రేవంతు రెడ్డి కాదు, చంద్రబాబు బడ్డీ


N-Chandrababu-Naidu_0

తెలంగాణకు బద్ధశత్రువు చంద్రబాబునాయుడుకు చెంచాగిరి చేసేవాళ్లు తలకిందికి పెట్టి కాళ్లు పైకి పెట్టి తపస్సు చేసినా కేసీఆరును కానీ, తెలంగాణ ప్రభుత్వాన్నిగానీ ఇంచు కూడా కదిలించలేరు. రేవంతురెడ్డి ఒక లంపెన్ నాయకుడు. ఏ విలువలూ లేని వాడు. ఆయన తన సన్నిహితుల వద్ద చెబుతున్నవి గానీ, స్టీఫెన్ సన్తో జరిగిన సంభాషణలో చప్పిందిగానీ ఎందుకూ పనికి రాని వాదన. “తెలంగాణలో రెడ్లు ప్రాభవం ఎక్కువ. ఉన్న నాయకులంతా ముసలోల్లయిపోయారు. వాళ్లంతా నాకు చుట్టాలే. ఎప్పటికయినా రెడ్ల చేతికి పెత్తనం రావాలి. ఇప్పటి నుంచి కొట్లాడితే ఎప్పటికయినా నేనే పైకొస్తా. నేనే ప్రత్యామ్నాయం. అది జరగాలంటే వెలమల ప్రతిష్ఠను నాశనం చేయాలి”…ఇలా సాగుతున్నది ఆయన వాగాడంబర ఆలోచనాధార. ఇంత లేకిగా, ఇంత చౌకబారుగా, ఇంత సొల్లు, పొల్లు మాట్లాడేవాడు తెలంగాణకు నాయకుడు కావడం అంటే అంతకంటే దరిద్రం ఉండదు.

నాయకులు, ప్రత్యామ్నాయాలు అవసరాలనుంచి, సమస్యలకోసం జరిగే ఉద్యమాలనుంచి ఎదగాలి. అందుకు ఒక రాజకీయ, సామాజకి ఆలోచనాధార ప్రాతిపదిక కావాలి. గొప్ప వ్యక్తిత్వం కావాలి. అసాధారణ నాయకత్వ పటిమ కావాలి. కేసీఆరు అలా ఎదిగి ఇవ్వాల తెలంగాణకు అందివచ్చిన నాయకుడు. అటువంటి నాయకుడిని ఎదిరించి ఎదగాలంటే మళ్లీ అటువంటి నాయకుడే రావాలి. సుత్తి, చెత్త మాట్లాడే ఆవారా నాయకులు, తెలంగాణ గురించి కనీస అవగాహన లేని అజ్ఞానాంధులు, ఏనాడూ తెలంగాణకోసం తెగించి నిలబడనివాళ్లు, రాజీలు, రాజకీయాలు తప్ప ఒక్క మంచిపనికోసం మాట్లాడనివాళ్లు తెలంగాణకు నాయకులుగా ఎదగలేరు. పైగా చంద్రబాబు పక్కన నిలబడి తెలంగాణలో పైకి వస్తామని విర్రవీగడం ఇంకా పైత్యం పతాకస్థాయికి చేరిన వైపరీత్యం. రేవంతురెడ్డికి, ఆయన పక్కన ఊరేగుతున్న తెలంగాణ బిడ్డలకు కాసింత విచక్షణ ప్రసాదించాలని కోరుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.

రేవంతురెడ్డి షరతులతో కూడిన బెయిలుపై బయటికి వచ్చినప్పుడు కూడా పిచ్చిపట్టినవాడిలా, ఉన్మాదంతో పూనకం వచ్చినవాడిలా మాట్లాడుతున్నాడే తప్ప సంయమనం పాటించాలనుకోలేదు. చంద్రబాబు కూడా చెప్పినట్టులేదు. కించిత్ రాజకీయానుభవం ఉన్న నాయకుడెవరయినా ఇటువంటి సందర్భాల్లో ఇలా వ్యవహరించరు. చంద్రబాబు కూడా కావలసింది తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలాపడితే అలా తిట్టడమే రేపు రేవంతురెడ్డి ఏమయితే ఆయన కేంది. తెలంగాణలో భవిష్యత్తులో పొడిచేదేమీ లేదని ఎవరికి తెలిసినా తెలియకపోయినా చంద్రబాబుకయితే తెలుసు. ఇక్కడ కుంపటి రాజుకుంటూ ఉండడం అక్కడ ఆయనకు అవసరం. అక్కడ ఘోర వైఫల్యాల నుంచి జనం దృష్టి మళ్లించడానికి ఇక్కడ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగు కావాలి. ఆ గ్యాంగును పెంచి పోషిస్తాడు. అందులో రేవంతుడు ఒకరు. రేవంతురెడ్డి రెడ్డి నాయకునిగా కాదు, చంద్రబాబుకు తెలంగాణలో మంచాలేసే నాయకునిగా మాత్రమే మిగిలిపోతాడు.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in politics. Bookmark the permalink.

One Response to రేవంతు రెడ్డి కాదు, చంద్రబాబు బడ్డీ

  1. Kishan Guptha vanaparthy says:

    Sir ravnanth reddy first loo 1 painter

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s