బీసీ రిజర్వేషన్లపై ఏది నిజం?


head-in-sand

బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయస్థానాల తీర్పులను మరుగున పరిచి తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం నడుస్తున్నది. ఏ రిజర్వేషన్లయినా 50 శాతానికి మించకుండా చూడండి అని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. కొందరు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళితేనే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. మరోవైపు నెలరోజుల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి తీరాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదీ కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ వచ్చిన తీర్పే. ఈ రెండు తీర్పులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లను 23.81 శాతానికి తగ్గిస్తూ అత్యవసర ఆదేశాలు జారీ చేసి ఎన్నికల నిర్వహణకు సిద్ధమయింది.

ఈ వాస్తవాలను మరుగున పరిచి కొందరు మాజీ న్యాయమూర్తులతో సహా ప్రతిపక్ష నాయకులు బీసీ రిజర్వేషన్లను ఎలా తగ్గిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి దురుద్దేశాన్ని ఆపాదించాలని కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. రిజర్వేషన్ల మొత్తంపై కేంద్రం పెత్తనం కాకుండా రాష్ర్టాలకే నిర్ణయాధికారం ఉండాలని కోరుతున్నారు. ఆ విషయాలను మరుగునపర్చి మాజీ న్యాయమూర్తులు కొందరు రాజకీయ చిడతలు పట్టుకుని తిరుగుతున్నారు.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily