జ్ఞాన శూన్యత


godavaribesin

తెలంగాణ విషాదం ఈ సంవత్సరం మన కళ్లముందే ఆవిష్కృతం అయింది. సింగూరు, మంజీరా, నిజాంసాగర్, ఎగువ మానేరు, దిగువ మానేరులకు చుక్క నీరు రాలేదు. శ్రీరాంసాగర్‌కు కేవలం 17.6 టీఎంసీల నీరు వచ్చింది. ఎల్లంపల్లి ఇంకా నిండ లేదు. కానీ 500 టీఎంసీలకు పైగా నీరు బంగాళాఖాతంలో కలిసిపోయింది. ఈనీటితో 50 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చి ఉండవచ్చు. ఆగ్రాన-మిస్టుల లెక్కల ప్రకారం 12500 కోట్ల విలువ చేసే పంటలు పండించి ఉండవచ్చు. వేలాది ఊళ్లు, లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపి ఉండవచ్చు. అందుకు భిన్నంగా ఇక్కడ బీళ్లు నోళ్లు తెరుచుకుని ఉన్నాయి. బోర్లు అథఃపాతాళానికి వెళ్లిపోతున్నాయి. తాగునీటికి కూడా కటకటపడే పరిస్థితి పొంచి ఉన్నది. కృష్ణా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జూరాల నిండ లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లు ఇంకా కనీస నీటి మట్టానికి ఎక్కడో దిగువన ఉన్నాయి. కోయిల్ సాగర్, మూసీ వంటి ప్రాజెక్టులకూ నీరు రాలేదు. ఈ అనుభవాలన్నీ మనకు నేర్పుతున్నదొక్కటే. వాన వచ్చినప్పుడు, వరదవచ్చినప్పుడు పట్టిపెట్టుకోవడం.

నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకుల అజ్ఞాన ప్రదర్శన చూస్తుంటే ఒకింత కోపం, బాధ, జాలి కలుగుతున్నాయి. ఇటువంటి నాయకులా తెలంగాణను ఇంతకాలం ఏలింది అన్న విస్మయం కలుగుతున్నది. భారీ ప్రాజెక్టులు వద్దు. చిన్న ప్రాజెక్టులు సరిపోతాయి అని ఒక మహానుభావుడు చెబుతున్నాడు. ఈయన గోదావరిపై ఉద్యమం చేశాడట. ఆ అనుభవంతోనే ఈ విషయం చెబుతున్నాడట. ఇంకో నాయకుడు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు తయారవుతున్నాడట. ఆయన గతంలో నీటిపారుదల మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో ఆయన శ్రీశైలం గేట్లు తీసి సకాలంలో నాగార్జునసాగర్‌కు నీళ్లు వదలకపోవడం వల్లనే కర్నూ లు మునిగిపో-యింది. మంచినీళ్లు కావాలి త్వరగా సాగర్‌కు నీళ్లు వదలండి అని అప్పట్లో టీఆర్‌ఎస్ నాయకులు అడిగితే ఎక్కడున్నయి నీళ్లు అని పంచాయతీకి దిగిన అల్పజీవి. ఈయనకు ఆ కాలంలో ఎంత విలువ ఉండేదంటే ఈయన పోతిరెడ్డిపాడు కింద కొన్ని కాలువలకు గేట్లు తెరిస్తే, ఈయన అక్కడ ఉండగానే అక్కడి ఎంపీ వచ్చి మూసేయించాడు. శ్రీశైలంలో ఎప్పుడు వరద పెరిగి కర్నూలు మునిగిందో ఆయన అస్వస్థత పేరిట ఆస్పత్రి పాలయ్యాడు. పాపం రోశయ్య ముఖ్యమంత్రిగా రాత్రులు సచివాలయంలో జాగారాలు చేశారు. మల్ల-న్నసాగర్‌పై ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వాళ్లంతా సమైక్యాంధ్ర ప్రభుత్వాల్లో కుక్కిన పేనుల్లా ఆంధ్ర నాయకత్వం చెప్పింది చేసుకుపోవడం తప్ప స్వతంత్రించి తెలంగాణకు ఫలా నా మంచి చేద్దామని యోచించినవారు కాదు. నీళ్ల సోయి కానీ, ప్రాజెక్టుల సోయిగానీ వీళ్లకు ఎప్పుడూ లేదు. వీళ్లు మరిచిపోయారో లేక కావాలని ఇప్పుడు అబద్ధాలాడుతున్నారో తెలియదు…కానీ తెలంగాణను దగాచేసింది కాంగ్రెస్ పార్టీయే. గోదావరి నదిపై ఇచ్చంపల్లి బహుళార్ధక సాధక భారీ ప్రాజెక్టు తలపెట్టింది ఎప్పుడో తెలు సా? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లతోపాటు కేంద్రం కూడా అందుకు సమ్మతించిన విషయం తెలుసా? నాలుగైదు దశాబ్దాలపాటు ఆ ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేశారో కాంగ్రెస్ నాయకులు ఎప్పుడయినా చెంపలేసుకున్నారా? ఇచ్చంపల్లి నిర్మించి ఉంటే ఇప్పుడు గోదావరి నీటికోసం మనం ఇంతగా వెంపర్లాడాల్సిన అవసరం ఉండేదా? కానీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి నీళ్లు లేని దేవాదుల ప్రాజెక్టునొకదానిని నిర్మించి మేమూ చేశామని జబ్బలు చరుచుకుంటున్నారు. ఆ ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీళ్లందించే విధంగా రిజర్వాయరు నిర్మించకపోవడం వల్ల అక్కడి నుంచి కూడా సంవత్సరంలో నాలుగు మాసాలు మాత్రమే నీటిని తీసుకోవడం సాధ్య-మవుతున్నది. ఇప్పుడు కదా తెలంగాణ ప్రభుత్వం తుపాకులగూడెం ప్రాజెక్టు కట్టాలని ముందుకు వచ్చింది.

తెలంగాణ రాజకీయ నాయకత్వానికి నీళ్ల విలువ తెలియదు. తెలంగాణ ఉద్యమం, దాని నాయకుడు కె.చంద్రశేఖర్‌రావు ఇంజినీర్లతో కూర్చుని చిట్టాలు దులిపి ఒక్కొక్కటి బయటపెట్టుకుంటూ వస్తే కదా చంద్రబాబునాయుడు హెలికాప్టర్‌లో మేస్త్రిని తీసుకెళ్లి దేవా-దులకు రాయి వేసి వచ్చింది? తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో లెక్కలు బయటపెడితే కదా రాజశేఖర్‌రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల పేరిట 22 లిఫ్టులతో ప్రాజెక్టును మొదలు పెట్టింది? తెలంగాణ గళమెత్తిన ప్రతిసారీ ఏదో ఒక ప్రాజెక్టు మొదలుపెట్టడం కాలువలు తవ్వడం హెడ్‌వర్క్స్ వదిలేయడం సమైక్యాం ధ్ర నాయకత్వం విసిరిన పన్నాగాలు. ఇది ఎటువంటి ప్రాజెక్టు అంటే బావిలో నీళ్లు, కరెంటు ఉన్నప్పుడు రైతు పొలానికి నీళ్లు పెట్టుకున్నట్టే, గోదావరిలో నీళ్లున్నప్పుడు, మనకు కరెంటుకూడా ఉన్నప్పుడు మాత్రమే ప్రాణ-హిత నుంచి చేవెళ్లదాకా 22 లిఫ్టు లు ఏకబిగిన నడిపిస్తూ నీళ్లు తేవాలి. ఇన్నివేల కోట్లతో ఇటువంటి ప్రాజెక్టులు ఎవ రూ నిర్మించి ఉండరు. ఇది ఎంత విడ్డూరమంటే మొత్తం ప్రాజెక్టుకు నీరందించే ప్రాణహిత తమ్మిడిహట్టి వద్ద పారమట్టి తీయకుండా, అంటే రిజ-ర్వాయరు పని మొదలుపెట్టకుండా చేవెళ్ల దగ్గర సొరంగాలు పూర్తవుతాయి. మనకు కాలువలు కనిపిస్తాయి. ఎన్నేళ్లయినా నీళ్లు రావు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అప్పుడు మాట్లాడేవాళ్లు కాదు. ఎవరయినా మాట్లాడినా కట్టలతోనో కట్టెలతోనో కొట్టించే పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినతర్వాత, నీటికోసం తపన మొదలయింది. మర్రి శశిధర్‌రెడ్డికి ఇప్పుడు గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టులు భారీ ప్రాజెక్టులుగా ఎందుకు కనిపిస్తున్నాయో ఆ పైవాడికే తెలియాలి. మేడిగడ్డ నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు, అన్నా రం నిల్వ సామర్థ్యం 11.77, సుందిళ్ల 5.46 నిల్వ సామర్థ్యం. మల్లన్న సాగర్ ఒక్క టే కాస్త పెద్ద రిజ్వయర్. అది తెలంగాణకు ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకు వంటిది. అక్కడి నుంచి ఎక్కడికయినా తేలికగా నీరు తీసుకునే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా చూడలేదట. నిజానికి చూసి ఉండరు. ఇంతపెద్ద ఆనకట్ట కట్టి 50 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే ప్రమాదకరం అని మరొకాయన వాదించారు.

నిజమే ఇది ప్రత్యేకమైన ప్రాజెక్టు. ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. కానీ ఇది సురక్షితమైన ప్రాజెక్టు. ఇంతపెద్ద ఆనకట్టతో రిజ-ర్వాయర్లు నదులపై నిర్మిస్తే ప్రమాదం. ఎందుకంటే నదుల్లో అనూహ్యరీతిలో వరదలు వచ్చే అవకాశం ఉంటుం ది. ఇటువంటి ఆనక-ట్టలు పనికి రావు. కానీ మల్లన్నసాగర్‌ను ఒక వాగుపై నిర్మిస్తున్నారు. అక్కడ వరద తాకిడికి అవకాశం లేదు. ఆనకట్టకు ఎటువంటి ముప్పు ఉండ దు. నీటిని ఎత్తిపోసేందుకు అయ్యే కరెంటు ఖర్చు గురించి కూడా కొందరు మాట్లాడుతున్నారు. సోలార్ విద్యుత్ రాక వల్ల విద్యుత్ చార్జీల పెరుగుదలకు బ్రేకు పడింది. ఇక నుంచి పెరిగే అవకాశాలు లేవు. రానున్న కాలమంతా విద్యుత్తు ఇంకా చౌకగా లభించే కాలమే. సౌరవిద్యుత్ పీపీఏలన్నీ యూనిట్‌కు ఆరు రూపాయలకు మించ డం లేదు. ఈ రేటు వచ్చే ఇరవయ్యేళ్లపాటు ఉంటుంది. అంటే ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఇప్పుడున్న ఆరు రూపాయలకు యూనిట్ విద్యుత్ కారు చౌక కింద లెక్క. మనం తీసుకునే నీరు, ఆ నీటితో మనం సృష్టించే సంపదలతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. చాలా మంది అసలు విషయాలు తెలియకుండా మాట్లాడుతున్నారు. మాజీ చీఫ్ ఇంజినీర్లు అనుకునేవారు కూడా ఎందుకింత అడ్డంగా మాట్లడుతున్నారో తెలియడం లేదు అని నీటి-పారుదల, విద్యుత్ వ్యవహారాలను అధ్యయనం చేస్తున్న పొద్దుటూరి వెంకట్ గాంధీ చెప్పారు. చాలామంది ముఖ్యమంత్రి తమతో చర్చించలేదు అని అలిగి ఇలా వంకర టింకర మాట్లాడుతున్నారు. వారితో ఒక్కసారి ముఖ్యమంత్రి మాట్లాడితే అందరూ సర్దుకుం-టారు అని ఒక మిత్రుడు అన్నారు. అలా అందరితో చర్చించాలంటే సగం తెలంగాణతో చర్చించాలి. ఏ ముఖ్యమంత్రికయినా సాధ్యమేనా అని ప్రశ్నించాడు మరో మిత్రుడు. విస్తృత ప్రయోజనాలు ముఖ్యమా? వ్యక్తిగత అహంభావాలు సంతృప్తి చెందడం ముఖ్యమా ఆలోచించుకోవాలి.

తెలంగాణ విషాదం ఈ సంవత్సరం మన కళ్లముందే ఆవిష్కృతం అయింది. సింగూరు, మంజీరా, నిజాంసాగర్, ఎగువ మానేరు, దిగువ మానేరులకు చుక్క నీరు రాలేదు. శ్రీరాంసాగర్‌కు కేవలం 17.6 టీఎంసీల నీరు వచ్చింది. ఎల్లంపల్లి ఇంకా నిండ లేదు. కానీ 500 టీఎంసీలకు పైగా నీరు బంగాళాఖాతంలో కలిసిపోయింది. ఈనీటితో 50 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చి ఉండవచ్చు. ఆగ్రాన-మిస్టుల లెక్కల ప్రకారం 12500 కోట్ల విలువ చేసే పంటలు పండించి ఉండవచ్చు. వేలాది ఊళ్లు, లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపి ఉండవచ్చు. అందుకు భిన్నంగా ఇక్కడ బీళ్లు నోళ్లు తెరుచుకుని ఉన్నాయి. బోర్లు అథఃపాతాళానికి వెళ్లిపోతున్నాయి. తాగునీటికి కూడా కటకటపడే పరిస్థితి పొంచి ఉన్నది. కృష్ణా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జూరాల నిండ లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లు ఇంకా కనీస నీటి మట్టానికి ఎక్కడో దిగువన ఉన్నాయి. కోయిల్ సాగర్, మూసీ వంటి ప్రాజెక్టులకూ నీరు రాలేదు. ఈ అనుభవాలన్నీ మనకు నేర్పుతున్నదొక్కటే. వాన వచ్చినప్పుడు, వరదవచ్చినప్పుడు పట్టిపెట్టుకోవడం. అందుకే ప్రాజెక్టులపై రిజర్వాయర్లు తప్పనిసరి. నీటి నిల్వ తప్పనిసరి. నిరంతరంగా నీళ్లు లిఫ్టు చేసి కాలువలకు, పొలాలకు ఇవ్వడం అన్నది తెలివితక్కువ పని. అసాధ్యమైన పని కూడా. రిజర్వాయర్లు ఉంటే మనకు కరెంటు ఉన్నప్పుడు, లేదా చౌకగా దొరికిన సమయంలో మాత్రమే కొనుగోలు చేసి నీటిని పంపింగ్ చేసుకుంటాము. రిజర్వాయర్లు లేకపోతే వరదకాలంలో నాలుగుమాసాలు ఎంత రేటయినా పెట్టి కరెంటు కొనుగోలు చేసి నీటిని పంపింగ్ చేయాలి. అది ఇంకా తలకుమించిన భారం. పీక్ అవర్స్‌లో, నాన్ పీక్ అవర్స్‌లో విద్యుత్ చార్జీలలో తేడా ఉంటుంది. తక్కువ ధరకు విద్యుత్ లభించే అవర్స్‌లోనే మనం మోటార్లు నడుపుకుని రిజర్వాయర్లను నింపుకోవడానికి అవకాశం ఉంటుంది.

మళ్లీ మళ్లీ చెప్పుకోవాలి….ఆంధ్రాలో కృష్ణా, గోదావరి డెల్టాల్లో అక్కడి రైతు ఏడాదికి ఎకరానికి కేవలం 300 రూపాయలు చెల్లిస్తే కాలువ నీరు మళ్లించుకుని పొలం పండించుకోవచ్చు. పంట అంతా రైతుకు ఆదాయమే. తెలంగాణ రైతు బోరు, కరెం టు, ఇత-రత్రా పెట్టుబడుల రూపేణా ఎకరాకి ఏడాదికి ఒకటి నుంచి రెండు లక్షల పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి. అందుకే ఇక్కడి రైతులు అప్పులు, ఆర్థిక సంక్షోభంలో కునారిల్లి పోతున్నారు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అక్కడ రైతుల ఆత్మహత్యలు లేవు. ఈ అంత-రాన్ని తొలిగించడానికి ప్రభుత్వమే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ మాగాణాలకు నీళ్లు మళ్లించాల్సి ఉంది. ఆ యజ్ఞమే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. ఎక్కడయినా రాజకీయాలు చేసుకోండి. నీటిపారుదల ప్రాజెక్టులను మాత్రం వదిలేయండి.
kattashekar@gmail.com

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad