నగరం ఓ పద్మవ్యూహం: ఛేదించడమెలా?


నగరం ఓ పద్మవ్యూహం: ఛేదించడమెలా?

కట్టా మీఠా

రోడ్లు సరిపోను ఉంటే కదా ఎవరయినా నియంత్రించగలిగేది? రోడ్లు విస్తరిస్తున్నాం. విస్తరించే లోపే రోడ్డుపైకి వచ్చే కొత్త వాహనాల సంఖ్య అసాధారణంగా పెరిగిపోతున్నది. ప్రధాన రోడ్లన్నీ ఇక విస్తరించడానికి వీలులేని పరిస్థితికి చేరుకున్నాయి.ఇక ఇప్పుడు మిగిలిన పరిష్కారం రద్దీ రోడ్లపైకి వచ్చే ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించడం. ప్రత్యామ్నాయ మార్గాలున్న చోట ఆ పని చేస్తున్నారు. కొన్నిచోట్ల నత్తనడక నడుస్తున్నాయి. కొన్నిచోట్ల కొత్తగా ప్రత్యామ్నాయ మార్గాలు నిర్మించాల్సి ఉన్నది.


హైదరాబాద్‌లో ఇవ్వాళ ఎవరయినా ఎక్కువగా మాట్లాడుకునే అంశం, ప్రభుత్వాన్నో, జీహెచ్‌ఎంసీనో, పోలీసులనో తిట్టుకునే అంశం గుంతలుపడిన రోడ్లు, విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లు, నీళ్లు మళ్లాడటం, పావుగంటలో వెళ్లగలిగిన చోటుకు కూడా గంటల సమయం పట్టడం వంటి సమస్యలే. ఈ సమస్యలన్నీ ఇప్పటికిప్పుడు సంక్రమించినవి కాదు. ఐదారు దశాబ్దాల ప్రణాళికారాహిత్యం, అడ్డగోలు అభివృద్ధి ఫలితం. కానీ ఈ సమస్య రోజురోజుకు పెరుగుతున్నది. జనం, వాహనాలు పెరగడం ఒకవైపు, నాసిరకం రోడ్ల నిర్మాణం మరోవైపు, అనేకచోట్ల వివాదాల వల్ల విస్తరించలేకపోయిన ఇరుకురోడ్లు(బాటిల్‌నెక్స్) ఇంకోవైపు ఈ సమస్యలను జటిలం చేస్తున్నాయి. ఇవి పరిష్కరించలేని సమస్యలు కాదు. మానవసాధ్యం కానిదంటూ ఏదీ లేదు. కావలసింది ఒక్కటే – సంకల్పం. నాయకులు, అధికారుల సమిష్టి కృషి. మొదటిసారిగా మన రాష్ర్టానికి కాస్మోపాలిటన్ నగరం అంటే ఏమిటో నిర్వచనం తెలిసిన యువనాయకుడు నగరపాలన మంత్రి అయ్యారు. ఆయన మాటలు ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. కానీ చేయాల్సింది చాలా ఉన్నది. చేయవలసిన యంత్రాంగం…

View original post 910 more words

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad