ఒక అబద్ధం, వందమంది గోబెల్స్


కట్టా మీఠా

చాలా కాలం క్రితం- 2003లో అనుకుంటాను- ఒక ప్రముఖ జర్నలిస్టు యథాలాపంగా ఒక గొప్ప సూత్రం చెప్పారు. అది చాల గొప్ప సూత్రమని తెలంగాణ ఉద్యమ సందర్భంగా నాకు మరింత బాగా అర్థం అయింది. అది తెలంగాణ రాష్ట్ర సాధన, కులాలు, అధికారాలపై చర్చ జరుగుతున్న సందర్భం. ఆయన చెప్పిన విషయం ఆయన మాటల్లోనే ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని, సొంత రాజకీయ అస్తిత్వాన్ని సంపాదించుకోలేదు. సంపాదించుకున్నా నిలబెట్టుకోలేదు. తెలంగాణ వాళ్లు ఇంకా అమాయకత్వాన్ని అధిగమించి ఎదగలేదు. తెలంగాణ వాళ్లు అధికారంలోకి వచ్చినా మూన్నాళ్లకే వాళ్లకు తాటాకులు కట్టి గద్దె దింపేయగల శక్తులు వారికంటే బలంగా ఉన్నాయి. వాళ్లను ఎదర్కొనే సాధనాలేవీ తెలంగాణ వారి వద్ద లేవు’’ అని ఆయన అన్నారు. ‘‘ఏమిటా సాధనాలు? ఎందుకిలా జరుగుతోంది?’’.
‘‘వేదకాలం, ఇతిహాసకాలం, చరిత్ర, చివరకు ఆధునికాంధ్రప్రదేశ్ నేర్పిన పాఠం నీకు అర్థం అవుతుందా? సమాజంపై అధికారాన్ని, ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి, దానిని జస్టిఫై చేసుకోవడానికి అక్షరం అన్నది ఒక బలమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నవాళ్లే నాటినుంచి నేటి వరకు సమాజంపై నిరాటంకంగా పెత్తనం కొనసాగించగలుగుతున్నారు. మా విషయమే తీసుకోండి. వేదాలు, ఉపనిషత్తులు, మంత్రం, తంత్రం రాసుకున్నాం. మాకు మేము అతీంద్రియ శక్తులను, అలౌకిక శక్తులను ఆపాదించుకున్నాం. ఈ ప్రపంచమంతా మంత్రభూతమైందని, ఆ మంత్రం తెలిసినవాళ్లం మేమేనని, ఇక్కడ శాంతిగా బతకాలన్నా, దర్పంగా రాజ్యాలు ఏలాలన్నా మమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలన్న స్పృహను సమాజం నిండా…

View original post 721 more words

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in politics. Bookmark the permalink.