవజాలాన్ని పునరుద్ధరించడం…’ అని మైమరచి చెప్పుకుపోతున్నారు ఆయన. నిజమే. మనకు నీటి విలువ ఇప్పటికీ తెలియలేదనే చెప్పాలి. నీటి విలువను తెలియజేసింది తెలంగాణ ఉద్యమమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేసీఆరే. క్యూసె-క్కులు, టీఎంసీల భాషను ఎజెండాలోకి తెచ్చింది ఆయనే. తెలంగాణకు నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాలను చర్చకు తెచ్చింది ఉద్యమ శక్తులే. ఇప్పటివరకు నీటి పారుదలను ప్రధాన ఎజెండాగా పనిచేయడం ఈ ప్రభుత్వంలోనే. తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు…వీళ్లు మారకుండా నీళ్లు రావు. కేసీఆర్‌కు, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు, ఇతర ఉద్యమశ-క్తులకు ఉన్న ఆరాటం వీళ్లకు ఉందా లేదా అన్నది కీలకమవుతుంది. చాలా ప్రాజెక్టుల విషయంలో లోతుగా పరిశీలించి చూస్తే మనకు అర్థం అవుతుంది.

ఎల్లంపల్లి పునరావాసితుల సమస్యను మంత్రి ఒక్క రోజు కూర్చోబెట్టి పరిష్కరించారు. ఇప్పుడు పనులు చకచకా జరిగిపోతున్నాయి. మంత్రి ఎన్నని చేయగలరు. చాలా ప్రాజెక్టుల విషయంలో చేయాల్సిన పనులు చిన్నచిన్నవే. కానీ ఏళ్లు పడుతుంది. కాంట్రాక్టరు చేయడు. ఇంజనీర్లు అది-లించరు. అధికారులకు పట్టదు. ప్రాజెక్టులను పూర్తి చేసే ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల ధోరణిలోనే గుణాత్మకమైన మార్పు రావాల్సి ఉంది. ఉదాహరణకు ఒక కాలువలో ఒక ఆరొందల మీటర్ల తవ్వకం పూర్తి చేస్తే పది చెరువులకు నీళ్లు వస్తాయి. పది గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. కనీసం మూడు వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఆ గ్రామాల రూపు రేఖలు మారిపోతాయి. కానీ ఎవరో ఒక రైతు కేసు వేశాడు. ఎక్కువ పరిహారం కోసం కావచ్చు. నాలుగేళ్లుగా ఆ కేసు నడుస్తూనే ఉంది. అది వరదకాలువ. ప్రతిఏటా ఒక సారయితే ఆ కాలువకు నీరొస్తుంది. ఆ చెరు-వులన్నీ నిండుతాయి. ఆ పొలాలన్నీ పండుతాయి. నాలుగేళ్లలో ఆ గ్రామాలకు జరుగుతున్న పంటనష్టం లెక్కవేస్తే ఆ ఒక్క రైతుకు ఇచ్చే పరిహారం లెక్కలోకి రాదు. కానీ అధికారులు ఇంతదూరం ఆలోచించరు. కాంట్రాక్టర్లకు వివాదం నడుస్తూ ఉండాలి. ఇంజనీర్లూ చూసీచూడ-నట్టు వెళుతుంటారు.

వీరి ధోరణి ఎలా ఉంటుందంటే-నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని ఆ ఊరి చివరిదాకా కాలువ పూర్తయింది. ఇవతలివైపు పెండింగులో పడింది.అయినా కాలం ఆగదు కదా! వరద నీరు వచ్చింది. మిగతా పని పూర్తి కాలేదన్న సాకుతో కాంట్రాక్టరు అక్కడ అడ్డుకట్టవేసి పక్కనే ఉన్న వాగులోకి మళ్లించాడు. కాలువ నీరు కళ్లముందే వాగులో కలిసి పోతుంటే కరువులో ఉన్న సమీప గ్రామాల రైతుల హృదయం ఎలా ఉంటుంది? తమ ఊరి చివరి దాకా వచ్చిన నీటిని అడ్డుకట్ట తొలగించి ముందుకు వదలాలని, రైల్వే కల్వర్టుల ద్వారా రెండు చెరువులు నింపుకుంటామని రైతులు అర్థించారు. కాంట్రాక్టరు ముందు సరేనన్నాడు, తర్వాత అడ్డం తిరిగాడు. రైతులు బలప్రయోగానికి దిగారు. కాంట్రాక్టర్ పోలీసులను దింపాడు. అందరూ కలిసి రైతాంగాన్ని బెదిరించారు. నీటి విలువ తెలిసిన మనుషులేనా వీళ్లు? నీటి విలువ తెలిసిన వ్యవస్థలేనా ఇవి? మాధవరెడ్డి కాలువపై ఉదయ సముద్రం పూర్తయి పదేళ్లవుతుంది. కానీ ఇప్పటికీ అది పూర్తిస్థా-యిలో నిండలేదు. అది పూర్తిస్థాయిలో నిండితే డీ-40కి, మూసీకి నీరు ఇవ్వవచ్చు. కనీసం 40 చెరువులు నిండుతాయి. వేల ఎకరాలు సాగులోకి వస్తున్నాయి. ఆ పంటల విలువ వందల కోట్లలో ఉంటుంది. అక్కడి జీవన విధానమే మారిపోతుంది. అదనంగా మరో ఐదారు టీఎంసీల నీటిని ఉపయోగించుకోవచ్చు. కానీ ఏదో తెలియని జబ్బు పట్టినట్టు ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. సమీక్షలు జరుగుతుంటాయి. సంవత్సరాలు గడుస్తుంటాయి. వివాదం మాత్రం తేలదు.

ఎస్‌ఎల్‌బీసీ ఎప్పటి ప్రాజెక్టు? దీనితో ఆలోచన చేసిన ఎస్‌ఆర్‌బీసీ గత పదిహేనేళ్లుగా నీళ్లంది-స్తున్నది. దీనితర్వాత ఆలోచన చేసిన తెలుగు గంగ పూర్తయింది. కడప-కర్నూలు కాలువకు అనుసంధానమూ పూర్తయింది. దీని కంటే వెనుక మొన్నమొన్న ప్రారంభించిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ విస్తరణ కూడా పూర్తయి ఆరేళ్లు దాటింది. వెలుగోడు టన్నెలు కూడా పూర్తి కావ-చ్చింది. కానీ ఎస్‌ఎల్‌బీసీ మాత్రం నత్త నడక నడుస్తూనే ఉంటుంది. జిల్లాలో పెద్ద నాయకులు పెద్ద పెద్ద మాటలు చాలా కాలంగా చెబుతున్నారు. కానీ పట్టుబట్టి పనిచేయించింది లేదు. ఫ్లోరైడు బాధితులకు నీరందించడానికి అవకాశం ఉన్న ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయించింది లేదు. ఎస్‌ఆర్-ఎస్‌పీ మూడవ దశ కాలువలు పూర్తయి పదేళ్లు దాటింది. ఆ కాలంలోనే వెయ్యి కోట్ల రూపాయ-లకు పైగా ఖర్చుపెట్టినట్టు చెబుతారు. కానీ నీళ్లు పారింది ఒకటి రెండేళ్లు మాత్రమే. దేవాదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత కంతానపల్లి అనుసంధానం ప్రచారంలోకి తెచ్చారు. ఏది చెస్తారో తెలియదు. కానీ వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసి, వందల కోట్లు కూడా రాబట్టలేని దుస్థితి.

నీటిపారుదల ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతున్నామంటే అందుకు అనేక రెట్లు అధికంగా ఆదాయం సృష్టించాలన్న లక్ష్యంతో చేస్తున్నామని అందరూ మరచిపోతున్నారు. ప్రాజెక్టులపై వందలు, వేలకోట్ల రూపాయలు కుమ్మరించి ఆ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే ఆ ప్రాంత రైతాంగా-నికి ఎంత నష్టం? ప్రభుత్వానికి ఎంత లోటు? రాజశేఖర్‌రెడ్డి ప్రాజెక్టులు ప్రారంభించడంపై చూపిన శ్రద్ధ, మొబిలైజేషన్ అడ్వాన్సులు తర్పణ చేయడంలో చూపిన శ్రద్ధ, ప్రాజెక్టులను పూర్తి-చేయడంపై చూపలేదు. అలాగని అన్నింటినీ వదిలేశారా అంటే అదీ లేదు. తనకు కావలసిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను మూడేళ్లలో అడ్డంగా తవ్వుకున్నారు. ఆయనకు స్పష్టత ఉంది. నాడు తెలంగాణ నాయకత్వానికే లేకపోయింది. ఆయన అడుగులకు మడుగులొత్తడంలోనే అందరూ తరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలి. నీటి సోయి ప్రభుత్వానికి, నాయకత్వానికి ఉంటే చాలదు. అది మొత్తం అధికార యంత్రాంగానికి రావాలి. పనులు జరిపించడంలో లక్ష్యశుద్ధి ఉండాలి. ప్రాజెక్టులపై ఖర్చు పెడుతున్న ప్రతిపైసకూ లెక్క కావాలి. ప్రాజెక్టులపై నిద్రపోతున్న కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను మేల్కొల్పాలి. ఒక్కో వర్షాకాలం కోల్పోతున్నామూ అంటే కొన్ని వేలకోట్ల రూపాయలు నష్టపోతున్నామని గుర్తించాలి. అమూల్య-మైన ప్రజాధనాన్ని పెట్టుబడిగా పెట్టి నిర్లక్ష్యం చేస్తున్నామని గుర్తించాలి.

తెలంగాణ మంచి చెడుల కొలబద్ద

Telangana-map

కేసీఆర్‌ను తిట్టివాడు కేబీఆర్ పార్క్ వాకర్లలో హీరో అప్పట్లో. కానీ తెలంగాణ ప్రజల మనసు వేరు కదా. పాపం మోత్కుపల్లి రాజకీయంగా దెబ్బతినిపోయారు. కొడంగల్ నియోజకవర్గం ప్రధాన స్రవంతిలో లేకపోవడం వల్ల రేవంత్‌రెడ్డి బతికిపోయాడు. నేడు మాట్లాడగలుగుతున్నాడు. మోత్కుపల్లి స్థానాన్ని ఆయన తీసుకున్నట్టున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు ఏది ఒప్పు అన్నది అర్థం చేసుకోవడానికి వేరే కొలమానాలు అక్కరలేదు. రేవంత్‌రెడ్డి తప్పు పడుతున్నాడూ అంటే అది కచ్చితంగా ఒప్పయి ఉంటుంది. రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడూ అంటే చంద్రబాబు మాట్లాడుతున్నాడని అర్థం. చంద్రబాబు తెలంగాణకు ఏది అవసరమో అది మాట్లాడడు కదా? తెలంగాణకు ఏది మంచో అది చెప్పడు కదా? ఆ పత్రికలు, ఆ చానెళ్లు ఏడుస్తున్నాయీ అంటే అదేదో తెలంగాణకు శుభం జరిగినట్టే-శనివారం పొద్దుటే ఫోనులో ఒక రాజకీయ బుద్ధిజీవి విశ్లేషణ ఇది. రాజకీయాల్లో కొన్ని ప్రతీకలు అలా ఏర్పడతాయి. గతంలో మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడితే తెలంగాణలో అలాగే అనుకునేవారు. అన్నా ఎన్ని ఫోన్లు వస్తున్నాయో తెలుసా అని ఒక సారి తెగ ఆనందపడిపోయారు మోత్కుపల్లి. అవును కేసీఆర్‌ను తిట్టివాడు కేబీఆర్ పార్క్ వాకర్లలో హీరో అప్పట్లో. కానీ తెలంగాణ ప్రజల మనసు వేరు కదా. పాపం మోత్కుపల్లి రాజకీయంగా దెబ్బతినిపోయారు. కొడంగల్ నియోజకవర్గం ప్రధాన స్రవంతిలో లేకపోవడం వల్ల రేవంత్‌రెడ్డి బతికిపోయాడు. నేడు మాట్లాడగలుగుతున్నాడు. మోత్కుపల్లి స్థానాన్ని ఆయన తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు సహజంగానే రేవంత్‌రెడ్డి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఆయన లక్ష్యమట అని తెలుగుదేశం వ్యవహారాలు చూసే ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు. పాపము శమించుగాక. మంచి చేసి నాయకుడు కావచ్చు. కానీ చెడు చేసి, చెడు మాట్లాడి, చెడు పక్షం వహించి నాయకుడు కావడం చరిత్రలో జరుగలేదు. అలా జరిగితే ఆ రాష్ట్రం కొసెల్లదు. అసలు ఆయన గురించి ఇంత టాపిక్ అవసరమా అని వాకింగ్ మిత్రుడు నిలదీశాడు. ఆయన గురించి ఇంతగా మాట్లాడుతున్నారూ అంటే ఆయన విజయం సాధించినట్టే కదా అని మరో లాజిక్కు తీశాడు మిత్రుడు. నిజమే…కానీ వందసార్లు చెబితే అబద్ధం నిజమవుతుందని నమ్మే రాజకీయ సంతతికి ప్రస్తావించకుండా సమాధానం చెప్పలేం. మెట్రో గురించి, ఆ తర్వాత మై హోం గురించి చేస్తున్న ప్రచారం చూస్తే కచ్చితంగా ఇందులోని కుట్రకోణం బయటపడుతుంది. తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు, ఆయన ఏజెంట్లు ఎంతగా కాచుకుని కూర్చున్నారో ఈ పరిణామాలు చెప్పకనే చెబుతాయి. చంద్రబాబు, ఆయన పంజరంలోని చిలుక రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఎల్‌అండ్‌టీకి పంచాయితీ వస్తే ఎల్‌అండ్ టీపక్షం వహిస్తాడు. ఎల్‌అండ్‌టీకి మై హోంకు పంచాయితీ వస్తే ఎల్‌అండ్‌టీ పక్షం వహిస్తాడు. మై హోంకు గేమింగ్ సిటీకి పంచాయితీ వహిస్తే గేమింగ్ సిటీ పక్షం వహిస్తాడు. రేవంత్‌రెడ్డి ఇక నుంచి ఏ అంశంలోనయినా ఎవరి పక్షం వహిస్తాడో వేరే చెప్పనవసరం లేదు.

ఎవరు ఏపక్షం వహించినా సత్యం సమాధి కాకూడదు కదా. మై హోం ఏపీఐఐసీ వద్ద భూమిని వేలం పాడి తీసుకుంది నిజం కాదా. మొత్తం భూమికి డబ్బులు చెల్లించింది నిజం కాదా? ఆ భూమిని మై హోంకు అందించాల్సిన బాధ్యత ఏపీఐఐసీకి లేదా? అది అమలయ్యేట్టు చూడాల్సిన బాధ్యత వేలం డబ్బులను పూర్తిగా రంగరించి మింగేసిన ప్రభుత్వానికి లేదా? భూవివాదాలు ఏమి తలెత్తినా పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వానిది, ఏపీఐఐసీది కాదా? గేమింగ్ సిటీ ప్రారంభోత్సవానికి వెళ్లిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సాక్షి గా మంత్రి పొన్నాలను యూ ఛీటర్స్ అని అంత పెద్ద సభలోనే నిలదీయడానికి ఎంతటి దమ్ము ఉండాలి. మైం హోం రామేశ్వర్‌రావుకు దమ్ము ధైర్యం ఉన్న మనిషిగా పేరు ఉంది. ఆయన దైవభక్తి పరాయణుడు. అనేక ఆధ్యాత్మిక, సామాజిక స్వచ్ఛంద సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు. తెలుగుదేశంను మోస్తున్న పారిశ్రామిక వేత్తల్లా కొండలను, గోలకొండలను మింగేసేరకం కాదు. ఆయనపై ఇంతవరకు ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలు లేవు. రేవంత్‌రెడ్డి మోకాలు బోడిగుండు మాత్రమే కాదు చిటికన వేలు కూడా ముడేయాలని తాపత్రయ పడుతున్నాడు. తిమ్మినిబమ్మి బమ్మిని తిమ్మి చేయాలని చూస్తున్నాడు. ఆయన మాటకారితనం ఇలా ఉపయోగపడుతున్నది. తెలంగాణకు వ్యతిరేక అద్దెమైకులుగా స్థిరపడిన కొన్ని చానెళ్లు రేవంత్‌రెడ్డి నోటికి గొట్టాలు తగిలించి గంటలు గంటలు వదిలేశాయి. పర్వాలేదు. మళ్లీ అదే మాట. ఆయన ఎందుకు మాట్లాడతాడో, ఆ మీడియా ఎందుకు ప్రచారం చేస్తుందో అర్థం చేసుకునే శక్తి తెలంగాణ సమాజానికి ఉంది. హీన వ్యక్తిత్వాలను నిర్లక్ష్యం చేయగలిగే యుక్తి కూడా తెలంగాణ సమాజానికి ఉంది.

చంద్రబాబునాయుడు ఎల్‌అండ్‌టీకి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అది ప్రొఫెషనల్ సంస్థ అట. ఆ వివాదంలోకి తనను లాగొద్దట. ఎల్‌అండ్‌టీకీ రాజకీయాలు లేవట. నిజమే ఎల్‌అండ్‌టీ ప్రొఫెషనల్స్ నడుపుతున్న సంస్థ. దాని పనితనంపై అందరికీ గౌరవం ఉంది. అది సాధించిన విజయాలు అమోఘం. మెట్రోను నిర్మిస్తున్న తీరు కూడా మంచి ప్రశంసలు పొందుతున్నది. కానీ ఎల్‌అండ్‌టీ రాజకీయాలకు అతీతం కాదు. తెలంగాణ రావాలో వద్దో, వస్తే మంచో చెడో ఆలోచించేవాడు రాజకీయాలకు అతీతమైనవాడు ఎలా అవుతాడు. తెలంగాణ వచ్చింది కాబట్టి, మాకు లాభాలు రాకపోవచ్చని ఇప్పుడు ఎగనామం పెడదామని ఆలోచించే సంస్థ నిజాయితీని శంకించకుండా ఎలా ఉండడం? ముందున్న ప్రభుత్వాలు తెలంగాణ రాదని చెప్పి ఒప్పందంపై ఏమైనా సంతకాలు పెట్టించాయా? హైదరాబాద్‌లో మెట్రో లాభసాటి కాదని మెట్రో ఏదైనా అధ్యయనం చేయించిందా? ఏవైనా నివేదికలు రూపొందించిందా? వాటన్నింటినీ బహిర్గతం చేయండి లేక పోతే ఎవరిని మెప్పించడానికి ఈ లేఖలు రాస్తున్నది. కాంట్రాక్టు సంస్థలు ఇంత పెద్ద నిర్ణయాలను ఇంత తేలికగా ఎలా తీసుకోగలుగుతున్నాయి? ఎవరి ధైర్యం చూసుకుని ఇటువంటి దోబూచులాటలు ఆడుతున్నాయి? సచివాలయంలో డీ బ్లాక్ నిర్మాణం సందర్భంగా కాగ్ కూడా ఎల్‌అండ్‌టీని తప్పుపట్టింది. ఎల్‌అండ్‌టీకి అక్రమ చెల్లింపులు జరిగాయని విమర్శలు వచ్చాయి. డీ బ్లాక్ చెల్లింపులకు ప్రతిగా ఎల్‌అండ్‌టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించిందని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. మెట్రో ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్చారని, దారిపొడవునా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల సంతర్పణ జరుగుతున్నదని స్వచ్ఛంద సంస్థలు చాలాకాలంగా విమర్శిస్తున్నాయి. ముందు అంగీకరించిన దానికంటే ఆ తర్వాత చాలా డిమాండ్లు పెంచుతూ పోయిందని విమర్శలు వచ్చాయి.

ఫిర్యాదులు ఉంటే ఎల్‌అండ్‌టీ ప్రభుత్వానికి లేఖలు రాయడంలో తప్పు లేదు. ఏ రాజకీయాలూ లేకపోతే ఆ లేఖలు ఆ రెండు పత్రికలకు ఎందుకు దక్కుతాయి? ఎల్‌అండ్‌టీ వ్యాపారం చేస్తున్నదా రాజకీయాలు చేస్తున్నదా? అన్న ప్రశ్నలు తలెత్తడం అందుకే. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి, ఒక రకంగా రాజకీయాలు చేసి లబ్ధిపొందుదామని చూసినట్టు అర్థమవుతున్నది. కానీ ఎల్‌అండ్‌టీ మిత్రపూర్వకంగా సాధించదల్చుకుందా అమిత్రవైఖరితో ఘర్షణ పడదల్చుకుందా అన్నది తేల్చుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం అమిత్ర వైఖరిని సహజంగానే దీటుగా తిప్పి కొట్టింది. సీమాంధ్ర పత్రికలు, టీడీపీ ఇచ్చే సర్టిఫికెట్లు ఏవీ తెలంగాణలో చెల్లవని ఎవరయినా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకుల్లో, అధికారుల్లో చంద్రబాబు ఆర్డర్లు పాటించే శక్తులు ఉండవచ్చు. కానీ ప్రజల్లో ఉండబోరని ఇప్పటికే రుజువయింది. బీజేపీ, కాంగ్రెస్‌లను తెలంగాణ ప్రజలు సహిస్తారు. అవి కూడా స్వతంత్రంగా వ్యవహరించగలిగితేనే. కానీ సీమాంధ్ర ఆధిపత్యానికి అవశేషంగా మిగిలే తెలుగుదేశంను మాత్రం తెలంగాణ ఇంకెప్పుడూ జీర్ణించుకునే అవకాశాలు లేవు. హైదరాబాద్‌లో వలస ఓట్లతో ఎప్పుడయినా రెండు మూడు సీట్లు దక్కించుకోగలదేమో కానీ, తెలంగాణ గడ్డమీద మాత్రం ఆ పార్టీకి అంత్యక్రియలు జరిగినట్టే. రేవంత్ రెడ్డి కాదు కదా స్వయంగా చంద్రబాబే ఇక్కడికొచ్చి నిలబడినా తెలంగాణ ప్రజలు మన్నించే అవకాశం లేదు.

ఇటు నీటికి కటకట, రైతు కంట నీరు, అటు సముద్రంపాలవుతున్న నీరు

80 Water Bodies

అక్కడ అత్యంత అమూల్యమైన వందల టీఎంసీల నీరు గంగలో కలసి పోతున్నది. ఒక్క టీఎంసీ నీటితో సుమారు 10000 ఎకరాలు పారించవచ్చని, పది వేల ఎకరాల్లో 50 నుంచి 100 కోట్ల రూపాయల విలువైన పంటలు పండించవచ్చునని ఒక ఇంజనీరు లెక్క చెప్పారు.

ఈసారి కూడా మా ఊరికి నీరు రాలేదు. కాలం కాలేదు. వరద కాలువ నీరు అదిగో మూడు కిలోమీటర్ల అవతలే ఒక వాగులో పడి కొట్టుకు పోతున్నది. వృధాగా ప్రవహించి కృష్ణా నదికి, అటు నుంచి బంగాళాఖాతానికి వెళ్లి పోతున్నది. ఇక్క బీళ్లు నోళ్లు తెరుచుకుని నీటికోసం అంగలార్చుతున్నాయి. అక్కడ అత్యంత అమూల్యమైన వందల టీఎంసీల నీరు గంగలో కలసి పోతున్నది. ఒక్క టీఎంసీ నీటితో సుమారు 10000 ఎకరాలు పారించవచ్చని, పది వేల ఎకరాల్లో 50 నుంచి 100 కోట్ల రూపాయల విలువైన పంటలు పండించవచ్చునని ఒక ఇంజనీరు లెక్క చెప్పారు.

ఈ మ్యాపు చూడండి. ఇది నల్లగొండ జిల్లాలోని చెరువుల చిత్రం. చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 80 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నీ నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలతోపాటు కొన్ని మిర్యాలగూడెం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ చెరువులకు నీరందించేందుకే ఉదయసముద్రం నుంచి 40వ డిస్ట్రిబ్యూటరీ(దీనినే డి-40అంటారు)ని, ఉదయ సముద్రం నుంచి మూసీ వరకు కాలువను తవ్వారు. ఈ కాలువలు తవ్వి చాలా కాలమైంది. కానీ చాలా చోట్ల చిన్నచిన్న పనులు మిగిలిపోయాయి.

అధికారులుకు పట్టింపు లేదు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకూ పట్టింపు లేదు. ఈ గ్రామాలు నిత్యం నీటి కరువుతో కటకటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడో 700-800 కిలోమీటర్ల దూరంలోని రిజర్వాయర్లకు పోతిరెడ్డి పాడు నుంచి నీటిని తీసుకెళుతోంది. వాళ్లు మంచిపనే చేస్తున్నారు. మన నాయకులు, అధికారులు మాత్రం ఏదో ఒక సాకుచెప్పి కాలువల పనులను పెండింగులో పెడుతూనే ఉన్నారు. జనం సంక్షోభం పాలవుతూనే ఉన్నారు. అక్కడక్కడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ పనిని మూడే మూడు సంవత్సరాల్లో తవ్విపారేశారు. కోర్టు కేసులు, కంప్లెయింట్లు, స్థానిక రైతుల అభ్యంతరాలు….ఇవేవీ లెక్కపెట్టలేదు. పనిని ఒక్క రోజు కూడా ఆపలేదు. కానీ చిన్న కాలువ పనులు పూర్తి చేయడానికి మన నాయకులకు, మన అధికారులకు ఏళ్లూపూళ్లూ పడతాయి. ఎవడో ఒకడు కేసు వేశాడట. ఇక అక్కడితో పని ఆగిపోయిందట.

కాలువల పనులు పూర్తి చేసి ఏటా 80 చెరువులు నింపితే చెరువుకు సగటున వందెకరాలు వేసుకున్నా 8000 ఎకరాలు సాగవుతుంది. ప్రతిఏటా ఒకసారి చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీటి సమస్య ఉండదు. ఊరు సస్యశ్యామలమవుతుంది. కరెంటు కష్టాలు తగ్గుతాయి. రైతులపై భారం తగ్గుతుంది. ఎందుకు ఆలోచించరో మన నేతలు.

Corporates Political War

image

L&T arguements and letters to the Telangana Government are nothing, but a political war with. Usually Corporate companies bother about political situation in investment prone states and nations. Nothing wrong in it. They never document their political thought in records. But unusually L&T done it. They thought that the Telangana State will not form. Against their wishes Telangana formed.

The Company feel that the project is not viable in the given situation. As per my knowledge L&T is doing contracts in Afghanistan, east Asia and African nations, where the political establishments most unstable. They may have habit of raising such bogey and enhancing the contract amount. But L&T made a mistake, Telangana is not Afghanistan or any other state.

The same problem can be addressed in corporate decorum. But it seems politics of Andhra and Telangana overwhelmed on him. It might have been influenced by the otherside of the division. It might have been playing into the hands of Andhrapradesh establishement, who were envy at the image Hyderabad had.

And also AndhraPradesh goverment has to take up Capital and many infrastructure projects worth more than one lakh crores. L&T may have an eye on those contracts. L&T had good and workable equation with Chandrababu, as they both executed number of projects earlier.
Every loss of Hyderabad will be gain of Andhraptadesh. This may be propmted the latest controversy.

Telangana Government must be cautious in dealing these corporates. The handling of controversy sofar good and fast. At tge same time we must not loose L&T . It cannot be rubbed wrongside. Let us take the them in to confidence.

నీ కోడీ కుంపటి లేకున్నా ఏదీ ఆగదు

IMG_2293.JPG

నా కోడీ కుంపటి లేకపోతే లోకానికి తెల్లారాదని భ్రమించే ముసలమ్మలు మీడియాలో చాలా మందే ఉన్నారు.

రెండు ఛానళ్ళు మూతపడి మూడు మాసాలు పూర్తయ్యాయి. భూకంపాలు రాలేదు. కల్లోలం చలరేగలేదు.

రాజకీయాలు స్తంభించిపోలేదు. దిగులుతో ప్రజలు మంచాన పడలేదు. ఎన్నికలు ఆగలేదు. ఓట్లు వేయడం మానుకోలేదు.

టీఆరెస్ను గెలిపించడం మానలేదు.

సెప్టెంబరు 17 తెలంగాణ స్వేచ్ఛాదినం

సెప్టెంబరు 17 తెలంగాణ స్వేచ్ఛాదినం

nalgonda-district-map

సీమాంధ్ర ఆధిపత్య శక్తులను ఖండించే క్రమంలో చాలా మంది నిజాం ప్రభువును ఊరేగించేదాకా వెళ్లారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల కంటే నిజామే గొప్పవారని చెప్పేదాకా వెళ్లారు. భూస్వామ్య ప్రభువులెప్పుడూ ఆధునిక పెట్టుబడి దారుల కంటే ఉత్తముడూ ఉన్నతమైనవాడూ కాలేడు…మార్క్సిస్టు గతి తర్కం ప్రకారం. ఒకరిని ఖండించడంకోసం మరొకరిని ఎత్తుకోవడం మంచిది కాదు.

అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలకు సెప్టెంబరు 17 ఒక ప్రత్యేకమైన రోజు. తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఆ రోజును విద్రోహ దినమని కొందరు, విలీనదినమని మరికొందరు, స్వాతంత్య్రదినమని ఇంకొందరు వాదిస్తున్నారు. కానీ అందరూ ఒక మౌలిక అంశాన్ని విస్మరిస్తున్నారు. పార్టీలు, వారి రాజకీయ సిద్ధాంతాలు, వాదోపవాదాలతో నిమిత్తం లేకుండా ఆరోజు తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. నిజాం ప్రభువుకు మనం ఎంత గొప్ప భుజకీర్తులు పెట్టాలని ప్రయత్నించినా భూస్వామ్య, రాజరిక ప్రభువు ప్రజాస్వామిక ప్రభువు కాలేడు. సమాజం అభ్యున్నతికి అత్యవసరమైన రెండు అంశాల విషయంలో నిజాం ప్రభువువల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. మొదటి అంశం: 1948కి ముందు తెలంగాణ ప్రజలకు మాతృభాషలో చదువుకునే అదృష్టం కలుగలేదు. జిల్లాకు రెండు మూడు మల్టీపర్పస్ హైస్కూళ్లు ఉన్నా మెజారిటీ జన బాహుళ్యానికి చదువు అందుబాటులోకి రాలేదు. అప్పటి బోధనా భాష ఉర్దూ. ఇందుకు భిన్నంగా సీమాంధ్రలో ఆంగ్లేయుల పాలన కారణంగా మనకంటే వందేళ్ల ముందునుంచే చదువుకునే అవకాశాలు మెండుగా లభించాయి. తెలంగాణ, సీమాంధ్రల మధ్య ఈ వందేళ్ల వెనుకబాటు అంతరం నిన్నమొన్నటి వరకు కొనసాగుతూనే వచ్చింది. కృష్ణా జిల్ల గుడివాడ సమీపంలోని ఒక పల్లెటూరిలో 190లోనే ఆడపిల్లలకోసం ఒక ప్రత్యేక పాఠశాలను ప్రారంభించగా, మా ఊళ్లో పదవ తరగతి చదువుకునే అవకాశం మాకు 1977లో మాత్రమే వచ్చింది. అంతకుముందు ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకో వలసిన దుస్థితి. అందువల్ల నిజాం హయాంలో విద్యావికాసం, సాంస్కృతిక జీవనానికి సంబంధించి మనం అహో ఒహో అని కీర్తించవలసింది ఏమీ కని పించదు. హైదరాబాద్‌లో నిర్మించిన మహాసౌధాలు, విశ్వవిద్యాలయ భవనాలు ఎస్టాబ్లిష్‌మెంట్ కోసమే, సామాన్య జనంకోసం కాదు. అవి ఇప్పుడు మనకు ఉపయోగపడినంత మాత్రాన నిజాం పరిపాలన అసలు స్వభావాన్ని నిందించ కుండా వదలివేయలేము. నిజాం కృషికి తగిన గుర్తింపునివ్వాలను కోవడం వరకు సమంజసమే కావచ్చు, కానీ గడచి కాలమంతా మంచిది కాదు. చెరువులు తవ్వించి ఉండవచ్చు, ప్రాజెక్టులు కట్టించి ఉండవచ్చు…కానీ అవి ఎవరికి ఉపయోగపడ్డాయన్నదే కీలకమవుతుంది. ప్రజలకా, రాజు, ఆయన తాబేదార్లకా? సీమాంధ్ర ఆధిపత్య శక్తులను ఖండించే క్రమంలో చాలా మంది నిజాం ప్రభువును ఊరేగించేదాకా వెళ్లారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల కంటే నిజామే గొప్పవారని చెప్పేదాకా వెళ్లారు. భూస్వామ్య ప్రభువులెప్పుడూ ఆధునిక పెట్టుబడి దారుల కంటే ఉత్తముడూ ఉన్నతమైనవాడూ కాలేడు…మార్క్సిస్టు గతి తర్కం ప్రకారం. ఒకరిని ఖండించడంకోసం మరొకరిని ఎత్తుకోవడం మంచిది కాదు.

రెండవ అంశం: తెలంగాణలో నిజాం పాలనలో ఉన్నది పచ్చి భూస్వామ్య సమాజం. అత్యంత హేయమైన వెట్టిచాకిరీ, దాస్యం, దోపిడీ, అప్రజాస్వామిక ధోరణులకు తెలంగాణ ఆలవాలం. పటేల్, పట్వారీ, భూస్వామి ఏది చెప్పితే అదే చెలామణి కావడం అప్పటి రివాజు. ఎన్నికలు లేవు, ప్రజాప్రతినిధులు లేరు. అంతా ఏలికల ఇష్టం. దొరలు, భూస్వాములు, దేశ్‌ముఖులు జనాన్ని ఎంతగా పీడించుకుతిన్నారో, ఎంతగా పెత్తనం చెలాయించారో ఆనాటి చరిత్ర పుటలు చెబుతున్నాయి. ఇందుకు మినహాయింపులు ఉండవచ్చు. భూస్వామ్య కుటుంబాల నుంచి వచ్చినవారే కొందరు పుచ్చిపోయిన రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తి గర్జించి ఉండవచ్చు. ప్రజల పక్షాన నిలబడి పోరాడి ఉంవచ్చు. కానీ ఒక వ్యవస్థ గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు మెజారిటీ భూస్వాములు, దేశ్‌ముఖులు ఎలా ఉన్నారన్నదే కొలమానమవుతుంది. ఈ వ్యవస్థ పునాదులపై వెలసింది ఏదైనా ఉత్తమమైనదే. స్వాగతించదగినదే. నిజాం ప్రజాస్వామిక వాది కాదు. ఆ రోజు అటు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కానీ, ఇటు కమ్యూనిస్టు పార్టీగానీ పోరాడింది నిజాం నుంచి విముక్తి పొందడం కోసమే. అందుకే 1948 సెప్టెంబరు 17న కేంద్రం పంపిన సేనలు హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు తెలంగాణ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఏర్పడిన సందర్భంగా 2014 జూన్ 2న ఎంత ఆనందపడ్డారో అరోజు కూడా అంతే ఆనందించారు. ఒక్క కమ్యూనిస్టులు మాత్రం కన్ఫ్యూజ్ అయిపోయారు. సైనిక చర్య నేపథ్యంలో కొందరు కమ్యూనిస్టు నాయకులు సాయుధపోరాటాన్ని విరమించాలని ప్రతిపాదించారు. మరికొందరు లేదు లేదు కొనసాగించాల్సిందేనని పట్టుబట్టారు, పంతానికి దిగారు. మావో సేటుంగ్ చైనాను విముక్తి చేసినట్టు మనం తెలంగాణను విముక్తి చేద్దామని కొందరు కామ్రేడ్స్ దుస్సాహసిక దుందుడుకు వాదానికి దిగారు. బ్రిటన్ భారత్‌కు వదిలేసిపోయిన సైన్యాల బలాన్ని కమ్యూనిస్టు నాయకత్వం తక్కువ అంచనా వేసింది. పర్యవసానంగా నిజాం నుంచి తెలంగాణ విముక్తిని కమ్యూనిస్టు పార్టీ ఒక ఉత్సవంగా జరుపుకోలేకపోయింది. కొత్తగా పెట్టుకున్న లక్ష్యాలు ఆ పార్టీని చాలా దూరం తీసుకెళ్లాయి. భారత సైనిక జనరల్ చౌధరి కమ్యూనిస్టులను ఊచకోత కోయించారు. సుమారు 4000 మంది మెరికల్లాంటి సాయుధ పోరాటయోధులను కోల్పోవలసి వచ్చింది. చివరికి ఎప్పుడో 1952లో సాయుధ పోరాటాన్ని విరమించి, ఎన్నికల రాజకీయాలకు దిగాల్సి వచ్చింది. అదేపనిని 1948 సెప్టెంబరు 17న చేసిన ఉంటే కమ్యూనిస్టులు తెలంగాణలో బలమైన శక్తులుగా ఎదిగి ఉండేవారు. మొత్తంగా సైనిక చర్య వల్ల ఒక భూస్వామ్య ప్రభుత్వం అంతరించి, ఒక జాతీయ ప్రజాస్వామిక ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే సివిల్ పాలన, ఆ తర్వాత ప్రజాస్వామిక పాలన వచ్చాయి. ఈ మార్పును ఎలా తిరస్కరించగలరు? ఈ మార్పులకు పునాది సెప్టెంబరు పదిహేడే అంటే ఎవరు కాదనగలరు?

సైనిక చర్య లక్ష్యం నిజాం కానే కాదని, కమ్యూనిస్టుల అణిచవేతేనని, అందుకే ఇది విద్రోహదినమని కొందరు అతివాద వామపక్ష మిత్రులు వాదిస్తున్నారు. అయితే వారు కొన్ని పరిణామాలను కావాలని విస్మరించి, మిగిలిన పరిణామాలను గురించే మాట్లాడుతున్నారు. నిజాంకు, భారత ప్రభుత్వానికి మధ్య ఏ దశలోనూ సయోధ్య లేదు. నిజాం ఆఖరి వరకు తనది స్వతంత్ర దేశమని, తన స్వతంత్ర ప్రతిపత్తిని కావాడాలని ఐక్యరాజ్యసమితిపైన, బ్రిటన్‌పైన, ఇతర ప్రపంచదేశాలపైన ఒత్తిడి తెస్తూనే ఉన్నాడు. అందువల్ల ఆయనకోసం కాకుండా కేవలం కమ్యూనిస్టులకోసమే జనరల్ చౌధరి వచ్చారని చెప్పడం వాస్తవ దూరం అవుతుంది. ఒక రాజకీయ వాదన మాత్రం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. దీనికి చారిత్రక ఆధారాలు లేవు. కానీ సర్‌కమ్‌స్టాన్సియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్‌లో స్టేట్ కాంగ్రెస్ నాయకత్వం బ్రాహ్మణ వర్గాల చేతుల్లో ఉంది. కాంగ్రెస్‌లో కొండా వెంకటరంగారెడ్డి, చెన్నారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, నూకల నరోత్తమరెడ్డి వంటి వారు ఉన్నప్పటికీ పెత్తనం బూర్గుల, స్వామి రామానందతీర్థ, ఉమ్మెత్తల నరసింగరావు, మాడపాటి హనుమంతరావు వంటివారు అనేక మంది పార్టీపై పెత్తనం చేస్తూ వచ్చారు. బ్రాహ్మణ నాయకత్వానికి ఢిల్లీలో లాబీయింగ్ కూడా ఎక్కువే. రెండు వర్గాల మధ్య అధికారం కోసం ఘర్షణలు జరుగడం కూడా అప్పటికే ఉంది. మరోవైపు కమ్యూనిస్టుల నాయకత్వం రెడ్ల చేతిలో ఉంది. ఇంకోవైపు రజాకార్లు కూడా యధేచ్ఛగా చెలరేగుతున్నారు. నిజాంను అంకెకు తేవడంతపాటు కమ్యూనిస్టులను, రజాకార్లను అణచివేయడంకోసం సైనిక చర్య జరిగిందని చెబుతారు. 1956లో కూడా బూర్గుల రామకృష్ణారావును విశాలాంధ్రకు ఒప్పించడానికి ఢిల్లీలోని బ్రాహ్మణ సామాజిక వర్గం ఇదే సూత్రీకరణను ఉపయోగించుకుంది. రెడ్డీస్, రెడ్స్ అండ రజాకార్స్- వీళ్లను తట్టుకుని నిలబడలేవు. సొంతపార్టీలో రెడ్లు నిన్ను నెగలనీయరు. విడిగా ఉంటే ఎప్పుడో ఒకప్పుడు కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. రజాకార్లను కూడా నీవు అదుపు చేయలేవు. అందుకే విశాలాంధ్రలో కలిస్తే అక్కడ ఇక్కడ ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం సంఘటితమవుతుంది అని అప్పట్లో బూర్గులకు చెప్పి ఒప్పించారని సీనియర్ రాజకీయ నాయకులు చెబుతారు.

హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మరాట్వాడాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతున్నదని, ఇక్కడ సీమాంధ్ర ప్రభుత్వం సెప్టెంబరు 17ను గుర్తించకపోవడం అన్యాయమని నిన్నమొన్నటిదాకా మనమే నిందించాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ కారణాలు చెప్పి ఉత్సవాలకు దూరంగా ఉంటుంది? తెలంగాణ అస్తిత్వం ప్రతీకలను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్న ప్రభుత్వం రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును ఎలా విస్మరించగలదు. మనకు రాని స్వాతంత్య్ర దినం ఆగస్టు పదిహేనును ఘనంగా నిర్వహించే మనం, మనకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబరు 17ను ఎలా విస్మరించగలం? ఇప్పుడు సెప్టెంబరు 17ను జరుపుకోకపోవడం రాజకీయ అవకాశవాదం అవుతుంది. చరిత్రను అవమానించడం అవుతుంది. రాజకీయ పునరుజ్జీవనం గురించి మాట్లాడుతున్నవాళ్లం, మొన్నమొన్నటి వాస్తవాలను ఎలా దాచిపెట్టగలం? అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ప్రధాన స్రవంతి రాజకీయ పక్షంగా సెప్టెంబరు 17ను స్వేచ్ఛాదినంగా జరుపుకోవాలి.