ప్రజాస్వామ్యానికి ప్రతినిధి కేసీఆరా? రాధాకృష్ణా?


Dharani’s Counter to RK

కట్టా మీఠా

By ధరణి కులకర్ణి

రాధాకృష్ణ చంద్రబాబు షాడో
ప్రజాస్వామ్యానికి ప్రతీఘాతశక్తి

ఒక్కసారి లైసెన్సు తీసుకుని, జీవితాంతం ఇష్టం వచ్చింది వాగుడు, ఇష్టం వచ్చింది రాసుడు, ఇష్టమొచ్చినోన్ని తిట్టుడు, నచ్చనోళ్లను టార్గెట్ చేసుడు, డబ్బులియ్యనోళ్లను బ్లాక్‌మెయిల్ చేసుడు…ఇదేనా ప్రజస్వామ్యం?
రాజకీయ నాయకులు ఎవరయినా ఐదేళ్లకోసారి ప్రజల వద్దకు వెళ్లి ఆమోదం పొందాల్సి ఉంటుంది. కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా మరెవరయినా?

వీళ్లలో ఎవరు గొప్ప? ఎవరు ప్రజాస్వామ్యానికి ప్రతినిధి? ఎవరికి ప్రజల ఆమోదం ఉంది?

రాధాకృష్ణ ఒక పత్రికను పునరుద్ధరించి చాలా మందికి ఉపాధి కల్పించాడని ఒకప్పుడు అందరికీ గౌరవం ఉండేది. చాలా మంది మంచి జర్నలిస్టులను పోగేసి పత్రికను ఈనాడుకు ప్రత్యామ్నాయంగా తెచ్చాడు. స్పాట్‌న్యూస్ ఉద్యోగులను మోసం చేసినా, ఏపీఎల్ ఉద్యోగులకు బకాయిలు ఎగవేసినా, కోర్టుకేసులను తుంగలో తొక్కినా ఆయన చేసిన మంచి ముందు అవి పెద్దగా ప్రచారం కాలేదు. కానీ రాధాకృష్ణకు కొమ్ములు పెరిగే కొద్దీ మంచి మంచి జర్నలిస్టులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీనియర్లు, పెద్దవాళ్లు వెళ్లిపోయాక ఒకటి రెండు కాదు తలనిండా కొమ్ములు మొలిచాయి. టీవీ వచ్చాక ఇక ఆయనకు పట్టపగ్గాల్లేకుండా పోయింది. ఆయన ఆడింది ఆట, పాడింది పాట, రాసింది రాత. ఏసు ప్రభువు పునర్జన్మ ఎత్తి మళ్లీ రాధాకృష్ణ అవతారంలో ఎత్తినంత బిల్డప్. ఆయన నాయకులు మొదలు స్వామీజీల వరకు ఎవరికీ సుద్ధులు చెప్పకుండా వదలడు. చిన్నంతరం పెద్దంతరం ఉండదు. వరుసవాయీ ఉండవు. ఉచితానుచితాలుండవు. మోనార్క్…

View original post 1,025 more words

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad