ఈ సోయి అప్పుడుంటే ఎంత బాగుండేది? 


పాలమూరు, మెదక్ జిల్లాలకు ఆరు దశాబాలపాటు అన్యాయాలు జరుగుతుంటే ఏనాడూ నోరు మెదపని శక్తులు, అప్పుడెప్పుడూ కేసులు వేయని నాయకులు ఇప్పుడు ప్రాజెక్టులను ఆపడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. వలసలు, ఆత్మహత్యలు, చివరికి ఆకలి చావులు కూడా జరుగుతూ ఉంటే చంద్రబాబు, రాజశేఖర్రెడ్డి సేవలో తరించిన నాయకులు ఇప్పుడు తెలంగాణకు ఇంత కాలానికి దక్కిన అవకాశాలను అడ్డుకొట్టాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఒకప్పుడు బయటివారు కుట్రలు చేస్తే ఇప్పుడు ఇక్కడి వారే గోతులు తవ్వుతున్నారు. అక్కడ చంద్రబాబు తెలంగాణ నీటి హక్కులకు పాతర వేయాలని చూస్తుంటే ఇక్కడ ఆయన అంతేవాసులు సొంత రాష్ట్ర ప్రాజెక్టులకు గోరీ కట్టాలని చూస్తున్నారు. వీళ్ళ భవిష్యత్తును జనమే నిర్ణయించాలి. 

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily