ఇటు వెల్లువ, అటు వెలవెల


కాంగ్రెస్‌ను, కూటమిని ఎవరూ ఓడించనవసరం లేదు. స్వయం విధ్వంసకులు అక్కడ చాలా మందే ఉన్నారు. మేడ్చల్ సభలో ఒకరు కాదు, ఇద్దరు కాదు ఒకట్రెండు డజన్ల మంది మాట్లాడారు. ఒక్కరూ తమ ఎజెండా చెప్పే ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపైనా, టీఆర్‌ఎస్‌పైనా అవాకులు, చెవాకులు పేలడం తప్ప, ఒక నిర్మాణాత్మక ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ ఇవ్వలేదు. పాపం కాంగ్రెస్ అధి-నేత్రి సోనియాగాంధీ సైతం ఈ వాచాలత్వమంతా వింటూ కూర్చోవలసి వచ్చింది. వీరు ఇంత చెలరేగి మాట్లాడుతు న్నా సభలో అక్కడక్కడా ఏ నాయకుడు మాట్లాడితే ఆ నాయకుడి మనుషులు చప్ప ట్లు కొట్టడం తప్ప సభికులం తా ఊగిపోయింది లేదు. ఉత్సాహంగా స్పందించింది లేదు. సోనియాగాంధీ సైతం తెలంగాణ ప్రజలను ప్రభావి తం చేయడానికి ప్రత్యేక ప్రయత్నమేదీ చేయలేదు. తెలంగాణలో ఏదో కొంపలు మునిగిపోయినట్టు, కడుపు తరుక్కుపోతోంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లోనే కాంగ్రెస్‌ను తిరస్కరించి, ఇష్టపడి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. బహుశా తమకు అధికారం దక్కనందుకు కడుపు తరుక్కుపోవడంలో ఆశ్చర్యం లేదు. తెలంగాణ ప్రజ లు దుఃఖంలో లేరు. దుఃఖంలో ఉన్నది కాంగ్రెస్, దాని మిత్రపక్షా లు మాత్రమే. పైగా విచిత్రంగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని ఆమె మేడ్చల్ సభలో తెలంగాణ నాయకుల సాక్షిగా ప్రకటించారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వచ్చు, ఇస్తామని చెప్పొచ్చు. తెలంగాణ ఎన్నికల సభలో ఈ మాట ఎందుకు చెప్పారన్నదే ప్రశ్న. ఎం దుకు చెప్పారంటే హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్ల ఓట్లు పడాలంటే అలా చెప్పాలని ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని, అందుకే ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారని కొందరు విశ్లేషకులు సూత్రీకరిస్తు-న్నారు. ఎన్నికల వేళ సెటిలర్ల ఓట్ల కోసమే చంద్రబాబు కాంగ్రెస్ అధినేత్రి చేత తెలంగాణ గడ్డమీద ఇటు-వంటి ప్రకటన చేయించారంటే రేపు వీళ్ల కూటమి పెత్తనం వస్తే ఎలా చెలరేగిపోతారో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో చంద్రబాబుతో అవసరం పెరిగే కొద్దీ సోనియాగాంధీ ఇక్కడ తెలంగాణ నాయకుల మెడలు వంచి అమరావతికి అంకితం చేయడం పెరుగుతూ ఉంటుంది. దేశ రాజకీయాల్లో చంద్రబాబు అతిపెద్ద అవకాశ-వాది. తన నాలుకను ఎప్పుడు ఎలా తిప్పేస్తారో ఎవరితో జట్టు కడుతారో ఎవరిని తిడుతారో చెప్పడం కష్టం. చంద్రబాబు ఇప్పుడు ఎన్ని వేషాలైనా వేయవచ్చు గాక, ఆయన తెలంగాణకు వ్యతిరేక శక్తి. ఆయన మాయలో కాంగ్రెస్ పడటం విషాదం.
వాస్తవ పరిస్థితి ఏమంటే చంద్రబాబు ఎత్తుగడలను సెటిలర్లం తా ఆమోదిస్తారన్నది కూడా ఒక భ్రమ. ఆంధ్రలో చంద్రబాబు రాష్ర్టాన్ని సర్వనాశనం చేశారని, ఈసారి ఆయన ఓడిపోవాలని చెప్పే సెటిలర్లు హైద-రాబాద్‌లో కోకొల్లలు. సెటిలర్లకు 2014 ఎన్నికల నాడు అనుమానాలున్నాయి. అందుకే హైదరాబాద్ నగ-రంలో టీడీపీకి ఓటేశారు. ఆ తర్వాత ఆ అనుమానాలు పటాపంచలయ్యా యి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏక-పక్షంగా టీఆర్‌ఎస్‌కు పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు మాయలకు పడిపోయి సెటిలర్లు ఆషామాషీగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ భావించడం లేదు. కూటమి ఎంత గోలగోల చేసినా తెలం-గాణలో వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని వారికీ తెలుసు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు తిరిగి అధికా-రంలోకి వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయనీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో సెటిలర్లు తెలంగాణ రాష్ట్ర సమితితో కయ్యం పెట్టుకునే అవకాశాలు మృగ్యం. ఎక్కడ న్నా కుల పిచ్చి ఉన్న కొన్ని వర్గాలు కూటమికి జై కొట్టవచ్చు, కానీ మిగిలిన సెటిలర్లంతా వివేకంతో ఓటేస్తారు. చంద్రబాబు నిర్వాకాలను బాహాటంగా వ్యతి-రేకించే సెటిలర్లే ఎక్కువ మంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ పరిస్థితులేవీ ఊహించకుండా సోని-యాగాంధీతో ఆంధ్ర పాట పాడించారు. చంద్రబాబు తోక పట్టుకోవ డం చారిత్రక తప్పిదమైపోయిందని కాంగ్రెస్ అధిష్ఠానంలో కీలకపాత్ర పోషించే ఒక నాయకుడు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారని చెబు-తున్నారు. డిసెంబరు 11 తర్వాత ఈ అభిప్రాయం మరింత బలపడుతుంది. ఎన్నికల ఫలితాలు అనేక భ్రమలను బద్ద లు కొడుతాయి.
ఇక సభలకు హాజరైన సమూహాల స్పందన ఎలా ఉంది? శుక్రవారంనాడే కేసీఆర్ ఆరు చోట్ల బహిరంగ సభల్లో పర్యటించారు. అన్ని సభల్లో మూడు నుంచి నాలుగు లక్షల మంది పాల్గొన్నారు. ఈ సభలకు సమీకరణ ఉన్నప్పటికీ స్వచ్ఛంద హాజరు కూడా కనిపిస్తున్నది. వచ్చిన ప్రజానీకంలో కూడా ఒక ఉత్సాహం, సానుకూ ల దృక్పథం కొట్టొచ్చినట్టు కనిపించాయి. కేసీఆర్ తన ప్రసంగంలో వేదిక మీది నుంచి ఇచ్చే పిలు-పులకు సభ మారుమోగే స్పందన వస్తున్నది. మహిళలు, గిరిజనులు, రైతులు, యువకులు అధికంగా హాజ-రవుతున్నారు. కేసీఆర్ తన ప్రసంగాల్లో నాలుగున్నరేండ్లలో అమలుచేసిన పథకాలు, చేసిన మంచిపనులు చెబుతూ, తిరిగి గెలిపిస్తే చేయబోయే పనులను వివరిస్తూ కుట్రపూరితమైన కూటమి వేట గురించి కూడా చెబుతున్నారు. నర్సంపేట, మహబూబాబా ద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామ… ఊర్లు కిటకిటలాడిపోయాయి. సభా వేదిక ముందు ఎంతమంది ఉన్నారో వీధు ల్లో అంతమంది ఉన్నారు. ఈ సభలన్నీ టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. టీఆర్‌ఎస్ నాలుగున్నరేండ్ల పాల-నకు సానుకూల స్పందనగా కనిపిస్తున్నాయి.  మరి సోనియాగాంధీ సభ ఎలా జరిగింది? సభ నిర్వ-హించింది 30 ఎకరాల విస్తీర్ణంలో. సాధారణంగా సభకు వచ్చినవారు కూర్చుంటే ఎకరానికి 4 వేల మందిని లెక్కగడుతారు. నిలబడితే ఐదు వేల మందిని లెక్కగడుతారు. కుర్చీలు వేస్తే వెయ్యి నుంచి పదిహే-నువందల మం దిని లెక్కగడుతారు. సభకు వచ్చేవారు వస్తున్నారు, పోయేవారు పోతున్నారు. ఒక నిలకడ, నిండుదనం లేదు. సభకు ఎంత మంది హాజరై ఉంటారో ఎవరికి వారు అంచనాకు రావచ్చు. ఇంత మంది మహా నాయకులు, కాబోయే ముఖ్యమంత్రులు, మాటలు కోటలు దాటించే వాక్‌శూరులు తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పాటుచేసిన తొలి సోనియాగాంధీ సభను ఇంత పేలవంగా ఎందుకు నిర్వహించినట్టు? బహు-నాయకత్వం మొదటికి చేటు అని మేడ్చల్ సభ చూసే అర్థమవుతుంది. ఎంతమంది మాట్లాడారని? కింద జనం గురించి పట్టించుకున్న నాథుడే లేడు. వచ్చామా మైకందుకున్నా మా నాలుగు సుత్తి చెత్త డైలాగులు కొట్టామా వెళ్లామా అన్నదే అం దరి ఆరాటం. అందరినోటా బాగా తలకెక్కిన కేసీఆర్ వ్యతిరేక జప మే. సోనియా గాంధీ వచ్చిన తర్వాత అయినా ఆమెను జనానికి కనిపించనిస్తే కదా. పరిచయాలు సత్కారాలు చేరికలతో గుంపులు గుంపులు ఆమెను కప్పేస్తూ వచ్చారు. ఒక సభనే సక్రమంగా నిర్వహించలేని ఈ నాయకులు రేపు రాష్ర్టాన్ని ఎలా పాలిస్తారు?
కాంగ్రెస్ నాయకులు నోరుపారేసుకుంటే అర్థం చేసుకోవచ్చు. వారి రాజకీయ స్థాయి అంతే అని. ప్రొఫెసర్ కోదండరాం సారు గొంతులో కూడా అక్కసు, ద్వేషం, ఉక్రోషం మాత్రమే కనిపించా యి. ఒక రాజకీయ పండితుడు కూడా రాజకీయాలను వదిలిపెట్టి తిట్లకు లంకించుకోవడం ఆశ్చర్యకరం. నాలుగున్నరేండ్లలో తెలంగాణలో ఏమీ జరుగలేదని చెప్పాలని ఎంత తాపత్రయపడుతున్నా రో వీరి ప్రసంగాలు వింటే తెలిసి-పోతుంది. సమస్య అదే. ప్రజలకే మో ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం, ఫలితం అందింది. ఆ కృతజ్ఞ-తాభావం జన సమూహాల్లో ఉన్నది. టీఆర్‌ఎస్ సభలు విజయవంతం కావడానికి కారణం ఆ స్పందనే. కూటమి నాయకులే మో అవేవీ చూడదల్చుకోలేదు. కూటమి నాయకులు ఎంత ఔట్‌డేటెడ్ అయిపోయారో వారి ప్రసంగాలే చెబుతున్నాయి. మంచి ప్రత్యామ్నాయాల గురించి, మంచి పథకాలు విధానాల గురించి చెప్పి ప్రజలను గెలువడానికి బదులు, అబద్ధాలను, అక్కసుతో కూడిన పరుష పదజాలాన్ని ఆశ్రయిస్తు-న్నారు. తెలంగాణ అభివృ ద్ధి దిశగా ముందుకెళ్లాలంటే ఏమి చేయాలో తెలియని ఈ నేతలం తా కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి శాపనార్థాలు పెట్టి సంబురపడిపోయారు. కుటుంబ పాలన గురించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పక్కన కూర్చొని, కొన్ని తరాలుగా రాజకీయాలను తమ కుటుంబాలకు జీపీఏ తీసుకు-న్నంత ఈజీగా వ్యవహారాలు నడిపించే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే జనం నవ్విపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో తరతరాలుగా ఎన్ని కుటుంబాలైనా ఉండవచ్చు. ఇంకెక్కడా ఉండకూడదు. కాంగ్రెస్ కుటుంబాలు పైరవీకారుల కుటుంబాలు. టీఆర్‌ఎస్ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో, రాజకీయాల్లో నలిగినలిగి రాటు దేలివచ్చిన కుటుంబం. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు సహా అనేక మంది పారాచూట్ నాయకులు. ఢిల్లీలో పైరవీ చేసుకొని లేక టికెట్లు కొనుక్కుని నేరుగా నియోజకవర్గాలకు వచ్చి-నవారు. వారు కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడితే ఏం విలువ ఉంటుంది? వారు తిట్లు మాని కేసీఆర్ కంటే ఉత్తమంగా ఏమి చేయగలరో చెప్పి ఉంటే కొంతయి నా ప్రయోజనం ఉండేది. వాళ్లు మారరు. జనమే వారిని మార్చేస్తున్నారు.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily