భూగర్భ జలాలు పెరగాలంటే

  
*కాలువల కింద నీటి వినియోగానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ రూపొందించి అమలు చేయాలి.

 * కాలువల చివరిదాకా మొదటి ప్రాధాన్యతగా చెరువులు కుంటలు నింపిన తర్వాతనే పొలాలకు నీరు వదలాలి. 

* చెరువులు కుంటల నీటిని పొలాలకు మల్లించకుండా నిషేధం విధించాలి. కనీసం రెండేళ్లపాటు తూములను పూర్తిగా మూసేయాలి.

* వరుసగా రెండేళ్ళు చెరువులు కుంటల్లో నీరు నింపి నిలిపిఉంచగలిగితే భూగర్భ జలాలు సహజంగానే పెరుగుతాయి.

* నీటిని ఎక్కువగా ఉపయోగించే వరిపంటను ఏడాదిలో ఒక సీజన్లో మాత్రమె వేసే విధంగా రైతులకు మార్గదర్శనం చేయాలి. 

* నీటి విలువకు సంబంధించి పట్నం నుంచి పల్లె దాకా అవగాహన పెంపొందించాలి.

* హైదరాబాద్లో భూగర్భ జలాలు పెంపొందాలంటే నగరం చుట్టూ ఉన్న పెద్ద చెరువులన్నీ కృష్ణ, గోదావరి నీటితో నింపాలి. గండిపేట, హిమయత్ సాగర్, అమీన్పూర్ చెరువు, షామీర్పేట్ చెరువు, ఇబ్రహింపట్నం చెరువు, మీర్ ఆలం చెరువు, బీబీనగర్, భువనగిరి చెరువులు నింపి నిలిపి ఉంచగలిగితే నగరంలో భూగర్భ జలాలు తిరిగి పైకి వస్తాయి.

* కాలం, వరదలు వచ్చిన రోజుల్లో చెరువులు నిమ్పడంపైనే ప్రధానంగా దృష్టిని పెట్టాలి. 

చెట్టులో మనిషి ప్రాణం

  

చందమామ కథల్లో మాంత్రికుడి ప్రాణం చెట్టు తొర్రలో ఉందని తరచూ చదువు కునేవాళ్లం. అది నిజమో కాదో తెలియదు కానీ మనిషి ప్రాణం మాత్రం చెట్టులోనే ఉన్నదని ఇప్పుడు మనకు తెలిసివస్తున్నది. 

ఎండలు కొత్త కాదు కానీ, అవి నానాటికీ ముందుకు రావడం, తీవ్రస్థాయిలో ఉం డటం కొత్త. ఏప్రిల్‌లో ఇటువంటి ఎండలు నాలుగు దశాబ్దాల తర్వాత చూస్తున్నామని ఒక అధికారి చెప్పారు. రుతువులు గతి తప్పుతున్నాయి. కాలాలు గతి తప్పుతు-న్నాయి. కరువు నిత్యకృత్యం అవుతున్నది. ఈసారి అసలు చలికాలం వచ్చినట్టు పోయినట్టు ఎవరికీ పెద్దగా అనుభవంలోకి రాలేదు. సంవత్సరమంతా ఎండలు చూస్తున్నాం. కాస్త ఎక్కువగా కాస్త తక్కువగా. ఏమి జరుగుతున్నదో, ఎందుకు జరుగు-తున్నదో ఒకసారి అందరూ మననం చేసుకోవలసిన అవసరమయితే కనిపిస్తున్నది. మనిషి ప్రాణం నీరులో ఉంది. నీరు ప్రాణం చెట్టులో ఉంది. చెట్టు ఉంటే గాలి. చెట్టు ఉంటే నీడ. చెట్టు ఉంటే నీరు. ఆ చెట్టు లేకుండా పోవడమే ఇప్పుడు అన్ని అనర్థాలకు దారితీస్తున్నది. అభివృద్ధి, విధ్వంసం జమిలిగా ఉంటాయి. గత రెండు దశాబ్దాల్లో రహదారుల విస్తరణ పేర, గనుల తవ్వకం పేర, కార్ఖానాల ఏర్పాటు పేరిట, వ్యవసాయ విస్తరణ పేరిట రోడ్లవెంట ఉన్న మహావృక్షాలు, అడవులు, కంచెలు మాయమయిపోయాయి. వృక్షాలను కదిలించకుండా అభివృద్ధి చేసే ఆలోచనే మన విధానాల్లో లేకుండాపోయింది. ఆ మధ్య థాయిలాండ్‌లో ఒక చారిత్రక నగరాన్ని సందర్శించాము. చియాంగ్మయి నుంచి లాంఫూన్‌కు వెళ్లే దారి అది. సుమారు పది కిలోమీటర్లు దారి పొడవునా రోడ్డుకిరువైపులా 40 నుంచి 50 అడుగుల ఎత్తైన యాం గ్ వృక్షాలు కనిపిం-చాయి. ఆ చెట్లకు పసుపుపచ్చని వస్ర్తాలు కట్టి దేవతల్లాగా పూజిస్తున్నారు. నడి ఊర్లలో కూడా, పెద్ద పెద్ద వ్యాపార సముదా-యాల వద్ద సైతం ఒక్క చెట్టు నూ కదిలించలేదు. ఇళ్లు కట్టుకున్నా, వ్యాపార సముదాయం కట్టుకున్నా చెట్టు జోలికెళ్లకుండా కట్టుకోవలసిందే. అక్కడ ఏ ఊరు చూసినా వనంలాగా కనిపించింది. ఇండ్ల కంటే పైకెదిగిన వృక్షాలు అధికంగా కనిపించాయి. అక్కడా ఒకప్పుడు అడవులను తీవ్రంగా ధ్వంసం చేసి, విపరీత పర్యవసానాలను చూసిన తర్వాత వృక్షజాతి సంరక్షణకు కఠి-నమైన చట్టాలు తెచ్చారు. 

ఎంతో దూరం ఎందుకు? జర్మనీలో ఇంటి నిర్మా ణం కోసం ఒక చెట్టును నరకాల్సివస్తే, అదే స్థానంలో రెండు అవే జాతి మొక్కలు నాటి, అవి కుదురుకునే వరకు, ఇంటి యజమాని వాటిని సంరక్షించాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తూంటుంది. ఒకప్పుడు మన రాష్ట్రంలోనే ప్రతిఊరిలో ఎక్కడపడితే అక్కడ చెట్లు ఉండేవి. చింతలతోపులు, మామిడి తోపు లు, మర్రి, జువ్వి, రావి, వేపచెట్లు విరివిగా ఉండేవి. ఎండాకాలం వస్తే జనం చెట్లకిందికి చేరి ఆటాపాటలతో కాలక్షేపం చేసేవారు. ప్రతిఊరికి రెండు మూడు వందల ఎకరాల కంచెలు ఉండేవి. కంచెల నిండా చెట్లు ఉండేవి. పశువులను మేపడానికి ఆదరువుగా ఉండేవి. జింకలు, కుందేళ్లు, అడవి పందులు దుముకుతూ ఉండేవి. ఇప్పుడవ న్నీ అంతరించిపోయాయి. వనాలతోపాటే వానలు పోయాయి. చెరువులు నిండటం ఎప్పుడో అరుదుగా జరుగుతున్నది. ఏటా అలుగులు పోసిన బావులు, పిల్లల ఈతలకు కేంద్రం గా ఉండే బావులు ఇప్పుడు పాడుబడిపోయాయి. మర్రి చెట్లు, జువ్వి చెట్లు, రావి చెట్లు అరుదుగా కనిపిస్తాయి. చేలల్లో, గట్లల్లో, బావుల వద్ద అసలు చెట్లు లేకుం డా పోయాయి. ఇప్పుడు నాగలి దున్నని చోటులేదు. ఊర్లు కాంక్రీట్ జంగల్‌లు అయ్యా యి. కరువు విరుచుకుపడుతున్నదంటే ఎందుకు పడదు? ఎవరిని నిందించా ఇప్పుడు? 
మరోవైపు అడవుల విధ్వంసం. తెలంగాణలో ఉన్నంత విశాలమైన దట్టమైన అర ణ్యం ఒకప్పుడు ఆంధ్రలో లేదు. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే అవి కూడా చాలా చిన్నచిన్న చెట్లతో మాత్రమే మిగిలిఉన్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజా-మాబాద్, ఆదిలాబాద్ దట్టమైన అరణ్యాలకు ప్రసిద్ధి. వరంగల్ అడవుల్లో ఒకప్పుడు ఏనుగుల సంచారం ఉండేదని చెబు-తారు. ఇప్పుడక్కడ అడవి దొంగల సంచా రం కనిపిస్తున్నది. చాలామంది రాజకీయ నాయకుల అండతో వరంగల్ జిల్లాలో అడవి అంతిమ దశకు చేరుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అడవుల ఆవశ్యకత గురించి, ఒక్కో మనిషికి ఉండాల్సిన చెట్ల సంఖ్య గురించి దేశదేశాల వివరాలు సేకరించి చెబుతున్నారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం గురించి పదేపదే నొక్కి చెబుతున్నారు. అటవీ సిబ్బందికి అవసరమైన సాధన సంపత్తి సమకూర్చుతున్నారు. కానీ నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో అడవుల నరికివేత ఆగలేదు. అటవీ సిబ్బందిపై స్మగ్లర్ల దాడులు ఆగలేదు. బండెనకబండి పదహారు బండ్లు కట్టి కలప తరలించుకుపోవడం ఆగలేదు. అడవుల విస్తీర్ణం నానాటికీ హరించుకుపోతున్నది. అడవుల విస్తీర్ణం పెంచడం కాదుకదా ఇప్పుడున్న శాతం కూడా కాపాడలేని పరిస్థితి. మనిషి ప్రాణానికి ఇచ్చిన విలువను చెట్టు ప్రాణా-నికి ఇచ్చే చట్టాలు చేయకపోతే భవిష్యత్తు తరాలు మనలను క్షమించవు. చెట్టును ముట్టుకోవడానికి మనిషి భయపడే రోజు రావాలి. అలా చేయనంతకాలం కూర్చోవడానికి నీడ, పీల్చుకోవడానికి గాలి, తాగడానికి నీరు లేక విపరీత ఉత్పాతాలను ఎదుర్కోవలసిన పరిస్థితి తలెత్తుతుంది. ఎంత విజ్ఞానం, ఎన్ని ఆవిష్కరణలు, ఎంత టెక్నాలజీ వచ్చినా మనిషిని ఎవరూ రక్షించలేరు. అమెరికానే మనకు ఉదాహరణ. అత్యంత ఆధునిక దేశం, టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్న అమెరికాలో ఈరోజు కూడా ప్రకృతి వైపరీత్యాలు వస్తే అతలాకుతలం అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రకృతి అసమ-తౌల్యం ఏర్పడిన ప్రతిచోట పరిస్థితి అలాగే ఉంది.

వెనుకటికి జనం కలరా వంటి మాయరోగాలు వచ్చి చనిపోయేవారు. ఇప్పుడు కరువులకు,వడగాడ్పులకు పిట్టల్లా రాలిపో-తున్నారు. పల్లె పట్నం తేడా లేదు. హైదరాబాద్ గురించి ఒకప్పుడు కాశీయాత్రా చరిత్రలో ఏనుగుల వీరాస్వామయ్య చాలా గొప్పగా చెప్పారు. ఉద్యానవనాలు, పండ్లతోటలు, పచ్చని మైదానాలు ఎక్కడ చూసినా భవనాలను కప్పేసే వృక్షాలు ఉండేవని ఆయన రాశారు. అప్పటిదాకా ఎందుకు, 1970, 80 దశకాల్లో ఇంత ఉష్ణోగ్రతలు లేవు. ఎక్కడ చూసినా గ్రీన్ స్పేసెస్ ఉండేవి. వసంతం వచ్చిందంటే రోడ్లవెంట గుల్‌మొహర్ పూలు తివాచీ పరచినట్టు పరుచుకుని ఉండేవి. సాయంత్రం అయితే వాతావరణం చల్లబడేది. ఎండాకాలంలో కూడా వర్షపు జల్లులు పలకరించిపోయేవి. వర్షాలు విరివిగా కురిసేవి. కానీ నగరంలో ఇప్పుడు ఖాళీ స్థలాలు లేవు. రోడ్ల వెంట చెట్లు లేవు. విస్తరణ, ఆధునీకరణ పచ్చదనాన్ని మింగేసింది. నగరీకరణ ఒత్తిడి, అస్తవ్యస్థ పాలన కారణంగా కమ్యూనిటీ స్థలాలు సైతం అన్యాక్రాంతమైపోయాయి. చివరికి కొండలు గుట్టలు ఏవీ ఆక్రమణల నుంచి తప్పించుకోలేకపోయాయి. ఒకప్పుడు హైదరాబాద్‌కు ఉన్నంత లాండ్ బ్యాంకు దేశంలో మరే నగరానికీ లేదు. సమైక్యపాలనలో ఒక విధంగా లూటీ అయిపోయింది. ఇవ్వాళ ఎక్కడ చూసినా భవంతులే భవంతులు. ప్రభుత్వం ఏదైనా కొత్త కార్యాలయం కట్టాలంటే స్థలం దొరకడం కష్టమైపోతున్నది. వందలాది చెరువులు అంతరించిపోయాయి. ఉన్న చెరువులు కూడా కుంచించుకుపోయాయి. నీరు ఇంకడానికి ఖాళీ స్థలాలు లేవు. ఇక భూగర్భ జలాలు ఎలా ఉంటాయి. ఇవ్వాళ రెండు వేల అడుగుల కంటే ఎక్కువ లోతుకు తవ్వుతున్నారు. నమస్తే తెలంగాణకు సమీపం లో మూడు రోజులుగా ఒకే బోరుబండి నీటికోసం తవ్వుతూనే ఉంది. భూమికి చిల్లు పడుతుందేమో అని ఒక మిత్రుడు కామెంట్ చేశాడు. భూమికి చిల్లు పడుతుందో లేదో కానీ నీరు మాత్రం ఇంకా దొరకలేదు. 

నగరంలో మొక్కల పెంపకం ఒక ప్రహసనమే. కొన్ని ఏళ్లుగా ఏటా లక్షలాది మొక్కలు నాటుతున్నట్టు, పట్టణ సామాజిక అడవులు పెంచుతున్నట్టు ప్రకటించడం చివరికి వచ్చేసరికి ఎక్కడా అవి కనిపించకపోవడం అనుభవంలో ఉన్నదే. మొక్కలు పెట్టగానే కాదు. వాటిని పెంచడానికి నీళ్లు కావాలి. సిబ్బంది కావాలి. లేదంటే ప్రజలయినా ముందుకు వచ్చి పట్టించుకోవాలి. ఇవి రెండూ సాధ్యం కావడం లేదు. అందు కే ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. కాలం వెనకకుపోతూనే ఉంది. రుతువులు చెదిరిపోతూనే ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఒకటి అర్థం అవుతుంది-చెట్టు, నీరు, గాలి, ఖాళీ స్థలాలు పరస్పరాధారితాలు. మొత్తం సమాజం ఈ అం శంపై దృష్టిపెడితే తప్ప ముందు ముందు ఈ గండం నుంచి తప్పించుకో-లేము. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కరెంటు కష్టాలు లేకుండా చూస్తున్నది. ఏవో ఏసీలు, కూల ర్లు నడుస్తున్నాయి కదా అని ఊపిరి పీల్చుకుంటుండవచ్చు. కానీ పచ్చదనాన్ని ధ్వం సం ఇలాగే కొనసాగి, ఉష్ణోగ్రతలు ఇలాగే పెరుగుతూ పోతే ఏ ఏసీలు, ఏ కూలర్లూ మానవజాతిని కాపాడలేవు. మానవ మనుగడకే ముప్పు ఏర్పడే దుస్థితి నుంచి మనల్ని మనం కాపాడు-కునే అవకాశం ఇప్పటికీ మన చేతుల్లోనే ఉంది. 

kattashekar@gmail.com

Oh..My Lords…. What law is this? 

  
It seems all are not equal before the law, some rich and famous are seems to be more equal. Every system and rule come to rescue, protect a rich and famous defaulter of national banks. RBI and Central Government trying to hide behind the confidentiality clause. 
They dont want to ‘hurt’ industrial class, but readily jump to hurt farmers, professionals and other marginal sections. Most of the NPAs are byproduct of industrial class and bank officials criminal, fraudulent collusion. Indian establishments never treated bank frauds as national crime. 
Industrial class will engage the highest paid lawyers in the country to dodge the cases and get out of it, where as common farmer has to sweat his blood or hang himself in case of default.
Where as whenever a small or medium farmer fails to deliver the repayment of the loan, which amounts to few thousands, will be draged to streets and insulted like anything. His gold ornaments will be auctioned by notifying publicly in newspapers. His property will be seized. His house will be locked. 
But rich defaulters are gifted with One Time Settelements, Re-schedule of loans and if that to failed fecilitate escapades, where as common man will be pushed to a corner pressing for pay or die. What law is this? 

యథాజ్ఞానం తథా ప్రజెంటేషన్

godavaribesin
వ్యతిరేకించడమే ప్రతిపక్షం పని అయితే ఈ దేశంలో ఒక్క పనీ ముందుకు సాగదు. వ్యతిరేకించడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. సందర్భోచితంగా ఉండాలి. సహేతుకమైన కారణాలు చూపాలి. ఒక సమగ్ర దృష్టితో మాట్లాడాలి. వ్యతిరేకించడంలో అక్కసు, ఏడుపు, ఉక్రోషం కనిపించకూడదు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని గ్రూపులు చేస్తున్న వాదనల్లో డొల్లతనం తప్ప బలమైన కారణాలు కనిపించవు. ఎడ్డెమంటే తెడ్డెమనే ధోరణి తప్ప ప్రజల బాగుకోరే తపన కనిపించదు. కొందరయితే మండలస్థాయికి, నియోజకవర్గస్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. కొందరు జిల్లా నేతలుగా మాట్లాడుతున్నారు. ఒకే పార్టీలో కొందరు సమర్థిస్తారు. కొందరు వ్యతిరేకిస్తారు. కాంట్రాక్టులు తీసుకున్నవాళ్లు ఒకరకంగా, తీసుకోని వాళ్లు మరోరకంగా…వీళ్లెవరూ విశాల ప్రయోజన దృష్టితో మాట్లాడటం లేదు. అధికారంపోయి, ఆశలు ఛిద్రమైన దుగ్ధతో మాట్లాడేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. మంచిని మంచిగా చెడును చెడుగా చూసే ధోరణిలేకపోతే రాజకీయాలు ఆరోగ్యకర స్థాయి నుంచి హీనస్థాయికి దిగజారుతాయి. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఒక మహాయజ్ఞం. ఒట్టిపోయిన తెలంగాణను తిరిగి జలాభిషేకంతో పునర్జీవింపజేసే ప్రయత్నం. కాంగ్రెస్ నాయకులకు గానీ, కొందరు మేధావులకు గానీ అర్థం కానిదేమంటే ప్రాజెక్టులు కట్టడం అంటే కాలువలు తవ్వడం కానే కాదు. నదుల్లో నీరు వస్తున్నప్పుడు ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు నింపుకోవడం. అందుకనుగుణంగా రిజర్వాయర్లు నిర్మించడం. అన్ని చెరువులను సంధానం చేయడం.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, అంతకు ముందు చంద్రబాబు చేసిన పని అదే. వారు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో విస్తృతంగా రిజర్వాయర్లు నిర్మించారు. ముప్పైకి పైగా రిజర్వాయర్లలో ఇంకా కొన్ని పూర్తికావలసి ఉంది. ముందు రిజర్వాయర్లు నిర్మించి ఆ తర్వాత వాటికి తగినంత నీరు తీసుకోవడానికి వీలుగా పోతిరెడ్డి కాలువ సామర్థ్యాన్ని 44000 క్యూసెక్కులకు పెంచారు. ఇప్పుడు కాలమైతే, వరదవస్తే చాలు ముప్పై రోజుల్లో రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున కనీసం120 టీఎంసీల నీటిని తరలించుకుపోయే సామర్థ్యం ఆ కాలువకు ఉంది. సుమారు 220 టీఎంసీల నీటిని నింపుకునే రిజర్వాయర్లు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు లేదంటే నాగం జనార్దనరెడ్డి వంటి నాయకులు అర్థం చేసుకోవలసింది అదే. పోతిరెడ్డిపాడు కింద అన్ని కాలువలు, రిజర్వాయర్లు నిర్మించిన పెద్దమనిషి ప్రాణహిత-చేవెళ్లను నీళ్లొచ్చినప్పుడే వాడుకునే విధంగా ఎందుకు రూపొందించారో చెప్పాలి. తగినన్ని రిజర్వాయర్లను ఎందుకు ప్లాను చేయలేదో చెప్పాలి. హెడ్వర్క్స్ వదిలేసి టెయిల్వర్క్స్ ఎందుకు ముందు చేశారో చెప్పాలి. ప్రాణహిత-చేవెళ్ల తెలంగాణపై రుద్దిన పెద్ద ఫ్రాడ్. దానిని సరిదిద్ది తెలంగాణ శాశ్వత ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే పనిని కేసీఆర్ నెత్తికెత్తుకున్నారు. వీలైనంత ఎక్కువ నీటిని నదుల నుంచి మళ్లించి నిల్వ చేసుకునే విధంగా రీడిజైనింగ్ జరిగింది. నిల్వ సామర్థ్యం పెంచితేనే తెలంగాణకు బతుకు, భవిష్యత్తు. భూగర్భాన్ని తిరిగి రీచార్జి చేయకుండా తెలంగాణ వ్యవసాయం కలకాలం మనజాలదు. రీచార్జి చేయాలంటే రిజర్వాయర్లు, చెరువులు నిండాలి. జాలు జలాలతో వాగులు, వంకలు పునర్జీవం పొందాలి. ఎండిపోయిన బావులు తిరిగి నీటితో కళకళలాడాలి. వందల అడుగులు బోర్లు వేసే దుస్థితి నుంచి రైతును విముక్తి చేయాలి. ఇవేవీ ఆలోచించకుండా రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పట్టుకుని కాంగ్రెస్ నాయకులు, వామపక్షాలు గోలచేయడం విచిత్రం.

ప్రతిపక్షాలు ముందుగా తెలంగాణ తాగునీటి, సాగునీటి సమస్యను ఆకళింపు చేసుకోవాలి. వారికి ఇప్పటికీ నదుల గురించి, వాటి పరీవాహక ప్రాంతాల గురించి, ఆయకట్టు గురించి, నీటివాలు గురించి అవగాహనలేదంటే కోపపడవలసిన పనిలేదు. క్యూసెక్కులు, టీఎంసీల లెక్కలు తెలియవంటే బాధపడనక్కరలేదు. తెలంగాణ ఉద్యమసారథిగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు పదమూడేళ్లు ఆ లెక్కలు పత్రాలు వందలు వేలు చదివారు. నిష్ణాతులైన ఇంజనీర్లతో అనేక దఫాలుగా చర్చించారు. కాంగ్రెస్ నాయకత్వానికి అసలు అసెంబ్లీలో కూర్చునే ఓపికలేదు. సమస్యలను తెలుసుకునే ఓపిక లేదు. కేసీఆర్ను విమర్శించాలంటే కేసీఆర్కు తెలిసినన్ని విషయాలు ప్రతిపక్షానికి తెలియాలి. ప్రతిపక్షాలు మూస పద్ధతుల్లో ఆలోచిస్తున్నాయి. వాదనలో విషయం లేకుండా డబ్బాలో రాళ్లువేసి చప్పుడు చేసినట్టు ఎంతకాలం ఎంతగట్టిగా మాట్లాడితే ఏమి ప్రయోజనం? కేసీఆర్ వారికంటే రెండు మూడు దశాబ్దాలు ముందుకెళ్లి మాట్లాడుతున్నారు. సృజనాత్మకంగా ఆలోచించే అరుదైన నాయకుల్లో ఆయన ఒకరు. ఐఫోను వచ్చిన కొత్తలో అనుకుంటా ఆయన తనకు ఆ ఫోను కావాలన్నారు. అది ఇంకా ఇక్కడ విడుదల కాలేదని ఎవరో చెప్పారు. ఆ విషయం నాకు తెలుసు. ఎలా తెప్పించాలో చూడండి అని ఆయన పురమాయించారు. మరుసటిరోజుకు ఆ ఫోను చేతికివచ్చింది. ఐఫోను ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో ఆయన ముందే చూసి, మరుసటిరోజు అందరికీ వివరించి చెప్పారు. ఐప్యాడ్ వచ్చినప్పుడూ అంతే. ఈ దేశంలో గూగుల్ ఎర్త్ను సమర్థవంతంగా వాడుకున్న ఒకే ఒక నాయకుడు, ముఖ్యమంత్రి బహుశా కేసీఆరే కావచ్చు. అందుకే అన్ని అంశాలపై ఆయనకు అంతగా పట్టు. కొత్తగా, భిన్నంగా ఆలోచించడం ఆయన తత్వం. నిరంతర శోధన ఆయన ప్రపంచం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆలోచనల పుట్ట. మరో లోకం లేదు. మరి ఆయనపై విమర్శలు చేయడానికి ప్రతిపక్ష నాయకులకు కూడా అంతే అవగాహన ఉండాలా లేదా?

ప్రతిపక్ష నాయకులు ప్రజెంటేషన్ ఒక్కరివ్వాలా వందమందివ్వాలా అన్న దగ్గరే ఆగిపోయారు. ఎందుకంటే ఒక్కరికే అన్ని ప్రాజెక్టుల గురించి అవగాహన లేకపోవడం. జిల్లానాయకుల స్థాయి నుంచి ఎవరూ రాష్ట్ర నాయకుని స్థాయికి ఎదగకపోవడం. ఒక రాష్ర్టానికి నాయకత్వం వహించే దమ్మూ ధైర్యం, విశాలదృక్పథం ఎవరూ అలవర్చుకోకపోవడం. ఒక్కరు కూడా కాలంతోపాటు ఎదగకపోవడం. పాత భావజాలాలు, పాత పద్ధతుల్లోనే రాజకీయాలు చేయాలనే ధోరణిని మార్చుకోకపోవడం. రాజకీయాల్లో ఎదగడానికి ఏమాత్రం కష్టపడకుండా, ఇంకా దగ్గరి దారిలోనే నిచ్చెనమెట్లెక్కాలనుకోవడం. అందుకే ప్రతిపక్షానికి అస్ర్తాలే లేకుండాపోయాయి. తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో, రాసిచ్చిన స్క్రిప్టులతో ప్రభుత్వంపైకి ఏదో ఒక బాణం విసిరినా అవి మధ్యలోనే దూది పింజల్లా ఎగిరిపోతున్నాయి. నిజానికి తెలంగాణలో ఇంత తొందరగా రాజకీయ బాగోతాలు మొదలుపెట్టనవసరం లేదు. కొత్త రాష్ట్రం తెచ్చుకున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇన్నేళ్ల ఆధిపత్య వ్యవస్థల నుంచి సంకెళ్లు తెంచుకుని, కాళ్లూ చేతులూ కూడదీసుకుని అభివృద్ధి పరుగు ప్రారంభించడానికి ప్రభుత్వం శతధా ప్రయత్నిస్తున్నది. తెలంగాణ నాయకులకు పరిపాలించుకోవడం చేతగాదు, ఉత్తగనే ఆగమైపోతరని చెప్పిన ఒకప్పటి పెత్తందారుల దిమ్మదిరిగేట్టు, అనతికాలంలోనే తెలంగాణ ఒక అజేయమైన రాష్ట్రంగా, ఆదర్శవంతమైన రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. కేసీఆర్కు దేశంలో మరే నాయకునికీ లభించని పేరు దక్కింది. తెలంగాణ నేతలను ఎగతాళి చేసిన శక్తులన్నీ వాస్తవంలోకి వచ్చి ఇప్పుడు పాహిమాంపాహిమాం అని చేతులు జోడిస్తున్నారు. తెలంగాణ సమాజానికి మునుపెన్నడూ లేని ఒక ఆత్మవిశ్వాసాన్ని ఈ రెండేళ్ల పాలన కలిగించింది. ఇంత తక్కువ వ్యవధిలో తెలంగాణ ఇంతసాధించిందీ అంటే అది కేవలం కేసీఆర్ అందించిన నాయకత్వం. తాను విశ్రమించడం లేదు. ఎవరినీ విశ్రమించనీయడం లేదు. ఎందుకంటే చేయాల్సింది చాలా ఉంది. ముందున్న లక్ష్యాలు సాధారణమైనవి కాదు. ఈ పదేళ్లూ పునర్నిర్మాణ కంకణబద్ధులై ముందుకు సాగితే తప్ప తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రయోజనం నెరవేరదు.

పంతాలు, ప్రజెంటేషన్లు మాని రాష్ట్ర ఉమ్మడి ప్రయోజనాలకోసం అన్ని పక్షాలూ కలసి పనిచేయడం మంచిది. ప్రభుత్వం చేసే పనులలో లోపాలే లేవని కాదు. విమర్శలే చేయవద్దని కాదు. ఎక్కడైనా రాజకీయాలు చేయండి. కానీ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఒక్కమాటగా ఉండకపోతే తెలంగాణకు నష్టం. తెలంగాణ ప్రథమ ప్రాధాన్యం తాగునీరు, సాగునీరే. ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగడానికి, త్వరిత గతిన ప్రతి ఇంటికి, ప్రతి పొలానికి నీరందించడమే లక్ష్యంగా అన్ని పక్షాలూ తమ శక్తియుక్తులను ఉపయోగించాలి.
kattashekar@gmail.com

కేసీఆర్ విశ్వరూపం

  
కేసీఆర్ విశ్వరూపం చూశాం. ఆయన గురించి మేము ఇంతకాలం విన్న వ్యతిరేకాంశాలు దూదిపింజల్లా తేలిపోయాయి. ఆయనను ఇప్పటిదాకా పరిపాలించిన మరో ముఖ్యమంత్రి ఎవరితోనూ పోల్చలేము. ఆయన ఒక ఉద్యమకారునిగా, ఒక నాయకునిగా, ఒక ముఖ్యమంత్రిగా, అసాధారణమైన మేధోసంపత్తి కలిగి న నేతగా విజయం సాధించారు. కలిసి బతుకుదాం. నీళ్ల పంచాయితీలు వద్దు అని ఆయన చెప్పిన మాట మా వాళ్లకు ఎంతగా నచ్చిందో. మా ప్రాంత ప్రజలు మాకు ఇట్లాంటి నాయకుడు ఉంటే బాగుండు అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో అని ఇప్పుడు తలుచుకుంటే గుబులుగా అనిపిస్తుంది. కేసీఆర్ వంటి ఒక బలమైన నాయకుడు రాకపో యి ఉంటే అటు చంద్రబాబు, ఇటు కాంగ్రెస్ కొత్త రాష్ర్టాన్ని ఎంతగా ఆగం పట్టించి ఉండేవారో తెలిసివస్తున్నది. నీటిపారుదల ప్రాజెక్టులపై శాసనసభలో ఆయన చేసిన ప్రసంగం, ప్రజెంటేషన్ నభూతో నభవిష్యతి అని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక మేధావి అభివర్ణించారు. కేసీఆర్‌పై మాకో చిన్న చూపు ఉండేది. ఆయన గురించి ఉద్యమ సమయంలో, ఆ తర్వాతా మేము విన్నవి అన్నీ అబద్ధాలని తేలిపోయింది. ఆయన తెలంగాణకు వరం. తెలంగాణ వనరులను మేము ఉన్నతాధికారులమై ఉండీ ఇంతవరకు ఎప్పుడూ ఇంత లోతుగా అధ్యయనం చేయలేదు. నదులు, ప్రాజెక్టుల స్వరూపాలను ఇంచుఇంచూ చెబుతుంటే ఆశ్చర్యం వేసింది అని ఒక ఇరిగేషన్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలో చాలారోజులు అందరికంటే ఆఖరుకు నిద్రపోయింది కేసీఆర్‌గారే కావచ్చు. ఒక్కోరోజు తెల్లవారుజామున రెండు మూడు గంటలు కొట్టే వరకు కంప్యూటరు ముందు కూర్చుని గూగుల్ ఎర్త్‌ను బ్రౌజ్ చేస్తుంటే ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడేవాళ్లం. కానీ ఆయన పట్టిన పట్టు విడువరు. ఏదైనా ఒక అంశాన్ని ముందేసుకున్నారంటే, దాని అంతుచూసే దాకా నిద్రపోరు. సంపూర్ణంగా అధ్యయనం చేస్తారు. అడిగి తెలుసుకోవడానికీ వెనుకాడరు. ఏదైనా గొప్పగా, అత్యంత ప్రయోజనకరంగా, పకడ్బందీగా, పరిపూర్ణంగా చేయాలనేది ఆయ న తాపత్రయం అని ఆయన సహాయకుల్లో ఒకరు మాటల సందర్భంగా చెప్పారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిపారుదలపై ఎందుకు ఇంతగా శ్రద్ధపెడుతున్నారో ఎవరికయినా ఇప్పటికే అర్థం కావాలి. తెలంగాణ ఈ ఆరు దశాబ్దాల్లో బాగా నష్టపోయింది, అష్టకష్టాలపాలయింది, అప్పుల పాలయింది సాగునీరు, తాగునీరు, కరెంటు లేకనే. ఆయన ముఖ్యమంత్రి కాగానే కరెంటు విషయం పరిష్కరించారు. కరెంటు సమస్యను ఎదుర్కోవడానికి ఏమి చేయాలో అధికారులను పిలిచి అడిగారు. లెక్కలు వేశారు. డిమాండు సైప్లెల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో తేల్చారు. ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను ట్రాన్సో, జెన్కోలపై పెట్టకుండా ఇంజనీర్లుగా అక్కడే ఉన్నతస్థానాలకు ఎదిగిన ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డి వంటి టెక్నోక్రాట్స్‌కు బాధ్యతలు అప్పగించారు. కరెంటు కోసం జనం వీధుల్లోకి రాకూడదు ఏం చేస్తారో మీష్టం. ఎంత ఖర్చయినా పర్వాలేదు అని ఆయన వారిని పురమాయించారు. వారు వారం తిరుగకుండానే ఒక పరిష్కారంతో ముందుకు వచ్చారు. అదనంగా ఎంత ఖర్చవుతుందో చెప్పారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి మంజూరు చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సమస్య తలెత్తలేదు. అంతేకాదు పాత విద్యుదుత్పత్తి కేంద్రాల ఉత్పాదన సామర్థ్యం పెంచారు. వృథాను అరికట్టారు. కొత్త విద్యుత్ కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. కేసీఆర్‌ను జనం శభాష్ అనుకున్న తొలి సందర్భం అది. మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి మన అధికారులు అయితే ఏం చేయగలరో రుజువయిన సన్నివేశం అది. కరెంటు ఉంది సరే. మరి నీళ్ల సంగతి ఏమిటి? తెలంగాణలో రైతులు సాగునీరు లేక బోర్లు వేసీ వేసీ అప్పుల పాలయి, పంటలు చేతికి రాక ఆగమయిపోతున్నారు. కాలువల్లో నీరు లేదు. బావులు ఎప్పుడో ఎండిపోయాయి. చెరువులు పూడుకుపోయాయి. బోర్లు వందల ఫీట్ల లోతుల్లోకి పోతున్నాయి. అయినా నీళ్లు లభించని పరిస్థితి. గోదావరి, కృష్ణా డెల్టాల్లో కేవలం రెండొందల రూపాయల నీటితీరువా కడితే ఏడాదిపాటు పొలాలకు నీరు వస్తుంది. ఇక్కడ ఒక్క రైతు ఒక్కోసారి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఎకరా పారించడం కష్టం అవుతున్నది. తెలంగాణ రైతులు భూగర్భ జలాలకోసం ఏటా 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పిన విషయం అక్షర సత్యం. రైతుకు నీళ్లివ్వగలిగితే ఆ 25 వేల కోట్లు తెలంగాణకు మిగులు. రైతుకు మిగులు. తెలంగాణ వెనుకబాటుకు ప్రధాన కారణం అదే. తెలంగాణ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు మూలం ఇందులోనే ఉంది. ఊళ్లు పాడుబడిపోయి యువకులు పొట్ట చేతపట్టుకుని బొంబాయి, దుబాయి, బొగ్గుబావుల వెంట తిరగాల్సి వస్తున్నది. జీవితానికి ఇతరత్రా భరోసా లేక ప్రభుత్వోద్యోగాలకోసం వెంపర్లాడాల్సి వస్తున్నది. ఈ సమస్యలన్నింటినీ జయించడానికి ఒకటే పరిష్కారం…నీళ్లు… నీళ్లు… నీళ్లు. తెలంగాణ ఎదుర్కొంటున్న అత్యంత ప్రధాన సమస్యలు రాయాల్సివస్తే ఒకటి నుంచి పదిదాకా సాగునీరు, తాగునీరు గురించే రాయవలసిన పరిస్థితి. అందుకే కేసీఆర్ ప్రాజెక్టుల సమస్యను అంతగా ముందేసుకున్నారు.

జలయజ్ఞం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే కదా అని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. నిజమే. మన నాయకులకు, కొందరు ఇంజనీర్లకు, కొందరు మేధావులకు ఇంతకాలం అర్థం కానిది అదే. వాళ్లు మనకు కొండను చూపిస్తూ నేలకింద భూమిని తవ్వడం మొదలుపెట్టారు. కొండ వస్తుందని మనం అటే చూస్తుండిపోవాలి. మన పాదాల కింద మట్టి కదలిపోయి మనం బొందలో పడాలి. వాళ్లు హెడ్‌వర్క్స్ చేసుకున్నారు. మనకు టెయిల్ వర్క్స్ మొదలుపెట్టారు. వాళ్లు కాంట్రాక్టులు, కమీషన్లు తీసుకున్నారు. మనవాళ్లకు పదో పరకో చిన్న చిన్న ప్యాకేజీలో పడేశారు. వాళ్లు ప్రాజెక్టులు పూర్తి చేసుకుని నీళ్లు తీసుకెళ్లారు. మన ప్రాజెక్టులు, కాలువలు చెట్లు దుప్పలు మొలిచి పడువబడి పోయాయి అని ఒక జర్నలిస్టు చేసిన పరుషమైన విశ్లేషణ. అంతపెద్ద పోతిరెడ్డిపాడు కాలువను ఏ అనుమతులూ లేకుండా రెండేళ్లలోపే నల్లమల కొండలను నిట్టనిలువునా చీల్చుతూ 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ఆ రెగ్యులేటర్ నుంచి నాలుగు కాలువలు కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను స్పర్శిస్తూ ముందుకు సాగిపోయాయి. ఇవిగాక హంద్రీ-నీవా కర్నూలు జిల్లాలో మొదలై చిత్తూరు ఆ చివరన కుప్పం దాకా సాగిపోయింది. అవి కేవలం కాలువలు కాదు, ఒక నది మళ్లింపు ప్రయత్నం. పోతిరెడ్డిపాడు ఒక పెద్ద అతిక్రమణ. దుర్మార్గం. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి గ్రేట్. తన ప్రజలకు తాను చేయదల్చుకున్నది చేసి పారేశారు. ఎవరి ఆమోదం కోసమూ ఎదురు చూడలేదు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా తలకిందులుగా తపస్సు చేసినా ఆయన వెరువలేదు. పోతిరెడ్డిపాడు నుంచి తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఒక ఎండమావిని సృష్టించారు. వేల కోట్ల రూపాయలను మట్టిలో పోశారు. పదేళ్ల తర్వాత కూడా ఒక్క చుక్క నీరు పారలేదు. ఎందుకంటే తమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి ఎత్తకుండా చేవెళ్ల వద్ద టన్నెలు తవ్వించే క్రూరమైన పరిహాసానికి దిగారు అప్పటి పాలకులు. 22 లిఫ్టులు, రెండే రెండు రిజర్వాయర్లతో 180 టీఎంసీలు వాడాలని లెక్కలు వేశారు. రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 20 టీఎంసీలకు మించదు. మరి 180 టీఎంసీలు ఎలా వాడతారయ్యా అంటే నది పారుతున్న కాలంలో ఆగకుండా మోటార్లు నడిపి నీళ్లు ఎత్తిపోసి పొలాలకు మళ్లించాలట. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారో, ఎంత ప్రయోజనం జరిగిందో లెక్కలు తీస్తే, ఈ ప్రాజెక్టులను రూపకల్పన చేసిన వారందరినీ కటకటాల వెనుక కూర్చోబెట్టాల్సి వస్తుంది. విచిత్రం ఏమంటే ఆ కుట్రలకు భాగస్వాములుగా ఉన్నవాళ్లు ఇప్పటికీ తెలంగాణకు జరిగిన మోసాన్ని గుర్తించకపోవడం. తమ్మడిహట్టి వద్ద ప్రాణహిత హెడ్‌వర్క్స్ పక్కనబెట్టి చేవెళ్ల దగ్గర తవ్వకాలు ఎందుకు జరిగాయో ఇప్పటికీ ఎవరూ ఎందుకు మాట్లాడరు? మూడు దశాబ్దాల క్రితం పోతిరెడ్డిపాడుతోపాటే ఆలోచన చేసిన ఎస్‌ఎల్‌బీసీ నానాతెర్వూ ఎందుకు అయిపోయింది? మహబూబ్‌నగర్‌లో ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు ఎందుకు?

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిజానికి కాంగ్రెస్‌ను తిట్టడం కోసం అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టలేదని విన్నవారెవరికయినా అర్థం అవుతుంది. తెలంగాణకు అత్యంత అవసరమైన నీటిపారుదల ప్రాజెక్టుల గురించి అందరి ఆమోదంతో ఏకోన్ముఖంగా పనిచేయాలని, పంచాయితీలు, వివాదాలతో కాలయాపన జరుగరాదని ఆయన భావించారు. తెలంగాణకు గరిష్ఠ ప్రయోజనం కలిగే విధంగా ప్రాజెక్టులు రూపకల్పన చేయాలన్నది ఆయన ప్రయత్నం. తెలంగాణ నేల ఒట్టిపోయింది. భూగర్భ జలాలు సైతం దొరకని పరిస్థితి వచ్చేసింది. భవిష్యత్తు ఇంకా దారుణంగా ఉండబోతున్నది. అందుకే తెలంగాణ రాగానే శాశ్వత ప్రాతిపదికన నీటి వనరుల పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్నది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రారంభించింది. ఇవి రెండు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. అయితే వీటికి కూడా నీరు కావాలి. ఎంత గొప్ప లక్ష్యాలయినా నీరు లేకపోతే ప్రయోజనం శూన్యం. తాగునీరు, సాగునీరు, భూగర్భ జలాల పునర్జీవం లక్ష్యాలుగా నీటిపారుదల ప్రాజెక్టులను సమగ్రంగా రీడిజైన్ చేయాలని భావించారు. ఇప్పటికీ తెలంగాణ ప్రయోజనాలను జీర్ణించుకోలేని కొన్ని పత్రికలు ఎంత వంకరగా ఆలోచిస్తున్నాయంటే, కాళేశ్వరం వ్యయం పెరిగింది, విద్యుత్ అవసరం పెరిగింది అని రాశాయే తప్ప, రీడిజైనింగ్ వల్ల గోదావరి నుంచి తీసుకునే నీటి మొత్తం పెరిగింది, రిజర్వాయర్లు పెరిగాయి, నిల్వ సామర్థ్యం పెరిగింది. సాగు విస్తీర్ణం పెరిగింది. తెలంగాణ నేలను రీచార్జి చేసే యజ్ఞం మొదలయింది అని రాయలేదు. రాయలేవు. తెలంగాణ ఏది చేసినా వంకరగా చూడడం వారి జన్యువులోనే ఉందనిపిస్తుంది. కాంగ్రెస్ నాయకులకు కుంభకోణాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌కు ప్రాజెక్టులు నిర్మించడం అంటే కాసులు పండించడం. నీళ్లు మళ్లించడం కాదు. ఇప్పుడా అవకాశం లేకుండా పోయిందన్నది వారి బాధ. అందరూ తమలాగే కాసులు పండించుకుంటారని వారు భావిస్తుండవచ్చు. కానీ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఇంతకాలం జరిగిన నష్టం ఏమిటో, తను చేయదల్చుకున్నదేమిటో పూసగుచ్చినట్టు వివరించి చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టాలని నిర్ణయించుకుని, అందుకు ఒక సాకు వెతుక్కున్నారు. ఇటువంటిది మునుపెన్నడూ జరుగలేదన్నది వారి వాదన. కొత్తబాటలో నడవడం అంటే కాంగ్రెస్‌కు మంట. అసెంబ్లీ అంటేనే ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలను చర్చించే వేదిక. అది తెలుసుకోవడానికి కామన్‌సెన్సు చాలు. రూల్సు బుక్ అవసరం లేదు. అనుభవజ్ఞులైన మాజీ స్పీకర్లు అవసరం లేదు. విజువలా, ఆడియో విజువలా అన్న చర్చ కూడా అత్యంత తెలివి తక్కువ, కాలం చెల్లిన ఆలోచన. మావాళ్ల ప్రయాణం అసమర్థుని జీవయాత్రలాగా ఉంది. వారు మారరు. అప్‌డేట్‌కారు. గతకాలపు భావదారిద్య్రాలు వారిని వదలవు. వారిలో చాలామందికి హెడ్‌వర్క్స్‌కు, టెయిల్‌వర్క్స్‌కు తేడా తెలియదు. టీఎంసీలకు, క్యూసెక్కులకు వివరణ తెలియదు. కమీషన్లు బాగా సంపాదించిపెట్టే కాలువలు, వాటి కాంట్రాక్టుల గురించి తప్ప రిజర్వాయర్లు, రీచార్జింగు గురించి సున్నా జ్ఞానం అని ఒక కాంగ్రెస్ అభిమాన మేధావి ఆక్రోశం వ్యక్తంచేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యే మంచి అవకాశాన్ని మావాళ్లు చేజేతులా వదిలేశారని ఆయన వాపోయారు.

అసెంబ్లీలో ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసులను గెల్చుకున్నారు. గత రెండు రోజులుగా నలుగురు కూర్చున్న ప్రతిచోటా ఇదే చర్చ. అందరిలోనూ కేసీఆర్‌ను కొత్తగా చూసిన ఒక ఆశ్చర్యం,సంబరం. తెలంగాణ నీటిపారుదల సమస్యను కొత్తగా తెలుసుకున్నామన్న తృప్తి, ఆత్మవిశ్వాసం. తాగునీటి, సాగునీటి సమస్య నుంచి తెలంగాణను విముక్తి చేయలగలరన్న నమ్మకం ఇప్పుడు అందరిలోనూ కలిగించారు. కొత్త ఆశయాలు, లక్ష్యాలతో ప్రారంభించిన ఈ యజ్ఞం అధికారులు, కాంట్రాక్టర్లతోపాటు మొత్తం యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతుంది. తలపెట్టిన లక్ష్యాలు సకాలంలో పూర్తికావడానికి తెలంగాణ సమాజానికి ఈ చైతన్యం ఉపయోగపడుతుంది.