అందని ద్రాక్ష పుల్లన

అయ్యా బల్లీ ఏందీ లొల్లి

images

దూకాలని చూశావు దూకనివ్వలేదు
రావాలని చూశావు రానివ్వలేదు
బతిమాలుకున్నా పప్పులుడకలేదు
పైరవీలు చేసినా పని జరగలేదు
అందని ద్రాక్ష కదా పుల్లగానే ఉంటుంది
దగ్గరికి రానివ్వలేదు కదా చేదుగానే ఉంటుంది
అయ్యా బల్లీ ఏందీ లొల్లి

గుడ్డి మేధావుల ఎడ్డి నివేదిక

image

తెలంగాణ ప్రభుత్వంలోనే 90 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ ఒక నివేదిక ఇచ్చింది. దేశంలోనే ఇది రికార్డు అని కూడా ఆ నివేదిక పేర్కొంది. అయితే ఆ నివేదికను రూపొందించిన మేధావులకు తెలంగాణ ఆవిర్భావ నేపథ్యం గురించి కానీ, తెలంగాణ ఉద్యమం గురించి కానీ కనీసం అవగాహన లేదని, వారికి కేసుల లెక్కలు తప్ప ఇంగితజ్ఞానం ఇసుమంతయినా లేదని ఆ నివేదికను చూస్తే అర్థమవుతుంది. ఏడీఆర్ ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని అర్థం చేసుకున్న తీరిది. ఇంకేం కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా తెలంగాణపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్న టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యాపార శిశువు ఎకనమిక్ టైమ్స్ ఇప్పుడు మళ్లీ ఆ నివేదికను తవ్వి తీసి ఒక వార్తను వండి వార్చింది.

తెలంగాణ మంత్రులపై కేసులు ఎందుకు వచ్చాయి? కేసులు పెట్టింది ఎవరు? వాళ్లు నేరాలు ఎప్పుడు చేశారు? ఎందుకు చేశారు? ఇప్పుడు తెలంగాణలో మంత్రులుగా ఉన్నవారిలో అత్యధికులు ప్రభుత్వంలోకి రావడం ఇదే ప్రథమం. వారు గత పద్నాలుగేళ్లుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఉద్యమం సందర్భంగా సీమాంధ్ర ప్రభుత్వం నుంచి అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. సీమాంధ్ర ప్రభుత్వం వేలాదిమంది తెలంగాణ ఉద్యమకారులను అనేక కేసుల్లో ఇరికించింది. కొందరిపై పీడీ చట్టాలనూ ప్రయోగించింది. ఒక్కొక్కరిపై వందలాది కేసులు నమోదు చేసింది. అత్యధిక కేసులు ఇలా పెట్టినవే. ఆ కేసులన్నీ లెక్కవేసి తెలంగాణ ప్రజాప్రతినిధుల్లో అత్యధికశాతం మంది నేరగాళ్లే అని తీర్పులు ఇస్తే వారిని మేధావులు అనుకోవాలా లేక వాస్తవాలు చూడడానికి నిరాకరించే మరుగుజ్జులు అనుకోవాలా? ఇటువంటి వారు ఎటువంటి ప్రజాస్వామిక సంస్కరణలు ప్రతిపాదిస్తారో అర్థం కాదు.

జగ్గారెడ్డి, ఆయనకు తోడు రేవంత్‌రెడ్డి

223

తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అయినా సీమాంధ్ర ఆధిపత్య మూలాలను కొనసాగించినంతకాలం గొర్రెతోకలుగా మాత్రమే మిగిలిపోతాయని 2014 ఎన్నికలు రుజువు చేశాయి. మెదక్ ఎన్నికలు అదే రుజువు చేయబోతున్నాయి. భవిష్యత్తులోనూ అదే జరుగుతుంది. సీమాంధ్ర పార్టీలకు బీ టీములుగా కొనసాగే వారిని తెలంగాణ ప్రజలు నెత్తికెత్తుకునే అవకాశాలు ఇంకెంతమాత్రం ఉండవు.

తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ ప్రకటనకు ప్రతి ఎన్నికా ఒక సందర్భమే అవుతున్నది. సాధారణంగా అయితే మెదక్ లోక్‌సభ ఎన్నిక సాదాసీదా జరిగిపోవలసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖాళీ చేసిన స్థానం కాబట్టి గెలుపు గురించి కూడా పెద్దగా ఉత్కంఠ లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కాబట్టి పాలక పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య సమరంగా ఈ ఎన్నికలు జరగాల్సింది. కానీ అనూహ్యమైన రీతిలో ఈ ఎన్నికలు కూడా తెలంగాణవాదులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య పోటీగా పరిణమించాయి. తెలంగాణ రాజకీయ అస్తిత్వ సమస్య మరోసారి ఎజెండాలోకి వచ్చింది. అక్కసుతోనో, ఆక్రోశంతోనో ప్రతిపక్షాలు తప్పులుచేసి తెలంగాణ రాష్ట్ర సమితికి మరింత నైతిక బలాన్ని చేకూర్చుతున్నాయి. మెదక్ నుంచి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డిని పోటీలోకి దింపడం ద్వారా బీజేపీ తెలంగాణ అనుకూల పార్టీగా తనకున్న కాస్తోకూస్తో మంచి పేరును తనే తుడిచేసుకుంది. తెలంగాణ ద్రోహుల జాబితా తయారు చేస్తే జగ్గారెడ్డి అందులో అగ్రభాగంలో ఉంటారు. టీఆరెస్ నుంచి గెలిచి, వైఎస్‌తో కుమ్మక్కయి తెలంగాణ ఉద్యమాన్ని దారుణంగా దెబ్బతీసిన ఘనకీర్తి జగ్గారెడ్డిది. జగ్గారెడ్డి అక్రమాల జాబితా కూడా పెద్దదే. అమీన్‌పూర్‌లో కోట్ల విలువైన భూములను స్వాతంత్ర సమరయోధుల పేరిట కాజేయాలని చూసిన కమిటీకి అధ్యక్షుడు జగ్గారెడ్డి. ఈ అక్రమాలపై విజిలెన్సు విచారణ జరిపి ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిఫారసు చేస్తే, వైఎస్ ఆ నివేదికను తొక్కిపెట్టి జగ్గారెడ్డితో తెలంగాణకు వ్యతిరేకంగా ఎన్ని దుర్మార్గాలు చేయించాలో అన్ని దుర్మార్గాలు చేయించారు. వివాదాస్పద, వైరుధ్యభరిత రాజకీయ నేపథ్యం కలిగిన జగ్గారెడ్డి ఏకాలంలో రెండు పార్టీలను దెబ్బకొట్టారు. వీడిపోయి కాంగ్రెస్‌ను, కలసి బీజేపీని భ్రష్టుపట్టించారు. జగ్గారెడ్డికి టీఆరెస్ ఒక విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలి. మెదక్ ఎన్నికను ఏకపక్షం చేసినందుకు. ఎవరయినా కాస్త మంచిపేరు సంపాదించాలని చూస్తారు. కానీ కిషన్‌రెడ్డి బీజేపీకి వీలైనంత చెడ్డపేరును పోగేస్తున్నారు.

తెలుగుదేశంతో జట్టుకట్టడం, వెంకయ్యనాయుడు ప్రభావంలో పనిచేస్తున్న పార్టీగా ముద్ర పడడం వల్ల ముందునుంచే బీజేపీ కొంత అప్రదిష్టను మోస్తున్నది. జగ్గారెడ్డిని నెత్తిన పెట్టుకుని ఆ ఆప్రదిష్టను పరిపూర్ణం చేసుకున్నది. తెలంగాణ ప్రజల్లో ఏమాత్రం విశ్వసనీయత లేని రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు వంటి నాయకులను వెంటబెట్టుకుని నామినేషను వేయడం తెలంగాణవాదులను మరింత విస్మయానికి గురిచేసింది. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అయినా సీమాంధ్ర ఆధిపత్య మూలాలను కొనసాగించినంతకాలం గొర్రెతోకలుగా మాత్రమే మిగిలిపోతాయని 2014 ఎన్నికలు రుజువు చేశాయి. మెదక్ ఎన్నికలు అదే రుజువు చేయబోతున్నాయి. భవిష్యత్తులోనూ అదే జరుగుతుంది. సీమాంధ్ర పార్టీలకు బీ టీములుగా కొనసాగే వారిని తెలంగాణ ప్రజలు నెత్తికెత్తుకునే అవకాశాలు ఇంకెంతమాత్రం ఉండవు. ‘ఒక గుంటూరాయనేమో మీ పాలన బాగుందని కేసీఆర్‌ను పొగుడుతున్నారు. రేవంత్‌రెడ్డేమో నోటికి డ్రైనేజీకి తేడా లేకుండామాట్లాడుతున్నాడు. ఏంటిసార్ ఇదంతా? ఆయనను ఎవరు ఉసిగొల్పుతున్నారు? టీవీలో ఆయనను చూడాలంటేనే అసహ్యం వేస్తుంది’ అని ఒక ఉపాధ్యాయుడు ఫోనులో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణవాదుల మానసిక స్థితి ఇలా ఉంటే రేవంత్‌రెడ్డి వంటి వారు ఇప్పటికీ సీమాంధ్ర ఆధిపత్య మైండ్‌సెట్‌తోనే తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీలో ఉంటూ, ఇలా వాగినంతకాలం ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, భవిష్యత్తులో ఎమ్మెల్యే కూడా కాలేడు. ఆ రకంగా తెలంగాణ కాంగ్రెస్‌కు ఎప్పటికయినా పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కానీ టీడీపీ, బీజేపీ మాత్రం ఈ అవలక్షణాలను వదిలించుకోనంతకాలం కేవలం డిఫెన్సుకు పరిమితం కావలసి ఉటుంది.

జానా, రేవంత్‌ల విఫల గీతం

223

లాఠీ చార్జీలు చేయడం, బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, కేసులు పెట్టడం, కాళ్లూ చేతులు విరగ్గొట్టడం గురించి జానారెడ్డి మాట్లాడకపోతే మంచిది. ఆయన హోంమంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా ఏం చేశారో ఇంకా ఎవరూ మరచిపోలేదు.

తెలంగాణ ప్రజల బాగోగులను గురించి, రైతుల కష్టనష్టాలను, విద్యార్థుల సమస్యలను గురించి సీమాంధ్ర పార్టీ తెలంగాణ ఏజెంటు రేవంత్‌రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రైతులను అంపశయ్యపైకి ఎక్కించి, విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమించినవారిపై కాల్పులు జరిపి ముగ్గురు అమాయకులను బలిగొన్నది ఎవరో అందరికీ తెలుసు.

ఇంజనీరింగ్ విద్యను ఒక స్కామ్ కింద మార్చిన ఘనత కూడా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలదే. ఇవాళ తెలంగాణ పడుతున్న కష్టనష్టాల పాపమంతా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలదే. ఐదున్నర దశాబ్దాలపాటు రాష్ర్టాన్ని పరిపాలించిన ఈ రెండు పార్టీలు వ్యవసాయానికి కరెక్టుగా ఐదారు గంటలు కరెంటు ఇవ్వలేని దుస్థితిలోకి తెలంగాణను నెట్టారు. విద్యుత్ ప్రాజెక్టులన్నీ ఆంధ్రాకు తరలిపోతుంటే కళ్లప్పగించి చూశారు. ఇవ్వాళ తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద కబుర్లు చెబతున్నారు.

చరిత్రహీనులకంటే కొత్త ఉత్తమం

కొత్త ప్రభాకర్‌రెడ్డికి తెలంగాణ ఉద్యమ చరిత్ర లేదని కొందరు చెబుతున్నారు. కానీ ఆయన గత నాలుగేళ్లుగా తెలంగాణ ఉద్యమంతోనే ఉన్నారు. ఎక్కడ ఏ పెద్ద సభ జరిగినా ఆయన అండదండలు అందించారు. ఆయనకు మంచిపేరు ఉంది కానీ జగ్గారెడ్డికి, రేవంత్‌రెడ్డిలకు ఉన్న ద్రోహ చరిత్ర లేదు. చరిత్రహీనుల కంటే కొత్తగా చరిత్రలో భాగస్వామి కావడానికి ముందుకు వచ్చిన ప్రభాకర్‌రెడ్డే నయం అని ఒక మిత్రుడు అభిప్రాయపడ్డారు. జగ్గారెడ్డి కేసీఆర్‌కు నిద్రలేని రాత్రులు చూపిస్తాడట. చాలా రోజులు నిద్రపోకపోతేనే ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు వస్తాయి అన్నాడో నర్సాపూర్ అధ్యాపకుడు. సంగారెడ్డి ప్రజలు చిత్తుగా ఓడించినా జగ్గారెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు అని ఆ అధ్యాపకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

One shot two parties

telangana_state
మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో తూర్పు జయప్రకాశ్‌రెడ్డి ఒక్క దెబ్బకు రెండు పార్టీలను మట్టికరిపించారు. చేరి బీజేపీని, వీడి కాంగ్రెస్‌ను ఆగంపట్టించాడు. టీఆరెస్ పని తేలిక పరిచారు.

ద్రోహులతో కలిసి, ద్రోహులకోసం బీజేపీ

telangana_state

తెలంగాణ భారతీయ జనతాపార్టీ తెలిసి చేస్తున్నదో తెలియక చేస్తున్నదో తెలంగాణ వ్యతిరేకులకు, ద్రోహులకు కేంద్రంగా మారుతున్నది. సీమాంధ్ర ఆధిపత్య పార్టీ తెలుగుదేశంతో ఇంకా సహవాసం కొనసాగించడమే పెద్ద తప్పిదం. తెలంగాణ ద్రోహులను పార్టీలోకి ఆహ్వానించడం మరో తప్పిదం. నేను సమైక్యాంధ్రవాదిని అని పదే పదే ప్రకటించుకున్న తూర్పు జయప్రకాశ్‌రెడ్డిని మెదక్ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఆ పార్టీకి ఎటువంటి పేరు తెస్తుందో ఎవరయినా ఊహించవచ్చు.

టీఆరెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టడాన్ని ప్రస్తుతం తెలంగాణ ద్రోహంగానే ఇంకా ప్రజలు చూస్తున్నారు. బీజేపీ సొంతంగా పోరాడినా లేక మరో మంచి అభ్యర్థితో బరిలో దిగినా గెలిచినా ఓడినా ఆ పార్టీకి ఒకింత పేరు వచ్చి ఉండేది. ‘ద్రోహులతో కలిసి, ద్రోహిని అభ్యర్థిగా పెట్టి తెలంగాణలో పోటీ చేయాలనుకోవడమే బీజేపీ వికృత ఆలోచనా విధానానికి నిదర్శనం’ అని ఒక తెలంగాణ మేధావి వ్యాఖ్యానించారు.

‘తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తెలంగాణ ఉద్యమానికి తొట్టతొలుత వెన్నుపోటు పొడిచి అమ్ముడుపోయినవాడు, వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు నమ్మినబంటు, పవన్ కల్యాణ్ హీరో, స్వాతంత్య్రసమరయోధుల పేరిట భూములను కాజేసిన కమిటీకి నాయకుడు, విజిలెన్స్ విచారణలో దోషిగా తేలిన ఘరానా మనిషి …. ఆయన ఇప్పుడు బీజేపీకి దిక్కయ్యాడు…. బీజేపీకి ఇదేం ఖర్మ’ అని ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు.

Each sub-station one solar plant

IMG_2092.JPG

Bharat C. Reddy and PV Gandhi, well known protogonists of Telangana, are advocating since long time that we must focus on Solar Power. Its like captive power station. They feel that any part of Telangana is eligible for erecting a Solar plant.

They are very specific that we must plan to start a solar plant at sub-station level to overcome the crisis earliest. Solar projects gestation period is very short and quick. Investiment sizes also vary from one crore to one thousand crores.

Telangana needs solar revolution to come out of this agrarian crisis. If at all we complete all irrigation projects also, power usage will not going to be reduced.