వారు 1974 లోనే ఆగిపోయారు! ప్రముఖ ఇంజనీరు హనుమంతరావు ఇంకా 1974 లోనే ఉండిపోయారు. హరియాణా ప్రాజెక్టు అప్పుడు కట్టిందే. కాలం మారింది. అవసరాలు పెరిగాయి. మనకు ఇప్పుడు సాగు నీరు ఒక్కటే అవసరమా? తాగునీరు అవసరం లేదా? గోదావరిలో నాలుగు నెలలు నీళ్లు లభిస్తాయి కాబట్టి ఎత్తి పోస్తే చాలు, రిజర్వాయరు అవసరం లేదని ఆయనతో పాటు కొందరు పెద్ద మనుషులు చెబుతున్నారు. మరి పన్నెండు మాసాలు అవసరమైన మంచినీళ్లు ఎక్కడినుంచి తేవాలి? 

తెలంగాణ నేల బోర్లు వేసీ వేసీ ఒట్టిపోయింది. భూ గర్భ జలాలు అడుగంటాయి. వాగులు, వంకలు, ఉపనదులు ప్రవహించడం ఆగిపోయి చాలా కాలమైంది. భూగర్భ జలాలను తిరిగి పైకి తేవాలంటే వీటన్నింటినీ పునర్జీవింప చేయాలి. వ్యతిరేకించడం కోసమే వ్యతిరేకించే వాళ్ళను వ్యతిరేకించక తప్పదు మరి. రాజకీయాలకంటే నీళ్లు విలువయినవని ఎందుకు గుర్తించరు?

నిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి. అందుకోసం కొట్లాడడం వరకు సమంజసమే. కానీ ప్రోజెక్టులకే అడ్డంపడే వాదనలు మంచివి కాదు. 

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad