మునుపటి గుణమేల మాను..

images

మార్పును ఆహ్వానించలేనివారు మచ్చల కోసం భూతద్దం పెట్టి వెదుకుతుంటారు. జీవితకాలమంతా సాగించే ఆ మచ్చల అన్వేషణే ఒక మహా విప్లవకార్యంగా భావిస్తుంటారు. ఆ మచ్చల అన్వేషణలో పాల్గొన-లేదని ఇతరులపై దుమ్మెత్తిపోస్తుంటారు. వీరు మేధావుల పేరిట చెలామణి అవుతుంటారు. పత్రికల ముసు-గు లో చెలరేగుతుంటారు. ప్రాంతాన్ని బట్టి, అధికారంలో ఉన్న పార్టీని బట్టి వీళ్ల చూపు మారిపోతుంది. నిజానికి యథాతథవాదులకూ వీళ్ల కు పెద్దగా తేడా ఉండదు. వెనుకటికి భూస్వాములు ఊళ్లోకి బడిని రాని-చ్చేవారు కాదు. కరెంటు వచ్చినా తమ ఇళ్లకే పరిమితం. చెరువు నీళ్లు కూడా తమకే సొంతం. ఇవేవీ బక్క రైతులకు, పేదలకు దక్కేవి కాదు. దక్కకుండా ఉంటేనే వారంతా తమవద్ద సేవకులుగా పడి ఉంటారని వారి నమ్మకం. ప్రాజెక్టులు, కాల్వల విషయంలోనూ ఇదే భూస్వామ్య మనస్తత్వం కొనసాగింది. కాలువ నీళ్లొస్తే ఇంకేమన్నా ఉందా, జనం మన మాట విం టారా. ఛట్ ఆపండి అని మోకాలు అడ్డం వేసిన నాయకులు తెలంగాణలో ఎప్పటి నుం చో ఉన్నారు. వారి వారసులు ఇప్పటికీ వివిధ పార్టీల్లో కొనసాగుతున్నారు. వారే వందలకొద్దీ కేసులు వేస్తారు. వారే రైతులకు పరిహారం ఇవ్వడం లేదని గోల చేస్తారు. వారే ప్రభుత్వం అడ్డ-గోలుగా అప్పులు చేసేస్తుందని వాదిస్తారు. కొందరు నాయకులు ఎంత దుర్మార్గులో ఒక చిన్న సంఘటన వింటే అర్థమవుతుంది. నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ రిజర్వాయర్ వెనుక నుంచి ఒక వరద కాలువ తవ్వారు. ఆ కాలువ  పొడవు 84 కిలోమీటర్లు. అందులో మధ్యలో ఒక వందమీటర్ల పొడవున భూమిపై కొందరు రైతులు కేసు వేశారు. ఆ కేసులో 2009లో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పటికి తొమ్మిదేండ్లు. కేసును ఎత్తివేయమని అడుగడానికి ఎవరికీ తీరుబడి లభించలేదు. ఇటీవల ఒక్కొక్క రైతును బతిమాలి కేసుల నుంచి తప్పించే ప్రయత్నం మాడుగులపల్లి మండల యువకు లు చేశారు. కొందరు కేసు ఉపసంహరించు-కున్నారు. మరో రైతు అదే క్రమంలో కేసు ఉపసంహరించుకోవడానికి ముందుకువచ్చాడు. ఈ విషయం తెలిసిన నల్లగొండ కాంగ్రె స్ ప్రతినిధి, నాకు తెలియకుండా కేసు ఉపసంహరించుకోవద్దు అని ఆ రైతును ఎగదోశాడు. మళ్లీ పని ఆగింది. పర్యవసానం ఏమంటే, మాడ్గులపల్లికి ఇవతల ఉన్న పదిహేను గ్రామాలు, పది చెరువులకు నీరు అందకుండా పోయింది.

ఈ గ్రామాల్లో కాలువ తవ్వకానికి పెట్టిన ఖర్చు సుమారు 150 కోట్లకు పైగా ఉంటుంది. అంటే ప్రభుత్వం 150 కోట్లు ఖర్చుచేసి కూడా పదేండ్లుగా ఆ గ్రామాలకు నీరివ్వలేకపోయింది. పదివేల ఎకరాలకు నీరందించలేకపోయింది. కాంగ్రెస్ నాయకుల మనస్తత్వం అలా ఉంటుంది. పానగల్లు చెరువు ఇప్పటికీ పూర్తిగా నింపలేదు. చాలా కాలువలకు దిగువకు నీరివ్వలేని పరిస్థితి. రైతులు కరువుతో అలమటిస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోలేదు. పానగల్లు రిజర్వాయ ర్‌లో మునిగే భూము-లకు, ఇళ్లకు నష్టపరిహారం చెల్లించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ పనుల్లో కదలిక వచ్చింది. ఏ ప్రాజెక్టు వద్దయినా కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఇలాగే ఉంది. కొంతమంది మేధావులు, కొన్ని పత్రికల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పాలమూరు రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం ప్రాజెక్టు.. అన్నింటిపైనా ఏదో ఒక పేచీ లేవనెత్తడం పనులు ఆపడం వీరికి అలవాటుగా మారింది. ఒక పత్రికయితే ప్రాజెక్టులపై కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నా, ఫలితం ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదని రాగాలు తీసింది.  ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేసి ప్రజలకు నీళ్లివ్వాలని కొట్లాడటానికి బదులు ఎంతసేపు వివాదాలు లేపడా-నికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఒక స్టే ఖరీదు ఎంతో ఇటీవల ఒక రిటైర్డు చీఫ్ ఇంజినీర్ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేం ద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చాయి. ప్రాజెక్టు పనులు చూసి కేంద్ర ప్రభుత్వం మొదలు అన్నివర్గా ల ప్రజలు కొనియాడుతున్నారు. ఎటొచ్చీ మనవాళ్లే సమస్యలు సృష్టిస్తున్నారు. ఒక రిజర్వాయర్ నిర్మించాలంటే వందలాది మంది కార్మికులు పనిలో ఉం టారు. వందలాది జేసీబీలు, ట్రక్కులు పనిలో ఉం టాయి. ఎంతోమంది ఇంజినీర్లు, అధికారులు పను ల్లో నిమగ్నమవుతారు. ఉదాహరణకు ఆ రిజర్వాయర్‌ను వెయ్యి కోట్లతో నిర్మిస్తున్నామంటే, దానికొక తుదిగడువు పెట్టుకొని ఆ గడువులోగా పూర్తిచేసి నీళ్లు తీసుకోవాలని ప్రణాళిక పెట్టుకుంటారు. సకాలంలో పూర్తిచేసి, ఫలితాలు తీసుకుంటే ఆ వెయ్యికోట్లకు సార్థకత లభిస్తుంది. వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. రైతుల జీవన ప్రమాణాల్లో అసాధారణమైన మార్పు వస్తుంది. రైతుకు విద్యుత్, నీరు, పెట్టుబడి ఇవ్వడమంటే వారిని ఆర్థికంగా శక్తిమంతులను(ఎంపవర్) చేయడం. ఇదంతా అభివృ ద్ధి సోపానంలో భాగం. కానీ ఎవరో ఒకరు ఒక స్టే తీసుకొస్తే ఈ ప్రణాళిక అంతా తారుమారవుతుంది. అప్పటికే పెట్టిన పెట్టుబడిపై వడ్డీలు పెరుగుతాయి. ప్రాజెక్టు వ్యయం పెరుగుతుంది. ఫలితాలు తీసుకోవడంలో ఆలస్యమవుతుంది. విచిత్రమేమంటే కాం గ్రెస్ నాయకులు స్టేలతో ఎంత వికృ-తంగా ప్రవర్తిస్తా రో కరీంనగర్ నాయకుడొకరు చెప్పారు. గోదావరి ఒడ్డు కాంగ్రెస్ నాయకుడొకాయన ఫొటోగ్రాఫర్లను పెట్టి ఏ రోజుకారోజు ఫొటోలు తీయించి, కోర్టుకు పంపి, ఇగో చూశారా మీరు స్టే ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం పనులు జరిపిస్తోంది అని కోర్టు ధిక్కరణ కేసులు నడిపిస్తున్నారు. ఇది పైశాచికా-నందం కాక ఏమిటి?

ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు. దేశానికి మెతుకు పెట్టే మహా నిర్మాణాలు. రైతు-లకు పరిహారాలు, పునరావాసాల గురించి కొట్లాడటానికి ఈ కేసులకు సంబంధం లేదు. ఇది రాజకీయ నాయక త్వం విపరీత బుద్ధితో చేస్తున్న వికృత విన్యాసం. ఆంధ్ర ఆధిపత్య మీడియా ఇందుకు భిన్నంగా లేదు. వారికి ఇక్కడి చేపలపై కండ్ల మంట. ఇక్కడి ఆలయాలపై ఏడుపు. ఇక్కడ జరుగుతున్న మంచి ఏదీ వారి కి కనిపించదు. ఎన్నో ఏండ్లు చేపల వ్యాపారం చేసింది ఆంధ్ర ప్రాంత వ్యాపారులే. ఫార్మాలిన్ వాడింది కూడా వారే కావచ్చు. అసోంతో సహా ఈశాన్య రాష్ర్టాల్లో ఆ కారణంగానే చేపలు నిషేధించి ఉండ-వచ్చు. కానీ ఆ వార్తను తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ప్రచురించి, ఆంధ్రలో మినహాయించడం వెనుక ఉన్న దురుద్దేశం ఏమిటో అందరికీ అర్థం అవుతూనే ఉంది. ఆ పత్రికకు ఆంధ్రలో అంతా సస్యశ్యామలంగా, వైభవోపేతంగా, ఉజ్వలంగా ఎం దుకు కనిపిస్తున్నదో, తెలంగాణలోనే అస్తవ్యస్థంగా ఎందుకు కనిపిస్తున్నదో తెలుసుకోవడానికి కంటి డాక్టర్ అవసరం లేదు. అది కడుపు మంటతో వచ్చి న దృష్టిలోపం. ఈ పత్రికలకు ప్రభుత్వాలను పాదాక్రాంతం చేసుకొని, చెవులు పట్టి ఆడించడం చాలాకాలంగా అలవాటుగా మారింది. తెలంగాణలో ఇప్పుడు ఆ ఆటలు సాగడం లేదు. వీరికి జీ హుజూర్‌లు చెప్పే వ్యవస్థ లేదు. అందుకే జీర్ణిం-చుకోవడం కష్టంగా ఉన్నది. ఆ అజీర్తి నుంచే రోజూ ఏదో ఒకటి వండి వార్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే యథాతథవాద నాయకత్వం, మీడియా తెలంగాణ ప్రభుత్వం అప్పులు విపరీతంగా చేస్తున్నదని విమ-ర్శలు చేస్తున్నది. పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారానికి దిగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేస్తున్నమాట నిజ మే. వాస్తవానికి అప్పులు ఎవరికి పడితే వారికి ఇవ్వ రు. దివాళా కంపెనీలకు, ప్రభుత్వాలకు అప్పులు పుట్టవు. పరపతిలేని వారికి అప్పు పుట్టదు. ఆరోగ్యవంతమైన ప్రభు త్వం, ఆర్థిక వ్యవస్థ ఉన్నవారికే అప్పు పుడుతుంది. జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు పోటీపడి తెలంగాణ ప్రభుత్వానికి అప్పులు ఇస్తున్నాయంటే, మన ఆర్థిక నిర్వహణ మీద నమ్మకంతో. మనం ఎక్కడ పెట్టుబడి పెడుతున్నామో చూసి వారు ముందుకు వస్తున్నారు. షోకులు చేయడానికి మనం అప్పులు చేయడం లేదు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అప్పులన్నీ తెలంగాణలో మౌలిక సదు-పాయాల అభివృద్ధికోసం నేరుగా తెచ్చినవే. ఏవీ ప్రభు త్వ ఖజానాకు తెచ్చిన అప్పులు కావు. ప్రభుత్వం హామీ మేరకు మిషన్ భగీరథకు, కాళేశ్వరం ప్రాజెక్టు కు, ఇంకా ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. బడా పెట్టుబడిదారులకు రుణాలు ఇచ్చి, వారు సకాలంతో తిరిగి చెల్లిం-చక, మొండి బాకీలు పేరుకుపోయి అతలాకుతలమైన బ్యాంకులు ఉత్తమ ఆర్థిక నిర్వహణ కలిగిన రాష్ర్టాల కు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఇది ఆరోగ్యకరమైన పరిణా మం. మరో విషయం, నిన్నటిదాకా రైతులు అప్పులు చేసి, బోరువెనుక బోరు వేసి, అష్టకష్టాలపాలై, పంట లు చేతికి రాక, అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రైతాంగాన్ని ఈ నీటి -బాధల నుంచి విముక్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే అప్పు చేస్తున్నది. ఇంతకాలం కరెంటు కోసం, బోరు బావుల కోసం రైతులు చేసిన, చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ అప్పులు మొత్తం లెక్కతీయండి.

రాష్ట్ర ప్రజలంతా చేసే అప్పుతో పోల్చితే ప్రభుత్వం చేసే అప్పు చాలా స్వల్పం. ఈ అప్పు కూడా ప్రపంచ బ్యాంకు వద్ద తేవడం లేదు. ఏ షరతులకూ తలొగ్గని రుణ సేకరణ ఇది. కానీ రంధ్రాన్వేషకులకు ఇందులో కూడా ఘోరాలు నేరాలు కనిపిస్తున్నాయి. వీళ్లకు మంచి ఆలోచనలు రావు. ఎవరికైనా వస్తే సహించలేరు. ఓర్వ-లేరు. యాభైయేండ్లుగా నష్టపోయిన రంగాల్లో వేగంగా ఫలితాలు తీసుకోవాలంటే యుద్ధంలా పనిచేస్తే తప్ప సాధ్యం కాదు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం యుద్ధమే చేస్తున్నది. సుమారు 1000 టీఎంసీల గోదావరి నీళ్లు, 400 టీఎంసీల కృష్ణా నీళ్లు తెలంగా ణ హక్కు. ఇందులో ఇప్పుడు ఉప-యోగించుకుంటున్న నీరు సుమారు 300 టీఎంసీలకు మించదు. నీటి హక్కును సాధించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో అనేక ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తిచేసే దిశగా అహోరాత్రాలు శ్రమి-స్తున్నది.  ఇన్ని నీళ్లు తెలంగాణ బీళ్లకు మళ్లిన రోజు ఈ శకున పక్షులేవీ మనకు కనిపించవు. కోటి ఎకరా-లకు నీరు లభి స్తే పండే పంట ఎంత? దానినుంచి వచ్చే ఆదాయం ఎంత? సమాజం ఎంత గతిశీలంగా మారుతుంది? ఇది అర్థమైతే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పని అర్థమవుతుంది. ఇటువంటివారికి అది అర్థం కాకపోయినా తెలంగాణ ప్రజలకు వచ్చే నష్టం లేదు.

kattashekar@gmail.com

పెప్పర్‌స్ప్రే ప్రజాస్వామ్యం

IMG_2681

ఆంధ్రా థాట్ పోలీసింగ్ దారుణం

పార్లమెంటు చరిత్రలో మరో సంచలనమట. సోమవారం రాజ్యసభలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి చర్చను కొనసాగించారు సభాధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు. పిల్లిమొగ్గలకు, అప్రజాస్వామిక ప్రవర్తనకు ప్రసిద్ధిగాంచిన ఆంధ్రా నాయకత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పార్లమెంటుకు కళంకం అంటగడుతున్నది. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి, అప్రజాస్వామికంగా విభజన చట్టాన్ని ఆమోదించారని ఆంధ్ర నాయకులు ఒక పచ్చి అబద్ధపు ప్రచారాన్ని పదేపదే వల్లెవేస్తున్నారు. నిజానికి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించింది ఆంధ్ర ఎంపీలు. పెప్పర్ స్ప్రేలు తెచ్చి, సభకు భంగం కలిగించాలని చూశారు. వెల్‌లోకి దూసుకొచ్చి సభా కార్యక్రమాలు జరుగకుండా అడ్డుకోవాలని చూశారు. సభాధ్యక్షులపై కాగితాలు, పుస్తకాలు విసిరారు.

అధికార కాంగ్రెస్, బీజేపీలతో పాటు మరో 30కి పైగా పార్టీల మద్దతుతో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు పట్టుమని పదిహేను మంది ఎంపీలు మొత్తం సభను అడ్డుకోవాలని చూడడం ప్రజాస్వామికమా? టీడీపీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా లేఖ ఇచ్చి, తీరా నిర్ణయం జరిగాక అడ్డుకోవాలని ప్రయత్నించడం నీతమంతమా? అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చివరిదాకా చెబుతూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు నాలిక తిప్పేసి, విభజన చట్టాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామికమా? ఆంధ్ర, టీడీపీ ఎంపీలు ఇంత క్రూరంగా వ్యవహరించారు కాబట్టే ఆ రోజు పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయాల్సి వచ్చింది. పెప్పర్ స్ప్రే ప్రయోగించి సభా కార్యకలాపాలను ఆపాలని చూసినవారు కుట్రదారులు. ఆ ఘటన పార్లమెంటు చరిత్రలో మాయనిమచ్చ.

అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామ్యంగా, అప్రజస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంగా నమ్మించడంలో, ప్రచారం చేయడంలో ఆంధ్ర మీడియా, ఆంధ్ర నాయకత్వం సిద్ధహస్తులు. ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని నిలువునా చీల్చిన నాదెండ్ల భాస్కర్‌రావు అప్రజాస్వామిక వాది ఎలా అయ్యాడు? అదే ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, ఆయన గుండెపగిలి చావడానికి కారణమైనవాడు ప్రజాస్వామ్య పరిరక్షకుడు ఎలా అయ్యాడు? మీ థాట్ పోలీసింగుకు అంతే లేదా?

నమ్మితే నట్టేట వదిలేస్తారు

img_4285img_4885

 

చంద్రబాబు, నరేంద్రమోడి సేమ్ టు సేమ్. పోయిన ఎన్నికల్లో ఇద్దరు కట్టగట్టుకుని రాష్ట్ర విభజనపై విషం చిమ్మారు. రాష్ర్టాన్ని విభజించి తల్లిని చంపి పిల్లను బయటికి తీశారని చెప్పింది నరేంద్ర మోడీనే. అప్పుడు ఓట్లకోసం అది అవసరం అయింది. ఇప్పుడు చంద్రబాబు చెల్లని కాసు అయిపోయారు. ఆయనతో ప్రయోజనం లేదు. చంద్రబాబుకు కూడా మోడీతో అవసరం తీరిపోయింది.

చంద్రబాబుకు ఒక పాజిటివ్ వాతావరణాన్ని నిర్మించుకుని గెలిచే తెలివి తేటలు ఎప్పుడూ లేవు. ఎవరో ఒకరిని బద్నాం చేసి, జనాన్ని మాయలో ముంచి గెలుపొందాలన్నది ఆయన సూత్రం. తిట్టడానికి ఒక బకరా, పొత్తుకోసం మరో బకరా కావాలి. అందుకే ప్రతిసారీ పొత్తు భాగస్వామిని మార్చాల్సిందే. ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిందే.

కొందరు ఆయనను పరాన్నజీవి అనేది అందుకే. స్వయంప్రకాశం కలిగిన నాయకుడు కాదు. పక్కనో సూర్యుడు ఉండాలి. ఆంధ్రకు అదే శాపం అవుతున్నది. కొట్లాటలో నిజాయితీ లేకపోవడమే ఆంధ్ర సమస్యలకు కారణం.

నరేంద్రమోడీ కూడా ఇప్పటికీ విమర్శలమీదే బతకాలని చూస్తున్నారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి కూడా ఇప్పటికీ ఆయన తిట్టులాభంపైనే ఆధారపడుతున్నారు. పాత భాగస్వాములను వదిలేస్తున్నారు. కొత్త భాగస్వాములకోసం గాలాలు వేస్తున్నారు. ఈయన ఎవరినయినా ఉపయోగం లేదంటే ఇట్టే వదిలేస్తారు. పార్టీలనయినా, సొంత పార్టీ నాయకులనయినా. ఇద్దరినీ నమ్మడానికి వీలులేదు.

చంద్రబాబు దివాళాకోరుతనం

img_4885-1

రాజకీయ అస్తిత్వంకోసం, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆంధ్ర ప్రజానీకాన్ని పదేపదే మోసం చేయడంకోసం టీడీపీ రాష్ట్ర విభజన అంశాన్ని తప్పుదోవపట్టిస్తున్నది. రాష్ట్ర విభజన చేయాలంటూ స్వయంగా లేఖలు ఇచ్చి మాట మార్చిన ఆ పార్టీ విభజన చట్టం ఆమోదం పొందకుండా చూడడానికి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించింది. ఆంధ్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా వారి బాటలోనే నడిచింది. ఆంధ్రకు ఏమి కావాలో అప్పుడే అడగాల్సింది. కానీ జనాన్ని మోసం చేయడంకోసం విభజనను వ్యతిరేకిస్తున్నట్టు నటించాయి. ఒక్కటంటే ఒక్క డిమాండు ఆ రోజు ముందుకు తేలేదు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు కూడా వారి బుద్ధి మారలేదు. తెలంగాణపై పడి ఏడ్వడం తప్ప ఆంధ్రకు న్యాయమైన డిమాండ్లను సాధించే చిత్తశుద్ధిలేదు. భావోద్వేగాలు రెచ్చగొట్టి వచ్చే ఎన్నికల్లో మరోసారి జనాన్ని ఎలా వంచించాలన్నదే వారి ఏకైక లక్ష్యంగా కనిపిస్తున్నది.

రాష్ర్టాన్ని అప్రజాస్వామికంగా విభజించారట. విభజన వల్ల తెలంగాణ లాభపడిందట. ఆంధ్ర నష్టపోయిందట. గల్లా జయదేవ్ అనే టీడీపీ ఎంపీ ఇవ్వాళ పార్లమెంటు సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేశారు. నిజమే వెనకటికి ఓట్లకోసం నరేంద్ర మోడీ కూడా విభజనకు వ్యతిరేకంగా మాట్లాడిన మాట వాస్తవం. తెలంగాణకు ఆంధ్ర ఆస్తులు ఏమైనా రాసిస్తే తెలంగాణ లాభపడిందా? తెలంగాణకు ఆంధ్ర వనరులు ఏమైనా మిగిల్చి పోయిందా? ప్రజాస్వామ్యం లేకుండానే, మెజారిటీ పార్లమెంటు సభ్యుల మద్దతు లేకుండా పార్లమెంటులో విభజన చట్టం ఆమోదం పొందిందా? ఎప్పటికి మారతారు? తెలంగాణ తన స్వశక్తితో, సొంతవనరులతో, సొంత నాయకత్వ పటిమతో లాభపడింది. తెలంగాణ వనరులతో సోకు చేసిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు సొంత వనరులతో, స్వశక్తితో ఏలుకోవలసి వచ్చేసరికి ఉక్రోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణపైనే నెపం వేసి బతకాలని చూస్తున్నారు.

ఆంధ్ర నాయకత్వ స్థానంలో చంద్రబాబు బదులు కేసీఆర్ ఉంటే ఈపాటికి రాజధాని నిర్మాణం జరిగి పాతమరుపు అయిపోయేదని ఒక ఆంధ్ర జర్నలిస్టు మిత్రుడు అన్నారు. అమరావతి నిర్మాణం అప్పుడే మొదలు పెట్టి ఉంటే ఈ పాటికి రాష్ట్రం స్థిరపడి ఉండేది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ విమనాశ్రయాలు, చత్తీస్‌గడ్ కొత్తరాజధాని, ఇంకా వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను, అనేక భారీభారీ ప్రాజెక్టులను నిర్మించిన చరిత్ర ఘనత ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లదే. వారు ఏ ప్రాజెక్టు నిర్మాణంలోనూ జాప్యం చేయలేదు. సమస్యంతా చంద్రబాబు బుర్రలోనే ఉంది. ఆయన దృష్టిలోపానిదే అసలు సమస్య. పని మొదలు పెడితే ఈసరికి అన్నీ పూర్తయ్యేవి. చంద్రబాబు ప్రపంచబ్యాంకు డిక్షనరీ నుంచి రోజుకో కొత్తపదం పట్టుకుని జనానికి కబుర్లు చెప్పడం తప్ప వాస్తవిక అభివృద్ధి సాధించడంలో విఫలమవుతున్నారు. తన వైఫల్యాన్ని అటు కేంద్రం మీదకు, ఇటు తెలంగాణ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాలు కొంతకాలం కొందరని మోసం చేయగలవు. ఎల్లకాలం అందరినీ మోసం చేయలేవు. చంద్రబాబు బృందం ఇప్పటికైనా ఈ వాస్తవాన్ని గుర్తిస్తే ఆంధ్ర బాగుపడుతుంది.

An old memory

As an activist of leftist student movement fought against toppling of NTR government by Nadendla Bhaskar Rao in September, 1984.  While Picketing at Nalgonda District Collectorate main gate I was arrested along with all party leaders.

ముసుగువీరుల అసలు లక్ష్యం

 

image

సైంధవులను, శిఖండులను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తేనే సమస్య. ముసుగు యుద్ధాలతోనే ప్రమాదం. కర్ణాటక, మహారాష్ట్రలో ఏదో ఒక సేన ఏర్పాటు చేసుకొని ప్రగతిశీల శక్తులపై మారణకాండ సాగించిన ముసుగు శక్తుల తరహాలో ఇక్కడ కూడా అటువంటి ప్రమాదం తలెత్తగల అవకాశాలపై తెలంగాణ మెలకువతో ఉండాలి. ఆధ్యాత్మికం ముసుగులో, మీడియా ముసుగులో, ఇంకా సినిమా ముసుగులో ఇక్కడ విరజిమ్ముతున్న కాలుష్య కారకాలు తెలంగాణ సమాజానికి నష్టదాయకం. తెలంగాణ సమాజం ఈ శక్తుల పట్ల ఇప్పటికీ ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆదమరిచి ఉంటే తెలంగాణను ఆగం పట్టించడానికి, అస్థిరపర్చడానికి ఈ శక్తులు కూడగట్టుకొని విరుచుకుపడతాయి. 

కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం. కనిపె ట్టి కాపాడుకోకపోతే ఈన గాచి నక్కలపాలు చేసినట్టవుతుంది. స్వ రాష్ట్రంలో కూడా ఈ కుట్రలేంది? ఓ చానెలో డు ఆయనెవరినో లైవ్‌లో పెట్టి రాముడిని తిట్టిస్తాడు. మరో చానెలోడు ఇంకో రాజకీయ స్వామీజీని సీనులోకి తీసుకొచ్చి హాట్ రాముడిని తిడుతారా. నేను యాత్ర చేస్తా అని బయ లుదేరుతాడు. భావోద్వేగాలు రెచ్చగొడుతారు. అసలు వీళ్లెవరు? ఒకాయనది చిత్తూరు. ఇంకొకాయనది కాకినాడ. వీళ్లకో రాష్ట్రం ఉన్నది. అక్కడా దేవుళ్లున్నారు. పంచాయితీలున్నాయి. కానీ ఇక్కడే పీఠం వేసుకొని ఎందుకు రభస చేస్తున్నారు? వీళ్లు పాత్రధారులు సరే. వీరి వెనుక సూత్రధారులెవరు? వీరి లక్ష్యం ఏమి టి? అది గుర్తించి, ఈ శక్తుల తెరవెనుక భాగోతాలను బట్టబయలు చేయకపోతే అభివృ ద్ధి పట్టాలపై నల్లేరుపై నడకలా సాగిపోతున్న తెలంగాణ మళ్లీ సంక్షోభాల్లో పడుతుంది-తెలంగాణ నుంచి ఇద్దరు అరాచకవాదుల బహిష్కరణ నేపథ్యంలో ఓ పెద్దాయన వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ఇదిప్పుడు చాలామంది వేస్తున్న ప్రశ్న. అసలు ఈ స్వామీజీ బాసర నుంచి భద్రాచలం పాదయాత్ర ఎందుకు చేయతలపెట్టినట్టు. బెజవాడ నుంచి సింహాచలమో, శ్రీకూర్మమో చేపట్టవచ్చు కదా? ద్రాక్షారామం నుంచి కాణిపాకం దాకా చేపట్టవ చ్చు కదా? కనకదుర్గమ్మ నుంచి వేంకటేశ్వరస్వామి వరకు చేయవచ్చు కదా? ఆలయా ల్లో అన్యమత ప్రచారాలు, క్షుద్రపూజలు.. ఇంకా ఏవేవో వివాదాలు అక్కడే నడుస్తున్నా యి కదా? సామాజిక మాధ్యమాల్లో బుద్ధిజీవులు వేస్తున్న ప్రశ్నలివి. విచిత్రమేమంటే హైదరాబాద్‌లో తిట్టుకున్న పాత్రధారులిద్దరూ ఆంధ్రాలో ఒక్కటైపోయారు. ఈయన ఆయనను ఎలా బహిష్కరిస్తారని ప్రశ్నిస్తే ఆయన ఈయనను వాల్మీకి అని వర్ణిస్తారు. దీనివెనుక ఎక్కువ ఆలోచించాల్సిన పనిలేదు. భావ కాలుష్యాన్ని వ్యాప్తిచేసి తెలంగాణ ప్రజలను అయోమయంలో పడేయాలని, భావోద్వేగాల వైపు నడిపించాలని యోచిస్తున్న ఒకనాటి తెలంగాణ వ్యతిరేక మీడియా, సంస్థలు, నాయకులు కలిసి ఆడుతున్న కుట్రల నాటకం ఇది అని ఆ ఓ రాజకీయ విశ్లేషకుడు చెప్పారు.

సమస్య ఇంతలోతుగా ఉందా? అంటే తరచి చూస్తే తెలుస్తుంది. నిజానికి తెలంగాణ లో ఆధ్యాత్మిక శూన్యత ఉందా? ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందరినీ మించిన ఆధ్యాత్మిక వాది. ఆయన స్వధర్మాన్ని ఎంత అంకితభావంతో పాటిస్తారో, పరధర్మాన్ని అంతే చిత్తశుద్ధితో ఆదరిస్తారు. ఆయనను చూసి నేర్చుకోండి అని ఒక ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడే బీజేపీ నేతలకు చెప్పినట్టు ఆ పార్టీ ఆంతరంగికుడు ఒకరు మన ఎంపీతో చెప్పారు. అసాధారణ రీతిలో యజ్ఞయాగాదుల నిర్వహణ, ఆలయాల పునరుద్ధరణ, ఆధ్యాత్మిక పోషణ విషయంలో కేసీఆర్‌ను మించినవారు లేరు. ఇక్కడే కాదు ఎక్కడా ఏ ముఖ్యమంత్రి తన స్వధర్మాన్ని ఇంత ధైర్యంగా పాటించిన, ప్రదర్శించిన సందర్భం లేదు. బీజే పీ, అనేకమంది స్వామీజీలు కొన్ని దశాబ్దాలుగా రాముడి ఆలయ నిర్మాణం పేరు చెప్పి ఓట్లు కోట్లు ఇటుకలు సేకరించారు. రామాలయ నిర్మాణాన్ని ఒక రాజకీయ అస్త్రంగా మాత్రమే దానిని సజీవంగా ఉంచుతూ వచ్చారు. కేసీఆర్ ముందుగా ఏమీ చెప్పకుండానే, యాదాద్రి ఆలయాన్ని ఒక అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. వేద పాఠశాలలను పునరుద్ధరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తున్నది. అంతేకాదు ఇక్కడ స్వామీజీలు, ఆధ్యాత్మిక గురువులు చాలామంది ఉన్నారు. చినజీయర్ స్వామీజీ దేశంలోనే అతిపెద్ద రామానుజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఆ ప్రాంగణంలో శ్రీమహావిష్ణువు అన్ని రూపాలను ఒకేచోట ఆవిష్కరించడానికి అహరహం కృషి చేస్తున్నారు. వీధిపోరాటాలకు దిగి న స్వామీజీ ఆయన కన్న గొప్ప ఆధ్యాత్మిక బోధకు డా? హైదరాబాద్, మొత్తంగా తెలంగాణ గంగా-యుమునా సమ్మిళిత సంస్కృతికి చిరునామా. ఇక్క డ ఇస్లాం, క్రైస్తవ, జైన, బౌద్ధ, సిక్కు, యూదు మతానుయాయులతోపాటు ప్రపంచంలోని అన్ని మతా లు, శాఖలకు అనుచరులు, శిష్యులు ఉన్నారు. ఆలయాలు ఉన్నాయి. మందిరాలు ఉన్నాయి. ఎవరి నమ్మకాలు వారివి. అందరూ అందరినీ గౌరవిస్తూ సాఫీగా జీవితం సాగిస్తున్నారు. సమస్యలు వచ్చేద ల్లా రాజకీయ లక్ష్యాలతో మతాన్ని వాడుకోవాలని చూసినప్పుడే. రాముడి రక్షణ పేరుతో తెలంగాణలో తిరిగిన స్వామీజీ రాజకీయ లక్ష్యాలతోనే మత ప్రచారానికి దిగారని ఆయన మాటలు, చేష్టలు చూస్తే అర్థమవుతుంది.

తెలంగాణ ఏర్పడుతుందనీ, అది ఒక సమర్థవం తమైన, ప్రగతిశీల రాష్ట్రంగా ఎదుగుతుందనీ, ఒడిదుడు కులు లేని ప్రయాణం సాగిస్తుందని ఊహించని తెలంగాణ వ్యతిరేక ఆంధ్ర ఆధిపత్య మీడియా, వారి ని అనుసరించే నాయకులు, పార్టీలు అసూయాద్వేషాలతో రగిలిపోతున్నాయి. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని, అభివృద్ధిని కూడా పోరాటంలాగా ముందు కు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నాలుగేండ్లలో సాధించిన ప్రాజెక్టుల ప్రగతి అందు కు సాక్ష్యం. నీటిపారుదల ఇంజినీర్లు మూడు షిఫ్టుల్లో పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉందా? సుమారుగా 30 వేల మంది కార్మికులను యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులపై మోహరించి పనిచేయించిన సందర్భం ఎప్పుడైనా ఉందా? ఎమ్మెల్యేలు, మంత్రు లు నియోజకవర్గాల్లో, ప్రాజెక్టుల వద్ద ఇంతగా కాపలాకాసిన సందర్భం ఒక్కటి చూపించగలరా? గ్రామసీమలకు వేల కోట్ల రూపాయల సంపద పంపిణీ కావ డం ఎప్పుడైనా జరిగిందా? రాష్ట్రం వరుసగా ఇన్ని అవార్డులు, రివార్డులు అందుకున్న చరిత్ర ఉందా? తెలంగాణ ఏర్పడితే ఆదాయం తగ్గిపోతుందని, అడుక్కుతినాల్సి వస్తుందని, అంధకారం అవుతుందని గేలి చేసిన మీడియా మేధావులు, రాజకీయ నాయకులు, పార్టీలు ఇప్పుడు ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎంత తేడా అంటే- 2013-14లో 23 జిల్లాలకు సమైక్య రాష్ట్రం 1.61 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తే, 2018-19లో తెలంగాణ రాష్ట్రమే 1.75 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకుంది. ఒక్క 2017-18 ఆర్థిక సంవత్సరంలోనే నీటి పారుదల ప్రాజెక్టుల పై 25,291 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఆరు దశాబ్దాల సమైక్య పాలనలో నీటి పారుదల ప్రాజెక్టులపై ఒక సంవత్సరకాలంలో గరిష్ఠంగా ఖర్చుచేసింది 11,000 కోట్లు మాత్రమే. ఆగమవుతుందని భావించిన తెలంగాణ, తిరిగి తమ కాళ్లవద్దకు వస్తుందని భావించిన తెలంగాణ తమకు అందనంత ఎత్తుకు ఎదుగడాన్ని పైన పేర్కొన్న వ్యవస్థలేవీ సహించలేకపోతున్నాయి. అందుకే ఎక్కడ వీలైతే అక్కడలేని మచ్చ లు వెతుకడానికి ప్రయత్నిస్తున్నాయి. ఏదో ఒకటి చేయాలి. తంపులు పెట్టాలి. వివాదాలు చెలరేగాలి.

తెలంగాణ సమాజం ఎంత మంచిదంటే, ఇక్కడ ఇప్పటికీ అన్ని భావజాలాలు వర్ధిల్లుతాయి. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తుదికంటా వ్యతిరేకించిన పార్టీ, తెలంగాణకు వ్యతిరేకంగా ఇప్పటికీ కుట్రలు చేస్తున్న పార్టీ ఇంకా ఇక్కడ బతికే ఉంటాయి. ఇంకా ఆ జెండాలు, ఎజెండాలు మోసే నాయకులు ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతుంటారు. ఆంధ్రా మీడియా వారికి ఉచితాసనాలు వేసి ఇప్పటికీ టీవీల్లో కూర్చోపెట్టి తెలంగాణకు సుద్దులు చెప్పిస్తూ ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన మూన్నాళ్లకే కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా ఏడు మండలాలను లాగి ఆంధ్ర ప్రాంతాని కి అప్పగించిన పార్టీ, విభజనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఒక్కరోజూ సహకరించని పార్టీ, మతం తప్ప జనం పట్టని పార్టీ ఇక్కడ నోరేసుకొని ఊళ్లమీద పడుతుంది. రాజకీయ జెండా లు, ఎజెండాలు బాహాటంగా ఉంటే ఎవరు ఎవరితోనైనా పోరాటం చేయవచ్చు. ప్రజాస్వామ్యంలో అది సహజమే. సైంధవులను, శిఖండులను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తేనే సమస్య. ముసుగు యుద్ధాలతోనే ప్రమాదం. కర్ణాటక, మహారాష్ట్రలో ఏదో ఒక సేన ఏర్పాటు చేసుకొని ప్రగతిశీల శక్తులపై మారణకాండ సాగించిన ముసుగు శక్తుల తరహాలో ఇక్కడ కూడా అటువంటి ప్రమాదం తలెత్తగల అవకాశాలపై తెలంగాణ మెలకువతో ఉండాలి. ఆధ్యాత్మికం ముసుగులో, మీడియా ముసుగులో, ఇంకా సినిమా ముసుగులో ఇక్కడ విరజిమ్ముతున్న కాలు ష్య కారకాలు తెలంగాణ సమాజానికి నష్టదాయ కం. తెలంగాణ సమాజం ఈ శక్తుల పట్ల ఇప్పటికీ ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్న ది. ఆదమరిచి ఉంటే తెలంగాణను ఆగం పట్టించడానికి, అస్థిరపర్చడానికి ఈ శక్తులు కూడగట్టుకొని విరుచుకుపడతాయి. తెలంగాణను ప్రగతి పట్టాల నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తాయి.
kattashekar@gmail.com

ఆయుధం కాదు భస్మాసుర హస్తం

 

girl with raised hands and broken chains

 

సమాజాన్ని సోషల్ మీడియా భూతం ఆవరిస్తోందా? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సరే.. భావాలను, వ్యక్తులను, గోప్యత ను, మొత్తంగా కోట్లాది ప్రజల మెదళ్లను అన్యాక్రాంతం చేస్తున్న దాడి భయపెడుతున్నది. కనిపించే, మాట్లాడే సామాజిక జీవనం నుంచి కనిపించని, మాట్లాడని యంత్ర భూత జీవితంలోకి మనిషి జారుకుంటున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద సమాచార, శోధనవాహిక ఇంజినీర్ల బృందం తో ఇటీవల ఒక సమావేశం జరిగింది. తమ వాహిక రూపొందించిన విశ్లేషణాత్మక సమాచా రం వారు ఈ సమావేశంలో వెల్లడించారు. ఆ సమాచారంలో వెల్లడించిన విషయాలు వారికి చాలా గొప్ప. వారు అలాగే చెప్పారు కూడా. సామాజిక దృక్పథంతో చూసేవారికి మాత్రం విస్మయం కలిగిస్తాయి. జియో ఫోన్ వచ్చిన తర్వాత దేశంలో ఇంటర్నెట్ డేటా విప్లవం వచ్చింది. అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఎక్కడినుంచి ఏ సమాచారమైన స్వీకరించే, పంపుకునే స్వేచ్ఛ లభించింది. అంతవరకు బాగానే ఉంది. సోషల్ మీడియాను జనం సగటున రోజుకు ఎంతసేపు చూస్తున్నారో సంబంధిత ఇంజినీర్ చెప్పినప్పుడు ఆశ్చ ర్యం వేసింది. ఒక్కోమనిషి రోజుకు సగటున మూడు గంటలు సోషల్ మీడియాపై వెచ్చిస్తున్నారని, అటువంటివారు దేశంలో 40 కోట్లకు చేరారని ఆయన వివరించారు. అంటే రోజూ 120 కోట్ల పని గంటలు జనం సోషల్ మీడియాలో గడుపుతున్నారని అర్థమవుతున్నది. ఇది ఉత్పాదక సమయం కాదు. వినియోగ సమయం కాదు. వినోద సమయం లేక ఉబుసుపోకకు వెచ్చించే సమయం. కమ్యూనికేషన్ విప్లవం ఎంత మేలు చేస్తున్నదో అంత చెడు చేస్తున్నదేమోనన్న ఆందోళన నిపుణుల్లో వ్యక్తం అవుతున్నది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో 4జీ సేవలు మాత్రమే, అందులో పరిమిత ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

త్వరలో ఇప్పుడున్న 4జీ వేగం కంటే 100 రెట్ల వేగంతో పనిచేసే 5జీ రాబోతున్నదట. అంటే మరింత వేగంగా విడియోలు, ఫొటోలు, సమాచారం పంపిణీ చేసుకోవచ్చు. వీక్షించవచ్చు. మంచి సమాచారం పంపిణీ అయితే ఇబ్బంది లేదు. కానీ పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈ సమాచారం పంపిణీ అయితే సమాజంలో అశాంతి, నేరాలు, సంక్షోభం తలెత్తుతాయి. ప్రజలు విచక్షణతో స్పందించినంత కాలం ఇబ్బంది ఉండదు. కానీ ఉన్మాదపూరిత ప్రచారాలు బయటికి వస్తే ఏం జరుగుతున్నదో మత ఘర్షణలు, గో రక్షకుల నేరాలు, పిల్లలను ఎత్తుకుపోయేవారిగా అనుమానించి జరుగుతున్న హత్యలు, వైవాహిక సంబంధాల్లో జరుగుతున్న దారుణాలు సమాజాన్ని హెచ్చరిస్తున్నాయి. వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే దారుణాతి దారుణమైన ప్రచారాలకు కూడా సోషల్ మీడియా వేదికయింది. ఫేక్ న్యూస్‌కు సోషల్ మీడియా అడ్డాగా మారింది. ఈ ఫేక్ న్యూస్‌ను నమ్మి కొన్నిసార్లు ప్రధాన స్రవంతి మీడియా కూడా అవే వార్తలుగా ప్రచురిస్తున్నది. పబ్లిష్ అండ్ ఫినిష్ అన్న భావన సర్వత్రా ప్రబలుతున్నది. ఇది ప్రమాదకరమైన ధోరణి. అసత్యాలు, అర్థసత్యాలు, వక్రీకరణలు, తప్పుడు సమాచారాలు వ్యక్తులను, వ్యవస్థలను గెలువడానికి ఒక సారి ఉపయోగపడవచ్చు. కానీ అది ఎక్కువకాలం నిలువదు. ఫేక్ బుడగ తొందరగానే బద్దలవుతుంది. సత్యంపై నమ్మకం లేనివారు చేసే పని ఇది. దొంగదారిలో యుద్ధాన్ని గెలువాలనుకునే వారు చేసే అధర్మ యుద్ధం ఇది. దేశంలో ఈ తరహా యుద్ధాన్ని బీజేపీ ప్రారంభించింది. చరిత్రకు సంబంధించి పచ్చి అబద్ధాలను ప్రచా రం చేయడం, చరిత్రకు మసి బూయడం, తప్పుడు సమాచారం, తప్పుడు లెక్కలు ప్రచారం చేయడం వారికి బాగా అలవాటయింది.

అబద్ధపు యుద్ధాన్ని చేసే భారీ యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి దేశంలో సమాచార కాలుష్యాన్ని, జ్ఞాన కాలుష్యాన్ని సృష్టించ డం బీజేపీ సాధించిన విజయం. అదిప్పుడు ఇంకా ఇంకా పాతాళానికి చేరుతున్నది. స్వయంగా ప్రధాని చారిత్రక అబద్ధాలు చెబుతుంటారు. ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చాలా గంభీర స్వరంతో చెబుతుంటా రు. బీజేపీ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని చేసిన ప్రచార, ప్రసారయుద్ధాల గురించి ఆ పార్టీ ఐటీ విభా గం నుంచి బయటికి వచ్చిన యువకుడే కుండబద్ధలు కొట్టారు. రాంమాధవ్ అనుచరునిగా ఈశాన్య రాష్ర్టా ల్లో తాము చేసిన ఘన కార్యాలను గురించి ఆయన ఇటీవల మీడియాకు చెప్పారు. అవే ఎత్తుగడలను తెలంగాణలో కూడా బీజేపీ నాయకత్వం అమలు చేస్తున్నది. మేధావి అని, పెద్ద నాయకుడని, వ్యూహక ర్త అని పేరున్న రాంమాధవ్ వంటి నాయకుడు తెలంగాణ నాయకుల మగతనం గురించి మాట్లాడాడంటే బీజేపీ నాయకుల అసలు స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ తెలంగాణ నాయకత్వం కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నది. పెద్దపెద్ద పారిశ్రామిక సామ్రాజ్యాలకు, వ్యాపార వర్గాలకు ఊడిగం చేస్తున్నపార్టీ, భూస్వామ్య భావజాలంలో తననుతాను బం ధించుకున్న బీజేపీ, ప్రభుత్వాన్ని, వేల కోట్ల రూపాయ ల ఆదాయాన్ని పల్లెమార్గం పట్టించిన తెలంగాణ ముఖ్యమంత్రికి గడీ పాలనను ఆపాదిస్తున్నది. ఎవరిది గడీల భావజాలం? ఎవరిది జనకేంద్రక భావజాలం? బీజేపీ నేతల స్థాయిని వర్ణించడానికి నేలబారు అనే పదం చాలదు. పాతాళ బారు అంటే వీరికి సరిపోతుం ది. విషాదం ఏమంటే కాంగ్రెస్ కూడా అదే బాటలో పయనిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పాటుచేసుకున్న యంత్రాంగం ఆ పార్టీ అజ్ఞానాన్ని మరింత బయటపెడుతున్నది.

ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేరు మీద బీజేపీ నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ బొమ్మ పెట్టి బాబూ జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించారు. అధికారాన్ని కోల్పోయి, దానిని తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆత్రంలో అబద్ధా ల ప్రచారానికి దిగుతున్నారు. రైతు రుణమాఫీ, రైతు బంధుపై ఆ పార్టీ సోషల్ మీడియాలో, బయటా చేస్తు న్న ప్రచారం చూస్తుంటే విచిత్రం అనిపిస్తున్నది. రైతు కు కనీసం సబ్సిడీలు కూడా మిగిల్చని చరిత్ర కాంగ్రెస్‌ది. కరెంటివ్వలేదు. విత్తనాలివ్వలేదు. ఎరువులివ్వలే దు. సబ్‌స్టేషన్లపై దాడులు, రైతులపై కేసులు అప్పట్లో నిత్యకృత్యం. విత్తనాలు, ఎరువుల కోసం చెప్పులు క్యూలో పెట్టుకొని రోజుల తరబడి ఎదురు చూడవలసిన దుస్థితి. ఇన్నేండ్ల చరిత్రలో కాంగ్రెస్ ఏనాడైనా రైతుకు రూపాయి అయినా రుణమాఫీ చేసిందా? కౌలు రైతుల సంగతి దేవుడెరుగు, అసలు రైతులపై ఎన్నడైనా కనికరం చూపించిందా? వేల కోట్ల రూపాయలు ఎగవేసిన పారిశ్రామికవేత్తలకు ఎంపీ టికెట్లు ఇచ్చి, యాభై వేలు అప్పు చెల్లించలేకపోయిన రైతుల చెంబు తపేలా, ఇంటి తలుపులు జప్తు చేసుకుపోయిన చరిత్ర కాంగ్రెస్‌ది. ఎంతో దూరం ఎందుకు? కర్ణాటక లో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారం వచ్చాక నాలుగు వాయిదాల్లో చేస్తామని ప్రకటించారు. అదే తెలంగాణలో మాత్రం ఒకేసారి రుణమాఫీ చేయలేదెందుకని ప్రశ్నిస్తుంటారు. అక్కడో రూలు ఇక్కడో రూలా? అసలు కాంగ్రెస్‌కు ఒక విధా నం అంటూ ఉందా? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చెప్పని పథకాలు కూడా అనేకం అమలు చేసింది.

గ్రామీణ జీవితంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రైతులకు, చేతివృత్తుల వారికి ప్రభు త్వం అండగా నిలబడి అన్నిరకాల సహాయం అందిస్తున్నది. రైతులు దేనికోసమూ ఎదురుచూడని రోజు లు తీసుకువచ్చింది. అన్నింటికీ మించి 45 లక్షల మం ది రైతులకు ఎకరాకు నాలుగువేల చొప్పున పంటసా యం అందించింది. మొత్తం రైతాంగానికి రైతు బీమా ను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ నాయకత్వానికి ఇప్పుడు కోటలు, గడీలు లేవు కానీ వారి మనస్తత్వం కోటలను, గడీలను దాటి రాలేదు. ఇంకా భూస్వామ్య మనస్తత్వంతోనే సమాజాన్ని, రాజకీయాలను చూస్తున్నారు. అదే బుద్ధితోనే సోషల్ మీడియాలో, బయటా అబద్ధాలు గుప్పిస్తున్నారు. అధికారం కోసం షార్ట్‌కట్‌లు వెతుకుతున్నారు. అయి నా వారిని జనం నమ్మడం లేదు. ఎన్నికలు సమీపించేకొద్దీ సమాచార కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌పై జరిగిన మార్ఫింగ్ దాడి అటువంటి దే. సుమన్ తన భార్య, పిల్లలతో దిగిన ఫొటోలో భార్య, బాబు ఫొటోలను ఫొటోషాప్‌లో తీసేసి, మరో అమ్మాయి ఫొటోను చేర్చి, లైంగిక వేధింపుల పేరిట సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టారు. వ్యక్తుల, నాయకుల జీవితాలపై ఇంతకంటే దుర్మార్గమైన దాడి లేదు. కుంభకోణాలను, అవినీతి ఆరోపణలనూ, నేర చరిత్ర అనీ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు ప్రారంభించారు. పత్రికల్లో ఇటువంటి ఆరోపణలు చేస్తే న్యాయ సమీక్షకు నిలబడవలసి వస్తుంది.

అందుకే వీరంతా సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. ఈ అబద్ధపు వీడియోలు, పోస్టులు ఎక్కడ జనరేట్ అయ్యాయో తెలుసుకోవడానికి సమయం పడుతుంది. ఈ లోపు జరుగాల్సిన నష్టం జరిగిపోతుంది. తప్పుడు ప్రచారం చేసేవారికి కావలసింది కూడా అదే. ఇదంతా హిట్ అండ్ రన్ రాజకీయ కుట్ర. బీజేపీ, కాంగ్రెస్ నాయకు లు నియోజకవర్గాల స్థాయిలో ఇటువంటి ప్రచారం మరింత తీవ్రంచేసే అవకాశం ఉన్నది. సామాజిక మాధ్యమాలు ఒక ఆయుధం కాదు, అది భస్మాసుర హస్తం. అది సృష్టించిన వారిని కూడా కబళిస్తుంది.

మోదీ, బాబు- ఒక కేసీఆర్

img_4285

కేసీఆర్ ఒక్కరే వీరిద్దరికీ భిన్నం. ఆయన ఈ నాలుగేండ్లూ ప్రజలకు గరిష్టంగా, గుణాత్మకంగా, నేరుగా మేలుచేసే అంశాలపైనే దృష్టిపెట్టారు. గత నాలుగేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం పల్లెల్లో ఖర్చు చేసి న నిధులు లెక్కతీస్తే దేశ చరిత్రలో అదొక రికార్డవుతుంది. విద్యుత్, సాగు, తాగు నీరు సమస్యలను ప్రథమ ప్రాధాన్యంగా పెట్టుకొని అహోరాత్రులు శ్రమిస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి దిశ గా ఒక గొప్ప ముందడుగు వేసే దిశగా మిషన్ కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల ను యుద్ధ ప్రాతిపదికన నడిపిస్తున్నారు. ఎంత సంకల్పం లేకపోతే గోదావరి నదిపై ఒక బరాజును కేవలం 15 మాసాల వ్యవధిలో పూర్తి చేయిస్తారు?

దేశ రాజకీయాల్లో ఎన్నికల పరుగు మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ కోసం రూపొందించిన డిఫెం డ్, డెస్ట్రాయ్ అండ్ డిఫీట్ అన్న నినాదాన్ని దేశవ్యాప్తం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. తన నాలుగేండ్ల పాలనను సమర్థించుకోవడం, ప్రత్యర్థుల ప్రతిష్ఠను దెబ్బతీయడం, అంతిమంగా ఎన్నికల్లో ఓడించడం లక్ష్యంగా ఆయన బృందం ముందుకు కదులుతున్నది. అది విజయవంతం అవుతుందా లేదా అన్నది దేశ ప్రజలు మోదీని ఎంతవరకు నమ్ముతారన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. నిజానికి ఆయన తన నాలుగేండ్ల పాలనను సమర్థించుకోవడంలో ఇప్పటికే విఫలమయ్యారు. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఒక్కసారి అంటే ఒక్కసారి నల్లధనం గురించి గానీ, పెద్దనోట్ల రద్దు గురించి గానీ, జీఎస్టీ గురించి గానీ మాట్లాడలేదు. వాటిని తన విజయాలుగా చెప్పుకునే స్థితిలో ఆయన లేరు. అందుకే ఆయన, ఆయన బృందం ప్రత్యర్థులపై దాడి చేయడాన్నే ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నారు. ప్రభుత్వానికి సారథ్యం వహించిన నాయకుడు ప్రజలకు నేరుగా చేయగలిగిన మేలు, వారిలో కలిగించగలిగిన నమ్మకం ప్రజల్లో ఆ నాయకుడికి సుస్థిర స్థానం సంపాదించి పెడుతుంది. అటువంటి తిరుగులేని అవకాశం నరేంద్ర మోదీకి వచ్చింది.

బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వాన్ని నడుపుకొనే అవకాశం దేశ చరిత్రలో మొదటిసారి వచ్చింది. అప్పట్లో అటల్ బిహారీ వాజపేయి చాలామందిపై ఆధారపడవలసి వచ్చింది. నరేంద్ర మోదీకి అటువంటి పరిస్థితి లేదు. మోదీ తనకు వచ్చిన తిరుగులేని అధికారాన్ని ఏకపక్ష నిర్ణయాలు చేయడానికి ఉపయోగించుకున్నారు. ప్రజలకు ఏ రకం గా మేలుచేయని, ప్రజలు తమ డబ్బు కోసం తాము ఇక్కట్లు పడవలసిన దుస్థితిలోకి నెట్టే నిర్ణయాలు చేశారు. ప్రజలకు నేరుగా మేలు కలిగే మౌలికమైన నిర్ణయాలు ఏవీ చేయలేదు. సబ్సిడీ గ్యాస్ ను కోటిమందికి పైగా ప్రజలు వదులుకుంటే ఆ ధనంతో ఇతర ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. మోదీ పాలనాకాలమంతా ప్రజల త్యాగమే తప్ప ప్రభుత్వ త్యాగం ఎక్కడా కనిపించలేదు.

కేంద్ర పథకాలు వందలాదిగా ఉన్నాయి. అవి అమూర్తమైనవి. ప్రజలకు నేరుగా కనిపించవు. వాటిద్వారా ఇచ్చే నిధులు కూడా రాష్ర్టాలకు ఏ మూలకు చాలవు. మళ్లీ రాష్ర్టాలు తమ వంతు భారీగా ఖర్చుచేసి ఆ పథకాలను జన శ్రేయకంగా మార్చుకోవలసిందే. కేం ద్ర బడ్జెట్ ప్రపంచ భారీ బడ్జెట్‌లలో ఒకటి. అటువంటి బడ్జెట్ ప్రజలకు నేరుగా, గుణాత్మకంగా, ప్రత్యక్ష ఫలితం కలిగించే పని ఒక్కటీ చేయకపోతే జనం అశాంతికి లోనుకాక ఏమవుతారు? ప్రభుత్వం తమకు మేలు చేయకపోగా తమకు నగదు కష్టాలు, పన్ను కష్టాలు మీద మోపిందని భావిస్తున్నారు. రూపాయి విలువ అంతకంతకూ పడిపోతున్నది. జీవన వ్యయం విపరీతంగా పెరిగింది. ఆదాయాలు అదే మోతాదులో పెరుగడం లేదు. నాలుగేండ్లుగా దేశంలోని మధ్యతరగతి ప్రజలు మరిన్ని పన్ను రాయితీలు, ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితి పెంపు వంటివి ఆశించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. పోనీ మోదీ నిజాయితీ పరుడు, దేశం ఆదాయాన్ని పెంచడానికి పాటుపడుతున్నాడు అని చెప్పుకోవడానికీ ఏమీ మిగల్లేదు. అవినీతి తగ్గలేదు. కుంభకోణాలు తగ్గలేదు. ఎన్నికల్లో రాజకీయ అమ్మకాలు కొనుగోళ్లు తగ్గలేదు. నల్లధనం చెలామణి తగ్గలేదు, కశ్మీర్‌లో రాళ్లు వేయడం తగ్గలేదు. వెయ్యి నోటుతో కొన్న ఓటు రెండు వేల నోటు పెట్టి కొనవలసి వస్తున్నది.

ఇదేమి ఖర్మ అని బీజేపీతో సహా అన్ని పార్టీల నేతలు ఆంతరంగికంగా వలపోసుకుంటున్నరు. బ్యాంకుల మునక ఆగలేదు. మోసగాళ్లు విదేశాలకు పారిపోవడమూ కట్టడి కాలేదు. మరి మోదీ నిజాయితీ వల్ల దేశానికి ఏమి ఒరిగిన ట్టు. రాజకీయాల్లో ఏమైనా వైవిధ్యం ఉందా అంటే అదీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఇన్నేండ్లు చేసిన సకల పాపాలను బీజేపీ ఈ నాలుగేండ్లలో చేసేసింది. ప్రజ ల తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వాలను కూల్చడం, రాష్ర్టాల్లో తలదూర్చడం అన్నీ షరా మామూలే. తాను గొప్ప అని చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో ప్రత్యర్థులను దునుమాడటంతోపాటు కశ్మీర్, అయోధ్యల చుట్టూ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికల గండం గట్టెక్కే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఎంతచేసినా ఆయనకు మునుపటి వైభవం కష్టమే. ఆయన పోయిన ఎన్నికల్లో పదకొండు రాష్ర్టాల్లో తొంభై శాతం స్థానాలను గెలుపొందారు. ఆ రాష్ర్టాలలో ఆయన గెలిచిన స్థానాలు 197. మరో ఐదు రాష్ర్టాల్లో సగానికిపైగా స్థానాలను, అంటే 72 స్థానాలను గెలిచారు. ఆ పార్టీ కి వచ్చిన మొత్తం 282 స్థానాల్లో ఈ పదహారు రాష్ర్టాల్లో గెలిచిన స్థానాలే 269. ఆ రాష్ర్టాలన్నీ ఇప్పు డు ప్రతికూల పవనాలతో ఉడుకుతున్నాయి. కొన్ని రాష్ర్టాలు పూర్తి ప్రతికూలంగా ఉన్నాయి. మరికొన్ని రాష్ర్టాల్లో పాక్షిక వ్యతిరేకత ఉన్నది. ఆయన ఇప్పుడు ఏకైక పెద్దపార్టీగా అవతరించడమే గగనం. అది సాధిస్తే బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి అవకాశం ఉండవచ్చు. అప్పుడు మద్దతునిచ్చే పార్టీ లు, ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు మోదీని నాయకుడిగా అంగీకరిస్తాయా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకం.

చంద్రబాబు నాయుడు కూడా సేమ్ టు సేమ్. ఎప్పుడూ వ్యతిరేక నినాదాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ఆంధ్రకు ఏమి కావాలో అడుగకుండా, విభజనకు వ్యతిరేకంగా నీచాతినీచమైన ఎత్తుగడల కు దిగారు. రాష్ట్ర విభజన జరుగకుండా చూడాలని దేశమంతా తిరిగి అందరి కాళ్లూ వేళ్లూ పట్టుకున్నా రు. అప్పటికి చేయిదాటిపోయింది. కాంగ్రెస్, బీజేపీలు అనుకూలంగా ఉండటం వల్ల విభజన ఆగలే దు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలువడం కోసం బీజేపీ, పవన్ కల్యాణ్‌లతో జట్టుకట్టి నాలుగేండ్లు విహారయాత్రలు చేసి ఇప్పుడు కేంద్రం మోసం చేసిందం టూ వీధికెక్కాడు. ప్రత్యేక హోదా కావాలని ఎవరయినా అంటే అరెస్టులు చేయించేదాకా వెళ్లిన చంద్రబాబు ఇప్పుడు తనను మించిన హోదావాది లేడని మాట్లాడుతున్నాడు. మోసం అన్నది ఏండ్ల తరబడి జరుగదు. నాలుగేండ్ల పాటు మోసపోయావు అంటే అది చంద్రబాబు అసమర్థత. చేతగాని తనం. చంద్రబాబు పరాన్న రాజకీయవేత్త. సొంతబలం ఎప్పు డూ లేదు. మహానుభావుడు ఎన్టీఆర్ పెట్టి పోషించి మహావృక్షంలా నిర్మించిపెట్టిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదికే ఇప్పటికీ చంద్రబాబుకు ఆలంబన. ఆయన కేవలం మేనేజర్. మ్యానిపులేటర్. కానీ అవి ఎల్లకాలం పనిచేయవు. చంద్రబాబు ఎంత దాచిపెట్టాలనుకున్నా ఆయన రాజకీయ అవకాశవాదం దాగదు. యునైటెడ్ ఫ్రంట్‌కు నేనే కర్త కర్మ క్రియ అని చెప్పుకున్న చంద్రబాబు కార్గిల్ యుద్ధంతో ఎన్డీయేకు ప్రతిష్ఠ పెరుగగానే ఫ్రంట్‌ను యమునా నదిలోకి విసిరేసి, ఎన్డీయేలో చేరారు. మళ్లీ నాలుగేండ్లకే నరేంద్ర మోదీ హంతక రాజకీయాలను వ్యతిరేకిస్తూ 2004లో ఎన్డీయే నుంచి బయటికి వస్తున్నానంటూ ప్రకటించిన చంద్రబాబు, పదేండ్లు తిరిగేసరికి అదే నరేంద్ర మోదీతో జట్టుకట్టారు. కొన్ని పక్షులు వానను పసిగట్టినట్టు, చంద్రబాబు ట్రెండును పసిగడతాడు. దానికి అనుగుణంగా పార్టీ లు మార్చుతాడు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండ వు. ఈసారి దెబ్బతిన్నాడు. నరేంద్ర మోదీతో కలసి ఉంటేనే అంతో ఇంతో ఫలితం ఉండేది. అశాంతి, అభద్రత ఉండేవి కాదు.

కేసీఆర్ ఒక్కరే వీరిద్దరికీ భిన్నం. ఆయన ఈ నాలుగేండ్లూ ప్రజలకు గరిష్ఠంగా, గుణాత్మకంగా, నేరుగా మేలుచేసే అంశాలపైనే దృష్టిపెట్టారు. గత నాలుగేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం పల్లెల్లో ఖర్చు చేసి న నిధులు లెక్కతీస్తే దేశ చరిత్రలో అదొక రికార్డవుతుంది. విద్యుత్, సాగు, తాగు నీరు సమస్యలను ప్రథమ ప్రాధాన్యంగా పెట్టుకొని అహోరాత్రులు శ్రమిస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి దిశ గా ఒక గొప్ప ముందడుగు వేసే దిశగా మిషన్ కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల ను యుద్ధ ప్రాతిపదికన నడిపిస్తున్నారు. ఎంత సం కల్పం లేకపోతే గోదావరి నదిపై ఒక బరాజును కేవ లం 15 మాసాల వ్యవధిలో పూర్తి చేయిస్తారు? కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ఎత్తిపోతల పథకాలను ఆగమేఘాలమీద పూర్తిచేసి పాలమూరుకు పచ్చలతోరణం కట్టారు. పింఛన్ల రూపేణా, రైతుబంధు, రైతు బీమా, విద్యుత్ సబ్సిడీల రూపేణా, సంక్షేమ పథకా ల ద్వారా లక్ష కోట్లకు పైగా నిధులు పల్లెల్లో ఖర్చు చేశారు. వేలాది గ్రామాల్లో గత అరువై ఏండ్లలో జరుగని ప్రగతి ఈ నాలుగేండ్లలో జరిగింది. సమాజంలో ఒక భరోసాను, నమ్మకాన్ని కలిగించింది. ఫలితాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. చదువులు బాగుపడినాయి. ప్రభుత్వ దవాఖానలు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. మన రాష్ట్రం సృష్టించిన సంపద మన ప్రజలకు దక్కుతున్నది. తెలంగాణ వస్తే ఏమవుతుందని ప్రశ్నించినవాళ్లకు పల్లెలు, పట్టణాలు సమాధానం చెబుతున్నాయి. కేసీఆర్ ఒక్కరే- చేసిన పనులు, సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు చూపించి జనం తీర్పు కోరుతున్నారు. నరేం ద్ర మోదీ, చంద్రబాబు నాయుడు అందరిపై దుమ్మెత్తిపోసి రాజకీయంగా కాలం నెట్టుకొస్తున్నా రు. కేసీఆర్ అనుకూల పవనాలతో ముందుకెళుతున్నారు. మోదీ, చంద్రబాబు ప్రతికూల పవనాలను ఎదుర్కొంటున్నారు. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్పా ఈ పరిస్థితి మారే అవకాశం లేదు.