తెలుగుసినిమా ఎందుకు విఫలమౌతోంది?


letch_wideweb__470x405,2

“ఎందుకంటే ఇక్కడ హీరో సినిమా తీస్తాడు.దర్శకుడు ఆయన చెప్పినట్టల్లా నటిస్తాడు ఇష్టం ఉన్నా లేకున్నా… ఇక్కడ హీరో గొప్ప. హిందీ, తమిళ సినిమాల్లో దర్శకుడే గొప్ప. షారూఖ్ ఖాన్ అయినా అమీరు ఖాను అయినా దర్శకుడు చెప్పినట్టు వింటారు. ఇక్కడ మెదడు ఉన్నా లేకున్నా హీరో పెత్తనం చేస్తాడు. కథ ఉండదు. అభిమానుల పేరు చెప్పి కథను అష్టావక్రంగా తయారు చేస్తారు. అడ్డగోలు సీన్లు చొప్పిస్తారు. పాటలు, ఫైట్ల పైత్య పతాకస్థాయికి చేరుకున్నది. ఇంతా చూస్తే ఆ అభిమానులు పట్టుమని పది మంది ఉంటారు. లక్షలాదిమంది ప్రేక్షకులంటే వీరికి లెక్క లేదు. గౌరవం లేదు. వాస్తవికతకు కొంచెమన్నా దగ్గరగా ఉందామన్న సోయిలేదు. అందుకే తెలుగు సినిమాలు పూడుస్తున్నాయి. హీరోలు మాత్రం ముందే సొమ్ము చేసుకుని తడిబట్టవేసుకుని కూర్చుంటున్నారు. డిస్ర్టిబ్యూటర్లు ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థతికి చేరుకుంటున్నారు. నిర్మాతల పరిస్థతి కూడా ఇలాగే ఉంది. హీరోల పెత్తనం పోయి, కథ, దర్శకుడి పెత్తనం ఉంటే తప్ప తెలుగు సినిమాలు బాగుపడవు. రాజమౌళి చెప్పినట్టల్లా అందరూ విన్నారు కాబట్టే బాహుబలి అంతగా విజయం సాధించింది”….ఇవ్వాళ మా మిత్రుడు చేసిన విశ్లేషణ ఇది.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily