గోదావరికి విముక్తి


godavaribesin

గోదావరి ప్రాజెక్టులపై కుదిరిన ఒప్పందం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక నూతనాధ్యాయం. చర్చలు, సంప్రదింపులు, పరస్పర సహకార ధోరణితో అసాధ్యం సుసాధ్యం చేయవచ్చునని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆచరించి చూపారు. చనాక-కొరాట, తమ్మిడిహట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులపై మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందంపై సంతకాలు చేయడం అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల చరిత్రలో ఒక కొత్త ఒరవడి. కేరళ-తమిళనాడు, కర్ణాటక-తమిళనాడు, ఒరిస్సా-చత్తీస్‌గడ్, హర్యానా-పంజాబ్ వంటి రాష్ర్టాలు నదీజలాలకోసం పరస్పరం ఘర్షణపడుతున్న తరుణంలో తెలంగాణ, మహారాష్ట్రలు దేశానికి ఒక కొత్త మార్గాన్ని చూపాయి. మంచితనంతో మనసులు గెలవడం అన్న నినాదంతో ముఖ్యమంత్రి అనుసరించిన విధానం అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నది. వరద గోదావరిపై ఒక్క ప్రాజెక్టునూ నిర్మించని కాంగ్రెస్, టీడీపీల అరవయ్యేళ్ల దాష్టీకానికి చరమగీతం పాడుతూ ఇవ్వాళ తెలంగాణ ఒక గొప్ప ముందడుగు వేసింది. మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రీ సాధించని విజయాన్ని మన ముఖ్యమంత్రి తన రాజకీయ దౌత్యంతో సాధించారు.

తలాపునా పారుతుంది గోదారీ
నీ చేను నీ చెలకా ఎడారీ
అని బాధాతప్త గీతాలు పాడుకున్న నేలపై ఇప్పుడు కోటి జల వసంతాలు ఆవిష్కృతం అవుతున్నాయి. ఎండిబీటలు వారిపోయిన తెలంగాణ బీడు భూముల దాహం తీర్చినప్పుడే గోదావరికి శాంతి, విముక్తి. తెలంగాణ ఇవ్వాళ మరోసారి రాష్ట్రం సాధించుకున్నంత సంబరంగా పండుగ చేసుకుంటున్నది. జీవధార గోదావరిని మన పొలాలకు మళ్లించే మహాయజ్ఞానికి ఈరోజు రాచబాట ఏర్పడింది. నీటికోసం ప్రజల గోస, భాష, బాధ తెలిసిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఫలితం ఎలా ఉంటుందో ఈరోజు మరోసారి తెలిసివచ్చింది. స్వరాష్ట్రం, స్వయంపాలన ఏమి సాధించగలదో ఈ రోజు మరోసారి రుజవుచేసింది.

గోదావరి ప్రాజెక్టులపై కుదిరిన ఒప్పందం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక నూతనాధ్యాయం. చర్చలు, సంప్రదింపులు, పరస్పర సహకార ధోరణితో అసాధ్యం సుసాధ్యం చేయవచ్చునని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆచరించి చూపారు. చనాక-కొరాట, తమ్మిడిహట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులపై మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందంపై సంతకాలు చేయడం అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల చరిత్రలో ఒక కొత్త ఒరవడి. కేరళ-తమిళనాడు, కర్ణాటక-తమిళనాడు, ఒరిస్సా-చత్తీస్‌గడ్, హర్యానా-పంజాబ్ వంటి రాష్ర్టాలు నదీజలాలకోసం పరస్పరం ఘర్షణపడుతున్న తరుణంలో తెలంగాణ, మహారాష్ట్రలు దేశానికి ఒక కొత్త మార్గాన్ని చూపాయి. మంచితనంతో మనసులు గెలవడం అన్న నినాదంతో ముఖ్యమంత్రి అనుసరించిన విధానం అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నది. వరద గోదావరిపై ఒక్క ప్రాజెక్టునూ నిర్మించని కాంగ్రెస్, టీడీపీల అరవయ్యేళ్ల దాష్టీకానికి చరమగీతం పాడుతూ ఇవ్వాళ తెలంగాణ ఒక గొప్ప ముందడుగు వేసింది. మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రీ సాధించని విజయాన్ని మన ముఖ్యమంత్రి తన రాజకీయ దౌత్యంతో సాధించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో అటు కేంద్రంలో, ఇటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. అయినా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడంలో విఫలమయింది అని ఈ రోజు ఒప్పందం సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పిన మాట అక్షర సత్యం. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా ఎటువంటి అరమరికలు లేకుండా పరస్పరం సహకరించుకుంటున్నాయి. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వినతికి సానుకూలంగా స్పందించి కరువులో సైతం నీటిని ఇచ్చిందంటే కేవలం ముఖ్యమంత్రి దౌత్యం వల్లనే ధోరణివల్లనే సాధ్యమయింది. చంద్రబాబు హయాంలో ఆలమట్టిపై కర్ణాటకతో దాదాపు యుద్ధం చేసినంతపని అయింది. అదే ఆలమట్టి నుంచి నీటిని సాధించుకోగలిగింది తెలంగాణ ప్రభుత్వం. బాబ్లీపై టీడీపీ వీధి బాగోతాలే నడిపించింది. తెలంగాణ ప్రభుత్వం అదే బాబ్లీ గేట్లను తెరిపించి నీటిని తీసుకోగలిగింది. పొరుగు రాష్ర్టాలతో గిల్లికజ్జాలు పెట్టుకుని ఒక్క ప్రాజెక్టునూ ముందుకు సాగనివ్వలేదు. పొరుగు రాష్ర్టాల అభ్యంతరాల వల్ల ఆగిపోతే తెలంగాణ ప్రాజెక్టులే ఆగిపోతాయి కదా అన్న భావన నాటి ముఖ్యమంత్రులది. ఆంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులకు పొరుగు రాష్ర్టాల బెడదలేదు కదా. తమ ప్రాజెక్టులేమో ఆగమేఘాలపై పూర్తి చేసుకోవడం, తెలంగాణ ప్రాజెక్టులనేమో వివాదాల్లోకి నెట్టడం…ఇదీ నాటి రివాజు.

నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చెత్తగా వ్యవహరించిందంటే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రతో ఎటువంటి ఒప్పందానికి రాకుండానే తమ్మిడిహట్టి బరాజును 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని వీరంతట వీరే నిర్ణయించుకున్నారు. అక్కడ తట్టెడు మట్టి కూడా తవ్వకుండా ముందుగా చేవెళ్లవద్ద కాలువలు తవ్వారు. మా అనుమతి లేకుండా నిర్మిస్తే, మీ ప్రయత్నమంతా వృధా అవుతుందని కాంగ్రెస్ పార్టీకే చెందిన నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇంతా చేసి ఆ బరాజులో వారు నిల్వ చేయతలపెట్టింది కేవలం 5 టీఎంసీల నీరు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో సయోధ్యకు వచ్చి తమ్మిడిహట్టితోపాటు మేడిగడ్డ ప్రాజెక్టును కూడా సాధించగలిగింది. ఈ రెండు ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 1.85+16.17=18.02 టీఎంసీలు. రెండు ప్రాజెక్టుల నుంచి తరలించగలిగిన నీళ్లు సుమారు 200 టీఎంసీలు. కాంగ్రెస్ తలపెట్టిన నీటి నిల్వ సామర్థ్యం కేవలం 16.4 టీఎంసీలు, నేడు తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 148.67 టీఎంసీలు. తమ్మిడిహట్టి ద్వారా 160 టీఎంసీల నీరు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి ఎత్తలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ఏకంగా అనుమతినే సాధించగలిగింది.

వివాదాలు, ఘర్షణలు సృష్టించడం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం రాజకీయ నాయకులు చేసే పని. విశాలదృక్పథంతో వివాదాలు పరిష్కరించడం, సద్భావంతో పనులు సాధించడం రాజనీతిజ్ఞులు, కార్యశూరులకు మాత్రమే సాధ్యమయ్యేపని. ముఖ్యమంత్రి, నీటిపారుదల మంత్రి ఏడాదిన్నరకాలంగా సాగించిన సంప్రదింపుల యజ్ఞం ఫలించి ఇప్పటికి ఈ ఒప్పందం కుదిరింది. ఎగువ రాష్ర్టాలతో గొడవపడినా, అల్లరిచేసినా ఆగం కావడంతప్ప ఫలితం ఏమీ ఉండదని గత ఆరు దశాబ్దాల చరిత్ర రుజువు చేసింది. కేసీఆర్ ఇప్పుడా చరిత్రను తిరగరాశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చెత్తగా వ్యవహరించిందంటే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రతో ఎటువంటి ఒప్పందానికి రాకుండానే తమ్మిడిహట్టి బరాజును 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని వీరంతట వీరే నిర్ణయించుకున్నారు. అక్కడ తట్టెడు మట్టి కూడా తవ్వకుండా ముందుగా చేవెళ్లవద్ద కాలువలు తవ్వారు. మా అనుమతి లేకుండా నిర్మిస్తే, మీ ప్రయత్నమంతా వృధా అవుతుందని కాంగ్రెస్ పార్టీకే చెందిన నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇంతా చేసి ఆ బరాజులో వారు నిల్వ చేయతలపెట్టింది కేవలం 5 టీఎంసీల నీరు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో సయోధ్యకు వచ్చి తమ్మిడిహట్టితోపాటు మేడిగడ్డ ప్రాజెక్టును కూడా సాధించగలిగింది. ఈ రెండు ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 1.85+16.17=18.02 టీఎంసీలు. రెండు ప్రాజెక్టుల నుంచి తరలించగలిగిన నీళ్లు సుమారు 200 టీఎంసీలు. కాంగ్రెస్ తలపెట్టిన నీటి నిల్వ సామర్థ్యం కేవలం 16.4 టీఎంసీలు, నేడు తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 148.67 టీఎంసీలు. తమ్మిడిహట్టి ద్వారా 160 టీఎంసీల నీరు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి ఎత్తలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ఏకంగా అనుమతినే సాధించగలిగింది.

సమైక్య ప్రభుత్వాలది తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మొదటినుంచీ సైంధవ పాత్రే. ప్రాజెక్టులు కట్టినట్టు ఉండాలి. డబ్బులు ఖర్చు చేసినట్టు కనిపించాలి. ఇరుగుపొరుగు రాష్ర్టాలతో వివాదాల్లో నలుగుతూ ఉండాలి. అవి తెగొద్దూ ముడిపడొద్దు. ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కాకూడదు. పూర్తయినా నీళ్లు ఉపయోగించుకునే పరిస్థితి ఉండకూడదు. నోటితో నవ్వి నొసటితో ఎక్కిరించే ధోరణి. 2004 నుంచి 2014 వరకు వేల కోట్ల రూపాయలు కాలువల తవ్వకాల్లో కుమ్మరించారు తప్ప లక్ష ఎకరాలు కూడా అదనంగా భూమిని సాగులోకి తేలేదు. ఎందుకంటే ఎక్కడా ప్రాజెక్టుల హెడ్‌వర్క్స్ పూర్తి చేయలేదు. తమ్మిడిహట్టి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్‌ఎల్‌బీసీ, ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండోదశ, వరదకాలువ….వీటిల్లో ఏ ఒక్క ప్రాజెక్టు కిందయినా నీరొస్తే ఒట్టు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హెడ్‌వర్క్స్‌ను ఆగమేఘాలపై పూర్తి చేసి నీటిని పంపింగ్ చేసే పనులను వేగిరపర్చింది. ఇవ్వాళ మహబూబ్‌నగర్‌లో రోజూ 4500 క్యూసెక్కులకు పైగా నీటిని పొలాలకు మళ్లిస్తున్నారంటే గత రెండేళ్లలో సాగించిన కృషివల్లనే సాధ్యమైంది.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సమైక్య కాంగ్రెస్ ప్రభుత్వాల పాపాలను వెనుకేసుకువస్తూ మహారాష్ట్రతో జరిగిన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ మునుపటికంటే ఘోరమైన తప్పిదం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లహితంకోరి పనులు చేపడితే, తెలంగాణ ప్రభుత్వం ప్రజాహిత పనులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి వెంటపడి పూర్తిచేయిస్తున్నది. ఆ సంకల్పంలో భాగంగానే ఇవ్వాళ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని పూర్తిచేసింది. కృష్ణాలో నీటివనరులు తగ్గిపోయాయి. గోదావరిలో ప్రాణహితకు దిగువన ఇప్పటికీ పుష్కలంగా నీరు లభిస్తున్నది. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి నిన్నటిరోజువరకు 1461 టీఎంసీల నీరు సముద్రం పాలయింది. ఈ నీరంతా ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత ప్రవహించిందే. అందుకే మేడిగడ్డ ఇప్పుడు తెలంగాణకు జీవనరేఖ అయింది. మనకు 950 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉంది. శ్రీరాంసాగర్ నుంచి తూర్పుదిశగా అటు మహబూబాబాద్ దాకా, ఇటు సూర్యాపేట దాకా ఒట్టిపోయి విస్తరించిన కాకతీయ కాలువలు, జనగామ దాకా తవ్విన వరద కాలువలు, ఏ నీటి ఆధారమూ కల్పించకుండానే తుమ్మిడి హట్టి నుంచి దక్షిణ దిశగా ముక్కలు ముక్కలుగా తవ్విపడేసిన ప్రాణహిత-చేవెళ్ల కాలువలు జలధారలతో నిండడానికి ఇప్పుడు మేడిగడ్డ ఒక్కటే ఆధారం. ఉత్తర తెలంగాణలో రిజర్వాయర్లు, చెరువులు నింపడానికి, ఎండిబీడు పడిపోయిన ఉపనదులు, వాగులు, వంకలు పునర్జీవింపజేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం ఒక్కటే మార్గం. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సమైక్య కాంగ్రెస్ ప్రభుత్వాల పాపాలను వెనుకేసుకువస్తూ మహారాష్ట్రతో జరిగిన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ మునుపటికంటే ఘోరమైన తప్పిదం చేస్తున్నారు.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily