నా తెలంగాణ


దాశరథి

vector silhouette of a girl with raised hands and broken chains

vector silhouette of a girl with raised hands and broken chains


కోటి తెలుగుల బంగారు కొండకింద
పరచుకొన్నట్టి సరసులోపల వసించి
పొద్దు పొద్దున అందాల పూలుపూయు
నా తెలంగాణ తల్లి: కంజాత వల్లి.

వేయి స్తంభాల గుడినుండి చేయిసాచి
ఎల్లొరా గుహ లందున పల్లవించి
శిల్పిఉలి ముక్కులో వికసించినట్టి
నా తెలంగాణ, కోటి పుణ్యాల జాణ.

మూగవోయిన కోటి తమ్ముల గళాల
పాట పలికించి కవితా జవమ్ము కూర్చి
నా కలానకు బలమిచ్చి నడిపినట్టి
నాతెలంగాణ, కోటి రత్నాల వీణ.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Poetry. Bookmark the permalink.