మూసీ విషాదం


 మూసీకి కుడి, ఎడమ కాలువలున్నాయి. ఈ సారి తొందరగా నీళ్లు వదిలారు. ఈ పాటికి చెరువులన్నీ నిండాల్సింది. కొందరు రైతులు స్వార్ధం, తెలివితక్కువతనంతో కుడికాలువకు తుంగతుర్తి గ్రామం వద్దే గండి పెట్టారు. కింది చెరువులకు నీరు వెళ్లడం లేదు. ఎడమకాలువ వరద తాకిడికి తెగిపోయింది. నాలుగు రోజులకింద కాలువలకు నీరు ఆపేశారు. ఇవ్వాళా మూసీ గేట్లు యెత్తి నీరు కిందికి వదలాల్సి వచ్చింది. నీటి కాలువల నిర్వహణ, ప్రాధాన్యతలపై ఒక విధానం రూపొందించకపోతే నీరు ఇలా వృధాగా సముద్రం పాలవుతూనే ఉంటుంది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad