మీడియా విచిత్ర విన్యాసాలు  


దాచేస్తే దాగని సత్యం 

 

ఏ విషాదమైనా ఎవరు రాజకీయం చేసినా తప్పే. రాజమండ్రీలో జరిగింది పెను విషాదం. అందరూ చూస్తుండగానే 35 నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఆంధ్ర సీఎం చంద్రబాబునాయుడు కూడా ఇలా జరుగుతుందని ఊహించి ఉండడు. ఆయన కూడా షాక్కు లోనైనట్టు కనిపించారు. రైల్వేస్టేషన్ పక్కనే unna ఘాట్లోకి వీఐపీలంతా వచ్చిపడడం, అధికారులంతా వీఐపీల ధ్యాసలో పడి ప్రమాద పరిస్థితిని అంచనా వేయకపోవడం, సమూహాన్ని వేర్వేరు ఘాట్లలోకి మల్లించకపోవడం ఇంతటి విషాదానికి దారితీసింది. పాలనా యంత్రాంగం ఘోర వైఫల్యం ఇది. చంద్రబాబు ఆ ఘాట్లోనే అంతసేపు పూజలు చేసి వెళ్ళారు కాబట్టి సహజంగానే ఆయననూ తప్పుబడతారు. అందుకే నేను కారణమైతే క్షమించండి అని చంద్రబాబు వెంటనే ప్రాయశ్చిత్తం ప్రకంటించారు. 

ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే….మొత్తం మీడియా కూడబలుక్కున్నట్టు, ఇది చాలా సాధారణ విశయమైనట్టు, ఇటువంటి ఉత్సవాలు, సంబరాల్లో అనేక మంది చనిపోవడం ఎప్పుడూ జరిగే విషాదమే అయినట్టు నటించడం. నెంబర్ వన్ ఛానల్గా చలామణి అయ్యే ఓ ఛానల్ ప్రైమ్ న్యూస్ బుల్లెటిన్లో సండ్ర బెయిలు విజయాలపై 15 నిమిషాలు నడిపింది. ఒకటేమిటి ఆంధ్ర ఛానళ్ళు అన్నిటిదీ అదే పాట. ప్రపంచంలో, భారత దేశంలో, సమైక్య రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఇటువంటి ఘోరాలు జరిగాయో ఏకరువు పెట్టాయి. ఈటీవీలోనైతే మాల్యాద్రి అనే టీడీపీ అనే పెద్ద మనిషి ఈ విషాదం ముందే పసిగట్టి సిద్దం చేసి ఉంచుకున్నట్టు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన తొక్కిసలాటల క్లిప్పింగులు చూపుతూ వీర విహారం చేశారు. 

ఇటువంటి ఘటనే తెలంగాణాలో జరిగి ఉంటే ఈ మీడియా ఏమి చేసేదో అందరికీ అనుభవమే. ఈటీవీ వాళ్ళైతే రాజమండ్రి విషాదాన్ని వదిలేసి తెలంగాణా పుష్కర ఘాట్లలో లోటుపాట్ల గురించి ప్రభుత్వాన్ని తిట్టించడం చేస్తూనే ఉన్నారు. తప్పును ఒప్పు చేయడం, గోరంతలు కొండంతలు చేసి చూపడం, కొండన్తలను గోరంతలు చేసి చూపడం వీరు బాగా నేర్చిన విద్య. 

రాజకీయాలు చేయవద్దు నిజమే. కానీ చంద్రబాబు చేయకుండా ఉండేవారా? ఏమీ లేకుండానే ఒక ఫ్రాడ్ లీడర్ రేవంత్ రెడ్డి ఏమి వాగుతున్నాడో అందరూ చూస్తున్నారు. కెసీఆర్ పుష్కర స్నానం చేస్తే అరిష్టమని శాపనార్థాలు పెడుతున్నాడు. తెలంగాణాలో అనుకోని విపత్తు ఏదైనా జరిగితే వీళ్ళు ఎలా కల్లుతాగిన కోతుల్లా చెలరేగిపొయెవారో ఊహించుకోవచ్చు.  

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Poetry. Bookmark the permalink.

2 Responses to మీడియా విచిత్ర విన్యాసాలు  

 1. Shivakumar Ramadgu says:

  ఒరే రేవంతూ, నీ పిచ్చి పీక్ కి పోయింది.
  పితృ కర్మల కొరకే పుష్కరాలు. సూతుకంలో నదికి వెళ్ళి సంకల్పం చేసుకుని స్నానమాచరించడమే కరెక్ట్. గుడికి మాత్రం పోకూడదు.

  Like

 2. Ch Balraj says:

  చాలా బాగా చెప్పారు sir ….కాని ఆ మీడియాను మనం నిషేధించలేమా సార్ …తన కొడుకు దొంగతనం చేసినా….తన కొడుకును మంచివాడుగా చూయించడానికి అవతలి వాడే దొంగను చేసే దొంగల మీడియా sir ఇది…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s