కూటమి సభలకు జనమేరి?

TDP-CONGRESS-1

టీఆర్ సభలు జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. కేసీఆర్ సభలతోపాటు కేటీఆర్, హరీశ్ సభలు, రోడ్డు షోలు కూడా సూపర్ నమస్తే తెలంగాణతోపాటు అన్ని పత్రికల్లో సభల ఫొటోలు వస్తున్నాయి. కూటమి నాయకులు కూడా సభలు, రోడ్డుషోలు నిర్వహిస్తున్నారు. కానీ ఏ పత్రికలో కూడా ఆ సభల ఫోటలు రావడం లేదు.

చానెళ్లలో కూడా కూటమి నాయకులు మాట్లాడిందే చూపుతున్నారు తప్ప, కింద జనం ఎంతమంది ఉన్నారన్నది చూపడం లేదు. సరే టీఆర్ అనుకూల పత్రికలు ప్రచురించడం లేదు. కూటమి అనుకూల పత్రికల్లో కూడా వారి సభల ఫొటోలు రావడం లేదు.

సభల్లో జనం ఎక్కువమంది లేకపోవడం కారణం అయి ఉండాలి. మొన్న ఆ మధ్య కోదండరామ్ సారు దుబ్బాకలోనో ఏమో ఒక సభలో కుర్చీలనుద్దేశించి ప్రసంగించారు. నిన్న ఎల్ రమణ ఉప్పల్ రోడ్డు షో నిర్వహించారు. పచ్చభక్తి కలిగిన టీవీలు రమణ ప్రసంగాన్ని చూపించాయి తప్ప సూత్రానికన్నా ఒక్క సారి జనాన్ని చూపించడం లేదు.

ఒకవైపు టీఆర్ సభలకు జనం పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. కేరింతలు కొడుతున్నారు. మరోవైపు కూటమి సభలకు అంతంతమాత్రంగా వస్తున్నారు. స్పందన గొప్పగా ఉండడం లేదు. ఇది దేనికి సూచన?

 

కాంగ్రెస్ సీఎం అభ్యర్థులు- గెలిచేదెవరు? ఓడేదెవరు?

image

కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులకు కొదువలేదు. మొన్న మేడ్చల్ సభలోనే ఎవరో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఆగిపోయింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, దామోదర రాజనరసింహ, మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి, డీకే అరుణ, జైపాల్‌రెడ్డి….ఈ జాబితాకు అంతులేదు. వీరంతా సీఎం కావాలని ఆశిస్తున్నవారే. కానీ కాంగ్రెస్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవని సర్వేలు, రాజకీయ విశ్లేషణలు సూచిస్తున్నాయి.

బెట్టింగులు పెట్టే వాళ్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ విజయంపై ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ గెలుస్తుంది యాభైకి యాభై అని కాలుదువ్విన ఒక పెద్ద మనిషి ఆ తర్వాత రెండు రోజులకే జారిపోయారని ఒక పరిశీలకుడు చెప్పారు. కొంత మంది సీట్లపైన బెట్టింగులకు దిగుతున్నారని సమాచారం. ఫలానాయన గెలుస్తారా ఓడుతారా అన్న అంశంపై బెట్టింగులు జరుగుతున్నాయట. ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న ఈ తరుణంలో అభ్యర్థుల విజయావకాశాలపై ఒకింత స్పష్టత వస్తున్నది. టీఆర్‌ఎస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయని చాలా మంది విశ్లేషకులు చెబుతున్న విషయం.

నల్లగొండ జిల్లాలో ఒక స్థానం గురించి ఒక సీనియర్ నాయకుడిని అడిగితే, అక్కడ అభ్యర్థి ముఖ్యం కాదు, కేసీఆర్‌ను చూసి ఓటేస్తారు. టీఆర్‌ఎస్ గెలుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. మరో ఊళ్లో ఒక కమ్యూనిస్టు కార్యకర్త, మాకు నీళ్లొచ్చాయి, రోడ్లొచ్చాయి, టీఆర్‌ఎస్‌కు వేయకపోతే అన్యాయంగా ఉంటుంది అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ చేసిన పనులు ప్రభావం చూపిస్తున్నాయి. ఈ పరిస్థితే గనుక పోలింగురోజువరకు కొనసాగితే కాంగ్రెస్ సీఎం అభ్యర్థులు కూడా ఎదురీదవలసిందే. సీఎం అభ్యర్థుల్లో ఒకరిద్దరు తప్ప, అందరికీ ఓటమి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నల్లగొండ జిల్లాలో కూడా సీఎం అభ్యర్థులంతా చెమటోడ్చుతున్నారు. ఇంతకాలం డబ్బులు ఖర్చు చేయని కాంగ్రెస్ నాయకులు సైతం ఇప్పుడు డబ్బులు బయటికి తీస్తున్నారు. ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారు. అయినా అందరూ గట్టేక్కేది కష్టమే. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి ఎదురీదుతున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కూడా చాలా కష్టంగా ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ది లాటరీ టైపు.

గీతారెడ్డి, రాజనరసింహలకు విజయం అందని పండు కావచ్చు. మల్లు భట్టి విక్రమార్క ఒక్కడే కాస్త బెటర్‌గా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. రేవంత్‌రెడ్డి రాష్ట్రమంతా తిరుగుతున్నారు, కానీ సొంత నియోజకవర్గంలో మొదటిసారి ఆయనకు గట్టి సవాలు ఎదురవుతున్నది. గద్వాలలో డీకే అరుణకు విజయావకాశాలు తక్కువగా ఉన్నాయి.

సర్వేలు ఏం చెబుతున్నాయి?

surveys1f

తెలంగాణ ఎన్నికలపై ఇప్పటివరకు అరడజను సర్వేలు వెలువడ్డాయి. కొన్ని ప్రసారం అయ్యాయి. కొన్ని కాలేదు. ఒక్క సర్వే తప్ప అన్ని సర్వేలు టీఆర్ తిరిగి అధికారంలోకి రాబోతున్నదని సూచించాయి. సీ-ఓటర్ సర్వే మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సూచించింది. ముఖ్యమంత్రిగా తిరిగి కేసీఆర్ రావాలని కోరుకునే వారు ప్రతి సర్వేలోనూ 60 శాతం దాకా ఉన్నారు. టీఆర్ ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా ఉందని చెప్పిన వారి శాతం కూడా 50 నుంచి 60 శాతం వరకు ఉంది. కాంగ్రెస్ విజయావకాశాలు ఉన్నాయని చెప్పే నియోజకవర్గాల్లో కూడా ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలన్నవారి సంఖ్య ఎక్కువగా వస్తున్నది.

గ్రామీణ ప్రాంతాలలో టీఆర్ బాగా నమ్మకం కనిపిస్తున్నది. పట్టణ పేదల్లో కూడా టీఆర్ అంటేనే ఎక్కువగా ఆసక్తి కనిపిస్తున్నది. కాంగ్రెస్ ఒక దశలో బలమైన శక్తిగా కనిపించినప్పటికీ పొత్తులపేరుతో టీడీపీని చేరదీయడం, సీట్ల పంపిణీ పేరిట రోజుల తరబడి కుమ్ములాడుకోవడం ఆ పార్టీ విజయావకాశాలను బాగా దెబ్బ తీసింది. చాలా నియోజకవర్గాల్లో వారికి పూర్తిస్థాయిలో ప్రచారం చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. మరోవైపు టీఆర్ ఊపిరి సలుపకుండా విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నది.

కేసీఆర్ సుడిగాలిలా రాష్ట్రమంతటా తిరిగి టీఆర్ అభ్యర్థులకు గట్టి బూస్టును ఇస్తున్నారు. కేటీఆర్, హరీశ్ కూడా తమకు అప్పగించిన నియోజకవర్గాలలో హోరు పుట్టిస్తున్నారు. టీఆర్ సభలకు ప్రజాస్పందన కూడా బాగా ఉంది. కాంగ్రెస్ నాయకులు జనసమీకరణకు చాలా కష్టపడవలసి వస్తున్నది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరి నియోజకవర్గాలకు వారే పరిమితం కావలసిన పరిస్థితి. ఒక్క రేవంత్ చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారానికి పిలుస్తున్నారు. విజయశాంతి, మరికొందరు నాయకులు ప్రచారానికి వస్తామన్నా పిలిచేవారు లేరు.

నియోజకవర్గాల్లో నెలకొని ఉన్న పరిస్థితే సర్వేలలో వ్యక్తమవుతున్నది. ప్రచురించని, ప్రసారం కాని సర్వేలు కూడా కొన్ని బయటికి వచ్చాయి. ఒక టీవీ చానెల్ నిర్వహించిన సర్వేలో టీఆర్ 90 స్థానాలు వచ్చినట్టుగా సమాచారం. మరో పత్రిక నిర్వహించిన సర్వేలో కూడా టీఆర్ అనుకూలంగా వేవ్ ఉన్నట్టు వెల్లడయింది. అయితే అవేవీ ఎన్నికల నియమావళి కారణంగా ప్రచురించబడలేదు.

తెలంగాణలో గెలుపెవరిది?

map_telangana

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయావకాశాలపై చాలా కాలుష్యం ప్రచారంలో ఉంది. నిజమైన సర్వేలతోపాటు కల్పిత సర్వేలు, అక్కసు లెక్కలు, విష్‌ఫుల్ గణాంకాలు ఇలా అనేకం సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ ఈ ప్రచారం ఎక్కువగా చేస్తున్నది. ఎన్నికల బరిలో ఇవన్నీ సహజం కావచ్చు. ఇప్పుడే కాదు ప్రతి ఎన్నికలోనూ ఈ తరహా సర్వేలు, కల్పితగాథలు వస్తూనే ఉంటాయి. కానీ వాస్తవిక పరిస్థితి ఎలా ఉంది? సర్వేల సంగతి పక్కన ట్రెండును అంచనా వేయడానికి రెండు మూడు కొలమానాలను చూస్తారు. అందులో ఒకటి పార్టీ మార్పిడులు. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున పార్టీ మార్పిడులు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కూడా పెద్ద సంఖ్యలో జంపింగులు జరిగాయి. ఎటునుంచి ఎటు ఎక్కువగా జరిగాయన్నది చూడాలి. నాయకుల స్థాయిలో కొందరు కాంగ్రెస్ పార్టీలోకి మారారు. వారెవరూ ప్రజాబాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారు కాదు. కానీ కేడరు, ఇతర సామాజిక సమూహాలు మునుపెన్నడూ లేని రీతిలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గత నాలుగు మాసాలుగా ఎడతెరిపి లేకుండా టీఆర్‌ఎస్‌లో చేరికలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌లో కూడా చేరికలు జరుగుతున్నప్పటికీ పోల్చి చూసినప్పుడు టీఆర్‌ఎస్ వైపు జనం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు అర్థం అవుతుంది.

రెండో అంశం సభలు సమావేశాలకు హాజరవుతున్న జనం, వారి స్పందనలు. టీఆర్‌ఎస్ సభలకు ప్రభంజనంలా జనం వస్తున్నారు. కొంతవరకు స్థానిక అభ్యర్థులు సమీకరిస్తున్నప్పటికీ స్వచ్ఛంద హాజరు కూడా ఎక్కువగా ఉంటున్నది. వచ్చినవారు కూడాసభలో కేరింతలు, నినాదాలతో స్పందిస్తున్నారు. మొక్కుబడి హాజరు కాకుండా కేసీఆర్ ప్రసంగాలకు స్పందిస్తున్నారు. జేకొడుతున్నారు. వారిలో ఒక ఉత్సాహం కనిపిస్తున్నది. కాంగ్రెస్ సభల్లో ఆ ఉత్సాహం లేదు. ఆ స్వచ్ఛంద హాజరూ లేదు. ఒక్క రేవంత్‌రెడ్డి సభల్లో కొంత సందడి కనిపిస్తున్నది. కానీ ఆ సభలకు కూడా హాజరవుతున్న ప్రజల సంఖ్య స్వల్పమే.

మూడవ అంశం ఏయే సామాజిక వర్గాలు మద్దతు నిస్తున్నాయి అన్నది. అన్నివర్గాల బీసీలు, ఎస్సీల్లో ఒక బలమైనవర్గం, మెజారిటీ అగ్రకులాలు, ముస్లింలు, క్రైస్తవులు టీఆర్‌ఎస్ వైపు ఉన్నారు. మహిళలు, వృద్ధులు, రైతులు, యువకులు టీఆర్‌ఎస్‌కు బాసటగా ఉన్నారు. నాలుగవ అంశం, ఎవరు ఎన్నికల సమరాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారన్నది. టీఆర్‌ఎస్ ముందుగా అభ్యర్థులను ప్రకటించి ఊళ్లలోకి పంపింది. కాంగ్రెస్ టికెట్ల పంపిణీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతగానీ బయటికి రాలేదు. అనేక తన్నులాటలు, కుమ్ములాటలు. అలకలు. తిరుగుబాట్లు. మిత్రపూర్వకపోటీలు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభిచేనాటికే టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం రెండో రౌండు కూడా పూర్తయింది.

కాంగ్రెస్ బలహీనతలు ఒకటికాదు, అనేకం. టీడీపీతో జట్టుకట్టడం ఆ పార్టీకి రాజకీయ ఆత్మహత్యాసదృశం. అది ఏరకంగానూ ఉపయోగపడదు. రెండవది, కాంగ్రెస్‌కు ఒకే ఒకడు అని చెప్పగలిగిన బలమైన నాయకుడు లేడు. బహునాయకత్వం పెద్ద సమస్య. కొడంగల్ ఆయన నేను ముఖ్యమంత్రి కాకూడదా అంటాడు. హుజూర్‌నగరాయన కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిని అంటాడు. నాగార్జునసాగర్ నాయకుడు అదే చెబుతున్నాడు. మూడవది, తమ ఎజెండాను ప్రభావవంతంగా చెప్పలేకపోవడం. పైగా తిట్లపురాణానికి దిగడం. కేసీఆర్ ఏమి చేస్తున్నారో ప్రజలకు తెలుసు. తాము వస్తే ఏమి చేస్తారో కాంగ్రెస్ గట్టిగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి కిందిస్థాయిదాకా చర్చ జరుగలేదు. తొలుత కొంత చర్చ జరిగినా కేసీఆర్ తన ఎజెండాను ప్రకటించి దానిని పూర్వపక్షం చేశారు.

ఇటు వెల్లువ, అటు వెలవెల

కాంగ్రెస్‌ను, కూటమిని ఎవరూ ఓడించనవసరం లేదు. స్వయం విధ్వంసకులు అక్కడ చాలా మందే ఉన్నారు. మేడ్చల్ సభలో ఒకరు కాదు, ఇద్దరు కాదు ఒకట్రెండు డజన్ల మంది మాట్లాడారు. ఒక్కరూ తమ ఎజెండా చెప్పే ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపైనా, టీఆర్‌ఎస్‌పైనా అవాకులు, చెవాకులు పేలడం తప్ప, ఒక నిర్మాణాత్మక ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ ఇవ్వలేదు. పాపం కాంగ్రెస్ అధి-నేత్రి సోనియాగాంధీ సైతం ఈ వాచాలత్వమంతా వింటూ కూర్చోవలసి వచ్చింది. వీరు ఇంత చెలరేగి మాట్లాడుతు న్నా సభలో అక్కడక్కడా ఏ నాయకుడు మాట్లాడితే ఆ నాయకుడి మనుషులు చప్ప ట్లు కొట్టడం తప్ప సభికులం తా ఊగిపోయింది లేదు. ఉత్సాహంగా స్పందించింది లేదు. సోనియాగాంధీ సైతం తెలంగాణ ప్రజలను ప్రభావి తం చేయడానికి ప్రత్యేక ప్రయత్నమేదీ చేయలేదు. తెలంగాణలో ఏదో కొంపలు మునిగిపోయినట్టు, కడుపు తరుక్కుపోతోంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లోనే కాంగ్రెస్‌ను తిరస్కరించి, ఇష్టపడి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. బహుశా తమకు అధికారం దక్కనందుకు కడుపు తరుక్కుపోవడంలో ఆశ్చర్యం లేదు. తెలంగాణ ప్రజ లు దుఃఖంలో లేరు. దుఃఖంలో ఉన్నది కాంగ్రెస్, దాని మిత్రపక్షా లు మాత్రమే. పైగా విచిత్రంగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని ఆమె మేడ్చల్ సభలో తెలంగాణ నాయకుల సాక్షిగా ప్రకటించారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వచ్చు, ఇస్తామని చెప్పొచ్చు. తెలంగాణ ఎన్నికల సభలో ఈ మాట ఎందుకు చెప్పారన్నదే ప్రశ్న. ఎం దుకు చెప్పారంటే హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్ల ఓట్లు పడాలంటే అలా చెప్పాలని ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని, అందుకే ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారని కొందరు విశ్లేషకులు సూత్రీకరిస్తు-న్నారు. ఎన్నికల వేళ సెటిలర్ల ఓట్ల కోసమే చంద్రబాబు కాంగ్రెస్ అధినేత్రి చేత తెలంగాణ గడ్డమీద ఇటు-వంటి ప్రకటన చేయించారంటే రేపు వీళ్ల కూటమి పెత్తనం వస్తే ఎలా చెలరేగిపోతారో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో చంద్రబాబుతో అవసరం పెరిగే కొద్దీ సోనియాగాంధీ ఇక్కడ తెలంగాణ నాయకుల మెడలు వంచి అమరావతికి అంకితం చేయడం పెరుగుతూ ఉంటుంది. దేశ రాజకీయాల్లో చంద్రబాబు అతిపెద్ద అవకాశ-వాది. తన నాలుకను ఎప్పుడు ఎలా తిప్పేస్తారో ఎవరితో జట్టు కడుతారో ఎవరిని తిడుతారో చెప్పడం కష్టం. చంద్రబాబు ఇప్పుడు ఎన్ని వేషాలైనా వేయవచ్చు గాక, ఆయన తెలంగాణకు వ్యతిరేక శక్తి. ఆయన మాయలో కాంగ్రెస్ పడటం విషాదం.
వాస్తవ పరిస్థితి ఏమంటే చంద్రబాబు ఎత్తుగడలను సెటిలర్లం తా ఆమోదిస్తారన్నది కూడా ఒక భ్రమ. ఆంధ్రలో చంద్రబాబు రాష్ర్టాన్ని సర్వనాశనం చేశారని, ఈసారి ఆయన ఓడిపోవాలని చెప్పే సెటిలర్లు హైద-రాబాద్‌లో కోకొల్లలు. సెటిలర్లకు 2014 ఎన్నికల నాడు అనుమానాలున్నాయి. అందుకే హైదరాబాద్ నగ-రంలో టీడీపీకి ఓటేశారు. ఆ తర్వాత ఆ అనుమానాలు పటాపంచలయ్యా యి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏక-పక్షంగా టీఆర్‌ఎస్‌కు పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు మాయలకు పడిపోయి సెటిలర్లు ఆషామాషీగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ భావించడం లేదు. కూటమి ఎంత గోలగోల చేసినా తెలం-గాణలో వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని వారికీ తెలుసు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు తిరిగి అధికా-రంలోకి వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయనీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో సెటిలర్లు తెలంగాణ రాష్ట్ర సమితితో కయ్యం పెట్టుకునే అవకాశాలు మృగ్యం. ఎక్కడ న్నా కుల పిచ్చి ఉన్న కొన్ని వర్గాలు కూటమికి జై కొట్టవచ్చు, కానీ మిగిలిన సెటిలర్లంతా వివేకంతో ఓటేస్తారు. చంద్రబాబు నిర్వాకాలను బాహాటంగా వ్యతి-రేకించే సెటిలర్లే ఎక్కువ మంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ పరిస్థితులేవీ ఊహించకుండా సోని-యాగాంధీతో ఆంధ్ర పాట పాడించారు. చంద్రబాబు తోక పట్టుకోవ డం చారిత్రక తప్పిదమైపోయిందని కాంగ్రెస్ అధిష్ఠానంలో కీలకపాత్ర పోషించే ఒక నాయకుడు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారని చెబు-తున్నారు. డిసెంబరు 11 తర్వాత ఈ అభిప్రాయం మరింత బలపడుతుంది. ఎన్నికల ఫలితాలు అనేక భ్రమలను బద్ద లు కొడుతాయి.
ఇక సభలకు హాజరైన సమూహాల స్పందన ఎలా ఉంది? శుక్రవారంనాడే కేసీఆర్ ఆరు చోట్ల బహిరంగ సభల్లో పర్యటించారు. అన్ని సభల్లో మూడు నుంచి నాలుగు లక్షల మంది పాల్గొన్నారు. ఈ సభలకు సమీకరణ ఉన్నప్పటికీ స్వచ్ఛంద హాజరు కూడా కనిపిస్తున్నది. వచ్చిన ప్రజానీకంలో కూడా ఒక ఉత్సాహం, సానుకూ ల దృక్పథం కొట్టొచ్చినట్టు కనిపించాయి. కేసీఆర్ తన ప్రసంగంలో వేదిక మీది నుంచి ఇచ్చే పిలు-పులకు సభ మారుమోగే స్పందన వస్తున్నది. మహిళలు, గిరిజనులు, రైతులు, యువకులు అధికంగా హాజ-రవుతున్నారు. కేసీఆర్ తన ప్రసంగాల్లో నాలుగున్నరేండ్లలో అమలుచేసిన పథకాలు, చేసిన మంచిపనులు చెబుతూ, తిరిగి గెలిపిస్తే చేయబోయే పనులను వివరిస్తూ కుట్రపూరితమైన కూటమి వేట గురించి కూడా చెబుతున్నారు. నర్సంపేట, మహబూబాబా ద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామ… ఊర్లు కిటకిటలాడిపోయాయి. సభా వేదిక ముందు ఎంతమంది ఉన్నారో వీధు ల్లో అంతమంది ఉన్నారు. ఈ సభలన్నీ టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. టీఆర్‌ఎస్ నాలుగున్నరేండ్ల పాల-నకు సానుకూల స్పందనగా కనిపిస్తున్నాయి.  మరి సోనియాగాంధీ సభ ఎలా జరిగింది? సభ నిర్వ-హించింది 30 ఎకరాల విస్తీర్ణంలో. సాధారణంగా సభకు వచ్చినవారు కూర్చుంటే ఎకరానికి 4 వేల మందిని లెక్కగడుతారు. నిలబడితే ఐదు వేల మందిని లెక్కగడుతారు. కుర్చీలు వేస్తే వెయ్యి నుంచి పదిహే-నువందల మం దిని లెక్కగడుతారు. సభకు వచ్చేవారు వస్తున్నారు, పోయేవారు పోతున్నారు. ఒక నిలకడ, నిండుదనం లేదు. సభకు ఎంత మంది హాజరై ఉంటారో ఎవరికి వారు అంచనాకు రావచ్చు. ఇంత మంది మహా నాయకులు, కాబోయే ముఖ్యమంత్రులు, మాటలు కోటలు దాటించే వాక్‌శూరులు తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పాటుచేసిన తొలి సోనియాగాంధీ సభను ఇంత పేలవంగా ఎందుకు నిర్వహించినట్టు? బహు-నాయకత్వం మొదటికి చేటు అని మేడ్చల్ సభ చూసే అర్థమవుతుంది. ఎంతమంది మాట్లాడారని? కింద జనం గురించి పట్టించుకున్న నాథుడే లేడు. వచ్చామా మైకందుకున్నా మా నాలుగు సుత్తి చెత్త డైలాగులు కొట్టామా వెళ్లామా అన్నదే అం దరి ఆరాటం. అందరినోటా బాగా తలకెక్కిన కేసీఆర్ వ్యతిరేక జప మే. సోనియా గాంధీ వచ్చిన తర్వాత అయినా ఆమెను జనానికి కనిపించనిస్తే కదా. పరిచయాలు సత్కారాలు చేరికలతో గుంపులు గుంపులు ఆమెను కప్పేస్తూ వచ్చారు. ఒక సభనే సక్రమంగా నిర్వహించలేని ఈ నాయకులు రేపు రాష్ర్టాన్ని ఎలా పాలిస్తారు?
కాంగ్రెస్ నాయకులు నోరుపారేసుకుంటే అర్థం చేసుకోవచ్చు. వారి రాజకీయ స్థాయి అంతే అని. ప్రొఫెసర్ కోదండరాం సారు గొంతులో కూడా అక్కసు, ద్వేషం, ఉక్రోషం మాత్రమే కనిపించా యి. ఒక రాజకీయ పండితుడు కూడా రాజకీయాలను వదిలిపెట్టి తిట్లకు లంకించుకోవడం ఆశ్చర్యకరం. నాలుగున్నరేండ్లలో తెలంగాణలో ఏమీ జరుగలేదని చెప్పాలని ఎంత తాపత్రయపడుతున్నా రో వీరి ప్రసంగాలు వింటే తెలిసి-పోతుంది. సమస్య అదే. ప్రజలకే మో ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం, ఫలితం అందింది. ఆ కృతజ్ఞ-తాభావం జన సమూహాల్లో ఉన్నది. టీఆర్‌ఎస్ సభలు విజయవంతం కావడానికి కారణం ఆ స్పందనే. కూటమి నాయకులే మో అవేవీ చూడదల్చుకోలేదు. కూటమి నాయకులు ఎంత ఔట్‌డేటెడ్ అయిపోయారో వారి ప్రసంగాలే చెబుతున్నాయి. మంచి ప్రత్యామ్నాయాల గురించి, మంచి పథకాలు విధానాల గురించి చెప్పి ప్రజలను గెలువడానికి బదులు, అబద్ధాలను, అక్కసుతో కూడిన పరుష పదజాలాన్ని ఆశ్రయిస్తు-న్నారు. తెలంగాణ అభివృ ద్ధి దిశగా ముందుకెళ్లాలంటే ఏమి చేయాలో తెలియని ఈ నేతలం తా కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి శాపనార్థాలు పెట్టి సంబురపడిపోయారు. కుటుంబ పాలన గురించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పక్కన కూర్చొని, కొన్ని తరాలుగా రాజకీయాలను తమ కుటుంబాలకు జీపీఏ తీసుకు-న్నంత ఈజీగా వ్యవహారాలు నడిపించే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే జనం నవ్విపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో తరతరాలుగా ఎన్ని కుటుంబాలైనా ఉండవచ్చు. ఇంకెక్కడా ఉండకూడదు. కాంగ్రెస్ కుటుంబాలు పైరవీకారుల కుటుంబాలు. టీఆర్‌ఎస్ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో, రాజకీయాల్లో నలిగినలిగి రాటు దేలివచ్చిన కుటుంబం. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు సహా అనేక మంది పారాచూట్ నాయకులు. ఢిల్లీలో పైరవీ చేసుకొని లేక టికెట్లు కొనుక్కుని నేరుగా నియోజకవర్గాలకు వచ్చి-నవారు. వారు కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడితే ఏం విలువ ఉంటుంది? వారు తిట్లు మాని కేసీఆర్ కంటే ఉత్తమంగా ఏమి చేయగలరో చెప్పి ఉంటే కొంతయి నా ప్రయోజనం ఉండేది. వాళ్లు మారరు. జనమే వారిని మార్చేస్తున్నారు.

మరో బలి పశువు

చంద్రబాబు యెంతమందిని బలితీసుకున్నారు? ఎంతమందిని బకరాలను చేశాడు?

ముందు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచాడు.

ఆ తర్వాత వెన్నుపోటులో తనతో చెయ్యికలిపిన తోడల్లుడిని కరివేపాకులా తీసిపారేశాడు.

ఆ వెంటనే బావమరిది హరికృష్ణను చావుదెబ్బ కొట్టాడు.

మధ్యలో తమ్ముడిని శంకరగిరి మాన్యాలు పట్టించాడు.

ఎన్నోసార్లు పార్టీలను, ఫ్రంటులను రాత్రికి రాత్రి తన్నేసి కొత్త జట్టులోకి మారిపోయాడు.

చివరకు రాష్ట్రమంతా తిరిగి పార్టీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ను వెలివేశాడు.

అయినా ఎన్టీఆర్ కావాలి. ఆయన బొమ్మ కావాలి. ఆయన బిడ్డలు కావాలి.

అందుకే ఇప్పుడు మరో బలి పశువును తీసుకొస్తున్నాడు.

అర్థం కానిదేమంటే ఇంత చరిత్ర కళ్ళ ముందున్నా ఎప్పటికప్పుడు కొత్త బకరాలు అదే కుటుంబం నుంచి దొరుకుతుండడం.

కేసీఆర్ కావాలె, కేసీఆర్ రావాలె

టీడీపీ ఓటు బ్యాంకు లెక్కలు నమ్మి పొత్తులకు వెళ్లి ఉంటే కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో తీవ్ర నిరాశ తప్పదు. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం లేదు. వందలాది గ్రామాల్లో కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కొంతమంది కాంగ్రెస్‌లోనే చేరిపోయారు. మరికొంత మంది బీజేపీలో చేరిపోయా రు. అందువల్ల కాంగ్రెస్‌కు అదనంగా ఒనగూడే ప్రయోజనం కంటే ద్రోహులతో చేతులు కలిపార న్న అపప్రథే ఎక్కువగా వస్తుంది. ఆ తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను కూడా చంద్రబాబే ఫైనల్ చేస్తున్నాడన్న వార్తలు నిజమే అయితే,కాంగ్రెస్‌కు అంతకంటే దౌర్భాగ్యం లేదు.

img_3780

నిలబడ్డోడు ఎటువంటోడయితే మనకేందిరా. కేసీఆర్ కావాలె. కేసీఆర్ రావాలె. మనం ఆయనకు ఓటేస్తు న్నం. కేసీఆర్ రాబట్టే మనూరు మండలం అయిం ది. మనూళ్లెకు రోడ్లొచ్చినయి. కాలువ నీళ్లొచ్చినయి. నాలాంటోళ్లకు వందల మందికి పింఛన్లు వస్తున్నయి. అంతా నిమ్మళంగున్నం. కాంగ్రెసొస్తే చాటల తవుడువోసి కుక్కలకు కొట్లాటబెట్టినట్టే ఉంటది. వద్దురా బాబూ. ఎవరి ముఖమూ చూడొద్దు. ఒక్క కేసీఆర్ సారునే గుర్తుపెట్టుకోవాలె అని ఇటీవల నల్లగొండ జిల్లాలో ఓ పెద్దమనిషి స్పందించిన తీరిది. స్థానిక టీఆర్‌ఎస్ అభ్యర్థి తమ ఊరికి రాలేదని, తమను పలుకరించలేదని కొంతమంది యువకులు ఫిర్యాదు చేస్తుంటే ఆ పెద్దమనిషి చెప్పిన సమాధానమిది. ఆ ఒక్క పల్లెలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా గ్రామీ ణ ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉన్న సాధారణ అభిప్రాయం ఇది. అది ఎవరో నేర్పితే కలిగే అభిప్రాయం కాదు. స్వానుభవం నుంచి ఏర్పరచుకున్న భావ న. ఒక మీడియా సంస్థ ఇటీవల ఏకకాలంలో 110 నియోజకవర్గాల్లో 60 వేల మంది ఓటర్లను కలిసి అభిప్రాయాలు సేకరించింది. వారిలో 42 వేల మంది మళ్లీ కేసీఆరే కావాలి, కేసీఆరే రావాలి అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో మీడి యా సంస్థ 13 నియోజకవర్గాల పరిధిలో 13 వేల మం ది ఓటర్ల అభిప్రాయాలను సేకరించిది. ఈ సర్వేలో కూడా జనాభిప్రాయం ముందు సర్వేలో వ్యక్తమయినట్టుగా వచ్చింది. ఇవిగాక జాతీయ, స్థానిక పత్రికలు అనేకం సర్వేలు చేశాయి. అన్నింటిలోనూ వ్యక్తమైన సాధారణ భావన ఒక్కటే మళ్లీ కేసీఆర్ వస్తారు, రావాలి అని. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సర్వత్రా సానుకూల వాతావరణం ఉందని ఈ సర్వే లు, అభిప్రాయ సేకరణలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇందు లో హైర్ పర్చేజ్ సర్వేలు లేవు. ఇప్పుడొస్తున్నాయి. కాంగ్రెస్-టీడీపీ కూటమి గెలువబోతుందని ఇక నుంచి వండివార్చే సర్వేలు మొదలవుతాయి. వీటికి ప్రాతిపదిక జనాభిప్రాయం కాదు. 2014 శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కలు తీసి, టీఆర్‌ఎస్‌కు 34.3 శాతం ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ… గట్రగట్రాలకు 40 శాతం ఓట్లు వచ్చాయి, అప్పుడు వేర్వే రు చేశాయి కాబట్టి టీఆర్‌ఎస్ గెలిచింది, ఇప్పుడు కలిసిపోటీ చేస్తున్నాయి కాబట్టి టీఆర్‌ఎస్‌కు కష్టకాలం వచ్చింది అని సూత్రీకరణ లు చేస్తున్నాయి.

ఎన్నికల రాజకీయాల గురించి జ్ఞానం ఉన్నవారెవరూ ఇంత తెలివితక్కువ వాదనలకు దిగరు. 2014 జూన్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజలు స్వపరిపాలన రుచి అనుభవించారు. మన నిధు లు, నీళ్లు, నియామకాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూశారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన సంక్షేమ పథకాలనూ ప్రజలు చూశారు. తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా అన్నివర్గాలకు ఆర్థిక ఫలాలు అందించే పథకాలను తీసుకొచ్చింది. ఇవన్నీగాక గత ఎన్నికల తర్వాత మెదక్, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలు జరిగాయి. ఇంకా స్పష్టంగా అర్థం కావడానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలూ జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏం జరిగింది? మెదక్ లో 58.03 శాతం, వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో 59.5 శాతం ఓట్ల తో ఘనవిజయం సాధించింది. వరంగల్‌లో కాంగ్రెస్‌కు అన్ని పార్టీ లు మద్దతు ప్రకటించినా వచ్చింది కేవలం 16 శాతం ఓట్లు. టీడీపీకి పెట్టనికోట, పచ్చని కోట అని ఆంధ్రా మీడియా వర్ణించే హైదరాబాద్‌లో ఆ పార్టీ స్థానమేమిటో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తేలిపోయింది. తెలంగాణ వచ్చిన వెంటనే జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో జంటనగరాల్లో ఉండే వివిధ ప్రాంతాల ప్రజల్లో కొంత అభద్రత, అనుమానాలున్నాయి. అవి చంద్రబాబు, ఆంధ్రా మీడియా కల్పించినవే. ఆ భయంతోనే హైదరాబాద్ మహానగరం పరిధిలో ఉండే పది నియోజకవర్గాల్లో ప్రజలు టీడీపీని గెలిపించారు. వాళ్ల అభద్ర త, అనుమానాలు ఉత్తవేనని ఆ తర్వాత ఇక్కడ నివసిస్తున్న అన్ని ప్రాంతాల ప్రజలకు అర్థమైంది. అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 43.85 శాతం ఓట్లతో 99 కార్పొరేటర్ స్థానాల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్ నగర చరిత్రలో ఇన్ని సీట్ల ఏకపక్ష ఆధిపత్యం సాధించిన పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమే. కాంగ్రెస్-టీడీపీలకు ఇద్దరికి కలిపి కూడా వచ్చింది 23.5 శాతం ఓట్లే. అయినా చంద్రబాబు కాంగ్రెస్‌తో కలువగానే ఇక్కడేదో భూకంపం వస్తోందన్న భ్రమలు సృష్టించేందుకు ఆంధ్రా మీడియా పాతలెక్క లు ముందుకు తెస్తున్నది. కొత్త సర్వేలు వండివార్చుతున్నది. తెలంగాణకు సంబంధించినంత వరకు చంద్రబాబు అవాంఛిత శక్తి. అవరోధక వ్యక్తి. టీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదు. ఆయన తెలంగాణలో ఎంత కనిపిస్తే టీఆర్‌ఎస్‌కు, తెలంగాణ స్వపరిపాలన కోరుకునే శక్తులకు అంత మంచిది. తెలంగాణవాదులు చేయాల్సిన పని ఇంకా మిగిలే ఉందని చంద్రబాబు గుర్తుచేస్తారు. తెలంగాణ నుంచి తరిమేయాల్సిన భూతాలు ఇంకా ఇక్కడున్నాయన్న వాస్తవాన్ని తెలియజెబుతారు. చంద్రబాబును తెచ్చి నెత్తిన పెట్టుకున్నవారు బాధపడాలి.

బహుశా అయన ధనబలం ఆయనకు మళ్లీ తెలంగాణకు వచ్చే శక్తిని ఇచ్చి ఉంటుంది. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు కూడా ఆ ఒక్క కారణంతోనే ఆయనను భుజానికెత్తుకుని ఉంటారు. కానీ అందుకు వారు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. చంద్రబాబుతో కాంగ్రెస్‌కు ఏదో పెద్ద ప్రయోజనం ఉంటుందని తెలిసో తెలియకో రాహుల్‌గాంధీ అనుకుంటూ ఉండవచ్చు. చంద్రబాబు శాలువాలు, బొకేలు, తలపాగాలు తీసుకొని వెళ్లి కలిసి వస్తు న్న వివిధ పార్టీల నాయకులంతా ఇప్పటికే నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నవారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ఇప్పటికే కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. దేవెగౌడ-కుమారస్వామిలను ఈయన మోటివేట్ చేసేదేమీ లేదు. చంద్రబాబు ఎంత అవకాశవాదో దేవెగౌడకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. తమిళనాట స్టాలిన్ కాంగ్రెస్‌కు మిత్రుడే. శరద్‌పవార్ బీజేపీకి ఎప్పటినుం చో వైరి పక్షమే. మాయావతి, ములాయంసింగ్, ఫరూక్, మమతా బెనర్జీలు చంద్రబాబు కంటే ముందునుంచి మోదీతో తలపడతున్నవారు. చంద్రబాబు నరేంద్రమోదీతో అంటకాగుతున్నప్పుడు వారంతా కేంద్రంతో వీధిపోరాటాలు చేస్తున్నవారు. ఈయన వారి ని ప్రేరేపించేదేమీ లేదు. నన్నుకూడా మీతో కలుపుకోండని మాత్ర మే చెప్పగలడు. అందుకు అవసరమైతే లోక్‌సభ ఎన్నికలకు నిధులిస్తానని ఆశ చూపగలడు. చంద్రబాబు దేశ రాజకీయాల్లో అవకాశవాదానికి ఒక గొప్ప పాఠం వంటివాడు. ఆయన గురించి అందరికీ సుపరిచితమే. తెలంగాణలోని తెలుగుదేశం అవశేషులు, చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో పెరిగిపెద్దలైన పచ్చమీడియా ఆయనకు కీర్తికిరీటాలు తగిలించి ఊరేగించవచ్చుగాక. కానీ ఎవరూ ఆయన ను నమ్మి చేరదీయరు. నమ్మిన వారినెవరినీ ఆయన ముంచకుండా ఉండలేదు. అందుకే టీడీపీ-కాంగ్రెస్‌లు బ్రహ్మాండం బద్దలు చేసే అవకాశమే లేదు. అది తాత్కాలిక, అవకాశవాద బంధం. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ ఇక సోదిలో ఉంటే ఒట్టు. జార్ఖండ్‌లో లాలూప్రసాద్, నితీష్‌కుమార్‌లు ఎలా దుకాణాలు బందు చేసుకున్నారో తెలంగాణలో కూడా చంద్రబాబు దుకాణం బందవుతుంది.

ఇది అనివార్యంగా, సహజంగా జరిగే పరిణామం. ఆంధ్ర ఆధిపత్యంకోసం, ఆంధ్ర ప్రయోజనాల కోసం పాటుపడే ఆ పార్టీకి తెలంగాణ ప్రయోజనాలతో సహజ వైరుధ్యం ఉంది. అందుకే తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాస్తాడు. రాయకపోతే ఆంధ్ర ప్రజలు ఆయనను తిరస్కరిస్తారు. తెలంగాణలోనే ఇంకా కొద్ది మం ది నాయకులు బుద్ధి మాంద్యం కారణంగానో, చంద్రబాబు ఇచ్చే రాజకీయ వేతనాలకు తలొగ్గో ఇంకా టీడీపీని పట్టుకొని వేలాడుతున్నారు. వారు కూడా ఈ ఎన్నికల తర్వాత కనిపించరు. చంద్రబాబుతో జట్టు కట్టడం వల్ల జరిగిన నష్టమేమిటో కాంగ్రెస్‌కు ఎన్నికల తర్వాత తెలిసొస్తుంది. టీడీపీ ఓటు బ్యాంకు లెక్కలు నమ్మి పొత్తులకు వెళ్లి ఉంటే కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో తీవ్ర నిరాశ తప్పదు. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం లేదు. వందలాది గ్రామాల్లో కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కొంతమంది కాంగ్రెస్‌లోనే చేరిపోయారు. మరికొంత మంది బీజేపీలో చేరిపోయారు. అందువల్ల కాంగ్రెస్‌కు అదనంగా ఒనగూడే ప్రయోజనం కంటే ద్రోహులతో చేతులు కలిపారన్న అపప్రథే ఎక్కువగా వస్తుం ది. ఆ తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను కూడా చంద్రబాబే ఫైనల్ చేస్తున్నాడన్న వార్తలు నిజమే అయితే, కాంగ్రెస్‌కు అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఇక కోదండరాం సారు, సీపీఐ కామ్రేడ్స్ పరిస్థితి మరీ దీనం. వారిని ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం సారు పాత్రను ఎవరూ విస్మరించలేరు. కానీ ఆయన చిల్లర రాజకీయాలతో ఆ ప్రతిష్ఠనంతా స్వయంగా కడిగేసుకున్నారు. అందునా ఇప్పుడు టీడీపీతో చేతులు కలుపడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాలు బోధించిన కోదండరాంసారుకు టీడీపీతో చేతులు కలుపగూడదన్న విషయం ఎందుకు అర్థం కాలేదో తెలియదు. అది ప్రతికూల ఫలితాలను ఇస్తుందని, తెలంగాణవాదానికి ఉన్న శక్తిని బలహీనపరుస్తుందని, ఉద్యమ హేతుబద్ధతను ప్రశ్నార్థకం చేస్తుందని వారు ఆలోచించాల్సింది. సీపీఐది మరీ విషాదం. ఆంధ్రలో చంద్రబాబు కు వ్యతిరేకంగా పవన్‌కల్యాణ్‌తో జట్టుకట్టి ఎన్నికలకు వెళదామనుకుంది.
తీరా ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు, నారాయణ ఒకే పంథాలోకి వచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అన్న కొత్త చొక్కా కుట్టించుకొని ఒక్కటయ్యారు. మరి ఆంధ్రాలో ఏమి చేస్తారో తెలియదు. వ్రతం చెడ్డా సుఖం దక్కలేదు. అడిగిన సీట్లు ఇవ్వలేదు. ఇచ్చిన సీట్లలో ఓట్లు వేస్తారో లేదో తెలియదు. కమ్యూనిస్టు నాయకులు ఎన్నికల వేళ ఉన్నంత క్రియాశీలంగా మిగిలిన కాలమంత ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవి. ఇలా సీట్ల కోసం బతిమాలుతూ వీళ్ల వెంట వాళ్ల వెంట తిరుగాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇదిగో ఇట్లా ఉన్న పార్టీలన్నీ కలిసి టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని చెబితే జనం ఎలా నమ్ముతారు? వీళ్ల జెండా, ఎజెండా, మ్యానిఫెస్టోలకు బాధ్యులెవరు?