రేవంత్‌రెడ్డి ఘనత

TDP-CONGRESS-1

రేవంత్‌రెడ్డి గొప్పతనం గురించి కొత్తగా ఎవరూ ఎవరికీ చెప్పనవసరం లేదు. ఆయన ఎంతటి శీలవంతుడో ఓటుకు నోటు కేసులో పచ్చిగా ఆయనే రుజువు చేసుకున్నడు. ఇప్పుడు జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులు ఆయన ఘనతను మరింత బయటపెడుతున్నయి.

అటువంటి శీలవంతుడు జర్నలిస్టులకు శీల పరీక్షలు నిర్వహించడం గురించి మాట్లాడితే జనం నవ్విపోతారు. రాత్రి అమ్మకాలు, పగలు కొనుగోళ్లు, చీకటిమాటు వ్యవహారాల గురించి ఆయన ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.

సింగపూరు బ్యాంకు ఖాతాలకు ఎన్ని డిజిట్లు ఉంటాయో తెలిసిన ఈ శీలవంతునికి ఐటీ, ఈడీలు ఎవరి ఆదేశాలతో పనిచేస్తాయో తెలియదా? గట్టిగా అరిచినంతమాత్రాన అవినీతి నీతిగా మారదు. బుకాయించినంత మాత్రాన నిన్నమొన్నటి చరిత్ర మరుగునపడదు.

 

 

 

అసెంబ్లీ సీట్ల పెంపు బాబు మిత్రుల పతంగి

 

image

 

అసెంబ్లీ సీట్ల పెంపు ప్రతిపాదన ఫైలు హటాత్తుగా కదిలిందని, నేడో రేపో అయిపోతుందని కొన్ని పత్రికలు పనిగట్టుకుని రాశాయి. రాజ్యాంగ సవరణ చేయడం తప్ప సాధారణంగా సీట్ల పెంపు సాధ్యం కాదని న్యాయసలహా వచ్చినా ఇప్పుడేదో ఫైలుకు కాళ్లొచ్చినట్టు ఆ కొన్ని పత్రికలు కట్టగట్టుకుని ప్రచారంలోకి తెచ్చాయి. చంద్రబాబు మిత్రపత్రికలు ఇక్కడ బాణం వేశాయంటే లక్ష్యం ఎక్కడో ఉన్నట్టు లెక్క. ఆంధ్రప్రదేశ్‌లో అన్నిపార్టీల నుంచి కొనుగోలు చేసి టీడీపీలో పోగేసిన గుంపు ఎన్నికలలోపు చెదరిపోకుండా చూడాల్సిన బృహత్తర కర్తవ్యం ఆ కొన్ని పత్రికలు చంద్రబాబు అడుగకపోయినా మీద వేసుకున్నాయి.

అందుకే చాలా పాతదే అయిన ఈ ఎరను కొత్తగా వదిలారు. అంతకుమించి ఈ ఐదుమాసాల వ్యవధిలో పునర్విభజన, పెంపు సాధ్యమయ్యే అవకాశమే లేదు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి చాలా తతంగం ఉంటుంది. కనీసం ఆరుమాసాల వ్యవధి అవసరం. పునర్విభజన కమిషను వేయాలి, వారు ముసాయిదా ప్రతిపాదనలు రూపొందించాలి, ఆ ప్రతిపాదనలపై అభ్యంతరాలు కోరాలి, తుదకు వాటిని నోటిఫికేషను, గెజిటు ఇవ్వాలి.

మార్చి మొదటివారంలో సార్వత్రిక ఎన్నికల ప్రకటన రావలసి ఉంటుంది. అంటే ఇక మిగిలింది ఐదుమాసాలు. ఇంతకాలం పట్టించుకోని కేంద్ర హోంశాఖ ఇప్పుడే మేల్కొన్నట్టుగా ఈ పత్రికలు ప్రచారం చేస్తున్నాయి అంటే దానికి ఏదో ఒక లక్ష్యం ఉండాతలి. చెదరిపోతున్న అధికారపార్టీ శ్రేణులలో ఒక ఆశపుట్టించి, దాని వెంట పరుగెత్తించాలి కదా. అందుకే బాబు మిత్రులు ఈ పాతకొత్త మిత్తరను ముందుకు తెచ్చాయి. ఇంతకుమించి ఇసుమంతయినా ఇందులో వాస్తవం లేదు.

భిక్షకాదు, దీక్షాఫలం

అభివృద్ధి అంటే ఏమిటో ఇవ్వాళ ప్రతిపల్లె, ప్రతి గడప చవి చూస్తున్నది. ఈ మార్గం ప్రజలకు బాగా నచ్చింది.ఈ పంథా నాలుగు కాలాలపాటు కొనసాగాలని జనం కోరుకుంటున్నారు. విధానాల కోసం, నిర్ణయాల కోసం, నిధుల కోసం, చివరికి నియామకాలకోసం ఢిల్లీకి ఎదురుచూసే వాళ్లు కాదు, సొంత చైతన్యంతో, ఆస్తిత్వకాంక్షతో అభివృద్ధిని ఉరకలు ఎత్తించాలని కోరుకునే అచ్చ తెలంగాణ నాయకత్వమే కావాలని తెలంగాణ కోరుకుంటున్నది. అందుకు కేసీఆరే సరైనవారని జనం భావిస్తున్నారు. నాలుగున్నరేళ్ల నాటి కంటే ఇవ్వాళ కేసీఆర్ ప్రబల శక్తిమంతుడు. జనం గుండెల్లో గూడుకట్టుకున్నవారు.

 

img_3780

తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర లేదని చెప్పడం అంటే భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్ వంటి వారల పాత్ర లేదని చెప్పడమే. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అని చెప్పడం అంటే దేశానికి స్వాతం త్య్రం తెల్లోళ్లు ఇచ్చారని చెప్పడమే. అవును భారత దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి కూడా బ్రిటన్ పార్లమెంటు చట్టం చేయాల్సి వచ్చింది. తెలంగాణకు స్వపరిపాలన ఇవ్వడానికి కూడా భారత పార్లమెంటు చట్టం చేయా ల్సి వచ్చింది. అప్పుడు తెల్లోళ్లయినా, మొన్న కాంగ్రెస్ అయినా తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి. దేశంలో అప్పు డు ఆ పరిస్థితి సృష్టించినవారు గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్‌లయితే, తెలంగాణలో మొన్న స్వరాష్ర్టాన్ని ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి తీసుకువచ్చినవారు కేసీఆర్, ఇతర ఉద్యమశక్తులు. ఇప్పటి జాతీయ కాంగ్రెస్ నాయకత్వానికిగానీ, తెలంగాణ నాయకత్వానికి గానీ ఈ భాష అర్థం అయ్యే అవకాశమే లేదు. వారేనాడూ ఉద్యమాలు చేసింది లేదు. ఒక గొప్ప లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించడం కోసం జీవితాలను పణంగా పెట్టిన చరిత్ర ఇప్పటి కాంగ్రెస్‌లో ఒక్కరికయినా లేదు. వారెప్పటికీ తెలంగాణ ఎలా వచ్చిందో అర్థం చేసుకోలేరు.

అర్థం అయినవారయితే ఇప్పుడీ భాష మాట్లాడరు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్నా కాంగ్రెస్‌ను 2014 ఎన్నికల్లో ఎందుకు అంత చిత్తుగా ఓడించారో ఆత్మవిమర్శ చేసుకోకుండా ఉండేవారు కాదు. భారత దేశం విషయంలో తెల్లోళ్లు ఎన్ని దుర్మార్గాలకు పాల్పడ్డారో తెలంగాణ విషయంలో ఆంధ్ర ఎస్టాబ్లిష్‌మెంటుతో కూడిన కాంగ్రెస్ అన్ని దుర్మార్గాలకు పాల్పడింది. 1950లలో ముల్కీ ఉద్యమకారులపై కాల్పులు జరుపడం, తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతో విలీ నం చేయడం, పెద్దమనుషుల ఒప్పందాన్ని కాలరాయడం, తెలంగాణ నిధులు, ఉద్యోగాలు కొల్లగొట్టడం, ప్రత్యేక రాష్ట్రంకోసం 1969లో జరిగిన ఉద్యమాన్ని అతిదారుణంగా అణిచివేయడం, 374 మందిని కాల్చిచంపడం, తుదకు హైదరాబాద్‌ను ఒక ఆంధ్రా కాలనీగా మార్చడం వరకు కాంగ్రెస్ పాతకాలు లెక్కేలేవు. నీళ్లు లేక, కరెంటు లేక, వ్యవసాయం సంక్షోభంలో పడి వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది కూడా కాంగ్రెస్, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశంల నిర్వాక పాలనలోనే. ఆంధ్ర ఆధిపత్యానికి గొడుగుపట్టి తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన పార్టీలు కాంగ్రెస్, టీడీపీలు. తెలంగాణ ఆరు దశాబ్దాలు అనుభవించిన అన్ని కష్టాలకు, క్షోభలకు మూలకారణం కాంగ్రెస్, టీడీపీలు.

ఎంతో దూరం ఎందుకు- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూ ఎన్నికల ఒప్పందం చేసుకుని అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాని కి ఎంత ద్రోహం చేశారో అందరికీ తెలుసు. అప్పుడు ఇప్పటి కాంగ్రెస్ నాయకులు ఏ అధికార దర్బారుల్లో, ఏయే పదవుల్లో, ఏయే కిరీటాలు పెట్టుకుని రాజశేఖర్‌రెడ్డికి దాస్యం చేస్తూ వచ్చారో చాలామందికి గుర్తుండే ఉంటుంది. రాజశేఖర్‌రెడ్డి అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు భయం అనుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల కాలంలోనూ ఇప్పటి కాంగ్రెస్ నేతలంతా మంత్రి పదవు లు తీసుకుని కుక్కిన పేనుల్లా పడి ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అనే ఒక అజ్ఞాని తెలంగాణకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని సచివాలయంలో కూర్చుని అవాకులు చవాకులు పేలుతుంటే ఇవ్వాళ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పెద్దమనుషులెవరూ మం త్రి పదవులను వదలి రాలేదు. కనీసం నిరసన ప్రకటనలు కూడా చేయలేదు.
గడ్డాలు, మీసాల మీద ఇవ్వాళ ప్రతిజ్ఞలు చేస్తున్నవారికెవరికీ ఆ రోజు రోషం పుట్టుకురాలేదు. తెలంగాణ ఆత్మగౌరవం పొడుచుకురాలేదు.ఎంచక్కా అధికార కార్యకలాపాల్లో ముని గి తేలారు. ఫైళ్లు ఆమోదింపజేసుకునే పనిలో ఉండిపోయారు. వీళ్లిలా ఉన్నప్పుడు తెలంగాణ సమాజం ఏం చేస్తూ ఉంది- తెలంగాణ ఉద్యమ పతాకం కిందపడకుండా చేతిలో చెయ్యేస్తూ వీధి పోరాటాలు చేస్తూ ఉంది. కేసీఆర్ స్వయంగా దీక్షకు పూనుకుని మృత్యుముఖం వర కూ వెళ్లి మొత్తం శాసనవ్యవస్థను కదిలించి తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను సాధించారు. ఇదే చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిల కుట్రల ఫలితంగా సాధించుకున్న స్వేచ్ఛా ప్రకటనపై కేంద్రం వెనుకకు పోయినప్పుడు కేసీఆర్ సారథ్యం లో స్వచ్ఛంద ప్రజాగర్జనలు, సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం.. ఒకటేమిటి, సకల ఉద్యమరూపాలు తెలంగాణ నినాదాన్ని నెత్తికెత్తుకుని ఊరేగింపు చేశాయి. తెలంగాణ స్వేచ్ఛాకాంక్షను చివరి నిమిషందాకా రాజకీయ లక్ష్యంగా చేసుకుని కొట్లాడి, సాధించినవారా? లేక చివరి నిమిషం దాకా అధికార సౌధాల్లో పనులు, పైరవీల్లో మునిగి తేలినవారా? ఎవరు తెలంగాణ సాధకులు?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావడంలో తెరవెనుక సైంధవ పాత్ర పోషించినవారిలో అనేక మం ది ఉన్నారు. గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్, వీరప్పమొయిలీ, ప్రణబ్‌ముఖర్జీ వీరందరూ ఏదో ఒక కమిటీకి నాయకత్వం వహించి తెలంగాణ డిమాండును దాటవేసినవారే. వీరందరికీ తెలంగాణ ఉద్యమం అంటే చాలా చిన్నచూపు. తెలంగాణ నాయకత్వం అంటే చులకన భావం. ఒక్క తెలంగా ణ ఉద్యమమే కాదు, ఏ ఉద్యమమన్నా వీరికి చిన్న చూపే. ప్రజలు ఉద్యమాలు చేయకుండా, రక్తం చిం దించకుండా కాంగ్రెస్ మెహర్బానీతో ఏర్పాటైన ఒక్క రాష్ట్రం చూపించండి దేశంలో. చివరకు కేసీఆర్ చెప్పినట్టు ఒక్క సోనియాగాంధీనే తుదకు బలమైన నిర్ణయం తీసుకుని తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను నడిపించింది. అనేక అనివార్యతల మధ్య. అప్పటికే పార్లమెంటులోని మెజారిటీ రాజకీయపక్షాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లిఖితపూర్వకంగా ఆమోదా లు తెలిపి ఉన్నందున పునర్విభజన చట్టం అమోదానికి నోచుకుంది. మిగిలిన కాంగ్రెస్ ఎస్టాబ్లిష్‌మెంట్ అంతా ఆంధ్రా నాయకత్వం కనుసన్నల్లో తెలంగాణకు ద్రోహం చేయడానికే ప్రయత్నించింది. చేసిన పాపాలు చెప్పుకుంటే పోతాయని సామెత. తెలంగాణ కాంగ్రెస్ తాము చేసిన తప్పులేమిటో ఇప్పటికీ గుర్తించలేదు. తెలంగాణ ప్రజల ముందు చెంపలేసుకోలేదు. బుకాయింపులు, దబాయింపులు, అబద్ధా ల ప్రచారం ప్రాతిపదికగా తెలంగాణ ప్రజలను వం చించాలని చూస్తున్నది. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. కేసీఆర్ అవసరం ఏమిటో ఈ నాలుగున్నరేళ్లలో ప్రజలు బాగా గుర్తించారు. స్వయం పాలన ఫలాలు ఎలా ఉంటాయో తెలంగా ణ ప్రజలకు అనుభవంలోకి వచ్చింది.

అభివృద్ధి అంటే ఏమిటో ఇవ్వాళ ప్రతిపల్లె, ప్రతి గడ ప చవి చూస్తున్నది. ఈ మార్గం ప్రజలకు బాగా నచ్చింది. ఈ పంథా నాలుగు కాలాలపాటు కొనసాగాలని జనం కోరుకుంటున్నారు. విధానాల కోసం, నిర్ణయాల కోసం, నిధుల కోసం, చివరికి నియామకాలకోసం ఢిల్లీకి ఎదురుచూసే వాళ్లు కాదు, సొంత చైతన్యంతో, అస్తిత్వకాంక్షతో అభివృద్ధిని ఉరకలు ఎత్తించాలని కోరుకునే అచ్చ తెలంగాణ నాయకత్వ మే కావాలని తెలంగాణ కోరుకుంటున్నది. అందుకు కేసీఆరే సరైనవారని జనం భావిస్తున్నారు. నాలుగున్నరేళ్ల నాటి కంటే ఇవ్వాళ కేసీఆర్ ప్రబల శక్తిమంతుడు. జనం గుండెల్లో గూడుకట్టుకున్నవారు. అప్పట్లో అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలంగా పాదుకోలేదు. ఆ ఎన్నికల్లో 34 శాతం ఓట్లతో 63 సీట్ల మెజారిటీతో అధికారంలోకి వచ్చా రు. ఇవ్వాళ ఏ నియోజకవర్గానికి వెళ్లినా టీఆర్‌ఎస్‌కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇవ్వాళ గులాబీ జెండా ఎగురని చోటు లేదు. ఏ సర్వేలు చూసినా, ఎవరి అంచనాలు విన్నా ఇవ్వాళ టీఆర్‌ఎస్‌కు ఏ నియోజకవర్గంలోనైనా 45 శాతానికి తక్కువగా ఓట్లు రావడంలేదు. సగటున 45 శాతం తెచ్చుకున్న పార్టీలు ఎన్నికల చరిత్రలో 85 నుంచి 90 శాతం సీట్లు గెల్చుకున్న సందర్భాలు అనేకం. ఇప్పుడు టీఆర్‌ఎస్‌దీ అదే ఊపు.

TDP is anathema to Telangana

TDP, which caused Telangana a great loss during its regime, which created all the obstructions to stop state bifurcation, which is troubling Telangana, all the way through four years of States division, which tried invoke its rule on Hyderabad now and then…is a permanent anathema to Telangana.

Still some people are with TDP in Telangana, some parties are trying to align with it, sure they might have been political ignorants or slaves or parasites. They must be rejected right now to the core.

తెలంగాణ ద్రోహకూటమి

TDP-CONGRESS-1

-Image Courtesy Sakshi

తెలంగాణ ప్రభుత్వాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఎం తగా ద్వేషిస్తున్నాడో, తెలంగాణ కాం గ్రెస్ అంతగా ద్వేషిస్తున్నది. చంద్ర-బాబునాయుడు మొదట రాష్ట్ర విభజనను, తర్వాత విభజనానంతర పంపకాలను ఎంతగా అడ్డుకున్నారో తెలంగాణ కాంగ్రెస్ ఈ గడ్డపైనే తెలంగాణ ప్రభుత్వాన్ని అన్నిరకాలుగా అడ్డుకున్నది. కాంగ్రెస్, ఆ పార్టీ మద్దతుదారులు ఎన్నివంద ల కేసులు వేశారో. చంద్రబాబునాయుడుపై అక్కడి ప్రతిపక్షాలు కూడా అన్ని కేసులు వేసి ఉండవు. వైఎస్ రాజశేఖర్-రెడ్డి కాలంలో అడ్డగోలు జలయజ్ఞానికి డూడూ బసవన్నల మాదిరిగా తలలూపుతూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రభుత్వం ప్రారం-భించిన ప్రతి ప్రాజెక్టుపైనా కేసులు వేస్తూ వచ్చారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకూ అభ్యంతరాలు పెడుతూ వచ్చారు. చివరకు హైదరాబాద్‌లో తలపెట్టిన అభివృద్ధి ప్రాజెక్టులపైనా కేసులు తెచ్చి పనులు అడ్డుకున్నారు. చంద్రబాబు పుణ్యాన ఇంకా విభజన కాని హైకోర్టును ఉపయోగించుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతికేసులో ఇరికించడాని కి ప్రయత్నం చేసింది. ఉద్యోగాలు ఇవ్వలేదని ఉద్యమాలు చేసేది వారే. ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తే కేసులు, స్టేలు తెచ్చేది వారే. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యో-గాలు ఇవ్వాలన్నది వారే. తీరా ప్రభుత్వం నిర్ణయం చేస్తే కేసులు వేసింది వారే. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం చేస్తే, దానిపైనా కేసులు వేసిందీ వారే. విషాదం ఏమంటే తెలంగాణ ప్రతి-పక్షం చివరికి ఒక కోర్టు లిటిగెంటుగా మారడం. ప్రజాకేంద్రకంగా ఆలో-చించకుండా, అక్కసుతో కూడిన రాజకీయ కజ్జాకోరుతనానికి దిగడం ఆ పార్టీ పతనానికి నిదర్శనం. టీఆర్‌ఎస్ గెలువడం, ప్రభుత్వం ఏర్పాటు చేయ డం, మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొత్త పుంతలు తొక్కించడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నది. కాంగ్రెస్ విచక్ష-ణతో వ్యవహరించి, టీఆర్‌ఎస్‌కంటే మరింత ఉన్నతమైన ఎజెండాను, రాజకీయాలను ఎలా అందించగలదో ప్రజలకు చెప్పడానికి బదులు, అడుగడుగునా పేచీ కోరు రాజకీయాలకు దిగింది. తన ప్రతిష్ఠను మరింత దిగజార్చుకున్నది. ఆ పతనావస్థకు పరాకాష్ఠ ఇప్పుడు టీడీపీతో పొత్తుకు సిద్ధపడటం.

కాంగ్రెస్ ప్రతిబంధక రాజకీయాల నుంచి, లిటిగెంటు వ్యవ-హారాల నుంచి, అభివృద్ధి నిరోధక కుతంత్రాల నుంచి విముక్తిని కోరేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్  ముం దస్తుగా ప్రజల తీర్పును కోరాలని నిర్ణ-యించుకున్నట్టు స్పష్టమవుతున్నది. ప్రతిపక్షాల పంచాయితీలపై ప్రజలే సరైన తీర్పరులు. అందుకే కేసీఆర్ వారిని ఆశ్రయించారు. పాపం కాంగ్రెస్ అందుకు కూడా సిద్ధంగా లేదు. వారిని నిలబెట్టేందుకు పక్కరాష్ట్రం నుంచి జాకీ లు కావలసి వచ్చింది. నిజానికి చంద్రబాబే దిక్కుతోచనిస్థితిలో ఏ కొమ్మదొరికితే ఆ కొమ్మను పట్టుకొని వచ్చే ఎన్నికలను ఈదాలని ఆరాట-పడుతున్నారు.

కాంగ్రెస్ తయారుచేస్తున్నది కేసీఆర్ వ్యతిరేక ఫ్రంట్ కాదు. తెలంగాణ వ్యతిరేక ఫ్రం ట్. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడితో కలిసే పార్టీ ఏదైనా, జట్టుకట్టే ఫ్రంటు ఏదైనా అది కచ్చితంగా తెలంగాణ ప్రయోజనా-లకు విఘాతం కలిగించేదే. కాంగ్రెస్‌కు ఇప్పటికీ అవకాశవాద ఆత్మ తప్ప, తెలంగాణ ఆత్మ ఒంటబట్టలేదనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. తెలంగాణలో ఇప్పటికీ కొందరు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొ ని ఉండటమే తెలంగాణకు పట్టిన దరిద్రం. ఆత్మగౌరవం ఇసుమంతైనా లేని బానిస నాయకత్వం. తెలంగాణకు వ్యతిరేకంగా ఇన్ని కుట్రలు చేసిన ఆ పార్టీలో ఇంకా కొనసాగుతున్నారంటేనే విస్మయం కలుగుతున్నది. అటు-వంటి పార్టీని కాపాడుకోవడానికి కొందరు, బతికించడానికి కొందరు కంకణం కట్టుకున్నారంటే ఏమనుకోవాలి? రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పార్టీలేవీ విభజన కోరిన రాష్ర్టాల్లో బతి కి బట్టకట్టలేదు. బీహార్ విభజనను వ్యతిరేకించిన ఆర్జేడీ, జేడీయూలు రెండూ జార్ఖండులో ఊసులోకి లేకుండా పోయాయి. ఉత్తరప్రదేశ్ విభజనను వ్యతిరేకించిన సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరాఖండ్‌లో జాడలేకుండాపోయింది. తెలంగాణలో కూడా టీడీ-పీని తిరస్కరించారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రాం త వాసుల్లో అభద్రతను సృష్టించి పోయినసారి కొన్ని స్థానాలు గెల్చుకున్నారు తప్ప, తెలంగాణలో మెజార్టీ జిల్లాల్లో టీడీపీని తుక్కుతుక్కుగా ఓడించా రు. ఈసారి హైదరాబాద్‌లో కూడా ఆ పార్టీకి పుట్టగతులుంటాయని ఎవరూ భావించడంలేదు. ఎందుకంటే తెలుగుదేశం తెలంగాణ వ్యతిరేక పార్టీగా అనేక పాపాలను మూటగట్టుకుంది. ఇప్పటికీ తెలంగాణకు వ్యతిరేకంగా జరిగే ప్రతి కుట్రలో చంద్రబాబునాయుడి పాత్ర ఉంటున్నది. హైకోర్టు విభజనకు కేం ద్రం, ఇక్కడి హైకోర్టు అందరూ ఒప్పుకున్నా చంద్రబాబు కావాలని అడ్డుపడుతున్నాడు. ఒక్క హైకోర్టు ఏమిటి హైదరాబాద్‌లోని ప్రభుత్వరంగ సంస్థల విభజనపైనా ఇంకా పేచీలు పెడుతూనే ఉన్నాడు. కృష్ణా జలాల పంపిణీపై కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నాడు. పోతిరెడ్డిపాడు నుంచి ఇష్టారాజ్యంగా నీరు తరలిస్తూనే ఉన్నాడు. అక్కడ లెక్కాపత్రం తెలియకుండా ఉండటం కోసం  టెలిమెట్రీ పనిచేయనివ్వడు. కృష్ణాకు తరలించే గోదావరి జలాలకు బదులుగా కృష్ణాలో తెలంగాణకు ఇవ్వాల్సిన 40 టీఎంసీల వాటా సంగతి ఎప్పటికీ తేల్చడు. ఇలా ఒకటేమిటి? వంద అంశాలున్నాయి. అయినా ఇక్కడి తెలుగుదేశం నేతలకు చీమకుట్టినట్ట-యినా ఉండదు.

ఎప్పుడో సాధించుకోవలసిన తెలంగాణ రాష్ట్రం ఇంతకాలం ఎందుకు ఆలస్యమైందో తెలుగుదేశం, కాంగ్రెస్‌లలోని నాయకత్వాన్ని చూస్తే అర్థమవుతుం ది. వారికి రాజకీయాలు ముఖ్యం.  టికెట్లు ఇచ్చేవారు, ఎన్నికల నిధులు ఇచ్చేవారు ముఖ్యం. తెలంగాణ ముఖ్యం కాదు. ఆత్మగౌరవం ముఖ్యం కాదు. అస్తిత్వ చైతన్యమూ లేదు. రెండు పార్టీలలోని నాయకు-లను తరతరాలుగా ఈ పద్ధతికి బానిసలను చేశా రు ఢిల్లీ, ఆంధ్రలలోని ఆధిపత్య రాజకీయ నేతలు. తెలంగాణపై నిర్ణయం జరిగిన సందర్భంలో కూడా-2009 డిసెంబర్ 9న-కాంగ్రెస్, టీడీపీలు ఇలాగే వ్యవహరిం-చాయి. టీడీపీ ఆంధ్ర ఎమ్మెల్యేలతో రాజీనామా డ్రామాలు నడిపించింది. ఎన్‌టీఆర్ ట్రస్టుభవన్ నుంచే రాజీనామా నమూనా పత్రాల పంపిణీ జరి-గింది. రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని అడ్డుకోవడానికి టీడీపీ సర్వశక్తులూ ఒడ్డింది. ఆ సమయంలో మనమూ రాజీనామాలు చేయాలని తెలంగాణ కాం గ్రెస్ నాయకులతో టీఆర్‌ఎస్ ప్రతిపాదిస్తే, వారు ముందుకురాలేదు. టీడీపీకి ఉన్న జిద్దు కాంగ్రెస్ నాయకులకు లేకపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రులమవుతామని ఆరాటపడుతున్న అరడజను మంది కాంగ్రెస్ నాయకులు ఆరోజు మంత్రివర్గం లో ఉండి ఎంచక్కా ఇంట్లో ఫైళ్లు క్లియర్ చేసుకుం టూ అధికారాన్ని అనుభవించారు. టీడీపీది అడ్డుకునే కుట్ర అయితే వీరిది దొంగనిద్ర నటించే కుట్ర. తెలంగాణ కాంగ్రెస్ నాయ-కుల నిర్వాకం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరో నాలుగేండ్లు వెనుకకు-పోయింది. వందలాది మంది యువకులు ఆత్మబలిదానాలు చేశారు. తెలంగాణ ఎంతగానో క్షోభించింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సెక్షన్-8ని అడ్డంపెట్టు కొని హైదరాబాద్‌పై పెత్తనం చెలాయించాలని, ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలు చేయాలని టీడీపీ కుట్రలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం చం ద్రబాబు కుట్రలను సకాలంలో పసిగట్టి తెలం-గాణ సరిహద్దుల నుంచి తరిమేసింది. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా చంద్రబాబు తన కుట్రలు మానలేదు. సచివాలయంలో, చాలా హెడ్‌క్వార్టర్స్ భవంతుల్లో తమకు కేటాయించిన భవనాలను ఖాళీచేసి వెళ్లి-పోయారు. కానీ ఇంతవర కు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడానికి ముం దుకు రావడంలేదు. అటువంటి చంద్రబాబుకు ఇప్పుడు మళ్లీ తెలంగాణలో పిలిచి పీట వేయాలని కాంగ్రెస్ ప్రయత్నించడం ఆ పార్టీకే ఆత్మహత్యాసదృశం. ఇది తెలంగాణకు మరోసారి ద్రోహం చేయడం.

ఈ రెండు పార్టీలలో ఉండే మరో ఉమ్మడి లక్షణం గులాంగిరీ చేయడం. కాంగ్రెస్ ఢిల్లీలో దేబిరిస్తే, టీడీ పీ నాయకులు అమరావతిలో అడుక్కో-వాలి. కాంగ్రెస్‌లో ఎప్పుడూ తెగించి ఒక నిర్ణయం చేసే పరిస్థితి ఉండదు. ఢిల్లీ అనుమతి వచ్చేవరకు ఒక్క పాదయా త్ర కూడా చేయడానికి వీల్లేదు. అటువంటి పార్టీలు తెలంగాణలో ఇప్పుడు ప్రారంభించిన అభివృద్ధి మహాయజ్ఞాన్ని నడిపించడానికి ఎలా పనికివస్తా యి? చంద్రబాబుకో, ఆయన మనుషులకో, ఆయన మద్దతుతో నడిచే పార్టీలకో పొరపాటున అధికా రం వస్తే తెలంగాణ అస్తిత్వ కాంక్షలను ఎక్కడ పాత ర వేస్తారో మనకు తెలుసు.

మా ఊరికి కాలువొచ్చింది

WhatsApp Image 2018-09-04 at 9.32.12 PM(1)

ఎన్నోయేళ్ల స్వప్నం. ఎంతో నిరీక్షణ. ఎన్నో వాదవివాదాలు. నాగార్జునసాగర్ వరదకాలువ 2009లో మాడ్గులపల్లి దాకా వచ్చి ఆగిపోయింది. కొందరు రైతులు తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లారు. కోర్టు స్టే ఇచ్చింది. ఇక ఆ వైపు చూసినవారు లేరు. అధికారులు, నాయకులు ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే మళ్లీ కదలిక. గత నాలుగేళ్లుగా ఆ చిక్కుముడిని విప్పేందుకు చేయని ప్రయత్నం లేదు. మంత్రి జగదీశ్‌రెడ్డి అనేక సార్లు అధికారులకు గట్టిగా చెప్పారు. మరో మంత్రి హరీశ్‌రావుగారయితే ఒకరోజు చాలా తీవ్రస్వరంతో అధికారులను మందలించారు. వారంతా కోర్టు కేసును చూపి నిస్సహాయతను వ్యక్తం చేస్తూ వచ్చారు.

ఇక మేమే కోర్టు చుట్టూ తిరిగాము. చాలా ప్రయత్నం తర్వాత ఒక సందర్భంలో న్యాయమూర్తి కేసు విని తీర్పు రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించి వేసవి సెలవుల్లో వెళ్లిపోయారు. మళ్లీ కోర్టులు తెరిచే సరికి ఆయన వేరే బెంచికి మారిపోయారు. మళ్లీ మా ప్రయత్నం మొదటికొచ్చింది. కేసు బెంచీమీదకే రాదు. కోర్టు ప్రాధాన్యతలేమిటో మనకు అర్థం కావు. చూసీచూసీ విసిగిపోయాము. ఇక ఈ జన్మలో కాలువరాదని నిట్టూర్చేవారు, దెప్పిపొడిచేవారు ఎక్కువయ్యారు. నెలరోజుల కింద పరిస్థితి. వానలు బాగా పడుతున్నాయి. శ్రీశైలం నిండబోతోంది. నాగార్జునసాగర్‌కూడా నిండే అవకాశం ఉంది. మా బాధ అంతా ఇంతా కాదు. ఈసారయినా నీరు తీసుకోకపోతే…. ఊహించడానికే కష్టం అనిపించేది.

ఇక రైతులతో స్వయంగా సంప్రదింపులు జరిపి కాలువ తవ్వుకోవాలని భావించాము. అంతకుముందే కేసువేసిన ఒకరైతు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేసు ఉపసంహరణకు ముందుకు రావడంతో మాకు మరింత ధైర్యం వచ్చింది. అధికారులు గతంలో ఏం చేసినా గత ఏడాదికాలంగా బాగా సహకరిస్తూ వచ్చారు. భూములివ్వడానికి ఒప్పుకుని వచ్చిన రైతులకు చకచకా పరిహారం చెల్లించారు. కొందరు రైతులు తమ భూమిలో తవ్వుకోవడానికి అనుమతిస్తూనే, తమకు సరైన పరిహారం ఇవ్వాలని కోరారు. మరికొందరు అందుకూ అంగీకరించలేదు.

ఇక ఒత్తిడి మంత్రం తప్పనిసరి అయింది. యువనాయకుడు సిద్ధార్థరెడ్డి దగ్గర నిలబడి కాలువ తవ్వకం మొదలు పెట్టారు. స్థానిక రైతులతో సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చారు. కాంట్రాక్టరు లేడు, అధికారులు లేరు. ఒకరోజు ఒక జూనియరు అధికారి వచ్చి ముగ్గుపోసి పోయారు. జనమే దగ్గరుండి పదిరోజులు రేయింబవళ్లు కాలువ తవ్వకం పనులను చూసుకున్నారు. ఒక చోట బాగా లోతు తవ్వాల్సి వచ్చింది. తెలిసిన కాంట్రాక్టరు మిత్రుడు ఒక పెద్ద తవ్వకం యంత్రం పంపి ఒక్కరోజులో పని పూర్తిచేశారు. హైవేకు సమీపంలో ఒక చోట పెద్ద రాళ్లు అడ్డం వచ్చాయి. వాటిని పేల్చి తొలగించాల్సి వచ్చింది.

తవ్వకం పూర్తయిన తర్వాత కూడా నాలుగైదు రోజుల నిరీక్షణ. ఎంతకీ నీళ్లు రావు. ఎందుకు ఆలస్యం అవుతున్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంజనీర్లను గట్టిగా మందలించారు. ఎస్‌ఈ, ఇంజనీర్లు కాలువ వెంట ప్రయాణం మొదలు పెట్టారు. ఇటు నుంచి సిద్ధార్థ, మరికొందరు రైతులు కాలువ వెంట వెనుకకు వెళ్లారు. కాలువ పొడవునా తూములు, బుంగలు. నీరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అందరూ కలసి తూములు, బుంగలు మూసివేస్తూ నీరు ముందుకు తీసుకొచ్చారు. ఈరోజుకు(04.09.2018) మా ఊరికి కాలువ నీరు వచ్చింది.

స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు దేవుళ్లు. కేసుల్లో ఉన్న భూముల రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. వారు మొదటిరోజు కాస్త నిరసన తెలిపినా తదుపరి వారెవరూ పనులకు అడ్డం రాలేదు. అధికారులూ అందరూ సహకరించారు. నీరు దైవంతో సమానం. నీరుతోపాటే సకల ఐశ్వర్యాలు. అందరి పుణ్యాన ఆరుదశాబ్దాలుగా కరువు కోరల్లో నలిగిపోతున్న మాడ్గులపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు కాలువ నీరు వచ్చింది. ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. సిద్ధార్థా….హాట్సాఫ్. ఈ యజ్ఞంలో సహకరించిన అధికారులు, రైతులు, పోలీసులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

కాంగ్రెస్‌ను సమర్థించలేను

 

images

ఒక దశాబ్దం క్రితం అనుకుంటా. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అప్పుడు మంత్రి, పాత సోషలిస్టు సూర్యాపేట ప్రాంతంలోని ఒక గ్రామానికి పర్యటనకు వచ్చాడు. ఆ ఊరి పెద్దాయన ఈ కాంగ్రెస్ మంత్రికి దూరపు బంధువు. సమకాలికుడు. చనువుతో మూసీ పర్రెకాలువ పనులు చేయించాలని, నీళ్లు లేక జనం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ మంత్రికి విజ్ఞప్తి చేశాడు. ఆ మంత్రిగారు ఏమాత్రం తడుముకోకుండా, మీకు ఊళ్లో కూలోళ్లు పనికి దొరకొద్దా అని ప్రశ్నించారట. ఈ మాటతో అవాక్కయిన ఆ గ్రామ నాయకుడు ఇంకేమీ మాట్లాడలేకపోయారు. అంటే కాలువలొస్తే, పొలాలకు నీళ్లొస్తే కూలీలు దొరకరని, పేదవాళ్ల పెద్దవాళ్లు అవుతారని, తమ చెప్పుచేతలలో ఉండరని ఆ మంత్రిగారి ఆంతర్యం.

తెలంగాణ ప్రభుత్వం ఆ పర్రెకాలువ పని పూర్తి చేసిన సందర్భంగా ఆ గ్రామ పెద్ద ఈ విషయం బయటపెట్టారు. ఆ మంత్రి ఒక్కరే కాదు చాలా మంది సీనియర్‌ర్‌ర్ కాంగ్రెస్ నాయకుల మనస్తత్వం ఇలాగే ఉంది. నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాకపోవడానికి, సాగునీరు అందకపోవడానికి ఈ నాయకులే కారణం.

మరో కాంగ్రెస్ నాయకుడు ఉదయసముద్రం నుంచి ఏడు గ్రామాలకు మంచి నీళ్లు రాకుండా అడ్డుకున్నాడు. కారణం ఏమంటే ఆ సమయంలో ఆ గ్రామాల్లో సీపీఎం సర్పంచులు గెలవడం. అవన్నీ కమ్యూనిస్టు గ్రామాలు మంచినీళ్లు ఇప్పుడేం అవసరం లేదు అని ఆపించాడు. ఆ గ్రామాల ప్రజలు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి నల్లగొండ నుంచి మిర్యాలగూడెం వెళుతున్నప్పుడు ఆయన వాహనాన్ని ఆపి, తమగోడు వెళ్లబోసుకున్నారు. ఆయన ఆదేశించిన తర్వాత గానీ ఆ ఏడు గ్రామాలకు నీరు రాలేదు.

ఉదయసముద్రం కింద డి-39, 40 కాలువలకు ఇప్పటివరకు సరిగ్గా నీరు వదలలేదు. ఎందుకంటే ఉదయసముద్రం పూర్తిగా నింపితే కానీ ఈ కాలువలకు నీరు రాదు. రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తే కానీ రిజర్వాయరు పూర్తిగా నింపరు. ఇలా గొలుసు సమస్యలతో పదిహేనేళ్ల క్రితం పూర్తయిన ఉదయసముద్రం దిగువన ఉన్న గ్రామాలకు కూడా నీరు ఇవ్వలేకపోయింది. అయినా మన కాంగ్రెస్ నాయకులు ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదు. ఉదయసముద్రం, మాధవరెడ్డి ప్రాజెక్టు కూడా జలసాధన ఉద్యమకారులు, ఎలిమినేటి మాధవరెడ్డి వంటివారి పుణ్యం. కాంగ్రెస్ ప్రయత్నం జీరో.

చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఈ కాలానికి పనికిరారు. ఆధునిక కాలానికి తగినట్టుగా వారు ఎదగలేదు. మారలేదు. ఇప్పటికీ అవే ముతక భావాలు. ఆవే ముదురు రాజకీయాలు. కాంగ్రెస్‌లోనూ కొందరు యువనాయకులు ప్రజలతో మమేకమై పనిచేస్తున్నవారు ఉన్నారు. కానీ వారు పైకి రావడానికి, నిర్ణయాలు చేసే స్థితికి చేరడానికి దశాబ్దాలు పట్టవచ్చు. అప్పటిదాకా అభివృద్ధి నిరోధక నాయకత్వమే పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్‌ను సమర్థించలేను.