CAN I NAME YOU CALLITICIAN?


I Beg apology for using call girl. But they are sincere and honest to their customer. Where as some politicians are not. They sit in a camp and try to exhibit loving some and hating some in the same camp. 
They always call some one with some name and try to certify that he is such and such. They fit for nothing except shooting some one who was chosen as target. They do nothing except raising litigations. 

I remember Tholubommalata and Kethigaadu. Kethigaadu introduce everyone in badmouth. Hence some politicians are called Calliticians. 

When a pressman working hard to draw the facts between the lines is called presstitues, there is nothing wrong calling some politicians,sitting in glass houses and scratching everything they come accross, Callitician.

Note:

I like poltics. I respect the leaders. I believe nation builds in political process. But I disown Calliticians who give certificates to media.

Advertisements

Is High Court above suspicion?

Caesar’s wife must be above suspicion. Judiciary must be above suspicion. When Telangana judges suspecting the role of HC what it means?
Not only must Justice be done; it must also be seen to be done.” …a judicial quote. Then whats happening in Telangana? Seen as cheating.

Judiciary must be above bias and parochial thought and must be purely based on facts, but why so biased and parochial in decisions?

High Court must be independent and but it must be felt, seen and experienced by its subjects.

When the division of state is possible by a Parliament act, why not High Cout division possible. Its sheer politics of Centre and Andhra Pradesh. 

The day Central Cabinet makes a resolution and sends it to Preseidents approval, the division over. But why this cruel drama is played up on by Telangana? 

ఈ సోయి అప్పుడుంటే ఎంత బాగుండేది? 

పాలమూరు, మెదక్ జిల్లాలకు ఆరు దశాబాలపాటు అన్యాయాలు జరుగుతుంటే ఏనాడూ నోరు మెదపని శక్తులు, అప్పుడెప్పుడూ కేసులు వేయని నాయకులు ఇప్పుడు ప్రాజెక్టులను ఆపడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. వలసలు, ఆత్మహత్యలు, చివరికి ఆకలి చావులు కూడా జరుగుతూ ఉంటే చంద్రబాబు, రాజశేఖర్రెడ్డి సేవలో తరించిన నాయకులు ఇప్పుడు తెలంగాణకు ఇంత కాలానికి దక్కిన అవకాశాలను అడ్డుకొట్టాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఒకప్పుడు బయటివారు కుట్రలు చేస్తే ఇప్పుడు ఇక్కడి వారే గోతులు తవ్వుతున్నారు. అక్కడ చంద్రబాబు తెలంగాణ నీటి హక్కులకు పాతర వేయాలని చూస్తుంటే ఇక్కడ ఆయన అంతేవాసులు సొంత రాష్ట్ర ప్రాజెక్టులకు గోరీ కట్టాలని చూస్తున్నారు. వీళ్ళ భవిష్యత్తును జనమే నిర్ణయించాలి. 

ప్రతిపక్షాలకు లెక్కలు రావా?

ఒక అబద్ధం వందసార్లు చెప్పినా నిజం కాదు. అబద్ధం గొంతు పెంచి చెప్పినంత మాత్రాన జనం వినిపించుకోరు. నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్, టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు, అడ్డగోలు ఆరోపణలు చూస్తుంటే వారికి వాస్తవాల పట్ల, నిజమైన వివరాల పట్ల కనీసం శ్రద్ధ లేదని అర్థమవుతున్నది. వారికి లెక్క లు కూడా సరిగా తెలిసినట్టు లేదు. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. అతికినట్టు కాదుకదా ఏకోశానా నమ్మేటట్టు లేవు. నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఓ కాంగ్రెస్ నాయకుడు రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని నోరుపారేసుకున్నారు. మరో నాయకుడు లక్ష కోట్లని వాగారు. అసలు తెలంగాణ ప్రభు త్వం నీటిపారుదల ప్రాజెక్టులు మొదలుపెట్టింది ఎప్పడు? ఆ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం ఎంత? అందులో ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఎంత? పాత ప్రాజెక్టులపై గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఖర్చు చేసింది సుమారు 11 వేల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టులకు కేటాయించింది సుమారు 30 వేల కోట్లు. మిషన్ భగీరథ మొత్తం అంచనా వ్యయం 36,976 కోట్లు. ఇందులో ఇంకా 30 శాతం కూడా ఖర్చు చేయలేదు. మిషన్ కాకతీయ మొత్తం అంచనాయే 26,651 కోట్లు. అందులో ఇప్పటివరకు అయిన ఖర్చు 10 వేల కోట్లకు మించదు. ఇలా చూస్తే గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలపై ఖర్చు చేసిన మొత్తమే 30 వేల కోట్లకు మించదు. మరి లక్ష కోట్లు, రెండు లక్షల కోట్లు అవినీతి ఎలా జరిగినట్టు? పోనీఈ మూడు రకాల ప్రాజెక్టుల అంచనాల మొత్తం కలిపినా లక్ష 20 వేల కోట్లు మాత్ర మే. అది కూడా వచ్చే నాలుగైదేళ్లలో చేయవలసిన వ్యయం. ఏటా ఆ నిధుల కేటాయింపు జరగాలి. పనులు జరగాలి. నిధులు విడుదల చేయాలి. అప్పుడు గానీ ఏదో ఒకటి జరగాలి. కానీ ప్రతిపక్ష కోయిలలు ముందే ఎందుకు కూస్తున్నాయి? రాబోయే సంవత్సరాల్లో కాబోయే ఖర్చు కూడా లక్ష కోట్లు దాటనప్పుడు అయిన అవినీతి లక్ష కోట్లు అని ఎందుకు విషవూపచారం చేస్తున్నాయి? అబద్ధాలకు అలవాటు పడిపోయి అలా మాట్లాడుతున్నారా? లెక్కలు రాకనా? లేక అధికారం చేజారిపోయిందన్న ఆక్రోశ ఉక్రోశాలా? రాజకీయాల్లో హుందాతనం ఎందుకు కోల్పోవాలి? అధికారపక్షాన్ని విమర్శించే అధికారం ప్రతిపక్షాలకు ఉంటుంది నిజమే. కానీ అందుకోసం కనీసం హోంవర్కు చేయాల్సిన పనిలేదా? నోటికి ఎంత వస్తే అంత? ఏది తోస్తే అది మాట్లాడేస్తే వాళ్లను ఎప్పటికయినా నాయకులుగా జనం గుర్తిస్తారా? అడ్డంగా మాట్లాడటమే నాయకత్వ లక్షణమైతే అటువంటివాళ్లకు వాళ్లకు ఏగతి పట్టిందో గతం నుంచి గుణపాఠాలు ఎందుకు నేర్చుకోవడం లేదు?
చంద్రబాబునాయుడు గతంలో తెలంగాణలో కొందరు మైకాసురులను తయారుచేసి కేసీఆర్‌పై, తెలంగాణ ఉద్యమంపై ఇష్టంవచ్చినట్టు దాడి చేయించారు. వ్యక్తిగతంలో అనరాని మాటలు అనిపించారు. తెలంగాణ టీడీపీ నాయకులకు ఏవేవో పదవులు ఆశచూపి రెచ్చగొట్టి మరీ మాట్లాడించారు. కేసీఆర్‌ను ఎంత తిడితే అంత గొప్పనాయకునిగా ఆరోజు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా వారిని ఆకాశానికెత్తింది. ఇప్పుడేమయింది. చంద్రబాబు వారికి ఎంత విలువ ఇచ్చారు? ఒక్క రాజ్యసభ సీటుకు అవకాశం ఉంటే ఎప్పుడూ నోరు విప్పని తన నమ్మినబంటుకు ఇచ్చుకున్నారు. గవర్నర్ పదవి గాలానికి కట్టిన ఎరలా ఎగురుతూనే ఉంది. తిట్టీ తిట్టీ అలసిపోయిన ఆ పెద్దమనిషి ఇప్పుడు మౌనమువూదలోకి వెళ్లారు. ఇప్పుడో కొత్త బిచ్చగాడు బయలుదేరాడు. ఆయన ఇంకా చెండాలంగా నోరుపారేసుకుంటున్నారు. ఈయనేదో రాజకీయాల్లోకి పవిత్ర గర్భం నుంచి ఊడిపడినట్టు అందరిపై తిట్లు కుమ్మరిస్తున్నాడు. ‘గోదావరి-కృష్ణ లింకు వల్ల ఎగువ కృష్ణలో లభించే 45 టీఎంసీల నీళ్లు తెలంగాణకు ఇవ్వబోవడం లేదు. డెల్టా ఆధునీకరణ వల్ల మిగిలే 20 టీఎంసీల నీళ్లు కూడా బీమాకు ఇవ్వం’ అని ఢంకా బజాయించి చెబుతున్న పార్టీ టీడీపీ. అటువంటి పార్టీని ఇంకా తెలంగాణలో మోయడమే దుర్మార్గం. పైగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు. అటువంటి మనిషి తనేదో పవివూతుడయినట్టు అందరికీ కాండక్టు సర్టిఫికెట్లు ఇవ్వాలని చూస్తున్నాడు. చంద్రబాబుకు ఈయనేమిటో అర్థమయినా ఇంకా దుకా ణం ఎందుకు నడిపిస్తున్నాడంటే, ఆ కేసు అటో ఇటో తేలాలి. ఓటుకు నోటు కేసు లో తనను ఇరికించిన నాయకునికంటే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. వారంతా చంద్రబాబుతో మాట్లాడకుండానే, ఆయనతో ఏదో సర్దిచెప్పుకోకుండా చేరారని అనుకోలేము. చంద్రబాబుకు, ఆయన సన్నిహితులకు తెలంగాణలో ఇంకేమి మిగిలిఉందో, ఏమి జరుగబోతున్నదో అర్థమయింది. అందుకు అనుగుణంగానే వారు నడుచుకుంటున్నారు. ఎటొచ్చీ నడమంవూతపు నాయకత్వంతోనే సమస్య. చంద్రబాబుకు మరికొంతకాలం ఈయన అవసరం ఉంది. ఆ అవసరాన్ని అడ్డుపెట్టుకుని ఈయన ఎగిగిరి పడుతున్నారు. ఓటుకు నోటు కేసు కొలిక్కి వచ్చిన మరుక్షణం ఈ నాయకులను నేలకేసి కొడతారని వేరే చెప్పనవసరం లేదు. యూజ్ అండ్ త్రోలో చంద్రబాబు ప్రసిద్ధుడు అని అందరికీ తెలిసిన విషయమే. అది అందరికీ అర్థం అవుతున్న విషయమే. కానీ ఖాళీ విస్తరి చప్పుడెక్కువ చేస్తుంది కదా. ఎగిగిరి పడుతున్నది. ఆ చప్పుడే ఇప్పుడు తెలంగాణ వింటున్నది.

కాంగ్రెస్ నాయకులయితే ఒక్కసారే వయసుమీద పడి గతమంతా మరచిపోయి, ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినవారిలా మాట్లాడుతున్నారు. వారు ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, ముంపులు, ప్రజాందోళనలు ఏమీ తెలియనట్టు, తమకు ఏమీ గుర్తుకు లేనట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులకు ఎంత గొప్ప చరిత్ర ఉందంటే ‘పులిచింతల ప్రాజెక్టు కట్టనివ్వం’ అని భీషణ ప్రతిజ్ఞలు చేసి, ప్రాజెక్టు సైటుకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న కరెంటు మోటార్లను ధ్వంసం చేసి వచ్చా రు. కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలవగానే ఎవరికి కావలసినవి వారు తీసుకుని చల్లగా జారుకున్నారు. పులిచింతల కింద చుక్క నీరు తెలంగాణకు రాదు. కానీ ఆ ప్రాజెక్టు కింద 14 నల్లగొండ గ్రామాలు మునుగుతున్నా, వేలాది మంది నిరాక్షిశయులవుతున్నా రాజశేఖర్‌డ్డి ముందు చేతులు కట్టుకు కూర్చున్నారు తప్ప ఒక్కరూ నోరు మెదిపిన పాపాన పోలేదు. ఎందుకంటే అందరికీ కాంట్రాక్టులు, పదవులు, పందేరాలు చేసిపెట్టారు. పులిచింతల కింద ఇప్పటికీ పలు గ్రామాల ప్రజలకు పరిహారం అందలేదు. పోయినసారి పరిహారం చెల్లించకుండానే రిజర్వాయరు నింపితే కొన్ని గ్రామాల్లోకి నీరు వచ్చింది. ప్రజలు గగ్గోలు పెట్టవలసి వచ్చిం ది. అప్పుడు కూడా అక్కడి మంత్రి ఉత్తమ్‌కుమార్‌డ్డి ఒక్కటంటే ఒక్క ప్రకటన చేయలేదు. ఉత్తమ్‌కు అంత నిజాయితీ ఉంటే పరిహారం చెల్లించేదాకా పులిచింత ల నింపకుండా అక్కడ కొట్లాడాలి. నాగార్జునసాగర్ ఎల్‌ఎల్‌సి కాలువను తవ్వి దాదాపు తొమ్మిదేళ్లవుతున్నది. నీళ్లొస్తాయి కదా అని రైతులు అభ్యంతర పెట్టలేదు. కానీ ఆ రైతులకు ఇప్పటికీ పరిహారం చెల్లించలేదు. మరి పెద్దమనిషి జానాడ్డి అప్పుడెప్పుడూ కొట్లాడలేదు. కోమటిడ్డి బ్రదర్స్ పీపుల్ ఫ్రెండ్లీ లీడర్స్ కాదు, కాంట్రాక్టు ఫ్రెండ్లీ లీడర్స్. కాంట్రాక్టులు ఇచ్చేవాళ్లతో మంచిగా ఉండాలన్నది వారి నియమం. అందుకే వారు తమకు కావలసినవేవో తీసుకుని, తమ పనులేవో తాము చేసుకుంటున్నారు. పార్టీలో పదవులు కాపాడుకోవడం కోసం ఒకసారి అధికార పార్టీని తిడతారు, ఇంకోసారి కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పని చేస్తున్నదని పొగుడుతారు. వారివన్నీ నిలకడలేని చేష్టలు. అవసరార్థ సంబంధాలు, అవకాశవాద ప్రకటనలు. రెండులక్షల కోట్ల అవినీతి గురించి మాట్లాడిన నాయకుడయితే రాజశేఖర్‌డ్డి జలయజ్ఞానికి అధికార ప్రతినిధిగా పనిచేసివారు. ఆయనకు అప్పుడూ ప్రాజెక్టుల గురించి తెలియదు, ఇప్పుడూ ప్రాజెక్టుల గురించి తెలియదు. ప్రతిపక్ష నాయకుడంటే ప్రతిదీ అడ్డంగా మాట్లాడటం అని మాత్రమే తెలుసు. అందుకే ఆయనకు లక్ష కోట్లకు రెండు లక్షల కోట్లకు తేడా తెలియదు. రాజశేఖర్‌డ్డికి నీడగా పనిచేసినవారు. ఆయన కూడా ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వంపై రాళ్లు విసురుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పరిహారం ఇవ్వడానికి కూడా కమీషన్లు తీసుకున్న చరిత్ర ఉంది. ఇళ్లు పోతే ఇందిరా ఆవాస్ యోజన కింద ఇళ్లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తున్నది. పరిహారం కూడా కాంగ్రెస్ ఇచ్చినదానికంటే రెండు మూడు రెట్లు ఇస్తున్నది.

ఈ ఆరు దశాబ్దాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలకు, ఇక్కడ జరిగిన అవినీతికి భాగస్వాములుగా, ప్రత్యక్షసాక్షులుగా అద్దాల మేడలు నిర్మించుకున్నవారు తెలంగాణ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయో లేదో ఏదో కొంపలు మునిగిపోయినట్టు యాగీ చేయడం మొదలుపెట్టారు. అద్దాల మేడల్లో ఉన్నవారు ఇతరులపై రాళ్లు విసిరితే ఏమవుతుందో వారికి తెలుసు. అయినా విసురుతామంటే, నువ్వొక్కటి విసరితే బయటివాళ్లు నాలుగు విసురుతారు. ఎందుకంటే మీకు అంత చరిత్ర ఉంది. మీ వెనుక అన్ని పాపాలు ఉన్నాయి. ప్రతిపక్షం ఇప్పటికయినా పునరాలోచించుకోవాలి. తిట్టి పెరగలేరు. నిర్మాణాత్మక పాత్ర, అర్థవంతమైన చర్చ, విమర్శ మాత్రమే వారి మర్యాదను పెంచగలవు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న ప్రాజెక్టులపై ఏదైనా మాట్లాడే ముందు వాటి గురించి సమక్షిగంగా అధ్యయనం చేయాలి. వివరాలు లెక్కలు పత్రాలు తెలిసి ఉండాలి. గాలి మాటలు, పిచ్చి కూతలతో ప్రతిపక్షం గౌరవాన్ని పెంచలేరు.

Its just not Brexit, its Glexit!



Its just not Brexit, its Glexit, mean exit from globalisation… ‘get back Britain’ is over, now ‘get back America’ is on the agenda. 
Country agenda’s were neglected in the name of International agenda. 
People welfare policies were compromised for the benefit of market forces. 
Developing countries were knee bended to the demands and needs of Developed countries.
Hope Countries are coming to the back to square.

Brexit: Anger about globalization

vector silhouette of a girl with raised hands and broken chains
vector silhouette of a girl with raised hands and broken chains

“It’s hard to see that this won’t have an impact on the US economy,” David Wessel, director of Brookings Institution’s Hutchins Center on Fiscal and Monetary Policy, tells the Monitor.

“But more importantly, this is a manifestation of the anger of people who have been left out of the global economy.”

The message sent by disaffected British voters could be a harbinger for the US election, Wessel says, the outcome of which will ultimately shape the US economy.
“The imperative now for elites in the US – business people, politicians – is that we can no longer pay lip service to the effects on people left out of globalization,” he says.

ప్రతినాయకగణం

mallannasagar

ప్రాజెక్టు ఆలస్యం అయితే జరిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని పరిహారం సమస్యను పరిష్కరించాలి. ఒక ప్రాజెక్టు ఒక సీజను ఆలస్యంగా మొదలయినా, ఒక సీజను ఆలస్యంగా అందినా ప్రజలకు, ప్రభుత్వానికి కలిగే నష్టం వందలు వేల కోట్లలో ఉంటుందని అన్ని పక్షాలూ గమనించాలి. ఒక సీజనులో ఒక టీఎంసీ నీటితో సుమారు 25 కోట్ల పంట చేతికి వస్తుందని వ్యవసాయార్థిక వేత్తలు అంచనావేశారు. అంటే మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టు ఒక సీజను ఆలస్యంగా పూర్తయితే జరిగే నష్టం సుమారు 1250 కోట్ల రూపాయలు. నిజానికి మల్లన్నసాగర్‌లో నిల్వ ఉంచేది 50 టీఎంసీల కావచ్చు, కానీ ఆ ప్రాజెక్టుకు ఎగువన ఇటు నిజాంసాగర్ వైపు, అటు గంధమల్ల వైపు ఉపయోగించే నీటి పరిమాణం ఇంకా ఎక్కువ. అంటే ఆ ప్రాజెక్టును ఎంత ఆపితే తెలంగాణకు అంత నష్టం.

ఒక చిన్న లిటిగేషన్ 30 గ్రామాలకు గత పదేళ్లుగా తాగునీరు, సాగునీరు లేకుండా చేసింది. నలుగురు రైతులకు చెందిన ఐదెకరాల భూమి విషయంలో వివాదం మొదలయింది. సుమారు వంద కిలోమీటర్ల కాలువ తవ్వకం పూర్తయింది. మధ్యలో ఈ ఐదెకరాల పొడవున 400 మీటర్లు తప్ప మిగిలిన కాలువలు, లింకు కాలువలు అన్నీ పూర్తయ్యాయి. ఆ నాలుగువందల మీటర్ల కాలువ తవ్వకం పూర్తయితే 20 గ్రామాలకు తాగునీరు, 40 వేల ఎకరాలకు సాగునీరు 2009లోనే అందుబాటులోకి వచ్చేవి. కానీ కొందరు లిటిగెంట్ల చెప్పుడు మాటలతో రైతులు కోర్టుకెళ్లారు. స్టే తెచ్చారు. ఇప్పటివరకు ఆ స్టే ఎత్తివేయించే మొనగాడు లేకపోయాడు. న్యాయమూర్తులు సైతం ఆ కేసుకు తొందరేముంది అని పక్కనపెడుతున్నారు. కానీ ఆ 40 వేల ఎకరాలకు ఈ ఏడేళ్లుగా నీరందివుంటే ఎన్నివందల కోట్ల పంట చేతికివచ్చేది? ఎంతమంది రైతుల జీవితాలు బాగుపడేవి? జీవన ప్రమాణాలు ఎంతగా మెరుగుపడేవి? భూముల విలువ ఎన్ని రెట్లు పెరిగి ఉండేది? ఒక్క వివాదం అన్ని గ్రామాలను ఎండబెడుతున్నది. నీటిపారుదల ఇంజనీర్లు రెవెన్యూ అధికారులవైపు వేలెత్తిచూపుతారు. రెవెన్యూ అధికారులు కోర్టులో ఉంది కదా ఏమి చేయలేమని చేతులెత్తేస్తారు, కోర్టులు వందలవేల కేసులు ఉన్నాయి, దీనికేమి తొందర అని వాయిదాలు వేస్తుంటాయి. రైతులు మాత్రం అలా కునారిల్లిపోతూనే ఉంటారు. ఇది ఒక జిల్లాలో ఒక ప్రాజెక్టు కింద తలెత్తిన వివాదం, విషాదం కథ. కానీ చాలా ప్రాజెక్టుల కథలు ఇలాగే విషాదాల్లో కూరుకుపోతున్నాయి. ఏటిగడ్డ కిష్టాపూర్ కథ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఎవరో వస్తారు. మీకు ఇన్నిలక్షలు అన్ని లక్షలు వస్తాయి. చలో కొట్లాడదాం అంటారు. రెచ్చగొడతారు. అది ఎన్నాళ్లకూ తెగదూ ముడిపడదు. ముందుగా భూములిచ్చి పరిహారం తీసుకుని ఎక్కడో దూరంగా వెళ్లి మళ్లీ భూములు కొనుక్కుని కొత్తజీవితం ప్రారంభించినవారు ముందుగా ఇబ్బంది పడినా నిక్షేపంగా ఉన్నారు. ఇప్పుడు వారి భూముల విలువలు కూడా పెరిగాయి. వాళ్లంతా ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకుంటున్నారు. మల్లన్నసాగర్ ఆషామాషీగా తలపెట్టిన రిజర్వాయరు కాదు. యాభై టీఎంసీల నీటిని నిల్వ చేయడం అంటే మెదక్ జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేయగలిగిన ప్రాజెక్టు. మల్లన్నసాగర్ అటు హరిద్ర, మంజీర నదులను, ఇటు గంధమల్ల నుంచి మూసీదాకా ఉన్న ఉపనదులను సజీవం చేసేందుకు ఉద్దేశించిన రిజర్వాయరు. మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వందలాది చెరువులను నింపడానికి, లక్షలాది ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి ఉద్దేశించిన నిల్వ రిజర్వాయరు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయువుపట్టు అది. అందుకే కొన్ని ప్రతిబంధక రాజకీయ శక్తులు అక్కడ దృష్టిని కేంద్రీకరించాయి.

నిజమే, ఉన్న ఊరు, చేసుకున్న భూమి వదిలిపోవాలంటే చాలా కష్టం. ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రజల బాధను కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరూ త్యాగాలు చెయ్యకుండా ఏ నిర్మాణమూ జరుగదు. ప్రతినిర్మాణంతో పాటు కొంత విధ్వంసమూ ఉంటుంది. కానీ నిర్మాణం వల్ల జరిగే మేలు ఎంత? జరుగుతున్న విధ్వంసం ఎంత? అన్న విచక్షణతో ఆలోచించకపోతే గోదావరిని తెలంగాణకు మళ్లించే యజ్ఞం ఎప్పటికీ పూర్తికాదు. ప్రాజెక్టుల నిర్మాణం, భూసేకరణ, పరిహారం చెల్లింపు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మొదలయింది ఏమీ కాదు. నాగార్జునసాగర్ సమయంలో వందలాది మంది నల్లగొండ ప్రజలు నిరాశ్రయులయ్యారు. నల్లమల కొండలపై వారికి నివాసాలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ ఊర్లకు ఇప్పటికీ రోడ్లు లేవు. కనీస వసతులు లేవు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇప్పుడక్కడికి రోడ్లు పడుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయరులో భూములు కోల్పోయిన మహబూబ్‌నగర్ వాసులకు ఇప్పటికీ పరిహారం, పునరావాసం కల్పించలేదు. ఇప్పుడు కూడా దీక్షలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఎంతో దూరం ఎందుకు? మంజీర కింద భూములు కోల్పోయిన వారికి దామోదర రాజనరసింహ ఎన్ని లక్షలు ఇప్పించారో ప్రభుత్వ రికార్డుల్లో దొరకదా? పరిహారం చెల్లించడానికి కూడా రైతులను ఎంత తిప్పుకున్నారో మంజీర చుట్టుపక్కల గ్రామాల్లో స్థిరపడిన రైతులను అడిగితే చెప్పరా? తెలంగాణ టీడీపీ నాయకులు భూసేకరణ గురించి మాట్లాడితే అసహ్యం కలుగుతుంది. అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు అనుసరించిన పద్ధతుల గురించి ఎవరికి తెలియదు? అరటి తోటలు, చెరుకు తోటలు కూల్చి, రైతులను బెదిరించి భూములు తీసుకున్న విషయం నిజం కాదా?చంద్రబాబు అక్కడ ప్రాజెక్టుల కింద ఎంత పరిహారం చెల్లిస్తున్నారు? ఏ చట్టం ప్రకారం చెల్లిస్తున్నారో వివరించి చెబితే ఇక్కడి ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. టీడీపీ నాయకులు ఇక్కడ కూతలు మాని అక్కడ ఏమి జరుగుతున్నదో తెలుసుకుని వచ్చి చెబితే బాగుంటుంది. తెలగాణలో జరిగిన అనేక విధ్వంసాలకు, పాపాలకు కారణమైన కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇప్పుడు ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారో! కొందరయితే సభ్యత సంస్కారం కోల్పోయి మాట్లాడుతున్నారు. వీళ్లా మన నాయకులు అని జనం సిగ్గుపడేట్టు వ్యవహరిస్తున్నారు. నువ్వేమన్నా చెప్పు, నేను మాత్రం వ్యతిరేకిస్తా అనే వాడిని ఏ ప్రభుత్వం ఒప్పించగలదు?

భూసేకరణ ఒక్క ఏడిగడ్డ కిష్టాపూర్‌లో మాత్రమే జరగడం లేదు. తెలంగాణ అంతటా జరుగుతున్నది. ఇప్పటికే 25 వేల ఎకరాల భూమిని ఎటువంటి అరమరికలు లేకుండా ప్రభుత్వం సేకరించింది. దామరచర్ల అల్ట్రాపవర్ ప్లాంటు వద్ద కూడా పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టింది. పాలమూరు రైతులు కొన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూమిని ఇస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉత్త కాలువలు తవ్వినప్పుడు చాలా గ్రామాల్లో పరిహారం అడగకుండానే కాలువలు తవ్వనిచ్చారు. ఆ తర్వాత ఎప్పుడో పరిహారం ఎంత ఇస్తే అంత తీసుకున్నారు. ఎందుకంటే అభివృద్ధి జరుగుతుందని. నీళ్లు వస్తాయని. కరువు పోతుందని. అనేక మంది బాగుపడతారని. అస్సలు బాధపడనివారు, ఎదురు తిరగని వారు లేరని కాదు. అప్పుడూ కొందరు వివాదాలకు వచ్చారు. ఆ తర్వాత రాజీపడ్డారు. ఏడిగడ్డ కిష్టాపూర్ రైతులు కూడా ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. పంచాయితీకోసం కాచుక్కూచున్న ప్రతిపక్ష నాయకుల భ్రమల్లో పడకుండా వాస్తవిక దృష్టితో సమస్యను పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలి. ఎప్పటికయినా పరిహారం చెల్లించాల్సింది ప్రభుత్వమే. సంఘర్షణపూరిత వాతావరణం పెంచుకోవడం మంచిది కాదు. ప్రభుత్వం కూడా పంతానికి పోకుండా వారికి మెరుగైన పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్లకు చెల్లించే ఎస్కలేషన్ డబ్బుతో పోల్చితే రైతులకు చెల్లించే పరిహారం స్వల్పం. ప్రాజెక్టు ఆలస్యం అయితే జరిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని పరిహారం సమస్యను పరిష్కరించాలి. ఒక ప్రాజెక్టు ఒక సీజను ఆలస్యంగా మొదలయినా, ఒక సీజను ఆలస్యంగా అందినా ప్రజలకు, ప్రభుత్వానికి కలిగే నష్టం వందలు వేల కోట్లలో ఉంటుందని అన్ని పక్షాలూ గమనించాలి. ఒక సీజనులో ఒక టీఎంసీ నీటితో సుమారు 25 కోట్ల పంట చేతికి వస్తుందని వ్యవసాయార్థిక వేత్తలు అంచనావేశారు. అంటే మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టు ఒక సీజను ఆలస్యంగా పూర్తయితే జరిగే నష్టం సుమారు 1250 కోట్ల రూపాయలు. నిజానికి మల్లన్నసాగర్‌లో నిల్వ ఉంచేది 50 టీఎంసీల కావచ్చు, కానీ ఆ ప్రాజెక్టుకు ఎగువన ఇటు నిజాంసాగర్ వైపు, అటు గంధమల్ల వైపు ఉపయోగించే నీటి పరిమాణం ఇంకా ఎక్కువ. అంటే ఆ ప్రాజెక్టును ఎంత ఆపితే తెలంగాణకు అంత నష్టం.

ఆరుదశాబ్దాలు తెలంగాణను ఏలిన రాజకీయ శక్తులు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజల తిరస్కారానికి గురయి రాజకీయ నిరుద్యోగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. తెలంగాణను తెచ్చుకున్నాం కదా. కొంతకాలం పనులు సాగనిద్దాం. బాగు చేసుకుందాం. కాళ్లలో కట్టెలు పెట్టకుండా నడవనిద్దాం. ఎన్నికల సమయంలో చూసుకుందాం అనుకోవడం లేదు. ఓడిపోయిన రోజునుంచే కుట్రలు కుతంత్రాలు ఉక్రోశాలు బయటపెట్టుకోవడం మొదలు పెట్టాయి. పరాజయం ఎదురయినప్పుడు అనుసరించాల్సిన రాజకీయ విజ్ఞత, పరిణతి వారిలో కనిపించ లేదు. క్రమంగా శక్తులు కూడదీసుకునే రాజకీయ సాధన ఏదీ వారు చేయడం లేదు. కేసీఆర్ ఎక్కడ గెలిచారో, తాము ఎక్కడ ఓడిపోయారో వాళ్లకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. తెలంగాణ రాకముందు తెలంగాణ వ్యతిరేక శక్తులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉపయోగించిన భాషను, దాడినే ఇప్పుడు తెలంగాణ ప్రతిపక్ష నాయకులు కూడా ఉపయోగిస్తున్నారు. కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే కేసీఆర్‌లాగా ఎదగాలని ఒక్కరూ అనుకోవడం లేదు. ఒక్కొక్క నాయకుడు రోజురోజుకు పతనాంధోలోకంలోకి జారిపోతున్నారు. ఒకప్పుడు మోత్కుపల్లి నరసింహులు పోషించిన తిట్లపాత్రను ఇప్పుడు రేవంత్‌రెడ్డి పోషిస్తున్నాడు. ఒకప్పుడు జయప్రకాశ్‌రెడ్డి అనుసరించిన తీరును ఇప్పుడు కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్నారు. తీవ్రంగా మాట్లాడి రోజూ ఎదుగుతున్నామనుకుంటున్నారేమో! కానీ తిట్టేవాళ్లు నాయకులు కాలేరని మోత్కుపల్లిని చూసి అర్థం చేసుకోవాలి. మోత్కుపల్లి చాలా సీనియర్ నాయకుడు. తెలివైనవారు. అనుభవం, అవగాహన ఉన్నవారు. మాట చాతుర్యం ఉన్నవారు. కానీ వాటన్నింటనీ ఉపయోగించుకోకుండా కేవలం చంద్రబాబు తిట్ల ఎజెండాను మోసి ఆయన ఏం సాధించుకున్నారు? ఎక్కడ ఆగిపోయారు? తిట్టునాయక గణం అంతా తెలుసుకోవలసింది గతం నుంచి గుణపాఠం నేర్చుకోవలసిందంతా ఒక్కటే – ప్రతీఘాత, ప్రతిబంధక, విధ్వంసకర పాత్రలతో సాధించేదేమీ ఉండదని. నిర్మాణాత్మక పాత్ర, నిర్మాణాత్మక విమర్శ మాత్రమే నాయకుడిని నిలబెడుతుందని. ఏటిగడ్డ కిష్టాపూర్ రైతాంగం అర్థం చేసుకోవలసింది ఒక్కటే. రాజకీయాలకోసం తమను ఎగదోసేవారిని నమ్మకండి. నాయకుల లక్ష్యమల్లా ప్రాజెక్టును వీలైనంతకాలం అపడమే. ఎల్లకాలం వీరు రైతుల వెంట ఉండరు. వీరి ఎత్తుగడ పరిహారం పెంచి ఇప్పించడం కాదు. ఈ సమస్యకు మెరుగైన పరిష్కారం చూపించే నాయకులను, అధికారులను మాత్రమే నమ్మండి. ప్రాజెక్టును ఆపకండి. పరిష్కారానికి సహకరించండి.