సైనికుడు అయితే మాత్రం ఇంత అజ్ఞానమా?Map shows Pranhita River dividing Telangana(left)and Maharastra(right). Great Congress Governments just gave mobilisation advances for canl works as shown in the map, recieved commissions and forgot commissioning of Headworks at Water drawing point, i.e Tammidihatti. This is latest google map, Congress cannot disown or cry foul. 

కాంగ్రెస్ నాయకులూ ఇంత అజ్ఞానంలో ఉన్నారని అనుకోలేదు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును మహారాష్ట్ర, తెలంగాణలను విభజిస్తూ ప్రవహించే ప్రాణహిత పై నిర్మిస్తున్నారు. ముంపు ఉన్నా లేకున్నా రెండు రాష్ట్రాల ఒప్పందం తప్పనిసరి. 
వాళ్ళ రాష్ట్రములో వాళ్ళు బాబిలీ కడితేనే గోల గోల చేసాం. ఇప్పుడు సరిహద్దులో కడుతూ మా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటామంటే ఎవరు ఒప్పుకుంటారు. ఇప్పుడు కూడా ముంపు వీలైనంత తగ్గించి ఒప్పందానికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 

కాంగ్రెస్ నాయకులకు భౌగోళిక శాస్త్రం నేర్పడం అవసరమేమో. లేక పొతే వారు తమ అజ్ఞానాన్ని రోజు రోజుకు మరింత బయట పెట్టుకుని పలుచనవుతున్నారేమో. 2008 లో మొదలుపెట్టిన ప్రాణహిత ప్రాజెక్టులో తుమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి తీయలేదు. వైఎస్సార్, కిరణ్కుమార్ రెడ్డి పాపాలను తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు గంపల కొద్దీ యెత్తి మీద పోసుకుంటున్నదో అర్థం కాదు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు గూగుల్ చిత్రపటం చూడండి వీరి బండారం తెలుస్తుంది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad