రేవంత్రెడ్డి గొప్పతనం గురించి కొత్తగా ఎవరూ ఎవరికీ చెప్పనవసరం లేదు. ఆయన ఎంతటి శీలవంతుడో ఓటుకు నోటు కేసులో పచ్చిగా ఆయనే రుజువు చేసుకున్నడు. ఇప్పుడు జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులు ఆయన ఘనతను మరింత బయటపెడుతున్నయి.
అటువంటి శీలవంతుడు జర్నలిస్టులకు శీల పరీక్షలు నిర్వహించడం గురించి మాట్లాడితే జనం నవ్విపోతారు. రాత్రి అమ్మకాలు, పగలు కొనుగోళ్లు, చీకటిమాటు వ్యవహారాల గురించి ఆయన ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.
సింగపూరు బ్యాంకు ఖాతాలకు ఎన్ని డిజిట్లు ఉంటాయో తెలిసిన ఈ శీలవంతునికి ఐటీ, ఈడీలు ఎవరి ఆదేశాలతో పనిచేస్తాయో తెలియదా? గట్టిగా అరిచినంతమాత్రాన అవినీతి నీతిగా మారదు. బుకాయించినంత మాత్రాన నిన్నమొన్నటి చరిత్ర మరుగునపడదు.