రిషితేశ్వరి కేసులో అరెస్టయిందెవరు?


IMG_2989

రిషితేశ్వరి కేసులో ఒక సామాజిక వర్గం పాత్రను సూచిస్తూ వడ్లమూడి హర్ష రాసిన కథనాన్ని నా బ్లాగులో ప్రచురించాను. ఆ కథనంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కొంతమంది చాలా తీవ్రస్థాయిలో నాపై విరుచుకుపడ్డారు. వెంటనే నాకు తెలిసిన జర్నలిస్టు మిత్రులను అక్కడికి పంపి పరిశీలన చేసి రమ్మని చెప్పాను. గుంటూరుకు చెందిన ఆ జర్నలిస్టు కూడా యూనివర్శిటీని సందర్భించకముందు నాకు తొలుత చెప్పిన విషయం నిందితులంతా ఆ సామాజిక వర్గానికి చెందినవారేనని. కానీ స్పష్టంగా పరిశీలించి, అవసరమైతే పోలీసు కేసు ప్రాథమిక సమాచార నివేదిక చూసి వివరాలు పంపాలని కోరాను.

ఆయన వెళ్లొచ్చిన తర్వాత పంపిన వివరాలు ఆశ్చర్యం కలిగించాయి. రిషితేశ్వరి కేసులో అరెస్టయిన ముగ్గురిలో ఒక్కరు కూడా ఆంధ్రలో అధికారంలో ఉన్న సామాజిక వర్గానికి చెందిన వారు లేరు. ఒకరు వైశ్య, ఒకరు ఎస్టీ, ఒకరు కాపు. ఒకరు గుంటూరు, మరొకరు ఖమ్మం, ఇంకొకరు తూర్పుగోదావరి చిల్లంగిపేటకు చెందినవారు. ఒక సత్యం కంటే ఒక అబద్ధం ఎంత వేగంగా వ్యాప్తి చెందుతున్నదో ఈ కథనం చూసిన తర్వాత అర్థమయింది. ఈ వ్యాప్తికి నేను కూడా దోహదం చేసినందుకు సిగ్గనిపించింది.

రిషితేశ్వరి ఆత్మహత్యకు, అధికార సామాజిక వర్గానికి ముడిపెట్టి చూడడంలోనే ఎటువంటి వాస్తవం లేదని ఈ పరిశీలనలో అర్థమయింది. ఇటువంటి కథనం నేను ప్రచురించాల్సింది కాదు. ఆ కథనాన్ని నా బ్లాగు నుంచి ఉపసంహరించుకుంటున్నాను. రిషితేశ్వరి మృతికి కారకులయిన పాషండులను మాత్రం కఠినంగా శిక్షించాలి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

8 thoughts on “రిషితేశ్వరి కేసులో అరెస్టయిందెవరు?”

 1. its a good gesture to realize and agree the mistake, but damage repair is difficult than damaging,.. so please be accurate going forward. thank you.

 2. Respects your sincerity. Never give a chance to others to pin point you.
  We are also waiting to see the punishment for culprits.

 3. Em sir siggu paduthunna ani oka mata ante saripothunda sir.oka bhadyatha gala position lo vundi niza nizalu telusukokunda posting cheyyatam yanta varuku meeku nyayam.
  Ika nunchi ina rase mundu niza nizalu telusoni rayandi.
  Ante kani ado mee yokka trp penchukovatam kosam try cheyyakandi
  Please its my request

 4. its 100% correct sir,.. prasad garu.. meeku subject gurinchi purthiga avagana ledu.. the great katta.sekhar reddy sir medha posting chestapudu jagrathaga undali…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s