చంద్రబాబుకు సరైనోడు కేసీఆరే

వైస్రాయ్ సిద్ధాంత కర్త కేసీఆరేనని 2001లో చెప్పి ఉంటే బాగుండేది. అప్పుడేమో నేనే మొనగాడినని చెప్పుకున్నవు. కేసీఆర్ పక్కనబెట్టి అవమానించినవు. ఇప్పుడేమో కేసీఆర్ అంటున్నవు. నిజంగానే అది నాలుకా తాటిమట్టా? కులగజ్జిని మహావృక్షంలా పెంచిన చంద్రబాబు, ఆయన బాకా మీడియా కేసీఆర్ కులాన్ని అంటగట్టాలని చూశాయి. చంద్రబాబు దేశమంతా తిరిగి ఏ చక్కానయినా కలవవచ్చు, అది తప్పు కాదట, కేసీఆర్ తిరిగి రాష్ర్టాల ముఖ్యమంత్రులను కలవడం, ఆ తర్వాత నరేంద్ర మోడీని కలవడం తప్పట. బ్రీఫింగ్ చేయడానికి కలిశావా అని నువ్వు ప్రశ్నిస్తే జనం నవ్విపోరా చంద్రబాబూ. బ్రీఫింగ్ గురించి ‘బ్రీఫ్డు మీ’ సాక్షిగా నీకు ఎంత అనుభవం ఉందో ఎవరికి తెలియదు చంద్రబాబూ. ఇంతకాలం మీరంతా కట్టగట్టుకుని ఏది చేస్తే అది రాజకీయం. మీరు చెప్పేది వేదం. మీరు ఆడింది ఆట. పాడింది పాట. ఇక నడవదు బాబూ. మీరు తప్పు చేసినా రైటే. దొంగతనం చేసినా రైటే. కేసులు కొట్టేయించుకున్నా రైటే. మీకు అలా సాగింది. ఇంక కష్టం బాబూ.

ఇంతకాలానికి మీకు సరైనోడు దొరికాడు. నీగురించి కేసీఆర్ అన్నవన్నీ అక్షర సత్యాలు. వెన్నుపోటు పొడవలేదా? మాటలు మార్చలేదా? పార్టీలు మార్చలేదా? పిల్లిమొగ్గలెయ్యలేదా? ఆంధ్రప్రజల మనోభావాలతో ఇష్టమొచ్చినట్టు ఆడుకోలేదా? మోడీతో నాలుగేళ్లు అంటకాగి ఇప్పుడు అడ్డం తిరిగావు. కాంగ్రెస్ సర్వనాశనం కావాలని శాపనార్థాలు పెట్టినోడివి ఆ పార్టీ కొంగుపట్టుకున్నావు. నీకు విలువలు లేవన్నది అందుకే. పచ్చి మోసగాడివి అన్నదీ అందుకే. హైటెక్ సిటీ నేనే కట్టాను అన్నావు. అంతమొనగాడివైతే సొంత రాజధాని నాలుగేళ్లలో ఎందుకు కట్టలేదు. ఇప్పుడు బున్యాదులు తీసి, ఇంత సిమెంటు కాంక్రీటు బోసి అదేదో ఘనకార్యం చేసినట్టు బిల్డప్ ఇచ్చుడు ఏంది? నీ డబ్బాలు, బాకాలు దానికి అంతగా జోకుడేంది?

చంద్రబాబూ నీకు మర్యాద కావాలా? పార్టీ పెట్టి, ప్రజలను గెలిచి, ప్రభుత్వాన్ని సాధించి, మీ అందరికీ పదవులు ఇచ్చి, అధికారంలో కూర్చో బెడితే ఆయనకు వెన్నుపోటు పొడిచి, ఆయనపై చెప్పులు వేయించి, ఆయనను దారుణంగా అవమానించి, గుండె పగిలి చనిపోయేలా చేసిన ఘాతక చరిత్ర నీది. చంద్రబాబు ఇప్పుడు కూడా తాను బాధితుడి ఫోజు పెట్టి మరోసారి జనాన్ని మోసం చేయాలని చూస్తున్నడు. నరేంద్రమోడీ, జగన్, పవన్, కేసీఆర్ అందరూ ఒక్కటయ్యారని అబద్ధపు ప్రచారం చేసి, తానొక్కడినే కొట్లాడుతున్నానని జనాన్ని నమ్మించాలని చూస్తున్నడు. పవన్ కల్యాణ్ కొంపలు కూల్చడానికి ఇప్పటికే కొందరు కోవర్టులను ఆయన పార్టీలో చేర్పించాడు. ఎన్నికల వేళ వాళ్లు తమ నిజస్వరూపం ప్రదర్శిస్తారు. కుళ్లు, కుతంత్రాలు, కుట్రలు అబ్బో చంద్రబాబు రాజకీయ డిక్షనరీలో వాడని పదం లేదు.

చంద్రబాబుకు ఆంధ్రను బాగుచేసే ఉద్దేశం ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలవడం ఒక్కటే ఆయన ఎజెండా. అందుకోసం ఎంతకయినా తెగించడమే ఆయన నైజం. మళ్లీ ఆంధ్ర ప్రజలను పిచ్చోళ్లను చేసి ఆడించాలని చూస్తున్నడు. ఆయన పాతకాలను సమర్థించేందుకు బాకాలు, డబ్బాలు మళ్లీ మోపయినయి.

బీసీ రిజర్వేషన్లపై ఏది నిజం?

head-in-sand

బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయస్థానాల తీర్పులను మరుగున పరిచి తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం నడుస్తున్నది. ఏ రిజర్వేషన్లయినా 50 శాతానికి మించకుండా చూడండి అని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. కొందరు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళితేనే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. మరోవైపు నెలరోజుల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి తీరాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదీ కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ వచ్చిన తీర్పే. ఈ రెండు తీర్పులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లను 23.81 శాతానికి తగ్గిస్తూ అత్యవసర ఆదేశాలు జారీ చేసి ఎన్నికల నిర్వహణకు సిద్ధమయింది.

ఈ వాస్తవాలను మరుగున పరిచి కొందరు మాజీ న్యాయమూర్తులతో సహా ప్రతిపక్ష నాయకులు బీసీ రిజర్వేషన్లను ఎలా తగ్గిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి దురుద్దేశాన్ని ఆపాదించాలని కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. రిజర్వేషన్ల మొత్తంపై కేంద్రం పెత్తనం కాకుండా రాష్ర్టాలకే నిర్ణయాధికారం ఉండాలని కోరుతున్నారు. ఆ విషయాలను మరుగునపర్చి మాజీ న్యాయమూర్తులు కొందరు రాజకీయ చిడతలు పట్టుకుని తిరుగుతున్నారు.

శకునాల బల్లి చంద్రబాబు

img_4885-3

తెలుగుదేశం చంద్రబాబునాయుడు అంతటి రాజకీయ అవకాశవాది, మాటలు మార్చే వాడు దేశంలో మరొకరు ఉండరు. ఏమాత్రం వెన్నెముక లేని రాజకీయ జీవి. నాలుగేళ్లపాటు ప్రధాని నరేంద్రమోడీతో అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు వీరావేశాలు ప్రదర్శిస్తున్నారు. మూడో ఫ్రంటుకు అవకాశమే లేదని, నరేంద్రమోడీకి మేలు చేయడంకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలలో ఏదో పార్టీకి దూరంగా ఫ్రంటులు మనుగడ సాగించలేవని చెబుతున్నారు. మరి 1989లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు, ఆ తర్వాత 1996లో ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ ఎలా వచ్చాయి? ఎలా ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి?

చంద్రబాబునాయుడు దివాళాకోరు కాబట్టి అవేవీ గుర్తు లేవు. కాంగ్రెస్, బీజేపీలు ఒంటరిగా లేక కూటములుగా ఈసారి 150 నుంచి 200 స్థానాలలోపే గెల్చుకుంటాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 225 లోక్ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ర్టాలలోని ప్రాంతీయ పార్టీలన్నీ జట్టు కడితే కాంగ్రెస్, బీజేపీ కూటమిలకంటే ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంది. ఈ స్థానాల బలంతో కేంద్రంలో నిర్ణాయక పాత్ర పోషించవచ్చు. కాంగ్రెస్, బీజేపీలను ఫెడరల్ ఫ్రంటుకే మద్దతు ప్రకటించాలని కోరే అవకాశం ఉంది. అది వదిలేసి నోటికి వచ్చినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు. తనకు అనువైతే ఒకరకంగా కాకపోతే మరో రకంగా నాలుక మడతేయడం చంద్రబాబుకు అలవాటే.

ఫెడరల్ మార్గం మేలు

poll

 

మోదీ ఇకముందు కూడా ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. మళ్లీ అధికారంలోకి వచ్చినా ఆయన ధోరణి మారకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా ఇదే పరిస్థితి. ఆ రెండు పార్టీలదీ ఉత్తరాది మనస్తత్వం. ఢిల్లీ కేంద్రక ఆలోచన. దక్షిణాది అంటే ఒక చిన్నచూపు. అందుకే అన్ని ప్రాంతాలు తమ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటుకునే ఒక ఫెడరల్ నమూనా దేశ రాజకీయాలకు అవసరం. ఆ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ఆలోచన ఉత్తమమైనది. చంద్రబాబువి ఆసరా రాజకీయాలు. ఆయన ఎవరో ఒకరిపై ఆధారపడితే తప్ప రాష్ట్రంలో,రాజకీయాల్లో బతుకలేరు.

జాతీయపార్టీల కేంద్రీకృత అధికారం దేశానికి చేటు. గతంలో ఇందిరాగాంధీ, తాజాగా ప్రధాని నరేం ద్ర మోదీ నాయకత్వం ఆ విషయం బాగా రుజు వు చేసింది. ఆయన నిర్ణయాలు చేస్తున్న తీరు, వాటి తప్పొప్పులను సమీక్షించడానికి నిరాకరించే మొండితనం దేశానికి చాలా నష్టం చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ, పెట్రో ధరలకు స్వేచ్ఛ, నల్లధనం విషయంలో చేతులెత్తేయ డం, బ్యాంకు డిఫాల్టర్లను కట్టడి చేయకపోవడం, రాష్ర్టాల హక్కులను గౌరవించకపోవడం ఆయన లెక్కచేయనితనానికి తార్కాణా లు. ఇవన్నీ పదుగురితో చర్చించి తీసుకున్న నిర్ణయాలు కాదు. ఆయన, మరికొద్ది మంది దేశంపై రుద్దిన నిర్ణయాలు. బ్యాంకులు, కోర్టు లు, ఉన్నత విద్యావ్యవస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘాసంస్థలు.. అన్నీ అనర్హులతో నిండిపోతున్నాయి. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండాలే తప్ప బలాదూర్‌గా వ్యవహరించే ప్రభుత్వం కాదు. ఒక్క బీజేపీ సమస్య కాదు, జాతీ యపార్టీల అన్నింటి సమస్య. వారి ఆలోచనలన్నీ ఢిల్లీ కేం ద్రంగా, ఉత్తరాది కేంద్రం గా ఉంటాయి. వారు ఏ నిర్ణ యం చేయాలన్నా, ఏ విధా నం రూపొందించాల న్నా ఒక రాష్ర్టానికి మరో రాష్ర్టానికి పోటీపెట్టి ఆలోచిస్తారు. చివరికి ఏ నిర్ణయ మూ చేయని దుస్థితిలో ఉండిపోతారు.

ఏకపక్ష అధికారం ఉన్నప్పుడల్లా ఢిల్లీలో జరిగింది ఇదే. ఇందిరాగాంధీ ఏకపక్షంగా అధికారం చెలాయించింది కాబట్టే 1969లో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయగలిగింది. 10 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినా తెలంగాణ వాదాన్ని గౌరవించలేదు. ప్రశ్నించలేని అధికారం చెలాయించింది కాబట్టే ఎదురుదెబ్బలు తగిలేసరికి 1975లో ఎమర్జెన్సీ విధించింది. 1977లో జనతా ప్రభుత్వం, 1989 తర్వాత ఫ్రంట్ రాజకీయాలు మొదలైన తర్వాతనే కేంద్రం లో ఏ పార్టీ ఉన్నా ఒళ్లు దగ్గర పెట్టుకోవడం కొంత అలవాటైంది. విశ్వనాథ ప్రతాప్‌సింగ్ ప్రభుత్వం, అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వాలు ఫ్రంట్ రాజకీయాలపై ఆధారపడినా శక్తివంతమైన పాలన ను అందించాయి. దేశంలో మొదటిసారి రైతు రుణ మాఫీ చేసింది 1989లో జాతీయ ఫ్రంట్ ప్రభుత్వం హయాంలోనే. వెనుకబడిన తరగతులకు మండల్ రిజర్వేషన్లు అమలు చేసిందీ వీపీ సింగ్ ప్రభుత్వమే. ప్రపంచానికి మరోసారి మన అణు పాటవాన్ని చాటిం ది వాజపేయి పాలనలోనే. కార్గిల్ యుద్ధం గెలిచిందీ ఆయన పాలనలోనే. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులు, రోడ్డు ప్రాజెక్టులు మొదలైందీ వాజపేయి పాలనలోనే. వీపీసింగ్, వాజపే యి దేశమంతటా ఏదో ఒక రూపంలో కనిపించారు. పల్లెలకు రోడ్లన్నీ వాజపేయి పేరుతోనే వచ్చాయి. వెనుకబడిన తరగతులకు విద్య ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు వీపీ సింగ్ కారణంగానే వచ్చాయి.

మోదీ కూడా ప్రజలకు చాలా రూపాల్లో కనిపించారు. ఆయన కనిపించిన సందర్భాలన్నీ ప్రజలకు ప్రతికూలమైనవే. నోట్ల రద్దు పేదల ఆర్థికస్వేచ్ఛను దెబ్బతీసింది. పెద్దల ఆర్థికస్వేచ్ఛను మాత్రం ఇసుమంత కూడా తాకలేదు. బ్యాంకులకు రుణాల ఎగవేత ఆగలే దు. నల్లధనం చెలామణి ఆగలేదు. అవినీతి ఆగలేదు. ఎన్నికల ఖర్చు తగ్గలేదు. ధరల పెరుగుదల ఆగలేదు. పెద్ద వాళ్ల నోట్ల చెలామణి ఎప్పటిలాగే ఉంది. చిన్నవాళ్ల వద్ద నోట్లు మిగులలేదు. అందుకే కేంద్రం లో జాతీయ పార్టీలకు తిరుగులేని అధికారం దేశానికి ఎప్పుడూ మంచిది కాదు. సమాఖ్య రాజకీయాలే దేశానికి అవసరం. సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించే నాయకత్వమే దేశానికి కావాలి. ఇందుకు సమాఖ్య రాజకీయ నమూనానే కావాలి. మళ్లీ జాతీయ ఫ్రంట్ తర హా ఫెడరల్ ఫ్రంట్ రావాలి. జాతీయపార్టీలకు ఫ్రంట్‌లు అండగా ఉండటం కాదు. ఫ్రంట్‌కే జాతీయ పార్టీలు మద్దతుగా వచ్చే పరిస్థితి రావాలి. వీపీ సింగ్, ఎన్టీఆర్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది. కాంగ్రెస్ అవినీతిపైన, బీజేపీ మతోన్మాదంపైన నేషనల్ ఫ్రంట్ పోరాడింది. ఈ నేపథ్యంలో జరిగిన 1989 ఎన్నికల్లో జనతాదళ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ 146 స్థానాలు గెలువగా కాంగ్రెస్ 197 స్థానాలను గెలిచింది. బీజేపీ 86 స్థానాలు, వామపక్షాలు 52 స్థానాలు గెలిచాయి.

రాజీవ్‌గాంధీ తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని ప్రకటించారు. ఆ వెంటనే వామపక్షాలు, బీజేపీ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించాయి. అలా మరోసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ర్టాల ఆకాంక్షలు నెరవేర్చుకునే అవకాశం అప్పుడు మొదలైంది. జాతీయ రహదారులు, కొత్త రైల్వే మార్గాలు, జాతీయ విద్యాసంస్థలు అనేక ప్రాజెక్టులు ఆయా ప్రాంతీ య పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వంలో ఉండి తమ రాష్ర్టాలకు తీసుకొచ్చారు. నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నది కొద్దికాలమే అయినా మంచి ఫలితాలనే అందించింది. దీర్ఘకాలిక దృష్టిలేని స్వార్థ రాజకీయశక్తుల కారణంగా నేషనల్ ఫ్రంట్ ఎక్కువ కాలం మనలేకపోయింది. మరోసారి 199 6 ఎన్నికల్లో ప్రాంతీయపార్టీలన్నీ యునైటె డ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, బీజేపీలు కలిసి 300 స్థానాలు గెలిస్తే, ప్రాంతీయ పార్టీలు 243 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్ బయ టి మద్దతుతో దేవెగౌడ, ఇంద్రకుమార్ గుజ్రాల్ వంటి వారు దేశాని కి ప్రధానులు అయ్యే అవకాశం వచ్చింది. దక్షిణాది నుంచి రెండో ప్రధాని దేవెగౌడ. అయితే ప్రయోజన వైరుధ్యాల వల్ల యునైటెడ్ ఫ్రంట్ కూడా ఎక్కువ కాలం నిలువలేదు. 1998, 99లలో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రాంతీయపార్టీలు గెలుచుకున్న స్థానాల సంఖ్య తగ్గినా ఢిల్లీ లో రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకపాత్ర పోషించాయి. వాజపేయి వంటి నాయకుడు ప్రధాని కావడానికి ప్రాంతీయ పార్టీలే మద్దతు తెలిపాయి. ఆ తర్వాత మన్మోహన్‌సింగ్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలకు కూడా ప్రాంతీయపార్టీలే ప్రాణవాయువు.

ఇందిరాగాంధీ తర్వాత తిరిగి ఏకచ్ఛత్రాధిపత్యం వచ్చింది నరేం ద్ర మోదీకే. అందుకే ఆయన ఎవరి మాటా వినని సీతయ్యలాగా నిర్ణయాలు చేస్తూ పోయారు. నోట్ల రద్దు విషయం కనీసం మంత్రివర్గానికి తెలియదు. ఆర్థికమంత్రికి కూడా తెలియదని అప్పట్లో వార్తలు వచ్చాయి. మోదీ రాష్ర్టాలకు న్యాయంగా ఇవ్వాల్సిన ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. మంచిగా ఉంటే ఒకరకంగా ప్రత్యర్థిగా ఉంటే మరోరకంగా తటస్థంగా ఉంటే ఇంకోరకంగా కేంద్రం సాయాన్ని రాజకీయ జూదం స్థాయికి మార్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లోపభూయిష్టమని అదనీ ఇదనీ తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ ప్రభుత్వం వాటిని సరిచేసేందుకు ఎంతమాత్రం ప్రయత్నించలేదు. హైకోర్టు విభజనను కోర్టు వ్యాజ్యాలకు వదిలేసింది. కేంద్ర సంస్థల మంజూరీని ఇంకా సాగదీస్తూనే ఉన్నది. రాష్ర్టాల ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో నూ దాటవేత వైఖరినే ప్రదర్శిస్తున్నది. రాజకీయ సుస్థిరతను కోరి శాసనసభ నియోజకవర్గాల సంఖ్య ను పెంచాలని పునర్విభజన చట్టంలో ప్రతిపాదిస్తే దానిపై లేనిపోని పేచీలు లేవదీసి ఇప్పుడు చేయలేమని వాదిస్తున్నది. పార్లమెంట్ ఆమోదించిన చట్టంలోని ప్రతిపాదనకే ఇటువంటి పరిస్థితి ఉంటే కేంద్రం ఇంక దేనిని గౌరవిస్తుంది? ఒకవేళ రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తే కూడా పార్లమెంట్‌లో అంతటి మెజార్టీ బీజేపీకి ఉన్న ది. జీఎస్టీ వంటి సంక్లిష్టమైన బిల్లును ఆమోదింపజేసుకున్నది. అన్ని పార్టీలు ఒప్పుకున్న పునర్విభజన ప్రతిపాదనలపై నిర్ణయం చేయడానికి ఎందుకు తాత్సారం? అన్నింటినీ సొంత రాజకీయ ప్రయోజన దృష్టితో చూసే మోదీ సంకుచిత దృక్పథమే ఈ జాప్యానికి కారణం. కేంద్రం తలుచుకుంటే రాష్ర్టాలకు సంబంధించిన సమస్యలన్నీ ఒక్కరోజులో పరిష్కారమవుతాయి. మోదీ అలా ఆలోచించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఉపయోగపడతారు ఎవరు ఉపయోగపడరు అన్న లెక్కలు వేసుకుని మరీ సహకరించడమో, సతాయించడమో చేస్తున్నారు.

మోదీ ఇకముందు కూడా ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. మళ్లీ అధికారంలోకి వచ్చినా ఆయన ధోరణి మారకపోవ చ్చు. ఒకవేళ కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా ఇదే పరిస్థితి. ఆ రెండు పార్టీలదీ ఉత్తరాది మనస్తత్వం. ఢిల్లీ కేంద్రక ఆలోచన. దక్షిణాది అంటే ఒక చిన్నచూపు. అందుకే అన్ని ప్రాంతాలు తమ అస్తిత్వా న్ని, ఆత్మగౌరవాన్ని చాటుకునే ఒక ఫెడరల్ నమూనా దేశ రాజకీయాలకు అవసరం. ఆ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ఆలోచన ఉత్తమమైనది. చంద్రబాబువి ఆసరా రాజకీయాలు. ఆయన ఎవరో ఒకరిపై ఆధారపడితే తప్ప రాష్ట్రం లో, రాజకీయాల్లో బతుకలేరు. అందుకే ఆయన ముందే తన రాజకీయావసరాలను కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారు. కేసీఆర్ బీజేపీ, కాం గ్రెస్‌లకు దూరంగా ఒక ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రధాని, ఉప ప్రధాని, మంత్రివర్గాన్ని నిర్ణయించడంలో రాష్ర్టాలకు ప్రమేయం ఉండాలని భావిస్తున్నారు. ప్రధాని ఉత్తరాది నుంచి ఉంటే దక్షిణాది నుంచి ఉప ప్రధాని ఎందుకు ఉం డకూడదు? కీలకమైన శాఖలు దక్షిణాది రాష్ర్టాలకు ఎందుకు దక్కకూడదు? తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడి షా వంటి రాష్ర్టాలు తమ రాష్ర్టాల ప్రగతికి సాధించుకున్న ప్రాజెక్టు లు తెలంగాణకు కూడా ఒక నమూనా కావాలి.

తమిళనాడులో ఉన్నన్ని జాతీయ రహదారులు, రైలుమార్గాలు దేశంలో ఎక్కడా లేవు. బీహార్‌లో రైలు మార్గాలు అసాధారణ రీతిలో విస్తరించాయి. ఆ రాష్ర్టాల నాయకత్వం స్వతంత్రంగా ఉండి కొట్లాడి రైల్వేలు, ఉపరితల రవాణా వంటి శాఖలు తీసుకొని తమ రాష్ర్టాలకు మేలు చేయగలిగారు. తెలంగాణకు చేయాల్సింది చాలా ఉన్నది. రైల్వేలు, జాతీయ రహదారుల విషయంలో మనం ఇప్పటికీ వెనుకబడి ఉన్నాం. తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి నమూనా దేశానికి కూడా అవసరం. గత ఎన్నికల్లో కేసీఆర్ ధైర్యం చేసి అమలుచేసిన రుణమాఫీ దేశమంతటా ఒక నినాదమై కూర్చుంది. ఏనాడూ రైతుల గోడు పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు దేశమంతటా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నది. కేసీఆర్ కేవలం రుణమాఫీ మాత్ర మే కాదు, దేశమంతటా రైతుబంధు అమలుచేయాలని పిలుపునిస్తున్నారు. భారీ ఎత్తున దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని సూచిస్తున్నారు. దేశంలో 65 శాతం ప్రజానీకం ఆధారపడిన వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ ఎజెండా అంతా అమలు కావాలంటే ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భవించాలి. కాంగ్రెస్, బీజేపీ ఛత్రాలకింద తలదాచుకోవడం మాని ప్రాంతీయ ఆకాంక్షల కేంద్రబిందువుగా ఒక బలమైన ఫ్రంట్ రూపొందాలి. ఆ దిశగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు విజయవం తం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈవీఎంలపై భావదారిద్య్రం

evm

 

ఈవీఎంలను మానిప్యులేట్ చేయవచ్చునని, అవి తీసేసి మళ్లీ మాన్యువల్ బ్యాలెట్ ఎన్నికలు జరిపించాలని కొంత మంది రాజకీయ నాయకులు, మేధావులు డిమాండు చేస్తున్నారు. పార్టీలన్నీ తీర్మాణం చేసి అటువంటి నిర్ణయం తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ తాము గెలిచినచోట ఒక విధంగా ఓడిన చోట మరో విధంగా ఈవీఎంల వినియోగంపై చర్చ చేయడమే విడ్డూరమవుతుంది. నాకు గుర్తున్న మేరకు 2004 నుంచి పూర్తిస్థాయిలో ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఈవీఎంలను మానిప్యులేట్ చేయవచ్చునని మొదటి నుంచీ విమర్శలు ఉన్న మాట వాస్తవమే. అవి అనుమానపూరిత విమర్శలు తప్ప, రుజువైన దాఖలాలు లేవు.

2004లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఇటువంటి అనుమానాలు అనేక మంది సీనియర్ జర్నలిస్టులు, మేధావులు సైతం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఓడిపోవాలని బలంగా కోరుకుంటున్నవారొకవైపు, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాలు రావాలని కోరుకుంటున్నవారు మరోవైపు. చంద్రబాబు ఇంద్రుడు చంద్రుడు ఆయన ఏదో ఒకటి చేసి మళ్లీ గెలుస్తాడు అన్న భావనను చంద్రబాబునాయుడు, ఆయన అనుకూల మీడియా ప్రజలపై బలంగా రుద్దింది. అప్పుడు కూడా వంటకం చేసిన సర్వేలు జనంపై రుద్దారు. ఒక సీనియర్ జర్నలిస్టు జూబిలీహిల్స్ పోలింగ్ బూత్ వెళ్లి ఓటేసి వచ్చాడు. ఎటు ఓటు వేసినా సైకిల్ పడుతుందని నా అనుమానం అన్నాడు.

కానీ ఎన్నికల తర్వాత ప్రజాతీర్పు స్పష్టమైంది. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాలు గెలిచాయి. ఇలా అనేక రాష్ర్టాల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి. పాలించే పార్టీలు మారుతూనే ఉన్నాయి. 2014లో కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ఓడిపోయి ఎన్ గెలిచింది. ఈవీఎంలను మానిప్యులేట్ చేసే పనయితే రాహుల్ ఎప్పుడో ప్రధాని కావలసింది. అంతదూరం ఎందుకు? నరేంద్రమోడీ సర్వశక్తిమంతుడని పేరు కదా! మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఓడిపోతే దేశవ్యాప్తంగా తన పాలనకు ముప్పు వస్తుందనీ తెలుసు. అయినా అక్కడ ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించారు. బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ మాత్రం ఈవీఎంలు సక్రమంగా పనిచేసి, తెలంగాణలో మాత్రమే తేడా చేశాయా?

ఇవన్నీ ప్రజల తీర్పును జీర్ణించుకోలేని ఒక భావదారిద్య్రం నుంచి వచ్చే ఆలోచనలు. తెలంగాణలో ప్రజలు కూడా సాధారణ తీర్పు ఇవ్వలేదు. దాదాపు 30 లక్షల ఓట్ల ఆధిక్యతను ఇచ్చారు. టీఆర్ 88 స్థానాల్లో విజయం సాధించింది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా కాంగ్రెస్ ఇంకా అదే సమస్యను పట్టుకుని వేలాడడం ఆశ్చర్యం వేస్తున్నది. కాంగ్రెస్ నాయకులు ఈ పితూరీలు, ఫిర్యాదులు, కేసుల చుట్టూ కాకుండా జనం చుట్టూ తిరిగితే నాలుగు ఓట్లు వస్తాయి. ఎప్పటిలాగే ఓటర్ల జాబితాలు, సమస్యలంటూ కోర్టుల చుట్టూ తిరిగితే ప్రజలు హర్షించరు. దానికంటే ఓటర్ల జాబితాలో నమోదుకాని వారిని చేర్పిస్తే ఒకింత మేలు జరుగుతుంది.

దేశమంతటా రుణమాఫీ

 

gh

తెలంగాణ దేశాన్ని ప్రభావితం చేస్తోంది

తెలంగాణ ప్రభుత్వం చేసిన రుణమాఫీ ఇవ్వాళ దేశమంతటా ఒక నినాదమై మోగుతోంది. ప్రతిరాష్ట్రంలోనూ ఎన్నికల నినాదమై పోయింది. కర్ణాటక, పంజాబ్ ఇప్పటికే రుణమాఫీ ప్రకటించాయి. మధ్యప్రదేశ్, చత్తీస్ రుణమాఫీ నిర్ణయం తీసుకున్నాయి.

ఇప్పుడు కొత్తగా అస్సాం బీజేపీ ప్రభుత్వం పాక్షిక రుణమాఫీ పథకాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ దేశమంతటా రుణమాఫీ చేయాలంటున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా రుణమాఫీపై ఆలోచన చేస్తున్నదని వార్తలు వస్తున్నాయి.

రైతుబంధు, రైతు బీమా పథకాలు కూడా దేశవ్యాప్తంగా ఇదే ప్రభావాన్ని చూపించనున్నాయి. దేశంలో అత్యధిక ప్రజానీకాన్ని ప్రభావితం చేసే పథకాలవైపు జాతీయ పార్టీలు ఇంతవరకు కన్నెత్తి చూడలేదు. 1989లో జాతీయ ఫ్రంటు కాలంలో మొదటిసారి పదివేల రూపాయల రుణమాఫీ మొదలయింది.

ఇప్పుడు కూడా మళ్లీ ప్రాంతీయ పార్టీల చొరవతోనే రైతాంగంవైపు పార్టీలన్నీ దృష్టిసారించే పరిస్థితి వచ్చింది. ఇది గొప్ప గుణాత్మక మార్పు. ఏ ఉత్పాదక చూపించకుండానే ఒక దగుల్బాజీ పారిశ్రామిక వేత్త బ్యాంకులకు ఎగవేసిన సొమ్ము 45000 కోట్లు. ఆ డబ్బుతో నాలుగైదు రాష్ర్టాల్లో రైతు రుణాలు మాఫీ చేయవచ్చు.

ఆయనొక శిఖరం

FullSizeRender(4)

 

ఒక పార్టీని ప్రారంభించి, ఒక జెండాను సృష్టించి, ఎజెండాను రూపొందించి, ఒక ఉద్యమాన్ని నడిపించి, ఒక రాష్ర్టాన్ని సాధించి, నాలుగున్నరేండ్లు అద్భుతమైన పాలన అందించి, మరోమారు కోట్లమంది ప్రజల అభిమానం చూరగొని, 88 స్థానాల్లో విజయకేతనం ఎగరేసిన మహానాయకుడు కేసీఆర్. ఒంటిచేత్తో అనేక విజయాలు సాధించిన జనహృదయనేత కేసీఆర్. వారసత్వాలు లేవు. రాజకీయ సంక్రమణాలు లేవు. బలమైన ఆర్థిక నేపథ్యమూ లేదు. సామాన్యుడిగా మొదలై అజేయుడిగా ఎదిగిన భూమిపుత్రుడు. ఒంటరిగా మొలిచి మహావృక్షంగా ఎదిగిన నేత. ఎటువంటి పటాటోపాలు లేకుండా కొన్ని నిమిషాల్లోనే చాలా సాదాసీదాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగించారు. నిబద్ధత, నిరాడంబరత ఆయన సహజాతాలు. ఆయన మూలాలను వదిలిపెట్టని నాయకుడు. స్వయంకృషితో ఇంత గా ఎదిగిన నాయకుడు. మరొకరయితే ప్రమాణ స్వీకారోత్సవాన్ని బ్రహ్మాండం బద్దలయ్యేట్టుగా చేసేవారు. ఏ ఎల్బీస్టేడియమో రణగొణ ధ్వనులతో మోగిపోయేది. అప్పుల్లో ఉన్నాం.. ఆగమై పోయాం అంటూ నిరంతరం ఏడ్చే పొరుగు ముఖ్యమంత్రి కూడా తొలి ప్రమాణానికి ఎంత సెట్టింగు వేశారో తెలుసు. కానీ కేసీఆర్ వాటి జోలికెళ్లలేదు. ఎదిగే కొద్దీ మరింత బాధ్యతగా ఉందామన్నది ఆయన ఆలోచన. సాయంత్రానికి యథావిధిగా పనిలో నిమగ్నమయ్యారు.

పార్లమెంటు సభ్యులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఆయన జనం మనిషి. నిన్న ముఖ్యమంత్రిని అభినందించడానికి ప్రగతిభవన్‌కు వెళితే అక్కడ ఎటుచూసినా జనప్రవాహమే. వేలమంది లోపలికి వచ్చి ముఖ్యమంత్రిని అభినందించి వెళుతున్నారు. ఆ జనాన్ని చూసినప్పుడు అదొక దర్బారు అని తిట్టే సన్నాసులు గుర్తొచ్చారు. మనిషి శిఖరం, మనసు విశాలం, అయినా నేల విడువని నైజం. ఎప్పుడూ పదిమంది చుట్టూ లేకుండా భోజనంచేయరు. కులాలు, సామాజికవర్గాలు, హోదాలు ఇవేవీ ఆయన లెక్కలో ఉండవు. భోజనం వేళకు వచ్చిన అతిథులను పేరుపేరునా పలకరిస్తూ ముచ్చటిస్తూ భోజనంచేయడం ఆయనకు ఆది నుంచీ అలవాటు. నాకు వివిధ పార్టీలలో చాలా పెద్దపెద్ద నాయకులు తెలుసు. వాళ్లందరి ఇళ్లకూ వెళ్లాను. కానీ ఏ నాయకుడూ తన డైనింగ్‌టేబుల్ వద్ద తనతో కూర్చోబెట్టుకుని నాకు భోజనం పెట్టిన సందర్భంలేదు అని టీడీపీ నుంచి వచ్చిన ఓ సీనియర్ నాయకుడు ఒకనాడు చెప్పడం గుర్తు. పెద్దలను గురువులను ఆయన సత్కరిస్తారు. పాదాభివందనం చేస్తారు. కానీ ఎవరినీ తనకు సాష్టాంగపడనివ్వరు.

For full story:

https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/cm-kcr-is-a-god-for-me-says-telangana-people-1-2-590626.html

ఇతిహాసంలో తెలంగాణ ఎక్కడ?

కొత్త చూపు :

చరిత్ర ఒక తరగని గని. ఎంత శోధించినా మరికొంత మిగిలే ఉంటుంది. ఎందుకంటే చరిత్ర అంతా ఆధిపత్య సంఘర్షణల మయమే. సంఘర్షణలో గెలిచినవారు పరాజిత ప్రాంతాల చరిత్రను ధ్వంసం చేసి తమ చరిత్రను స్థాపితం చేయడం గతకాలమంతా జరిగింది. గతానికి సంబంధించిన ఆనవాళ్లు, ఆధారాలు, శత్రుశేషాలు లేకుండా చేయడం అన్నది విస్తృతంగా, కొన్నిసార్లు వికృతంగా జరిగింది. చాలా సార్లు అధికార సంఘర్షణ మాత్రమే గాక మతాల సంఘర్షణగా కూడా చరిత్ర నడిచింది. శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధం, మళ్లీ శైవం, వైష్ణవం…పరస్పర విధ్వంస పునాదులపై పొరలుపొరలుగా చరిత్ర పేరుకుపోయింది. తెలంగాణ పూర్వయుగపు చరిత్రకు సంబంధించి రేఖామాత్ర ఆధారాలు తప్ప, కచ్చితమైన కాలనిర్ణయంగానీ, రాజవంశాల అనుక్రమణికగానీ లభించలేదు. ముక్కలు ముక్కలుగా అక్కడక్కడా లభించిన శాసనాలు, కథాసాహితీ గ్రంథాలు, పురాణాల ప్రస్తావనలే ఇప్పటి చరిత్రకు ఆధారాలు. ఆధారాలు లేనప్పుడు ఆధిపత్య శక్తులు తమకు తోచిన విధంగా చరిత్రను మల్చుకోవడం పరిపాటి. తెలుగునేల చరిత్రలో కూడా ఈ వైకల్యం కనిపిస్తుంది. “కళింగ, వేంగి, వెలనాడు, పాకనాడు, రేనాడు, సబ్బినాడు మొదలైన నాడులేర్పడి ప్రతినాడులోను స్వతంత్ర రాజ్యం వెలసి రాజకీయైక్యానికి భంగం వాటిల్లింది. రాజకీయంగానేగాక ప్రతివర్ణంలోనూ నాడీ భేదం ఏర్పడి సాంఘిక అనైక్యానికి కారణమై జాతీయ భావం దుర్భలమైంది. తెలంగాణ, రేనాడు ప్రాంతాలు చిరకాలం ఆంధ్రేతర రాజవంశాల పాలనలోనే ఉండడం జరిగింది. సుదీర్ఘమైన తమ చరిత్రలో ఆంధ్రులు అత్యల్పకాలం మాత్రమే ఏకఛత్రాధిపత్యం కింద మనగలిగినారు (ఆంధ్రుల చరిత్ర, పేజీ9, పేరా3)” అని ప్రముఖ చరిత్రకారుడు బీఎస్ హనుమంతరావు పేర్కొన్నారు. ఉద్యమ వేకువలో తెలంగాణవాదులు ఆ మాటే అంటే సమైక్యవాదులు, కొందరు చరిత్రకారులకు కోపం వచ్చింది. ఆంధ్ర, తెలంగాణ వేర్వేరు కాదు అని, తెలంగాణ ప్రత్యేకం అని చెప్పేవాదన విచ్ఛిన్నకరమైనదని వాదించారు. తెలంగాణకు ఆది నుంచీ సొంత అస్తిత్వం ఉంది. సొంత చరిత్ర ఉంది. తెలుగు అన్న భావనే త్రిలింగ, తెలింగ, తెలుంగు నుంచి వచ్చిందని అనేక చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ప్రాంతాలతోనే భాషలు ఎదిగాయని ఏ భాషను చూసినా అర్థమవుతుంది. కర్ణాటులు మాట్లాడిన భాష కన్నడం అయింది. తమిళులు మాట్లాడిన భాష తమిళం అయింది. మర్హాటులు మాట్లాడిన భాష మరాఠా అయింది. అలాగే గుజరాతీ, ఒరియా, బెంగాలీ భాషలు. తెలుగు ఆవిర్భావానికి మూలాలను మాత్రం మన చరిత్రకారులు అంగీరించలేదు. మూలాలను అంగీకరిస్తే తెలంగాణను, త్రిలింగదేశ భావనను అంగీకరించాల్సి ఉంటుందని వారు భావించారు. అందుకే త్రిలింగ, తెలింగ, తెలంగాణ భావనల ప్రాధాన్యాన్ని చరిత్రలో వీలైనంత తగ్గించి చూపడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఆ భావనల ఆవిర్భావ క్రమాన్ని, ఆ భావనల వెంట అల్లుకుపోయిన చారిత్రక ఆధారాలను తవ్వితీయడానికి ఇప్పుడు ఒక కొత్తచూపు కావాలి. తెలంగాణ చరిత్రకారులు కొందరు ఈ దిశగా పరిశోధనలు ప్రారంభించారు. కానీ అది చాలదు. తవ్వినా కొద్దీ కొత్త ఆధారాలు లభిస్తున్నాయి. వెదకినా కొద్దీ మూలాలు దొరుకుతున్నాయి.

చరిత్ర పరిశోధకులంతా ఆంధ్రజాతి దృక్పథం నుంచి తమ పరిశోధనను సాగించి, ఆంధ్రజాతి అన్నది ఒకే ప్రాంతంగా మనలేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక, భేదాల గురించి చర్చించి, కొన్ని ప్రాంతాలను పూర్తిగా విస్మరించి, ఆంధ్ర చరిత్రను మొత్తం తెలుగుజాతి చరిత్రగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్ర కళింగలో భాగంగా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు పల్లవ, చోళ, పాండ్య రాజ్యాలకు ఉపరాజ్యాలుగా మనుగడ సాగించాయి. గుంటూరు ప్రత్యేక రాజ్యంగా వర్ధిల్లింది. కర్నూలు, అనంతపురం వేర్వేరు రాజ్యాలుగా ఉన్నాయి. తెలంగాణ అత్యధికకాలం ఈ ప్రాంతాలతో విడివడి ప్రత్యేక రాజ్యంగాగానీ, వేర్వేరు రాజ్యాలలో అంతర్భాగంగాగానీ ఉంది. తెలంగాణ ప్రస్తావనను విస్మరింపజేసేందుకు అనేక చారిత్రక సందర్భాలకు ఆంధ్రను లేక ఆంధ్ర రాజ్య భావనను ఆపాదించారు. తెలంగాణ అస్తిత్వాన్ని సూచించే గుర్తులను, ప్రస్తావనలను వారు ఎంతమాత్రం నమోదు చేయలేదు. ఐత్తరేయ బ్రాహ్మణంలో అంధక లేక ఆంధ్రక ప్రస్తావన ఉంది కాబట్టి అది అతి ప్రాచీనమైనది కాబట్టి, తెలుగు జాతికంతటికీ అదే వర్తిస్తూ చరిత్ర రచన సాగింది. అస్మక మహాజనపదం ప్రస్తావన కూడా చాలా ప్రాచీనమైనది. రామాయణ, మహాభారత కాలాల్లో, రచనల్లో ఈ మహాజనపదం ప్రస్తావన ఉంది. గోదావరి తీరంలో వర్ధిల్లిన అస్మకుల చరిత్రను ఆధునిక చరిత్ర రచయితలు ఎందుకో విస్మరించారు. ఆంధ్ర ప్రస్తావన ముందు నుంచి ఉన్నమాట వాస్తవమే. మహాభారతంలో కూడా ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధం చేసినట్టుగా వ్యాసభారతంలో ఉంది. విచిత్రం ఏమంటే నన్నయ, తిక్కన, ఎర్రాప్రగ్గడ తెలుగులో రాసిన మహాభారతంలో ఆంధ్ర ప్రస్తావన తొలగించి రాశారు. ఆంధ్రులకు కౌరవుల పక్షాన పోరాడారన్న అపప్రథ రాకూడదని అలా చేసి ఉంటారు. కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థతులు వేరు. పాండ్యులు పాండవుల పక్షాన యుద్ధం చేశారు. ఆంధ్రులకు పాండ్యులకు ఆది నుంచి వైరుధ్యం ఉంది. ఘర్షణ ఉంది. ఆ ఘర్షణ కురుక్షేత్ర యుద్ధంలో ప్రతిఫలించవచ్చు. ఆశ్చర్యం ఏమంటే మహాభారతంలో తెలంగాణ ప్రాంత ప్రస్తావన గురించి పరిశోధకులు పరిశీలించకపోవడం. అసలు ఈ ప్రాంతం అప్పట్లో ఏ పేరుతో ఉంది? ఎవరి పక్షాన ఉంది? కచ్చితంగా మహాభారత కాలం నాటికి ఆంధ్ర అంతా ఒక్కటిగా లేదు. మహారాజ్యాలు ఏర్పడలేదు. మౌర్యుల తర్వాతనే రాజ్యాల అవతరణ మొదలైందని చరిత్రకారులు అందరూ చెప్పే వాదన. ఇతిహాసకాలంలో పదహారు మహాజనపదాలు ఉన్నాయని, అందులో అస్సక లేక అస్మక లేక అశ్విక మహాజనపదం ఒకటని మహాభారతంలో ప్రస్తావన ఉంది. వింధ్యా పర్వతాలకు ఈ వల ఉన్న మహాజనపదం ఇదొక్కటే అని కూడా జనపదాల వివరణలో ఉంది. గోదావరి, మంజీరా నదుల మధ్య విస్తరించి ఉన్న ప్రాంతమే ఈ అస్మక మహాజనపదమని, దీనికి పోతలి లేక పౌధన లేక బహుధాన్య లేక బోధన లేక బోధన్ రాజధానిగా ఉందని చారిత్రక చర్చల్లో ప్రస్తావించారు. బౌద్ధ, జైన వాజ్ఞయాల్లోనూ పౌధన లేక పోతలి ప్రస్తావన ఉంది. సుత్తనిపాత(పరమాత్తజోతిక-581) అస్మక, మూలక రాజ్యాలనే ఆంధ్ర ప్రాంతంగా అభివర్ణించింది. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంనాటి ‘అంగుత్తర నికాయ’ అనే బౌద్ధ విచారగ్రంథంలో ప్రస్తావించిన షోడశ మహాజనపదాల్లో అస్మక కూడా ఒకటి.

చరిత్రకు ముందు మహాభారతంలో కొన్ని ప్రస్తావనలను అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. మహాభారతంలో ధర్మరాజు నిర్వహించిన రాజసూయ జైత్రయాత్రలో భాగంగా సహదేవుడు దక్షిణ భారతంలోని రాజ్యాలను జయించిన ప్రస్తావన ఉంది (మ.భా. ప.2- అ.30). అందులో సహదేవుడు ద్రవిడులు, ఉడ్రకేరళలు, కేరళలు, ఆంధ్రులు, తలవానులు(తెలింగులా?), కలింగులను జయించినట్టు ప్రస్తావించారు. తలవానులు తెలంగాణులేనని, గోదావరి నదికి తెలివాహ నదిగా పేరుందని, గోదావరి తీరాన వెలసిన రాజ్యమే తలవానుల రాజ్యమని చరిత్రకారులు సంగనభట్ల నర్సయ్య ఒక సూత్రీకరణ చెప్పారు. భీష్మపర్వం తొమ్మిదో అధ్యాయంలో ధృతరాష్ర్టునికి కురుక్షేత్ర యుద్ధ వర్ణనకు ముందు భారత దేశ భౌగోళిక వర్ణన చేస్తారు సంజయుడు. అందులో దక్షిణాపథాన ఏయే రాజ్యాలు ఉన్నాయో వివరిస్తూ, ద్రవిడులు, కైరళులు, ప్రాచ్యులు, మూషికులు, వనవాసికులు, కరనాటులు, మహిషకులు… తలవానులు, విదర్భులు, కకులు, తంగనులు, పరతంగనులు ఉన్నట్టుగా వర్ణిస్తారు. అదే వరుసలో మరో చోట ‘షండులు, విదర్భులు, రూపవాసికులు, అశ్వకులు, పాంశురాష్ర్టులు, గోపరాష్ర్టుల…’ గురించి ప్రస్తావించారు. ‘దాక్షిణాత్యులైన పులిందులు, ఖసులు, బాహ్లికులు, నిషాదులు, అంధకులు, తంగనులు భోజులతో కలిసి పాండవుల పక్షాన పోరాడుతున్న పాండ్యులతో తలపడుతున్నారు(మహాభారతం, ప.8-అ.20)’ అని వర్ణించారు. ‘తుషారులు, యవనులు, ఖసులు, దర్వభీషరులు, దరదులు, శకులు, కామటులు, రామటులు, తంగనులు, అంధకులు, పులిందులు, భీకర పోరుకు పేరుగాంచిన కిరాతులు, మ్లేచ్ఛులు, పర్వతారోహకులు దుర్యోధనుని పక్షాన పోరాడుతున్నారు(మహాభారతం, ప.8-అ.73)’ అని కూడా వివరించారు. తలవానులు, మూషికులు, అశ్వకులు, తంగనులు ఎవరు? ఎక్కడివారు? అన్న చర్చ చరిత్ర పరిశోధనలో జరుగులేదు. మహాభారతానికి ముందు నుంచి ఉన్న జనపదాలన్నీ యుద్ధంలో పాల్గొన్నట్టు సంజయుని వర్ణనలో ఉంది. అశ్వక లేక అస్మక లేక అస్సక జనపదం చరిత్ర తెలంగాణ చరిత్రలో భాగం కాదా? సంజయుడు ప్రస్తావించిన అశ్వకులు మన అశ్వకులు కాదా? ఈ ప్రశ్నలపై ఇంకా విస్తృతంగా శోధన, చర్చ జరగాల్సి ఉంది. మత్స్యపురాణంలో అస్మక రాజ్య వివరణ ఉంది. బ్రహ్మదత్తునితో సహా 22 మంది రాజులు అస్మక రాజ్యాన్ని పాలించినట్టు మత్స్యపురాణం పేర్కొంది.

లింగ శబ్దం మూలాలు పురాణేతిహాసాల కాలం నుంచి ఉన్నాయి. దాక్షిణాత్యులు దస్యులు, రాక్షసులు, మ్లేచ్ఛులు, కిరాతులు, ఆర్య సంస్కృతినుంచి బహిష్కరించబడినవారు. వీరిలో శైవారాధన ఎక్కువ. శివాలయాలు అధికం. త్రిలింగ భావన చాలా కాలంగా ఉండి ఉండాలి. అనేక లింగాలు ఉండగా త్రిలింగాలే ఎందుకు అని కొందరు ప్రశ్నించవచ్చు. కానీ ప్రతి ప్రాంతానికి ఒక విస్తృతి, ఒక పరిమితి ఉన్నాయి. అలా త్రిలింగ భావన ఏర్పడి ఉండవచ్చు. కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామంల మధ్య భాగాన్ని త్రిలింగ దేశమని స్కందపురాణం పేర్కొంది.

శ్రీశైల భీమ కాళేశ మహేంద్రగిరి సంయుతం
ప్రాకారాతు మహత్ కృత్యా త్రీణిద్వారా మపాకరోత్… త్రిలింగ

అని స్కందపురాణం వర్ణించింది. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దకాలానికే సంబంధించిన స్కందపురాణం మహాపురాణంగా ప్రసిద్ధిగాంచింది. ఆ తర్వాత కాలంలో

అథపార్శే త్రిలింగాస్య మగధాస్య వృకైస్సహ!
మధ్యదేశా జనపదాః ప్రాయోశోమి ప్రకీర్తితాః!!(వాయుపురాణం-శ్లో 111)

అని వాయుపురాణం వర్ణించింది. వాయుపురాణం క్రీస్తుశకం ఐదో శతాబ్దకాలంలో రాసినట్టు చరిత్రకారుల అంచనా.
గోదావరి, కృష్ణా నదుల మధ్య ఆవరించి ఉన్న ప్రాంతం త్రిలింగభూమిగా చాలాకాలం పరిగణనలో ఉంది. ఈ ప్రాంతమంతా ఒకే రాజ్యఛాయలో ఉన్నట్టు మనకు ఆధారాలున్నాయి. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు అందరూ ప్రధానంగా ఈ ప్రాంతాన్నే ఏలారు. అయితే ఆంధ్ర చరిత్ర పరిశోధకులు ఈ వర్ణణను అంగీకరించలేదు. తెలుగునేలకు ఇవి సరిహద్దులు కాజాలవని వాదించారు. ఆంధ్ర శబ్దంపై మమకారం, త్రిలింగ శబ్దాన్ని అంగీకరించలేకపోవడం ఇందుకు కారణం తప్ప మరో కారణమేదీ కనిపించదు. తెలుగునేలంతా ఎక్కువకాలం ఒక్కటిగా లేదని చెప్పిన చరిత్రకారులే ఆంధ్ర, త్రిలింగ భావనలను అంగీకరించడానికి నిరాకరిస్తూ వచ్చారు. విన్నకోట పెద్దన

‘ధర శ్రీపర్వత కాళేశ్వర దాక్షారామ సంజ్ఞవరలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం బరుదార త్రిలింగదేశమనజనుకృతులన్’ రాశారు.

కాశ్మీరు రాజుల చరిత్ర ‘రాజతరంగిణి’లో కల్హణుడు దక్షిణభారతంలో బ్రాహ్మణుల వర్గీకరణ గురించి వివరిస్తూ

కర్ణాటకాశ్చ తైలంగా మహరాష్ట్రకాః
గుర్జరాశ్చతీ పంచౌ ద్రవిడ వింధ్యా దక్షిణే!!
సారస్వతాః కాన్యాకుబ్జ గౌడ ఉత్కళ మైథిలాః
పాంచగౌడ ఇతి ఖ్యాతా వింధ్యాస్తోత్తరవాసీ!! (రాజతరంగిణి, సంపుటి 4, పే-468)

అని రాసినట్టు చెబుతున్నారు. కర్ణాటులు, తైలంగులు, ద్రవిడులు, మహారాష్ట్రకులు, గుర్జరులు-ఈ ఐదు వింధ్యాచలానికి దక్షిణదిక్కున ఉన్న బ్రాహ్మణులుగా, వీరిని పాంచ ద్రవిడులుగా కల్హణుడు అభివర్ణించారు. పన్నెండో శతాబ్దకాలంలో ఆయన ఈ రచన చేసినట్టు చరిత్రకారులు అంచనా వేశారు.
విదేశీ యాత్రికుడు మెగస్తనీస్ నమోదు చేసిన వివరాలను తరువాతి తరం రచయితలు వివరించే ప్రయత్నంచేశారు. మెగస్తనీస్ ప్రస్తావించిన మొదగలింగ, త్రికలింగ వ్యుత్పత్తి త్రిలింగమేనని క్రీస్తుశకం 79లో మరణించిన ప్లీనీ వివరించారు. త్రిలింగ ప్రస్తావన తెలుగు రాజ్యానికి సంబంధించిన ప్రస్తావనే అని సుధాకర్ చటోపాధ్యాయ వివరించారు. క్రీస్తుశకం ఒకటవ శతాబ్దంలో భారత దేశంలో పర్యటించిన టోలెమీ క్లాడియస్, టోకోసాన్ ప్రాంత రాజధాని త్రిలింగాన్ అని యాత్రాగ్రంథంలో పేర్కొన్నారు. ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు కన్నింగ్ (యాన్సియెంట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా పే 518-9) టోలెమీ ప్రస్తావించిన త్రిలింగ శబ్దం తెలంగాణను ఉద్దేశించినదేనని చెప్పారు. ధనకటక, ఓరుగల్లు, రాజమహేంద్రిల మధ్య ప్రాంతం తెలింగాణగా భావించి ఉంటారని ఆయన రాశారు. కాల్డ్ (ద్రవిడ్ గ్రామర్ పే.32లో) త్రిలింగ శబ్దం గోదావరి తీర తెలంగాణ ఒకటేనని రాశారు. శాతవాహనులు తమ శాసనాల్లో ఎక్కడా తాము ఆంధ్రులమని పేర్కొనలేదు. నానాఘాట్ శాసనం మొదటి శాతకర్ణిని దక్షిణాపథ చక్రవర్తిగా పేర్కొంది. ఈ దక్షిణాపథమే తర్వాత దక్కనుగా మారింది. శాతవాహనులు మౌర్యుల సేనాపతులుగా ఇక్కడికి వచ్చారు. మౌర్యుల దండయాత్ర వింధ్యాచలం మీదుగా నర్మదను దాటుకుని విదర్భ మీదికి వచ్చినట్టు దండయాత్రామార్గాల పరిశోధన పత్రాల్లో పేర్కొన్నారు. వారు ముందుగా దక్కనుకు వచ్చి అక్కడి నుంచి రాజ్యం విస్తరించారని, ప్రతిష్ఠానపురం, ఇప్పటి పైఠాను వారి తొలి రాజధాని అని, పిమ్మట కోటిలింగాల, తుదకు అమరావతికి తమ రాజధాని మార్చుకుని ఉంటారని మరాఠా చరిత్రకారులు వాదిస్తున్నారు. శాతవాహనుల ఆఖరి గమ్యం అమరావతి. తొలి గమ్యం కాదు. వైభవోపేత కాలమూ కాదు. అమరావతి అంత్యకాల రాజధాని కావచ్చు. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుగా వేనోళ్ల కీర్తినొందిన శాతవాహన కృష్ణుడు త్రిలింగదేశాధీశ్వరుడుగా కీర్తినొందినట్టు చరిత్ర పరిశోధకులు పేర్కొంటున్నారు. కృష్ణా నది సముద్రంలో కలిసే చోట ఆంధ్రభృత్యులు రాజ్యం చేశారని కూడా చరిత్రకారులు గుర్తించారు. డాక్టర్ రామారావు శాతవాహనుల నాణేలు ముఖ్యంగా మొదటి శాతకర్ణి నాణేలు తెలంగాణలోని కొండాపురం, పెదబంకూరు, ఆంధ్రలోని గుంటూరులలో లభించాయి కాబట్టి శాతవాహనులు ఆంధ్రులే అని తన పరిశోధన పత్రంలో వాదించారు. శాతవాహన రాజు హాలుడు రచించిన ప్రాకృత రచన లీలావతి సప్తగోదావరి భీమం లేక ద్రాక్షారామం గురించి ప్రస్తావించింది కాబట్టి శాతవాహనులు ఆంధ్రులే అని కూడా మరో వాదన చేశారు. సప్తగోదావరి కేవలం గోదావరి జిల్లాల్లోనే కాదు, శ్రీరాంసాగర్ దిగువన కడెం నది కలిసే లోపు గోదావరి నది కనీసం నాలుగైదు చోట్ల నాలుగు నుంచి ఏడుపాయలుగా చీలిపోయి ప్రవహిస్తుంది. కరీంనగర్-ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులో కోటిలింగాలకు ఎగువన సప్తగోదావరిని చూడవచ్చు.

రాజుమారినప్పుడల్లా మతం మారడం చరిత్రలో ప్రతిసందర్భంలో చూశాము. యుద్ధాలవల్ల కావచ్చు, మత ప్రచారం కోసమే కావచ్చు జైనులు, బౌద్ధులు వింధ్యా పర్వతాలను దాటుకుని దక్షిణాపథానికి వచ్చారు. ఈ రెండు మతాలు ఉత్తరాది మతాలు. ఈ మత శాఖల రాక, వారిని అనుసరించే రాజవంశాల రాక ఏకకాలంలో జరిగాయి. శాతవాహనులు మౌర్యుల సేనాపతులుగా దక్షిణభారతానికి వచ్చారని, మౌర్యసామ్రాజ్యం బలహీనపడిన వెంటనే స్వతంత్రం రాజ్యం ఏర్పాటు చేసుకున్నారని ఒక వాదన ఉంది. వారు తొలుత బౌద్ధాన్ని వ్యాప్తి చేశారు. బౌద్ధ, జైన మతాలు దక్షిణ భారతంలో అనేక మౌలిక మార్పులను తీసుకువచ్చాయి. శాతవాహనులు తొలిసారిగా ఒక మహాసామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆ కారణంగా త్రిలింగ భావన కొంత బలహీనపడి ఉండవచ్చు. తెరమరుగైపోవచ్చు. కానీ త్రిలింగ భావనే తెలుగు ప్రజలకు మూల బీజం అన్నది మాత్రం నిర్వివాదాంశం. ఐదో శతాబ్దానికి చెందిన తమిళ వ్యాకరణ గ్రంథంలో కొంగణం, కన్నడం, కొల్లం, తెలుంగం అని ప్రస్తావించారు. త్రిలింగ శబ్దం నుంచే తెలింగ, తెలుంగు, తెలుగు ఆవిర్భవించాయని చెప్పడానికి ఆంధ్రచరిత్రకారులు అంగీకరించలేదు. పదకొండో శతాబ్దంలో నన్నయ ప్రస్తావించిన తెనుగు పదమే తెలుగు భాషకు సంబంధించిన మొదటి ప్రస్తావనగా ఆంధ్ర చరిత్రకారులు మొత్తం తెలుగుజాతిని నమ్మింపజూశారు. రాజకీయాధిపత్యాన్ని, ప్రాదేశిక ఏకతను ఒక్కటిగా చూపడానికి తెలుగుకు సంబంధించిన మూలాలను గుర్తించ నిరాకరించారు. ఇలా చర్చిస్తూ పోతే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. ఇలా మూలాలకోసం వెతుకులాడే తపనలోంచే ‘నమస్తే తెలంగాణ’లో చరిత్ర శోధన వార్తలను, వ్యాసాలను ఒక పరంపరగా ప్రచురించాము.

తెలంగాణకు సంబంధించి పురాచరిత్రకు తగిన ఆధారాలు లేవు. మధ్య యుగాల చరిత్రకు సంబంధించి కూడా ఎక్కువగా ఆధారాలు లభించలేదు. విషాదం ఏమంటే దక్కను పీఠభూమి ఉత్తర దక్షిణ భారత దండయాత్రలకు మధ్యన రంగభూమిగా మారడం. ఉత్తరాది రాజులు వింధ్య పర్వతాలు దాటిన తర్వాత మొదట విరుచుకుపడింది దక్కనుపైనే. దక్కను ధ్వంసం తర్వాతనే వారు ఇటు తూర్పునకు అటు మరింత దక్షిణానికి తమ దండయాత్రలు సాగించారు. సుల్తానులు, మొఘలులకు కూడా యుద్ధభూమి దక్కను పీఠభూమే. క్రీస్తు శకం 1300 తర్వాత దక్కను అంతా రక్తసిక్తమే. మొదట దేవగిరిలో యాదవ సామ్రాజ్యాన్ని నాశనం చేసి, తర్వాత ఓరుగల్లుపైకి వచ్చారు. రెండు చోట్ల అసాధారణ విధ్వంసం సాగించారు. సకల సంపదలను కొల్లగొట్టడమే కాదు, చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేశారు. కొంతకాలం దక్కనులోనే వారు తిష్టవేసి బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. యాదవ, కాకతీయ రాజులతో యుద్ధం తర్వాత, దక్షిణాదిలో మనుగడ సాగించాలంటే హిందువులతో కలసి ఉండాలన్న సోయి వారికి వచ్చింది. తమ ఆస్థానాలలో హిందువులను పెట్టుకుని దక్షిణాదిలో ఇంకా మిగిలి ఉన్న హిందూ రాజ్యాలను ఖతం పట్టించే పన్నాగాలకు దిగారు. దక్షిణాది రాజ్యాలపైకి దాడులకు వెళ్లే కొద్దీ ముస్లిం రాజులలో మతసహిష్ణుత అనివార్యమైంది. అందుకే కర్ణాటక, తమిళనాడు, కేరళలల్లో చారిత్రక, ఐతిహాసిక, ఆధ్యాత్మిక ఆనవాళ్లపై విధ్వంసం ఎక్కువగా జరుగలేదు. క్రీస్తుశకం 1324లో ప్రతాపరుద్రుని కరీటం పడిపోయిన తర్వాత నుంచి 1948 వరకు ముస్లిం రాజుల చరిత్రే తెలంగాణ చరిత్ర.

క్రీస్తుశకం 1331 నుంచి 1475 దాకా మలి కాకతీయులు, పద్మనాయకులు రాజ్యం చేసినప్పటికీ వారి చరిత్ర కూడా ఎక్కడా నమోదు కాలేదు. చివరకు మలి కాకతీయ రాజుల మధ్య తంపులు పెట్టి బహమనీలు తెలంగాణ నేలను మరోసారి రక్తసిక్తం చేశారు. రాజుకొండ, దేవరకొండ, ఓరుగల్లులను నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు. తెలంగాణలో ఇంకా అక్కడక్కడా మిగిలిఉన్న చిన్నచిన్న రాజ్యాలు, సంస్థానాలు, జాగిర్దారీలు ముస్లిం రాజుల తాకిడికి బదాబదలై పోయాయి. ఆరు వందల సంవత్సరాలపాటు తెలంగాణలో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి పెద్దగా చారిత్రక ఆధారాలు లేవు. కుల చరిత్రలు, వంశచరిత్రలు, కొన్ని శాసనాలు, కొన్ని గ్రంథాలు తప్ప ఏవీ మిగలలేదు. త్రిలింగదేశాధీశ్వరులుగా సకల కీర్తులందుకున్న కాకతీయుల వైభవానికి సంబంధించి అరకొర పరిశోధనలే. పివి పరబ్రహ్మశాస్త్రి గారు నిజానికి ఎంతో శ్రమించి కాకతీయుల చరిత్ర రాశారు. అప్పుడున్న పరిస్థితుల్లో, ఆయనకున్న పరిమిత వనరుల్లో ఆయన చేసిన కృషి అమూల్యమైనది. కానీ చేయవలసింది ఇంకా చాలా ఉంది. శోధించవలసింది ఎంతో మిగిలిపోయింది. అందుకోసం పుస్తకాల సేకరణ, ఆధారాల సేకరణ, పురావస్తుశాలల శోధన అనేకం చేయాల్సి ఉంది. హైదరాబాద్, కోల్ ఢిల్లీ, తంజావూరు, రాజమహేంద్రవరం వంటి చోట్ల గ్రంథాలయాల్లో, పురావస్తుశాలలల్లో దాచిఉంచిన గ్రంథాలు, పత్రాలు, శాసనాలను శోధించడంతోపాటు విదేశాల్లోని ప్రముఖ గ్రంథాలయాల్లో, పురావస్తుశాలల్లో అన్వేషణ జరగాలి. ఆ అన్వేషణలో ఒక చిరు ప్రయత్నం నగేశ్ బీరెడ్డి చేశారు.

ఈ నేల వేలయేళ్ల చరిత్రను తెలుసుకోవాలన్న ఆశ ఆయనను చాలా దూరం నడిపించింది. మనం ఎవరు? ఎక్కడి నుంచి ఇక్కడిదాకా వచ్చాం? ఏయే మలుపులు, ఏయే దారులు, ఏయే ఉత్పాతాలు, ఏయే యుద్ధాలు దాటుకుని ఇక్కడికి చేరాము. ఇక్కడే కదా వేల యోధుల కరవాలాలు కదను తొక్కింది. ఇక్కడే కదా వేలాదమంది అశ్వికులు విదేశీ సేనలను ఎదురొడ్డి పోరాడింది. ఇక్కడే కదా శిల్ప, కళా, సాహితీ సౌరభాలు నలుదిక్కుల విరాజిల్లంది. ఇక్కడే కదా సుల్తానులు, బహమనీలు, మొఘలాయిలు స్థానికుల రక్తంతో స్నానమాచరించింది. ఇక్కడే కదా నేలకొరిగిన వీరయోధుల తలలు కోటగుమ్మాలకు వేలాడింది. ఇక్కడే కదా వీరగల్లుల ఊరేగింపులు జరిగింది. ఆ దారులను చూడడానికి, ఆ ఆనవాళ్లను వెదకడానికి, చరిత్ర కోనల్లోకి వెళ్లాలి. అక్కడ ప్రవహించే ఆ నులివెచ్చని జీవనధారలను శోధించి పట్టుకోవాలి. శోధన ఒక తీరని దాహం. ఆ దాహం తీర్చుకునే ప్రయత్నంలో నగేశ్ విజయం సాధించారు. కాకతీయుల చరిత్రపై ఒక కొత్త చూపు ప్రసరింపజేశారు. మరిన్ని వివరాలు, ఆధారాలతో, కొత్తగా, హృద్యంగా, కమనీయంగా వివరించారు. కాకతీయుల కథ పాతదే కావచ్చు, కానీ ముక్కలుముక్కలుగా లభించిన కథలను పేర్చికూర్చి వర్ణించిన తీరు, పాత్రలను నడిపించిన తీరు ఆయన రచనా మాధుర్యాన్ని మనకు పట్టిఇస్తుంది.

Stupidity of Congress

Congress leaders not stopped in exhibiting their stupidity. They are hiding their inability in convincing the people to vote, instead blaming the people and Evms.

What kind of politicians are they? They won in three states with same Evms? But here they insult people verdict. These kind of vile accusations showing their low level of political stature and understanding.

One Congress candidate in Warangal district openly accused people for electing her. Congress done all possible crooked operations to defeat TRS. Their prompted 40 candidates who have similar names to file nominations and opting for truck symbol.

They dumped money bags like never before. In some constituencies they purchased 8 votes per lakh. Most of the places they offered 1000 rupees per vote. But people not budged at their offers.