పవన్ కల్యాణ్‌పై ఎన్ని అపార్థాలో!


Pawan-Kalyan-Public-Meeting-Live-Telecast-From-Tirupati

పర్వర్టెడ్, ఎక్సెంట్రిక్, పేలని తుపాకీ, లెక్కకు అందని తిక్క – ఓ తెలంగాణ సీనియర్ జర్నలిస్టు తక్షణ వ్యాఖ్య

పవన్ కల్యాణ్ సువార్త సభలు- మరో సీనియర్ రిపోర్టర్ మెసేజ్

చంద్రబాబు పండుకున్నారు సరే. వెంకయ్య మాట్లాడడం లేదు సరే. కేంద్రం చేయడం లేదు సరే. కాంగ్రెస్ ద్రోహం చేసింది సరే. మోడీ పక్కన కూర్చొని ప్రచారం చేసిన తమరు ఇంతకాలం ఏం చేశారు – బెజవాడ నుంచి టీడీపీ సానుభూతిపరుడయిన ఓ జర్నలిస్టు దెప్పి పొడుపు.

ఏదో దయ్యం పట్టినట్టు అప్పుడప్పుడు ఇలా ఊడిపడి ఊగిపోకపోతే మొనగాడయితే ఉన్న పార్టీలను చాలెంజ్ చేస్తూ బయటికి రావచ్చుగా. కొట్లాడొచ్చుగా- తిరుపతి నుంచే ఓ జర్నలిస్టు మిత్రుని వాట్సాప్ మెసేజ్

ఇది 2019 ఎన్నికలకు పవన్ కల్యాణ్ కొత్త స్క్రిప్టు. దర్శకత్వం చంద్రబాబునాయుడు. రాజకీయ మ్యాచ్ ఫిక్సింగులో భాగం. పవన్ కల్యాణ్ మెల్లగా గేరు మార్చుతున్నాడు. మరోసారి చంద్రబాబుకు ఉపయోగపడేందుకు ఇప్పటినుంచే రంగం సిద్ధం చేస్తున్నడు. 2009లో చిరంజీవి పోషించిన పాత్ర, 2014 తనే పోషించిన పాత్రను 2019లో మరోసారి విజయవంతంగా పోషించడానికి ఇప్పటినుంచే గ్రౌండు ప్రిపేర్ చేస్తున్నాడు- ఒక వైఎస్సార్ సీపీ విశ్లేషకుడి వ్యాఖ్య

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.