1901లోనే 8,97,280 ఎకరాల్లో వరి పంట 


“తెలంగాణవాళ్లకు తెల్లన్నం తెలియదని, తన తండ్రి ఎన్టీఆర్ వారికి తెల్లన్నం రుచి చూపించార’ని బాలకృష్ణ ఇటీవల అమెరికాలో జరిగిన జన్మదిన వేడుకల్లో అన్నట్టు వార్త వచ్చింది. ఆయనే కాదు గతంలో చాలా మంది ఆంధ్ర నాయకులు ఇలా అహంకరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయనకు ఆయనను ఆదర్శంగా భావించే మిత్రులకు వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉంది.

image1

image2

నిజాము రాష్ర్టంలో 1901 నాటికే 1402 చదరపు మైళ్ల విస్తీర్ణంలో అంటే 8,97,280 ఎకరాలలో వరి పంట పండించినట్టు నమోదయింది. నల్లగొండ జిల్లాలో కూడా లక్ష ఎకరాల విస్తీర్ణంలో వరి పంట పండిస్తున్నట్టు 1901 సెన్సస్ నివేదిక పేర్కొంది. రెండు రూపాయలకు కిలో బియ్యంతో పేదల ఇళ్లకు తెల్లన్నం పరిచయం చేసింది ఎన్టీఆరే. అంతవరకు చెబుకుంటే బాగుండేది. రెండు రూపాయలకు కిలో బియ్యంపథకం రాష్ర్టమంతటా ప్రవేశపెట్టారు ఎన్టీఆర్. బాలకృష్ణ ఒక్క తెలంగాణ పేరే ఎందుకు ప్రస్తావించారు? ఆధిపత్యం తలకెక్కిన మనస్తత్వాలు కదా. అంత తొందరగా దిగవు.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in politics. Bookmark the permalink.