ఉత్తమ్, జానారెడ్డిల కట్టడి

utt

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రులు కావాలని ఆరాటపడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత కుందూరు జానారెడ్డి ఇప్పుడు నియోజకవర్గం వదలి బయటికి రాలేనిస్థితికి చేరుకున్నారు. ఉత్తమ్ అప్పుడో ఇప్పుడో హైదరాబాద్ వచ్చిపోవడం తప్ప ఇతర నియోజకవర్గాలలో ప్రచారం చేసే పరిస్థితి లేదు. ఉత్తమ్ మొదటిసారి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. ఉత్తమ్ మొదటి నుంచి బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న మఠంపల్లి, మేళ్లచెరువు మండలాల్లో టీఆర్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మంచి పట్టుసంపాదించారు.

స్థానికుడు కావడం, మొదటి నుంచి సామాజిక సేవలో పనిచేస్తూ ఉండడం, నియోజకవర్గమంతా విస్తరించి ఉన్న బంధువర్గం సైదిరెడ్డికి బాగా కలసివస్తున్నాయి. టీఆర్ ప్రభుత్వమే మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందున ఉత్తమ్ గెలిచినా నియోజకవర్గానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని, అభివృద్ధి కుంటుపడుతుందని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక పరిస్థితులు రోజురోజుకు ప్రతికూలంగా మారుతుండడంతో ఆయన నియోజకవర్గాన్ని వదలకుండా ప్రచారం చేస్తున్నారు. ఆయితే ఈసారి ఎలాగైనా గెలవాలని, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని అవుతానని ఆయన స్థానికంగా నమ్మకం కలిగిస్తున్నారు. అయితే అది నెరవేరే అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి.

జానారెడ్డి అయితే బాగా చెమటోడ్చుతున్నారు. ఎక్కడికిపోయినా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన ఇంతవరకు నియోజకవర్గాన్ని వదలి బయటికి రాలేదు. ‘జానారెడ్డి ఇప్పుడు పడుతున్నంత కష్టం ఎప్పుడూ పడలేదు’అని నాగార్జునసాగర్ ప్రాంతానికి చెందిన నాయకుడొకరు అన్నారు. అక్కడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మహాకూటమి గెలవదని , జానారెడ్డిని గెలిపిస్తే స్థానిక అభివృద్ధి కుంటుపడుతుందని టీఆర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. జనం నుంచి కూడా బాగా స్పందన వస్తున్నది. చివరి నాలుగైదు రోజులు చాలా కీలకం.

O creator, just shut up

This Google Earth map is of 18th April 2004. Is there any Outer Ring Road in the picture? Is there Airport in this map? Development is a process. Some one thought it. Next one started it. Later one finished it. This cycle of development is eternal. If not you someone will take it forward.outer

యెక్కడి నుండి యెక్కడికి

IMG_2800-0

ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి
శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి
——————————-
బయోధి నుండి పవనాంధోలోకమున్ జేరె
కూలంకశ పెక్కుభంగుల్ వివేక భ్రష్టసంపాతముల్

-Bhartruhari

బుల్లెట్-తో ఆలింగనం

rahul

చంద్రబాబుకు ఇంకా తెలంగాణలో ఏదో ఉందని కాంగ్రెస్ నాయకులు భావించడం, హైదరాబాద్ తానే నిర్మించానని చంద్రబాబు పదేపదే చెప్పుకోవడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇవ్వాళ ఒకే వేదికపై చంద్రబాబు, గద్దర్, కోదండరామ్ రాహుల్ సురవరం సుధాకర్ చూస్తే రాజకీయాలు ఎలా మలుపు తీసుకుంటున్నాయో అర్థమవుతుంది.

‘కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పుణ్యం కొంచెమయినా దక్కేదుండే. అది చంద్రబాబుతో చేతులు కలపడంతో గంగల కలిసింది. ఎవరు ఏం కవరింగు ఇచ్చినా చంద్రబాబు తెలంగాణకు చేసిన ద్రోహం మరువం. చంద్రబాబు, ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు చేసిన దుర్మార్గాలవల్లే తెలంగాణ ఆలస్యమయింది. శ్రీకాంతాచారి మొదలు వందలమంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మా గాయాలు మానలేదు. మళ్లీ వాళ్లను ఎలా ఆహ్వానిస్తం” అని ఓయూ విద్యార్థి నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపిన చంద్రబాబు దాష్టీకానికి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమ దీపం వెలిగింది. కాల్పుల్లో ముగ్గురు యువకులు బలయ్యారు. ఆ ఘటనకు చంద్రబాబు అప్పటికీ ఇప్పటికీ ఎప్పుడూ పశ్చాత్తాపం ప్రకటించలేదు.

తన వెన్నులో బుల్లెట్ ఉందని, అది దింపిన వారిని ఇప్పటికీ శిక్షించలేదని గద్దరన్న చాలాకాలంగా విమర్శిస్తున్నారు. ఇటీవల తనపై దాడి జరిగి ఇరవైయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ఒక పెద్ద సభ కూడా నిర్వహించి గజ్జెకట్టి కదను తొక్కారు. గద్దరన్న వెన్నులో బుల్లెట్ దించింది ఎవరో ఆయనకు తెలసు. ఇవ్వాళ నేరుగా వెళ్లి ఆ బుల్లెట్ కౌగిలించుకున్నారు. పొడుస్తున్న పొద్దు ఖమ్మం సభలోనే అస్తమించింది. అక్కడితో ఒక చరిత్ర ముగిసినట్టనిపించింది.

ఇక కోదండరామ్ రాజకీయాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన సారు చివరికి తెలుగుజాతిని ఏకం చేసి వీరునితో కలిసి ఉపన్యాసాలు దంచారు. చంద్రబాబును ఏ ప్రమాణాలతో తూచినా కోదండరామ్ మిత్రునిగా చెప్పుకోలేరు. మిత్రునిగా చెప్పుకోలేని మనిషితో ఒకే వేదిక పంచుకోవడంలోనే ఆయన తెలంగాణవాదం అంతమయింది. సురవరం సుధాకర్ చంద్రబాబుతో పొత్తును ఎలా సమర్థించుకుంటారో తెలియదు. ఎవరూ ఏ విలువలకూ కట్టుబడరు. గతంలో ఎందుకు తన్నుకున్నారో, ఇప్పుడెందుకు కలిసిపోయారో కనీసం ప్రజలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నమూ చేయరు.

వీరంతా కలిసి ఇప్పుడు “తెలంగాణను విముక్తి చేస్తారట. ఎవరి నుంచి తెలంగాణకోసమే పార్టీ పెట్టి, తెలంగాణకోసమే ఉద్యమించి, తెలంగాణకోసమే అందరి మెడలూ వంచి, తెలంగాణ సాధించి, స్వపరిపాలన ఫలాలు అందించిన టీఆర్ కేసీఆర్ నుంచి తెలంగాణను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో చంద్రబాబుకు ఇంకేమీ లేదని చాటాల్సిన సమయం వచ్చింది. టీడీపీని ఇక్కడ అడుగుపెట్టనివ్వద్దు. ఒక్క సీటులోనూ టీడీపీ గెలవకూడదు” అని ఖమ్మం సభను చూసి ఒక తెలంగాణవాది ఆవేశపడ్డాడు.

ఉత్తమ్ ప్రతిజ్ఞల కథ

ఉత్తమ్ గడ్డం తీసి ప్రచారానికి వెళితే బాగుండేది అని ఆ మధ్య రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక సీనియర్ సిటిజన్ అన్నారు. ఆయన కాంగ్రెస్ గెలిపించే దాకా గడ్డం తీయనన్నారని చెబుతారు. అంత తీవ్రమైన ప్రతిజ్ఞ ఎందుకు చేశారో తెలియదు.

ఇది ఇలా ఉండంగానే మొన్న మీట్ ప్రెస్ కూటమి గెలవకపోతే నేను గాంధీభవన్ అడుగుపెట్టను అని మరో ప్రతిజ్ఞ చేశారు. మరుసటిరోజు మరో మీట్ ప్రెస్ తూచ్ నేను తమాషాకు అన్నాను అన్నారు. బహుశా గెలవదని గ్రహించి తూచ్ అన్నాడేమోనని ప్రత్యర్థులు కామెంటు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే ఒక సీనియర్ నాయకుడు ఇటువంటి ఆషామాషీ ప్రకటనలు చేయడం విడ్డూరం. ఆయన తమ పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడం కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారేమో, కానీ నవ్వుల పాలు కావడం తథ్యం.

ప్రతిజ్ఞలతోకాదు సమర్థవంతమైన నాయకత్వంతో భరోసా ఇవ్వాలి. ఒట్టిమాటలు ఎంత గట్టిగా చెప్పినా జనం లెక్కచేయరు. అంచనాలు, సర్వేలు అన్నీ టీఆర్ విజయావకాశాలను సూచిస్తున్నాయి. అదేగనుక జరిగితే ఉత్తమ్ గడ్డం కథ ఎలా ముగుస్తుందని అందరూ ప్రశ్నిస్తున్నారు.