గెలిచినోడు మనోడు: పాపం వెంకయ్యనాయుడు


venk

ఆంధ్ర తెలంగాణలో వెంకయ్యనాయుడుకు జరుగుతున్న సన్మానాలు, ఆ సభల్లో నాయకులు ఆయనపై కురిపిస్తున్న ప్రశంసలు చూస్తుంటే రాజకీయాల్లో నాటకీయత ఎంత పెరిగిపోయిందో కళ్లకు గడుతున్నది. వెంకయ్యనాయుడు పెద్దమనిషి. అధిష్ఠానం మనిషి. విభజన సమయంలో తెలంగాణకు కొంత నష్టం కలిగించినా విభజన ప్రక్రియ ఆగకుండా చూసిన మనిషి. పైగా అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్న నాయకుడు. రాష్ర్ట విభజన సందర్భంగా రాష్ర్టానికి అదికావాలి, ఇది కావాలి అని డిమాండు చేసిన ఏకైక నాయకుడు. భద్రాచలంలోని ఏడు మండలాలను కానుకగా ఇప్పించిన ఘనత కూడా ఆయనదే.

అటువంటి పెద్దమనిషికి రెండేళ్లు తిరగకుండానే ఆంధ్రలో తాటాకులు కట్టడం మొదలు పెట్టారు. అక్కడ నుంచి రాజ్యసభ సీటు అడగలేని, పోటీ చేయలేని స్థితి తీసుకొచ్చారు చంద్రబాబునాయుడు అండ్ కో. దాంతో ఆయన ఎప్పటిలాగే కర్ణాటక వెళ్లాలనుకున్నారు. కానీ అక్కడ ఆయనపై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా దాడి జరిగింది. ఆయన ఇక్కడి నుంచి ఇన్ని సార్లు గెలిచి రాష్ర్టానికి చేసిన మేలేమిటి అని నిలదీశారు. దీంతో ఆయన అక్కడా పోటీ చేయలేని పరిస్థితి వచ్చింది. చివరకు రాజస్థాన్ నుంచి పోటీచేసి గెలవాల్సి వచ్చింది. గెలిచిన తర్వాత మాత్రం అందరూ ఎలా అలుముకుపోతున్నారో గత రెండు రోజులుగా చూస్తున్నాం. పాపం సొంత రాష్ర్టంకదా. మనసుకు దగ్గరగా ఉంటుంది కదా. అన్నీ దిగమింగుకుని ఆయన సన్మానాలు చేయించుకుంటున్నారు.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in politics. Bookmark the permalink.