డిమాండు ఎవరిది? సంతోషం ఎవరికి?

2020 సెప్టెంబరు 23 మంగళవారం

వ్యవసాయ చట్టాల సవరణలు రైతులు అడిగారా? పారిశ్రామిక వర్గాలు అడిగాయా?

వ్యవసాయ చట్టాల సవరణలకు పారిశ్రామిక వేత్తలు, సీఐఐ, ప్రైస్వాటర్ కూపర్, డెలాయిట్, అగ్రిబజార్, ఇతర వ్యవసాయాధార పరిశ్రమల యజమానులు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారెందుకు? ఈ చట్టాలు గొప్ప ముందడుగు అని, తమను చలింప జేశాయని ఒక పారిశ్రామిక వేత్త ఆనందం వ్యక్తం చేశారు. మరి రైతులు, రాష్ట్రాలు, రైతు సంఘాలు అందోళన చెందుతున్నాయెందుకు? ఇది విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన సంస్కరణ అని కేంద్ర ప్రభుత్వము, పారిశ్రామిక వర్గాలు చెబుతుంటే, రైతులోకం, రాష్ర్టాలు బిక్కమొకం వేసుకుని ఎందుకు చూస్తున్నాయి?

రాష్ట్రాల జాబితాలోని అంశమైన వ్యవసాయం, మార్కెట్లు, అమ్మకాలపై కేంద్రం చట్టం చేయడం, ఇక నుంచి కేంద్రం ఆదేశాలనే అమలు చేయాలని చెప్పడం అంటే రాజ్యాంగం మౌలిక స్వభావాన్ని మార్చడం కాదా? రాష్ట్రాలు ఇకపై అమ్మకం పన్ను వేయవద్దు సరే. మార్కెట్లలో అవినీతి నుంచి, దళారీల నుంచి రైతుకు విముక్తి కలిగిస్తారు సరే. రైతుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, నీళ్లు, కరెంటు ఎవరు ఇవ్వాలి? పండిన పంటను ప్రాసెసింగ్ చేయడం, నాణ్యత నిర్ధారించడం, ధరనిర్ణయం, నింపడానికి బస్తాలు ఇవ్వడం లేక క్రేట్లు ఇవ్వడం, వాటిని మార్కెట్దాకా రవాణా చేయడం ఇవన్నీ ఎవరు చేయాలి? కేంద్రం లేక ప్రైవేటు ప్లేయర్లు ఈ బాధ్యత తీసుకుంటారా? ప్రైవేటు ప్లేయర్లు రైతులు, వినియోగదారుల మధ్య పెద్ద దళారులుగా అవతరించరన్న హామీ ఏమైనా ఉందా?

రైతులు, ప్రైవేటు ప్లేయర్లకు మధ్య కుదుర్చుకునే ఒప్పందాలకు చట్టబద్ధత కల్పిస్తున్నామని ప్రభుత్వం మాగొప్పగా చెబుతున్నది. ప్రైవేటు ప్లేయర్లతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకే దిక్కులేదు. స్పెక్ట్రం విషయంలో ఎన్నాళ్లుగా వివాదం నడుస్తున్నదో చూస్తూనే ఉన్నాం. ప్రైవేటు ప్లేయర్లతో పెద్ద పెద్ద బ్యాంకులు చేసుకున్న ఒప్పందాలే వీగిపోతున్నాయి. ఇక రైతుల ఒప్పందాలకు ఎంత విలువ ఉంటుందో, రైతు ఏమేరకు పోరాడగలడో ఊహించవచ్చు.

ఈ చట్టాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులపై నియంత్రణలు ఎత్తివేస్తున్నా మని, రైతుకు స్వేచ్ఛనిస్తున్నామని కేంద్రం చెబుతున్నది. రైతుకు స్వేచ్ఛనిస్తున్నదా లేక రైతుకు ఇప్పటిదాకా సహాయకంగా లేక మద్దతుగా ఉన్న అన్ని వ్యవస్థలను ఎత్తేసి మార్కెట్ దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నదా? ప్రకృతివైపరీత్యాలు, పంటనష్టాలు జరిగినప్పుడు ఎవరు ఆదుకుంటారు? ధరలు పతనమై ఉత్పత్తులు కొనేవారు లేనప్పుడు ఎవరు ముందుకు వస్తారు?

చిన్న చిన్న రైతులు మొదలు పెద్ద రైతుల వరకు కోట్ల కమతాలు ఉన్న ఈ దేశంలో, కులాలు, మతాలు, రకరకాల సామాజిక అంతరాలు ఉన్న సమాజంలో కాంట్రాక్టు వ్యవసాయం, సమిష్టి వ్యవసాయం, ఒక జిల్లా ఒకే పంట, ఒకే దేశం ఒకే మార్కెట్ సాధ్యమవుతుందా? సమిష్టి వ్యవసాయం, ఆహార ఉత్పత్తి సంఘాలు(ఎఫ్పీఓ)లు ఇంతకు ముందే ఘోరంగా విఫలమైన విషయం ప్రభుత్వానికి తెలియదా?

నిత్యావసర సరుకుల చట్టం పరిధి నుంచి పప్పు దినుసులు, నూనెధాన్యాలు, నూనె గింజలు, తృణధాన్యాలు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు తొలగిస్తూ కొత్త చట్టం తెచ్చారు. అంటే ఈ ఆహారోత్పత్తులను ఎక్కడయినా ఎవరయినా ఎంత మొత్తమయినా నిలువ చేయవచ్చా?

ఈ సంస్కరణలన్నీ మార్కెట్ అనుకూల, వ్యాపారవర్గాల అనుకూలంగా కనిపిస్తున్నాయే తప్ప రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేవిగా కనిపించడం లేదు. ఒకవైపు వ్యవసాయ పెట్టుబడి వ్యయం పెరగడానికి అన్నిరకాల కారణమవుతున్న కేంద్రం, మరోవైపు రైతు ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నామంటే నమ్మకం కలుగదు. ఎరువులు, డీసెల్, విత్తనాలు, యంత్రసాధనాల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. రైతు ఉత్పత్తి పెరిగినా పెట్టుబడి వ్యయం అదుపులో లేకపోతే ఆదాయం పెరగడం అటుంచి రైతు అప్పుల పాలవడం ఖాయం.

57 borrowers owe banks ₹85,000 cr, RBI tells apex court

Press Trust of India
October 24, 2016

New Delhi, October 24:

Only 57 borrowers have defaulted on bank loans worth ₹85,000 crore. The Supreme Court said this after perusing a report submitted by the RBI about persons who have taken loan worth over ₹500 crore and defaulted and asked the central bank why their names should not be made public.

“Who are these people who have borrowed money and are not paying back? Why this fact that the person has borrowed money and not paying back be not known to public,” asked a Bench headed Chief Justice TS Thakur.

The Bench, also comprising Justices DY Chandrachud and L Nageswara Rao, said if the bar was lowered below ₹500 crore, then the default amount would cross over ₹1 lakh crore. Observing that if people file an RTI query, they must know who the defaulters are, it asked the Reserve Bank of India why the information on defaulters should be withheld.

Demonetisation damage greater than its benefits, says Kaushik Basu

img_4334
Arup Roychoudhury | New Delhi November 12, 2016 Last Updated at 02:10 IST

World Bank Chief Economist and India’s former chief economic advisor Kaushik Basu said that the Narendra Modi government’s demonetization drive was not ‘good economics’ and that the damage it causes will be greater than its benefits.

“GST was good economics; the demonetization is not. Its economics is complex & the collateral damage is likely to far outstrip the benefits,” Basu tweeted on Friday evening. Basu was the CEA in the Finance Ministry from December 2009 to July 2012.

On day two of the demonetization drive, serpentine queues were reported from banks and ATMs around the country.

While government utilities were said to be accepting old currency, banks were quickly running out of cash.

Senior government officials said that such difficulties were expected and things would improve in the coming days, even as the centre extended the use of old notes in utilities by another 72 hours.

-Courtesy Business Standard

Kaushik Basu, is an Indian economist and academic who is Senior Vice-President and Chief Economist of the World Bank. He is on leave from Cornell University, where he is the C. Marks Professor of International Studies and Professor of Economics.

సూక్ష్మ పాలన-సత్వర ఫలితాలు

IMG_2796

అభివృద్ధి సోపానంలో అట్టడుగున ఉన్న వర్గాలకు నిజమైన స్వావలంబన చేకూరాలి. అవి సాధించాలంటే రాజకీయ నాయకులు, అధికారులు ప్రజలకు దగ్గరగా ఉండాలి. అభివృద్ధి పథకాల అమలును దగ్గరగా చూడాలి. చేసే ప్రతిపనిలో నాణ్యతా కొలమానాలు ఉండాలి. అటువంటప్పుడే ఎన్నదగిన, గమనించదగిన, దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యం. జిల్లాలు పెరిగితే అధికారులు పెరుగుతారు. ఖర్చులు పెరుగుతాయి అని చేస్తున్న వాదన అర్థరహితమైనది. జిల్లాలు పెరిగితే పాలన పెరుగుతుంది. దృష్టిపెట్టి పనిచేయడం జరుగుతుంది. లీకేజీలకు, అవినీతికి అడ్డుకట్టపడుతుంది. ప్రభుత్వం వెచ్చించే నిధులు ప్రజలకు చేరతాయి. ఒక పురోగామి రాష్ట్రంగా, ఉన్నత జీవన ప్రమాణాలను సాధించే రాష్ట్రంగా ముందుకు సాగుతుంది.

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లబ్దిదారులకు చేరడం లేదు. ప్రభుత్వం రూపాయి ఖర్చుపెడితే లబ్దిదారులకు చేరుతున్నది 15 శాతానికి మించి చేరడం లేదు అని నాడు రాజీవ్‌గాంధీ మొదలు మొన్న బీజేపీ నాయకత్వం వరకు పదే పదే చెబుతున్న మాట. ఆరు దశాబ్దాలుగా పేదరిక నిర్మూలన పథకాలు అమలు చేస్తున్నా ఇప్పటికీ 20 శాతానికి పైగా ప్రజలు పేదరికంలో ఉన్నారని కేంద్ర ప్రభుత్వమే అంగీకరిస్తున్నది. అవినీతి సహజం దానిని ఏమీ చేయలేమని ఒకప్పుడు ఇందిరాగాంధీ, ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను మార్చలేమా? ప్రభుత్వం చేతుల్లో ఏమీ లేదా? నాయకులు రాజనీతిజ్ఞులయితే, దీర్ఘదృష్టి, ప్రజాసంక్షేమాపేక్ష, పట్టుదల ఉంటే ఎందుకు మార్చలేము? సంక్షేమ పథకాల్లో 85 శాతం వృథాను అరికడితే పేదరికాన్ని జయించలేమా? అవినీతిని కట్టడి చేస్తే ప్రజలపై భారాన్ని తగ్గించి ప్రజారంజక పాలన అందించలేమా? సర్క్యులర్ రాజ్యాన్ని మార్చి ప్రజలు, పారిశ్రామిక వేత్తలు తేలికగా పనులు చేసుకునే వెసులుబాటు తేలేమా?అభివృద్ధిని ఉరకలు వేయించలేమా? తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సరిగ్గా ఇదే అంశంపై సంస్కరణలు మొదలు పెట్టారు. ఆలోచించడం, ప్రశ్నలు వేసుకోవడం, అందరిచేతా ఆలోచింపజేయడం, సమాధానాలు రాబట్టడం, విధానాలు రూపొందించడం, ఆచరణలో పెట్టడం తెలంగాణలో ఇవన్నీ ఒక పరంపరగా జరుగుతున్నాయి. ప్రజలకు గరిష్ట ప్రయోజనం కలిగించగల మార్గాలను అన్వేషించడంలో ఆయన నిత్య శోధకుడు. అస్తమానం ఏదో ఒక దేవులాటతో తపించే ముఖ్యమంత్రిని నేనింతవరకు చూడలేదు. పత్రికలు చదవడం, చానెళ్లు ఫాలోకావడం, సామాజిక మాధ్యమాల్లో ఏం జరుగుతున్నదో కనిపెట్టడం, నిరంతరం ఏవో కొత్తకొత్త ఆలోచనలు చేయడం, అందరితో ఆ ఆలోచనలను పంచుకోవడం, ఆచరణకు ఉద్యుక్తులను చేయడం…ఒక ముఖ్యమంత్రి ఇంతగా శ్రమపడడం అసాధారణం. గతంలో ముఖ్యమంత్రులకు పౌరసంబధాల అధికారులు పత్రికలు, చానెళ్లు చూసి సంక్షిప్త నివేదికలు ఇచ్చేవారు. వాటిని పైపైన చూసి పక్కన పడేసేవారు. కేసీఆర్ అలాకాదు వార్తలు చదివి, వాటిపై అప్పటికప్పుడు సూచలు చేయడం, ఆదేశాలు ఇవ్వడం ఆయనకు రివాజు. ఆయన చుట్టూ ఉండే అధికారులు, సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండవలసిందే. ఒక్కోసారి అనిపిస్తుంది-తెలంగాణ రాష్ట్రం, స్వయం పాలన, అసాధారణ అభివృద్ధి, సంక్షేమ విజయాలను సాధించిన ఒక ముఖ్యమంత్రి ఇంతగా కష్టపడడం అవసరమా అని. కానీ ఆయన విశ్రమించరు. ఎవరినీ విశ్రమించనీయరు. ఒక్కోసారి ఇబ్బంది అనిపించినా ఆయన ఓపిక, ఆయా అంశాలపై ఆయన చూపే శ్రద్ధ మనలను ఆశ్చర్యపరుస్తుంది. ఉద్యుక్తులను చేస్తుంది. అది ఆయన తత్వం. శోధించాలి, సాధించాలి…ఆయన కార్యాచరణలో కనిపించే తత్వం. ఆయన మనస్తత్వం. కొత్తగా ఆయన మారే అవకాశమే లేదు. ఆయన అసాధారణ ఆలోచనల పుట్ట. ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేయండి అని తన సహచరులకు పురమాయించడం ఆయన ఉద్యమకాలం నుంచీ చెబుతున్న మాట. ఇప్పుడూ అదే ఒరవడి.

దేశంలో 29 రాష్ర్టాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 687 జిల్లాలు ఉంటే అందులో 250 జిల్లాలు పది లక్షలు అంతకంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి. ఐదు లక్షలు అంతకంటే తక్కువ జనాభా కలిగిన జిల్లాలు సుమారు 100 ఉన్నాయి. చత్తీస్‌గడ్‌లో 24 జిల్లాలు ఉంటే 19 జిల్లాలు సుమారు పదిలక్షలు అంతకంటే తక్కువ జనాభా కలిగిన జిల్లాలున్నాయి. మధ్యప్రదేశ్‌లో 16 జిల్లాలు ఐదు నుంచి పదిలక్షల జానాభా కలిగి ఉన్నాయి. పంజాబ్‌లో పది జిల్లాలు పదిలక్షలు అంతకంటే తక్కువ జనాభాతో ఉన్నాయి. గుజరాత్‌లో పది, జార్కండులో 11, ఉత్తరాఖండ్‌లో 9 పదిలక్షల కంటే తక్కువ జనాభాతో జిల్లాలు ఉన్నాయి. తక్కువ జనాభాతో ఎక్కువ జిల్లాలు కలిగిన రాష్ర్టాలన్నీ అభివృద్ధి సూచికలో పైమెట్టులో ఉండడమో, పైస్థానానికి ఎదగడానికి గట్టిగా పోరాడుతుండడమో చేస్తున్నాయని వేరేచెప్పనవసరం లేదు.

జిల్లాల ఏర్పాటు నిర్ణయం కూడా ఆ ఆలోచనా స్రవంతిలో భాగమే. తెలంగాణ సాధించడమే కాదు, సాధించిన తర్వాత ఏమి చేయాలో ఆయన చాలా కాలం నుంచి ప్రణాళికలు ఆలోచిస్తూ వచ్చారు. కొత్త జిల్లాల ఆలోచన కూడా అటువంటిదే. తెలంగాణ సాధించినంత గొప్ప చరిత్రాత్మక పరిణామం. మార్పు దిశగా వేసిన ఒక గొప్ప ముందడుగు. చిన్న జిల్లాలు లక్ష్యాల సాధనకు దగ్గరి మార్గం. ఫలితాలపై దృష్టిపెట్టి పనిచేయడానికి, సత్వర ఫలితాలు సాధించడానికి ఒక ప్రగతిశీల పాలనా సంస్కరణ. నిర్వహణ, తనిఖీ, పర్యవేక్షణ, ఫలితాల సమీక్షకు అందనంత పెద్ద జిల్లాలు ఇంతకాలం కొనసాగాయి. కాలంచెల్లిన రాజకీయ ఆలోచనలతో, అభివృద్ధి నిరోధక ఆధిపత్య ధోరణులతో జిల్లాల్లో తరతరాలుగా పాతుకుపోయిన రాజకీయ పెత్తందారీ వ్యవస్థల పట్టునుంచి ప్రాంతాలను విముక్తి చేసే ప్రజాస్వామిక ప్రక్రియ జిల్లాల ఏర్పాటు. ప్రజలకోసం, ప్రజలకు చేరువగా ప్రభుత్వం ఉండాలని యోచించేవారెవరూ కొత్త జిల్లాలను వ్యతిరేకించరు. వెనుకటికి ఎన్‌టిఆర్ మండలాల వ్యవస్థను తెచ్చినప్పుడు అప్పటిదాకా నిద్రాణమై ఉన్న సామాజిక శక్తులు ఒక్కసారిగా స్వేచ్ఛను పొంది రాజకీయాధికార సౌధాల్లో అడుగుపెట్టగలిగారు. కేసీఆర్ జిల్లాల సంస్కరణ అంతకంటే గొప్ప మార్పు. ఎన్ని జిల్లాలు, ఎంత జనాభా అన్న పంచాయతీ కూడా అర్థరహితమైనది. తెలంగాణకంటే తక్కువ వైశాల్యం కలిగిన బీహార్‌లో 38, పశ్చిమబెంగాల్‌లో 20, జార్కండులో 24, అస్సాంలో 35, పంజాబ్‌లో 22, హర్యానాలో 22 జిల్లాలు ఉన్నాయి. దేశంలో 29 రాష్ర్టాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 687 జిల్లాలు ఉంటే అందులో 250 జిల్లాలు పది లక్షలు అంతకంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి. ఐదు లక్షలు అంతకంటే తక్కువ జనాభా కలిగిన జిల్లాలు సుమారు 100 ఉన్నాయి. చత్తీస్‌గడ్‌లో 24 జిల్లాలు ఉంటే 19 జిల్లాలు సుమారు పదిలక్షలు అంతకంటే తక్కువ జనాభా కలిగిన జిల్లాలున్నాయి. మధ్యప్రదేశ్‌లో 16 జిల్లాలు ఐదు నుంచి పదిలక్షల జానాభా కలిగి ఉన్నాయి. పంజాబ్‌లో పది జిల్లాలు పదిలక్షలు అంతకంటే తక్కువ జనాభాతో ఉన్నాయి. గుజరాత్‌లో పది, జార్కండులో 11, ఉత్తరాఖండ్‌లో 9 పదిలక్షల కంటే తక్కువ జనాభాతో జిల్లాలు ఉన్నాయి. తక్కువ జనాభాతో ఎక్కువ జిల్లాలు కలిగిన రాష్ర్టాలన్నీ అభివృద్ధి సూచికలో పైమెట్టులో ఉండడమో, పైస్థానానికి ఎదగడానికి గట్టిగా పోరాడుతుండడమో చేస్తున్నాయని వేరేచెప్పనవసరం లేదు. అధికార వికేంద్రీకరణ, సమర్థ నిర్వహణ, సూక్ష్మస్థాయి పర్యవేక్షణ, ఆశించిన ఫలితాల సాధన చిన్న పాలనా కేంద్రాల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలు. తెలంగాణ కూడా అభివృద్ధి దిశగా వేసిన ఒక పెద్ద ముందడుగు జిల్లాల ఏర్పాటు. గాంధీ జయంతిరోజు ముఖ్యమంత్రి మరికొన్ని జల్లాలను కూడా అంగీకరించి ఆందోళన చేస్తున్నవారిని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. పంతాలు పట్టింపులకు పోకుండా వీలైనంత విస్తృత ఆమోదంతో నిర్ణయాలు చేశారు. అయినా అక్కడక్కడా డిమాండ్లు, అలకలు, అసంతృప్తులు మిగిలిపోవడం సహజం. అందులో న్యాయమైనవీ, ఆచరణ సాధ్యం కానివీ ఉండవచ్చు. ఏదో ఒక పేచీ లేవనెత్తేవారు ఎప్పుడూ ఉంటారు. విశాలదృష్టితో ఏం జరుగుతున్నదన్నదే ముఖ్యం.

తెలంగాణ ప్రభుత్వం దేశంలో మునుపెన్నడూ ఏ ప్రభుత్వమూ చేయని సాహసాలు చేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ జాతి దృష్టిని ఆకర్షించాయి. అందరి మన్ననలూ పొందుతున్నాయి. నీటి విలువ తెలిసిన రాష్ట్రంగా అత్యంత వేగంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నది. సుమారు 50 వేల కోట్ల రూపాయలు సంక్షేమ రంగాల్లో ఖర్చు చేస్తున్నది. రాష్ట్ర జనాభాలో పది శాతం మందికి పించన్లు ఇవ్వడం ద్వారా సామాజిక భద్రత కల్పిస్తున్నది. ఆహార భద్రత విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు చేసింది. రెండు పడక గదుల ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి పథకాలను ప్రారంభించినా అవి ఇంకా వేగంగా అమలు చేయవలసి ఉంది. కేజీ టూ పీజీ, సంక్షేమ గురుకులాల ఏర్పాటు వేగంగా కార్యరూపం దాల్చాల్సి ఉంది. ఇవన్నీ త్వరితగతిన అమలు చేయడానికి, నిర్వహించడానికి, ఫలితాలు సాధించడానికి దృష్టిని కేంద్రీకరించి పనిచేసే యంత్రాంగం కావాలి. ఒక అధికారి అరవై మండలాలు చూడడం వేరు. ఒక అధికారి పది నుంచి ఇరవై మండలాలు చూడడం వేరు. ఏళ్ల తరబడి పేదరిక నిర్మూలన పథకాలు అమలు చేస్తూ ఉంటే లాభం లేదు. అవి ఫలితం ఇవ్వాలి. ప్రజలకు పేదరికాన్ని జయించే సాధన సంపత్తి సమకూర్చాలి. ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో 85 శాతం లీకేజీలను అరికట్టగలిగితే ఈదేశంలో పేదరికం ఎప్పుడో అంతమయ్యేది. పేదలకు పూరిగుడిసెల్లాంటి ఇండ్లు, ఏవో పప్పు బెల్లాలు అందించి చేతులు దులుపుకోవడం, రాజకీయ నాయకత్వం అంతకంతకూ ఎదగడం ఇప్పటిదాకా జరుగుతున్న తంతు. ఇదే మూస ధోరణితో పనిచేస్తే ఇంకెన్ని దశాబ్దాలు పేదరిక నిర్మూలన పథకాలు అమలు చేసినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉండిపోతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత నాలుగు దశాబ్దాల్లో కట్టించిన ఇళ్లన్నీ సరిగా ఉండి ఉంటే ఇప్పుడు సొంత ఇళ్లకు ఇంత డిమాండు ఉండేది కాదు. నాణ్యత లేని ఇండ్లు ఇవ్వడం, అవి నాలుగు రోజులకే పాడైపోవడం, పేదలు మళ్లీ వీధుల్లో పడడం, మళ్లీ ఇండ్లకోసం దరఖాస్తులు చేసుకోవడం ఇదో చక్రభ్రమణంలాగా తయారైంది. ఈ పరిస్థితి పోవాలంటే ప్రభుత్వం ఖర్చు చేసే నిధులు ప్రజలకు నాణ్యమైన, దీర్ఘకాలం మన్నగలిగే ఆస్తిని సమకూర్చాలి. అభివృద్ధి సోపానంలో అట్టడుగున ఉన్న వర్గాలకు నిజమైన స్వావలంబన చేకూరాలి. అవి సాధించాలంటే రాజకీయ నాయకులు, అధికారులు ప్రజలకు దగ్గరగా ఉండాలి. అభివృద్ధి పథకాల అమలును దగ్గరగా చూడాలి. చేసే ప్రతిపనిలో నాణ్యతా కొలమానాలు ఉండాలి. అటువంటప్పుడే ఎన్నదగిన, గమనించదగిన, దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యం. జిల్లాలు పెరిగితే అధికారులు పెరుగుతారు. ఖర్చులు పెరుగుతాయి అని చేస్తున్న వాదన అర్థరహితమైనది. జిల్లాలు పెరిగితే పాలన పెరుగుతుంది. దృష్టిపెట్టి పనిచేయడం జరుగుతుంది. లీకేజీలకు, అవినీతికి అడ్డుకట్టపడుతుంది. ప్రభుత్వం వెచ్చించే నిధులు ప్రజలకు చేరతాయి. ఒక పురోగామి రాష్ట్రంగా, ఉన్నత జీవన ప్రమాణాలను సాధించే రాష్ట్రంగా ముందుకు సాగుతుంది.

స్వయంపాలనే పరమావధి

ts_new_districts_revenue_div

జిల్లాల విభజన వల్ల కలిగే ప్రయోజనాల సంగతి వేరే చెప్పనవసరం లేదు. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఒనగూరుతున్న ప్రయోజనాలే జిల్లాల కు వర్తిస్తాయి. వికేంద్రీకరణ వల్ల జిల్లాల పరిధి తగ్గుతుంది. జన సంఖ్య తగ్గుతుం ది. కేంద్రీకృత అభివృద్ధి జరుగుతుంది. జిల్లాలు పెద్దవి కావడం వల్ల అధికారులు, నాయకులు ఏ ఒక్క అంశంపై శ్రద్ధపెట్టడం సాధ్యం కావడం లేదు. దృష్టిని కేంద్రీకరించడం సాధ్యపడటం లేదు. అంతేకాదు పెద్ద జిల్లాలో తరతరాలుగా పాతుకుపోయిన నాయకత్వాల కింద బలహీన నాయకత్వాలున్న ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో బాగా అభివృద్ధి జరుగుతుంది. మరికొన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటాయి. జిల్లాల పునర్విభజన అటువంటి జాఢ్యాలన్నింటినీ బదాబదలు చేస్తుంది.

జిల్లాల విభజనవల్ల ఏమిటి ప్రయోజనం? ఇటీవల కొందరు బుద్ధిజీవులు, మరికొందరు బుద్ధివిగత జీవులు పదే పదే ప్రశ్నిస్తున్నారు. విభజనలో ఏదో లోపం ఉన్నట్టు, ప్రభుత్వానికి ఏవో దురుద్దేశాలున్నట్టు విమర్శలు చేస్తున్నారు. సిద్ధాంతా లు, సూత్రాలు వల్లెవేస్తున్నారు. వీరి వాదనలు వింటుంటే కొన్నాళ్ల క్రితం తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యవాదులు చేసిన వాదనలే గుర్తుకు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడితే నష్టపోతుందని, సొంతంగా మనుగడ సాగించలేదని, తమ నిధులేవో తెచ్చి పేద ప్రాంతమైన తెలంగాణను పోషిస్తున్నామని కొందరు ఆధిపత్యవాదులు ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ చివరికి ఏం జరిగింది? ఎవరు ఎవరిపై ఆధారపడ్డారు? ఎవరి నిధులతో ఎవరు సంబురాలు చేసుకున్నారు? ఈ రెండున్నరేళ్ల లో ఒక్కొక్క వాస్తవమే తెలిసివచ్చింది. స్వయంపాలనాధికారం తెలంగాణ ఉద్యమానికి తాత్విక భూమిక.

సుదీర్ఘ ఉద్యమాల తర్వాత స్వయంపాలనాధికారం సాధించుకున్నాం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ ఒక విశిష్టరాష్ట్రంగా, అభివృద్ధికి కొత్త నమూనాగా, ప్రజాసంక్షేమమే కేంద్ర బిందువుగా ముందుకు సాగుతున్నది. మన నిధులు మనం ఖర్చు చేసుకోవడం, మన ఉద్యోగాలు మనం భర్తీ చేసుకోవడం, మన నీళ్లు మనం వాడుకోవడం, మన భవిష్యత్తుకు మనం బంగారుబాటలు వేసుకోవడం, మన ప్రాజెక్టులను మనం మరింత ప్రయోజనకరంగా రూపకల్పన చేసుకోవడం, మన రాష్ట్రం-మన ఆత్మతో పనిచేయడం….ఇవన్నీ తెలంగాణ సాధించిన విజయాలు. మన ప్రభుత్వం, మన నాయకులు, మన కళ్ల ముందు. మన ప్రణాళికలు… అన్నీ మనకు తెలిసే జరుగుతున్నా యి. అయితే స్వయంపాలన సాధించడం అంటే మన రాష్ట్రం ఏర్పడటం, మన నాయకత్వానికి అధికారం రావడం ఒక్కటే కాదు.

కేసీఆర్ దానిని ఇంకా అట్టడుగు వర్గాల దాకా తీసుకెళ్లాలనుకుంటున్నారు. రాజకీయ, పాలనా వ్యవస్థల వికేంద్రీకరణ మరింత విస్తృతంగా జరుగాలనుకున్నారు. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కావాలని తపనపడినట్టే తమకు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేయాలని తెలంగాణలో చాలా ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్లు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనకు శ్రీకారం చుట్టారు. ఉన్నతాధికారుల కమిటీ, మంత్రివర్గ కమిటీ అందరూ అధ్యయనం చేసి, ప్రతిపక్షాలతో కూడా మాట్లాడిన తర్వాతనే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా ప్రకటనను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజల అభిప్రాయాల ను కోరింది. వేలాది అభిప్రాయాలు, అభ్యంతరాలు వచ్చాయి. అన్నింటినీ ప్రభు త్వం పరిశీలిస్తున్నది. ముఖ్యమంత్రి వివిధ ప్రాంతాల నుంచి విన్నపాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. స్థూలంగా ప్రజాభీష్టానికి అనుగుణంగానే తుది ప్రకటన వెలువడుతుందని ప్రభుత్వం చెబుతున్నది.

జిల్లాల విభజన వల్ల కలిగే ప్రయోజనాల సంగతి వేరే చెప్పనవసరం లేదు. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఒనగూరుతున్న ప్రయోజనాలే జిల్లాల కు వర్తిస్తాయి. వికేంద్రీకరణ వల్ల జిల్లాల పరిధి తగ్గుతుంది. జన సంఖ్య తగ్గుతుం ది. కేంద్రీకృత అభివృద్ధి జరుగుతుంది. జిల్లాలు పెద్దవి కావడం వల్ల అధికారులు, నాయకులు ఏ ఒక్క అంశంపై శ్రద్ధపెట్టడం సాధ్యం కావడం లేదు. దృష్టిని కేంద్రీకరించడం సాధ్యపడటం లేదు. అంతేకాదు పెద్ద జిల్లాలో తరతరాలుగా పాతుకుపోయిన నాయకత్వాల కింద బలహీన నాయకత్వాలున్న ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో బాగా అభివృద్ధి జరుగుతుంది. మరికొన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటాయి. జిల్లాల పునర్విభజన అటువంటి జాఢ్యాలన్నింటినీ బదాబదలు చేస్తుంది. జిల్లాల మధ్య పోటీ ఏర్పడుతుంది. నాయకులు దృష్టిని కేంద్రీకరించి లక్ష్యాలు, ఫలితాలు సాధించడానికి సులువవుతుంది. పథకాల అమలులో పారదర్శకత ఏర్పడుతుంది. ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతుంది.

కలెక్టరాఫీసుకు పోవడం అంటే బ్రహ్మలోకం పోవడంలాగా ఎవరూ భారంగా భావించే పరిస్థితి ఉండదు. ఉన్నతాధికార యత్రాంగం సామాన్యులకు అందుబాటులోకి వస్తారు. అధికారులు జిల్లాలకు సంబంధించిన సమస్త అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అలవోకగా పనిచేయడానికి, ఫలితాలు రాబట్టడానికి వీలవుతుంది. ఖర్చు పెట్టే ప్రతిపైసాకు ఫలితాలను చూపించాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. పర్యవేక్షణ, తనిఖీ, నిర్వహణ, ఫలితాల గణన అన్నీ సునిశితంగా చేయడానికి వీలవుతుంది. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలకు జిల్లాల పునర్విభజన గట్టి పునాదులు వేస్తుంది. కేవలం జిల్లాలను ఏర్పాటు చేయడం కార్యాలయాలు ఇవ్వడం కాకుండా, జిల్లాలను అభివృద్ధి కేంద్రాలుగా మల్చడానికి వీలుగా ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా జిల్లాల ప్రత్యేకతలను గుర్తించి, వాటికి తగిన పారిశ్రామిక వాడలు లేదా చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పడానికి ఆలోచనలు చేస్తున్నారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా సాధిస్తున్న ముందడుగే రేపు జిల్లాలు సాధిస్తాయని ఏమాత్రం విచక్షణతో చూసినా అర్థమవుతుంది.

ఎటువంటి మార్పును మొదలుపెట్టినా అపశకునాలు పలికే వాళ్లు కొందరు ఉంటారు. తమ ఆలోచనల ప్రకారం లోకం స్తంభించిపోవాలని కొందరు కోరుకుంటుంటారు. తమకు నచ్చితే వైభవం, నచ్చకపోతే అధ్వాన్నం. ఇదీ వారి ధోరణి. కొన్ని ప్రాంతాల ప్రజలు తమకూ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుకోవడం న్యాయ మే కావచ్చు. కానీ భౌగోళిక, రాజకీయ పరిమితులన్నీ కలిసి రావాలి. కొన్ని రాజకీయ శక్తుల డిమాండ్లో, రియలెస్టేటు పక్షాల డిమాండ్లో ముందేసుకుంటే జిల్లాల సంఖ్య 27తో ఆగదు. సిరిసిల్ల, జనగామ ప్రజలు జిల్లాను కోరుకోవడంలో తప్పులేదు, కానీ రాష్ట్రం విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలపై జరిగే తుది నిర్ణయాలను అర్థం చేసుకోవాలి. గద్వాల శాసనసభ్యురాలు డి.కె.అరుణ గతంలో మంత్రిగా పనిచేశారు.

ఆమె గద్వాలను జిల్లాను చేయాలని కోరడం వరకు బాగానే ఉంది. కానీ ఆ అంశంపై వ్యక్తిగత పట్టింపులు, పంతాలదాకా వెళ్లడం విచిత్రంగా ఉంది. గద్వాలను ఒక ప్రజాస్వామిక రాజకీయ కేంద్రంగా కాకుండా ఆమె అదేదో తన సొంత ఆస్తి వ్యవహారంలాగా ఎందుకు భావిస్తున్నారో అర్థం కాదు. వనపర్తిని జిల్లాను చేసి మళ్లీ గద్వాలను కూడా జిల్లా చేయడం ఎలా సాధ్యమో ఆమె ఆలోచించాలి. రాష్ట్ర నాయకురాలిగా, మహబూబ్‌నగర్ జిల్లా నాయకురాలిగా కాకుండా కేవలం ఒక గద్వాలకే నాయకురాలిగా ఎందుకు రుజువు చేసుకోవాలనుకుంటున్నారు? జిల్లాల విభజన తుది దశకు చేరుకుంటున్న దశలో శాసనసభ్యత్వ రాజీనామా లేఖను ముఖ్యమంత్రి పంపించడం అంటే దీనిని ఆమె తన వ్యక్తిగత సమస్యగా భావిస్తున్నారన్నమాట.

ప్రజాస్వామిక ప్రక్రియను అపహాస్యం చేసే ధోరణి. నిజానికి జిల్లాల విభజన విషయంలో ఎక్కువ కష్టపెట్టుకుందీ, ఇబ్బందిపడ్డదీ ముఖ్యమంత్రి తనయుడు, పురపాలకశాఖ మంత్రి తారకరామారావు. తన నియోజకవర్గ ప్రజలు జిల్లా కావాలని బలంగా కోరుకున్నారు. ఉద్యమాలు చేశారు. అందులో అన్ని పార్టీలవారూ ఉన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రం అయితే బాగుంటుందని కేటీఆర్ కూడా గట్టిగానే భావించారు. కానీ ఆచరణలోకి వచ్చే సరికి చుట్టూ కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఏర్పాటు చేయగా సిరిసిల్లా జిల్లా ఏర్పాటు చేయడానికి తగిన భౌగోళిక అనుకూలతలు కనిపించలేదు. అయిష్టంగానే అయినా కేటీఆర్ కూడా వెనుకకు తగ్గవలసి వచ్చింది. ముఖ్యమంత్రి కూడా తన మన అని చూడకుండా తుది నిర్ణయాలు చేస్తున్నారు. సొంత ప్రయోజనాలు, తక్షణ ప్రయోజనాల దృష్టితో కాకుండా విశాల ప్రయోజనాల దృష్టి తో జిల్లాల విభజనను అర్థం చేసుకోవాలి.

కొంత మంది మిత్రులు జిల్లాలు తమ ప్రత్యేక గుర్తింపును కోల్పోతున్నాయని, బలహీనపడుతున్నాయని వాదిస్తున్నారు. ఎక్కువకాలం ఇదే జిల్లాల వ్యవస్థ ఉండటం వల్ల మనకు అలా అనిపించడం సహజమే. కానీ జిల్లాలు సుదీర్ఘకాలంపాటు పెద్దవిగా ఉండి అభివృద్ధిలో బలహీనపడిపోవడం, వెనుకబడిపోవడం కంటే చిన్నవిగా ఉండి బలమైన అభివృద్ధి కేంద్రాలుగా ఎదగడం మంచిది. ప్రస్తుతం ఉన్న జిల్లాలు మనకు ఈ వందేళ్లుగా తెలిసి ఉండవచ్చు, కానీ చరిత్ర అంతటా చిన్నచిన్న రాజకీయాధికార వ్యవస్థలే ఉన్నాయి. కాకతీయుల కాలంలో కూడా 70కి పైగా ప్రాంతీయ రాజ్యాలు ఉండేవని చెబుతారు. దేని ప్రత్యేకత దానికి ఉంది. కొంతకాలం చాలా సంస్థానాలూ రాజకీయాధికార కేంద్రాలుగా కొనసాగా యి. ఇప్పుడు కొత్త జిల్లాలుగా ఏర్పడుతున్న ప్రాంతాలన్నింటికీ చరిత్రలో, సంస్కృతిలో ప్రత్యేకతలున్నాయి. వేటికవి తమ ప్రత్యేకతలను, ప్రతీకలను పునరుద్ధరించుకుని ఉన్నతంగా ఎదగాలి.

అడుగడుగునా జల దృశ్యాలు 

మూసి రిజర్వాయర్, నల్గొండ జిల్లా.

సిద్ధిపేట సమీప చెక్ డ్యామ్లు అలుగుపోస్తున్న సంబరం

మెదక్ జిల్లా ఘనపురం ప్రాజెక్టు కత్వ దూకుతున్న దృశ్యం

**********ఇవి నమస్తే తెలంగాణ విలేఖరులు పంపిన ఫొటోలు*********

గోదావరికి విముక్తి

godavaribesin

గోదావరి ప్రాజెక్టులపై కుదిరిన ఒప్పందం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక నూతనాధ్యాయం. చర్చలు, సంప్రదింపులు, పరస్పర సహకార ధోరణితో అసాధ్యం సుసాధ్యం చేయవచ్చునని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆచరించి చూపారు. చనాక-కొరాట, తమ్మిడిహట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులపై మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందంపై సంతకాలు చేయడం అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల చరిత్రలో ఒక కొత్త ఒరవడి. కేరళ-తమిళనాడు, కర్ణాటక-తమిళనాడు, ఒరిస్సా-చత్తీస్‌గడ్, హర్యానా-పంజాబ్ వంటి రాష్ర్టాలు నదీజలాలకోసం పరస్పరం ఘర్షణపడుతున్న తరుణంలో తెలంగాణ, మహారాష్ట్రలు దేశానికి ఒక కొత్త మార్గాన్ని చూపాయి. మంచితనంతో మనసులు గెలవడం అన్న నినాదంతో ముఖ్యమంత్రి అనుసరించిన విధానం అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నది. వరద గోదావరిపై ఒక్క ప్రాజెక్టునూ నిర్మించని కాంగ్రెస్, టీడీపీల అరవయ్యేళ్ల దాష్టీకానికి చరమగీతం పాడుతూ ఇవ్వాళ తెలంగాణ ఒక గొప్ప ముందడుగు వేసింది. మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రీ సాధించని విజయాన్ని మన ముఖ్యమంత్రి తన రాజకీయ దౌత్యంతో సాధించారు.

తలాపునా పారుతుంది గోదారీ
నీ చేను నీ చెలకా ఎడారీ
అని బాధాతప్త గీతాలు పాడుకున్న నేలపై ఇప్పుడు కోటి జల వసంతాలు ఆవిష్కృతం అవుతున్నాయి. ఎండిబీటలు వారిపోయిన తెలంగాణ బీడు భూముల దాహం తీర్చినప్పుడే గోదావరికి శాంతి, విముక్తి. తెలంగాణ ఇవ్వాళ మరోసారి రాష్ట్రం సాధించుకున్నంత సంబరంగా పండుగ చేసుకుంటున్నది. జీవధార గోదావరిని మన పొలాలకు మళ్లించే మహాయజ్ఞానికి ఈరోజు రాచబాట ఏర్పడింది. నీటికోసం ప్రజల గోస, భాష, బాధ తెలిసిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఫలితం ఎలా ఉంటుందో ఈరోజు మరోసారి తెలిసివచ్చింది. స్వరాష్ట్రం, స్వయంపాలన ఏమి సాధించగలదో ఈ రోజు మరోసారి రుజవుచేసింది.

గోదావరి ప్రాజెక్టులపై కుదిరిన ఒప్పందం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక నూతనాధ్యాయం. చర్చలు, సంప్రదింపులు, పరస్పర సహకార ధోరణితో అసాధ్యం సుసాధ్యం చేయవచ్చునని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆచరించి చూపారు. చనాక-కొరాట, తమ్మిడిహట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులపై మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందంపై సంతకాలు చేయడం అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల చరిత్రలో ఒక కొత్త ఒరవడి. కేరళ-తమిళనాడు, కర్ణాటక-తమిళనాడు, ఒరిస్సా-చత్తీస్‌గడ్, హర్యానా-పంజాబ్ వంటి రాష్ర్టాలు నదీజలాలకోసం పరస్పరం ఘర్షణపడుతున్న తరుణంలో తెలంగాణ, మహారాష్ట్రలు దేశానికి ఒక కొత్త మార్గాన్ని చూపాయి. మంచితనంతో మనసులు గెలవడం అన్న నినాదంతో ముఖ్యమంత్రి అనుసరించిన విధానం అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నది. వరద గోదావరిపై ఒక్క ప్రాజెక్టునూ నిర్మించని కాంగ్రెస్, టీడీపీల అరవయ్యేళ్ల దాష్టీకానికి చరమగీతం పాడుతూ ఇవ్వాళ తెలంగాణ ఒక గొప్ప ముందడుగు వేసింది. మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రీ సాధించని విజయాన్ని మన ముఖ్యమంత్రి తన రాజకీయ దౌత్యంతో సాధించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో అటు కేంద్రంలో, ఇటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. అయినా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడంలో విఫలమయింది అని ఈ రోజు ఒప్పందం సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పిన మాట అక్షర సత్యం. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా ఎటువంటి అరమరికలు లేకుండా పరస్పరం సహకరించుకుంటున్నాయి. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వినతికి సానుకూలంగా స్పందించి కరువులో సైతం నీటిని ఇచ్చిందంటే కేవలం ముఖ్యమంత్రి దౌత్యం వల్లనే ధోరణివల్లనే సాధ్యమయింది. చంద్రబాబు హయాంలో ఆలమట్టిపై కర్ణాటకతో దాదాపు యుద్ధం చేసినంతపని అయింది. అదే ఆలమట్టి నుంచి నీటిని సాధించుకోగలిగింది తెలంగాణ ప్రభుత్వం. బాబ్లీపై టీడీపీ వీధి బాగోతాలే నడిపించింది. తెలంగాణ ప్రభుత్వం అదే బాబ్లీ గేట్లను తెరిపించి నీటిని తీసుకోగలిగింది. పొరుగు రాష్ర్టాలతో గిల్లికజ్జాలు పెట్టుకుని ఒక్క ప్రాజెక్టునూ ముందుకు సాగనివ్వలేదు. పొరుగు రాష్ర్టాల అభ్యంతరాల వల్ల ఆగిపోతే తెలంగాణ ప్రాజెక్టులే ఆగిపోతాయి కదా అన్న భావన నాటి ముఖ్యమంత్రులది. ఆంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులకు పొరుగు రాష్ర్టాల బెడదలేదు కదా. తమ ప్రాజెక్టులేమో ఆగమేఘాలపై పూర్తి చేసుకోవడం, తెలంగాణ ప్రాజెక్టులనేమో వివాదాల్లోకి నెట్టడం…ఇదీ నాటి రివాజు.

నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చెత్తగా వ్యవహరించిందంటే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రతో ఎటువంటి ఒప్పందానికి రాకుండానే తమ్మిడిహట్టి బరాజును 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని వీరంతట వీరే నిర్ణయించుకున్నారు. అక్కడ తట్టెడు మట్టి కూడా తవ్వకుండా ముందుగా చేవెళ్లవద్ద కాలువలు తవ్వారు. మా అనుమతి లేకుండా నిర్మిస్తే, మీ ప్రయత్నమంతా వృధా అవుతుందని కాంగ్రెస్ పార్టీకే చెందిన నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇంతా చేసి ఆ బరాజులో వారు నిల్వ చేయతలపెట్టింది కేవలం 5 టీఎంసీల నీరు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో సయోధ్యకు వచ్చి తమ్మిడిహట్టితోపాటు మేడిగడ్డ ప్రాజెక్టును కూడా సాధించగలిగింది. ఈ రెండు ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 1.85+16.17=18.02 టీఎంసీలు. రెండు ప్రాజెక్టుల నుంచి తరలించగలిగిన నీళ్లు సుమారు 200 టీఎంసీలు. కాంగ్రెస్ తలపెట్టిన నీటి నిల్వ సామర్థ్యం కేవలం 16.4 టీఎంసీలు, నేడు తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 148.67 టీఎంసీలు. తమ్మిడిహట్టి ద్వారా 160 టీఎంసీల నీరు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి ఎత్తలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ఏకంగా అనుమతినే సాధించగలిగింది.

వివాదాలు, ఘర్షణలు సృష్టించడం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం రాజకీయ నాయకులు చేసే పని. విశాలదృక్పథంతో వివాదాలు పరిష్కరించడం, సద్భావంతో పనులు సాధించడం రాజనీతిజ్ఞులు, కార్యశూరులకు మాత్రమే సాధ్యమయ్యేపని. ముఖ్యమంత్రి, నీటిపారుదల మంత్రి ఏడాదిన్నరకాలంగా సాగించిన సంప్రదింపుల యజ్ఞం ఫలించి ఇప్పటికి ఈ ఒప్పందం కుదిరింది. ఎగువ రాష్ర్టాలతో గొడవపడినా, అల్లరిచేసినా ఆగం కావడంతప్ప ఫలితం ఏమీ ఉండదని గత ఆరు దశాబ్దాల చరిత్ర రుజువు చేసింది. కేసీఆర్ ఇప్పుడా చరిత్రను తిరగరాశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చెత్తగా వ్యవహరించిందంటే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రతో ఎటువంటి ఒప్పందానికి రాకుండానే తమ్మిడిహట్టి బరాజును 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని వీరంతట వీరే నిర్ణయించుకున్నారు. అక్కడ తట్టెడు మట్టి కూడా తవ్వకుండా ముందుగా చేవెళ్లవద్ద కాలువలు తవ్వారు. మా అనుమతి లేకుండా నిర్మిస్తే, మీ ప్రయత్నమంతా వృధా అవుతుందని కాంగ్రెస్ పార్టీకే చెందిన నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇంతా చేసి ఆ బరాజులో వారు నిల్వ చేయతలపెట్టింది కేవలం 5 టీఎంసీల నీరు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో సయోధ్యకు వచ్చి తమ్మిడిహట్టితోపాటు మేడిగడ్డ ప్రాజెక్టును కూడా సాధించగలిగింది. ఈ రెండు ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 1.85+16.17=18.02 టీఎంసీలు. రెండు ప్రాజెక్టుల నుంచి తరలించగలిగిన నీళ్లు సుమారు 200 టీఎంసీలు. కాంగ్రెస్ తలపెట్టిన నీటి నిల్వ సామర్థ్యం కేవలం 16.4 టీఎంసీలు, నేడు తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 148.67 టీఎంసీలు. తమ్మిడిహట్టి ద్వారా 160 టీఎంసీల నీరు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి ఎత్తలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ఏకంగా అనుమతినే సాధించగలిగింది.

సమైక్య ప్రభుత్వాలది తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మొదటినుంచీ సైంధవ పాత్రే. ప్రాజెక్టులు కట్టినట్టు ఉండాలి. డబ్బులు ఖర్చు చేసినట్టు కనిపించాలి. ఇరుగుపొరుగు రాష్ర్టాలతో వివాదాల్లో నలుగుతూ ఉండాలి. అవి తెగొద్దూ ముడిపడొద్దు. ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కాకూడదు. పూర్తయినా నీళ్లు ఉపయోగించుకునే పరిస్థితి ఉండకూడదు. నోటితో నవ్వి నొసటితో ఎక్కిరించే ధోరణి. 2004 నుంచి 2014 వరకు వేల కోట్ల రూపాయలు కాలువల తవ్వకాల్లో కుమ్మరించారు తప్ప లక్ష ఎకరాలు కూడా అదనంగా భూమిని సాగులోకి తేలేదు. ఎందుకంటే ఎక్కడా ప్రాజెక్టుల హెడ్‌వర్క్స్ పూర్తి చేయలేదు. తమ్మిడిహట్టి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్‌ఎల్‌బీసీ, ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండోదశ, వరదకాలువ….వీటిల్లో ఏ ఒక్క ప్రాజెక్టు కిందయినా నీరొస్తే ఒట్టు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హెడ్‌వర్క్స్‌ను ఆగమేఘాలపై పూర్తి చేసి నీటిని పంపింగ్ చేసే పనులను వేగిరపర్చింది. ఇవ్వాళ మహబూబ్‌నగర్‌లో రోజూ 4500 క్యూసెక్కులకు పైగా నీటిని పొలాలకు మళ్లిస్తున్నారంటే గత రెండేళ్లలో సాగించిన కృషివల్లనే సాధ్యమైంది.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సమైక్య కాంగ్రెస్ ప్రభుత్వాల పాపాలను వెనుకేసుకువస్తూ మహారాష్ట్రతో జరిగిన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ మునుపటికంటే ఘోరమైన తప్పిదం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లహితంకోరి పనులు చేపడితే, తెలంగాణ ప్రభుత్వం ప్రజాహిత పనులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి వెంటపడి పూర్తిచేయిస్తున్నది. ఆ సంకల్పంలో భాగంగానే ఇవ్వాళ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని పూర్తిచేసింది. కృష్ణాలో నీటివనరులు తగ్గిపోయాయి. గోదావరిలో ప్రాణహితకు దిగువన ఇప్పటికీ పుష్కలంగా నీరు లభిస్తున్నది. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి నిన్నటిరోజువరకు 1461 టీఎంసీల నీరు సముద్రం పాలయింది. ఈ నీరంతా ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత ప్రవహించిందే. అందుకే మేడిగడ్డ ఇప్పుడు తెలంగాణకు జీవనరేఖ అయింది. మనకు 950 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉంది. శ్రీరాంసాగర్ నుంచి తూర్పుదిశగా అటు మహబూబాబాద్ దాకా, ఇటు సూర్యాపేట దాకా ఒట్టిపోయి విస్తరించిన కాకతీయ కాలువలు, జనగామ దాకా తవ్విన వరద కాలువలు, ఏ నీటి ఆధారమూ కల్పించకుండానే తుమ్మిడి హట్టి నుంచి దక్షిణ దిశగా ముక్కలు ముక్కలుగా తవ్విపడేసిన ప్రాణహిత-చేవెళ్ల కాలువలు జలధారలతో నిండడానికి ఇప్పుడు మేడిగడ్డ ఒక్కటే ఆధారం. ఉత్తర తెలంగాణలో రిజర్వాయర్లు, చెరువులు నింపడానికి, ఎండిబీడు పడిపోయిన ఉపనదులు, వాగులు, వంకలు పునర్జీవింపజేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం ఒక్కటే మార్గం. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సమైక్య కాంగ్రెస్ ప్రభుత్వాల పాపాలను వెనుకేసుకువస్తూ మహారాష్ట్రతో జరిగిన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ మునుపటికంటే ఘోరమైన తప్పిదం చేస్తున్నారు.

తెలివితక్కువ ప్రదర్శన

TEL_Major Irrigation ProjectsMap (1)

కాంగ్రెస్ జల దృశ్యం లెక్కలు నిజమయితే తెలంగాణ కోనసీమలాగా ఉండాలి. కాంగ్రెస్ లెక్కలు కరెక్టు అయితే తెలంగాణలో బీడు భూములనేవే ఉండకూడదు. కాంగ్రెస్ వాదన సత్యమే అయితే ఇన్ని ఆత్మహత్యలు జరిగి ఉండకూడదు. కాంగ్రెస్ హయాంలో జరిగిందంతా ప్రాజెక్టుల తోకలు పూర్తిచేయడం, తలలు వదిలేయడం. ఎక్కడా నదుల నుంచి నీళ్లు తోడే పని మొదలు పెట్టకుండానే అడ్వాన్సులు ఇచ్చి, అందులో కమీషన్లు స్వీకరించి, మట్టి పనులు చేయించి మమ అనిపించారు. కాంట్రాక్టరుకు, రాజకీయ నాయకులకు, అధికారులకు సులువుగా అయ్యేపని కాలువలు తవ్వడం.

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టకపోవడం ఒక్కటే కాదు తవ్వినదంతా నెత్తినపోసుకోవడం అంటే ఇదే. నీటిపారుదల రంగంలో జరిగిన గతకాలపు పాపాలకు, ద్రోహాలకు అన్నింటికీ తమదే బాధ్యత అన్నట్టు కాంగ్రెస్ జలదృశ్యం నడిచింది. సమైక్యరాష్ట్రంలో జరిగిన నిర్వాకాలన్నీ తమకు తెలిసే జరిగినట్టుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఒప్పేసుకుంది. జలదృశ్యం పేరిట జరిగిన విన్యాసం వారికి మంచి చేయలేదు సరికదా, వారి అవగాహనారాహిత్యాన్ని బట్టబయలు చేసింది. మంత్రులు, మహామంత్రులుగా పనిచేసిన వారంతా పక్కన కూర్చుని జోగుతూ ఉంటే పాపం డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ కాంగ్రెస్ కేసును వాదించడానికి నానా తంటాలు పడ్డారు. శ్రవణ్ మంచి వక్త. మేధావిగా పేరు. కానీ ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే వాదించాల్సింది దోషుల తరఫున కదా. సుదీర్ఘకాలంపాటు తెలంగాణను పాలించి, అన్యాయాలు జరుగుతూ ఉంటే ప్రేక్షకపాత్ర పోషించిన కాంగ్రెస్ నాయకుల పక్షాన కదా. సగం తప్పులు, సగం అవాస్తవాలు, కొంత అజ్ఞానం. కేసీఆర్ లాగా గూగులమ్మను ముందేసుకుంటే అది ప్రదర్శన కాజాలదు. ఈ రాష్ర్టాన్ని నలభైయేళ్లపాటు పరిపాలించిన కాంగ్రెస్లో పట్టుమని గంటసేపు సాగునీరు గురించి మాట్లాడే పెద్ద మనిషి లేకపోవడం ఆ పార్టీ పేదరికాన్ని తెలియజేస్తున్నది. కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆరు మాసాల దాకా ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో వారికి నోరుపెగలకపోవడం నీటిపారుదల సమస్యపై వారి చేతగానితనాన్ని బయటపెట్టింది. సుదీర్ఘకాలం నీటిపారుదల మంత్రిగా వెలగబెట్టినవారు ప్రేక్షకుల్లో కూర్చుంటే పాపం మునుపెన్నడూ ఏ పదవులూ నిర్వహించని డాక్టర్ శ్రవణ్ కాంగ్రెస్ వాదన వినిపించవలసి వచ్చింది. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కె.చంద్రశేఖర్రావు ఏకబిగిన నాలుగైదు గంటలపాటు తెలంగాణ జలవనరుల చిత్రపటాన్ని ఆవిష్కరిస్తే, ఈ ప్రాంతాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ నేతలు తలాకొంత ఆక్రోశమూ, ఆగ్రహమూ, అసత్యాలూ కలబోసి గంట సేపట్లో అలసిసొలసిపోయారు. వారు పెద్దపెద్ద అబద్ధాలు ఎంత సులభంగా చెప్పా రో! ఆయకట్టు గురించి చెప్పినవి మరీ అబద్ధాలు. అసలు తెలంగాణలో సాగుభూమి ఎంత ఉంది? అందులో ఒకసారి పండేది ఎంత, రెండుమూడు సార్లు పండేది ఎంత? బహుషా కాంగ్రెస్ నాయకులకు ఒక్కరికీ ఆ పరిభాష తెలిసినట్టు లేదు. కాంగ్రెస్ కోటి ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టులు నిర్మించామని చెప్పేశారు. వారి జలదృశ్యంలోని డొల్లతనాన్ని బట్టబయలు చేయడానికి ఈ ఒక్క అంశం చాలు. వాస్తవానికి తెలంగాణలో మొత్తం సాగు భూమే కోటి 22 లక్షల ఎకరాలు. అందులో బోరుబావులు, తవ్వుడు బావుల కింద సాగయ్యేది 47.62 లక్షల ఎకరాలు. నీటిపారుదల ప్రాజెక్టుల కింద సాగవుతున్నది ఇప్పటికీ 19.56 లక్షల ఎకరాలు మాత్రమే. మిగిలినదంతా వర్షాధార సాగు భూమి. గతంలో తలపెట్టిన, ఇప్పుడు తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయి వినియోగంలోకి వస్తేనే మొత్తం కోటి ఎకరాల భూమిని సాగులోకి తేవడం సాధ్యం.

కాంగ్రెస్ తన పదేళ్ల పాలనలో మొత్తంగా కూడా ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించలేదు. అది మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఏవీ పూర్తికాలేదు. పూర్తి చేసే విధంగా పనులు చేపట్టలేదు. కాంగ్రెస్ జల దృశ్యం లెక్కలు నిజమయితే తెలంగాణ కోనసీమలాగా ఉండాలి. కాంగ్రెస్ లెక్కలు కరెక్టు అయితే తెలంగాణలో బీడు భూములనేవే ఉండకూడదు. కాంగ్రెస్ వాదన సత్యమే అయితే ఇన్ని ఆత్మహత్యలు జరిగి ఉండకూడదు. కాంగ్రెస్ హయాంలో జరిగిందంతా ప్రాజెక్టుల తోకలు పూర్తిచేయడం, తలలు వదిలేయడం. ఎక్కడా నదుల నుంచి నీళ్లు తోడే పని మొదలు పెట్టకుండానే అడ్వాన్సులు ఇచ్చి, అందులో కమీషన్లు స్వీకరించి, మట్టి పనులు చేయించి మమ అనిపించారు. కాంట్రాక్టరుకు, రాజకీయ నాయకులకు, అధికారులకు సులువుగా అయ్యేపని కాలువలు తవ్వడం. ‘మట్టి పనిలో మిగిలేంత డబ్బు హెడ్వర్క్స్ లో మిగలదన్నా, అందుకే అంతా కాలువలు ముందు తవ్వేస్తారు’ అని ఒక కాంట్రాక్టరు స్వయంగా చెప్పిన విషయమే. ‘ఎల్లంపల్లి గేట్లు తెరిచి కిందికి నీళ్లు వదులుతుం టే గుండెలు పిండేసినట్టయింది. ఎల్లంపల్లికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిగువన మానేరులో చుక్క నీరు లేదు. ఎల్లంపల్లికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకతీయ కాలువ ఎండిపోయి ఉంది. అక్కడి నుంచి మరో పది కిలోమీటర్ల దిగువ నుం చి వెళ్లే వరదకాలువలో నీరు లేదు. పక్కనే ఇంత కరువు పెట్టుకుని ఎల్లంపల్లి నుంచి నీళ్లు కిందకు వదలాల్సిన పరిస్థితి. ఎల్లంపల్లి నుంచి నీటిని ఉపయోగించుకోవడాని కి ఏర్పాట్లు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎత్తిపోసుకునే వ్యవస్థ అంతా రెడీ అయి ఉంటే కాకతీయ కాలువ, వరదకాలువల ద్వారా మానేరును నింపుకుని ఉండవచ్చు. హైదరాబాద్కు తాగునీరు పంపింగ్ చేయడానికి తప్ప ఇతర ఏర్పాట్లేవీ పూర్తి కాలేదు. హైదరాబాద్కు పంపింగ్ వ్యవస్థ ఏర్పాటు కూడా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చి న తర్వాతనే వేగంగా పూర్తి చేసింది’ అని ఎల్లంపల్లి గేట్లు ఎత్తినరోజు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బాధపడ్డారు.

కాంగ్రెస్ నాయకత్వం గత ప్రభుత్వాల తప్పిదాలకు తామే బాధ్యత తీసుకుని అత్యంత తెలివితక్కువగా వ్యవహరిస్తున్నది. వారి పాపాల నుంచి తమను తాము వేరు చేసుకుని చూసుకునే అవకాశం ఉన్నా, మా తాతలు నేతులు తాగారని కాలు దువ్వడం వారి తెలివితక్కువతనానికి నిదర్శనం.

విడ్డూరం ఏమంటే తుమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి తీయలేదు, చేవెళ్ల సమీపంలో కాలువలు, సొరంగాల పనులు మొదలుపెట్టారు. ఇవ్వాళ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మొదలుపెట్టి తామేదో ఉద్ధరించినట్టు వలపోస్తున్నారు. ప్రాణహిత నుంచి చేవెళ్ల దాకా నీరు రావాలంటే సుమారు ఆరు వందల కిలోమీటర్లు రావాలి. గ్రావిటీ ద్వారా వచ్చేవని ఒక పెద్ద అబద్ధాన్ని చాలా అందంగా చెప్పడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచి ఇక్కడిదాకా 22 లిఫ్టులతో నీరు ఎత్తిపోయనున్నట్టు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రిపోర్టులోనే ఉంది. ఇంత దూరం కాలువలు, సొరంగాల ద్వారా నీరు తెస్తారట. మైనరు ఇరిగేషను చెరువులను సంధానించడం తప్ప ఎక్కడా ఒక్క రిజర్వాయరు ప్లాను చేయలేదు. ఎల్లంపల్లి ఒక్కటే వారు సాధించిన ఘనకార్యం. ఆ ప్రాజెక్టుగేట్ల నిర్మాణం కూడా తెలంగాణ వచ్చిన తర్వాతనే జరిగింది. ఆ ప్రాజెక్టులో మునిగి పోయే గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించి వారిని ముంపు నుంచి తరలించింది కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. ఆ ప్రాజెక్టులో నీటిని నిల్వచేయడం ఇదే ప్రథమం. ప్రాణహిత చేవెళ్ల తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి, ఉద్యమాన్ని నీరుగార్చడానికి రాజశేఖర్రెడ్డి ప్రయోగించిన ఒక మంత్రపాచిక. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అప్పుడు బసవన్నల్లా తలలూపడం తప్ప ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలిగే ధైర్యం ఎప్పుడు ప్రదర్శించారు? కుక్కిన పేనుల్లా ఆయన చెప్పింది విని, ఆయన ఇచ్చింది తిని, ఫైళ్లపై సంతకాలు చేస్తూ పోయారు. నిజానికి తెలంగాణ నాయకత్వానికి ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. స్వతంత్రించి సమైక్య నాయకత్వం చేసిన ద్రోహాలను గుర్తించి, వాటిని ఎండగట్టి తెలంగాణకు ఎలా ఉపయోగపడాలో ఆలోచించకుండా వారి పాపాలను నెత్తిన మోస్తున్నారు. తాము అప్పుడు చేసింది కరక్టే అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంత పెద్ద అక్రమ ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు విస్తరణ ఏ అనుమతులు లేకుండా మూడున్నరేళ్లలో ఎలా పూర్తి చేయగలిగారు? తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టూ ఎందుకు పూర్తి కాలేదు? హంద్రీ నీవాకు రెండేళ్ల నుంచి నీళ్లు వెళ్తున్నాయి, కల్వకుర్తికి, నెట్టెంపాడుకు తెలంగాణ ప్రభు త్వం వచ్చేదాకా నీరెందుకు రాలేదు? కాంగ్రెస్ నాయకత్వం గత ప్రభుత్వాల తప్పిదాలకు తామే బాధ్యత తీసుకుని అత్యంత తెలివితక్కువగా వ్యవహరిస్తున్నది. వారి పాపాల నుంచి తమను తాము వేరు చేసుకుని చూసుకునే అవకాశం ఉన్నా, మా తాతలు నేతులు తాగారని కాలు దువ్వడం వారి తెలివితక్కువతనానికి నిదర్శనం.

తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంలో ఇంత డొల్లతనం ఉండడానికి కారణం ఏమి టి? వారు ఎప్పుడయినా ప్రాజెక్టులవద్దకు వెళ్లి ఉంటే కదా? ఎప్పుడయినా నదీ గమనాలను తెలుసుకుని ఉంటే కదా? ఏ నది ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రవహిస్తుందో తెలుసుకుంటే కదా? ఒకటి కాదు, రెండు కాదు జలదృశ్యంలో అన్నీ తప్పులే. కాంతానపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు నీరు తీసుకురావాలనుకున్నారా? కాంతానపల్లి ఎక్కడ నిర్మించదలిచారో, ఎందుకు నిర్మించదలిచారో, ఎక్కడికి నీరివ్వదల్చుకున్నారో డాక్టర్ శ్రవణ్కు తెలిసి ఉండకపోవచ్చు. వరంగల్లు జిల్లాకే చెందిన నీటిపారుదల మాజీ మంత్రికి కూడా తెలియకపోవడం విషాదం. శ్రీరాంసాగర్ కాకతీయ కాలువ రెండవదశ కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించడం, దారిపొడవునా ఉన్న గ్రామాలకు తాగునీరు అందించడం కంతానపల్లి లక్ష్యం. అంతేగాక దేవాదుల పం పింగ్కు అవసరమైన స్టోరేజీగా కూడా ఈ ప్రాజెక్టు పనిచేస్తుందని భావించారు. ఎక్క డో ఏటూరునాగారానికి ఎగువన నిర్మించే ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు నీరుతెస్తారని చెప్పారట. మరో తప్పిదం… రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) గురించి కూడా అవగాహన లేకపోవడం. ఆర్డీఎస్ తుంగభద్రపై నిర్మించిన ప్రాజెక్టు. ఆర్డీఎస్ ద్వారా 15.9 టీఎంసీలు మళ్లించి, గద్వాల నుంచి అలంపురం వరకు సుమారు లక్షల 75 వేల ఎకరాలకు నీరివ్వడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఆర్డీఎస్ ఆయకట్టుకు ఆలమట్టి, నారాయణపురంల నుంచి నీరు రాకపోవడానికి ఏమిటి సంబం ధం? ఆలమట్టి, నారాయణపురం కృష్ణా నదిపై నిర్మించారు. అక్కడి నుంచి వరదవచ్చినా ఆర్డీఎస్కు నీరివ్వడం సాధ్యం కాని పని. ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకుం డా తెలంగాణ ప్రాజెక్టులపై నోటికొచ్చిందంతా మాట్లాడటం తెలంగాణకు మేలు చేయదు. కాంగ్రెస్కూ మేలు చేయదు. సరికదా, వారిని మరింత పలుచన చేస్తుంది.

తెలంగాణ ఇప్పుడు జలఫలాలను తీసుకోవలసి ఉంది. వేగంగా ప్రాజెక్టులను పూర్తిచేసుకోవలసి ఉంది. మహబూబ్నగర్లో తలపెట్టిన ప్రాజెక్టులన్నీ నీరివ్వడం చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే అన్ని ఎత్తిపోతల పథకాల వద్ద యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు, చేయిస్తున్నా రు. ఇవ్వాల రోజుకు ఐదువేల క్యూసెక్కుల నీరు మహబూబ్నగర్ బీడు భూముల ను తడుపుతుంటే అక్కడి ప్రజలు హర్షాతిరేకాలకు అంతులేదు. జిల్లాలోని ఎత్తిపోతలన్నీ పూర్తయి పనిచేయడం మొదలుపెడితే ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే 100 టీఎంసీల నీరు వినియోగించవచ్చు. పదిలక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో అత్యధిక జిల్లాలు ప్రయోజనం పొందుతాయి. నీటి విలువ తెలుసుకుని మెలిగితే ఎవరికైనా భవిష్యత్తు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను వ్యతిరేకించి బాగుపడిన పార్టీలేదు.