ఉన్మాదం పెనుభూతం 


  
దేశద్రోహ నినాదాలు చేసిన వారిని కమ్యునిస్టులుగా చిత్రించి ఇటు మొత్తం కమ్యునిష్టు విద్యార్థి సంఘాలను, అటు జేఎన్యును బోనులో నిలబెట్టాలని చూసిన గోబెల్ వారసుల వ్యూహం బెడిసి కొట్టింది. చివరికి డిల్లీ ఏబీవీపీ నేతలు కూడా నిజం తెలుసుకుని విద్యార్థి లోకంపై జరుగుతున్న దాడులను ఖండించేదాకా వచ్చింది.
మతోన్మాదం ఏదైనా భస్మాసుర హస్తమే. అది సృష్టించిన వారిపైనా చెయ్యి పెట్టగలదు. మతం జీవన విధానమైతే సుందరం. మతం రాజకీయమైతే, అధికార సాధనమైతే దుర్భరం. మతవాద దేశాల్లో జరుగుతున్నది ఇదే. మన ఆ దేశాల బాట పట్టగూడదు. 

దేశద్రోహులను, ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేయడానికి మన ప్రభుత్వాలకు ఉన్న అధికారాలు చాలు. మతోన్మాదుల జోక్యం అవసరం లేదు. అరాచకులపై యుద్ధం చేయడానికి మనం నాగరికులం కావాలి. మనమూ అరాచకులమే అయితే మనకూ పాకిస్తాన్ కు తేడా ఉండబోదు. 

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad