తెలంగాణ మీడియా పై ఏడుపు

ఆడలేక మద్దెల ఓడు

TDP-CONGRESS-1

ఆడలేక మద్దెల ఓడిందని చెప్పడం అసమర్థులు చేసే వాదన. కాంగ్రెస్ కేసులు, ఫిర్యాదుల మీద పనిచేసి-నంతగా జనంలో పనిచేస్తే బాగుండేది. కోర్టుల చుట్టూ, ఎన్నికల కమిషన్ చుట్టూ తిరిగినంతగా ఓటరు చుట్టూ తిరిగితే ఎంతో కొంత ప్రయోజనం ఉండేది. ఏదోఒక విధానం, దృక్పథం ఉన్నవాళ్లు కేసులపై, ఫిర్యాదులపై ఆధారపడరు. ఏం చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో, ఎలా నమ్మించాలో అర్థంకాని వాళ్లే ఎక్కువ యాగీ చేస్తుంటారు. కాంగ్రెస్, మహాకూటమి గోల అందులో భాగమే. టీ న్యూస్ చానెల్, నమస్తే తెలంగాణ పత్రిక తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, టీఆర్‌ఎస్‌కు కరపత్రాల్లా పనిచేస్తున్నాయని చెబు-తున్న కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రా ఆధిపత్యవాదానికి పుట్టిన పత్రికలు, చానెళ్లు కాం గ్రెస్ నాయకుల పత్రికా సమావేశాలను జరిగినంత సేపు ఎం దుకు లైవ్ ఇస్తున్నాయో చెప్పగలరా? వారు ఏ ప్రయోజనం ఆశించి కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారు? ఇదే కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో పదవు లు వెలగబెడుతున్నప్పుడు సాక్షి టీవీ, పత్రిక రెండూ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చేసిన కుట్రలు, కథనాలు తెలంగాణ ప్రజలు అప్పుడే మర్చిపోతారా? అప్పుడు ఈ జానారెడ్డి, ఈ ఉత్తముడు, ఈ కోమటిరెడ్డి ఎవరి సేవల్లో తరించారో అందరికీ గుర్తే. చంద్రబాబు ఎన్నిదుర్మార్గాలు చేసినా, తెలంగాణకు ఎన్ని ద్రోహాలు చేసినా, తెలంగాణకు ఆయనకు సంబంధం లేకున్నా ఆయన వార్తలను పతాక శీర్షికలకు ఎక్కించే పత్రికలు, ఆయన తుమ్మినా దగ్గినా లైవ్‌లు పెట్టే చానెళ్లు తెలంగాణ ప్రజలందరికీ ఎరుకే. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి, తెలంగాణ అభివృద్ధి పథానికి, తెలంగాణ రాజకీయశక్తికి ఇప్పు-డొక పత్రిక, చానెల్ అండగా ఉండటం వీరెవరికీ జీర్ణం కావడం లేదు. వీళ్లంతా పెద్ద గురివిందలు. తెలంగా-ణకు ఏది మంచో నమస్తే తెలంగాణ అదే ఆచరిస్తూ ఉన్నది. కాంగ్రెస్ తెలంగాణ అనుకూల నిర్ణయం చేసిన రోజున సోనియాను పతాక శీర్షికలో పెట్టుకున్నది నమస్తే తెలంగాణనే. కాంగ్రెస్ నాయకత్వం తన చేత-గానితనాన్ని, జనాన్ని మెప్పించలేని తమ అసమర్థతను ఇతర కారణాలపైకి మళ్లిస్తున్నది. అందులో భాగమే తెలంగాణ మీడియా పై ఏడుపు.

కాంగ్రెస్ సమస్య విశ్వసనీయత లేకపోవడం. ఆ పార్టీ చరిత్ర, వర్తమానం అంతా ప్రజలకు గుర్తున్నది. ఇప్పుడు పది లక్షలు రుణమాఫీ చేస్తామంటే కూడా నమ్మేవాళ్లు లేరు. విశ్వసనీయతను సం పాదించుకోవ-డానికి చాలా కష్టపడాలి. ఒకసారి పోతే తిరిగి సంపాదించడం కష్టం. కాంగ్రెస్ అనేక దశాబ్దాలుగా రైతు వ్యతిరేక, సం క్షేమ వ్యతిరేక విధానాలను అమలుచేసింది. ఆర్థిక సంస్కరణల జెం డాను భుజానేసుకొని ప్రజల గోళ్లూడగొట్టే ఘనకార్యాన్ని అమలు చేస్తూ వచ్చింది. అప్పుడెప్పుడో దేవీలాల్ కాలంలో పదివేల రూపాయల రుణమాఫీ తప్పితే ఎప్పుడూ ఏ పార్టీ రుణమాఫీ చేయలేదు. మళ్లీ టీఆర్‌ఎస్ ఒక్కటే లక్ష రూపాయల రుణమాఫీ హామీ ఇచ్చి, అమలుచేసి చూపించింది. మళ్లీ కూడా రుణమాఫీ చేయడానికి ముందుకు వచ్చింది. చేయగలిగింది చెప్పడం, అమలుచేయడం విశ్వసనీయత. టీఆర్‌ఎస్‌కు ఆ విశ్వసనీ-యత ఉంది. కాంగ్రెస్‌కు అదిప్పట్లో వచ్చే అవకాశమే లేదు. టీఆర్‌ఎస్ హామీ అంటే కేసీఆర్ హామీ. కేసీఆర్ హామీ ఇస్తే అమలవుతుంది. అందుకు రుజువులున్నాయి. కాంగ్రెస్ హామీ అంటే ఎవరి హామీ? ఉత్తమ్‌కు-మార్‌రెడ్డి దా? జానారెడ్డిదా? రేవంత్‌రెడ్డిదా? లేక వీరి ఢిల్లీ బాస్ రాహుల్ గాంధీదా? రాహుల్ గాంధీ హామీ అయితే దేశవ్యాప్తంగా చేస్తారా? కాంగ్రెస్‌ది బహునాయకత్వం, దేశమంతటి సమస్య. టీఆర్‌ఎస్‌ది తెలంగా-ణకు మాత్రమే పరిమితమైన అంశం. కేసీఆర్ ఒక్కరు చేయగలిగిన పని. ఢిల్లీ కోసమో, అధిష్ఠానం కోసమో ఎదురు చూడాల్సిన పనిలేదు. కాంగ్రెస్, టీడీపీలు ఆంధ్రలో కూడా ఉన్న పార్టీలు. టీడీపీకి ఆంధ్రే ముఖ్యం. అక్కడ అధికారంలో ఉన్నది. మళ్లీ రావాలనుకుంటుంది. ఆంధ్ర ప్రయోజనాలు చూస్తుందా? తెలంగాణ ప్రయోజనాలు చూస్తుందా? నిజానికి చాలా చిన్న లాజి క్ ఇది.

ఉదాహరణకు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సంగతే చూడండి. రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 2005లో అప్పుడున్న 11000 క్యూసెక్కులు కాకుండా మరో 44 వేల క్యూసెక్కులకు పెంచుతున్నప్పుడు తెలంగాణవాదులు అభ్యంతర పెట్టారు. కాంగ్రెస్‌లో ఉండికూడా పి.జనార్దన్‌రెడ్డి గట్టిగా వ్యతిరేకించాడు. అందుకాయనను ఎంత వేధించారో, ఆయన ఎలా గుండెపగిలి మరణించారో హైదరాబాద్ ప్రజలందరికీ తెలుసు. రాయల-సీమకు తీసుకెళ్లేవి వరదనీళ్లే, నికర జలాలు కాదు, శ్రీశైలానికి వరద వచ్చేది 30 రోజులపాటే, ఆ 30 రోజు-ల్లోనే గరిష్ఠంగా నీళ్లు తీసుకోవాలంటే పోతిరెడ్డిపాడు సామ ర్థ్యం పెంచాల్సిందే అని వాదించాడు రాజశేఖ-ర్‌రెడ్డి. ఇప్పుడు చూడండి- శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగులకు నీరు చేరుకున్ననాటి నుంచి, అంటే జులై 24 నుంచి ఇప్పటిదాకా పోతిరెడ్డిపాడులో నిరంతరాయంగా నీరు పారుతూనే ఉన్నది. అక్కడ టెలి-మెట్రీలు ఉండవు. ఉన్నా పనిచేయవు. ఇవి కాకుండా హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలు. ఇప్పుడు కొత్తగా నాగలదిన్నె.. వరుసగా కృష్ణా నీటిని తోడేసేందుకు చంద్రబాబు నిరంతరం కుట్ర చేస్తూనే ఉన్నాడు.  ఈ ఏడాది ఇప్పటివరకు శ్రీశైలం నీటిపై కేవలం 30 టీఎంసీల హక్కు మాత్రమే కలిగిన రాయలసీమకు 130 టీఎంసీలు తరలించుకుపోయారు. అన్ని హక్కులున్న తెలంగాణ ఇప్పటివరకు కేవలం 30 టీఎంసీలే వాడుకోగలిగింది. మరి తెలంగాణలో ఆయనతో పొత్తు పెట్టుకుంటున్న కాంగ్రెస్, సీపీఐ, జనసమితి ఒక్క సందర్భంలోనైనా ఈ సమస్య గురించి మాట్లాడారా? అసలు మాట్లాడగలరా? ఎంతకడి-గినా టీడీపీకి అంటిన తెలంగాణ ద్రోహ గుణం పోదు. ఆంధ్రా పక్షపాతంగా ఉండటం టీడీపీకి సహ జ అవసరం కూడా. ఎటొచ్చీ తెలంగాణ పార్టీలే అసహజంగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్, జనసమితి, సీపీ-ఐలలో ఏ మాత్రం తెలంగాణ స్ఫూర్తి గానీ, ఆత్మగౌరవం కానీ లేవు. ఉంటే టీడీపీతో జతకలిసేవి కావు. ఆ పార్టీలు ఇప్పటికీ ఇతరేతర అవసరాలతో రాజకీయాలు చేస్తున్నాయే తప్ప, తెలంగాణ స్ఫూర్తితో కాదు. ఆ కూటమికి అరిష్టం అదే. కేవలం కేసీఆర్‌ను గద్దెదించాలనే లక్ష్యంతో అసహజ అక్రమ సంబంధాలు పెట్టు-కుంటున్నారు.

మొన్న చంద్రబాబు హైదరాబాద్ వచ్చి తెలంగాణ నాయకుల తో సమావేశమయ్యారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారట. ప్రచారానికి కూడా వస్తారట. నిజమే.. బాబు రావాలి. ప్రచారం చేయాలని చాలామంది తెలంగాణ వాదులు కోరుకుంటున్నారు. అప్పుడైనా ఆయనతో కలిసి తిరిగిన వారికి బుద్ధి వస్తుందేమోనని వారి ఆశ. అదే రోజు టీడీపీ పెద్ద మనిషి ఒకరు విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తెలంగాణకు చేసిన మేలు గురించి, హైదరాబాద్ నిర్మాణానికి ఆయన పాటుపడిన తీరు గురించి, చం ద్రబాబు మహోన్నత వ్యక్తిత్వం గురించి చాలా భక్తిభావంతో, తన్మయత్వంతో వివరించారు. తెలంగాణ శతాబ్దాల తరబడి పరా-యిపాలనలో, దశాబ్దాల తరబడి పొరుగు నేతల పాలనలో ఎందుకు ఉన్నదో ఆ నాయకుడిని చూసినప్పుడు అర్థమైంది. సొంత వ్యక్తిత్వంగానీ, ఆత్మాభిమానంగానీ, అస్తిత్వ చైతన్యం గానీ లేని జాతి ఇతర జాతులకు అణిగిమణిగి ఉంటుందని సామాజిక సూత్రం. ఇప్పటికీ చంద్రబాబు నామస్మరణ చేసేవారు కొందరు తెలంగాణ లో ఉన్నారంటే తరతరాల బానిస వారసత్వ లక్షణాలే ఇంకా కొనసాగుతున్నాయనిపిస్తుంది. వీరు ఇంకెంత మాత్రం రాజకీయంగా తెలంగాణకు ఉపయోగపడరు. వీరిని తెలంగాణ ప్రజలే వదిలించుకోవలసి ఉన్నది. వీరితో జతకలసిన కాంగ్రెస్, జనసమితి, సీపీఐలకూ ప్రజలు తగిన స్థానం చూపించవలసి ఉంది. శిఖండి భీష్ముడిని నిరాయుధున్ని చేసినట్టు, చంద్రబాబు కూటమిని నిరాయుధం చేశాడు. కూటమి పత-నానికి అది చాలు.

 

Advertisements

వాళ్లు మనోళ్ల్లు కాదు

తెలంగాణకు పనికొచ్చే పార్టీ ఏదో, పనికిరాని పార్టీ ఏదో ఇక్కడి ప్రజలు మునుపటి ఎన్నికల్లోనే నిర్ణయించారు. ఇప్పుడింత చర్చ అవసరం లేదు. ప్రజలకు స్పష్టత ఉన్నది. నాయకులకే లేదు. కాం గ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు ఎంత గొంతు పెంచి మాట్లాడినా పరిస్థితి మారదు. ఎందుకంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ప్రయోజన వైరుధ్యం ఉన్నది. టీడీపీ ప్రథమ ప్రాధాన్యం సహజంగానే ఆంధ్రప్రదేశ్. చంద్రబాబునాయుడు ఎన్నిమాటలు చెప్పినా ఆయన ఆంధ్ర ప్రయోజనాల విషయంలో రాజీపడి తెలంగాణకు మేలుచేయడం అన్నది జరుగని పని. ఆయ న నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి తెలంగాణకు ఎన్ని నీళ్లు ఇస్తున్నామన్నది పట్టించుకునే అవకాశమే లేదు. గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తెచ్చుకుంటున్నా, శ్రీశైలం నుంచి నీటి దోపిడీని ఆపలే దు. ఆయనకు పోతిరెడ్డిపా డు నుంచి ఎంత వీలైతే అం త నీరు రాయలసీమకు తరలించుకుపోవడమే ముఖ్యం. మహబూబ్‌నగ ర్, నల్లగొండ జిల్లాలకు కృష్ణా నీటిపై ప్రాథమిక హక్కు ఉందన్న విషయమే ఆయన గుర్తించరు. హైకోర్టు ను విభజించడానికి అంగీకరించరు. విభజించేలోపే జ్యుడీషియల్ ఉద్యోగాల భర్తీని, ప్రమోషన్లను పూర్తి చేయడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తారు. తెలంగాణకు నష్టం జరిగే పనులు ఎన్ని ఉంటే అన్ని చేస్తూపోతారు. చంద్రబాబుకు స్పష్టత ఉన్నది. ఆయన మనిషి, మనసూ రెండూ అమరావతిలోనే. తెలంగాణ గురించి మాట్లాడేదంతా నటన మాత్రమే. ఆయనే కాదు, ఆయనకు మద్దతుగా నిలిచే మీడియా, మేధావులు అంతా మనుషులే ఇక్కడ, మనసంతా అక్కడే. ఎటొచ్చీ స్పష్టతలేనిది తెలంగాణలోని కొద్దిమంది టీడీపీ నాయకులకు మాత్రమే. ఇంకా పసుపు పతాకాన్ని తెలంగాణ పల్లెల్లో ఊరేగిస్తున్న వీళ్లను చూస్తే జాలేస్తున్నది. వారికి ఇంకా ఓట్లేవో ఉన్నాయని భ్రమించి వారితో జట్టు కడుతున్న పార్టీలను చూస్తే ఇంకా సిగ్గేస్తున్నది. తెలంగాణకు అడ్డంపడ్డనాడే టీడీపీ పతనం ఆరంభమైంది. 2014 ఎన్నికల్లో దాని స్థానం దానికి చూపించారు. గత నాలుగున్నరేండ్లలో తెలంగాణలో కాస్త బుద్ధి జీవులనుకున్న తెలుగు తమ్ముళ్లంతా ఇతర పార్టీల్లోకి మారిపోయారు. చంద్రబాబు ఇచ్చే టికెట్లకు, ఆయన ఇచ్చే ఎన్నికల నిధులకు, మొత్తంగా రాజకీయ బానిసత్వానికి అలవాటుపడ్డ కొద్దిమంది నాయకులు మాత్రమే ఇప్పటికీ ఆయన సేవ లో తరిస్తున్నారు. ఆ పార్టీని ఎవరూ అంతం చేయవలసిన పనిలే దు. దానికి తెలంగాణలో సహజ మరణం తథ్యం. ఈ ఎన్నికలు ఆ విషయాన్ని రుజువు చేయబోతున్నాయి.

కాంగ్రెస్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. వాళ్ల మనుసులిక్కడ, మనసు ఢిల్లీలో. కాంగ్రెస్ ప్రథమ ప్రాధాన్యం కూడా జాతీయ రాజకీయాలు. జాతీయ రాజకీయ అవసరాలు. తెలంగాణలో ఏది చేయాలన్నా పక్క రాష్ర్టాల్లో లేదా జాతీయస్థాయిలో అది చేయగలమా లేదా అని ఆలోచించుకోవలసిన పరిస్థితి. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు వారి మనసంతా అప్పటి ముఖ్యమంత్రుల చుట్టూ. ముఖ్యమంత్రి రైటంటే రైటు, రాంగంటే రాంగు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని అడ్డగోలుగా పెంచుతూ ఉంటే పి.జనార్దనరెడ్డి వంటి కొందరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉంటే నీటిపారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్య వెళ్లి ఆ పనులకు జెండా ఊపి వస్తారు. పోతిరెడ్డిపాడు రైటే అని ఒక తెలంగాణ నాయకుడు సమర్థిస్తూ మీడియాకు ఎక్కుతారు. ఈ ఏడాది ఈ సీజనులో కృష్ణా జలాల్లో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు ఎన్ని నీళ్లు వాడుకున్నాయి, పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవాల ద్వారా ఎన్ని నీళ్లు వెళ్లిపోయాయో లెక్కలు తీస్తే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేసిన పాపాలేమిటో ప్రజలకు అర్థమవుతాయి. ఈ సీజనులో తెలంగాణ ఉపయోగించుకున్న నీటి మొత్తమే 77.311 టీఎంసీలయితే, ఆంధ్ర లెక్కచెప్పకుండా, లెక్కకు దొరుకకుండా తరలించిన నీరే 90 టీఎంసీలు. ఆ రాష్ట్రం మొత్తం తరలించిన నీరు 229 టీఎంసీలు. తెలంగాణ వైపు కృష్ణా ప్రాజెక్టులను తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన నిర్వాకం ఫలితమి ది. అందుకే ఆ పార్టీలకు తెలంగాణ మొదటి ప్రాధాన్యం కాదు. ఇప్పుడు అవసరార్థం రుణమాఫీ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ 2014లోనే ఆ పనిచేసి ఉండవచ్చు. దేశమంతా తమ పార్టీని ప్రజ లు తిరస్కరించిన తర్వాత రైతులకు ఏమి చేయాలో గుర్తొచ్చిందా? రైతులు సంక్షోభంలో కూరుకుపోవడానికి ఆర్థిక సంస్కరణల పేరిట సబ్సిడీలు ఎత్తివేయడం కారణం కాదా!

కాంగ్రెస్ విధానాలు రాజకీయ అవసరార్థం, ఆపదమొక్కులకోసం జనించేవి తప్ప, ప్రజల అవసరాలు గుర్తించి రూపొందించే వి కాదు. కాంగ్రెస్‌కు ప్రజలను కేంద్రంగా చేసుకొని ఆలోచించే విధానమే లేదు. అటువంటి ఆలోచనావిధానం ఉంటే తెలంగాణ రాష్ర్టాన్ని 2004లోనో 2005లోనో ఏర్పాటుచేసి ఉండేవారు. ఇన్ని ఉద్యమాలు, ఇంత గోస తెలంగాణ ప్రజలు పడి ఉండేవారు కాదు. ఇప్పుడు కూడా దేశమంతా ఒక విధానం లేదు. ఇక్కడ ఒకేసారి రుణమాఫీ చేస్తామంటారు. ఇప్పటికే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ర్టాల్లో మాత్రం అనేక వాయిదాలు పెడుతారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని సన్నాయి నొక్కులు నొక్కుతారు. విధాన నిర్ణయా లు చేయడానికి, వాటిని అమలుచేయడానికి ఒకే పార్టీ, ఒకే నాయకుడు కావాలి. బహునాయకత్వం, బలహీనమైన పార్టీ కాదు. ఎం తో దూరం ఎందుకు? ఉద్యోగాల భర్తీ విషయమై కాంగ్రెస్ నాయ కులు ఎన్నిరకాల మాటలు మాట్లాడుతున్నారో గమనించండి. ఒకాయన లక్ష ఉద్యోగాలిస్తామంటే ఇంకొగాయన రెండు లక్షల ఉద్యోగాలిస్తామంటాడు. ఇదే కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లకు వ్యతిరేకంగా అదేపనిగా కేసులు వేయిస్తారు. కాంగ్రెస్ నాయకులది విచిత్రమైన మనస్తత్వం. వాళ్ల కార్యస్థలం ప్రజల మధ్య కాదు. కోర్టుల వద్ద. ప్రజల కోసం కొట్లాడరు. ప్రజలకు వ్యతిరేకంగా కోర్టులకు వెళతారు. ఉద్యోగాల భర్తీ, సాగునీటి ప్రాజెక్టులు, పాలనాసంస్కరణలు అన్నింటి మీద కేసులే. ప్రజలకు ఏదైనా చేయమని డిమాండు చేసేవాళ్లు నాయకులు. ఏదీ చేయకుండా ఆపేవాళ్లు పేచీకోరులు. మర్రి శశిధర్‌రెడ్డి అని ఒక నాయకుడున్నాడు. ఆయన ప్రజల మధ్య కనిపించేది తక్కువ. కోర్టుల్లో కనిపించేది ఎక్కువ. విషాదమేమంటే వీళ్లకు ప్రజలను ఎక్కడ గెలువాలో, ఎలా గెలువాలో తెలియకపోవడం.

బీజేపీది కూడా దాదాపు కాంగ్రెస్ వంటి పరిస్థితే. వారు పక్క రాష్ట్రంతో కొట్లాడలేరు. ఢిల్లీతో కొట్లాడటం అసలు సాధ్యం కాదు. తెలంగాణ డిమాండ్లను ఒక్కటి కూడా నెరవేర్చుకు రాలేకపోయిన పార్టీ బీజేపీ. తెలంగాణకు అత్యంత అవసరమైన ఏడు మండలాలను ఆంధ్రకు అప్పగించే విషయం మొదలు ఇప్పుడు హైకోర్టు విభజన వరకు అన్ని సందర్భాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ఇక్కడి బీజేపీ నేతలు నోరు మెదపలేరు. మన సీలేరు విద్యుత్ ప్రాజెక్టును చంద్రబాబు తన్నుకుపోయినా వారికి ఇసుమంతైన బాధ కలుగదు. ఢిల్లీ ఆదేశాలు పాటించాలి కదా. ఇక మిగిలిన పార్టీలు పెద్దగా లెక్కపెట్టవలసినవి కాదు. తెలంగాణ కోసం కొట్లాడినా సీపీఐ, టీజేఎస్‌లు టీడీపీ జెండా పక్కన చేరడంతోనే ఆ పార్టీలు సామంజస్యాన్ని కోల్పోయాయి. విరుద్ధ రాజకీయ ప్రయోజనాలు కలిగిన పార్టీ పక్కన చేరిన తర్వాత, ఈ పార్టీలు తమకున్న కొద్దో గొప్పో సానుభూతిని కోల్పోయాయి. టీఆర్‌ఎస్ ఒకప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా అని కొందరు ప్రశ్నిస్తున్నా రు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు చేయించడం కోసం, లేఖలు ఇప్పించడం కోసం గొంగలిపురుగునైనా కౌగిలించుకుం టామని ఆరోజు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించి మరీ అన్ని పార్టీలను కలుపుకొచ్చారు. తెలంగాణ పదాన్ని ఉచ్చరించడాన్ని నిషేధించిన పార్టీని తెలంగాణ బాటకు తీసుకురావడానికి ఆరోజు కేసీఆర్ అటువంటి సాహసం చేశారు. ఆ పొత్తు సందర్భంగా కూడా టీఆర్‌ఎస్‌కు పెద్ద ఎత్తున వెన్నుపోటు పొడిచింది టీడీపీ.

వైఎస్‌ఆర్ 2009లో రెండవసారి అధికారంలోకి రావడానికి టీడీపీ టీఆర్‌ఎస్‌కు చేసిన ద్రోహమే ప్రధాన కారణం. తెలంగాణకు అడ్డంగా నిలబడిన వైఎస్‌ను ఓడించడానికి తెలంగాణ వాదులంతా మనస్ఫూర్తిగా టీడీపీ ఓట్లు వేశారు. కానీ టీఆర్‌ఎస్‌ను, తెలంగాణవాదాన్ని ఓడించాలన్న కుట్రతో టీఆర్‌ఎస్ పోటీచేసిన చోట్ల ఓట్లు బదిలీకాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు చంద్రబాబు. దాని పర్యవసానమే తెలంగాణలో వైఎస్ 50కి పైగా సీట్లు గెలువడం. కానీ కాలచక్రం ఒకచోట ఆగదు. నిరంతరం ఆకాశానికీ భూమికీ మధ్య తిరుగుతూ ఉంటుంది. పైకెళ్లినవాడు ఎప్పుడూ పైనే ఉండ డు. కింద పడినవాడెప్పుడూ కిందనే ఉండడు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ విజయం సాధించింది. 2009 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన తర్వాత చంద్రబాబు నిజస్వరూపం అనేకసార్లు రుజువైంది. తెలంగాణ నిర్ణయం వచ్చిన నాటినుంచి చంద్రబాబు, ఆయన అనుకూ ల మీడియా ఎన్ని వేషాలు వేశాయో తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు. టీడీపీ తెలంగాణలో బతుక తగని పార్టీ. అటువంటి పార్టీతో ఇప్పుడు కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌లు పొత్తుకు వెంపర్లాడుతున్నాయంటే అంతకంటే హీనం మరొకటి లేదు. అందుకే ఆ పార్టీలు మన పార్టీలు కాదు. నూటికి నూరు శాతం టీఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణ పతాకాన్ని, ప్రయోజనాలను కాపాడే పార్టీ. తెలంగాణ మాత్రమే ప్రాధాన్యం కలిగిన పార్టీ. మనసా వాచా కర్మణా తెలంగాణ బాగే తన బాగుగా చూసుకునే పార్టీ. ఎప్పటికప్పుడు వేషాలు మార్చుకొని వచ్చే బహురూపులను ఒకే ఒక ఓటుతో ప్రజలు తిరస్కరించాలి.

kattashekar@gmail.com

కాంగ్రెస్‌ది రాజకీయ ఆత్మహత్య

TDP-And-Congress-To-Form-An

చంద్రబాబు పార్టీని తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేయడం కాంగ్రెస్‌కు ఆత్మహత్యా సదృశం. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ. తెలంగాణకు అన్నిరకాలుగా నష్టం కలిగించిన పార్టీ. ఆంధ్రా ప్రయోజనాలకు అంకితమైన పార్టీ. అటువంటి పార్టీ కాబట్టే గత ఎన్నికల్లోనే ప్రజలు తిరస్కరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని పార్టీలతోపాటు టీడీపీనీ తిరస్కరించారు. చాలామంది ఆ పార్టీ నాయకులు ఇప్పటికే వివిధ పార్టీలలో చేరిపోయారు. ఈ ఎన్నికల్లో ఎవరూ పట్టించుకోకపోయి ఉంటే ఈ పాటికి ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయి ఉండేది. కొందరు టీఆర్‌ఎస్‌లో, ఇంకొందరు కాంగ్రెస్‌లో చేరిపోయేవారు. ఇంకా ఎవరయినా మిగిలి ఉంటే ఎన్నికల తర్వాత దుకాణం మూసేసుకుని ఇటో అటో చేరిపోయేవారు.

ఏమాత్రం కామన్‌సెన్సు, ఆత్మాభిమానం లేని కాంగ్రెస్, జేయేసీ నాయకత్వాలు చంద్రబాబు పంచన చేరడానికి సిద్ధపడ్డాయి. చచ్చిపోవడానికి సిద్ధంగాఉన్న టీడీపీని ఊతకర్ర పెట్టి నిలబెట్టడానికి ముందుకు వచ్చాయి. కాంగ్రెస్-టీడీపీల అక్రమ సంబంధం చాలు తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించడానికి. పరాయి పెత్తనం నుంచి విముక్తి పొందిన తెలంగాణ మరోసారి పరాయి నాయకులకు పెత్తనం అప్పగించే పని ఎప్పటికీ చేయదు. టీడీపీకి ఓటు వేయడమంటే తెలంగాణతల్లి గుండెలపై తన్నడమే.

కాంగ్రెస్ నాయకులు కలలు కంటూ ఉండవచ్చు, అసత్యాలు గుప్పించవచ్చు, ముఠాలు కట్టి తెలంగాణలో యాత్రలు చేయవచ్చు కానీ వారీ జన్మకు తెలంగాణ ప్రజలను మెప్పించలేరు. వారు ప్రజల్లో గడిపిన కాలం తక్కువ. కోర్టుల చుట్టూ తిరిగిన కాలం ఎక్కువ. టీడీపీతో జట్టుకట్టడంతోనే కాంగ్రెస్ అంతిమ పతనం మొదలయింది. ఎన్నికలు ఆ పార్టీకి దింపుడు కల్లమే.