తెలంగాణే గెలువాలె

IMG_2293

తెలంగాణ కిందపడితే నవ్వాలనుకుని నవ్వలేకపోయినవారు, ఓడిపోతే సంబరాలు చేసుకోవాలని చేసుకోలేకపోయినవారు, అల్లకల్లోలమైతే ఆనందతాండవం చేయాలని కలలుగని ఆశోపహతులైనవారు ఇప్పుడు మరోసారి తమ జుట్లు విదిలించుకుని తెలంగాణపై ఎగబడతున్నారు. ఏదో తెలియని దుఃఖం వారిని వెంటాడుతున్నది. కేసీఆర్ను ఎలాగైనా కదిలించాలని, చలించేలా చేయాలని ఊగిపోతున్నారు. చేతికి దొరికిన గడ్డీగాదం, బురదాబూచీ అన్ని ఆయనపై విసురుతున్నారు. విచిత్రం ఏమంటే శాస్త్రం చెప్పిన బల్లులు కుడితిలో పడినట్టు జీవితాంతం తెలంగాణ మంత్రం చదివినవాళ్లు సైతం ఇప్పుడు కేసీఆర్ను, తద్వారా ఆయన నిలబెట్టిన తెలంగాణవాదాన్ని ఓడించాలని రాగాలు తీయడం.

తెలంగాణ వాళ్లకు పరిపాలించడం చేతకాదు. కుమ్ములాడుకుంటారు. రాజకీ య అస్థిరత్వం వస్తుంది. చిన్న రాష్ట్రం కుదురుగా నిలబడలేదు. తెలంగా ణ వస్తే మావోయిస్టుల రాజ్యం వస్తుంది. తెలంగాణ వస్తే కరెంటుండదు. అంధకారం అయిపోతుంది .. అని తిట్టిపోసినవాళ్లు తెలంగాణకు ఇప్పుడు కొత్త సర్టిఫికెట్లు ఇస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు నియంతృత్వం నడుస్తున్నది. ప్రభుత్వం ఒక్క మాట గా సాగుతున్నది. తెలంగాణ కోసం పనిచేసినవారికి గుర్తింపు లేదు. తెలంగాణ వస్తే ఏదో బ్రహ్మాండం జరిగిపోతుందన్నారుగా ఏదీ ఎక్కడ? మావోయిస్టులపై దారుణంగా వ్యవహరిస్తున్నది. అవినీతి కట్టలు తెంచుకుంటున్నది…. ఇలా ఎవరికి తోసిన తిట్టు వారు తిట్టిపోస్తున్నారు. నరంలేని నాలుకలు కదా ఎటైనా తిప్పేయవచ్చు. తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు ఈ శనిపక్షులు పెట్టిన శాపనార్థాలు ఒక్కటి కూడా వాస్త వం కాదని కేసీఆర్ రుజువు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అదే శనిపక్షులు వేస్తు న్న నిందలు కూడా నిజం కాదని వరంగల్ లోక్సభ స్థానానికి పసునూరి దయాకర్ ను ఎంపిక చేయడం ద్వారా మరోసారి రుజువు చేశారు కేసీఆర్. బలమైన ప్రభుత్వం కోసం, దీర్ఘకాలిక రాజకీయ భవిష్యత్తు కోసం కొందరు బయటి పార్టీల నాయకులను తీసుకువచ్చినా, కేసీఆర్ తెలంగాణ కోసం అంకితభావంతో పనిచేసిన వారెవరినీ నిర్ల క్ష్యం చేయడం లేదని దయాకర్ ఎంపిక స్పష్టం చేసింది. నిజానికి గుడిమళ్ల రవికుమార్ కూడా తెలంగాణ ఉద్యమంలో కష్టపడినవారే. పార్టీ నాయకత్వం ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా సీరియస్గానే పరిశీలించింది. కానీ కొన్ని వివాదాలను నివారించడంకోసం తుదకు దయాకర్ను ఎంపిక చేశారు. దయాకర్ మొదటి నుంచి మొక్కవోని తెలంగాణవాదిగా నిలబడినవారు. ఫైన్ ఆర్ట్స్ చదివిన దయాకర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడంలో క్రియాశీల పాత్రపోషించారు. మాదిగ ఆత్మగౌరవం కోసం సాగిన ఉద్యమాలలో కూడా చురుకుగా పాల్గొన్న నాయకుడు. ఆయన ఎప్పుడూ గోడమీది పిల్లిలా కూర్చుని ఏ పడవలో దూకుదామా అని ప్రయత్నాలు చేయలేదు. అవసరాలు, అవకాశాల ప్రాతిపదికగా జెండాలను, ఎజెండాలను మార్చలేదు. అటువంటి అభ్యర్థిని ఎంపిక చేయడం పట్ల ఇవ్వాళ తెలంగాణవాదుల్లో హర్షధ్వానాలు వ్యక్తం అవుతున్నాయి. కల్మషం, కళంకం లేని అచ్చ తెలంగాణవాదిని అభ్యర్థిగా పెట్టి గెలిపించాలని పిలుపునిస్తున్నారు కేసీఆర్. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడానికి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. అయితే తెలంగాణ కిందపడితే నవ్వాలనుకుని నవ్వలేకపోయినవారు, ఓడిపోతే సంబరాలు చేసుకోవాలని చేసుకోలేకపోయినవారు, అల్లకల్లోలమైతే ఆనందతాండవం చేయాలని కలలుగని ఆశోపహతులైనవారు ఇప్పుడు మరోసారి తమ జుట్లు విదిలించుకుని తెలంగాణపై ఎగబడతున్నారు. ఏదో తెలియని దుఃఖం వారిని వెంటాడుతున్నది. కేసీఆర్ను ఎలాగైనా కదిలించాలని, చలించేలా చేయాలని ఊగిపోతున్నారు. చేతికి దొరికిన గడ్డీగాదం, బురదాబూచీ అన్ని ఆయనపై విసురుతున్నారు. విచిత్రం ఏమంటే శాస్త్రం చెప్పిన బల్లులు కుడితిలో పడినట్టు జీవితాంతం తెలంగాణ మంత్రం చదివినవాళ్లు సైతం ఇప్పుడు కేసీఆర్ను, తద్వారా ఆయన నిలబెట్టిన తెలంగాణవాదాన్ని ఓడించాలని రాగాలు తీయడం.

తెలంగాణ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపిన పార్టీని, నాయకుడిని బద్నాం చేయాలని చూడటం. తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులకూ ఇప్పటికీ ఏమీ తేడా కనిపించడం లేదు. ఆ రోజుల్లో కూడా ఆంధ్ర ఆధిపత్యశక్తులు అస్తమానం కేసీఆర్పైనే దాడి చేస్తూ వచ్చాయి. పొద్దున లేస్తే ఏవో కారుకూతలు ప్రచారం చేస్తూ వచ్చాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని కొట్టాలంటే కేసీఆర్ను కొట్టాలి. కేసీఆర్ను బలహీనపరిస్తే తెలంగాణను బలహీన పరిచినట్టే. అందుకే అప్పుడు ఆయనపై దాడి చేసేవారు. ఇప్పుడు కూడా అదే వ్యూహం. కేసీఆర్ను బద్నాం చేయాలి. బలహీనపర్చాలి. పలుచన చేయాలి. లొంగదీసుకోవాలి. అప్పుడు ఉద్యమాన్ని దెబ్బకొట్టాలన్నది లక్ష్యం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలన్నది, అస్థిరత్వంపాలు చేయాలన్నది తాపత్రయం. అప్పుడయినా ఇప్పుడయినా తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని జీర్ణించుకోలేని శక్తులే ఎడబొబ్బలు, పెడబొబ్బలు పెడుతున్నాయి.

నిజమే తెలంగాణ మళ్లీ ఒక పరీక్షను ఎదుర్కొంటున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కె.చంద్రశేఖర్రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పదిహేడు మాసాలు పూర్తయ్యాయి. రాష్ట్రం ఏర్పడటంపైన, ప్రభుత్వం పనితీరుపైన సమీక్షలు, విశ్లేషణలు చేసుకోవలసిన తరుణంలో వరంగల్ లోక్సభ ఎన్నిక వచ్చింది. తెలంగాణ ఇప్పుడు ఏమి చేయాలి? ఏమి చూసి ఓట్లేయాలి? తెలంగాణ వచ్చి మాకేమిచ్చింది? ఈ ప్రశ్నలకు ఆంధ్ర ఆధిపత్య భావజాలంలో కలుషితమైన మేధావులకంటే పల్లెజనం బాగా సమాధానం చెప్పగలుగుతున్నారు. మొన్న నల్లగొండ నుంచి ఒక పెద్ద రైతు ఫోను చేశారు. ఆయన సాగర్ ఆయకట్టుకు నీరివ్వాలని ప్రతిఏటా ఉద్యమాలు చేసేవారు. ఆయన ఫోను చేసి బాబూ. కేసీఆర్గారికి ధన్యవాదాలు చెప్పండి. మేము తెలంగాణను చూస్తున్నం. అనుభవిస్తున్నం. ఇంత కరువుకాలంలో, డెడ్స్టోరేజీ నుంచి నీళ్లు తెచ్చి మా పొలాలకు అందిస్తున్నరంటే అది తెలంగాణ వల్లనే సాధ్యమైంది. తెలంగాణ జిద్దు ఉండేవాళ్లు గవర్నమెంటులో ఉన్నరు కాబట్టే సాధ్యమైంది. నాకు ఈసారి ఆశలు లేకుండె నీళ్లొస్తయని. చాలా సంతోషంగా ఉంది అని ఆయన చెప్పుకుపోయారు. ఇటీవల ఒక సాహితీ సభకు వెళ్లాను. అక్కడ ఒక కవి చెప్పాడు- తెలంగాణ వచ్చి మాకేమిచ్చింది అని కొందరు ప్రశ్నిస్తున్నరు. మాకేమొచ్చిందని కొందరు మాట్లాడుతున్నరు. ఎవరికి ఏదైనా వచ్చిందో లేదో, కనిపిస్తున్నదో లేదో కానీ నాకు మాత్రం నా తెలంగాణ అనుభవం అడుగడుగునా కనిపిస్తున్నది. ఇవ్వాళ సెక్రటేరియట్కు పోతే అన్నా అని పిలిస్తే పలికే మంత్రులు ఉన్నారు. ఉద్యోగ నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కావాలని ఇలా అడిగితే అలా చేసి పెట్టిండ్రు. మా ఊరికి వాటర్ షెడ్ కావాలని అడిగిన. మా వాగుకు అడ్డుకట్ట వేసి ఊరికి నీరు మళ్లించుకోవాలన్నది నా కల. ఆరు వారాల్లో మంజూరు చేసిండ్రు. ఇవ్వాళ తెలంగాణలో ఎక్కడ చూసినా మన సంస్కృతీ సంప్రదాయాల ఆటపాట వినిపిస్తున్నది. ఇంతకంటే ఏమి కావాలె అని ఆయన వివరించారు. అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలు పూర్తి కాకుండానే ఒక్క గంట కరెంటు కోత లేకుండా చేసిన ప్రభుత్వం తెలంగాణ చరిత్రలో మరొకటి ఏదైనా ఉందా? అని వరంగల్ జిల్లాలో రైతు దామోదర్రెడ్డి ప్రశ్నించాడు. ఖర్మగాలి ఈసారి కాలం కాలేదు. నీళ్లు లేవు. రైతులు ఆగమయిండ్రు. కరెంటు ఉన్నా ఏమీ చేసుకోలేని పరిస్థితి అని ఆయన చెప్పాడు. ఎప్పుడూ చూడలేదు… జూరాల కింద చెరువులన్నీ నింపారు. మాధవరెడ్డి ప్రాజెక్టు కింద చెరువులు నింపారు. ఇప్పుడు సాగర్ కాలువల ద్వారా చెరువులకు, పొట్టకొచ్చిన పొలాలకు నీరు తరలించారు. తెలంగాణ వల్ల ఏమి ఒరిగిందో నిజాయితీ లేని మేధావులకంటే కష్టజీవులైన ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణకు ఇప్పుడు సమస్యలే లేవని కాదు. రైతు ఆత్మహత్యలు ఇప్పుడే పుట్టుకొచ్చినవి కాదు, ఇప్పుడిప్పుడే ఆగిపోతాయనీ చెప్పలేం. వ్యవసాయాన్ని దండగగా మార్చిన ఆధిపత్య శక్తుల నుంచి వారసత్వంగా ఈ సంక్షోభం కొనసాగుతున్నది. దీనిని అధిగమించడానికి సమయం పడుతుంది. ఆరు దశాబ్దాలపాటు తెలంగాణను ఎండబెట్టిన పాపం వెంటాడుతున్నది. తెలంగాణ రైతులు ఇప్పుడు ఈ సంక్షోభంలో కొనసాగుతున్నారు. ఈ సంక్షోభాన్ని మనకు అప్పుగా ఇచ్చిపోయినవారి తరఫున వకాల్తా పుచ్చుకుని ఇక్కడి మేధావులు, ఇక్కడి మెతుకుతిని బతుకుతున్న మీడియా మాట్లాడటం ఇంకా ఆశ్చర్యకరం. ఆరు దశాబ్దాలపాటు విఫలమైనవారిని వదిలేసి పదిహేడుమాసాల పసికందుపై కత్తులు దూయడం. తెలంగాణ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపిన పార్టీని, నాయకుడిని బద్నాం చేయాలని చూడటం. తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులకూ ఇప్పటికీ ఏమీ తేడా కనిపించడం లేదు. ఆ రోజుల్లో కూడా ఆంధ్ర ఆధిపత్యశక్తులు అస్తమానం కేసీఆర్పైనే దాడి చేస్తూ వచ్చాయి. పొద్దున లేస్తే ఏవో కారుకూతలు ప్రచారం చేస్తూ వచ్చాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని కొట్టాలంటే కేసీఆర్ను కొట్టాలి. కేసీఆర్ను బలహీనపరిస్తే తెలంగాణను బలహీన పరిచినట్టే. అందుకే అప్పుడు ఆయనపై దాడి చేసేవారు. ఇప్పుడు కూడా అదే వ్యూహం. కేసీఆర్ను బద్నాం చేయాలి. బలహీనపర్చాలి. పలుచన చేయాలి. లొంగదీసుకోవాలి. అప్పుడు ఉద్యమాన్ని దెబ్బకొట్టాలన్నది లక్ష్యం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలన్నది, అస్థిరత్వంపాలు చేయాలన్నది తాపత్రయం. అప్పుడయినా ఇప్పుడయినా తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని జీర్ణించుకోలేని శక్తులే ఎడబొబ్బలు, పెడబొబ్బలు పెడుతున్నాయి.

మీతో రోజుకోసారి మాట్లాడి, మీతో కలిసి భోంచేసి, మీతో చర్చలు జరిపి, ప్రజలకు ఏమీ చేయకపోయినా పర్వాలేదా? కేసీఆర్ చేయనిది, చంద్రబాబు చేస్తున్నది అదేనా? చంద్రబాబును ఆకాశానికెత్తుతూ కేసీఆర్ను దుమ్మెత్తిపోస్తూ పత్రిక నింపడానికి కారణం ఇదేనా? పచ్చని పంటపొలాలను తగులబెట్టిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఓడిపోవాలని రాసే ధైర్యం మీకుందా? అని ఆ మిత్రుడు ప్రశ్నించాడు. ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ ఆధిపత్యం అన్నదే శాసిస్తున్నది. కానీ ప్రజలకు తెలుసు. ఎవరు తన, ఎవరు మన అన్న విచక్షణ మేధావులకు, ఆధిపత్యశక్తులకు అర్థంకాకపోవచ్చు. కానీ తెలంగాణ ఫలాలను ఆస్వాదిస్తున్న సమాజానికి వీరిని ఏమి చేయాలో, ఎక్కడ వాత పెట్టాలో బాగా తెలుసు.

మొన్నామధ్య ఒక తెలంగాణ వ్యాసాల పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యాను. ఆ పుస్తకాన్ని ప్రచురించినాయన అతిథులందరినీ వేదికపైకి పిలిచి, ప్రారంభోపన్యాసం చేశారు. ఆయన మూడు వ్యాఖ్యలు చేశారు. మొదటిది, ప్రజలతో సంబంధం లేని రాజకీయ వికృతి పర్యవసానమట రాష్ట్ర విభజన. రెండవది, రెండు రాష్ర్టాల్లోనూ నిశ్శబ్దం రాజ్యం చేస్తున్నదట. మూడవది, ఆ పుస్తకం పరాజితుల చరిత్ర అట. ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రచురణ కర్త. ఎంత అజీర్తి ఆయనలో ఉందో ఈ మూడు మాటలతో తేలిపోయింది. ఇటువంటి అభిప్రాయం ఆంధ్ర మేధావులకే కాదు, చాలా మంది ఇక్కడి మేధావులకు కూడా ఉంది. ఈ వ్యాఖ్యలు విన్న నాకు ఆశ్చర్యం వేసింది. మూడు అభిప్రాయాలూ అబద్ధాలే. తెలంగాణ ఉద్యమం రాజకీయ ప్రకృతి, ప్రజల అభీష్టం కలిసి సాగిన ఉద్యమం. ప్రజాస్వామ్యబద్ధంగా సాగిన ఉద్యమం. వికృతి ఏదైనా ఉందంటే తెలంగాణను అడ్డుకోవడానికి సాగిన ఉద్యమం. ఇక పుస్తక రచయిత తెలంగాణవాది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నవారిలో ఒకరు. ఆయన రాసింది విజేతల చరిత్రే కాని పరాజితుల చరిత్ర కాదు. అది పరాజితుల చరిత్ర అంటే రచయితను అవమానించడం. చివరగా నిశ్శబ్దం గురించి…. ఎక్కడ నిశ్శబ్దం ఉంది? ఎవరు ఏడుస్తున్నారు? ఎందుకింత దుఃఖం కలుగుతున్నది వీరికి? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ర్టాలలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ఆంధ్రలో 11 జాతీయ సంస్థలు ఏర్పాటయ్యాయి. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. భూముల ధరలు పది ఇరవై రెట్లు పెరిగాయి. వారి హక్కుల సాధనకోసం వారు కేంద్రంతో కొట్లాడుతున్నారు. తెలంగాణ తన సొంత అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకుంటున్నది. సంక్షేమ బడ్జెట్ను అనేక రెట్లు పెంచింది. వృద్ధులు, వికలాంగులు, బీడీకార్మికులు, వితంతువులు…లక్షలాది మందికి పింఛన్లు ఇచ్చి సామాజిక భద్రత కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పింఛను వల్ల మా పిల్లలు మమ్మల్ని బాగా చూసుకుంటున్నార్రా అని ఒక తాత చెబితే ఎంత సంతోషం వేసిందో. విద్యుత్ ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు ఏకకాలంలో వేగం పుంజుకున్నాయి. ప్రాజెక్టులు పూర్తి చేసుకోగలమన్న నమ్మ కం కలుగుతున్నది. చిన్న చిన్న చిక్కుముడులను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తున్నది. అయినా కొందరు ఈ ప్రభుత్వాన్ని శపిస్తున్నారంటే వారేం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. వారికి ప్రజలకు ఏం జరుగుతున్నదన్నదానితో పనిలేదు. మాకు ఏమి జరుగుతున్నదన్నదే ముఖ్యం. వాళ్ల ఫిర్యాదులన్నీ వ్యక్తిగతమైనవి. మాతో మాట్లాడటం లేదు. మాతో చర్చించడం లేదు. మాకు మర్యాద ఇవ్వడం లేదు. మాకు సలాములు చేయడం లేదు అని వారు కుమిలిపోతున్నారు. ఫేస్బుక్లో ఒక మిత్రుడు ప్రశ్నించాడు. మీతో రోజుకోసారి మాట్లాడి, మీతో కలిసి భోంచేసి, మీతో చర్చలు జరిపి, ప్రజలకు ఏమీ చేయకపోయినా పర్వాలేదా? కేసీఆర్ చేయనిది, చంద్రబాబు చేస్తున్నది అదేనా? చంద్రబాబును ఆకాశానికెత్తుతూ కేసీఆర్ను దుమ్మెత్తిపోస్తూ పత్రిక నింపడానికి కారణం ఇదేనా? పచ్చని పంటపొలాలను తగులబెట్టిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఓడిపోవాలని రాసే ధైర్యం మీకుందా? అని ఆ మిత్రుడు ప్రశ్నించాడు. ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ ఆధిపత్యం అన్నదే శాసిస్తున్నది. కానీ ప్రజలకు తెలుసు. ఎవరు తన, ఎవరు మన అన్న విచక్షణ మేధావులకు, ఆధిపత్యశక్తులకు అర్థంకాకపోవచ్చు. కానీ తెలంగాణ ఫలాలను ఆస్వాదిస్తున్న సమాజానికి వీరిని ఏమి చేయాలో, ఎక్కడ వాత పెట్టాలో బాగా తెలుసు.

Blatant Lies of Andhra Jyothi

  
  
Here one can find when KCR taken as Labour minister at Centre:

NDTV CorrespondentSaturday, November 27, 2004 (New Delhi):
Telangana Rashtriya Samiti chief Chandreshekhar Rao, who has been a Cabinet Minister without portfolio ever since the UPA came to power, has been given the charge of the Labour and Employment portfolio.

Sis Ram Ola of the Congress, who was holding the Labour and Employment portfolio so far, has now been given the mines portfolio.

The allotment of a portfolio for Rao also comes on top of pressure applied by the TRS leader for concrete action for creation of a separate Telengana state out of Andhra Pradesh.
The decision for the expansion was taken at a UPA coordination committee meeting last evening.

 

Fraud Andhra Jyothi and its venom on KCR

sahara

October 29, 2015

Telangana Chief Minister K.Chandra Shekar Rao was sworn in as Central Labour Minister on 2004 May 22. He was without port folio for some time. Later he was assigned Labour Ministry. He was in the Ministry till 22 September 2006. At that time Sahara was in peaks. Here are few points to show its glory:

Sahara India Chairman Subrata Roy was named among the 10 Most Powerful People of India in 2012 by India Today. In 2004, the group was termed by the Time magazine as ‘the second largest employer in India’ after the Indian Railways.


But blind and ignorant Andhra Jyothi and its owner bent up slinging mud on Telangana leader and Telangana. Patentee of frauds, defaulters of banks, cheater of partners and what not… Andhra Jyothi grown brick by brick on frauds. When KCR or his ministry was taken decision to leave the maintenance of PF accounts to Sahara, its not in the bad books. It was run into crisis in 2010 November only. BUt Andhra jyothi is known to build the lies and live on it. Andhra Jyothi itself wrote that there is a provision to allow companies to organize PF and ESI on thier own. See Here what he wrote in his newspaper:

FullSizeRender(1)

Here are the developments of Sahara crisis. One can find easily, when it was started.

Events of this fraud case started in 2010 and it is still in proceeding in Supreme Court of India as of October 2015:

November 2010 – Securities and Exchange Board of India bars Sahara India Pariwar chief Subrata Roy and two of its companies – Sahara India Real Estate Corp (SIREC) and Sahara Housing Investment Corp (SHIC) from raising money from the public as they raised several thousand crores through optionally fully convertible debentures which SEBI deemed illegal.[10]
December 2010 – Sahara made appeal in the Allahabad High court which ordered SEBI not to take any action until a court order is passed.[11]

January 2011 – Delhi High court issued a warrant against Sahara India Pariwar chairman Subrata Roy and four other officials of the group on a complaint that it deceived investors in a proposed housing project of Rs.25,000 crore.[12]

February 2011 – Delhi High court stays proceedings against Sahara India Pariwar chairman Subrata Roy and four other officials of the group on a complaint that it deceived investors in a proposed housing project.[13]

May 2011 – Supreme court of India asked Sahara India Real Estate (SIREC) to furnish the format of the application for an optionally fully convertible debentures (OFCD) scheme and a list of accredited agents which raised money on company’s behalf.[14]

June 2011 – SEBI ordered Sahara firms to immediately refund the money collected through sales of OFCDs.

October 2011 – Securities Appellate Tribunal (SAT) ordered two unlisted Sahara Group companies to refund within six weeks about 17,656.53 crore with 15% interest which it had raised through a flotation of OFCDs.[15]

November 2011 – Sahara India Pariwar moved to Supreme Court against SAT’s order and in favour of Sahara Group it stayed the SAT order, and asked the two companies to refund 17,400 crores to their investors and asked the details & liabilities of the companies.[16][17]

January 2012 – Supreme Court gives three weeks time to Sahara India Pariwar to choose between options to secure investments made by public in OFCD scheme. Either to give sufficient bank guarantee or attach properties worth the amount raised through OFCD’s.[18]

May 2012 – Supreme court is informed by Senior counsel Fali Nariman (appearing for Sahara India Real Estate Corp) that SEBI could not have taken up this issue of Sahara Group of companies raising funds through OFCD since there was no complaint from any investor.[19]

June 2012 – SEBI informed Supreme Court that real estate division of Sahara India Pariwar had no right to mobilise Rs.27,000 crore from investors through optionally fully convertible debentures (OFCD) without complying norms of Market regulator – SEBI.[20]

August 2012 – Supreme court directs Sahara India Real Estate Corporation Ltd. (SIRECL) and the Sahara Housing Investment Corporation Ltd. (SHICL) to refund over Rs. 24,400 crore.[21]

In March 2015, the court had directed two Sahara group companies — Sahara Real Estate and Sahara Housing — to return around Rs 24,000 crore with interest to nearly 3 crore investors through market regulator SEBI in Aug 2012. The firms were later allowed to pay up by February 2013. So, the total dues have now gone up to Rs 40,000 crore with the accretion of interest.[22]

In July 2015, Sebi cancels Sahara’s mutual fund licence- Sebi directed cancellation of Sahara Mutual Fund’s certificate of registration on expiry of a six-month period. [23]

అమరావతి నేర్పిన పాఠం ఏమిటి?

  

తెలంగాణలో కేసీఆర్‌పై కత్తులు దూస్తున్న టీటీడీపీ నాయకులు ఎప్పటికైనా తనకు ఉపయోగపడతారన్న నమ్మకం చంద్రబాబుకు లేదు. వారు రానురాను తనకు దూరమవుతారని కూడా ఆయనకు బాగా అర్థమయింది. ఎవరెవరు ఎవరితో మంతనాలు జరుపుతున్నారో కూడా చంద్రబాబుకు సమాచారం ఉంది. వీళ్ల కోసం ఎల్లకాలం కేసీఆర్‌తో గొడవపడాల్సిన పనిలేదని చంద్రబాబు సన్నిహితులు ఆయనకు బోధిస్తున్నారు. అందుకే ఆయన కేసీఆర్‌తో సుహృద్భావం కోసం ఒక అడుగు ముందుకు వేశారు. అమరావతి శంకుస్థాపనను ఒక అవకాశంగా తీసుకున్నారు. కేసీఆర్ కూడా రాజనీతిజ్ఞునిగా వ్యవహరించారు.

అమరావతి శంకుస్థాపన సంరంభం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకున్నట్టు గొప్ప సంబరంగా జరిగింది. ఎంత ఖర్చు, ఎంత ప్రజాస్వామికం అన్న ప్రశ్నల జోలికి వెళ్లకుండా చూస్తే ఒక కొత్త రాష్ట్రం పడే పాట్లన్నీ చంద్రబాబు ఈ సందర్భంగా పడ్డారు. ప్రతిఘటన, విమర్శ అన్నీ దాటుకుని, వాటిని అప్రాధాన్యం చేసి ఆయన ఈ సంబరం జరిపించారు. అయితే శంకుస్థాపన సభ పూర్తికాగానే కేంద్రంపై ఆంధ్ర మీడియా విరుచుకుపడిన తీరు, నరేంద్ర మోదీతో తగవు పడిన తీరు ఆంధ్ర నాయకత్వం అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదని తెలియజేస్తుంది. అంతా ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రచారదాడి జరిగినట్టుగా కనిపిస్తున్నది. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆంధ్ర నాయకత్వం తమకు ఏమి కావాలో మాట్లాడకుండా ఏది జరుగదో అది కావాలని పీఠం వేసుకుని పంచాయితీ చేసుకుంటూ కూర్చున్నది. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి, విభజన బిల్లు చివరి నిమిషం దాకా పార్లమెంటు గడపదాటకుండా చూడడానికి ప్రయత్నించారే తప్ప విభజన జరిగితే తమకు ఏమి నష్టమో, తమకు ఏమి కావాలో గట్టిగా కోరలేకపోయారు. ఇవ్వాళ దీర్ఘాలు తీసి మాట్లాడుతున్న ఆంధ్ర కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులంతా ఆరోజు పార్లమెంటులో ఉన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి, బొత్స ఝాన్సీరాణి, ఉండవల్లి అరుణ్‌కుమార్, కొనకళ్ల నారాయణ, …మొదలైన వాళ్లంతా పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకుని చేసిందేమిటో రెండు రాష్ర్టాల ప్రజలూ చూశారు. రాష్ట్ర విభజనకు అడ్డంగా నిలబడ్డారు. స్పీకర్‌పట్ల దురుసుగా వ్యవహరించారు. విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందకూడదని విశ్వ ప్రయత్నం చేశారు. విచిత్రం ఏమంటే వారి పార్టీలేమో విభజనకు అనుకూలంగా లేఖలు, తీర్మానాలు చేశాయి. వీరేమో పచ్చి అవకాశవాదులుగా మారి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించారు. విభజనకు వ్యతిరేకంగా మాట్లాడారుతప్ప, వారెవరూ మాకిది కావాలి అని పార్లమెంటులో ఆరోజు అడగలేదు.

ఆ రోజు ఆంధ్రప్రదేశ్‌కు ఏదైనా కావాలని అడిగింది నాకు తెలిసి ఒక్క వెంకయ్యనాయుడే. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ప్రత్యేక హోదా కల్పించడం, తెలంగాణ నుంచి ఏడు మండలాలను లాగేయడం వంటి వన్నీ ఆయన డిమాండ్లే. కేంద్ర కాం గ్రెస్ నాయకత్వం కూడా ఆంధ్ర నాయకత్వాన్ని మెప్పించడానికి కొన్ని జాతీయ సం స్థలను ఇవ్వడం, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడం వంటి నిర్ణయాలు చేసింది. అప్పుడే కనుక ఆంధ్ర నాయకత్వం అంతా ఉమ్మడిగా తమకు కావలసిన డిమాండ్ల గురించి పార్లమెంటు లోపలా బయటా కొట్లాడి ఉంటే ఇవ్వాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టి ఉంటే ఆ క్షణాల్లో కేంద్రం కూడా ఇచ్చి ఉండేదేమో. అప్పుడు ప్రత్యేక హోదా అడిగితే విభజనకు ఒప్పుకున్నట్టవుతుందని నాటకమాడి పోటీలు పడి ఆంధ్ర ప్రజలను మోసం చేశారు. రాజకీయ మైలేజీ కోసం చాలా మూర్ఖంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించాయి అన్ని పార్టీలు. ఇప్పుడు కూడా అదే తప్పిదం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి మేలు చేయడం, బీజేపీని బద్నాం చేయడం కోసం కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, టీడీపీ-బీజేపీలను రెంటినీ బోనులో నిలబెట్టడంకోసం మరికొన్ని పార్టీలు, మీడియా సంస్థలు మోడీపై విరుచుకుపడుతున్నాయి. అందరూ కలిసి చేస్తున్నదేమంటే ఆంధ్ర ప్రజలను సంక్షోభ మానసికస్థితి నుంచి బయటికి రాకుండా చూస్తున్నారు. వారికి భవిష్యత్తుపై విశ్వాసాన్ని కల్పించడానికి బదులు, నిరంతరం గగ్గోలు పుట్టిస్తున్నారు. నరేంద్ర మోదీకి లేక కేంద్రానికి సమర్థనగా ఇది రాయడం లేదు. ఒక ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్న ఆంధ్ర పార్టీలు, మీడియా వ్యూహాత్మక తప్పిదాన్ని గుర్తు చేయడం కోసమే ఈ వాదన. ఇప్పుడు కూడా సంఘటితంగా ఉండి రాష్ర్టానికి ఏమేమి కావాలో డిమాండు చేసి ఉంటే బాగుండేది. చంద్రబాబు, జగన్, రఘువీరా ఒకే వేదిక నుంచి కేంద్రాన్ని అడిగి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేది. ఐదేళ్లకు ఒకసారి చేయాల్సిన రాజకీయాలను పార్టీలు నిత్యకృత్యంగా మార్చుకోవడం వల్ల ప్రజలు నిమ్మళంగా ఉండలేకపోతున్నారు.

నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటును ఇప్పటికీ జీర్ణించుకోలేదని ఆయన ప్రసం గం తెలియజేసింది. ఎన్నికలకు ముందు మాట్లాడిన తీరులోనే ఆయన అమరావతి శంకుస్థాపన సభలో మాట్లాడారు. ఆంగ్లేయులు చేసినట్టు చేశారని, సంపదలను ధ్వం సం చేశారని ఆయన మాట్లాడారు. రెండూ అబద్ధాలే అని ఆయనకు తెలుసు. ఆంధ్ర ప్రజలకు ఏమీ హామీ ఇవ్వలేక కాంగ్రెస్‌ను బద్నాం చేయడం కోసం ఆయన ఈ వాదన చేసి ఉండవచ్చు. విభజన ప్రక్రియలో మొదటి నుంచి చివరిదాకా బీజేపీ ఉంది. బీజేపీ మద్దతుతోనే పార్లమెంటులో బిల్లు చట్టరూపం దాల్చింది. ఆంగ్లేయులనవలసి వస్తే కాంగ్రెస్‌తోపాటు బీజేపీని కూడా అనాల్సి ఉంటుంది. సంపదలను ధ్వంసం చేశారనే వాదన మరీ అధ్వాన్నమైన ఆరోపణ. విభజన సంపదలను సృష్టించింది. ఇవ్వాళ రెండు ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణం పెద్ద ఎత్తున సంపదలను సృష్టిస్తున్నది. అధికార వికేంద్రీకరణ ఫలాలను ఇవ్వాళ ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఇద్దరూ అనుభవిస్తున్నారు. విభజన సమయంలో మేము ఇంతదూరం ఆలోచించలేదు. ఇంతదూరం ఊహించలేదు. హైదరాబాద్‌పై ఉన్న మోహం వల్ల కావచ్చు మేము విభజనను జీర్ణించుకోలేకపోయాం. కానీ ఇప్పుడు మా కళ్లను మేమే నమ్మలేకపోతున్నాం. ఇవ్వాళ ప్రభుత్వం మా ముందుకు వచ్చింది. మంత్రులు మా కళ్ల ముందు తిరుగుతున్నారు. ఒక విధంగా మేమంతా కేసీఆర్‌కు రుణపడి ఉన్నాం అని విజయవాడకు చెందిన మిత్రుడొకరు చెప్పారు. కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్లాలా వద్దా అన్న చర్చ వచ్చినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్టు మిత్రుడిని అడిగాను వస్తే ఎలా ఉంటుంది అని. నేను రెండు మాసాలుగా ఆంధ్ర అంతటా తిరుగుతున్నాను. కేసీఆర్‌పై ఇప్పుడు ఆరాధన భావం తప్ప వ్యతిరేకత లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ పేరు తలుచుకోని సందర్భం లేదు. కేసీఆర్ ముందు గా అంత ఫిట్‌మెంటు ఇచ్చి ఉండకపోతే మా రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు ఇచ్చి ఉండేవారు కాదని వారు చెబుతున్నారు. ఇక్కడ ఏర్పాటవుతున్న కేంద్ర సంస్థలు, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి, హడావిడి ఇక్కడి జనం లో ఆశలు రేకెత్తిస్తున్నది. ఇదంతా విభజన వల్లనే జరిగింది కదా అని భావిస్తున్నారు. కేసీఆర్ వస్తే ఇక్కడ హర్షధ్వానాలు తప్ప వ్యతిరేకత ఉండదు అని ఆ మిత్రుడు చెప్పారు. కేసీఆర్‌కు అమరావతిలో లభించిన స్వాగత సత్కారాలు, ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తమయిన హర్షధ్వానాలు ఆ మిత్రుడు చెప్పింది నిజమేనని రుజువు చేశాయి. ఆంధ్రలో ధ్వంసమేదీ జరుగలేదని, అక్కడ కొత్తగా నిర్మా ణం జరుగుతున్నదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమున్నది? విభజన జరిగి నా తమ కు పెద్దగా రాజకీయ ప్రయోజనం లభించలేదని మోదీ భావిస్తుండవచ్చు. ఆ దుగ్ధకొద్దీ విభజనపై ఆయన తరచూ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండవచ్చు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సుహృద్భావంతో ఒక్కవేదికపైకి వచ్చిన వేళ నరేంద్ర మోదీ ఇటువంటి మాటలు మాట్లాడవలసిన అవసరం ఏముంది? ప్రత్యేక హోదా ఎగ్గొట్టదల్చుకుంటే అది ఆయన సమస్య. అందుకు విభజననెందుకు బద్నాం చేయడం?

కేసీఆర్ ఈ సభకు రాకూడదని చంద్రబాబు మిత్రులు కొందరు, ప్రత్యర్థులు అందరూ ఆశించారు. చంద్రబాబు వీరి ఆకాంక్షలను తోసిరాజని కేసీఆర్ ఇంటికి వచ్చి మరీ స్వాగతించారు. చంద్రబాబుకు అమరావతిలో నెగ్గడం ముఖ్యం. ఆంధ్ర లో విజయాలు సాధించడం అవసరం. కేసీఆర్‌తో పేచీలు పెట్టుకుని రచ్చ చేసినంతమాత్రాన తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న గ్యారెంటీ లేదు. ఓటుకు నోటు కేసు చంద్రబాబు ధైర్యాన్ని బాగా దెబ్బతీసింది. తెలంగాణలో కేసీఆర్‌పై కత్తు లు దూస్తున్న టీటీడీపీ నాయకులు ఎప్పటికైనా తనకు ఉపయోగపడతారన్న నమ్మ కం చంద్రబాబుకు లేదు. వారు రానురాను తనకు దూరమవుతారని కూడా ఆయనకు బాగా అర్థమయింది. ఎవరెవరు ఎవరితో మంతనాలు జరుపుతున్నారో కూడా చంద్రబాబుకు సమాచారం ఉంది. వీళ్ల కోసం ఎల్లకాలం కేసీఆర్‌తో గొడవపడాల్సిన పనిలేదని చంద్రబాబు సన్నిహితులు ఆయనకు బోధిస్తున్నారు. అందుకే ఆయన కేసీఆర్‌తో సుహృద్భావం కోసం ఒక అడుగు ముందుకు వేశారు. అమరావతి శంకుస్థాపనను ఒక అవకాశంగా తీసుకున్నారు. కేసీఆర్ కూడా రాజనీతిజ్ఞునిగా వ్యవహరించారు. సభలో కూడా ఆయన క్లుప్తంగా హుందాగా మాట్లాడి జనం నుంచి జేజేలు పొందారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా చంద్రబాబుకు పట్టుబట్టే తత్వం, కష్టపడే తత్వం, సాధించే తత్వం ఉన్నాయి. రాజధాని నిర్మాణం చాలా పెద్దపని. చాలా పెద్ద సవాలు. దానిని ఆయన భుజం మీద వేసుకున్నారు. రాజధాని స్థలాన్ని ఎంచుకోవడంలో కూడా ఆయన సరైన నిర్ణయమే తీసుకున్నారు. విజయవాడకు రాజధాని 1953లోనే రావలసింది. అప్పుడే విజయవాడ రాజధాని అయి ఉంటే ఆంధ్ర పరిస్థితి మరోలా ఉండేదేమా. కానీ రాజకీయ కుట్రల పర్యవసానంగా ఒక్క ఓటు ఆధిక్యంతో కర్నూలు రాజధాని అయింది. విజయవాడ రాజధాని అయితే కమ్యూనిస్టుల పెత్తనం వస్తుందని అప్పట్లో మోతుబరి రాజకీయ నాయకులంతా నీలం సంజీవరెడ్డి, ప్రకాశం వంటి వారి మాటలు విని విజయవాడకు వ్యతిరేకంగా ఆంధ్రేతర ఎమ్మెల్యేలను నలుగురిని తీసుకొచ్చి ఓటేయించారు. ఇంతకాలానికి ఇప్పుడు రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రకు మంచి ప్రదేశంలో రాజధాని వస్తున్నది. సారవంతమైన భూములను ఎలా లాక్కుంటారని కొందరు ప్రశ్నించవచ్చు. సారవంతమా, కాలువ కింద భూములా, మెట్ట భూములా అన్నదానితో నిమిత్తం లేకుండా ఏ భూమినయినా వదులుకోవాలంటే రైతుకు బాధ ఉండటం సహజం. భూమితో రైతుకు ఉండే అనుబంధం అటువంటిది. ఎవరయినా వారిని మెప్పించి భూసమీకరణ చేయాల్సిందే. శంషాబాద్ విమానాశ్రయం కోసం భూసేకరణ చేసినప్పుడు కూడా ఇటువంటి గోల చూశాం. ఏ ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిగినా ఈ సమస్య చూస్తున్నాం. కొత్త నిర్మాణం జరగాలంటే కొంత వినిర్మాణం అనివార్యం. రాజధాని దొనకొండలో పెట్టినా ఈ సమస్య ఉండేదే. పూర్తిగా మెట్ట ప్రాంతమయినా రైతులు అక్కడా గొడవ చేసి ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబు చేయవలసిందల్లా రాజధానికి రైతు శాపం తగలకుండా చూసుకోవాలి. వారిని అక్కున చేర్చుకుని, రాజధానిలో భాగస్వాములను చేయాలి. తాము పరాయీలమై పోయామన్న భావన వారిలో కలిగితే రాష్ర్టానికి, రాజధానికి మంచిది కాదు.

Its nothing but Modi Operandi

Questioning and leaking…a farce  

 
KCR had been sworn in as Central Cabinet Minister for Labour Affairs on 22 May 2004. KCR resigned from the Cabinet and his Lok Sabha seat simultaneously on 22September 2006, in protest against delaying tactics of Congress on Telangana and also to prove that Telangana demand was not died down as propagated by YS Rajashekar Reddy at that time. He reelected with a sounding victory from Karimnagar Lok Sabha seat fighting the mighty of YSRs mone and men. 

During his 16 month tenure as Central Minister he had sanctioned ESI hospitals through out Andhra Pradesh. That contract was awarded to Andhra Pradesh Fisheries Corporation, not for any private agency. After KCRs resignation only ESI started construction works and said to be completed in 2007-08. ESI did not made any complaint on irregularities, but that Elugubanti Suryanarayana, who is Executive Engineer with fisheries department at that time was trapped in a DA case and FIR was filed in 2011. 

The case was fought between CBI and Suryanarayana in the High Court, susequently it was quashed by the High Court in 2014. But for unknown reasons case is said to be reopened and started this questioning and schematic leakage drama to media by CBI.

See the link below:

http://indiankanoon.org/doc/125498390/

As was reported in media NDA Government is trying to control the non NDA leaders through the flimsy cases and false propaganda. But it is bound to bounce back on NDA as political vendetta never yeilded any result to any establishment.

జగన్ పిచ్చి పనులు

andhra
అమరావతి నిర్మాణ శంకుస్తాపన ఉత్సవానికి దూరంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ అపరిణకు రుజువు. ఆయన ఏమీ మారలేదనీ, గత ఎన్నికల నుంచి ఆయన ఎటువంటి గుణ పాఠాలు నేర్చుకోలేదని ఆయన ఈ తాజా నిర్ణయం తెలియజేస్తున్నది.
రాజకీయాల్లో పట్టువిడుపులు ఉండాలి. ఇది ప్రజాస్వామిక రాజకీయాల యుగం. తెగే దాకా లాగే ప్రయత్నం చేయడం అవివేకం. ఐక్యత పోరాటం అనివార్యం. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడి, ఒక అసాధారణమైన సవాలు రాష్ట్రం ఎదుర్కొంటున్నప్పుడు అనుసరించవలసిన పధ్ధతి ఇది కాదు.
ఇంత పెద్ద సవాలును అధిగమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలనుంచి జగన్ తనను తానూ దూరం చేసుకున్నారు. రాజకీయాల్లోకనీస అనుభవం ఉన్నవారు ఎవరైనా నెపం చంద్రబాబుపై నెట్టేందుకు ప్రయత్నించేవారు. జగన్ ఇది వీరత్వం అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఇది రాజకీయ మూర్ఖత్వం. పిల్ల చేష్ట.
రాజధాని నిర్మాణం అనివార్యం. అత్యవసరం కూడా. చంద్రబాబు రాష్ట్రంకోసం, తన రాజకీయ మనుగడకోసం వేగవంతంగా రాజధాని నిర్మించక తప్పదు. వచ్చే మూడు ఏళ్ళలో ఆయన వీలైనంత ఎక్కువ నిర్మాణాలు పూర్తి చేయక తప్పదు. చేసే పట్టుదల చంద్రబాబుకు ఉంది. అక్రమాలు సక్రమాల గురించిన లెక్క తర్వాత, పని అయిందా లేదా అన్నదే ప్రజలు చూస్తారు.

జగన్ మూడేళ్ళ తర్వాత రాజకీయ ప్రయోజనాలు ఇప్పుడే ఆశించి డక్ అవుట్ అయ్యారు.
పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం చదవడం అజ్ఞానం అవుతుంది.