ఎవరినడిగి పోతిరెడ్డిపాడు కాలువను తవ్వారు?


ఎవరి అనుమతితో పట్టి సీమను ప్రారంభించారు?
ఎవరి అనుమతితో శ్రీశైలం రిజర్వాయరుపై అరడజను కాలువలు తవ్వారు?

తెలంగాణ టీడీపీ నేతలు ఇప్పటికయినా కళ్లు తెరుస్తారా?

IMG_3250

పాలమూరు ఎత్తిపోతలకు అనుమతేది? : దేవినేని

హైదరాబాద్‌, జూన్‌ 11: తెలంగాణ ప్రభుత్వం చేపట్టదలచిన పాలమూరి-రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. కృష్ణా జలాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం గురువారం నాడు కేంద్రానికి లేఖ రాసింది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రా కళ్లు పొడుద్దామనుకున్న కేసీఆర్‌.. ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతాంగం కళ్లు పొడుస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగానికి లోబడే ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని అన్నారు. అయితే కేసీఆర్‌ మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఎలాంటి అనుమతి లేకుండా తెలంగాణలో ప్రాజెక్టులు కడుతుంటే వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని దేవినేని ప్రశ్నించారు. ఇప్పటికే ఉన్న ఆల్మట్టీ వివాదంపై మూడు రాష్ర్టాలు కేంద్రాన్ని సంప్రదించాయన్న ఆయన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల ఎస్‌ఎల్‌పి పిటీషన్లపై వాదనలు నడుస్తూనే ఉన్నాయని వివరించారు.

ఆంధ్ర నాయకుల తీరు మొగున్ని కొట్టి మొగసాలకెక్కినట్టుగా ఉంది. కృష్ణా నదిపై మీరు నిర్మించిన ఏ ప్రాజెక్టులకు అనుమతి ఉంది? ఎవరినడిగి పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యం పెంచారు? ఎవరి అనుమతి తీసుకుని హంద్రీ-నీవా తవ్వుతున్నారు? పట్టిసీమను ప్రారంభించినప్పుడు ఈ తెలివి ఏమైంది? సంసారం చేయడానికి కూడా కేసీఆరు అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించిన మీకు ఇప్పుడు పాలమూరు గురించి మాట్లాడే హక్కు ఉందా? ఎక్కడ నీళ్లున్నాయని వెలిగోడు ప్రాజెక్టును ప్రారంభించారు? ఏ నీళ్లతో మీరు గాలేరు-నగరి ప్రాజెక్టును ప్రారంభించారు? ఏ నీటిని కడప-కర్నూలు కాలువకు మళ్లించారు? అప్పుడు నల్లగొండ-ఖమ్మం జిల్లాల కళ్లు పొడవడానికే ఈ ప్రాజెక్టులన్నీ కట్టారా? సమైక్య రాష్ర్టంలో కృష్ణా నదిపై మీరు ఆడింది ఆటగా పాడింది పాటగా నడిచింది. ఇప్పుడెలా నడుస్తుంది? తెలంగాణ తనకు రావలసిన న్యాయమైన వాటా నీళ్లను తీసుకుని తీరుతుంది. ఒక్క టీఎంసీ నీటిని కూడా వదులు కునేది లేదు. కృష్ణా నదిలో రెండు రాష్ర్టాలకు కలిపి కేటాయించిన వెయ్యి టీఎంసీలలో తెలంగాణకు రావలసిన 400 టీఎంసీల నీటిని తీసుకుని తీరతాలి.

మహబూబునగరాన్ని మొదట ఎన్టీఆరు, తర్వాత చంద్రబాబు దత్తత తీసుకున్నారు. ఒక్క టీఎంసీ నీరు అదనంగా తేలేదు. జిల్లా ఎడారిగా మారే పరిస్థితి వచ్చింది. లక్షలాది మంది బతుకుదెరువుకోసం వలసలు పోవలసి వచ్చింది. సాగునీరు, తాగునీరు లేక జిల్లా విలవిలలాడుతున్నది. అటువంటి జిల్లాకు నీరివ్వడానికి ప్రాజెక్టును నిర్మిస్తుంటే టీడీపీ ఆంధ్ర నాయకత్వం ఆటంకాలు కల్పిస్తున్నది. చంద్రబాబునాయుడుకు చంచాగిరి చేస్తున్న నాయకులు ఇప్పటికీ మహబూబునగరం జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. రేవంతుడు, రాజేందరరెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి వంటి వారు చంద్రబాబు పల్లకీ మోస్తున్నారు. వీళ్లు ఇప్పటికయినా కళ్లు తెరవాలి. ఆంధ్ర ప్రయోజనాలు తప్ప తెలంగాణ ప్రయోజనాలను గురించి ఆలోచించని పార్టీతో ఇప్పటికయినా బంధాలు తెంచుకోవాలి.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s