సైంధవుల సయ్యాట

img_4813

మహాభారతం ఒక గొప్ప రాజకీ య కావ్యం. అందులో కనిపించని రాజకీయపాత్రలు లేవు. కౌరవ పాండవుల పెనుగులాట లాగా ఇప్పుడూ ఎప్పుడూ అధికారం కోసం పెనుగులాట సహ జం. ఎవరు కౌరవులు, ఎవరు పాండవులన్నది ఇప్పుడేమో ప్రజలు నిర్ణయిస్తున్నారు. ప్రధాన పాత్రలు కాకుండా భారతంలో సైంధవుడు, శల్యుడు, శిఖండి, కర్ణుడు, అశ్వత్థామ.. వంటి చాలా పాత్రలున్నాయి. ఒకటి మంచికి, మరొకటి చెడుకు, ఇంకొకటి త్యాగానికి, స్నేహానికి, మరొకటి ద్రోహానికి ప్రతీకలు. ప్రధాన పాత్రలు కాకుండా చాలా తరచుగా ఇటువంటి పాత్రల గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు సైంధవుడు. సింధు రాజు. ఆయన అసలుపేరు జయద్రథుడు. కౌరవుల ఏకైక సోదరి దుస్సల భర్త. అంటే పాండవులకు కూడా బావ వరుస. అటువంటి వాడు ఒకసారి అరణ్యవాసంలో ఉండగా జయద్రథుడు వరుసకు సోదరి అయిన ద్రౌపదిని చూసి మోహించి, రథంపై లాక్కెళుతుంటాడు. ఈ విషయం తెలిసిన పాండవులు ఆయనను వెంబడించి, బంధించి, జుట్టు కొరిగించి, అవమానించి పంపుతారు. ఆ అవమానంతో తపస్సు చేస్తాడు. పాండవులపై ప్రతీకారం తీర్చుకునే శక్తిని ఇవ్వమని శివుడిని అడుగుతాడు. అంతశక్తిని ఇవ్వలేను కానీ, ఒకరో జంతా పాండవ యోధులను నిలువరించే శక్తిని ఇస్తున్నాను. ఒక్క అర్జునుడిని మాత్రం ఎవరూ నిరోధించలేరు అని శివుడు చెబుతాడు. కురుక్షేత్రంలో పద్మవ్యూహం పన్నిన రోజున అర్జునుడిని ఉద్దేశపూర్వకంగా మరోవైపు మళ్లించి, పద్మవ్యూహంతో పాండవ సేనను ఛిన్నాభిన్నం చేస్తుంటారు ద్రోణాది కౌరవసేన. ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు ఒక్కరు కూడా అడుగు ముందుకువేయలేకపోతారు. అభిమన్యుడు ఒక్కడే పద్మవ్యూహంలోకి వెళ్లగలుగుతాడు. కానీ బయటికి రాలేడు. కౌరవయోధులంతా కలిసి అభిమన్యుడిని చంపుతారు. దానికి ప్రతీకారంగా అర్జునుడు మరుసటిరోజు సైంధవుడిని చంపుతాడు. ఒక్కరోజు పాండవ యోధులను నిలువరించగలుగడం, పాక్షిక నష్టం కలిగించగలుగడం సైంధవుడి పాత్ర. సైంధువుడు దుష్కర్ముడు. దుష్టపాత్ర. అభిమన్యుడి హత్యకు కారకుడు. ఆధునిక రాజకీయాల్లో ఎవరినైనా తిట్టాల్సి వస్తే ఈ పేరుతో తిట్టడం అందుకే. వీరు యుద్ధాన్ని గెలువలేరు. ఏదో తెలియని బాధ, దుగ్ధ ఉంటాయి. ఎవరినో గెలిపించడానికి, మరెవరినో ఓడించడానికి పనికివస్తారు.

“వాడు రోడ్డేస్తే నాకు చెడ్డ పేరొస్తుంది. వాడు కాలువ తీస్తే వాడికి పేరొస్తుంది. పొలాలకు నీళ్లొస్తే జనం మన మాట వినరు. ఊళ్లోకి బడి వస్తే పిల్లలు పనికిరారు. అందరికీ భూమి ఉంటే మన పొలాల్లో ఎవరు పనిచేస్తారు? ఇది తరతరాలుగా సాగుతున్న ఆలోచనాధార. చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ ఆలోచనాధార నుంచి బయటపడటం లేదు. రైతులకు పరిహారం ఇవ్వాలనడం, పునరావాసం కల్పించాలనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయంలేదు. ప్రభుత్వం చట్టం ద్వారానే ఆ పనులన్నీ చేస్తున్నది. ఇంకా నష్టపోతున్నామని ఎక్కడైనా రైతులు వాదిస్తే అదనపు సాయం కూడా అందిస్తున్నది.” 

 
పవన్‌కల్యాణ్ గురించి ఒక మిత్రుడు ఇదేమాట అన్నాడు. అందుకే పైకథ అంతా చెప్పాల్సి వచ్చింది. పవన్‌కల్యాణ్ అమాయకుడు, భోళా అని మరో మిత్రుడు అన్నాడు. సైంధవుడా, అమాయకుడా అన్న ప్రశ్న ఆయన మాటలు, ప్రవర్తనను చూసి అర్థం చేసుకోవాలి. ఆయన గెలువాలనుకొని, మార్పు తేవాలనుకొని రాజకీయాలు చేస్తున్నట్టుగా అనిపించదు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్మార్ట్ సీఎం అంటారు. ఆయన పాలన బాగుందంటారు. మళ్లీ తెలంగాణలో అన్ని స్థానాలకు పోటీ చేస్తానంటాడు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడుతూ చాలా మిస్టీరియస్ పాత్ర పోషిస్తున్నాడనిపిస్తుంది. వసంత కోకిలలాగా ఎన్నికల రుతువులో పాటపాడే సినీ నాయకుడు కనిపిస్తారాయనలో. 2009 ఎన్నికలకు ముందు నుంచి నిన్న మొన్నటిదాకా ఆయన మాటల్లో వచ్చిన మార్పులన్నీ గుదిగుచ్చి ఎవరో మిత్రుడు ఒక వీడి యో పంపారు. ఆయనలో ఎన్ని వైరుధ్యాలో. ఎంత నిలకడలేని తనమో. ఎంత చపలచిత్తమో. ఎంత అవకాశవాదమో. ఆయన చేగో బొమ్మ పెట్టుకుంటే ఒకప్పుడు మురిసిపోయాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తే కనిపించేదంతా వాస్తవం కాదని, లోపలి మనుషులు వేరే ఉంటారని అర్థం అవుతుంది. పవ న్‌కల్యాణ్ తన అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పు డు తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా తీర్మానం చేశారు. పవన్‌కల్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తూ ఆవేశంతో ఊగిపోతూ నేను మీకు అండగా ఉంటా అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తాను సైతం అంకితమవుతానని చెప్పారు. 2009 డిసెంబరులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం రాగానే అడ్డం తిరిగారు. గడ్డం గీసుకున్నంత తేలికగా రాష్ట్రాన్ని విడదీస్తారా అని ప్రశ్నించారు. విభజన జరిగినప్పుడు నాకు ఏడుపొచ్చింది. ఒక్కరోజు కాదు రెండు రోజు లు కాదు 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పా డు. కేసీఆర్ తాటా తీస్తా అని బీరాలు పలికాడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ ఇంకా చాలాచాలా మాట్లాడాడు. అటువంటి మనిషి ఇప్పు డేం మాట్లాడుతున్నాడు? జై తెలంగాణ, వందేమాతరం వంటి ఒక మహావాక్యమట. కేసీఆర్ అంటే తనకు చాలా ఇష్టమట. ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతాయేమో. తెలంగాణకు నిజంగా కేసీఆర్ చాలు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ వంటి టుమ్రీ రాజకీయవాదులు అవసరంలేదు. పిచ్చికూతలతో, పిచ్చి ఆవేశాలతో ఇక్కడ వాతావరణం చెడగొట్టకుంటే చాలు. చిరంజీవిలో ఉన్నపాటి స్థిరత్వం, గాంభీర్యం కూడా ఈ మనిషిలో లేదు.

“రాజకీయాల్లో స్థిరత్వం ఉండాలి. మాట్లాడే ప్రతిమాటకు పొంతన ఉండాలి. సంబద్ధత ఉండాలి. కొనసాగింపు ఉండాలి. దీర్ఘకాలిక దృక్పథం ఉండా లి. ఇవి లేని విన్యాసాలన్నీ దూదిపింజల్లా గాలికి కొట్టుకుపోతాయి. పవన్‌కల్యాణ్ అయినా, తెలంగాణలో ప్రతిపక్ష నాయకులకైనా అదే వర్తిస్తుంది.”

రాజకీయాల్లో స్థిరత్వం ఉండాలి. మాట్లాడే ప్రతిమాటకు పొంతన ఉండాలి. సంబద్ధత ఉండాలి. కొనసాగింపు ఉండాలి. దీర్ఘకాలిక దృక్పథం ఉండా లి. ఇవి లేని విన్యాసాలన్నీ దూదిపింజల్లా గాలికి కొట్టుకుపోతాయి. పవన్‌కల్యాణ్ అయినా, తెలంగాణలో ప్రతిపక్ష నాయకులకైనా అదే వర్తిస్తుంది. ప్రతిపక్షాలది మరీ విచిత్ర వైఖరి. విశాల జనబాహుళ్య ప్రయోజనాలు చూడాలా లేక కొద్దిమంది కక్షిదారు ల ప్రయోజనాలు చూస్తారా? కాంగ్రెస్, బీజేపీలు ప్రజాపక్షపాతం కలిగిన రాజకీయపక్షాలుగా కాకుం డా కోర్టు కక్షిదారులుగా మారిపోయాయి. కరువు సీమకు ఎన్నో ఏండ్లు ప్రాతినిధ్యం వహించిన నాగం జనార్దన్‌రెడ్డి కేసుల ఉద్యమం నడిపిస్తున్నారు. జేఏసీ నాయకులు సైతం కేసుల వెంటే పరుగెడుతున్నారు. కాంగ్రెస్ సంగతి ఇంకా చెప్పనవసరం లేదు. ఈ కక్షిదారుల మనస్తత్వం భూస్వామ్య సంస్కృతి నుం చి పుట్టుకొచ్చింది. వాడు రోడ్డేస్తే నాకు చెడ్డ పేరొస్తుం ది. వాడు కాలువ తీస్తే వాడికి పేరొస్తుంది. పొలాలకు నీళ్లొస్తే జనం మన మాట వినరు. ఊళ్లోకి బడి వస్తే పిల్లలు పనికిరారు. అందరికీ భూమి ఉంటే మన పొలాల్లో ఎవరు పనిచేస్తారు? ఇది తరతరాలుగా సాగుతున్న ఆలోచనాధార. చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ ఆలోచనాధార నుంచి బయటపడటం లేదు. రైతులకు పరిహారం ఇవ్వాలనడం, పునరావాసం కల్పించాలనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయంలేదు. ప్రభుత్వం చట్టం ద్వారానే ఆ పనులన్నీ చేస్తున్నది. ఇంకా నష్టపోతున్నామని ఎక్కడైనా రైతులు వాదిస్తే అదనపు సాయం కూడా అందిస్తున్నది. అన్నిరకాలుగా నిర్వాసితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అదీ నచ్చకపోతే కోర్టులో అదనపు పరిహారం కోసం కొట్లాడే అవకాశమూ ఉంది. రాజకీయ లక్ష్యాలు, వాంఛలు, అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులకు అవరోధాలుగా మార డం రాష్ర్టానికి మంచిది కాదు.

నిజానికి ఈ పరిహారాల గురించి ఆలోచించకుండానే చాలా ప్రాజెక్టుల కింద రైతులు తమ భూము ల్లో కాలువలు తవ్వనిచ్చారు. నల్లగొండ జిల్లాలో వరదకాలువ కింద చాలామంది రైతులు భూములు ఎప్పుడో ఇచ్చేశారు. కనీసం భూ సేకరణ నోటిఫికేషన్ కూడా రాకుండానే భూములు ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల కింద కొన్ని గ్రామా ల రైతులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి భూములు ఇచ్చారు. వాళ్లు దేవుళ్లు. ఎందుకంటే నీరు బంగారమని, జీవనాధారమని, నీటి కంటే ఏదీ విలువైనది కాదని అర్థం చేసుకున్నవాళ్లు, నమ్మినవాళ్లు కాబట్టి వారు అలా చేశారు. రాజకీయ నాయకత్వం అటువం టి వారికి అండగా నిలబడి సత్వర న్యాయం జరిగేట్టు చూడాలి. నీళ్లు లేకపోతే ఎన్ని ఎకరాల భూమి ఉంటే ఏమిటి ప్రయోజనం? రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ తాగు, సాగునీటి కోసం తన్లాడింది. నీరు లేక తెలంగాణ ఎలా వెనుకబడిపోయిందో అందరికీ అనుభవంలో ఉన్నదే. స్వరాష్ట్ర ఉద్యమం కారణంగానే ఆంధ్ర నాయకత్వం తెలంగాణలో ఆదరాబాద రా అడ్డగోలు ప్రాజెక్టులు మొదలుపెట్టింది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన శక్తులు ఇప్పుడు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఫ్రంటు గట్టడం అంటే అం తకంటే విడ్డూరం ఏముంటుంది? నిన్నటి మన ఎజెం డా ఇవ్వాళ ఎందుకు ఎజెండా కాకుండాపోయింది? అభివృద్ధి పథంలో సైంధవులు కాకూడదని అందరూ అర్థం చేసుకుంటే తెలంగాణకు మేలు జరుగుతుంది.

మాట తప్పుట, మడమ తిప్పుట


మాట తప్పను. మడమ తిప్పను…. ఈ మాటలు 2009 ఎన్నికలకు ముందు కూడా అన్నట్టు గుర్తు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం జరగ్గానే మాట మార్చడం, పార్టీ మార్చడం, మడమ తిప్పడం, 2014 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పడిపడి ఏడ్వడం….. ఇంకా అందరికీ గుర్తే. ఎవరైనా ఎలా మర్చిపోగలరు?

ఇప్పుడు మరో ప్రతిజ్ఞ. మరో పార్టీ. మరో మడమ. బకరాలు ఎవరు? బలయ్యేది ఎవరు?

Judge of judges

Boast many things, but deliver nothing;

preach preach ethics, but voilate everything to be in power;

cultivate aam aadmi, but serve amir admi;

judge everyone, but dont allow anyone to judge you;

demonetise people economy, monetise political economy?????!!!!!

Irony of a man

He will not critisize, but he will contest against;

he will not quarrel, but he pretends as if quarreling;

he has no policy and philosiphy, but boasts as a noble warrior;

he say he will not tolerate injustice, but finally he stands as a pillar of injustice;

he will not win a war, but he will fail a war;

he tempers with emotion, but ends up with bundle of confusions;

he is not one person, but proves to be many versions;

he is visible and invisible; he is known and unknown;

భూములేలినా బుద్ధి మారదా!

తెలంగాణ ప్రజలకు చంద్రబాబు హయాంలో జరిగిన మంచేకాదు చెడుగురించి కూడా బోలెడు అవగాహన ఉంది.హైదరాబాద్‌ను ఆంధ్రా కాలనీగా వ్యవస్థితం చేసింది కూడా చంద్రబాబే. ఆ కాలంలోనే హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హుడా) నిధులను విజయవాడ-గుంటూరు-తెనాలి అభివృద్ధి సంస్థకు మళ్లించింది కూడా ఆయన కాలంలోనే. ఆయన ఇతర రంగాలను సర్వనాశనం చేసిందీ నిజం. పల్లెలను, వ్యవసాయాన్ని, నీటిపారుదల ప్రాజెక్టులను వదిలేసి ప్రపంచ బ్యాంకు ఎజెండాను మోసింది నిజం. తెలంగాణను రైతు ఆత్మహత్యల తో వల్లకాడుగా మార్చింది కూడా ఆ పదేళ్లలోనే.

ఎలుకతోలు తెచ్చి ఎన్నేళ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అని వేమన చెప్పింది ఎంత సత్య మో ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు, ఆయన ప్రభుత్వం తెలంగాణ గురించి చేస్తు న్న సూత్రీకరణలు చూస్తే తెలుస్తుంది. ఒక్క చం ద్రబాబు నాయుడే కాదు నీతి ఆయోగ్ వైస్ చైర్మ న్ రాజీవ్‌కుమార్ కూడా అమరావతిలో జరిగిన ఒక సమావేశంలో చాలా తెలివితక్కువ వాదన చేశారు. తెలంగాణకు వచ్చే పన్నుల ఆదాయంలో హైదరాబాద్‌లోని ఆంధ్రావారు చెల్లిస్తున్నదే 50 శాతం ఉంటుందని, వారంతా అమరావతికి వస్తే ఆంధ్రప్రదేశ్ గొప్పగా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబునాయుడు చాలా అనుభవం కలిగిన నాయకునిగా చెప్పుకుంటారు. రాజీవ్‌కుమార్‌కు కూడా గొప్ప ఆర్థిక నిపుణునిగా పేరుంది. తెలంగాణవాళ్లకు వ్యవసాయం చేయడం రాదని కృష్ణా ట్రిబ్యునల్‌కు లేఖలు రాసిన ఇంజినీర్లు కూడా నిన్నమొన్నటిదాకా హైదరాబాద్ నీళ్లూ, కూడూ అనుభవించినవాళ్లే. ఇటువంటి మనుషులు ఇంత విచక్షణారహితంగా ఎలా మాట్లాడగలుగుతున్నారన్నదే ప్రశ్న. హైదరాబాద్ రాజధాని కాబట్టి, బతుకుదెరువు బాగుంటుంది కాబట్టి, ఎదుగడానికి అవకాశాలు ఎక్కువగా ఉం టాయి కాబట్టి, రెండు రాష్ర్టాలతోపాటు దేశంలోని అన్నిరాష్ర్టాల ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఉద్యోగాలు చేశారు, వ్యాపారాలు చేశారు, పరిశ్రమలు ప్రారంభించారు, స్థలం కొనుక్కున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, రోడ్లు వేయించుకున్నారు, సుఖవంతమైన జీవితం చూసుకున్నారు. ఇందులో ఏదీ లోకోద్ధరణ కోసం జరుగలేదు. ఎవరి సంగతో ఎందుకు? నేను మా ఊరి నుంచి హైదరాబాద్ నగరానికి హైదరాబాద్‌లో ఉన్నవారిని, హైదరాబాద్ రాజధానిగా కలిగిన తెలంగాణవారిని ఉద్ధరించడంకోసం రాలేదు. బతుకడం కోసం వచ్చా ను. ఇక్కడ స్థిరపడ్డాను. బతుకుదెరువులో భాగంగా నా ప్రవృత్తికి తగిన ఒక వృత్తిని ఎంచుకున్నాను. అందులో పనిచేస్తున్నాను. కాలక్రమంలో ఎదిగాను. ఇవ్వాళ నేను కూడా పన్ను కడుతున్నాను. అదంతా ఒక బాధ్యత కలిగిన పౌరునిగా తప్ప, ఉద్ధరణ కాదు.

భారతీయులు అదృష్టవంతులు. వారికి బ్రిటిష్ పాలకు లు, అందునా శ్వేతజాతీయుల పాలన లభించింది. లేకపోతే వారు ఎప్పటికీ బాగుపడేవారు కాదు అని వెనుకటికి ఓ శ్వేత జాతి దురహంకార మేధావి చేసిన వ్యాఖ్యకు ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తేడా ఏమీ లేదు. ఇద్దరిదీ దురహంకారమే. అభివృద్ధి అన్నది ఒక నిరంతర ప్రక్రియ. ఒకరు ఆలోచిస్తారు. ఒకరు విధాన కల్పన చేస్తారు. మరొకరు ఆచరణ మొదలుపెడుతారు. ఇంకొకరు పూర్తి చేస్తారు. మళ్లీ మరో ఆలోచన మొదలవుతుంది. ఇందులో ఎవరి పాత్ర వారిది.

హైదరాబాద్‌లో నివసిస్తున్న ఏ ప్రాంతం వారికైనా ఇదే లాజిక్ వర్తిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి హైదరాబాద్‌లో ఉండే ఆంధ్రవారంతా అమరావతికి వస్తే బాగుంటుందని చంద్రబాబునాయుడుకు ఉండవచ్చు. అది అర్థం చేసుకోవచ్చు. కానీ రాజీ వ్‌కుమార్‌కు ఎందుకుండాలి? ఎందుకంటే ఆంధ్రకు ప్రత్యేక హోదా ఎగ్గొట్టడం కోసం ఏదో ఒక ఉపశమనం చేకూర్చే మాటలు చెప్పాలి. అందుకు ఇటువంటి తలతిక్కవాదన చేసి ఉం టాడు. రాష్ర్టాలు విడిపోయినప్పుడు ఏ రాజధాని అయినా బోసిపోదు. ఎడారి కాదు. మద్రాసు నుంచి కర్నూలుకు, కర్నూలు నుంచి హైదరాబాద్‌కు రాజధాని మారిన తర్వాత సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు ఎందుకు రాలేదు? మా వాళ్లతోపాటే మేము ఎందుకు అనుకోలేదు? అది ఆచరణ సాధ్యం కాదు కాబట్టి. మద్రాసులో, కోయంబత్తూరులో పరిశ్రమలు పెట్టిన ఆంధ్రా పారిశ్రామికవేత్తలు అన్నీ మూసేసుకుని ఆంధ్రకో హైదరాబాద్‌కో వచ్చారా? హైదరాబాద్‌లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగినవారంతా ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారాలు, పరిశ్రమలు ప్రారంభించి ఎదిగినవారే. మద్రాసు నుంచి వ్యాపారా లు మోసుకొచ్చినవారు అతి తక్కువ. ఇటువంటి అర్థరహితమైన వాదనలు గతంలోనూ జరిగాయి. మహారాష్ట్ర నుంచి గుజరాత్‌ను విడదీసేప్పుడు బొంబాయిపై ఇదేవిధంగా రచ్చ చేశారు. బొంబాయిలో వ్యాపారాలన్నీ గుజరాతీలవేనని, అందువల్ల బొంబాయిని గుజరాత్‌కు రాజధానిగా కొనసాగించాలని వాదించారు. బొంబాయిని గుజరాత్ నుంచి విడదీస్తే బొంబాయి బోసిపోతుందని బెదిరించారు. కానీ వాస్తవంగా ఏం జరిగింది? అక్కడ వ్యాపారాలు మూతపడలేదు. బొంబాయి దేశ ఆర్థిక రాజధాని అయింది. గుజరాతీ లు గుజరాత్‌లో కొత్తగా వ్యాపారాలు పెట్టుకున్నారు. రెండు రాష్ర్టాలు ఎదిగాయి. ఇప్పుడూ తెలంగాణ, ఆం ధ్రలో అదే జరిగితే సంతోషం. అంతే కానీ రెండు రాష్ర్టాలకు పోటీపెట్టి మాట్లాడటం, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రకు అన్యాయం జరిగిపోయిందంటూ చీటికీ మాటికీ వాపోవడం రాజనీతిజ్ఞత కాదు, రాజకీయ దివాళాకోరుతనం. ప్రజలను భావోద్వేగాలపరంగా రెచ్చగొట్టడం వారికి మంచిది కాదు.

1995కు ముందు హైదరాబాద్‌లో ఏముంది? ఇప్పుడేముంది? అని చంద్రబాబునాయుడు మాట్లాడారు. ఇంత రాజకీయ అనుభవం ఏమైందో అర్థం కాదు. హైదరాబాద్ చంద్రబాబు పుట్టకముందు, ఎన్‌టీఆర్ రాక ముందు కూడా వైభవంగానే ఉంది. భారతీయులు అదృష్టవంతులు. వారికి బ్రిటిష్ పాలకు లు, అందునా శ్వేతజాతీయుల పాలన లభించింది. లేకపోతే వారు ఎప్పటికీ బాగుపడేవారు కాదు అని వెనుకటికి ఓ శ్వేత జాతి దురహంకార మేధావి చేసిన వ్యాఖ్యకు ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తేడా ఏమీ లేదు. ఇద్దరిదీ దురహంకారమే. అభివృద్ధి అన్నది ఒక నిరంతర ప్రక్రియ. ఒకరు ఆలోచిస్తారు. ఒకరు విధాన కల్పన చేస్తారు. మరొకరు ఆచరణ మొదలుపెడుతారు. ఇంకొకరు పూర్తి చేస్తారు. మళ్లీ మరో ఆలోచన మొదలవుతుంది. ఇందులో ఎవరి పాత్ర వారిది. దేశంలోకి కంప్యూటర్లు తేవాలని రాజీవ్‌గాంధీ ఆలోచించారు. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుల ను ప్రారంభించాలన్న ఆలోచన అప్పటిదే. 1993లో నే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మాదాపూర్ రాజీవ్‌గాంధీ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేశా రు. ఎన్‌టీఆర్ కు చేసిన ద్రోహం తాలూకు పాపాలను కడిగేసుకోవ డం కోసం బాబు అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాలపై దృష్టిని కేంద్రీకరించిన మాటవాస్తవం. ఐటీ రంగం అభివృద్ధి వేగిరపరచింది నిజం. ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డి ఏమీ ఆపలేదు. అడ్డుకోలేదు. ఇప్పుడు స్వరాష్ట్రంలో ఇంకా స్వేచ్ఛగా అభివృద్ధి పథం సాగుతున్నది. మునుపెన్నడూ లేనంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్‌ను మరిం త మహోజ్వల నగరంగా తీర్చిదిద్దడానికి బాటలు వేస్తున్నారు. మొత్తంగా ఈ అభివృద్ధి ప్రస్థానంలో నేనుగానీ లేకపోతే… అనే సంభాషణే అవసరం లేని ది. ఎవరి పాత్ర వారికి ఉంటుంది. కేటీఆర్ నిజాయితీగా చంద్రబాబు చేసిన కృషిని ఒక వేదికపై చెప్పారు. ఆ గౌరవాన్ని చంద్రబాబు కాపాడుకుంటే మంచిది. అది కాకుండా హైదరాబాద్‌ను, తెలంగాణను కించపరిచే భాషను గానీ, వాదనను గానీ తెలంగాణ ప్రజ లు అంగీకరించరు.

ప్రకాశం బరాజు రాకముందు కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఏమి పంటలు వేసేవారో, ఎంత పంట పండించేవారో ఒక్కసారి చరిత్ర పుటల్లోకి, కనీ సం మద్రాసు ప్రెసిడెన్సీ గెజిట్‌లలోకి వెళ్లి చదువుకుంటే తెలుస్తుంది. ప్రకాశం బరాజు, దానిపైన నాగార్జున సాగరం వచ్చిన తర్వాత కృష్ణా, గుంటూరు వారు వరిపంటలో ఆరితేరి ఉండవచ్చు. సాగునీటికి పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేసుకోవడం తెలంగాణ రైతులకు సాధ్యమైతే బంగారం పండిస్తారు. అద్భుతాలు సృష్టిస్తారు. ఎప్పటిదాకో ఎందుకు తెలంగాణ ప్రభు త్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం రికార్డు స్థాయి లో వరిపంట దిగుబడి వచ్చింది. తెలంగాణ రైతు కరెంటుకోసం, పెట్టుబడి కోసం, ఎరువులకోసం ఎదురుచూడటంలోనే తన శక్తినంతా ధారపోస్తూ వచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం ఆ కష్టాలనుంచి విముక్తి చేసింది కాబట్టి అంత పంట దిగుబడి వచ్చింది.

ఎందుకంటే తెలంగాణ ప్రజలకు చంద్రబాబు హయాంలో జరిగిన మంచేకాదు చెడుగురించి కూడా బోలెడు అవగాహన ఉంది. హైదరాబాద్‌ను ఆంధ్రా కాలనీగా వ్యవస్థితం చేసింది కూడా చంద్రబాబే. ఆ కాలంలోనే హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా) నిధులను విజయవాడ-గుంటూరు-తెనా లి అభివృద్ధి సంస్థకు మళ్లించింది కూడా ఆయన కాలంలోనే. ఆయన ఇతర రంగాలను సర్వనాశనం చేసిందీ నిజం. పల్లెలను, వ్యవసాయాన్ని, నీటిపారుదల ప్రాజెక్టులను వదిలేసి ప్రపంచబ్యాంకు ఎజెండా ను మోసింది నిజం. తెలంగాణను రైతు ఆత్మహత్యల తో వల్లకాడుగా మార్చింది కూడా ఆ పదేళ్లలోనే. ఆయన తన ఘన కార్యాలను గురించి చెప్పుకున్నప్పు డు, తెలంగాణకు జరిగిన నష్టాలను కూడా చెప్పాల్సి ఉంటుంది. అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా- అప్ప ట్లో తెలంగాణ ఆదాయాన్ని ఇతర ప్రాంతాలకు మళ్లిం చి, ఇక్కడి ప్రజలకు చిప్ప చూపించేవారు. ఇప్పుడు తెలంగాణ ఆదాయం తెలంగాణలోనే ఖర్చు పెట్టుకునే అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడుకు ఇప్పు డు అలా ఖర్చు పెట్టుకునే ఛాన్సు పోయింది. అందుకే ప్రతిసందర్భంలో కంటికి కడివెడుగా ఏడుస్తున్నాడు. అంత బాధగా ఉంటే రాజీవ్‌కుమార్ చెప్పినట్టు చంద్రబాబు తెలంగాణలో వ్యాపారాలు మూసివేసి, అమరావతికి తరలించుకోవచ్చుగా. హెరిటేజ్ పన్ను ఆదా యం అంతా ఆంధ్రాకే దక్కేట్టు చూడవచ్చుగా. అది మాత్రం కుదరదు.

ఇక వ్యవసాయం గురించి, కృష్ణాజలాల పంపిణీ గురించి ఆంధ్రా ప్రభుత్వం రాసిన లేఖ ఆధిపత్య దురహంకారానికి పరాకాష్ట. పొరుగురాష్ట్రం, ఎగువరాష్ట్రం అయిన తెలంగాణతో ఎలా వ్యవహరించాలో ఆంధ్ర నాయకత్వానికి ఇప్పటికీ సోయి రాలేదని చెప్పడానికి ఉదాహరణ. ఇప్పటికీ తామేదో పెద్దన్నలమైన ట్టు, తెలివిమంతులైనట్టు, నేర్పడానికే పుట్టినట్టు వ్యవహరించడం వారి తెంపరితనాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాదనలే ఇప్పటికీ చేస్తున్నారు. తెలంగాణ వారికి వ్యవసాయం రాదు, మేము నేర్పించాము అన్నాడో దురహంకారి. తెలంగాణలో కొన్ని శతాబ్దాలుగా వ్యవసాయం ఉంది. కాకతీయులు నిర్మించిన తటాకాల నాటి నుంచి వ్యవసాయం కొనసాగుతున్నది. హైదరాబాద్ రాష్ట్రంలో 1901లోనే 8.69 లక్షల ఎకరాలు వరిపంట సాగయింది. ప్రకాశం బరాజు రాకముందు కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఏమి పంటలు వేసేవారో, ఎంత పంట పండించేవారో ఒక్కసారి చరిత్ర పుటల్లోకి, కనీ సం మద్రాసు ప్రెసిడెన్సీ గెజిట్‌లలోకి వెళ్లి చదువుకుంటే తెలుస్తుంది. ప్రకాశం బరాజు, దానిపైన నాగార్జున సాగరం వచ్చిన తర్వాత కృష్ణా, గుంటూరు వారు వరిపంటలో ఆరితేరి ఉండవచ్చు. సాగునీటికి పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేసుకోవడం తెలంగాణ రైతులకు సాధ్యమైతే బంగారం పండిస్తారు. అద్భుతాలు సృష్టిస్తారు. ఎప్పటిదాకో ఎందుకు తెలంగాణ ప్రభు త్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం రికార్డు స్థాయి లో వరిపంట దిగుబడి వచ్చింది. తెలంగాణ రైతు కరెంటు కోసం, పెట్టుబడి కోసం, ఎరువుల కోసం ఎదురుచూడటంలోనే తన శక్తినంతా ధారపోస్తూ వచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం ఆ కష్టాలనుంచి విముక్తి చేసింది కాబట్టి అంత పంట దిగుబడి వచ్చిం ది. తెలంగాణ రైతులకు వ్యతిరేకంగా ఇలా వాదిస్తున్నారు సరే, మరి రాయలసీమ సంగతేమిటి? వాళ్ల కూ వ్యవసాయం చేయరాదని, దిగుబడి తీయలేరని ఎగతాళి చేస్తారా? నీళ్లివ్వడానికి నిరాకరిస్తారా? తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వాదననే రాయలసీమకు వ్యతిరేకంగా చేయగలరా? ఇంత మూర్ఖపు అధికారు లు, ఇంత పైత్యపు నాయకత్వం ఉండటం ఆంధ్రా ప్రజల విషాదం.
kattashekar@gmail.com

అదే భావజాలం, అవే తిట్లు

తెలంగాణ రాష్ట్రం కొత్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కొత్త. ఏదో చేయాలన్న ఆరాటం. రుజువు చేసుకోవాలన్న తపన. ముందున్న నాయకత్వానికంటే భిన్నంగా ఉండాలన్న తాపత్రయం.. ఇవన్నీతెలంగాణ నాయకత్వాన్ని ప్రజలకు సన్నిహితులనుచేశాయి. ప్రభుత్వంలోని నాయకత్వం ఇంతగా ప్రజలతో కలసి మమేకం కావడం కూడా ఇదే ప్రథమం. వీరిలో అత్యధికులు ఉద్యమకాలంలో కూడా జనంతో ఉన్నారు. ప్రతి ఉద్యమంలో ముందుండి పోరాడారు. అదే ఒరవడి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నది. మరి ప్రతిపక్ష నాయకులో. అప్పుడు కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నారు. తెలంగాణ సమాజం ఎంత క్షోభపడుతున్నా ఉలుకూ పలుకూ లేకుండా ఆంధ్రా నాయకత్వం మాటున పడి ఉన్నారు.

కండ్లముందు కనిపించే వాస్తవా న్ని చూడటానికి నిరాకరించేవారికి ఏమి చెప్పినా ఏమి ప్రయోజనం? చెవిటివారి ముందు శంఖమూదడం కంఠశోష. కరెంటు సమస్యను తెలంగాణ ప్రభు త్వం ఎలా పరిష్కరించిందో ప్రజలందరికీ అనుభవంలో ఉన్నది. కరెంటు బాధల నుంచి విము క్తి వల్ల కలిగిన ప్రయోజనాలేమిటో ఇవ్వాళ తెలంగాణ ప్రజలకు ఎవరో చెప్పనవసరంలేదు. కరెంటు కోతలు లేవు. మోటార్లు కాలిపోవడం లేదు. లో ఓల్టేజీ సమస్య లేదు. ఇప్పుడు కరెంటుకోసం ఎదురుచూసుడు లేదు. ఫ్యాక్టరీలు, ఆఫీసులు, పెద్దపెద్ద దుకాణాలు, చిన్నచిన్న కిరా ణా కొట్లు, ఇళ్లల్లో అయితే జనరేటర్లు, ఇన్వర్టర్లు అన్నీ బందయిపోయాయి. ఎక్కడయినా ఉన్నా ఏదయినా ఆపత్కాల అవసరాల కోసమే వాడుకుంటున్నారు. జనరేటర్లు, ఇన్వర్టర్లు అమ్మే వ్యాపారులు వేరే వ్యాపారాలకు మళ్లవలసిన పరిస్థితి వచ్చింది. కరెంటుకోసం రాస్తారోకోలు, సబ్‌స్టేషన్లపై దాడులు, విద్యుత్ అధికారుల నిర్బంధాలు ఈ మూడున్నరేండ్లలో ఏనాడైనా చూశామా? ఇన్నీ తెలిసి కాంగ్రెస్ నాయకులు సవాళ్లు విసురుతున్నారు. కరెంటు విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాన్ని కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ ఊహించి ఉండరు. ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ నాయకుల మాటల్లో ఎన్ని వైరుధ్యాలంటే అన్నీ మేమే చేశాం, అంతా మా ఘనకార్యమే అని ఒకసారి అంటారు. అడ్డగోలు ధరపెట్టి కొనుగోలు చేశారని, అవినీతి జరిగిందని మరోసారి అంటారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క యూనిట్ విద్యు త్తు ఉత్పత్తి చేయలేదని చెబుతారు. ఏమీ చేయకుండానే ఈ మూడేండ్లలో సౌరవిద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ ఎలా ఎదిగింది? 2500 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యానికి ఎలా చేరుకుంది? థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు పరుగులు పెట్టిందెప్పుడు? భూపాలపల్లి, జైపూరు, కొత్తగూడెంలో కొత్త యూనిట్లు అందుబాటులోకి వచ్చిందెప్పుడు? కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా ప్రాజెక్టుల వెంట వెళితేగదా తెలిసేది. బజార్లో కాళ్లు బార్లా చాపుకొని సవాళ్లు విసురుతున్నవాళ్లు ముందు రాష్ట్రంలో అవసరమైన విద్యుత్తు ఎంత? ఉత్పత్తి అవుతున్నదెంత? ఎక్కడెక్కడ ఏయే ప్రాజెక్టులు ఉన్నా యో తెలుసుకొని మాట్లాడితే జనం సంతోషిస్తారు. మాట్లాడటానికి నోరూ, మైకూ ఉంటే చాలదు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ వనరుల నుంచి విద్యుత్ ఉత్పాదన పెరుగుతున్నది. మన దేశంలోనూ వివిధ రాష్ర్టాల్లో విద్యుదుత్పాదన బాగా పెరిగింది. తత్ఫలితంగా కొనుగోలు చార్జీలు తగ్గుతున్నాయి. మన ఎత్తిపోతల పథకాలన్నీ అందుబాటులోకి వచ్చేనాటికి విద్యుత్ బల్క్ కొనుగోలు చార్జీలు బాగా తగ్గుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చాలాకాలంగా చెబుతున్నారు. ఆ దృక్పథంతోనే పెద్ద ఎత్తున గోదావరిపై నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టులు చేపట్టారు. అత్యంత వేగంగా ఆ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి సమస్త యం త్రాంగం కృషి చేస్తున్నది. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావుతోపాటు ఏ జిల్లా మంత్రి ఆ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల వెంటపడుతున్నారు. కరెంటు తర్వాత నీరే అత్యంత కీల కం. కరెంటు కంటే నీరు ఖరీదైనది. అందుకే నీటికోసం ఎంతయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తున్నది. కాంగ్రెస్ నాయకత్వం ఇవేవీ చూడదల్చుకోలేదు. బట్టకాల్చి మీదవేసి ఏదో పబ్బం గడుపుకోవాలన్న ఆరాటం తప్ప నిర్మాణాత్మక పాత్ర పోషించే దార్శనికతే వారిలో కనిపించడం లేదు. సుదీర్ఘకాలంపాటు ఒక ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన కారణంగా టీఆర్‌ఎస్ నాయకత్వానికి ప్రజాపక్షపాతంతో పనిచేసే దార్శనికత అబ్బింది. కాంగ్రెస్ నాయకత్వానికి ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ప్రజాకేంద్రక ఆలోచనా ధోరణి అలవడలేదు. పొలాలకు నీళ్లిస్తే రైతులు, కూలీలు మన మాట వినరు, రోడ్డేస్తే జనం మనకు అందుబాటులో ఉండరు అన్న భూస్వామ్య దృక్ప థం నుంచి చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ బయటపడలేదు. ఆధునిక దృక్పథం కానీ, క్రియాశీల ఆలోచనలు కానీ వారికి రావడం లేదు. ఎంతసేపు తిట్లపురాణాలు తప్ప, ప్రత్యామ్నాయ ఆలోచనాధారను వారు అలవర్చుకోవడంలేదు. ఒక కాంగ్రెస్ మిత్రుడన్నట్టు ఆ పార్టీలో నాయకులకు మేధావులంటే చిన్నచూపు. బాగా మాట్లాడేవారిని, మంచి వక్తలను చూస్తే అక్కడ అగ్రకులాల నుంచి వచ్చి పెద్దనాయకులుగా చలామణి అవుతున్నవారు కళ్లలో నిప్పులు పోసుకుంటారని ఆ మిత్రుడు బాధపడ్డారు. అందుకే ఆ పార్టీలో భావజాలపరంగా ఒక దివాళా పరిస్థితి తలెత్తింది.

తెలంగాణ సాధించడంలో ప్రధాన చోదకశక్తిగా పనిచేసిన కేసీఆర్‌కు వచ్చినంత గొప్పపేరు మరెవరికీ రాలేదు. రాదు. ఆయన అందరిలో ఒకడు కాదు, అరుదైన నాయకుడు. ఆయన నాయకత్వంలో లోపాలు ఉండవచ్చు. మహాత్ములయిన నాయకుల్లో కూడా చరిత్ర కొన్ని లోపాలను లెక్కపెట్టింది. ఇదీ అంతే. ఒక గొప్ప నాయకుడు వస్తే తప్ప ఆయనను ఎదిరించడం సాధ్యం కాదు. నాయకుడు రాత్రికిరాత్రి నోరేసుకుని బయలుదేరితే తయారుకాడు. దానికి సాధన కావాలి. ఓపిక కావా లి. సందర్భం కావాలి. లేదంటే సందర్భం సృష్టించుకోవాలి. కొత్త రాజకీయ నమూనాలను తయారు చేసుకోవాలి. అందుకోసం అనేకమంది మేధావులు, నాయకుల అనుభవాలను చదువాలి. తిట్టి, కొట్టి, పెట్టి నాయకులయ్యేవారి వల్ల సమాజానికి ఏమీ లాభం ఉండదు. వారు అనేకమందిలో ఒకరు. వారు రాజకీయాలను కలుషితం చేయగలరు, తప్ప ఉన్నతీకరించలేరు. కల్లుకొట్టు ముందు నిలబడి మైకంలో మతితప్పి అమ్మనాబూతులు తిట్టేవాడికి పది మైకుల ముందు నిలబడి మాంచి ఖద్దరు బట్టలు తొడిగి పట్టుకండువా మీదేసుకుని మాట్లాడేవారికి తేడా లేకపోతే ఇక జనానికి ఏమి చెబుతారు? జనానికి ఎలా నాయకత్వం వహిస్తారు?

కరెంటు, తాగునీరు-సాగునీరు, రైతుకు ఎకరాకు నాలుగువేల పెట్టుబడి, భూ రికార్డుల ప్రక్షాళన, పిం ఛన్లు, కళ్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు, సంక్షే మ గురుకులాలు.. ఇవి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని చరిత్రలో నిలిచిపోయేట్టు చేస్తాయి. ఇంతకంటే ఉన్నతంగా, ఇంతకంటే భిన్నంగా, ఇంతకంటే ప్రయోజనకరంగా ప్రతిపక్షాలు ఏదైనా ఎజెండాతో వస్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. అధికారం పోయిందన్న అక్కసు, ద్వేషాలతో, తాము ఇంతకాలం అనుభవించిన పదవులు ఎవరో అనుభవిస్తున్నారన్న దుగ్ధతో, ప్రాజెక్టులు-కాంట్రాక్టులు అంటే కమీషన్లు అని మాత్రమే అర్థం చేసుకుని అవి తమకు దక్కకుండా పోయాయన్న ఉక్రోషంతో బుసలు ముసలు కొడితే అధికారం రాదు. తెలంగాణ సాధించడంలో ప్రధాన చోదకశక్తిగా పనిచేసిన కేసీఆర్‌కు వచ్చినంత గొప్పపేరు మరెవరికీ రాలేదు. రాదు. ఆయన అందరిలో ఒకడు కాదు, అరుదైన నాయకుడు. ఆయన నాయకత్వంలో లోపాలు ఉండవచ్చు. మహాత్ములయిన నాయకుల్లో కూడా చరిత్ర కొన్ని లోపాలను లెక్కపెట్టింది. ఇదీ అంతే. ఒక గొప్ప నాయకుడు వస్తే తప్ప ఆయనను ఎదిరించడం సాధ్యం కాదు. నాయకుడు రాత్రికిరాత్రి నోరేసుకుని బయలుదేరితే తయారుకాడు. దానికి సాధన కావాలి. ఓపిక కావా లి. సందర్భం కావాలి. లేదంటే సందర్భం సృష్టించుకోవాలి. కొత్త రాజకీయ నమూనాలను తయారు చేసుకోవాలి. అందుకోసం అనేకమంది మేధావులు, నాయకుల అనుభవాలను చదువాలి. తిట్టి, కొట్టి, పెట్టి నాయకులయ్యేవారి వల్ల సమాజానికి ఏమీ లాభం ఉండదు. వారు అనేకమందిలో ఒకరు. వారు రాజకీయాలను కలుషితం చేయగలరు, తప్ప ఉన్నతీకరించలేరు. కల్లుకొట్టు ముందు నిలబడి మైకంలో మతితప్పి అమ్మనాబూతులు తిట్టేవాడికి పది మైకుల ముందు నిలబడి మాంచి ఖద్దరు బట్టలు తొడిగి పట్టుకండువా మీదేసుకుని మాట్లాడేవారికి తేడా లేకపోతే ఇక జనానికి ఏమి చెబుతారు? జనానికి ఎలా నాయకత్వం వహిస్తారు?

తెలంగాణ ఉద్యమం నాయకత్వ సంస్కృతిలో కూడ ఒక గొప్ప మార్పు తెచ్చింది. గత మూడున్నరేండ్లలో మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పల్లెలు, పట్టణాలు, ప్రాజెక్టులు పట్టుకుని తిరిగినట్టుగా చరిత్రలో ఏనాడైనా ఏ నాయకుడైనా తిరిగినాడా? ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పట్నంలో ఉన్నది తక్కువ. హుజూరాబాద్, కరీంనగర్‌తోపాటు ఇతర జిల్లాల్లో ఉన్నది ఎక్కువ. ఆయనకు ఎప్పుడు ఏరోజు ఫోన్ చేసినా హైదరాబాద్ నుంచి ఊరికెళుతూనో, ఊరి నుంచి హైదరాబాద్‌కు వస్తూనో మాట్లాడుతారు. తన్నీరు హరీశ్‌రావు అయితే కాలికి బలపం కట్టుకున్నారు. కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి… దాదాపు మంత్రులంతా నిమ్మళంగా నాలుగు రోజులు పట్నంల గడిపింది లేదు. తెలంగాణ రాష్ట్రం కొత్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కొత్త. ఏదో చేయాలన్న ఆరాటం. రుజు వు చేసుకోవాలన్న తపన. ముందున్న నాయకత్వానికంటే భిన్నంగా ఉండాలన్న తాపత్రయం.. ఇవన్నీ తెలంగాణ నాయకత్వాన్ని ప్రజలకు సన్నిహితులనుచేశాయి. ప్రభుత్వంలోని నాయకత్వం ఇంతగా ప్రజలతో కలసి మమేకం కావడం కూడా ఇదే ప్రథమం. వీరిలో అత్యధికులు ఉద్యమకాలంలో కూడా జనం తో ఉన్నారు. ప్రతి ఉద్యమంలో ముందుండి పోరాడారు. అదే ఒరవడి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నది. మరి ప్రతిపక్ష నాయకులో. అప్పుడు కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నారు. తెలంగాణ సమాజం ఎంత క్షోభపడుతున్నా ఉలుకూ పలుకూ లేకుండా ఆంధ్రా నాయకత్వం మాటున పడి ఉన్నా రు. ఇంకొందరేమో తెలుగుదేశం, సీపీఎం పార్టీలలో తెలంగాణకు ద్రోహం చేసిన ఆంధ్ర నాయకత్వాలతో అంటకాగుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆంధ్ర నాయకత్వం వదిలివెళ్లిన భావజాలంతోనే తెలంగా ణ నాయకత్వంపై దాడి చేస్తున్నారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేయడం, ఉద్యోగ నోటిఫికేషన్లపై వివాదాలు రేపడం, ప్రతిపనికీ అవరోధాలు కల్పించడం ఇవన్నీ వారి వారసత్వ లక్షణాలే. అప్పటికీ ఇప్పటికీ వీరికి ఒరిజినాలిటీ ఏదీ లేదు. అన్నీ తెచ్చిపెట్టుకున్న వాదాలు, వాదనలు. బీజేపీ కేం ద్రంలో అధికారంలో ఉండి ప్రజలకు ఈ మూడున్నరేండ్లలో ఎన్ని కష్టాలను పరిచయం చేసిందో అం దరికీ అనుభవంలోకి వచ్చింది. తెలంగాణకు అనుకూలంగా ఒక్క మంచిపనీ చేయలేదు. విభజన చట్టంలోని హామీలన్నీ పెండింగులోనే ఉన్నాయి. తెలంగాణకు మద్దతు ఇచ్చిన మంచిని కూడా ఆ పార్టీ కాపాడుకోలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత ఏదైనా దక్కుతుందంటే అది టీఆర్‌ఎస్ నాయకత్వానికి, అనివార్యతకు తలొగ్గి, ప్రజావాంఛను గౌరవించి, పార్లమెంటుతో ఒప్పించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా అప్పుడూ ప్రేక్షకులే.

Judicial Monarchy Questionable

మేడి పండు చూడ మేలిమైయుండును పొట్టవిప్పి చూడ పురుగులుండు.

********

దేవతా వస్త్రాలు తీసేసారు. వస్త్రాలు తీసినవారిపై భక్తజనాల వాంతులు చేసుకోవడం మొదలయింది.

********

Democratization of judicial process much needed value today. It seems hierarchical monarchy is ruling the process. Its right to raise a point now. Judiciary cannot hide behind the courteous screens.