నమ్మితే నట్టేట వదిలేస్తారు


img_4285img_4885

 

చంద్రబాబు, నరేంద్రమోడి సేమ్ టు సేమ్. పోయిన ఎన్నికల్లో ఇద్దరు కట్టగట్టుకుని రాష్ట్ర విభజనపై విషం చిమ్మారు. రాష్ర్టాన్ని విభజించి తల్లిని చంపి పిల్లను బయటికి తీశారని చెప్పింది నరేంద్ర మోడీనే. అప్పుడు ఓట్లకోసం అది అవసరం అయింది. ఇప్పుడు చంద్రబాబు చెల్లని కాసు అయిపోయారు. ఆయనతో ప్రయోజనం లేదు. చంద్రబాబుకు కూడా మోడీతో అవసరం తీరిపోయింది.

చంద్రబాబుకు ఒక పాజిటివ్ వాతావరణాన్ని నిర్మించుకుని గెలిచే తెలివి తేటలు ఎప్పుడూ లేవు. ఎవరో ఒకరిని బద్నాం చేసి, జనాన్ని మాయలో ముంచి గెలుపొందాలన్నది ఆయన సూత్రం. తిట్టడానికి ఒక బకరా, పొత్తుకోసం మరో బకరా కావాలి. అందుకే ప్రతిసారీ పొత్తు భాగస్వామిని మార్చాల్సిందే. ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిందే.

కొందరు ఆయనను పరాన్నజీవి అనేది అందుకే. స్వయంప్రకాశం కలిగిన నాయకుడు కాదు. పక్కనో సూర్యుడు ఉండాలి. ఆంధ్రకు అదే శాపం అవుతున్నది. కొట్లాటలో నిజాయితీ లేకపోవడమే ఆంధ్ర సమస్యలకు కారణం.

నరేంద్రమోడీ కూడా ఇప్పటికీ విమర్శలమీదే బతకాలని చూస్తున్నారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి కూడా ఇప్పటికీ ఆయన తిట్టులాభంపైనే ఆధారపడుతున్నారు. పాత భాగస్వాములను వదిలేస్తున్నారు. కొత్త భాగస్వాములకోసం గాలాలు వేస్తున్నారు. ఈయన ఎవరినయినా ఉపయోగం లేదంటే ఇట్టే వదిలేస్తారు. పార్టీలనయినా, సొంత పార్టీ నాయకులనయినా. ఇద్దరినీ నమ్మడానికి వీలులేదు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad