ఏమిటి బీజేపీ గొప్ప

ఏమిటి బీజేపీ గొప్ప

ప్రధాని నరేంద్రమోడీ మూడేళ్ల పాలన సమీపించిన దశలో ఆయన నమ్మిన బంటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా దక్షిణాదియాత్ర మొదలు పెట్టాడు. ఇది దండయాత్రలాగా సాగింది. దక్షిణాదికి తెలంగాణ గేట్‌వే అని ఆయనే చెప్పారు. పూర్వం దక్షిణాదిపై దండయాత్రకు వచ్చినవారంతా దక్కను ద్వారానే ప్రవేశించారు. అప్పుడు కూడా ముందుగా దేవగిరి(మహారాష్ట్ర)ని నాశనం చేసి, ఆ తర్వాత తెలంగాణలో ప్రవేశించారు. మహారాష్ట్రలో బీజేపీ శివసేనతో కలిసి అధికారంలో ఉంది. ఇక మిగిలింది తెలంగాణే అని వారు భావిస్తున్నట్టున్నారు. మోడీ తదుపరి లక్ష్యం దక్షిణాది రాష్ర్టాలే అని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్నది. మైత్రి ద్వారా కాకుండా ఘర్షణ ద్వారా మాత్రమే బీజేపీని విస్తరించగలమని మోడీ, అమిత్‌షాల ప్రగాఢ నమ్మకం. పొత్తులు, మిత్రత్వాలు తాత్కాలికం, ఒంటరిగా ఎదగడమే దీర్ఘకాలికం అని ప్రగాఢంగా నమ్మిన నాయకులు వారు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిచోటా ఘర్షణకే దిగుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర, జార్ఖండ్, కేరళ, తమిళనాడు, ఇప్పుడు తెలంగాణ అన్ని చోట్లా ఒంటరిగానే ఎదగడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇందుకు మినహాయింపు కాదు. అక్కడ కూడా ఇది సంధికాలమే. విడిపోయిన దేశాలతో అఖండ భారతం సాధించడం సాధ్యం కాకపోవచ్చు కానీ, ఇప్పుడు ఉన్న దేశాన్ని ఏకఛత్రంకిందికి తీసుకురావడం సాధ్యమే అని వారు నమ్ముతున్నారు. అది సాధించగలిగితే అఖండభారతం సాధించినట్టే అని భావిస్తున్నారు. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మౌలిక నినాదం. భారత ఏకాత్మతావాదం పేరుతో బీజేపీ అగ్రనేతలు దేశమంతా యాత్రలు చేసిన విషయం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు రాజకీయ ఏకాత్మతావాద యాత్ర జరుగుతున్నది. ఈ యాత్ర నిరాటంకంగా ముందుకు సాగడానికి అవసరమైన అన్ని ఎత్తుగడలూ నరేంద్ర మోడీ ప్రయోగిస్తున్నారు. నోట్ల రద్దు నుంచి మొదలు పెడితే ప్రత్యర్థులపై కేసులు, దాడులు, దర్యాప్తులు అన్నీ అందులో భాగమే. సరెండర్ ఆర్ ఫినిష్ అన్నది అప్రకటిత నినాదం.

నోట్ల రద్దు దేశంలోని ప్రత్యర్థి రాజకీయ పక్షాలను ఆర్థికంగా నిరాయుధులను చేసే ఒక పెద్ద మంత్రం. అందుకే ఒక మేధావి దీనిని రాజకీయ కుట్ర అని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు ద్వారా ఏమేమి జరుగుతాయని చెప్పారో అవేవీ జరుగలేదు. కాశ్మీరులో శ్రీనగర్‌లో ఇప్పుడు సైన్యం కూడా అడుగుపెట్టలేని పరిస్థితి ఉత్పన్నమైంది. జీపులకు మనుషులను కట్టి ముందుకు అడుగులువేయవలసిన అమానుష దుస్థితి ఇవ్వాళ సైన్యానిది. ఉగ్రవాదుల రాక ఆగలేదు. సరిహద్దులో కాల్పులు ఆగలేదు. జనం చావులూ ఆగలేదు. ఏదో ఒక రోజు యుద్ధం కూడా వస్తుందేమోనన్న ఆందోళన ఇవ్వాళ దేశంలోని మార్కెట్లను పట్టిపీడిస్తున్నది. ఎన్నికలకు ముందు ఒక యుద్ధం వచ్చినా రావచ్చు. దండకారణ్యంలో మరణఘోష ఆగలేదు. ఇటు పోలీసులు, అటు నక్సలైట్లు, మధ్యలో మామూలు మనుషులు సమిథలు అవుతూనే ఉన్నారు. ఆర్థిక క్రమశిక్షణ వచ్చి సచ్చిందీ లేదు. బ్యాంకుల ఎన్‌పీఏలు ఏయేటికాయేడు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. బ్యాంకుల సేవలు మెరుగు పడింది లేదు. యాభైశాతానికి పైగా ఏటీఎంలు మూతపడే ఉన్నాయి. బ్యాంకుల్లో అకౌంటు ఉంటే డబ్బుండాలి. లేకుంటే వడ్డీలాగా పెనాల్టీలు పడతాయి. డబ్బులేకపోతే అక్కౌంటు మూసేసుకోవాలి. నోట్ల రద్దుకు ముందు కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్లు ఎన్ని చెలామణిలో ఉన్నాయని చెప్పిందో అన్ని నోట్లు బ్యాంకులకు వచ్చినట్టు లెక్కలు చెప్పింది. మరి నల్లడబ్బు ఏమైంది? నోట్ల రద్దు కారణంగా అదనంగా సంపాదించిన ఆదాయపు పన్ను అయినా గణనీయంగా ఉందా అంటే అదీ లేదు. నోట్ల రద్దు సందర్భంగా దొరికిన దొంగనోట్ల శాతం అసలు లెక్కలోకి తీసుకోదగింది కాదని ఆర్బీఐ లెక్కలు చెబుతున్నాయి. ఇవన్నీ కాగాపోగా నోట్ల రద్దు తర్వాతనే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ధారాళంగా డబ్బు ఖరు చేశాయి. బీజేపీ అందరికంటే ఎక్కువగా ఖర్చు చేసిందని అక్కడ ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన వారు చెబుతున్నారు. పోనీ రాజకీయ, అధికార యంత్రాంగాల్లో అవినీతి తగ్గిందా? మళ్లీ రేపు నల్లడబ్బు పోగుపడదని గ్యారంటీ ఉందా? ఇవేవీ జరుగలేదు. జరుగవు. అయినా ఎందుకు చేశారూ అంటే తమ పార్టీ, తానూ, తనను ఆర్థికంగా బలపరుస్తున్నవారూ బలపడడానికి ఈ ఐదేళ్ల అధికారాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోదల్చుకున్నారు. ఆ ప్రయత్నంలో ఇప్పటివరకు ఆయనకు ఎదురుదెబ్బలు తగల్లేదు. దేశానికి మంచి జరిగినా జరుగకపోయినా ఆయన మాత్రం బలపడుతూనే ఉన్నారు.

ఎకానమీలో రెండు విడ్డూరాలు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఒకవైపు షేర్ మార్కెట్ కొత్తపుంతలు తొక్కుతున్నది. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. మరోవైపు వేలాది మంది ఐటీ, ఆటోమొబైల్ ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ జీవితం గడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో లే ఆఫ్‌లు, రిట్రెంచ్‌మెంట్‌లు జరుగుతున్నాయి. కొత్తగా ట్రేడ్ యూనియన్‌లు పెట్టుకోవాలన్న ఆలోచన ఐటీ ఉద్యోగులకు కూడా వచ్చింది. టాటా మోటార్స్, షెవర్లే కంపెనీలు వందలాది మందిని రిట్రెంచ్ చేస్తున్నాయి. ఉద్యోగాల కల్పన దారుణంగా దెబ్బతింటున్నది. అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి. రియల్ ఎస్టేట్ ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఒకనాటి బలుపూఊపూవాపూ అన్నీ తగ్గిపోయాయి. నోట్ల రద్దుకు ముందు ఉన్న వెసులుబాటు ఇప్పుడు ఏ రంగంలోనూ లేదు. పది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నా నలుగురితో సరిపెట్టుకోవలసిన పరిస్థితి. ఎగుమతులు తగ్గిపోయాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినా మేకపోతు గాంభీర్యం దేశాన్ని నడిపిస్తున్నది. మాటలు, నినాదాలు అమ్మి అంతా సవ్యంగా ఉందని నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్న తెలంగాణకు వచ్చి అమిత్‌షా చేసిందీ ఆ ప్రయత్నమే. ఆయన తెలంగాణకు తమ సొమ్మేదో దోచుకొచ్చి పెట్టినట్టు మాట్లాడారు. లక్ష కోట్లు ఆయన జేబులోంచి ఇచ్చినట్టు చెప్పుకున్నారు. భారత దేశం రాష్ట్రల సమాఖ్య. కేంద్రం ఒక మిథ్య. రాష్ట్రల నుంచి వచ్చే ఆదాయమే కేంద్రం ఆదాయం. కేంద్రం గాలిలోంచి పుట్టించేది, సరిహద్దుల్లో, విదేశాల్లో సంపాదించేది ఏమీ ఉండదు. రాష్ట్రల్లో జరిగే ఉత్పత్తులు, అందించే సేవలు, జరిగే అమ్మకాలు, చేసే ఎగుమతులు వాటిపై వచ్చే పన్నులు ఆదాయమే కేంద్రం ఆదాయం. అంటే పునాది రాష్ట్రలే. కేంద్రం నుంచి నికరంగా ప్రజలకు అందేది ఏమీ ఉండదు. కేంద్రం వద్ద ఎంత సొమ్ము ఉన్నా అందులో ప్రజలకు అందేది పదీ పరకా మాత్రమే. రాష్ట్రల నిధులే ప్రజలకు పెన్నిధి. రాష్ట్రలు ప్రజలకు దగ్గరగా ఉంటాయి. ప్రజల అవసరాలను గుర్తించి పనిచేస్తాయి. ప్రజలకు సంపదను పంపిణీ చేస్తాయి. కేంద్రం నిధులు అధిక మొత్తాల్లో పెద్దలకు గద్దలకు మాత్రమే దక్కుతాయి అని ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్య ముమ్మాటికీ వాస్తవం.

బీజేపీ తెలంగాణకు ఏనాడూ చుట్టం కాదు. తెలంగాణ విముక్తి పోరాటంలో ఆ పార్టీ పునాది వర్గాలు చేసింది ఇసుమంతైనా లేదు. 1969 ఉద్యమంలో కూడా వారు గొప్ప పాత్ర ఏమీ నిర్వర్తించలేదు. గత రెండు దశాబ్దాల్లో బీజేపీ నిర్వర్తించిన పాత్ర కూడా అవమానకరమైనది, దాగుడుమూతలతో కూడుకున్నది. 1998 ఎన్నికల్లో ఒక ఓటు రెండు రాష్ర్టాలు నినాదంతో గణనీయంగా ఓట్లు సాధించిన పార్టీ ఆ తర్వాత ప్లేటు పిరాయించి తెలుగుదేశంతో ఊరేగింది. తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉండిపోయింది. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సొంతబలాన్నే నమ్ముకున్నారు. టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల సొంత బలమై కొట్లాడి, అనేక ఎత్తుపల్లాలు దాటుకుని తెలంగాణ సాధించింది. తెలంగాణ పేరు చెప్పక పోతే ఎవరికీ మెతుకు పుట్టని పరిస్థితిని ఆనాడు ఉద్యమ యోధుడు కె.చంద్రశేఖర్‌రావు సృష్టించారు. అందుకే కాంగ్రెస్ ఇవ్వక తప్పని పరిస్థితికి వచ్చింది. బీజేపీ మద్దతు ఇవ్వక తప్పని స్థితికి చేరింది. అయినా తెలంగాణ ఇచ్చే క్రమంలో ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడిన నాటకాలన్నీ గుర్తుపెట్టుకుని ఎన్నికల్లో ఆ పార్టీలకు ఎలా గుణపాఠం చెప్పాలో అలా గుణపాఠం చెప్పారు. బీజేపీ తన ఆంధ్ర పక్షపాతాన్ని ఏనాడూ దాచుకోలేదు. బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు పునర్విభజన చట్టానికి మద్ధతు ఇస్తూనే ఆంధ్రకు చేయవలసినదంతా చేశారు. పదేండ్ల ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు, అర్ధంతరంగా ఆరు మండలాలను, సీలేరు విద్యుత్తును, శబరి నదిని ఆంధ్రలో కలిపేయడం, ఉమ్మడి సంస్థలను మూడేండ్లయినా విభజించకపోవడం, ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి చేయకపోవడం, ఆంధ్రకు ప్రకటించిన సగం ప్రాజెక్టులు కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం, తెలంగాణలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకూ జాతీయ హోదా ప్రకటించకపోవడం…బీజేపీ చేసిన అన్యాయాల జాబితా చాలా తయారు చేయవచ్చు. బీజేపీ దళిత పక్షపాతం ఒక నటన. దళితులపట్ల ఆ పార్టీ ఆధిపత్య వర్గాలు ఎలా వ్యవహరిస్తున్నాయో గుజరాత్, జార్కండ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో గోరక్షణ పేరిట జరుగుతున్న ఘాతుకాలు ఏమిటో అందరికీ తెలుసు. అందువల్ల బీజేపీ తెలంగాణ ప్రజలను మాయ చేయలేదు. మోడీ, అమిత్ షా ఘర్షణ రాజకీయాలు ఎక్కడయినా పనిచేయవచ్చు, ఇక్కడ కష్టం.

BJP’s Congressisation

New dynasties in BJP

Here is a news analysis of BJP’s Congressisation:


BJP prime ministerial candidate Narendra Modi has often derided Congress vice president Rahul Gandhi as “shehzada (prince)” in his election rallies and refers to the Congress as a “sultanate (kingdom).”
But when it came to ticket allotments, the saffron party behaved no differently and nominations for princelings abound.
The sons of two sitting and three former chief ministers of the Bharatiya Janata Party (BJP) are in the fray in the Lok Sabha polls despite the party’s stated opposition to “dynastic politics”.
Anurag Thakur, son of former Himachal Pradesh chief minister Prem Kumar Dhumal, is re-contesting from Hamirpur in Himachal Pradesh, while Varun Gandhi, MP and son of party leader Maneka Gandhi, has shifted to Sultanpur from Pilibhit in Uttar Pradesh. Sultanpur is adjacent to Congress vice president and Varun’s cousin Rahul Gandhi’s Amethi constituency.
Poonam Mahajan, daughter of former union minister Pramod Mahajan, is the BJP candidate from Mumbai North-Central.
Former union minister and party MP Yashwant Sinha’s son Jayant is fighting for his father’s Hazaribagh seat in Jharkhand.
Former Uttar Pradesh chief minister Kalyan Singh’s son Rajbir Singh is contesting from Etah.
In Delhi, former chief minister Sahib Singh Verma’s son Parvesh Verma, an MLA, is the party candidate from West Delhi.
Dushyant Singh, son of Rajasthan Chief Minister Vasundhara Raje is fighting from Jhalawar in the state.
Chhattisgarh chief minister Raman Singh’s son Abhishek is the party candidate from the Rajnandgaon Lok Sabha constituency.

The Mahajan-Munde Family

• Pramod Mahajan(1949 – 2006) – Parliamentary affairs minister in Atal Bihari Vajpayee government
• Gopinath Munde (1949-2014) – Deputy Chief Minister of Maharashtra, Union Minister for Rural Development and Panchayati Raj in Narendra Modi’s Cabinet
• Poonam Mahajan – Member of Parliament from Mumbai North Central
• Pankaja Munde – Minister of Rural Development, Women and Child Welfare in Devendra Fadnavis government
• Pritam Munde – Member of Parliament from Beed

The Fadnavis Family

• Shobha Fadnavis – Member of Maharashtra Legislative Council aunt of Devendra Fadnavis
• Devendra Fadnavis – Chief Minister of Maharashtra

Raje family

• Vasundhara Raje, Chief minister of Rajasthan
• Dushyant Singh, Lok Sabha Member, son of Vasundhara

Singh family

• Raman Singh, current Chief Minister of Chhattisgarh
• Abhishek Singh, son of Raman Singh, member of Lok Sabha from Rajnandgaon

Badal Family

• Parkash Singh Badal, Current Chief Minister of Punjab.
• Sukhbir Singh Badal, Deputy Chief Minister of Punjab and President of the Shiromani Akali Dal
• Harsimrat Kaur Badal, wife of Sukhbir, current Union Minister for Food Processing Industries and current Member of Parliament from Bathinda
• Gurdas Singh Badal, Member of Parliament from Firozpur
• Manpreet Singh Badal, former minister Punjab