అస్తిత్వ చేతన జీవన జ్వాల హిమజ్వాల


A talk on Himajwala

కట్టా మీఠా

నేను సాహితీ విమర్శకుడిని కాదు, సాహిత్యంతో నా పరిచయం కూడా పరిమితమైనదే.నేను ఒక పాఠకుడిగా, వడ్డెర చండీదాసు మాస్టారు విద్యార్థిగా ఆ పరిమితుల్లోనే, ఆ పరిధుల్లోనే హిమజ్వాల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. మాస్టారు సాహిత్యంలో నేను ఎక్కువసార్లు చదివింది హిమజ్వాలనే. హిమజ్వాల ఒక సంక్లిష్ట జీవన వర్ణచిత్రం.
ఏ కొలమానాలకూ అందని, ఏ చెలియలి కట్టలకూ ఒదగని జీవన ప్రవాహం. ఏదో ఒక భావజాలం దృష్టితో చూస్తే అద్భుతాలు కనిపించకపోవచ్చు, కానీ భావుకత దృష్టితో చూస్తే ఈ నవల అసాధారణంగా కనిపిస్తుంది.

భావోద్దీపనలు, మధురోహలు, రస రాగరంజితమైన ప్రతిస్పందనలు మనుషులను ఏయే దారులలో నడిపిస్తే, ఆయా దారుల వెంట మనల్ని తీసుకెళతారు. నటన, కాపట్యం, కుహకాల సరిహద్దులు దాటి, మర్యాదల ముసుగులు తీసి, సంప్రదాయాల కుదురును దగ్ధం చేసి, బాహ్య అంతఃచేతనలో మనిషి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిన మనోవైజ్ఞానికుడాయన.

మనం ప్రపంచంలోని అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటాం. ఏం తినాలో, ఎలా తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో, ఏ రంగు బట్టలు ధరించాలో, వాటిని ఎక్కడ కుట్టించుకోవాలో, ఏ వాహనం కొనుక్కోవాలో అందరం బాహాటంగా మాట్లాడుకుంటాం, చర్చోపచర్చలు చేసి, ఏరికోరి ఎంపిక చేస్తాం, ఎక్కడో ఎంగిలిపడతాం, చిరంజీవి సినిమా మొదలు హాలీవుడ్ సినిమాల వరకు అన్నింటి గురించీ అందరితో చర్చిస్తాం, కానీ మనిషి అత్యవసరాల్లో ముఖ్యమైనదీ, అత్యంత సహజమైనదీ అయిన సెక్సు గురించి మాత్రం మాట్లాడుకోవడానికి జంకుతాం. దానినొక జైవికావసరంగా గుర్తించం…

View original post 1,119 more words

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad