దేవిది హత్యేనా?


DSC_2111_SPOT

CAR( FILE PHOTO)

DSC_2112

రోడ్డు ఎక్కడుంది? కారు ఎటుపోతోంది? ఏ డోరు పగిలింది? దేవి ఎలా మరణిస్తుంది. చెట్లు డ్రైవరు సీటు వైపు ఉన్నాయి. మరి ఈవలి సీటులో కూర్చున్న దేవి ఎలా మరణించింది? దేవి ఎందుకు రక్షించమని అరిచింది? బలవంతంగా ఆ అమ్మాయిని లాక్కెల్లి కార్లో వేసిన దుష్టులు ఎవరు? ఈ దారుణం వెనుక ఉండి ప్రమాదం కథ సృష్టించిన వీఐపీ ఎవరు? పోలీసులు నేర స్థలాన్ని ఎందుకు కాపాడలేదు? అపోలో డాక్టర్లు ఏం చేశారు? కారును వెంటనే ఎందుకు పోలీసు స్టేషనుకు తరలించారు? ఏం జరిగింది? కారులో ఉన్నట్టుగా చెబుతున్న వ్యక్తి ఫోను నంబరు నుంచి ఆ సమయంలో ఎవరెవరికి ఫోన్లు వెళ్లాయి?

అసలు కారులో ఎంత మంది ఉన్నారు? హోటలు వద్ద కారులో ఎంత మంది ఎక్కారు? ఎవరెవరు ఎక్కడ దిగారు? వారిని పోలీసులు ఏమైనా విచారించారా? కారు నడుపుతున్న వ్యక్తి తాగలేదని ఒక పోలీసు అధికారి మీడియాతో చెప్పారు. మత్తులో లేకపోతే అంత దారుణమైన ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం జరిగిన వెంటనే దేవి తల్లిదండ్రులకు ఎందుకు తెలియజేయలేదు? కారులో ఉన్న వ్యక్తి తల్లిదండ్రులు ముందుగా అపోలోకి ఎలా చేరుకోగలిగారు? పోలీసులు వెంటనే దర్యాప్తు చేయాలి. ఇంత అమానుషంగా దేవిని బలిగొన్న దొంగలను పసిగట్టాలి.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Social Issues. Bookmark the permalink.