‘చండీదాస్ ఎవరు? ఆ మూల రచన ఎక్కడ? -వాడ్రేవు చిన వీరభద్రుడు

కొత్త సంవత్సరం అడుగుపెడుతూనే తెలుగు సమాజం గర్వించదగ్గ కానుకను తీసుకొచ్చింది. ఎప్పుడో నలభై ఏళ్ళ కిందట వడ్డెర చండీదాస్ అనే తెలుగు తాత్త్వికుడు తనకోసం తాను రాసుకున్న ఒక సత్యమీమాంస ఇప్పటికి వెలుగు చూసింది. Desire and Liberation (2018) అనే ఆ గ్రంథాన్ని ఆక్స్ ఫర్డ్ యూనివెర్సిటీ ప్రెస్ ప్రచురించడంతో మొదటిసారిగా ఒక ఆధునిక తెలుగు తాత్వ్వికుడు ప్రపంచతత్త్వశాస్త్ర పటమ్మీద చోటు సంపాదించుకున్నాడు. ఒకవైపు సృజనాత్మక రచయిత, మరొక వైపు మౌలిక తత్త్వవేత్త అయిన ఆధునిక తత్త్వవేత్తల్లో జ్యా పాల్ సార్త్ర్ తర్వాత ఇకనుంచి ప్రపంచం వడ్డెర చండీదాస్ నే తలుచుకోవడం మొదలుపెడుతుంది.

అరుదైన,అపురూపమైన ఈ రచన వెలుగు చూడటం వెనక ఆచార్య అడ్లూరు రఘురామరాజు జీవితకాలం పాటు చేసిన తపసు ఉంది, భగీరథుడు గంగని భూమ్మీదకు తీసుకురావడంలాంటి కథ ఉంది.

ఆ కథ 1972 లో మొదలయ్యింది.

కాళిదాస్ భట్టాచార్య (1911-84) ప్రపంచప్రసిద్ధి చెందిన తత్త్వశాస్త్ర ఆచార్యుడు. శాంతినికేతన్ లో బోధించేవాడు. యు.జి.సి కోరికమీద, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రవిభాగం ఎలా పనిచేస్తోందో చూడటానికి ఆయన 72 లో తిరుపతి వెళ్ళారు. వారం రోజుల పాటు ఆ విభాగాన్ని కూలంకషంగా పరిశీలించటంతో పాటు,ఆ శాఖలో పనిచేస్తున్న ప్రొఫెసరల్నీ, రీడర్లనీ, లెక్చెరర్లనీ స్వయంగా కలుసుకోవాలనుకున్నారు. కలుసుకున్నారు, మాట్లాడేరు. ఒక్కరిని తప్ప.

డా.చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు అనే ముప్పై ఏడేళ్ళ వయసుగల లెక్చెరర్ ని మాత్రం అతని ముందు హాజరుపర్చడానికి ఆ శాఖాధిపతి సుతరామూ ఇష్టపడలేదు. ఇక భట్టాచార్య మర్నాడు వెళ్ళిపోతారనగా, ఆ లెక్చెరర్ ని కూడా ఆయనముందు హాజరు పరచకతప్పింది కాదు.

నిర్లక్ష్యంగానూ, అన్యమనస్కంగానూ తనముందు నిలబడ్డ ఆ యువకుణ్ణి ‘నువ్వేం చేస్తున్నావు? ‘ అనడిగాడు భట్టాచార్య.

‘ఏమీ చెయ్యను’ అన్నాడతడు.

‘ఏదో ఒకటి చెయ్యకుండా ఎలా ఉంటావు? యూనియన్లు నడుపుతుంటావా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటావా? సినిమాలు తీస్తుంటావా? ‘ అడిగాడు భట్టాచార్య.

‘లేదు, ఏమీ చెయ్యను.’ అన్నాడతడు మళ్ళా.

‘ఏమీ చెయ్యకుండా ఉండటం అంత సులభం కాదు, అది యోగులకే సాధ్యం. నిజం చెప్పు,ఇన్నాళ్ళూ నువ్వు నన్ను కలవలేదు. అసలు నువ్వు చేస్తున్న పనేమిటి?’

‘రాస్తుంటాను.’

‘ఏం రాస్తుంటావు?’

‘కథలూ, నవలలూ, అది కూడా తెలుగులో.’

‘తెలుగు నాకు రాదు. ఇంగ్లీషులో ఏమన్నా రాసావా?’

ఆ యువకుడు ఒక క్షణం పాటు ఆగాడు. అప్పుడు కూడా నెమ్మదిగా సందేహిస్తూ

‘ఒక రచన రాసాను. కాని అది ఫిలాసఫీ డిపార్ట్ మెంటు కి అర్థం కాదు, అంగీకరించదు.’

‘నాకు చూపించగలవా దాన్ని.’

ఆ యువకుడు తన ఛాంబర్ లో తన సొరుగులోంచి ఒక మాన్యుస్క్రిప్ట్ తీసి ఆయన చేతుల్లో పెట్టాడు. పట్టుమని ఇరవైపేజీలు కూడా లేని రచన.

భట్టాచార్య కుతూహలంగా మొదటి పేజీ తెరిచాడు. మొదటి వాక్యం చదివాడు.

“Contradictoriness is an inherent structural tinge of reality.”

ఆయన తనముందున్న యువకుణ్ణి ఎక్స్ రే కళ్ళతో చూస్తూ

‘మీ తండ్రితాతల్లో ఎవరన్నా శాక్తులా? ‘ అనడిగాడు.

‘కాదు. ఎవరూ లేరు.’

ఆయన నమ్మలేకపోయాడు.

‘మీపూర్వీకులెవరేనా రాసిన తాళపత్రాన్ని ఇంగ్లీషులోకి అనువదించావా?’

‘లేదు. ఇది నేనే రాసాను.’

‘నువ్వేం రాసావో నీకు తెలుసా?’

‘కొద్ది కొద్దిగా అర్థమవుతోంది’ అన్నాడా యువకుడు.

అంతే, భట్టాచార్య మర్నాడు రైలు టిక్కెట్టు కాన్సిల్ చేసేయమన్నాడు. నేరుగా గెస్ట్ హవుజ్ కి వెళ్ళిపోయాడు. ఎవరూ తనని కలవొద్దని చెప్పాడు. ఆ రాతప్రతినే అధ్యయనం చేస్తూండిపోయాడు. తాను శాంతినికేతన్ వెళ్తూ ఆ రాతప్రతిని టైపు చేసి ఒక కాపీ తనకి పంపించమన్నాడు.

1972 లో ఒక తెలుగు యువకుడు తనకోసం తాను రాసుకున్న ఒక రచన. 45 సంవత్సరాల పాటు దాన్ని ఇద్దరు మటుకే చదివారు. ఒకరు కాళిదాసు భట్టాచార్య, మరొకరు రఘురామరాజు. ఇప్పుడు యావత్ ప్రపంచం చదవబోతున్నది. తత్త్వశాస్త్రంలో metaphysics కి ఒకప్పుడు భారతదేశం పుట్టినిల్లు. కాని ఆధునిక భారతీయ చింతనలో మౌలికమైన metaphysical రచన ఏదీ ఇంతదాకా ప్రభవించలేదు. అరవిందులు, కె.సి.భట్టాచార్య ఆ దిశగా కొంత చింతనచేసారు. కాని ప్రధాన సూత్రగ్రంథమేదీ రాయలేదు. ఆ అవకాశం చండీదాస్ కి దక్కింది. ఆపస్తంబుడు, ఆచార్య నాగార్జునుడు, కుందకుందాచార్యుల తర్వాత ఇన్నాళ్ళకు తిరిగి ఒక తెలుగువాడి మౌలిక దార్శనిక గ్రంథం ప్రపంచం ముందు అవతరించింది.

శాంతినికేతన్ వెళ్ళాక కూడా భట్టాచార్య స్తిమితంగా ఉండలేకపోయాడు. ప్రాచీన భారతీయ దార్శనికుల పంథాలో సూత్రప్రాయంగా రాసిన ఆ ఇరవై పేజీల రాతప్రతి ఆయన్ని నిలవనివ్వలేదు. ఆయన ఒక ఏడాది పాటు ఉద్యోగానికి సెలవుపెట్టేసాడు. భిలాయిలో ఉన్న తన కూతురిదగ్గరకు వెళ్ళిపోయి, ఆ రచనను మరింత లోతుగా అధ్యయనం చేస్తూండిపోయాడు. ఏమైతేనేం, చివరికి, 1975 జనవరి నాటికి, ఆ రచనకు ఒక విపులమైన పీఠికను రాయగలిగాడు.

కాని, ఆ రచనను అట్లా ప్రాచీన సూత్రవాజ్మయం తరహాలో ప్రచురిస్తే ఎవరికీ అర్థం కాదనీ, దానికి కనీసం మూడువందల పేజీల భాష్యం కూడా రాయాలనీ చండీదాస్ ని కోరాడు. ఆ సందర్భంగా ఎనిమిది నెలలపాటు వాళ్ళిద్దరి మధ్యా ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి.

భట్టాచార్య సూచనను చండీదాస్ ఆదేశంగా స్వీకరించి తన రచనకు తనే వ్యాఖ్యానం రాయడానికి ఉపక్రమించాడు. కాని, ఆ దివ్యావేశం అతడికి మళ్ళా లభించలేదు. తాను రాసింది తనకే సంతృప్తికరంగా అనిపించలేదు.

18 ఏళ్ళు గడిచాయి.

ఆయన జీవితంలోకి రఘురామరాజు అనే తత్త్వశాస్త్ర విద్యార్థి ప్రవేశించాడు. తాను భట్టాచార్యకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోడానికి ప్రత్యక్షమయిన అవకాశంలాగా కనిపించాడతడు. తనకన్నా ఇరవయ్యేళ్ళు చిన్నవాడు. 1993 లో, చండీదాస్ నోరుతెరిచి అతణ్ణి అడిగాడు.

‘ఈ రచనకు నువ్వు భాష్యం రాయగలవా?ఇంగ్లీషు పాఠకలోకానికి నువ్వు పరిచయం చెయ్యగలవా?’

ఆ తర్వాత 2004 దాకా వాళ్ళిద్దరి మధ్యా ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి.(ఆ లేఖల్ని ‘ప్రేమతో..చండీదాస్ ‘ పేరిట ఎమెస్కో ప్రచురించింది. అందులో కాళిదాసు భట్టాచార్య చండీదాస్ కి రాసిన లేఖలకు నా తెలుగు అనువాదాలు కూడా ఉన్నాయి.) రఘురామ రాజు చండీదాస్ ని చివరి సారి కలిసినప్పుడు ఆయన బయట గుమ్మం దాకా వచ్చి అతడికి వీడ్కోలు పలుకుతూ ‘నేను మరణించినా కూడా నువ్వు నన్ను చూడటానికి రానక్కర్లేదు. కాని నేను భట్టాచార్యగారికి ఇచ్చిన మాట మాత్రం మర్చిపోకు ‘ అన్నాడు.

ఆ రచన ని రఘురామరాజు 16 సంవత్సరాలు అధ్యయనం చేసాడు. దానికొక విపులమైన వ్యాఖ్యానం రాసాడు. వందమందికి పైగా ప్రచురణకర్తలకు పంపాడు. ఒక్కరు కూడా ప్రచురణకు అంగీకరించలేదు. మొదటిసారిగా, జాన్ హారిస్ అనే ఒక తత్త్వశాస్త్ర ఆచార్యుడు దాన్ని work of genius అన్నాడు. కాని అతడు యాక్సిడెంట్ లో మరణించడంతో ఆ పుస్తకం గురించి చెప్పడానికి మరెవరూ లేకపోయారు. చివరికి ఆశిష్ నందీ ఆ రచనని ఆక్స్ ఫర్డ్ కి పరిచయం చేసాడు. కాని ఆక్స్ ఫర్డ్ కూడా నిరాకరించింది.

‘రఘురామరాజు ఎవరు? చండీదాస్ ఎవరు?’ అనడిగింది ఆ ప్రచురణ సంస్థ.

అప్పుడు రఘురామరాజు తానెవరో తెలియచేసుకోడానికి Debates in Indian Philosophy: Classical, Colonial and Contemporary (2006) అనే పుస్తకం రాసాడు. ఆ రచన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ‘ఛాయిస్’ పత్రిక దాన్ని అత్యంత విశిష్ఠమైన రచనగా ఎంపికచేసింది. డా. రాధాకృష్ణన్ తర్వాత మళ్ళా ఆక్స్ ఫర్డ్ కి భారతీయ తత్త్వశాస్త్రం గురించి మాట్లాడగల రచయిత దొరికాడు.

అప్పుడు, చండీదా రచనకి డా. రఘురామరాజు రాసిన భాష్యాన్ని ఆక్స్ ఫర్డ్ Enduring Colonialism: Classical Presences and Modern Absences(2009) పేరిట ప్రచురించింది. ఆ రచన చదివిన తత్త్వశాస్త్రప్రపంచం ‘చండీదాస్ ఎవరు? ఆ మూల రచన ఎక్కడ? ‘అని రఘురామరాజు వెంటపడింది.

అదిగో, ఆ దాహాన్ని తీర్చడానికి, ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ యూనివెర్సిటీ ప్రెస్ చండీదాస్ రచనను Desire and Liberation:Biography of a text by Vaddera Chandidas (2018 ) పేరిట ప్రచురించింది.

1972 లో ఒక తెలుగు యువకుడు తనకోసం తాను రాసుకున్న ఒక రచన. 45 సంవత్సరాల పాటు దాన్ని ఇద్దరు మటుకే చదివారు. ఒకరు కాళిదాసు భట్టాచార్య, మరొకరు రఘురామరాజు. ఇప్పుడు యావత్ ప్రపంచం చదవబోతున్నది. తత్త్వశాస్త్రంలో metaphysics కి ఒకప్పుడు భారతదేశం పుట్టినిల్లు. కాని ఆధునిక భారతీయ చింతనలో మౌలికమైన metaphysical రచన ఏదీ ఇంతదాకా ప్రభవించలేదు. అరవిందులు, కె.సి.భట్టాచార్య ఆ దిశగా కొంత చింతనచేసారు. కాని ప్రధాన సూత్రగ్రంథమేదీ రాయలేదు. ఆ అవకాశం చండీదాస్ కి దక్కింది. ఆపస్తంబుడు, ఆచార్య నాగార్జునుడు, కుందకుందాచార్యుల తర్వాత ఇన్నాళ్ళకు తిరిగి ఒక తెలుగువాడి మౌలిక దార్శనిక గ్రంథం ప్రపంచం ముందు అవతరించింది.

తెలుగు జాతి గర్వించదగ్గ క్షణమిది.

Why Draupadi? Why not Krishna?

It is pity is that RSS Ideologue Ram Madhav blamed Draupadi for Kurukshetra War. Draupadi was not given chance to choose her husband. Draupadi has no role in losing the Raj in gambling. Draupadi was lost in gambling by her husbands. Male chauvinist feudal Raj made her scape goat.

The same male chauvinism defining the roles of Iithas. Very poor thought process and very bad logic. Draupadi was a sufferer. But she stood for her Dharmic values of the day. Is Ram Madhav finding fault with Krishna? Is he means Kurukshetra War of Adharma? Why Draupadi? Why not Krishna?

త్రిలింగ, తెలింగ, తెలింగాణ, తెలుంగు, తెలుగు


Sun,November 12, 2017 12:14 PM

తెలంగాణ అస్తిత్వ ప్రతీకలను ప్రపంచానికి చాటడానికి తెలుగు మహాసభలు ఒక గొప్ప సందర్భం. మన చరిత్ర, సాంస్కృతిక వైభవాన్ని దశదిశలా చెప్పుకోవడానికి ఇదొక మంచి అవకాశం. తెలంగాణది విస్మృత చరిత్ర. తెలంగాణ, ఆంధ్ర పదాల మధ్య తెలంగాణ అన్న పదం అసలు వినిపించని, వినిపించకూడదని శాసించిన దశ ఒకటి తెలంగాణ ప్రజలు చూశారు. తెలంగాణ తన మూలాలను తాను మరిచిపోయే విధంగా చరిత్ర నిర్మాణం, రచన, ప్రచారం, విధ్వంసం ఒక ప్రణాళికాబద్ధంగా జరిగాయి. తెలంగాణ చరిత్ర మధ్యలో చాలా ఖాళీలున్నాయి. తెలంగాణ ప్రాంతం సుదీర్ఘకాలం పాటు అంటే క్రీస్తు శకం 1500 నుంచి 1948 దాకా సుల్తానులు-కుతుబ్‌షాహీలు, మొఘలాయిలు-అసఫ్‌జాహీల పాలనలో ఉండటం వల్ల అనేక చారిత్రక ఆధారాలు లభించకుండాపోయాయి. ఆలయాలు, శాసనాలు, కోటలు ఎన్నో ధ్వంసమయ్యాయి. సాహిత్యాన్ని, సాంస్కృతిక చిహ్నాలను నాశనం చేయడంతోపాటు కొన్నింటిని గుర్రాలు, ఏనుగుల అంబారీలపై ఢిల్లీకి తరలించుకుపోయినట్టు చరిత్రకారులు రాశారు. దొరికిన శాసనాలను కూడా ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేసిన సందర్భం లేదు. బీఎన్‌శాస్త్రి, పరబ్రహ్మశాస్త్రి వంటి కొద్దిమంది స్వయం శోధకులు పూనుకొని చాలా కృషి చేశారు. అయినా తెలంగాణ చరిత్రను పూసగుచ్చినట్టు వర్ణించే ఆధారాలు, అవకాశాలు లభించలేదు. ఒక్క కాకతీయుల చరిత్రే మనకు కొంత క్రమపద్ధతిలో లభిస్తుంది. అందులో కూడా అనేక అపరిష్కృత సందర్భాలున్నాయి. ప్రతాపరుద్రుడంతటి రాజు బందీ అయి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతారు. కానీ దానికి ఎటువంటి ఆధారాలు లేవు. 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత 74 మంది కాకతీయ నాయంకరులు ఏకమై 1328లో తిరిగి ఓరుగల్లును ముస్లింల పాలన నుంచి విముక్తి చేశారు. అక్కడి నుంచి మరో సుమారు 150 ఏండ్ల పాటు తెలంగాణను తెలుగు రాజులు ఏలారు.

ఓరుగల్లును కాపయ నాయకుడు, రాచకొండను సింగభూపాలుడు, కరీంనగర్ ప్రాంతాన్ని ముసునూరి, రేచర్ల నాయకులు, కొండవీడును రెడ్డిరాజులు ఇలా ఒక్కో ప్రాంతా న్ని ఒక్కోరాజు పరిపాలించాడు. వారి చరిత్ర వరుసక్రమంలో లభించలేదు. బహమనీల పదఘట్టనల కింద నలిగిపోక ముందు తెలంగాణలో ఏం జరిగింది? అన్నది శోధించాల్సి ఉంది. తెలంగాణను ఏలిన రాజులు ఏమయ్యారు? పద్మనాయకులు ఇక్కడ ఓడిపోయిన తర్వాత విజయనగర రాజులకు సామంతులుగా కొందరు వెలుగోడుకు, ఇంకొందరు గుంటూరుకు అటు నుంచి వెంకటగిరికి, కాళహస్తికి వెళ్లారనీ అక్కడ చిన్నచిన్న రాజ్యాలు స్థాపించారని వెలుగోటివారి వంశావళి, వెంకటగిరి రాజుల కుటుంబ చరిత్ర వెల్లడిస్తున్నాయి. నల్లగొండ జిల్లా పానగల్లు నుంచి వెళ్లినవారే కాళహస్తి వద్ద పానగల్ సంస్థానం ఏర్పాటుచేశారని, వారే ఆ తర్వాత మద్రాసు రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలోని ఆమనగల్లు, పిల్లలమర్రి రాజులు తమ పూర్వీకులను వెంకటగిరి రాజులు తమ చరిత్రలో పేర్కొన్నారు. చెన్నపట్నానికి భూమిని ఇచ్చిన వెంకటగిరి రాజులు తమ పూర్వీకుడైన చెన్నమనీడు పేరున ఆ ప్రాంతానికి చెన్నపురి అని పేరు పెట్టాలని కోరారని అందుకు అప్పటి బ్రిటిష్ పాలకులు అంగీకరించారని చెబుతారు. అలా ఎక్కడెక్కడికో తెలంగాణ చరిత్ర మూలాలు విస్తరించా యి. అవేవీ రికార్డు కాలేదు. కాకతీయులకు సామంతులుగా ఉన్న 74 మంది నాయంకరుల జాబితా కూడా ఇప్పటి వరకు లభించలేదు. అన్నీ చిద్రుపలై న చరిత్ర ముక్కలే మనం చదువుకున్నాం.

తెలుగు పదావిర్భావానికి మూలమే త్రిలింగ, తెలింగ, తెలుంగు, తెలింగాన, తెలంగాణ అని అనేక చారిత్రక ఆధారాలున్నాయి. అయితే ఆంధ్ర ఆధిపత్య చరిత్రకారులు తెలంగాణకు, తెలుగుకు సంబంధం లేదని చెప్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ప్రాంతం పేరు నుంచి భాష పేరు, భాష పేరు నుంచి ప్రాంతం పేరు ఆవిర్భవించడం అన్నది చరిత్రలో అనేక ఉదాహరణలున్నాయి. త్రిలింగ ప్రస్తావనలనే మన చరిత్రకారులు ఎందుకో సీరియస్‌గా తీసుకోలేదు. క్రీస్తు శకం రెండవ శతాబ్దం నాటి టాలెమీ యాత్రారచనలో త్రిలింగ ప్రస్తావన ఉంది. వాయుపురాణంలో త్రిలింగదేశ ప్రస్తావన ఉంది. కల్హణుడి రాజతరంగిణిలో త్రిలింగ ప్రస్తావన ఉంది. బ్రాహ్మణుల వర్గీకరణలో తెలంగాణ్య బ్రాహ్మణుల ప్రస్తావనే ఉంది. ఆంధ్ర బ్రాహ్మణ అన్న ప్రస్తావన లేదు. కర్ణాట, మర్హాట, తెలంగాణ్య, ద్రవిడ అన్న ప్రస్తావనలు మాత్రమే ఉన్నాయి. అయినా ఎందుకో తెలంగాణ చరిత్ర రచనకు ఇవేవీ ఆధారాలుగా తీసుకోలేదు. ఎంతసేపూ ఆంధ్ర వైపు నుంచే చరిత్రను చూసే ప్రయత్నం జరిగింది. కృష్ణా జిల్లాలో కృష్ణా నది ఒడ్డున వెలసిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కూడా త్రిలింగదేశాధీశ్వరుడని పిలిపించుకున్నాడు. రాజే దైవంగా వెలసిన ఆలయమని చెబుతారు. ఈయన శాతవాహనుల కంటే ముందు త్రిలింగ దేశాన్ని పరిపాలించాడని ప్రతీతి. కాకతీయులకు కూడా ఆ బిరుదమున్నది. కృష్ణదేవరాయలను కీర్తించిన కవులు కూడా ఆయన పది తెలంగాణ్య దుర్గములను జయించెను అని రాశారు తప్ప, తెలుగు రాజ్యాలను జయించారని రాయలేదు.

శాతవాహనులకు ముందు నుంచే తెలంగాణకు చరిత్ర ఉంది. ఇతిహాస కాలం నాటి పదహారు మహాజనపదాల్లో అస్మక రాజ్యం మన గడ్డమీదే ఉండేది. గోదావరి, మంజీరా నదుల మధ్య ఆ జనపదం ఉండేదని, నేటి బోధను, నాటి పోదన దానికి రాజధానిగా ఉందని చారిత్రక ఆధారాలు లభించాయి. చారిత్రక జైన బాహుబలి ఈ గడ్డ మీదే జన్మించాడని కూడా చెబుతారు. కానీ ఆంధ్ర చరిత్రకారులు ఆ అంశాన్ని అంతగా పట్టించుకోలేదు. దానిని తెలుగు ప్రజల చరిత్రలో భాగంగా చూడలేదు. విచిత్రంగా రాజకీయ కోణం నుంచి చరిత్రను చూడటం నన్నయ కాలం నుంచే మొదలైంది. సంస్కృత భారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడినట్టు ప్రస్తావన ఉంది. దుష్టుల పక్షాన పోరాడిన చరిత్ర మనకెందుకని నన్నయ తెలుగు భారతంలో ఆ ప్రస్తావన తొలిగించారు. అదే ఆంధ్ర సాహితీ చరిత్రకారులు నన్నయను ఆదికవిగా ప్రకటించి తెలుగు భాషా చరిత్ర ప్రాశస్త్యాన్ని, ప్రాచీనతను కుదించివేశారు. అందుకే కావచ్చు తెలుగుకు ప్రాచీన భాష హోదా గురించి ఆంధ్ర ప్రభుత్వం కొట్లాడటం మానేసింది. తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టి ఆధారాలు సమర్పించిన తర్వాత కానీ తెలుగుకు ప్రాచీనభాష హోదా రాలేదు. చరిత్ర మొత్తం ఆంధ్ర ప్రాంత దృక్పథం నుంచే చూశారు. శాతవాహనుల చరిత్రనే తీసుకోండి. దానిని ఆంధ్ర చరిత్రకారులు రివర్సులో వివరించే ప్రయత్నం చేశారు. శాతవాహనుల చరిత్ర మొదలైంది పైఠాన్‌లో. రాజ్యం చేసింది కోటి లింగాలలో.

వారి కార్యస్థలం అంతా దక్కను పీఠభూమి. నాసిక్ నుంచి కృష్ణానది దాకా వారు చాలాకాలం రాజ్యం చేశారు. అంత్యకాల రాజధాని అమరావతి. కానీ ముందు చరిత్రనంతా వదిలేసి తదుపరి చరిత్రను మాత్రమే రాసేందుకు, కీర్తించేందుకు ప్రయత్నించారు. బౌద్ధం, జైనం తెలంగాణలో క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం నుంచి ఉన్నట్టు ఫణిగిరి, కొండాపురం, ధూళికట్ట, కొలనుపాక ఆధారాలు చూపెడుతున్నాయి. ఫణిగిరిలో అశోకుని శాసనం లభించినట్టు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా కృష్ణానది ఒడ్డున ఉన్న ఏలేశ్వరం ఒకప్పుడు నాగార్జునుడి విద్యాపీఠంగా వర్ధిల్లిందని అస్పష్టమైన ఆధారాలను బట్టి తెలుస్తున్నది. కృష్ణానది ఒడ్డున బయల్పడిన చారిత్రక అవశేషాలకు సంబంధించి సరైన రికార్డు లేదు. నందికొండ, ఏలేశ్వరంతోపాటు అత్యధిక గ్రామాలు మునిగిపోయింది తెలంగాణవైపు. కానీ చారిత్రక ఆధారాలన్నీ పోగేసింది నాగార్జున కొండపైన. ఇక్షాకు రాజు వీర పురుషదత్తుని శాసనం ఫణిగిరిలో దొరికింది. అంటే ఆయన నదికి ఈవల ప్రాంతాన్ని పాలించి ఉండాలి. ఆయన రాజ్యం, రాజధాని నదికి ఈవలి వైపు ఉండి ఉండాలి. చారిత్రక విజయపురి ఎక్కడ ఉండేదన్న విషయం ఉద్దేశపూర్వకంగానే వదిలేశారు.

తెలంగాణతో ఏ అనుబంధమూ లేకపోతే ఎవరూ తమను తైలంగులని, తిలింగులని చెప్పుకోరు. కాకతీయ పతనం అనంతరం మతం మార్చుకొని ఢిల్లీ దర్బారులో తుగ్లక్ వద్ద మంత్రిగా చేరిన కాకతీయ మంత్రి మాలిక్ మక్బూల్ తిలింగాణి అని పేరు పెట్టుకున్నాడు. ఢిల్లీలోని ఆయన సమాధిపై ఇప్పటికీ ఆయన పేరు అలాగే ఉంది. తెలంగాణ గడ్డపై నుంచి బర్మా, థాయిలాండు వెళ్లినవారు కొన్ని శతాబ్దాలపాటు తమను తాము తైలంగులుగానే పిలుచుకున్నారు. తమ రాజ్యం ఛిన్నాభిన్నమైతే గోదావరి నది ద్వారా సముద్రానికి చేరుకొని సముద్రం ద్వారా బర్మా, థాయిలాండులకు చేరుకున్నామని అక్కడి వారు చెప్పుకున్నట్టు ఇటీవల ఒక జర్నలిస్టు పరిశోధించి రాశారు. స్థానిక జాతుల నుంచి ఘర్షణ తలెత్తిన తర్వాత వారు తమను మోన్ తెగగా చెప్పుకుంటున్నారు. మన దేశంలోనే ఎక్కడో గురుగ్రామంలో స్థిరపడిన సుధీర్ తైలంగ్ అనే ప్రముఖ కార్టూనిస్టు నేను తెలంగాణవాడిని కాబట్టే నా పేరులో తైలంగ్ అని పెట్టుకున్నానని చెప్పారు. తెలంగాణ మూలాలను వెతికిపట్టుకునే ప్రయత్నం జరుగాలి. తెలంగాణ చరిత్రను ఇతిహాసకాలం నుంచి ఇప్పటివరకు తెలంగాణ చరిత్రను ఒక వరుసక్రమంలో రాసే ప్రయత్నం పెద్దఎత్తున జరుగాలి. కలకత్తా, చెన్నయ్, తంజావూరు, ఢిల్లీ ప్రాచ్య గ్రంథాలయాల్లో ఉన్న సమస్త సమాచారాన్ని క్రోడీకరించి చరిత్ర ఖాళీలను పూరించాలి. తెలుగు మహాసభలు అటువంటి పూనిక తీసుకోవడానికి ఒకమంచి సందర్భం. ఇంటర్ విద్య వరకు తెలుగు భాషను తప్పని సరిచేయడం, తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించబూనుకోవడం తెలుగు భాషకు, తెలంగాణ వైభవ పునరుద్ధరణకు ఒక గొప్ప ప్రయత్నం. ఇదే స్ఫూర్తితో చరిత్ర నిర్మాణానికి కూడా పూనుకోవాలి.

పూర్ణకుంభం తెలంగాణది కూడా

మనకు తెలియాల్సిన మన చరిత్ర చాలా ఉందని మంగళవారం నల్లగొండ జిల్లా పానగల్లు సమీపంలోని ఛాయా సోమేశ్వరాలయం సందర్శించినప్పుడు మరోసారి తెలిసివచ్చింది. ఆలయ ఉప మంటప ద్వారాల్లో పూర్ణకుంభ సహిత ధ్వజశిల కనిపించింది. పూర్ణకుంభం తెలంగాణదా, ఆంధ్రదా అన్న మీమాంస గతంలో జరిగింది. కానీ దేవరకొండ కోట ప్రాంగణంలోనూ, ఛాయా సోమేశ్వరాలయంలోనూ ఆలయ ద్వారాల్లో కనిపించింది. అమరావతి బౌద్ధ స్థూపం నుంచి పూర్ణకుంభాన్ని తీసుకున్నారని మాత్రమే చదువుకున్నాం. అక్కడ పూర్ణకుంభం ఉన్నమాట నిజమే. తెలంగాణలో పూర్ణకుంభం ఉన్నదీ నిజం. ఛాయా సోమేశ్వరాలయంలో గొప్ప శిల్పకళ అసాధారణ నిర్మాణ నైపుణ్యం కళ్లకు గట్టినట్టు కనిపిస్తాయి. సప్తాశ్వాలను పూనిన సూర్య భగవానుని గుడి కూడా ఇందులో ప్రత్యేకమైనది. దశావతారాలను ఆలయ స్థంభం చట్టూ శిల్పాల్లో ప్రదర్శించారు.20160705_133730

20160705_133749

20160705_133809
20160705_135412

20160705_135452

20160705_135647

20160705_134326

20160705_135213